Aravindha Sametha
-
మరోసారి త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్
మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్‌ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను తీసుకు వచ్చింది. అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్‌శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్‌ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్‌ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్‌ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్‌ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్‌ను ఊపేసిన పాటల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్‌ట్యూన్.. రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్‌లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్‌ను యూత్‌ను కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్‌శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘టాక్సీవాలా’కు మద్దతుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్కేఎన్ నిర్మాతగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో మేసేజ్‌ను పోస్ట్ చేశారు. టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్ మెసేజ్‌పై స్పందించిన నిఖిల్, ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా రిలీజ్ కు ముందే లీకైతే గుండె పగిలినంత బాధకలుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు టాక్సీవాలాకు జరిగింది. తరువాత నా సినిమాకు కూడా జరగొచ్చు అందుకే అందరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సీవాలా విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. -
తమన్ సెంచరీ కొట్టేశాడు!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ దూసుకుపోతున్నాడు. కొత్తదనం లోపిస్తుందని, కాపీ క్యాట్ అని థమన్ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ‘అరవింద సమేత’తో మరో హిట్‌ను కొట్టాడు. థమన్ సంగీతం గురించి చెపుతూ.. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు థమన్‌ను ఆకాశానికెత్తేశారు. సినిమా సక్సెస్ కావడంలో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ కూడా కీలకపాత్ర పోషించిందని అందరూ ప్రశంసించారు. అయితే ఈ సినిమా తనకు వందో చిత్రమని థమన్ ట్వీట్ చేశాడు. తన వందో సినిమాగా అరవింద సమేత చేసినందుకు చాలా సంతోషంగా ఉందని థమన్ తెలిపాడు. Super Stoked on my #100th -#AravindaSametha Thnks for making me the #centurion !! Extremely blessed to have #blockbusteraravindhasametha as my 💯Th movie !! 🎥#Trivikram sir @tarak9999 @haarikahassine pic.twitter.com/7SK2SXS2To — thaman S (@MusicThaman) November 1, 2018 -
‘‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్‌మీట్
-
నాన్న హోదాలో బాబాయ్ : ఎన్టీఆర్
‘ఈ సమయంలో నాన్న ఉంటే బాగుండేదని... నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని, నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నాన’ని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పై విధంగా ఎన్టీఆర్ మాట్లాడాడు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా విజయాన్ని అభిమానులతోనే కాకుండా బాబాయ్‌తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని అందుకే బాబాయ్‌ను ముఖ్య అతిథిగా పిలిచామని అన్నాడు. ఈ వేడుకలో తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదని.. అభిమానులంతా బాబాయ్ మాటల కోసం ఎదురుచూస్తున్నారని అన్నాడు. జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ... జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. -
‘అరవింద సమేత’లో సీమకు అవమానం
పంజగుట్ట: ఇటీవలే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని సన్నివేశాలు రాయలసీమను అవమానపరిచేలా ఉన్నాయని, వెంటనే ఆ సన్నివేశాలు తొలగించి చిత్ర దర్శకుడు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలో ఎంతో కరువు ఉందని, వేలమంది వలసలు వెళుతున్నారన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, దేశంలో అతితక్కువ వర్షాభావం ఇక్కడే ఉంది వీటిపై సినిమాలు తీయకుండా కేవలం ఫ్యాక్షన్ అంటేనే రాయలసీమ అని సినిమాల్లో చూపించి నేటితరం యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో వివరించాలన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు కె.రవికుమార్, రాయలసీమ ఉద్యమ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఖానాపురం కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు సీమ క్రిష్ణ, రాయలసీమ యూత్ ఫ్రంట్ ప్రతినిధి జలం శ్రీనులు మాట్లాడుతూ .. సినిమాలో ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉంది, కొండారెడ్డి బురుజు, అనంతపురం టవర్ క్లాక్, కడప కోటిరెడ్డి సర్కిల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను ఉటంకిస్తూ తరిమి తరిమి నరుకుతానని హీరోచేత చెప్పించడం రాయలసీమ ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉందని డైరెక్టర్‌కు ఎలా తెలుసు అని, అతను సీమప్రాంతానికి చెందినవాడా ..? ప్రశ్నించారు. ఎక్కడో బ్యాంకాక్‌లో కూర్చుని కథలు రాయడంకాదు, సీమకు వచ్చి ఇక్కడ స్థితిగతులు తెలుసుకుని సినిమాలు తీయాలని సూచించారు. యువకులు ఉన్నత చదువులు చదువుకుని వలసలు పోతున్నారని, సినిమాల ప్రభావం వల్ల కడప, కర్నూలు, అనంతపురం అంటేనే ఇతర నగరాల్లో రూంలు అద్దెకు కూడా ఇవ్వడంలేదని, కడప యూనివర్సిటీలో సీట్లు వస్తే చదువుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్షోలో కూడా రాయలసీమ మట్టి అని మట్టి తినిపించడం, రాయలసీమ నీరు తాగితే పౌరుషం వస్తుందంటూ మురికినీరు తాగించడం చేస్తున్నారని ఇప్పటికైనా సినిమాల్లో, షోలల్లో రాయలసీమను కించపరిచేలా చిత్రీకరించరాదని, ఇదే విషయమై ఫిలించాంబర్‌లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు అప్పటికీ స్పందించపోతే రాయలసీమలో సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ -
అరవింద సమేత : రెడ్డెమ్మ తల్లి కవర్ సాంగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి వారాంతానికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. పండుగ సీజన్ కావటంతో ముందు ముందు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే సక్సెస్‌మీట్‌ను నిర్వహించిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద సమేత టీం. తాజాగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్ వర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ పాటను ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్ దాస్ స్వయంగా రాసి పాడారు. -
అరవింద సమేత బోల్డ్ స్టోరీ : రామ్ చరణ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించాడంటూ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫామెన్స్‌లో ఒకటిగా ఈ క్యారెక్టర్ నిలిచిపోతుంది. బోల్డ్ స్టోరి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్, పదునైన డైలాగ్స్ సూపర్బ్. జగ్గూ భాయి నటన, థమన్ సంగీతం ఈ సినిమా విజయానికి పిల్లర్లుగా నిలిచాయి. పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది’ అంటూ అరవింద సమేత టీంకు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా.. ‘నిజంగా అరవింద సమేత ఓ ఎమోషనల్ ట్రీట్’ అని ట్వీట్ చేస్తూ చెర్రీ పోస్టును షేర్ చేశారు. -
ఓవర్సీస్లో తెలుగు సినిమాల దూకుడు
తెలుగు సినిమాల స్టామినా పెరిగింది. వంద కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌కు హద్దులు ఉండేవి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఆడేవి. వసూళ్లలో పెద్ద రికార్డులు కూడా క్రియేట్ చేసేవి కాదు. అయితే బాహుబలి సినిమాతో దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. రాజమౌళి తన బాహుబలి సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌కు క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు సినిమాలు రాష్ట్రాలు దాటి దేశాల హద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 2018లో టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడింది . ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కూడా వసూళ్ల మోతను మోగించాయి. ఈ ఏడాదిలో రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా ‘అరవింద సమేత’ రికార్డుల వేటకు బయలుదేరింది. ఇప్పటికే వంద కోట్లను కలెక్ట్ చేసి వేగాన్ని పెంచుతోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియా, అమెరికాల్లో వసూళ్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. హిందీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలకే ఓవర్సీస్లో ఆదరణ ఎక్కువ ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇప్పటికే మన సినిమాలు జపాన్, చైనా దేశాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇంకా తన పరిధిని పెంచుకుంటూ.. కథ, కథనాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ.. మరింత ముందుకు దూసుకుపోవాలి. -
‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్ మీట్
-
