assistance
-
పునరావాసం ఊసేలేదు
సాక్షి, అమరావతి : భారీ వర్షాలు, వరదలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా స్పందించడంలేదు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విలీన మండలాలు, మరికొన్ని గిరిజన మండలాల్లో గ్రామాలు మునిగిపోయి జనం జలదిగ్బంధంలో చిక్కుకుపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. శనివారం సాయంత్రం వరకు 20 మండలాల్లో 200కి పైగా గ్రామాలు మునిగిపోయినా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. దీంతో అక్కడి జనం నానా బాధలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు వచ్చి, కరెంటులేక, నిత్యావసరాలు దొరక్కపోవడంతోపాటు కనీసం మంచినీరు లేక విలవిల్లాడుతున్నారు. వరద పెరిగాక జనాన్ని తరలిస్తారట.. గోదావరి వరద పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశాకే పునరావాస కేంద్రాల గురించి ఆలోచించాలని అధికారులు సూచించడంతో ఎక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాలేదు. దీంతో ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇళ్లల్లోకి నీరు చేరినా అక్కడే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. గోదావరి వరద పెరిగేలోపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వరద పెరిగాక సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించవచ్చని అధికారులు భావించడంతో వందలాది గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే చిక్కుకుపోయారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
సీఎం జగన్ ఆపన్న హస్తం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్ జగన్.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్ తల్లి టి.ఉష, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు. -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది. -
రెండున్నరేళ్ల చిన్నారికి రూ.లక్ష సాయం
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో శనివారం డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుని వివాహానికి సీఎం హాజరయ్యారు. తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం.. మలి్టపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న రెండున్నర ఏళ్ల నారాయణ నిఖిల్‌ను ముఖ్యమంత్రి పరామర్శించారు. నగరంలోని భవానిపురం, 38 వార్డు కొత్తపేటలో నివాసం ఉంటున్న బైపిళ్ళ రమేష్, లక్ష్మీ పద్మ దంపతుల కుమారుడు నారాయణ నిఖిల్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని మాజీమంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యను విన్న జగన్.. చిన్నారికి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావును ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఢిల్లీరావు వైద్య సేవల నిమిత్తం రూ.లక్ష చెక్కును కలెక్టరేట్లో అందజేశారు. -
ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90% పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాలలో 80% నుంచి 90% మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80% లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని నివేదిక విశ్లే షించింది. గతంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించిందని, అనంతరం జనవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందింది. పట్టణ పేదలకూ చేయూత గత ఆర్థిక ఏడాది పట్టణ పేదలకు సాయం చేయడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా, అందులో 7,24,776 మంది ఏపీ వారేనని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు 2.67 లక్షల ఎల్ఐజీ గృహాలను రాష్ట్రంలో నిర్మించగా, ఇతరత్రా దేశ వ్యాప్తంగా 9.15 లక్షల గృహాలు నిర్మించారని తెలిపింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. 18.47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారని తెలిపింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద లక్ష్యానికి మించి కొత్తగా 33,122 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారని స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాదిలో ఏపీలో 24,852 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 1,24,311 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇది లక్ష్యానికి 500 శాతం మేర అధికం అని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 99.98 శాతం డెలివరీలు (ప్రసవాలు) ఇన్‌స్టిట్యూషన్లలోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 7,61,629 డెలివరీలు జరిగాయని తెలిపింది. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం చాలా మంచి పనితీరు కనపరిచాయని, 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) చక్కగా పని చేశాయని ప్రశంసించింది. -
ఐఆర్‌ఆర్‌ఏ ఏర్పాటుకు అక్టోబర్ డెడ్‌లైన్
