AP Grama Sachivalayam Results
-
51మంది ఆ పోస్టులకు అనర్హులు
సాక్షి, కడప : జిల్లాలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు ఎంపికైన వారిలో 51 మందికి తగిన విద్యార్హతలు లేవని గుర్తించారు. వీరిని అనర్హులుగా అధికారులు ధ్రువీకరించారు. వీరు సంబంధంలేని డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. వాస్తవానికి ఈ పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమనిటీస్ ఆపైన చదివిన వారు అర్హులుగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. బీకాం కూడా అర్ట్స్ గ్రూపే కదా అని కొందరు, ఏదైనా డిగ్రీ సరిపోతుందని మరికొందరు భావించి దరఖాస్తు చేశారు. బీఎస్సీ, బీకామ్, ఎల్ఎల్బీ, బీటెక్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించడంతో నగరపాలక అధికారులు వీరిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశారు. అనంతపురం జిల్లాలో సంబంధం లేని డిగ్రీలు చేసిన వారు అర్హత పొందారని కొందరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మన జిల్లాలో కూడా ఇలాంటి అనర్హులున్నారని తేలింది. ఫలితంగా 51 మంది నియామకాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన తప్పును సరిదిద్దేందుకు అ«ధికారులు నియామకపత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. -
సర్టిఫి‘కేటుగాళ్లు’
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ కొలువు తెచ్చుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కారు. సచివాలయ పోస్టులకు సంబంధించి వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల పోస్టులకు 21 మంది అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లను దాఖలు చేశారు. వాటిని నిశితంగా పరిశీలించాల్సిన వెరిఫికేషన్ అధికారులు అభ్యర్థులకే వత్తాసు పలికారు. అయితే అడ్డగోలు బాగోతం నగర పాలక సంస్థ కమిషనర్ పి.ప్రశాంతి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. అడ్డదారిలో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలను రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సరిగా చేయని తాడిపత్రి, హిందూపురం, పామిడి, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని ఆదేశించారు. ఇదీ సంగతి సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల అభ్యర్థులకు సెప్టెంబర్ 26న అంబేడ్కర్ భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అందులో 21 మంది అభ్యర్థులు బీఎస్సీ, బీకాం, ఎంఏ కోర్సులతో దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. వాస్తవానికి వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమానిటీస్ చేసిన వారు అర్హులు. కానీ బీఎస్సీ, బీకాం, బీజెడ్సీ చేసిన వారు దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్లను సైతం అందజేశారు. వాటిని పరిశీలించిన అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నియామకపత్రాలు కూడా అందుకున్నారు. వెలుగులోకి ఇలా అయితే ఉద్యోగాలు దక్కించుకోలేని కొందరు అభ్యర్థులు రెండ్రోజుల క్రితం కమిషనర్ పి.ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు మంజూరు చేశారని, తాము ఆ కోర్సు చేసినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో కమిషనర్ ప్రశాంతి.. ఉద్యోగాలు దక్కించుకున్న వారి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని నగరపాలక సంస్థ సిబ్బందిని శుక్రవారం ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన 21 మంది నియామకాలు రద్దు చేశారు. 21 మంది అనర్హులు వీరే ఆర్ నటరాజ్ (191215002079), పి.రాజశేఖర(191215002308), ఎకిల గిరిప్రసాద్(191215002759), కేవీ అమర్నాథ్ (191215003206), కె.కృష్ణవేణి(191215003394), గూడూరు వెంకటేశు(191215002877), ఎన్పీ వెంకటనారాయణ (191215002029) బి.శ్రీదేవి(191215003446), గోరువ సుమలత(191215002050), సారే శంకర్(191215001262), వడ్డే రామకృష్ణ (191215000049), బి.మంజుల(191215002247), జె.ఓబుళమ్మ(191215001644), ఏ.శైలజ (191215001327), బి.సునీత(191215002389), ఎస్.రఘు (191215002335), ఎం.ఆదినారాయణ(191015002877), కె.లోకేష్‌నాయక్(191215000476), బి.ప్రియాంక(191215001345), ఎం.నాగజ్యోతి(191215002143), ఎం. అనిల్‌కుమార్ (191215003684). -
పచ్చ గుట్టు.. పారదర్శకతతో రట్టు
ఈ ఫొటోలో కనిపిస్తున్న టీడీపీ వీరాభిమాని పేరు యన్నం నాగరాజు. టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు. వేమూరు గ్రామానికి చెందిన ఇతనికి ప్రతిభ ఆధారంగా సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎల్లో మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. వీరంతా కేవలం ప్రతిభతోనే జీవితాల్లో స్థిరపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ఫలితాలు చెంపపెట్టుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారనే వారి కుటిల రాజకీయ బుద్ధిని తేటతెల్లం చేస్తున్నాయి. సాక్షి, గుంటూరు: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల వ్యవధిలో 1.40 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం చూసి టీడీపీ, ఎల్లో మీడియాకు కన్ను కుట్టింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకంపై విష ప్రచారానికి తెరలేపారు. పేపర్ లీక్ అయిందని, ఉద్యోగాలన్నీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకే ఇచ్చారని, నియామక ప్రక్రియ సరిగా జరగలేదని రోజుకో రీతిలో దుష్ప్రచారం చేశారు. సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ నుంచి అభ్యర్థుల ఎంపిక, నియామక పత్రాల అందజేత ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలూ, అక్రమాలూ జరగకుండా ఓ మహాయజ్ఞంలా సాగింది. తమ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండడంతో ఎందరో తల్లిదండ్రుల కల నెరవేరింది. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రతిభ కనబరిచిన వారికే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు సాధించిన వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీతో అంటకాగి నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా రిపోర్టర్లు, వారి కుటుంబ సభ్యులు సైతం సచివాలయ ఉద్యోగాలు సాధించారు. ‘‘నా పేరు ఉప్పు మణికంఠ. ఫిరంగిపురం మండలం నుదురుపాడు మా స్వగ్రామం. టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలోనే ఉంది. సచివాలయాల ఉద్యోగాల్లో నేను సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్–2 ఉద్యోగం సాధించాను. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వచ్చింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయక ఇబ్బంది పడ్డాను. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా పారదర్శకతతో పూర్తిచేసింది. ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.’’ ఇది ఉప్పు మణికంఠ ఒక్కరి అభిప్రాయమే కాదు. ఉద్యోగాలు సాధించిన ఎంతో మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామకపత్రాల జారీ వరకు ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది. ప్రతిభ చూపిన వారికే ఉద్యోగాలు ఇచ్చి, వారికి పట్టంగట్టింది. టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఉద్యోగాలు సాధించారు. దీంతో ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిసింది. దీనిని తట్టుకోలేని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా అక్కసుతో ఉద్యోగాల భర్తీపై దుష్ప్రచారానికి దిగింది. టీడీపీ, ఎల్లో మీడియా తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నిదర్శనాలు ఇవిగో.. ► వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన బండ్ల శశిరేఖ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించింది. ఈమె తండ్రి వెంకటకోటయ్య ఇనిమెళ్ల గ్రామ టీడీపీ నాయకుడు. ఇదే తరహాలో ఈపూరు మండలానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడు ఉన్నం భరత్ హార్టికల్చర్ అసిస్టెండ్ ఉద్యోగాన్ని సాధించాడు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ► తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన గాజులవర్తి సాంబశివరావు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇతను స్వయంగా టీడీపీ కార్యకర్త. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ► కొలకలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కొలకలూరి కేసరి కుమార్తె కొలకలూరి మాధవి వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఎంపికైంది. ► కొలకలూరు టీడీపీ కార్యకర్త ఉన్నం సాల్మన్ కుమారుడు ఉన్నం మోజెస్ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ► కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త ఉప్పల అర్జునరావు కుమార్తె ఉప్పల శివనాగరాణి మహిళా పోలీస్ ఉద్యోగం సాధించింది. ► కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీల కార్యకర్త మున్నంగి శ్రీనివాసరావు కుమారుడు మున్నంగి వెంకటేశ్వరరావు జూనియర్ లైన్మెన్ పోస్టుకు ఎంపికయ్యాడు. ► మంగళగిరి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగాల ప్రక్రియపై విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా రిపోర్టర్ సోదరుడి భార్య చిరందాసు గాయత్రి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించింది. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన భర్త ఉపాధికి సాయం చేస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్మోహన్రెడ్డి తమకు జీవిత భరోసాను కల్పించారని గాయత్రి అంటోంది. ► నరసరావుపేట నియోజకవర్గంలోని కర్లకుంటలో టీడీపీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగా వెంకటేశ్వర్లు సోదరుడి కుమార్తె అనిత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సాధించింది. వెంకటేశ్వర్లు బం«ధువులు లింగా సాంబయ్య వెటర్నరీ అసిస్టెంట్, ఇదే గ్రామంలో టీడీపీ కార్యకర్త మల్లయ్య కుమారుడు వెంకటరావు వెటర్నరీ అసిస్టెంట్, మరో కార్యకర్త బత్తుల హనుమయ్య కుమారుడు బత్తుల చిరంజీవి సర్వేయర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీ కర్లపాలెం మండల కన్వీనర్ నక్కల వెంకటస్వామి సోదరుడు నర్రవారిపాలెం గ్రామ టీడీపీ కన్వీనర్ నక్కల శేషాద్రి కుమారుడు గోపి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, అందుకే తనకు ఉద్యోగం వచ్చిందని గోపి చెబుతున్నాడు. దుగ్గిరాల మండలం కొండూరు గ్రామానికి చెందిన రామకోటయ్య మొదటి నుంచీ టీడీపీ సానుభూతిపరుడు. సచివాలయ పరీక్షల్లో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తనకు సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగమిచ్చారని ఆయన సంబర పడుతున్నారు. -
నేటి నుంచే గ్రామ స్వరాజ్య పాలన
పల్లె నవ్వింది.. మహాత్ముడి ఆశయం నెరవేరుతోందని. ఊరు ఊపిరి తీసుకుంది. ఇక పట్టణంపై గ్రామం ఆధారపడనక్కర్లేదని. జాతిపిత 150వ జయంతి నాడు దేశం కొత్త సందేశం అందుకుంది.. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాణం పోసుకుందని. సిక్కోలు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. గ్రామ పాలనకు శ్రీకారం చుడుతూ బుధవారం జిల్లావ్యాప్తంగా 835 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక పనులు ఆలస్యమవుతాయని బాధ ఉండదు. పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ ఉండదు. సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : మహాత్మా గాం«ధీ కలలు గన్న స్వరాజ్య పాలన మన ముందుకు వచ్చేసింది. ఆ మహాత్ము డి ఆశయాల్లో కీలకమైన వ్యవస్థకు నేడు ఆయన జయంతి రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రెండు వేల మం ది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ సరికొత్త చరిత్రకు సీఎం పునాది రాయి వేశారు. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మండలానికి ఒక్కొక్కటి చొప్పున 38 సచివాలయాలను నేడు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. జిల్లాలో సచివాలయాల పరిస్థితి ఇది.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే గ్రామీణాభివృద్ధి–పాలనపై దృష్టి సారించారు. గ్రామీణ ప్రజానీకం పాలకుల మోసాలకు గురవుతున్నారని గుర్తించి గ్రామ సచివాలయ వ్యవస్థను అమలు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 1141 పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన 835 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో ముందుగా మండలానికి ఒకటి చొప్పున 38 సచివాలయాలను నేడు ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో 10 టేబుళ్లు, 30 కు ర్చీలు, 06 ఫైల్ రాక్స్, ఒక గ్రామ సచివాలయ బోర్డు, ఒక ఐరన్ సేఫ్ (బీరువా)తో పాటు ఆరు నెలల పాటు సచివాలయానికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి సుమారు రూ.1.79 లక్షల వరకు నిధులను రాష్ట్ర ప్రభు త్వం కేటాయించింది. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ ద్వారా వస్తువుల కొనుగోలు తదితర ఏర్పాట్లతో నవంబర్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలతో సచివాలయాలన్నీ సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. 72 గంటల్లోనే వినతుల పరిష్కారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయి ప్రభుత్వ పథకాలు అందాలనే ధ్యేయంతో నేరుగా వారి ఇంటి ముంగిటకే పథకాల ఫలాలు అందాలనే పారదర్శక నిర్ణయంతో ముఖ్యమంత్రి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముందు గా గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తూ వారి ద్వారానే ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ కావాల్సిన ప్రభుత్వ సాయాన్ని తెలుసుకుని, ఆ వివరాలతో నేరుగా గ్రామ సచివాలయానికి తీసుకువెళ్లి, దరఖాస్తు చేయించి, కేవలం 72 గంటల్లోనే పరిష్కారం అయ్యేలా ఈ సచివాలయాలు పనిచేయనున్నాయి. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పలు విభాగాల అధికారులు త్వరలోనే విధుల్లోకి చేరనున్నారు. ఈ కొత్త అధికారులకు శిక్షణ పూర్తి కాగానే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ పనిచేసేలా రూపకల్పన చేశారు. జిల్లాలో మొత్తం 835 సచివాలయాల్లో 719 సచివాలయాలను స్థానికంగా ఉన్న పంచాయతీ భవనాలనే అందమైన నీలం, ఆకుపచ్చ రంగులతో ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆయా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ భవనా ల్లో మరో 75 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే అద్దె భవనాల్లో 16 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. కాగా 25 సచివాలయాలకు పూర్తిగా భవనాల కొరత కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నేడు 38 గ్రామ సచివాలయాల ప్రారంభం జిల్లాలో మండలానికొక మోడల్ సచివాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 38 పంచాయతీ కేంద్రాల్లోనే సచివాలయాల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ఆనందం కొలువైంది
ఎటు చూసినా అభ్యర్థుల కోలాహలం.. అందరి మోముల్లో చెప్పలేని సంతోషం.. ఎన్నో ఏళ్ల కల సాకారమైందన్న సంబరం.. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తమ జీవితాల్లోకి ఆనంద క్షణాలు వచ్చాయని, కష్టాలు తొలగిపోయాయన్న ధైర్యం.. ప్రభుత్వ ఉద్యోగం కల సాకారమైందన్న ఆనందం ప్రతి ఒక్కరిలో కనిపించింది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల కోసం తరలి వచ్చిన అభ్యర్థులతో మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో పండుగ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే తమకు ఉద్యోగాలు వచ్చేలా చేసిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహించి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే తమ ధ్యేయమన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఆసాంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. సాక్షి, అమరావతి : ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అంటూ అందరి కష్టాలను తీరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగి స్తున్న పాలన, ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమేనని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం సోమవారం మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న సీకే కన్వెన్షన్ హాలులో ఉత్సాహంగా సాగింది. శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధ్యక్షతన కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తెచ్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టి పూర్తిచేయడం ఒక అపూర్వ ఘట్టమని అన్నారు. టీడీపీ ఐదేళ్ల అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందించే జగనన్న సైన్యమే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు అని అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరలో భర్తీ చేసే శుభవార్తను త్వరలో అందిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నత వ్యవస్థ గ్రామ/వార్డు సచివాలయాలు రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నతమైన వ్యవస్థగా హోం మంత్రి మేకతోటి సుచరిత అభివర్ణించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల్లోనే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశారని వివరిం చారు. సచివాలయాల ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారిపై లబ్ధిదారులకు కొండంత నమ్మకం ఏర్పడుతుందన్నారు. రేషన్, పింఛన్ వంటి సమస్యలను 72 గంట ల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎక్కువ మంది మహిళలే ఎంపికయ్యారని, వారికి భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా విధులు నిర్వర్తించాలని శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలన్నా, వ్యవస్థలో లోపాలు సరిచేయాలన్నా ఈ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వ్యవస్థలో మార్పు తేవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని సచివాలయాల ఉద్యోగులకు శాసనమండలి చీఫ్‌విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలతో ఒక శకం మారబోతోందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఉద్యోగులను కోరారు. గ్రామ స్వరాజ్యం చాలా ముఖ్యమైంది గ్రామ స్వరాజ్యం కోసమే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ గ్రామ వలంటీర్లపైన మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థలో మార్పు తెచ్చేం దుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని అన్నారు. గ్రామస్వరాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీకి విజయవాడలో పలు మార్లు ధర్నా చేసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 4 నెలల పాలనలోనే 1.26 లక్షల ఉద్యోగాలు కల్పిం చారని అభినందించారు. పరీక్షలను పకడ్బం దీగా నిర్వహించిన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో పారదర్శకతను ఆచరణలో తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నీతివంతమైన పాలనను సాకారం చేసేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించగా, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారని స్పష్టంచేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని సచివాలయాల ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రంలో లంచాలు లేని పారదర్శక పాలనను తీసుకు రావడంలో భాగస్వాములు కావాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం ఒక ఊరిలోనే పది నుంచి 30 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో రాష్ట్రంలో దసరా, దీపావళి పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉందన్నారు. ఉద్యోగులు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కోరారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక కుటుంబం వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబమని అన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజల బాధలు చూసి, వారి కష్టాలు తీర్చేదిశగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ గ్రామ, వార్డు వలంటీర్లందరూ పార్టీలకతీతంగా పనిచేయాలని కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నెహ్రూనగర్(గుంటూరు): సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డీఆర్డీఏ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు సూచించారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో డీఆర్డీఎ, స్కిల్ డెవలప్మెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆనందంలో అభ్యర్థులు విజయవాడలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని సీకే కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా తిలకించిన అభ్యర్థులు చప్పట్లు, కేరింతలతో సందడి చేశారు. ముఖ్యమంత్రి తీసుకొన్న సాహసోపేత నిర్ణయంతోనే తమకు ఉద్యోగాలు లభించాయనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. సీఎం జగన్ ప్రసంగం వింటున్నంతసేపు, అభ్యర్థులతోపాటు హాజరైన వారి తల్లిదండ్రుల మోములు చిరునవ్వుతో కళకళలాడాయి. -
నిజాయితీతో సేవలందించండి
సాక్షి, కర్నూలు : గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులు నిజాయితీ, పారదర్శకంగా, చిరునవ్వుతో ప్రజలకు సేవలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కోరారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తొగూరు ఆర్థర్, జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ రవిపట్టన్ శెట్టి, జెడ్పీ సీఈఓ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డీపీఓ కేఎల్ ప్రభాకర్‌రావు, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకోసం నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షల్లో ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశా మన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య పాలనే లక్ష్యంగా ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.27 లక్షల కొత్త ఉద్యోగాలను రికార్డు సమయంలో కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా నంబర్1గా ఉందన్నారు. 100 రోజుల్లోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారని మంత్రి బుగ్గన చెప్పారు. బడా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం వల్లే నేడు జీతాలకు ఇబ్బందులు ... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బడా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం వల్లే నేడు జీతాలకు ఇబ్బంది పరిస్థితి నెలకొనిందని మంత్రి బుగ్గన ఆన్నారు. 2019 జనవరి నెల నుంచి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు తదితర సేవా రంగాలకు చెందిన పద్దులన్నింటిని తమ అనునాయులైన బడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించారన్నారు. అందువల్లే తొమ్మిది నెలలుగా ఆయా రంగాల్లోని వారికి జీతాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నాటి పాలకుల చేపట్టిన చర్యలు కారణంగానే నేడు విద్యుత్ సమస్యలు కూడా తలెత్తాయని, ఈ సమస్యలను త్వరలోనే అధిగమిస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రెవెన్యూ చట్టం ... రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని మంత్రి బుగ్గన చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ చేపట్టారన్నారు. ఒక సెంటు భూమి కూడా తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గ్రామ సచివాలయాల్లో నియమితులవుతున్న వీఆర్ఓ, సర్వేయర్లు నిజాయితీగా కృషి చేయాల్సి ఉందన్నారు. నాడు చదువు ... నేడు ఉద్యోగం గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు ఫీజు రీయంయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని బుగ్గన్న అన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు వైఎస్సార్ తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన ఉద్వేగ భరితం.. వస్తుందో రాదో అనుకున్న ఉద్యోగం వరించడంతో ఓ యువతి ఉద్వేగానికి గురయ్యారు. నయాపైసా ఖర్చు లేకుండా.. ఎలాంటి రెకమెండేషన్ లేకుండా.. గ్రామ సచివాలయ కొలువు రావడంతో ఆనంద బాష్పాలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ మాది మిడుతూరు మండలం తలముడిపి గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. అవ్వాతాతల వద్ద పెరిగాను. దాతల సహకారంతో చదువుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సమయంలో ఎలాంటి రాజకీయ పలుకుబడి, డబ్బులేని లేని నాలాంటి వాళ్లకు ఉద్యోగాల వస్తాయో రావో అనే ఆందోళన ఉండేది. డబ్బు ఖర్చు లేకుండా, సిఫార్సులు లేకుండా, కష్టపడి చదివి నేను విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది.’’ అని ఆమె అన్నారు. ఈ యువతిని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆత్మస్థైర్యం, పట్టుదలతో విద్యలో రాణించి సచివాలయ పోస్టులో జిల్లాలో మహిళా విభాగంలో టాపర్‌గా నిల్వడం హర్షదాయకమన్నారు. -
నవశకానికి నాంది
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి నాంది పలికింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా సచివాలయ వ్యవస్థ అమలుకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని రాజీవ్ క్రీడాప్రాంగణంలో సోమవారం గ్రామ/వార్డు సచివాలయాల్లో పలు రకాల ఉద్యోగాలకు ఎంపికైన 4,283 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మైదానంలో పండగ సందడి కనిపించింది. నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగులు చిరునవ్వులు చిందించారు. జగన్మోహన్రెడ్డి సీఎం కావడం, ఉద్యోగాల విప్లవం సృష్టించడంతో చిరకాల వాంఛతీరిందంటూ మురిసిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు జ్యోతిప్రజ్వలన చేసి నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వినూత్న రీతిలో ఆలోచిస్తూ సుమారు ఒక లక్షా 26 వేల పోస్టులను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగులకు కొత్త జీవితాలు ప్రసాదించారన్నారు. మరోవైపు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లే శాశ్వత యం త్రాంగం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరించే ఒక చక్కని సుపరిపాలనా వ్యవస్థను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని ఆమె విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రసుత్తం భర్తీ చేసిన 4,283 పోస్టుల్లో సగానికి పైగా మహిళలనే ఎంపిక చేయడం మహిళా శక్తిపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా నిర్వహించిన జిల్లా యంత్రాగానికి అమె శాల్యూట్ చేశారు. అందరి ముఖాలలో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం ధ్యేయంగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ఒక్కడుకు ముందుకు వేసి పాలన సాగిస్తే యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండడుగులు ముందుకు వేసి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కష్టపడి చదివి ఎంపికైన నిరుద్యోగులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవాకులు, చవాకులు పేలుస్తూ.. పేపర్‌లీక్ అయ్యిందంటూ నిరుద్యోగల్లో అలజడి రేపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఉద్యోగాల భర్తీ ఎలా సాగిందో నిరుద్యోగ అభ్యర్థులకు తెలుసన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. లక్షా 26 వేల ఉద్యోగాలను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలచారన్నారు. నిరుద్యోగుల ప్రతిభకు పట్టం కట్టారన్నారు. జేసీ కె.వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను 92 శాతం మేర అందజేసి రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగుల నియామకం జరిగిందన్నారు. ఉద్యోగులుగా నియామకం అయిన వారంతా అంకిత భావంతో విధులను నిర్వర్తిస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీఆర్వో జె.