ఈ విజయం ఎన్టీఆర్‌దే : త్రివిక్రమ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా గ్రాస్సాధించటంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా మీడియాతో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మహిళా రిజర్వేషన్లను మగాళ్లే ఆపుతున్నారు. తల్లి, భార్య, సోదరి కంటే ఎక్కువ ఎవరుంటారు. అందుకే నా చిత్రం ముగింపు మహిళలకు అధికారం ఇవ్వాలని చెప్పా. ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడిని ప్రతి తరం చూడాలి. అరవింద సమేత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. ఒక పరాజయం, ఒక విషాధం తర్వాత వచ్చిన చిత్రం ఇది. ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ పేరును నిలబెట్టే వ్యక్తి కాదు... కొనసాగించే వ్యక్తి. తండ్రి మరణం విషాదాన్ని చూపించకుండా నలిగిపోయి పనిచేశారు. ఈ సినిమా విజయం ఎన్టీఆర్ దే’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రివిక్రమ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా అన్నారు. తామంత త్రివిక్రమ్ ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేశామన్న ఎన్టీఆర్, అరవింద సమేత లాంటి అద్భుత చిత్రాన్ని తనకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క నటుణ్ని, సాంకేతిక నిపుణుడిని పేరు పేరునా అభినందించారు. -
ఎన్టీఆర్ అరుదైన రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్సీస్లో కూడా మంచి జోరు చూపిస్తున్న అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. అయితే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన హీరోలు గతంలో కూడా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఈ రికార్డ్‌ను వరుసగా నాలుగు సార్లు సాదించటం విశేషం. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం. చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రెస్‌మీట్
-
‘అరవింద’ ప్రీమియర్ షో కలెక్షన్లు అదుర్స్
మాటల మాంత్రికుడు కలానికి పదును పెట్టి మాటల తూటాలను పేల్చితే ఎలా ఉంటుందో.. యంగ్ టైగర్ తన నట విశ్వరూపాన్ని చూపితే ఎలా ఉంటుందో.. సరైన సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్‌ల్లో రిలీజైన ‘అరవింద సమేత’ ఓవర్సీస్లో దూసుకెళ్తోంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్లో ఒక్కరోజులోనే మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్‌ను కూడా అవలీలగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి. జగపతి బాబు, నాగ బాబు, పూజా హెగ్డే, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందిచారు. #MillionDollarAravindhaSametha 🔥 pic.twitter.com/XeBEGsNNY9 — #RageOfTiger / Vainavi Hanvi Creations (@vainavihanvi) 12 October 2018 చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
త్రివిక్రమ్ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు : ఎన్టీఆర్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. ఎన్నో అంచనాల నడుమ గురువారం విడుదలై. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చిత్రం సక్సెస్ కావడంతో యూనిట్ సభ్యులందరూ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విజయం సాధించడంపై ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి త్రివిక్రమ్ కారణం. ఆయనే లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన డెడికేషన్, ఫోకస్ మమ్మల్ని ముందుకు నడిపించింది. థ్యాంక్యూ సర్. ఈ చిత్రాన్ని భుజాలపై మోసిన యూనిట్ సభ్యులందరికి ధన్యవాదాలు. నాకు అతిపెద్ద బలమైన అభిమానులందరికి , మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. Overwhelmed by the response for #ASVR . Thank you for all the love. This success wouldn’t have been possible without #Trivikram garu, whose focus and determination drove us all. Thank you sir — Jr NTR (@tarak9999) October 11, 2018 Thank you Chinababu garu, @vamsi84 ,@hegdepooja,@IamJagguBhai, @MusicThaman ,Penchal Das,PS Vinod,Naveen Nooli,Ram- Lakshman masters & every member of team #ASVR, who’ve carried this film on their shoulders. — Jr NTR (@tarak9999) October 11, 2018 A big thanks to all my fans, who’ve been a source of great strength during this time. Thanks to members of the media and members of the film fraternity,for their support to #ASVR — Jr NTR (@tarak9999) October 11, 2018 -
తారక్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రివ్యూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్లో తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా జగపతిబాబు, నాగబాబు, నవీన్ చంద్రలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్న అరవింద సమేత వీర రాఘవపై ఉమైర్ సందు అనే వ్యక్తి రివ్యూ ఇచ్చేశాడు. దుబాయ్‌లో ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్‌గా చెప్పుకునే ఉమైర్ గతంలోనూ స్టార్ హీరోల చిత్రాలకు ముందే రోజే రివ్యూ ఇచ్చాడు. అయితే అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెడుతోంది. గతంలో బాహుబలి ది బిగినింగ్ సినిమాకు దారుణమైన రివ్యూ ఇచ్చిన ఉమైర్.. తరువాత కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాలకు సూపర్ హిట్ రివ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు అరవింద సమేతను కూడా సూపర్ హిట్ అంటూ పొగిడేయటంతో రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. -