న్యూఢిల్లీ: ట్రేడింగ్ మెంబర్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడితే ఇన్వెస్టర్లకు సహాయ సహకారాలు అందించేందుకు తగు వేదికను ఏర్పాటు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం 2023 అక్టోబర్ 1లోగా ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేవాలని స్టాక్ ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లకు శుక్రవారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించింది. ట్రేడింగ్ మెంబర్స్ సిస్టమ్స్‌లో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఓపెన్ పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు వాటిని క్లోజ్ చేయలేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను రద్దు చేసేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ఉపయోగపడనుంది. సర్క్యులర్ ప్రకారం ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసుల వ్యవస్థను ఎక్సే్చంజీలు రూపొందిస్తాయి. సాంకేతిక లోపాలకు గురైన ట్రేడింగ్ మెంబరు (టీఎం) .. ఈ సర్వీసులను అందించాల్సిందిగా ఎక్సేంజీలను అభ్యర్ధించాల్సి ఉంటుంది. ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసును ఆథరైజ్ చేసిన తర్వాత సదరు టీఎం ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను పరిష్కరించుకోవచ్చు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక తిరిగి టీఎం సిస్టమ్ ద్వారా ట్రేడింగ్ యథాప్రకారం కొనసాగుతుంది. అంతకు ముందు ఐఆర్‌ఆర్‌ఏ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలన్నీ టీఎం సిస్టమ్‌లో ప్రతిఫలిస్తాయి. -
విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో భారత్
US Povide Pakistan For F-16 fighter jet fleet sustainment program: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్ డాలర్ల ఎఫ్16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్ నేతృత్వంలో యూఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో భారత్ తీవ్ర అభ్యంతరాలతోపాటు భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐతే అమెరికా మాత్రం ఇది కేవలం అమ్మాకాలే కానీ సహాయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు యూఎస్ దక్షిణాసియా, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ మాట్లాడుతూ.... ఒక దేశానికి అందించే రక్షణ పరికరాలకు మద్దతు ఇవ్వడం యూఎస్ ప్రభుత్వ విధానమని నొక్కి చెప్పారు. అంటే దీని అర్థం కేవలం పాక్‌తో ఉన్న ఎఫ్16 విమానాలకు సంబంధించిన విడిభాగాల విక్రయం మాత్రేమనని సహాయం కాదని తేల్చి చెప్పారు. తాము కేవలం పరికరాల సేవలను మాత్రమే ప్రతిపాదిస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల విమానాలు వాయు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. తాము భారత్ ఆందోళనలను అర్థం చేసుకున్నామని అన్నారు. పాక్‌లో ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలు 40 ఏళ్లకు పైబడినవి అందువల్ల ఆయా భాగాలకు సంబంధించిన సర్వీస్‌ని అందిస్తున్నామే తప్ప కొత్త విమానాలను ఏమి అందిచండం లేదని స్పష్టం చేశారు. ఐతే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్ హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద గ్రూపులను అణిచివేయడం తోపాటు, వారి సురక్షిత స్థావరాలను కూల్చివేయడంలో విఫలమైనందున పాకిస్తాన్‌కు సుమారు రెండు వేల బిలియన్ డాలర్ల భద్రతాసహాయాన్ని నిలిపేశారు. (చదవండి: ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....) -
ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి/తూర్పుగోదావరి: ఆన్లైన్ లోన్ యాప్ బారినపడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి(4), లిఖిత(2) ఇద్దరికి చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య కాగా, అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం
ఇస్లామాబాద్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు అమెరికా పాకిస్తాన్‌కి సుమారు రూ. 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ ద్వారా పాకిస్తాన్‌లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా:) కోవిడ్–19 ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా వీధిన పడిన పిల్లలు ఎందరో. కుటుంబ పెద్ద దిక్కయిన భర్తను కోల్పోయి ఆ భారాన్ని మోస్తున్న మహిళలు మరెందరో. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగు రేఖలు పూయించడం తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది భారతి సిమెంట్ యాజమాన్యం. క్షేత్ర స్థాయిలో ఈ ప్రణాళిక అమలును భుజానికెత్తుకుంది అవేర్ సంస్థ. జిల్లాలో 100 కోవిడ్ బాధిత కుటుంబాల పునరావాసానికి భారతి సిమెంట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద నిధులు అందించింది. దీంతో కడప నగరంలోని పలువురు మహిళలకు బతుకుపై భరోసా ఏర్పడింది. చదవండి👉: మనం ప్రజా సేవకులం జీవనోపాధి ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించగలిగితే తాము నిశ్చింతగా ఉండగలమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెలువరించిన వివరాల మేరకు జిల్లాలో 1,35,061 కోవిడ్ కేసులు నమోదు కాగా, 729 మంది మృతి చెందారు. జిల్లాలో 404 మంది పిల్లలు అనాథలుగా మారినట్లు ఐసీడీఎస్ సర్వే ద్వారా వెల్లడైంది. అనాథ పిల్లలను ఆదుకోవాలంటూ కలెక్టర్ విజయరామరాజు కార్పొరేట్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారతి సిమెంటు ముందుకొచ్చింది. సామాజిక సేవలో