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఆర్డీవో సాల్మన్‌రాజు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, పశుసంవర్దక శాఖ జేడీ నరసింహులు, సెట్విజ్ సీఈఓ నాగేశ్వరరావు, విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చరిత్ర సృష్టించారు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసే దిశగా సీఎం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలి. రాష్ట్ర భవిష్యత్ మీ పైనే ఆధారపడి ఉంది. గత పాలకుల్లా డబ్బు సంపాదన కోసం రాజకీయంచేసేవాళ్లం మేము కాదు. మంత్రులు బొత్స, శ్రీవాణి, బెల్లాన నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. – కోలగట్ల వీరభధ్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం నియోజకవర్గం నూతన శకం ఆరంభం రాష్ట్రంలో జిల్లాలో నూతన శకం ఆరంభమైంది. 4 నెలల వ్యవధిలోనే సీఎం జగన్మోహన్రెడ్డి తనదైన మార్కు చూపించారు. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పారదర్శకమైన పాలనకు శ్రీకారం చుట్టారు. గత 5 ఏళ్లలో కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి మహాత్మా గాంధీ 150వ జయంతి రోజున నాంది పలకడం శుభపరిణామం. నిరుద్యోగుల ప్రతిభకు పట్టంకట్టే రోజులు వచ్చాయి. – శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం నమ్మకాన్ని నిలబెట్టండి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్ధులకు అభినందనలు. జగన్మోహన్రెడ్డి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్తశుద్ధితో పని చేయాలి. చక్కని చిరునవ్వుతో అందరికీ సేవలందించాలి. లక్షలాది ఉద్యోగాలు ఒకే సారి భర్తీ చేయటం చాలా గర్వంగా ఉంది. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కాపాడుకుందాం. ఆయన ఆశయాలను అందరూ కలసిగట్టుగా నెరవేర్చుదాం. – బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు భాగస్వాములు కావాలి. సీఎం జగన్మోహన్రెడ్డి ఓ చారిత్రాత్మక ఘట్టా నికి తెరలేపారు. అందులో మనందరినీ భాగస్వాములు చేయడం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా క్షమించేది లేదని గెలిచిన కొద్ది రోజుల్లోనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి నమ్మకాన్ని మనందరం నిలబెట్టాలి. – కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఎస్.కోట -
సాక్షాత్తు నా కొడుక్కయినా..
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : సచివాలయ ఉద్యోగాల నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయని, సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులంతా ప్రభు త్వ లక్ష్యాన్ని చాటిచెప్పేలా పనిచేశారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సోమవారం ఆయన పలువురు అభ్యర్థులకు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన చేపట్టలేదని, అది కూడా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు, ఒత్తిళ్లకు తలొగ్గకుం డా ఉద్యోగాలను భర్తీ చేయడం ఓ చరిత్ర అని అన్నారు. ‘సాక్షాత్తు నా కొడుక్కయినా అడ్డదారిలో ఈ ఉద్యోగం వచ్చే అవకాశమే లేద’ని సభాముఖంగా చెప్పారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘మీకిప్పుడు సమాజంలో గౌరవంతోపాటు కొత్తగా బాధ్యతలు పెరిగాయని, అవినీతికి దూరంగా నిజాయితీగా పనిచేయాల’ని సూచించారు. సచివాలయాల వ్యవస్థతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు సద్వినియోగమవుతాయని, ఇందుకోసం ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ‘మనం పాలకులం కాదు... సేవకులమని...’ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు తమతో అంటుంటారని, వయస్సులో చిన్నవాడైనా... అతనిలో కార్యదక్షత, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వంటి లక్షణాలు ఎంతో ఆదర్శ నీయమైనవన్నారు. రైతుల కోసం రైతు భరోసా, మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగుల కోసం స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగావకాశాలు, అమ్మఒడి, వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి రోగానికి ఆరోగ్యశ్రీ వర్తింపు.. దశలవారీగా మద్యపాన నిషేధం ఇలా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఎన్నో పథకాలను ఈ కొద్ది రోజుల్లోనే అమలు చేశారని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగాలను సాధించిన వారిలో.. 80 శాతం మందికి పైగా సామాన్య, మధ్యతరగతి స్థాయి కుటుంబాలకు చెందినవారేనని, నీతినిజాయితీలతో పనిచేస్తే వెలకట్టలేని గుర్తింపు వస్తుందని సూచించారు. ఇలా పనిచేయడమే సీఎం జగన్‌కు కృతజ్ఞతతో మీరిచ్చే గిఫ్ట్ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ భారీ ఉద్యోగాల నియామక ప్రక్రియను జిల్లా ఎంపిక కమిటీ సభ్యులంతా చాలా కష్టపడి రాత్రి పగలు అన్న తేడా లేకుండా పూర్తి చేశారని, పూర్తిగా మెరిట్ బేసిస్తోనే జాబితాలను తయారు చేశామని స్పష్టం చేశారు. సచివాలయాల వ్యవస్థతో స్థానిక సంస్థలు బాగా బలోపేతమవుతాయని, ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం దొరుకుతుందన్నారు. సొంత మండలాల్లో ఉద్యోగాలు దొరకడం అద్భుతమైన అవకాశమని, దీన్ని కొత్త ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జి.చక్రధరరావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డీపీవో రవికుమార్, ఆర్డీవో ఎం.వి.రమణ, డీపీఆర్వో ఎల్.రమేష్, నగర కార్పొరేషన్ కమిషనర్ ఎం.గీతాదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరాహ నర్సింహం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్, తహశీల్దార్ ఐ.టి.కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి ఆధ్వర్యంలో సీఐలు లలిత, సాకేటి శంకరరావులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. -
నిష్పక్షపాతంగా సేవలు చేయాలి: మంత్రి
సాక్షి, ప్రకాశం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక విప్లవం అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రకాశంలోని ఎ1 ఫంక్షన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, చంద్రబాబులా అబద్ధాలు చెప్పేరకం కాదని అన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులంతా సీఎం జగన్‌కు మంచి పేరు తేవాలని, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేశారు. -
విజయవాడ : నియామక పత్రాలు అందజేసిన సీఎం జగన్
-
దేశంలోనే భారీ రిక్రూట్మెంట్: అవంతి
సాక్షి, విశాఖపట్నం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణందాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన వాళ్లు గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో పని చేయాలని సూచించారు. దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్ చేపట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు
సాక్షి, విజయనగరం: అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయ నియామకాలు చేపట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుష్ప శ్రీవాణి నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎంపికైన ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారని తెలిపారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నవారిపైన ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాక్కులు చవాక్కులు విసిరారని విమర్శించారు. పేపర్ లీక్ అంటూ అసత్య ప్రచారాలు చేపట్టారని మండిపడ్డారు. -
‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’
సాక్షి, కడప : గాంధీ జయంతి సందర్భంగా ఆయన కన్న కల ‘గ్రామ స్వరాజ్యాన్ని’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెత్తం 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన వెళ్లనుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో నవరత్నాల పథకాలు అమలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ ఒక్కరేనని పేర్కొన్నారు. కౌలు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని, భూ చట్టం ద్వారా రీ సర్వే చేయించనున్నామని, దీని ద్వారా భూ సమస్యలను తగ్గించడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. మానిఫేస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఉగాదికి 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన భూములను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ నేరవేరుస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో పేజీ పేజీలు లేదని... రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చామన్నారు. మూడు నెలల లోపే 85 శాతం మానిఫెస్టోని అమలు చేసామని, జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియా ద్వారా దుష్పచారం చేస్తున్నారని.. బాబు అక్రమ ఇంట్లో ఉంటూ ఇప్పటి వరకు దానిపై నోరు తెరవలేదని అన్నారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని విమర్శించారు. ఇప్పటికిప్పుడు జగన్ పేరు, చంద్రబాబు పేరు మీద ఓటింగ్ పెడితే 99 శాతం ఓట్లు జగన్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మధ్యపాలసీ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. -
ఉద్యోగాల విప్లవం.. నియామకాల సంబరం!