‘అప్పుడు ఎన్టీఆర్ కళ్లలో ఆనందాన్ని వర్ణించలేను’
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘అరవింద సమేత’ ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నాడు. ఈ గురువారం రిలీజ్ కానున్న సినిమాకు ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తూ.. బిజీగా ఉన్న ఎన్టీఆర్‌కు ప్రముఖ యాంకర్, నటి ఇచ్చిన బహుమతి ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు సదరు నటి సోషల్ మీడియాలో వెల్లడించింది. యాంకర్, నటి గాయత్రి భార్గవి తన తాత శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ చిత్రపటాన్ని ఎన్టీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు ఎన్టీఆర్ కళ్లలో చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ చెప్పుకొచ్చిన గాయత్రి.. ‘అమ్మకు ఇస్తానండీ.. థ్యాంక్యూ’ అని ఎన్టీఆర్ అన్నాడని పోస్ట్ చేశారు. When the Pencils Sketch of an 80 years young Sri Sankar Narayana my grandfather reaches the hands of @tarak9999 . The joy in his eyes of young tiger cannot be mentioned in words. 'Ammaki istanau andi Thank you' were his words. @vamsikaka pic.twitter.com/w8tUFgbGjr — Gayatri Bhargavi (@GayatriBhargav1) October 9, 2018 -
బన్నీతో హ్యాట్రిక్ సినిమా..!
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, నాగబాబు, రావూ రమేష్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే బన్నీ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం అరవింద సమేత. దసరా సెలవుల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు సంబంధించిన అనుమతిని ఇచ్చింది. ఇక సినిమా రిలీజైన తరువాత వారం రోజుల పాటు (అక్టోబర్ 11 నుండి 18వరకు) రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని కలిపించింది. పండగ సీజన్ కావడం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఉండే క్రేజ్.. వీటన్నంటిని దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలె ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
త్రివిక్రమ సమేత వీరరాఘవ
-
‘అజ్ఞాతవాసి’పై స్పందించిన ఎన్టీఆర్
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లోతెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసిపై స్పందించాడు. ‘అజ్ఞాతవాసి ప్రభావం అరవింద సమేతపై ఉంటుందని నేను భావించటం లేదు. ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం. నా కెరీర్లో కూడా ఫ్లాప్స్ వచ్చాయి. ఒక ఫ్లాప్ ప్రభావం ఆ తదుపరి చిత్రం మీద ఉంటుందని నేను నమ్మను. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా’ అన్నాడు ఎన్టీఆర్. -
‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ స్టిల్స్
-
‘వయొలెన్స్ నీ డీఎన్ఏలోనే ఉంది’
యంగ్ టైగర్ ఎన్టీఆర్- పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ఎన్టీఆర్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మంగళవారం (అక్టోబర్ 2) రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నోవాటెల్ హోటల్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా థియరిటికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల పరిచయంతో ట్రైలర్ మొదలౌతుంది. పూజా పేరు తెలుసుకోవాలనుకున్న ఎన్టీఆర్‌కు.. ‘పేరు మాత్రమే చాలా.. ఇంకా అడ్రస్ కూడా చెప్పాలా’అనే సమాధానమొస్తుంది. ఇక సమస్యను (ఫ్యాక్షనిజాన్ని) రూపుమాపడం ఒక్క అడుగు దూరంలోనే ఉందంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది. ‘వయొలెన్స్ నీ డీఎన్ఏలోనే ఉందంటూ’ సాగే త్రివిక్రమ్ మార్కు డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘ఫ్యాక్షనిజం అనే పదం విన్నావా.. అర్థం కాలేదు కదా’ అంటూ పూజా ఎన్టీఆర్‌ను అడగడం...ఆ వెంటనే ‘ఈడ మందిలేరా కత్తుల్లేవా అంటూ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లో కనిపించడం చూస్తుంటే ఎన్టీఆర్ రెండు భిన్న కోణాలు గల పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. -
‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న క్రేజీ చిత్రం ‘అరవింద సమేత’. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్స్, టీజర్, పాటలతో సినిమాపై భారీ హైప్ క్రియేటైంది. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అభిమానులకు మరో తీపి కబురును చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 2న ఏర్పాటుచేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.