అపార అనుభవం ఉన్న అవేర్ స్వచ్ఛంద సంస్థను ఆహ్వానించి వారి ద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. ఆర్థికాభివృద్ధి యూనిట్ల పంపిణీ నగదు పంపిణీ చేయడం వంటి చర్యలు ఫలితం ఇవ్వబోవని, ఆర్థికాభివృద్ధి యూనిట్లు పంపిణీ చేస్తే బాధిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అవేర్ సంస్థ సూచించింది. ఈ కొత్త ప్రయోగానికి భారతి సిమెంటు యాజమాన్యం అంగీకరించింది. పాడి ఎనుములు, కిరాణాస్టోర్లు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సోఫా తయారీ వంటి స్వయం ఉపాధి కల్పించారు. భారతి సిమెంట్ ప్రధాన అధికారి సాయి రమేష్, పీఆర్ఓ మేనేజర్ భార్గవరెడ్డి కలెక్టర్ విజయరామరాజు ద్వారా యూనిట్లను బాధిత కుటుంబాలకు అందించారు. ఇలా వంద కుటుంబాల్లోని 212 మంది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తమకు ఒక దారి చూపి ఆదుకున్న భారతి సిమెంట్, అవేర్ సంస్థలకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. అవేర్ వ్యవస్థాపకులు మాధవన్ ఆదేశాలతో తాము జిల్లాలోని 11 మండలాలకు చెందిన వంద కుటుంబాలకు ఉపాధి యూనిట్లు అందజేశామని అవేర్ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. ఇందులో బేకరీ, జిరాక్స్, ఆటో, గొర్రెల పెంపకం తదితర యూనిట్లు ఉన్నాయని వివరించారు. యూనిట్లను బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరా దొరికింది నా భర్త అమానుల్లాబాషా, బావ అమీర్‌బాషా, అత్త షేక్ మురాద్‌బీ గత సంవత్సరం రంజాన్ నెలలో కోవిడ్‌తో మృతి చెందారు. సొంత ఇల్లు లేదు. చెర్లోపల్లెలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి. భారతి సిమెంట్స్, అవేర్ సంస్థ నాకు కిరాణా షాపు ఏర్పాటు చేయించడంతో కుటుంబం గడుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ఫీజులు చెల్లించలేక పోతున్నాను. దాతలు ఆదుకుని చదువుకు సాయం చేయాలి. – పర్వీన్‌బాను, రాజారెడ్డివీధి, కడప ఆపదలో ఆదుకున్నారు లాడ్జిలో గుమాస్తాగా పనిచేసే నా భర్త ఎం.చంద్రశేఖర్ గత ఏడాది జూన్ 19వ తేదీ బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. సొంత ఇల్లు తప్ప మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కోవిడ్ సోకడంతో వలంటీర్ నా భర్త వేలిముద్రను తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో వైఎస్సార్ బీమా రాలేదు. అప్పుల వారు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్, అవేర్ సంస్థలు చీరల వ్యాపారం యూనిట్ మంజూరు చేసి ఆదుకున్నాయి. దీంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించగలిగితే రుణపడి ఉంటాము. – ఎం.వెంకట సుజిత, పెద్దబెస్తవీధి, కడప -
అఫ్గాన్‌కు తక్షణ మానవతా సాయం
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని భారత్, ఐదు సెంట్రల్ ఆసియా దేశాలు నిర్ణయించాయి. అదేసమయంలో, అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరా దని ఆదివారం న్యూఢిల్లీలోని జరిగిన మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు పేర్కొంది. సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మం త్రులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ సాయం అందజేయడం కొనసాగించాలని తీర్మానించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉం డాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి జై శంకర్ చెప్పారు. -
దీపావళి బొనాంజా.. నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్
చంఢీగడ్: రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు తగ్గటంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రకటించారు. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు(BOCW)లో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండగను పురస్కరించుకొని రూ.3,100 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.17 మంది కార్మికులు అధికారికంగా బీఓసీడబ్ల్యూలో రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలో చేరనుంది. On the eve of Diwali, My Govt. announces financial relief of Rs.3100 each for construction workers registered with BOCW Welfare Board (3.17 lakh workers across the State). A "Shagun" for workers as they have suffered immense losses in the wake of Covid Pandemic. pic.twitter.com/xpnLQRsVDt — Charanjit S Channi (@CHARANJITCHANNI) November 3, 2021 -
ఎంపీ ఎంవీవీ ఉదారత.. పేద విద్యార్థి చదువుకు రూ.2 లక్షల సాయం
సాక్షి, దొండపర్తి(విశాఖ దక్షిణ): పేద విద్యార్థి ఉన్నత చదువు కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ తన గొప్ప మనసును చాటుకున్నారు. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్(ఈసీఈ) ప్రవేశ పరీక్షలో నగరానికి చెందిన జి.శ్రీకాంత్ మెరిట్లో అడ్మిషన్ సాధించాడు. ప్రవేశానికి రూ.3 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంది. జర్నలిస్టుగా ఉన్న తన తండ్రికి అంత స్తోమత లేకపోవడంతో శ్రీకాంత్ యూనివర్సిటీలో చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఎంవీవీ రూ.2 లక్షలు సాయం చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీ వీసీతోపాటు పెరంబదూర్ ఎంపీతో మాట్లాడి ఫీజులో రూ. లక్ష రాయితీ ఇప్పించి శ్రీకాంత్ బీటెక్ చదువుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. -