సాక్షి, అమరావతి: పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులోభాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలల్లో 19 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా నియామక ప్రతాలను అందజేసింది. ఆ వివరాలు జిల్లాల వారీగా.. పశ్చిమ గోదావరి గ్రామ,వార్డు సచివాలయ అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ ముత్యాల రాజు మాట్లాడుతూ.. 4600 మంది అభ్యర్థులకు సోమవారం ఒక్క రోజే నియామక పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. 16 కేటగిరిలో జిల్లాలో 9576 నియామకాల్లో 8712 మంది అభ్యర్థులకు కాల్ లేటర్స్ పంపామని అన్నారు. 72 గంటల్లో స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆ దిశగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. తన ఇన్నేళ్ల ఉద్యోగ నిర్వహణలో ఈ విధంగా ఒకే సారి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..అభ్యర్థులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ ఉద్యోగాల కోసం విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రుల కూడా ఎన్నో కలలు కన్నారని, కావాలనే ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద జల్లుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ 1,26,000 కుటుంబాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. గ్రామ స్థాయిలో పనిచేసే తామందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావలని కోరారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ఆశకిరణమని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాలకు సీఎం జగన్ నడుంబిగించారని, రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా మొత్తం 1,36000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉద్యోగాలు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. పాదయాత్రలో వైఎస్ జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హమీనీ కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారని, లంచాలకు తావు లేకుండా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శేషగిరి బాబు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరప్రసాద్ రావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాలు ఎంత నిజాయితీగా జరిగాయో, ఉద్యోగులు కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని సూచించారు. అవినీతి లేని పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నియామకాల పత్రాలను తిరుపతి ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, తుడా విసి గిరీషా పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం నగరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, అర్థర్, ఎంపీ సంజీవ్ కుమార్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందజేశారు. మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం డివిజనల్ రెవిన్యూ అధికారి ఎం శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నియామకం పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు. ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ పావని, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కమీషనర్ రమేష్ పాల్గొన్నారు. విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే లు కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, అలజంగి జోగారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన అభ్యర్థులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ఎంపీ రంగయ్య, ఎంఎల్సీ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
‘రాజన్న చదివిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు’
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు. సోమవారం సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రియింబర్స్‌మెంట్ వల్ల చదువుకున్నామని, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అవినీతి రహిత పాలనకు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీయే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. (చదవండి : సేవ చేయడం కోసమే ఉద్యోగం: సీఎం జగన్ ) గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ చిరునవ్వును ఊహించుకోండి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ‘అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడొద్దు. మీ పని తీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశంలో ఇటువంటి ప్రయోగం ఎవరూ చేసి ఉండరు... మీరంతా కలిసి దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ సహా మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నా. ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చాము. ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు’ అని పేర్కొన్నారు. సొంత ప్రజల రుణం తీర్చుకోండి.. ‘అమెరికా వెళ్లినా సొంత గడ్డకు ఏదో చేయాలని ఎంతో మంది తపన పడతారు. అలాంటిది సొంత మండలంలోనే ఉద్యోగం చేసే భాగ్యం మీకు దక్కింది. మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోండి. లంచాలు, వివక్షలేని పారదర్శక పాలన అందివ్వండి. వాలంటీర్లు, మీరు కలిసి పేదవాడి ముఖంలో ఆనందం తీసుకురండి. మనం అధికారం చేలాయించడానికి కాదు.. వారికి సేవ చేయడానికి ఉన్నాం. గ్రామాల్లో రేషన్ కార్డు నుంచి ఏది కావాలన్నా లంచం తీసుకునే పరిస్థితి ఉండేది. జన్మభూమి కమిటీలు వ్యవస్థను నాశనం చేశాయి. వాటి కారణంగా నేడు గ్రామాల్లో పాలనా వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంది. అటువంటి పరిస్థితులను మన వ్యవస్థ ద్వారా మెరుగుపరచాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో 34 పనులు జరుగుతాయి. 72 గంటల్లోనే వారికి పరిష్కార మార్గం చూపేలా చర్యలు ఉంటాయి. మీరు చేసే సేవతో ప్రజల ముఖాల్లో వచ్చే చిరునవ్వును ఊహించుకోండి. ప్రతీ గ్రామ వాలంటీరుకు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తారు. జనవరి 1 నుంచి పూర్తిగా 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే విధంగా జనవరి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు వస్తాయి. అర్హత ఉన్నవారికి తప్పకుండా లబ్ది చేకూరాలి’ అని సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దేశం చేశారు. అదే విధంగా ఇంత కష్టపడి నియామక ప్రక్రియ నిర్వహించిన ప్రతీ ఒక్క అధికారికి నా సెల్యూట్ అని అధికారులను ప్రశంసించారు. సరికొత్త రికార్డు నెలకొల్పిన సీఎం జగన్ ఈ తరం యువతరానికి ఉన్న జీవితకాల లక్ష్యంగా మారింది ప్రభుత్వోద్యోగం. నాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అన్నింటి వెనుక ఉన్న బలమైన నినాదం కూడా అదే. ఏ ప్రభుత్వమైనా సరే శాశ్వత ఉద్యోగాలు కల్పించి ఉపాధి మార్గం చూపించాలని ప్రజలు నిత్యం కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నవి అత్యంత కీలకమైన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో యువత ఉద్యమ బాట పట్టింది కూడా ఉద్యోగాల కోసమే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు...అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం విప్లవ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల వరకు నిత్యం పోరాటాలు చేస్తునే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఉద్యమాలు జరగకుండానే రికార్డు స్థాయిలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు నెలకొల్పారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాడు తాను చెప్పిన మాటను అక్షర సత్యం చేసి అక్టోబర్ 2 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి చూపిస్తున్నారు. తెలుగునేలపై సరికొత్త ఉద్యోగ విప్లవాన్ని సృష్టించి... అనతికాలంలోనే లక్షా 26 వేల 728 ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసి చూపించి తాను ప్రజల మనిషి అని మరోసారి చాటుకున్నారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నది గమనార్హం. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 వేల 158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా 110 మున్సిపాలిటీల్లో 3,809 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో పనిచేయడానికి 95 వేల 88 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, 33వేల 581 మంది వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అంతేగాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అదే విధంగా పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. -
‘బాబుకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు’
