ashok kumar
-
KSR Live Show: కరెంట్ చార్జీలు పెంచి కప్పిపుచ్చే కుట్ర.. డైవెర్షన్ లో బాబు సిద్ధహస్తుడు
-
మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా
రామచంద్రపురం: స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ‘‘భవిష్యత్ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. ఆది నుంచీ వివాదాస్పదమే.. సీఐ అశోక్ కుమార్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్ కుమార్ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
తిరుమలకు చంద్రబాబు కళంకం తెచ్చారు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ఎవరూ చేయనంత అపచారమిదిఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల పరువు మంటగలిపారుగీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివిఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు. -
ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టుల కుట్ర
ములుగు/వాజేడు: రానున్న ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న కుట్రను గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు తిప్పికొట్టారని బుధవారం ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డీ అశోక్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కర్రె గుట్టల్లో 30 నుంచి 40 మంది సాయుధ మావోయిస్టులు పెద్ద నాయకులతో కలసి ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఎగోలపు మల్లయ్య, భద్రు అలియాస్ పాపన్న, ముచ్చకి ఉంగల్ అలియాస్ రఘు, మడకం మంగ అలియాస్ మాసా ఇతర దళ సభ్యులు కర్రె గుట్ట ప్రాంతంలో ఉన్నారని.. తెలంగాణలో భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం వేస్తున్నారని సమాచారం రాగా బుధవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో మావోయిస్టులు పోలీసు పార్టీలను చూసి తమ వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదని, అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా కిట్ బ్యాగుల్లో ఆలివ్‌రంగు డ్రెస్‌లు, ఇతర వస్తువులు, సుతిలి బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు సాహిత్యం, మందులు, నీటి డబ్బాలు, సీసాలు, గొడుగులు, కూరగాయలు, తాళ్లు దొరికాయని తెలిపారు. కర్రె గుట్ట ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్ బి.అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు. – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా రిమాండ్ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు. – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్ చెప్పడం దురదృష్టకరం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్డీఎఫ్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. – విఠల్ రావు, సీనియర్ న్యాయవాది సూత్రధారులకు శిక్ష తప్పదు ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు. – జయరాజ్, మాజీ పీపీ తీర్పులకు వక్రభాష్యం తగదు తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్ అసోసియేషన్ -
కొనసాగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఎస్సై అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. మొత్తం 538 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 260 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్షల్లో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 4,581 మంది పురుష అభ్యర్థులు హాజరు కాగా, 3,233 మంది, 1177 మంది మహిళ అభ్యర్థులు హాజరు కాగా, 607 మంది అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలను ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు పరిశీలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
నవ్వులే నవ్వులు
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి కీలక పాత్రల్లో అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహానటులు’. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అనిల్ బోధిరెడ్డి, తిరుపతి ఆర్. యర్రంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో పూర్తి ఫన్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో తీసిన మూవీ ‘మహానటులు’. నలుగురు టీమ్‌గా మారి మహానటులు అనే యూట్యూబ్ చానల్‌ను ఎలా అభివృద్ధి చేశారు? అనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, సంగీతం: మార్కస్ ఎం. -
తలకోన: ప్రకృతికి విరుద్ధంగా వెళితే...