కరోనాతో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల సాయం
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): కరోనాతో తల్లి చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం పత్రాలను బుధవారం అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన నాగేశ్వరమ్మ ఇటీవల కోవిడ్‌తో మృతిచెందారు. మూడేళ్ల కిందటే నాగేశ్వరమ్మ భర్త రమేష్ గుండెపోటుతో మరణించాడు. దీంతో వీరి ఇద్దరు పిల్లలు సాయిగణేష్, నాగరవళి అనాథలయ్యారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులతో మాట్లాడి చిన్నారులకు ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. కరోనా అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల సాయాన్ని సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. -
కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో తన తీవ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా చికిత్స పొందాల్సిన రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోవడంతో ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు మరియు వైద్య పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కనీసం అందాల్సిన ఆక్సిజన్ సరైన సమయంలో దొరకని పరిస్థితుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత 16ఏళ్ళుగా భారత్ అవలంబిస్తున్న ఒక కీలక విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోవడం తప్ప ఇతర మార్గమేదీ కేంద్రప్రభుత్వం ముందు లేకుండా పోయింది. దీంతో 16 సంవత్సరాల తరువాత విదేశీ సహాయం పొందే విధానంలో భారత్ పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తరువాత విదేశాల నుంచి విరాళాలు, సహాయాన్ని స్వీకరించడం మొదలైంది. అంతేగాక చైనా నుంచి వైద్య పరికరాలు కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశీ సహాయం పొందడంలో రెండు పెద్ద మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగుదేశమైన చైనా నుంచి ఆక్సిజన్ సంబంధ పరికారాలతో పాటు, ఔషదాలను తీసుకోవడంలో ఇప్పుడు భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో సహాయం అందించేందుకు పాకిస్తాన్ సైతం ముందుకొచ్చింది. అయితే పాకిస్తాన్ సహాయానికి సంబంధించినంతవరకు, ఈ విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే మందులను నేరుగా విదేశీ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయగలవని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడే పరిస్థితిలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోందని, శక్తివంతమైన దేశంగా ఆత్మనిర్భర భారత్ ఇమేజ్‌ని ఇతర దేశాలకు తెలియచేసేందుకు 16 ఏళ్ళ క్రితం 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా విదేశీ వనరుల నుంచి గ్రాంట్లు, సహాయం తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుముందు ఉత్తరకాశి భూకంపం(1991), లాతూర్ భూకంపం (1993), గుజరాత్ భూకంపం(2001), బెంగాల్ తుఫాను (2002), బిహార్ వరదలు (2004) సమయంలో భారత్ విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని అంగీకరించింది. అయితే 2004 డిసెంబర్ నెలలో వచ్చిన సునామీ సమయంలో ఈ పరిస్థితిని తామే ఎదుర్కోగలమని నమ్ముతున్నామని, అవసరమైతే సహాయం తీసుకుంటామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ చేసిన ఈ ప్రకటన భారతదేశ విపత్తు సహాయ విధానంలో కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు. ఈ నిర్ణయంతో వచ్చిన విధానాన్ని , ఆ తరువాత వచ్చిన విపత్తుల సమయంలో భారత్ అనుసరించింది. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో సంభవించిన కేదార్నాథ్ విషాదం, 2014లో కశ్మీర్ వరదలు వచ్చినప్పుడు సైతం విదేశీ సహాయాన్ని కోరేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. ఆ తరువాత 2018లో వచ్చిన కేరళ వరదల సమయంలోనూ భారత్ విదేశాల నుంచి ఎటువంటి సహాయాన్ని అంగీకరించలేదు. కేరళ విపత్తుకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు యూఏఈ ముందుకొచ్చిందని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలపగా, కేంద్రప్రభుత్వం విపత్తు ఉపశమనం, పునరావాస అవసరాలను తామే తీర్చుతామని తెలిపింది. కానీ యూఏఈ అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తీసుకొనేందుకు మాత్రం కేంద్రప్రభుత్వం నిరాకరించింది. కానీ కేరళ విపత్తు జరిగిన మూడేళ్ళ అనంతరం దేశంలో పరిస్థితులు కరోనా దెబ్బకి ఒక్కసారిగా మారిపోయాయి. గతేడాది కరోనా సంక్రమణతో మొదలైన ఆర్థిక సవాళ్ళకు తోడు ఈ ఏడాది సెకండ్ వేవ్‌తో వైద్య సవాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ య్యాయి. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పతనమౌతున్న వైద్య వ్యవస్థను అత్యవసరంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 16ఏళ్ళ క్రితం తీసుకున్న కీలక విధానాన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో భయాందోళనలు, దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను మహమ్మారి నుం చి కాపాడేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి దాదాపు 40 దేశాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా, యుకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాం డ్, బెల్జియం, రుమేనియా, లక్జెంబర్గ్, పోర్చుగల్, భూటాన్,సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, నార్వే, ఇటలీ, యూఏఈ దేశాలు భారత్‌కు వైద్య సహాయం పంపుతున్నాయి. విదేశాల నుంచి భారత్‌కు అందనున్న వైద్య సహాయం.. ఆక్సిజన్ – ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.. ►బ్రిటన్ నుంచి వచ్చిన రెండో స్టాక్‌లో 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►అమెరికా నుంచి 1700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1100 సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ►ఫ్రాన్స్ నుంచి 5 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు రానున్నాయి. దీంతో రోజుకి 10వేల మందికి ఆక్సిజన్ అందించవచ్చు. ►ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►రుమేనియా 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 75 ఆక్సిజన్ సిలిండర్లు ►జర్మనీ మూడు నెలల కోసం మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని పంపిస్తోంది. ►పోర్చుగల్ నుండి 20,000 లీటర్ల ఆక్సిజన్ ►సౌదీ అరేబియా నుంచి 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ►యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 6 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు ►హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►థాయ్‌లాండ్ నుంచి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు ►రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వెంటిలేటర్లు – మాస్క్‌లు... ►అమెరికా నుంచి 15 కోట్ల ఎన్95 మాస్క్‌లు ►రష్యా నుంచి 75 వెంటిలేటర్లు ►ఫ్రాన్స్ నుంచి 28 వెంటిలేటర్లు ►ఐర్లాండ్ నుంచి 365 వెంటిలేటర్లు ►స్వీడన్ నుంచి 120 వెంటిలేటర్లు ►లక్జెంబర్గ్ నుంచి 58 వెంటిలేటర్లు ►జర్మనీ నుంచి 120 వెంటిలేటర్లు, 8కోట్ల కెఎన్ 95 మాస్క్‌లు ఆక్సిజన్ జనరేటర్లు.. ►ఫ్రాన్స్ నుంచి 8 ఆక్సిజన్ జనరేటర్లు... ఒక్కొక్కటి 250 పడకల ఆసుపత్రికి 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ►ఐర్లాండ్ నుంచి ఒక ఆక్సిజన్ జనరేటర్ రెమిడెసివిర్‌తో పాటు ఇతర వైద్య సామాగ్రి.. ►అమెరికా నుంచి 10 లక్షల రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్లతో పాటు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ►రష్యా నుంచి 150 బెడ్ సైడ్ మానిటర్లు, మందులు ►పోర్చుగల్ నుంచి 5వేల రెమిడెసివిర్ వయల్స్ ►బెల్జియం నుంచి 9వేల మోతాదుల రెమిడెసివిర్ -
యూపీలో మరో నిర్భయ
బధాయూ(యూపీ): యాభై ఏళ్ల అంగన్వాడీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి, చంపేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బధాయూ జిల్లాలో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 నాటి నిర్భయ హత్యాచార ఘటనను తలపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పూజారి పరారీలో ఉండగా, అతడి ఇద్దరు సహాయకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా తేలిందని, అలాగే బాధితురాలి మర్మాంగాలపై తీవ్ర గాయాలున్నాయని, కాలు, ఛాతీ ఎముక విరిగాయని పోలీసులు వెల్లడించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పూజారి తన సహాయకుల సాయంతో మృతదేహాన్ని బాధితురాలి ఇంటికి తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో ఈ మృతదేహం కనిపించిందని బాధితురాలి కుటుంబ సభ్యులకు వారు వివరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో రేప్ జరిగినట్లుగా తేలిన తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. దోషులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని బరేలీ జోన్ ఏడీజీని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఒక బృందాన్ని ఘటనా స్థలికి పంపించాలని నిర్ణయించింది. ఈ ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంలో జాప్యం చేసిన, తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిన ఉఘయితి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు సీనియర్ ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. ‘ఆదివారం సాయంత్రం దేవాలయానికి ప్రార్థనల కోసం వెళ్లిన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారని గుడి పూజారి (మహంత్), అతడి ఇద్దరు సహాయకులపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశాం. నిందితుల్లో ఇద్దరిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశాం. పూజారి పరారీలో ఉన్నాడు’ అని వివరించారు. నిందితులపై ఐపీసీలోని 376డీ (గ్యాంగ్ రేప్), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మహంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఘటనాస్థలిని బరేలీ ఏడీజీ అవినాశ్ చంద్ర పరిశీలించారు. పరారీలో ఉన్న పూజారి గురించిన సమాచారం ఇచ్చినవారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్య నిపుణుల నుంచి రెండో అభిప్రాయం కోరామని