సాక్షి, విజయనగరం: బాబు వస్తే జాబు అంటూ డాబులు చెప్పాడు.. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించలేని చంద్రబాబుకు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. పరీక్షల తర్వాత పేపర్ గోప్యత, కీ విడుదల వంటి తదితర అంశాలను పారదర్శకంగా నిర్వహిస్తే.. చంద్రబాబు అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల మండి పడ్డారు. సచివాలయ ఉద్యోగాల నిర్వహణలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి.. నిరసన, ధర్నాలు చేయాలని పిలుపునిస్తే.. ఒక నిరుద్యోగైనా బాబుకు అండగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అసూయతోనే విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు అని డాబులు పలికి చివరకు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసేసిన ఘనత చంద్రబాబుదే అంటూ కోలగట్ల విమర్శించారు. గత పాలకుల వల్లే ఇసుక కొరత.. తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల రూపాయలు ఇసుక దోచుకోవడంతోనే నేడు ఈ దుస్థితి అన్నారు కోలగట్ల. తమ ప్రభుత్వం యూనిట్ ఇసుకను అతి చౌకగా అందిస్తుందని తెలిపారు. గత పాలకుల ఇసుక దోపిడితోనే నేడు ఇసుక కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ ఆటో, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే ఐఆర్ వంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హరికృష్ణ, కోడెల మరణాలను తన నీచ రాజకీయాలకు వాడుకుంటూ.. చంద్రబాబు శవరాజకీయాలకు దిగారని మండి పడ్డారు. నియోజకవర్గంలో గత నాలుగు నెలలుగా వార్డ్ పర్యటన కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ వంద పనులను పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల అయిదున మంత్రి బొత్స చేతుల మీదుగా పలు పనులకు శంకుస్థాపన మహోత్సవం చేపట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వీఎస్ ప్రసాద్ మంత్రి బొత్స ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నట్లు కోలగట్ల ప్రకటించారు. -
2న గ్రామ సచివాలయాలు ప్రారంభం
సాక్షి, కర్నూలు(అర్బన్) : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లాలో మొత్తం 881 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే 2వ తేదీన అన్ని మౌలిక వసతులు, ప్రజలకు అందించాల్సిన విస్తృత సేవలతో ప్రతి మండలంలో మోడల్‌గా ఒక సచివాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోడల్‌గా ప్రారంభం కానున్న సచివాలయంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫర్నిచర్, మీ సేవా తదితర అన్ని వసతులను పూర్తి స్థాయిలో అమరుస్తున్నారు. జిల్లాలోని 53 మండలాల్లో ఒక్కో సచివాలయాన్ని మోడల్‌గా ప్రారంభించేసేందుకు ఇప్పటికే అధికారులు గుర్తించారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్..అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. అన్ని గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు వీలుగా మెజారిటీ సచివాలయాలకు ఇప్పటికే పెయింటింగ్స్‌ను దాదాపు పూర్తి చేశారు. అలాగే ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత పంచాయతీ అధికారులు కృషి చేస్తున్నారు. వేగంగా వార్డు సచివాలయాల ఏర్పాట్లు కర్నూలు (టౌన్): కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాలిటీల్లో 300 వార్డు సచివాలయాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2 నాటికి కర్నూలు కార్పొరేషన్లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఒక్కొక్క సచివాలయం చొప్పున ప్రారంభించేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో పాటు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వార్డు సచివాలయాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న సీఆర్సీ (కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్)లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు 103 ప్రెవేట్ భనవాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఆయా భవనాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు ఏర్పాటు చేస్తున్నారు. బాత్రూమ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నూలులోని ఏర్పాటు చేయనున్న 132 వార్డు సచివాలయాల్లో మరమ్మతులకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. రివర్స్ టెండర్ విధానం అవలంబించడంతో ఆదాయం మిగిలింది. అన్ని వార్డు సచివాలయాల మరమ్మతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రతి పనిని అంచనా విలువ కన్నా 10 శాతం తక్కువకు టెండర్లను ఖరారు చేశారు. దీంతో ప్రభుత్వానికి అదాయం మిగిలింది. -
పోటెత్తిన యువత
సాక్షి కర్నూలు(అర్బన్) : సచివాలయ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులతో జిల్లా పరిషత్ ప్రాంగణం కిటకిటలాడింది. దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా సందడి కన్పించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం తొమ్మిది రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు భారీగా తరలివచ్చారు. అభ్యర్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో జెడ్పీ ప్రాంగణం కిక్కిరిసింది. స్థానిక డీపీఆర్సీ భవనంలో ఆరు రకాల పోస్టులకు, మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ సర్వేయర్ పోస్టులకు, పీఆర్ ఎస్ఈ కార్యాలయం (విశ్వేశ్వరయ్యభవన్)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగింది. ముఖ్యంగా ఏఎన్ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ గ్రేడ్–3 పోస్టులకు ఎంపికైన∙వారి జాబితాను ఈ నెల 26న సాయంత్రం అప్లోడ్ చేయడంతో వారంతా 27వ తేదీన ఉదయానికే జెడ్పీకి చేరుకున్నారు. ఈ పోస్టులతో పాటు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు అమెనిటీస్ సెక్రటరీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు డీపీఆర్సీ భవనంలో వెరిఫికేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల అభ్యర్థులు అధిక సంఖ్యలో అక్కడికే రావడంతో భవనం కిక్కిరిసింది. వెరిఫికేషన్ నిదానం కావడంతో.. ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నిదానం కావడంపై అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇతర పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసిన అధికారులతో వారి సర్టిఫికెట్లను పరిశీలింపజేయాలని జెడ్పీ సీఈఓ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహులును కోరగా, ఎంత రాత్రయినా సరే తమ శాఖకు చెందిన వారితోనే వెరిఫికేషన్ చేయిస్తామని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ బయట జరుగుతున్న వివిధ రకాల ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దని, కాల్‌లెటర్లు అందిన అభ్యర్థులందరి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తామని అన్నారు. అవసరమైతే 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి వెరిఫికేషన్ ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నానికే పూర్తి విశ్వేశ్వరయ్యభవన్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తి చేశారు. మొత్తం 760 పోస్టులకు గాను 26వ తేదీన 400 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా 322 మంది హాజరయ్యారు. అలాగే శుక్రవారం 360 మందిని పిలవగా.. 337 మంది హాజరయ్యారు. పీఆర్ ఎస్ఈ సీవీ సుబ్బారెడ్డి స్వయంగా వెరిఫికేషన్ జరిగే బోర్డుల వద్దే ఉండి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీడని సస్పెన్స్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. జిల్లాలో 473 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –5 పోస్టులు, 1,181 మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం భారీగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదనే ఉద్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకటికి రెండు సార్లు సరిచూస్తున్నారు. ఫలితంగా ఈ జాబితా అప్లోడ్ చేసే విషయంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. 28వ తేదీ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వస్తే సాయంత్రానికి జాబితాను అప్లోడ్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
తుది దశకు పోస్టుల భర్తీ
సచివాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రెండు రోజుల్లో నియామకపత్రాల జారీకి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని పోస్టులకు మెరిట్ జాబితాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే గాకుండా... అందులో స్థానం సంపాదించినవారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన చురుగ్గా చేపడుతున్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తనీయకుండా... పూర్తి పారదర్శకంగా చేపడుతున్న ఈ ప్రక్రియతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నేడు ధ్రువీకరణ పత్రాల పరిశీలన వీరికి: వెల్పేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులు 287 మందికి, మహిళా పోలీస్ 647 మందికి ధ్రువపత్రాల పరిశీలన శనివారం ఉంటుందని జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తెలిపారు. సాక్షి, విజయనగరం: గ్రామ, సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రి య జోరందుకుంది. ఈ క్రతువును వేగవంతంగా పూర్తి చేసేం దుకు అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. వేలాది మంది కి ఉద్యోగాల కల్పన ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో ముగి యనుంది. ఇప్పటికే వేలాదిమంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. మిగిలినవారి ధ్రువపత్రాల పరిశీలన శనివారం నాటికి ముగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 1238 మంది ధ్రువపత్రాల పరిశీలన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం 1238 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. 