అప్సరా రాణి ప్రధాన పాత్రలో, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ‘ఉగ్రం’ మంజు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేష్ నారదాసి. -
ప్రియమైన థ్రిల్
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరో హీరోయిన్గా ఏజే. సుజిత్ దర్శకత్వం వహించిన సైకో థ్రిల్లర్ ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వహణ సారథ్యంలో సుజిత్, బాబు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేదికపై హీరో అశోక్ మాట్లాడుతూ– ‘‘మంచి సైకో థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో నేనే హీరో, నేనే సైకో. యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమిది’’ అన్నారు. ‘‘మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో వందో చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ దేవా. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షా, సహ–నిర్మాత: కె. లక్ష్మీకాంత్. -
నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు
గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇష్టం లేని పెళ్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు. అందుకే సినిమాలు మానేశా.. చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు. ముగ్గురికి పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులు తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. నిత్యానంద మాయలో పడి ఇప్పటికీ అతడితోనే! రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్ కుమార్. చదవండి: హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు -
సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్ ఫోన్లు గుర్తించాం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్‌లోని టాప్‌కాఫ్ (టీఏఎఫ్‌సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్‌లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్‌లను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. టాప్‌కాఫ్‌ను ఏపీఎల్‌ఎస్‌ఏ విజయవాడ బ్రాంచ్ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్, బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. -
లెజెండరీ బాలీవుడ్ నటుడి కుమార్తె మృతి
ప్రముఖ లెజెండరీ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ కూతురు, నటి భారతి జాఫ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు, నటుడు కమల్జీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. భారతీ జాఫ్రీ 'హజార్ చౌరాసి కి మా', 'సాన్స్', 'దమన్' వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. భారతి సయీద్ జాఫ్రీ సోదరుడు హమీద్ జాఫ్రీని వివాహం చేసుకున్నారు. (చదవండి: Raju Srivastava Death: విషాదం.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి) భారతి మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ నందితా దాస్ ఆమెతో కలిసి ఉన్న మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఆమెను చాలా మిస్ అవుతున్నా. భారతీ జాఫ్రీ ఒక మంచి వ్యక్తి. ఆమెను కోల్పోవడం బాధాకరం. భారతి ఆలోచనా విధానం చాలా గొప్పది. చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా." అని అన్నారు. భారతి అల్లుడు కన్వల్ జీత్ సింగ్ అత్తను తలుచుకుంటూ తీవ్ర భావోద్వేగానకి లోనయ్యారు. 'మాకు అన్నీ తానై ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బుధవారం ఆమె అంతిమక్రియలు చెంబూర్ క్యాంపులో నిర్వహిస్తాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Kanwaljit Singh (@kanwaljit19) -
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్‌జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
‘పెద్దింటి’కి సినీ స్వర్ణ కమలం అవార్డు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, సినీరచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణ కమలం అవార్డు లభించింది. సినిమా రంగంలో ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును ఉత్తమ రచయిత విభాగంలో 2020 సంవత్సరానికిగాను పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ సభ్యులు సీవీఎల్ నరసింహరావు ప్రకటించారు. కథకుడిగా తెలంగాణ భాష, యాసలపై పట్టుకున్న ‘పెద్దింటి’ పది సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మాటలు, పాటలు రాసిన ‘మల్లేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం అశోక్‌కుమార్ ముగ్గురు ప్రముఖ అగ్రహీరోల సినిమాలకు మాటల రచయితగా పనిచేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అశోక్‌కుమార్ రాసిన జిగిరి నవల ఆధారంగా హాలీవుడ్ హంగులతో సిని మాగా రూపొందుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం సిరిసిల్లలో స్థిరపడిన అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణకమలం అవార్డు రావడంపై పలువురు ఆయన్ని అభినందించారు. -
పక్కా కార్యాచరణతో ముందుకు
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడే అసాంఘిక శక్తుల గుట్టు రట్టు చేసేందుకు, లోతైన విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యరంగంలోకి దిగింది. శనివారం విజయవాడలో సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తొలి భేటీ జరిగింది. అందుబాటులో ఉన్న సిట్ సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాగా, విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులతో జూమ్ ద్వారా అశోక్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి జరిగిన దేవాలయాల ఘటనలను ప్రాథమికంగా సమీక్షించారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, వాటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్టు అయ్యారు, తదితర అన్ని వివరాలను పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దేవాలయ ఘటనలకు సంబంధించిన కేసుల ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్), కేస్ డైరీ (సీడీ ఫైల్స్)లను తీసుకుని పరిశీలించనున్నారు. అన్ని కేసులను లోతుగా పరిశీలించి, వాటికి సంబంధించిన ఆధారాలు, వివరాలను సేకరించాలని సభ్యులకు అశోక్‌కుమార్ తెలిపారు. సిట్ టీమ్ అంతా అంకితభావంతో పనిచేయాలని, ఆలయ ఘటనల్లో మూలాలను వెతికి పట్టుకుని అసలైన దోషులను శిక్షించేలా గట్టి ప్రయత్నాలు చేయాలని అశోక్‌కుమార్ సూచించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి సమావేశమవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. సిట్ టీమ్ సూపర్ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో మతపరమైన అలజడులు రేపేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలకు సిట్ ఏర్పాటు అద్దంపడుతోందని వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం కూర్పు సూపర్‌గా ఉందని పేర్కొంటున్నారు. హైందవ సంప్రదాయాలు తెలిసిన వాళ్లను, నేర పరిశోధనలో దిట్ట అయిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్, సిట్ చీఫ్ అశోక్‌కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో)గా మూడున్నరేళ్లు పనిచేశారు. విజయవాడ డీసీపీగా ఉన్న సమయంలో దుర్గ గుడిలో తాంత్రిక పూజలపైన ఆరా తీశారు. ఆలయాల భద్రత, నేర పరిశోధనలో పట్టున్న అధికారిగా ఆయనకు పేరుంది. టీమ్‌లో సభ్యులంతా నేరపరిశోధనలో మంచి అనుభవం ఉన్న వారే కావడం గమనార్హం. కుట్ర కోణం బయటపడుతుందని ఆశిస్తున్నా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తీరు బాగుంది. ఇందులో ఉన్న అధికారులు ఎంతటి సమర్థులో నాకు తెలుసు. రాష్ట్రంలో మత సామరస్యానికి తూట్లు పొడిచేలా కొందరు ఆలయాల ఘటనలను ప్రోత్సహిస్తున్నారు. ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కులమతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కోణాన్ని ఈ సిట్ వెలికితీస్తుందని ఆశిస్తున్నాను. –వి.రాజగోపాల్, రిటైర్డ్ డీఎస్పీ, రాజమహేంద్రవరం సిట్ ఏర్పాటు మంచి పరిణామం ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసే ఘటనలను నిగ్గు తేల్చేలా సిట్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తేటతెల్లమవుతోంది. సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనల్లో కుట్ర కోణం బయటకు తీయాలి. – పూరిళ్ల శ్రీనివాస్, న్యాయవాది, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా -
ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ వెల్లడించారు. టెండర్ ఓటింగ్ (చాలెంజ్ ఓటు) 0.1 శాతం కంటే ఎక్కువ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పామని, వారి నివేదిక ఆధారంగా రీపోలింగ్‌పై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని, వీటి పరిధిలో ఏవైనా ఐటీ సంస్థలు ఉన్నా లోకల్ హాలిడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఓటు వేసేందుకు 2, 3 గంటల పర్మిషన్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను కోరామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గిపోతున్నందున, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించామని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసిన ప్రచారంతో పోలింగ్‌శాతం 75 శాతానికి పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, 21న నిశితంగా వాటిని పరిశీలించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్‌బూత్‌లకు తీసుకు వెళ్లేలా చూస్తున్నామన్నారు. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ చేసిన ఏర్పాట్లపై కార్యదర్శి అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రతినిధి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... ఎన్నికల ఏర్పాట్లు... దాదాపుగా పూర్తయ్యాయి. మెటీరియల్ సార్టింగ్, బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 20న అన్ని మున్సిపాలిటీల్లో తుది ఏర్పాట్లను పరిశీలిస్తాం. ఫర్నిచర్, మంచినీరు ఇతర కనీస సదుపాయాల పరిశీలన. 21న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బృందాలు, రిటర్నింగ్, పోలింగ్ అధికారులు ఖరారై, మెటీరియల్‌తో సహా ఆ రోజు మధ్యాహ్నం నుంచే కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళతారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు.. ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల్లో 7,961 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. పోలింగ్ సిబ్బంది 52,757 మందికి ర్యాండమైజ్ చేసి శిక్షణనిచ్చాం. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్‌కు 5 వేల మంది ఉంటారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇద్దరేసి పోలీ సులుంటారు. మొత్తం 53,55,942 ఓటర్లున్నారు. డబ్బు జప్తుపై... డబ్బు జప్తు విషయంలో పోలీసులు, ఇతర అధికారులు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేయాలని ఆదేశించాం. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పంట అమ్మిన మొత్తం, వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఇలా తగిన కారణాలు చూపితే అటువంటి వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించాం. వెబ్‌కాస్టింగ్... వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం. కచ్చితంగా 30% పోలింగ్ స్టేషన్లు కవరవుతాయి. సున్నిత, అతిసున్నితమైన పోలింగ్ బూత్‌ల్లో తప్పనిసరిగా ఉంటుంది. వ్యయపరిమితి పెంచే యోచన.. అభ్యర్థుల వ్యయ పరిమితి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.లక్షన్నర, మున్సిపాలిటీల్లో రూ.లక్ష ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ఈ మొత్తం ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకల్లా సమీక్షించి అక్కడ పరిమితి పెంచే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కేంద్రాలు... అందుబాటులో ఉన్న స్థలం, సౌకర్యాల ప్రాతిపదికన సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను రెవెన్యూ డివిజన్ హెడ్క్వార్టర్లు, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటారు. -
అయ్యప్ప కటాక్షంతో...