తెలిపారు. ఈ ఘటనను 2012 నాటి నిర్భయ ఘటనతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. దీన్ని గత ఘటనలతో పోల్చడం సరికాదన్నారు. అధిక రక్త స్రావంతో ఆమె చనిపోయారని బుధాన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్పాల్ సింగ్ తెలిపారు. అంగన్వాడీ సహాయకురాలైన బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బుధాన్ కలెక్టర్ కుమార్ ప్రశాంత్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం పూజ చేసేందుకు వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదని, రాత్రి 11 గంటల సమయంలో మహంత్, అతడి ఇద్దరు సహాయకులు తమ ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారని బాధితురాలి కుమారుడు వివరించారు. దేవాలయ ప్రాంగణంలోని బావిలో పడిపోయిందని, బయటకు తీసి ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పి వారు వెంటనే వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులకు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశామన్నారు. ‘మానవత్వానికి సిగ్గుచేటు. ఇంకా ఎంతమంది నిర్భయలు? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లేస్తుంది?’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ‘మహిళల భద్రతపై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. -
పాడిరైతుకు రూ.40కోట్లు
సాక్షి, నారాయణఖేడ్: విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, పాడి రైతులకు బకా యిలు ఉన్న రూ.40 కోట్ల ప్రోత్సాహక నిధులు వారం రోజుల్లో విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వ పంపిణీ ద్వారా పొందిన పశువులు మృతి చెందితే వాటి స్థానంలో జనవరి తొలివారంలో కొత్తవి కొని రైతులకు అందిస్తామని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాడి రైతులు సరఫరా చేసిన పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తోపాటు గేదె పాలకు మరో రూ.2 అదనంగా అందజేస్తామన్నారు. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?) రాష్ట్రం లోని రైతులకు యాసంగి సాగుకు రూ.5వేల చొప్పున రూ.7,250 కోట్ల రైతుబంధు సాయంను వచ్చే సోమవారంలోగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ట్రల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను తెలంగాణలో కలుపుకొమ్మని కోరుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి తీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఖేడ్, ఆందోల్ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు
సాక్షి, తాడిపత్రి రూరల్: రాజకీయ నేపథ్యం లేదు. గ్రామంలో ఇతరులతో ఎలాంటి కక్షలూ లేవు. అయినా కుల పిచ్చి నెత్తికెక్కిన ఉన్మాదులు సాగించిన దాడిలో ఓ దళిత చిరుద్యోగి హతమయ్యాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురాగతంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. బాధిత కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చలించిపోయారు. ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగ కల్పనతో పాటు ఇతర పరిహారాలు అందేలా చేశారు. ఎమ్మెల్యే చొరవపై హర్షం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే... దళితుడి కింద పనిచేయడం ఇష్టం లేక.. తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలోని దళిత వెంకటరమణ, పద్మావతి దంపతులు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా వెంకటరమణ పనిచేసేవారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రావడం.. కొందరికి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఓ దళితుడు చెప్పినట్లుగా తాము నడుచుకోవడమేమిటనే దురహంకారం వారిలో ప్రబలింది. ఫలితంగా 2018, సెప్టెంబర్ 21న పథకం ప్రకారం వెంకటరమణపై దాడి చేసి హతమార్చారు. అదే సమయంలో ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన నాగరంగయ్య సైతం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆదుకోని గత టీడీపీ ప్రభుత్వం వెంకటరమణ హత్యకు గురి కావడంతో పద్మావతి దిక్కులేనిదైంది. ఘటనలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నామమాత్రపు ఆర్థికసాయం అందించి చంద్రబాబు ప్రభుత్వం చేతులేత్తిసింది. బాధిత కుటుంబానికి ఊరట కలిగించేలా పొలం కూడా ఇవ్వలేకపోయింది. ఉద్యోగ కల్పన ఊసే లేకుండాపోయింది. చదవండి: (ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం) అండగా నిలిచిన పెద్దారెడ్డి పద్మావతి పరిస్థితి ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి వచ్చింది. నేరుగా ఎమ్మెల్యేని కలిసిన ఆమె తన దుర్భర స్థితిని ఏకరవు పెట్టింది. స్పందించిన ఎమ్మెల్యే ఆమెకు అండగా నిలిచారు. తాను ఇచ్చిన మాట మేరకు పెద్దవడుగూరు మండల ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషి ఉద్యోగం దక్కేలా చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యేను పుట్లూరు మండలం ఎ.కొండాపురం వద్ద పద్మావతి, మరికొందరు దళిత నాయకులు కలిసి మాట్లాడారు. ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం అందజేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యేకు చూపి కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి..