1492 మందికి 1238 మంది హాజరయ్యారు. పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ పోస్టులకు 62 మందికి 61 మంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు 268 మందికి 218 మంది, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్ – 5) 286 మందికి 236 మంది, వీఆర్వో పోస్టులు 56 మందికి 48మంది, విలేజ్ సర్వేయర్ 248 మందికి 245 మంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు 190 మందికి 182 మంది. వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ 88మందికి 66 మంది, వెల్పేర్, ఎడ్యుకేషన్ సెక్రటరీలు 294 మందికి 182 మంది హాజరయ్యారు. నియామక పత్రాల పంపిణీ రేపు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 30వ తేదీన అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారిని ఉద్దేశించి 30వ తేదీన ప్రసంగిస్తారని, ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఆ కార్యక్రమానికి హాజయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబం ధిత శాఖల అధికారులపై ఉందని చెప్పారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులందరినీ వరుస క్రమంలో కూర్చోబెట్టి ప్రణాళికా బద్ధంగా పోస్టింగ్ ఆర్డర్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకేసారి లక్ష 26 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకం. మెరిట్ అధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలకు మాత్రమే గతంలో నోటిఫికేషన్లు వచ్చేవి. అవి భర్తీ చేయడానికి చాలా సమయం పట్టేది. అలాంటిది ఒకేసారి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. – అసియా బేగం, కాట వీధి, విజయనగరం సీఎంపై నమ్మకాన్ని పెంచింది పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సీఎంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచింది. నేను నిరుపేద కుటుంబానికి చెందినవాడను. మా నాన్న గృహాలకు పెయింటింగ్ వేస్తూ మమ్మల్ని చదివించారు. నేను ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాను. విశ్వబ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. – చిట్టూరి సాయికుమార్, కొత్తపేట, విజయనగరం -
గ్రేడ్–5 మెరిట్ లిస్ట్ తయారీలో ఆలస్యం
సాక్షి అనంతపురం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. వివిధ కేటగిరి పోస్టుల అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను కొలికి తీసుకురాగా.. మరికొన్నింటిపై విస్తృత కసరత్తు జరుగుతుంది. ఆయా శాఖలకు చెందిన పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలనకు వేగవంతంగా సాగుతోంది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5కు సంబంధించి మెరిట్ లిస్ట్ తయారీలో ఆలస్యమవుతోంది. సాంకేతిక కారణాలు, ఒకే పరీక్ష నాలుగు కేటగిరీలకు అర్హులు కావడం వల్ల మెరిట్‌లిస్ట్ తయారీలో అధికారులు ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5కి మెరిట్ లిస్ట్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ వచ్చినప్పుడే అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన.. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్ఈ మహేశ్వరయ్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో 896 ఖాళీలు ఉండగా 853 మంది అభ్యర్థులతో మెరిట్‌లిస్ట్ విడుదల చేశారు. ఇప్పటి వరకూ 727 అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగా 126 మంది గైర్హాజరయ్యారు. విలేజ్ సర్వీస్ అసిస్టెంట్ పోస్టులు 896 ఉండగా 832 మందితో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఇందులో 523 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరుకాగా 309 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 282 ఉండగా రోస్టర్ ఆధారంగా 279 మందితో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. శుక్రవారం 140 మంది అభ్యర్థులకు కాల్ లెటర్ ద్వారా సమాచారం ఇవ్వడంతో 95 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. శనివారం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించనున్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 483 ఉండగా 378 మందితో మెరిట్ లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేశారు. స్థానిక రైతు బజార్ వద్దగల హార్టికల్చర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించారు. సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్న సమయంలో కొంతమంది అభ్యర్థులు జాబితాలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. నేడు డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం: డీఎస్సీ రెండోదశ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా అభ్యర్థులకు శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా అభ్యర్థుల మొబైళ్లకు ఇదివరకే మెసెజ్‌లు వెళ్లాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇంటిమేషన్ లెటర్, ఆధార్‌కార్డు, మూడు సెట్లు లీగల్ సైజ్ క్లాత్ కవర్ జతచేసి తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఏదైనా రెండింటిలో గాని లేదా మూడింటిలో గాని ఎంపికై ఉంటే ఒక మేనేజ్మెంట్లో మాత్రమే ఆప్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు సర్వం సిద్ధం
సాక్షి, కర్నూలు(అర్బన్) : జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనం, విశ్వేశ్వరయ్య భవన్ (పీఆర్ ఎస్ఈ కార్యాలయం), మండల పరిషత్ సమావేశ భవనంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్యభవన్‌లో కేవలం ఇంజినీరింగ్ అసిస్టెంట్, కర్నూలు మండల పరిషత్ సమావేశ భవనంలో వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మిగిలిన 16 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీపీఆర్సీ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలోని గదుల్లో నిర్వహించనున్నారు. అన్ని గదులకు ముందు భాగంలో అందులో ఏ పోస్టుకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందనే విషయాన్ని సైన్బోర్డులపై ముద్రించి గోడలకు అతికించారు. ఒక్కో గదిలో నాలుగుకు మించి టేబుళ్లను ఏర్పాటు చేశారు. వరండాలోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను వేశారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున డీపీఆర్సీ భవనం ముందుభాగంలో పెద్ద షామియానాలు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య భవన్, మండల పరిషత్ సమావేశ భవనం ప్రాంతాల్లోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు వేశారు. ఆయా భవనాల్లో టాయిలెట్లను శుభ్రం చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. 14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 19 రకాల పోస్టులకు గాను మంగళవారం సాయంత్రానికి 14 రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో షార్ట్ లిస్ట్‌లను రూపొందించి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ నెల 23న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ షార్ట్‌లిస్ట్‌ను అప్లోడ్ చేసిన అధికారులు.. 24వ తేదీ సాయంత్రానికి ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2), పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 (డిజిటల్ అసిస్టెంట్), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2 ), విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు అమెనిటీస్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్‌లను సిద్ధం చేశారు. ఐదు రకాల పోస్టులకు కొనసాగుతున్న ప్రక్రియ 14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లను విడుదల చేసిన అధికారులు మిగిలిన ఐదు రకాల పోస్టులైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్– ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్ ) గ్రేడ్–3, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు షార్ట్‌లిస్టులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్ ) గ్రేడ్–3, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి వెయిటేజీ మార్కులు కలిపి షార్ట్‌లిస్టులు అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ దిశగా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన షార్ట్‌లిస్టులలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్లను చూసుకుని.. కాల్‌లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్లెటర్లలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏ తేదీన, ఎక్కడ హాజరు కావాలనే విషయాలను పొందుపరిచారు. నేడు మూడు రకాల పోస్టులకు వెరిఫికేషన్ 24 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, 11 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, 770 అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్థానిక డీపీఆర్సీ భవనంలో చేపట్టనున్నారు. వీఆర్ఓ పోస్టులకు కటాఫ్ మార్కులు జిల్లాలో మొత్తం 224 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం సంబంధిత అధికారులు ప్రకటించిన కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి. బీసీ–ఏ లోకల్ 85.75, బీసీ–ఏ (ఉమెన్) 67, బీసీ–బీ 87, బీసీ–బీ (ఉమెన్) 58, బీసీ–సీ 71, బీసీ–సీ (ఉమెన్ ) 71, బీసీ–డీ 82, బీసీ–డీ (ఉమెన్) 60, బీసీ–ఈ 85, బీసీ–ఈ (ఉమెన్) 62, ఓసీ 91, ఓసీ (ఉమెన్) 71, ఎస్సీ 82, ఎస్టీ 71 మార్కులు. -
నేడు శానిటేషన్ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగుల భర్తీలో భాగంగా జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీలకు సంబంధించి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌భవన్‌లో ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. 297 శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల పోస్టులకు గానూ 134 మందికి కలెక్టర్ సత్యనారాయణ అనుమతులిచ్చారన్నారు. ఫైనల్ మెరిట్‌లిస్టు అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం మూడు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కౌంటర్లో 45 మంది సర్టిఫికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. -