సుమన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్ కెరీర్లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు. అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్. పి. తెన్నేటి. -
13గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు. శోభయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్ వంటి పది చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. -
తుపాకీ మిస్ ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి
అర్ధవీడు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు. -
పోలింగ్ బూత్‌లో ఫొటోలు తీస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొంతమంది పోలింగ్ సిబ్బంది, ఓటర్లు పోలింగ్ సందర్భంగా ఓటు వేస్తున్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఫొటోలు తీసే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. -
సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 4 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న బిట్‌శాట్, 27న జేఈఈ ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ పునఃపరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తేదీలు నిర్ణయిస్తామని చెప్పారు. -
మే 8లోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల రీ వాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో! ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం. ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్ఎస్ నేతను బయటకు తీసుకొచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. -
అందుకే నవ్యకు 99కు బదులు సున్నా వచ్చింది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అంగీకరించారు. ఇంటర్ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. అందుకే నవ్యకు సున్నా! తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్ స్పందించారు. ఓఎమ్మార్ షీట్లో మార్కుల విభాగంలో బబ్లింగ్ చేయడంలో ఎగ్జామినర్ చేసిన తప్పిదం వల్లే నవ్యకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. నవ్యకు 99 మార్కులకు బదులు ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో నవ్యకు అలా మార్కులు వచ్చాయని తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే స్పందించి.. వెరీఫై చేసి.. ఆ విద్యార్థినికి న్యాయం చేశామన్నారు. ఈ విధంగా మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 99కి బదులు సున్నా మార్కులు వేయడం చాలా పెద్ద తప్పిదమని, దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నవ్య ఓఎమ్మార్ షీట్ మీడియాకు చూపించారు. ఆ వదంతులు అవాస్తవం.. ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతైనట్టు వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌బోర్డుకు 12 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యాలయాల్లోనే పరీక్షా పత్రాల మూల్యంకనం చేపడతామని తెలిపారు. పరీక్షా పత్రాలన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఏ ఒక్క పరీక్షా పత్రం మిస్ కాలేదని చెప్పారు. ఆబ్సెంట్ అయిన విద్యార్థిని కూడా పాస్ చేశారని వచ్చిన వాదనలు అపోహ మాత్రమేనని, కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రెండు సెంటర్లు కేటాయించామని, అందులో వారు ఒక సెంటర్లో ఆబ్సెంట్ అయి.. మరో సెంటర్లో పరీక్ష రాశారని, అందువల్ల వారికి ఏ-పీ (ఆబ్సెంట్-పాస్) అనే కోడ్ వచ్చిందని, రెండు సెంటర్లు వచ్చినవారిలో కొందరు ఫెయిల్ కావడంతో ఏ-ఎఫ్ వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తిగా ఆబ్సెంట్ అయిన వాళ్లను పాస్ చేయడం కానీ, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం కానీ జరగలేదని తెలిపారు. 15 ఏళ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోందని, 15 ఏళ్లుగా ఒకే సంస్థ ఇస్తుండటంతో మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరెనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని, ఆ సంస్థ మూడేళ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్ బోర్డే ఔట్ సోర్సింగ్ లేకుండా సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని అశోక్‌కుమార్ వివరించారు. రీ వాల్యుయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యుయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని తెలిపారు. అశోక్‌కుమార్‌ను నిలదీసిన నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అశోక్‌కుమార్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులకు ఎందుకు బలి కావాలని, 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థిని.. కలత చెంది.. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యంకనంలో టెక్నికల్ తప్పిదాలు దొర్లాయని సాక్షాత్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డే చెప్తున్నారని, అలాంటప్పుడు మీ తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవాలా? అని నిలదీశారు. ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంత పెద్ద పొరపాట్లు, తప్పిదాలా? అని ప్రశ్నించారు. నిరసనకారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అశోక్‌కుమార్ తడబడ్డారు. చదవండి : నవ్యకు తెలుగులో 99 మార్కులు