సంతబొమ్మాళి: పసి వయస్సులోనే బండెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. తోటి వారందరూ ఆడుతూపాడుతూ గడుపుతుంటే విధి వారి పాలిట శాపంగా మారింది. తల్లిదండ్రులు అకాలంగా మృతి చెందడంతో ఈ బాలికల ఆవేదన పలువురిని కలిచి వేసింది. మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన కొంచాడ యుగంధర్‌కు ఉషారాణితో 2007లో వివాహమైంది. వీరికి స్వాతి, పల్లవి అనే కుమార్తెలున్నారు. టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే విధి మరోలా తలచింది. యుగంధర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో భార్య ఉషారాణి సహాయంతో టీ దుకాణాన్ని నడుపుతూ కుటుంబాన్ని కొంత కాలం పోషించుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉషారాణికి (36) గుండెపోటు రావడంతో మృతి చెందింది. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకొనే స్థోమత లేకపోవడంతో యుగంధర్ (41) ఆదివారం మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పెద్దకుమార్తె స్వాతి 9వ తరగతి, చిన్న కుమార్తె పల్లవి 7వ తరగతి నౌపడ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రిలయన్స్ చాట్‌బోట్ సర్వీస్
న్యూఢిల్లీ : భారతీయ స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంది. దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన షేర్ హోల్డర్ల కోసం శనివారం ఏఐ శక్తితో కూడిన చాట్‌బోట్‌ను ప్రారంభించింది. దీనిని జియో ప్లాట్‌ఫామ్ అనుబంధ సంస్థ హాప్టిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్దది. హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బంగ్లా వంటి భాషల్లో లభించనుంది. ఆర్ఐఎల్లో దాదాపు రూ. 53,125 కోట్ల రూపాయల హక్కులు కలిగిన తన షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చాట్‌బోట్ ద్వారా సమాధానాలు ఇవ్వనుంది. ఇకపై షేర్ హోల్డర్స్ చాట్‌బోట్ సేవలను వాట్సప్ ద్వారా పొందవచ్చు. చాట్‌బోట్ సర్వీస్‌ను వినియోగించాలంటే '7977111111' జియో నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపగానే ఆటోమెటిక్‌గా యాక్టివ్ అవుతుంది. వాట్సప్‌లో వినియోగదారులు ఏంచుకునే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమిచ్చేందుకు చాట్‌బోట్ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో షేర్ హోల్డర్ల ప్రశ్నలకు సమాధానాలందించేందుకు రిలయన్స్ బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, కాల్ సెంటర్లకు చాట్‌బాట్ విరివిగా సేవలు అందించనుంది. చాట్‌బోట్ ఎలా వినియోగించాలి.. చెల్లింపు పద్దతులు.. ఫారమ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి.. లీడ్ మేనేజర్స్‌ను హెల్ప్‌లైన్ ద్వారా ఏ విధంగా సంప్రదించాలనే దానిపై రిలయన్స్ డాట్ కామ్‌లో తెలుసుకోవచ్చు. మనుషుల మాదిరిగానే చాట్‌బోట్ 24*7 తన సేవలను అందించనుంది. -
బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
నటి మోనిక సహాయకురాలు బ్లేడుతో కోసుకుని..