కొలువుల కల.. నెరవేరిన వేళ
నిరుద్యోగుల్లో ఉద్యోగాల ఆనంద కేళి. సర్కార్ కొలువుల కోసం ఏళ్లతరబడి నిరీక్షించిన నిరుద్యోగుల కల.. నెరవేరిన వేళ. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నవరత్నాల అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టారు. సాక్షి, నెల్లూరు : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. నోటిఫికేషన్ ప్రక్రియ నుంచి నియామక పత్రాల వరకు అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత జాబితా వరకూ అంతా పక్కాగా సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు అధికారులు రోస్టర్, రిజర్వేషన్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. 19 శాఖలకు చెందిన అధికారులు తమ, తమ శాఖల పరిధిలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. తొలి రోజు నగరంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించారు. మొత్తం 7,814 గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తొలి రోజు 1,400 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేయనున్నారు. 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌లెటర్లు పంపించారు. జిల్లాలో 665 గ్రామ సచివాలయాలకు 7,814 పోస్టులకు గాను 1,17,138 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నియామక ప్రక్రియ అంతా జిల్లా పరిషత్ కార్యాలయం కేంద్రంగా జరుగుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులు (24, 25, 26 తేదీలు) పాటు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు మేరకు జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి అన్ని శాఖల అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రోస్టర్, రిజర్వేషన్ల ప్రక్రియను ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకుని ధ్రువపత్రాల తనిఖీ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు జెడ్పీ కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బందిని నియమించారు. గ్రామాల నుంచి వచ్చే వారి సందేహాలను ఆ సిబ్బంది తీరుస్తూ ధ్రువపత్రాల పరిశీలినకు వెళ్లాల్సిన సెంటర్, అడ్రసు, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను వివరిస్తున్నారు. రెండు కేంద్రాల్లో తొలి రోజు మంగళవారం 6 రకాల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ్ర«ధువ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రెండు పూటలా ఈ పరిశీలన జరుగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను , ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్వోదయ కళాశాలలో పరిశీల కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆరు శాఖలకు.. తొలి రోజు విలేజ్ సెరికల్చరల్ అసిస్టెంట్, గ్రామ మత్స్య సహాయకులు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలిన జరుగుతుంది. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో పరిశీలన జరుగుతోంది. ఇదిలా ఉండగా సెరికల్చర్ శాఖలో కేవలం ఇద్దరికే పోస్టులు దక్కనున్నాయి. వీరి హాల్ టికెట్ నంబర్లు 190916000058, 190516000111. గ్రామ మత్స్య శాఖ సహాయకులకు సంబంధించి 68 మందిని, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగంలో 165 మందికి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి 82 మందికి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరందరికీ దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అర్హతల పత్రాలు పరిశీలిస్తారు. సర్వోదయ కళాశాలలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుల్లో 147 మందికి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల్లో 154 మందికి ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న సర్వోదయ కళాశాలలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. ⇒ శనివారం రాత్రి అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచారు. సోమవారం ఆన్లైన్లో ఉంచిన మెరిట్ లిస్ట్‌ను జెడ్పీ, హాజరు కావాల్సిన కేంద్రాల వద్ద నోటిస్‌బోర్డులో పెట్టారు. ఆదివారం నుంచే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌ను పంపారు. ఈ మెయిల్ ఉన్న వారికి మెయిల్లో సైతం సమాచారం పంపారు. ⇒ ఈ పరిశీలనకు సకాలంలో ఎవరైనా హాజరు కాలేకపోతే ఇంకొక అవకాశం కల్పిస్తారు. ⇒ అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారుల నుంచి పొందడంలో ఆలస్యమైతే అలాంటి వారు ఈ రెండో చాన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ⇒ హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు తదితర కనీస వసతులు కేంద్రాల వద్ద కల్పించారు. 25వ తేదీన.. నెల్లూరు(పొగతోట): 25వ తేదీన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల (గ్రేడ్–2) ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న కాకుండా 25వ తేదీన జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 25న ఉదయం 9.00 గంటలకు పీఎన్ఎం హైస్కూల్ జెండావీధిలో పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు.అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హర్టికల్చర్ ఏడి కే ప్రదీప్‌కుమార్ తెలిపారు. 26న ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు నెల్లూరు(వేదాయపాళెం): సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ పరీక్షల్లో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సర్వోదయ కళాశాలలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాఖ ఉప సంచాలకులు బి.జీవపుత్రకుమార్ తెలిపారు. కొండాయపాళెం గేటు సెంటర్లోని డీడీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విద్యారాణి, సహాయ సంక్షేమాధికారులు నరసారెడ్డి, లక్ష్మీ ప్రసూన, తేజోవతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే.. నెల్లూరు(పొగతోట) : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నుంచి గురువారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుందని వివరించారు. ప్రస్తుతానికి మొదటి రోజు హాజరుకావాల్సిన వారి మెరిట్ జాబితాలను సిద్ధం చేశామని, అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారమిచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 8 శాఖల మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయని వివరించారు. బుధవారం పరిశీలనకు హాజరుకావాల్సిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. జెడ్పీ కార్యాలయ కేంద్రంగా కసరత్తు జరుగుతోందన్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలో రోస్టర్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అనంతరం ప్రింట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు సకాలంలో అందజేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను జెడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. -
కర్నూలు సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం
సాక్షి, కర్నూలు(అర్బన్) : సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా దాదాపు సిద్ధమైంది. అధికారులు సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియపై కుస్తీ పడుతూనే ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్‌పై తేలకపోవడం, పలు శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై స్పష్టత లేని కారణంగా ఆయా శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. సోమవారం సాయంత్రానికి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన జాబితాను మాత్రం పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించి మంగళవారం ఉదయానికల్లా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఆయా శాఖలకు సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసిన వెంటనే ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం జాబితాలను సిద్ధం చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రయత్నం చేస్తున్నా, ‘ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్’ పై తేలకపోవడం వల్ల జాప్యం జరుగుతూనే ఉంది. 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ... అన్ని పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాలను పూర్తి చేసి 25, 26, 27వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని పోస్టులకు సంబంధించి జెడ్పీ ప్రాంగంణంలోని కార్యాలయాల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ పోస్టులకు ఎంపికైన వారి వివరాలు ... విలేజ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారి షార్ట్ లిస్ట్‌ను సంబంధిత అధికారులు అప్లోడ్ చేశారు. వీరంతా ఈ నెల 25వ తేదీన జరగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. షార్ట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లు: 191308000145, 191308000175, 190508001602, 191308000380, 191308000430, 191308000114, 191308000269, 190908000826, 191308000277, 190908000082, 191308000262, 190908000717, 191308000669, 190908000837, 191308000137, 190908000213, 191308000068, 191308000892, 191308000097, 191308000880.