పెరంబూరు: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో సినీ నటి సహయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక విరుగంబాక్కంలో దివంగత సినీ దర్శకుడు బాలుమహేంద్ర ఇల్లు ఉంది. ఆయన భార్య, నటి మోనిక నివసిస్తున్నారు. ఆమె వద్ద సిగాలంకారిణిగా జ్యోతిక(22) పనిచేస్తోంది. ఈమె నటి మోనిక కారు డ్రవర్ కార్తీక్‌ని ప్రేమించింది. గత నెలలో కారు డ్రైవర్ అక్కడ పనిమానేశాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పును గమనించిన జ్యోతిక తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ నిరాకరించాడు. మంగళవారం రాత్రి జ్యోతిక బ్లేడుతో చేతిని, మెడను కోసుకుని ఆత్మహత్మాయత్నానికి పాల్పడింది. ఆక్కడ ఉన్నవారు ఆమెను వెంటనే స్థానిక సాలి గ్రామంలోని ఒక ప్రైవేట్ అస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు జ్యోతికకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన విరుగంబాక్కంలో కలకలం రేపింది. -
పాక్‌కు మరో గట్టి షాకిచ్చిన ట్రంప్
న్యూయార్క్ : పాకిస్థాన్ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు మొన్నీమధ్యే ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇంతకాలం వెర్రోళ్లని చేసింది చాలూ... అంటూ స్వయంగా ట్వీట్ చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఇప్పుడు వెనువెంటే అమెరికా.. పాక్‌కి మరో దెబ్బ వేసింది. భద్రతా సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మరో ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం అమెరికా భద్రతా దళ అధికార ప్రతినిధి హెథర్ నౌఎర్ట్ మీడియా ఎదుట ప్రకటన చేశారు. ‘‘ఇకపై పాకిస్థాన్‌కు ఆయుధాల సరఫరా, భద్రతకు సంబంధించి ఇతరత్రా సహకారాన్ని నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో గత కొన్నేళ్లుగా పాక్ పూర్తిగా విఫలమవుతూ వస్తోంది. పైగా అమెరికా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేవారికి పాక్ సాయం అందించటం ఖండించదగ్గ అంశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం ’’ అని ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనపై మరో భద్రతాధికారి వివరణ ఇచ్చారు. 2016కుగానూ పాక్‌కు మంజూరు చేసిన మిలిటరీ ఫండ్‌ను నిలుపుదల చేస్తూ ఇది వరకే ఆదేశాలు జారీకాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై పాక్‌కు ఎలాంటి ఆర్థిక, భద్రతా సహకారాలు అందబోవని ఆయన స్పష్టంచేశారు. అయితే ఈ విషయాన్ని కూడా పాకిస్థాన్ చాలా తేలికగానే తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొనటం విశేషం. ట్రంప్ ట్వీట్ తర్వాత స్పందించిన పాక్ అర్థరహితమైన వ్యాఖ్యలతో తమ దేశ గౌరవానికి భంగం కలిగించారంటూ బదులివ్వటం తెలిసిందే. ఉగ్రవాదంపై పోరులో పాక్ చేసిన త్యాగాలను డబ్బుతో వెలకట్టడం సాధ్యం కాదని.. అమెరికా సహాయ సహకారాలు లేకపోయినా తమ పోరాటం కొనసాగుతుందని స్వయంగా ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ ప్రకటించటం చూశాం. -
టీవీ సౌండ్ తగ్గించలేదని...
తమిళసినిమా: టీవీ సౌండ్‌ను తగ్గించే విషయంలో జరిగిన వాగ్వాదం ఒక సినీ సహాయదర్శకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మరో సహాయ దర్శకుడు అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దిండుగల్ జిల్లా, సిలుక్కువార్‌పట్టికి చెందిన అఖిల్ కన్నన్ చెన్నైలో సినిమా సహాయదర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య శాంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నై, వలసరవాక్కం, కైక్కాన్ కుప్పం ఉవాసీ వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతనితో పాటు కార్తికేయన్ అనే మరో సహాయదర్శకుడు(32) మరో ఆరుగురు అదే ఇంట్లో కలిసి ఉంటున్నారు. గురువారం రాత్రి అఖిల్ కన్నన్ నిద్ర పోతుండగా, కార్తికేయన్ టీవీ చూస్తున్నాడు. టీవీ సౌండ్ ఎక్కువగా ఉండడంతో నిద్రపట్టని అఖిల్ కన్నన్ సౌండ్ తగ్గించమని కార్తికేయన్‌కు చెప్పాడు. అయినా అతను తగ్గించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణపడ్డారు. ఆ సమయంలో కార్తికేయన్ అఖిల్ కన్నన్ను కిందకి నెట్టడంతో అతని తలకు గాయమైంది. దీంతో అఖిల్‌ను కార్తికేయన్ ఇతర మిత్రులతో కలిసి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అఖిల్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి తలకు స్కాన్ తీయాలని చెప్పారు. కార్తికేయన్, మిత్ర బృందం వద్ద అందుకు డబ్బులేకపోవడంలో అఖిల్‌కన్నన్‌ను ఇంటికి తీసుకొచ్చేశారు. శుక్రవారం ఉదయం లేసి చూస్తే అఖిల్‌కన్నన్ శవమై ఉన్నాడు. దీంతో భయపడిపోయిన కార్తికేయన్ వెంటనే స్థానిక కేకే.నగర్ పోలీస్‌స్టేషన్‌లో సరండర్ అయ్యాడు. కేకే.నగర్ పోలీసులు వలసరవాక్కం పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వెళ్లి అఖిల్ కన్నన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపి కేసు విచారణ జరుపుతున్నారు.