athletics championship
-
రేస్ వాక్‌లో ఆర్తికి కాంస్యం
లిమా (పెరూ): ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో భారత అథ్లెట్ ఆర్తి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల ఆర్తి 10,000 మీటర్ల దూరాన్ని 44 నిమిషాల 39.39 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 47ని:21.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జుమా బైమా (చైనా; 43ని:26.60 సెకన్లు) స్వర్ణం, మీలింగ్ చెన్ (చైనా; 44ని:30.67 సెకన్లు) రజతం గెలిచారు. -
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్‌కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్‌గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
భారత్‌కు పతకాల పంట
దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. మహిళల లాంగ్‌జంప్‌లో పావన నాగరాజ్ (6.32 మీటర్లు)... షాట్‌పుట్‌లో అనురాగ్ (19.23 మీటర్లు)... 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రణ్వీర్ (9ని:22.62 సెకన్లు), ఏక్తా డే (10ని:31.92 సెకన్లు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. -
దీపాంశుకు స్వర్ణం
దుబాయ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో దీపాంశు శర్మ పసిడి పతకం సాధించాడు. దీపాంశు జావెలిన్‌ను 70.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.భారత్‌కే చెందిన రోహన్ యాదవ్ 70.03 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ప్రియాంశు రజత పతకం నెగ్గాడు. ప్రియాంశు 3 నిమిషాల 50.85 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ (53.01 మీటర్లు) రజత పతకం గెలిచాడు. -
గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి...
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కోల్పోయాడు. టెహ్రాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్ చేయగా.. గుల్వీర్ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్‌ను కొట్టివేశారు. -
100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్
సాధారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో వంద(100) మీటర్ల స్ప్రింట్ రేసుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ వంద మీటర్ల స్ప్రింట్‌లో ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పరుగుల చిరుతగా పేరు పొందిన ఉసెన్ బోల్ట్ వంద మీటర్ల రేసులో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. వంద మీటర్ల రేసు ప్రపంచ రికార్డు ఇప్పటికి బోల్ట్ పేరిటే పదిలంగా ఉంది. 2009 ఆగస్టు 16న బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ వంద మీటర్ల రేసును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ విభాగంలో బోల్ట్ మూడు ఒలింపిక్స్‌లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ కొట్టి మరెవరికి సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మహిళల విభాగంలోనూ వంద మీటర్ల స్ప్రింట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాంటి వంద మీటర్ల రేసు ప్రాధాన్యతను గంగలో కలిపింది సోమాలియాకు చెందిన అథ్లెట్ నస్రా అబుకర్ అలీ. విషయంలోకి వెళితే.. చైనాలోని చెంగ్డూ వేదికగా 31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా వంద మీటర్ల రేసు నిర్వహించారు. ఈ రేసులో సోమాలియాకు చెందిన అబుకర్ అలీ కూడా పాల్గొంది. అసలు ఆమెను చూస్తే ఏ కోశానా అథ్లెట్‌లా కనిపించలేదు. తన పక్కన ఉన్న సహచర అథ్లెట్లు మంచి ఫిట్‌గా కనిపిస్తుంటే ఆమె మాత్రం ఏ లక్ష్యం లేకుండా నిలబడింది. రేసుకు సిద్ధమైన మిగతా అథ్లెట్లు స్టాన్స్‌కు పొజిషన్ ఇవ్వగా.. అబుకర్ అలీ మాత్రం కనీసం స్టాన్స్ పొజిషన్ తీసుకోవడానికి కూడా బద్దకించింది. ఇక బజర్ రింగ్ మోగగానే తోటి అథ్లెట్లు రేసును తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించగా.. అబుకర్ అలీ మాత్రం మెళ్లిగా పరిగెత్తింది. ఇంకా నయం రేసు మధ్యలోనే వైదొలగకుండా మొత్తాన్ని పూర్తి చేసింది. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన ఆమె వంద మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21 సెకన్లు తీసుకుంది. రేసు పూర్తి అయిన తర్వాత చిన్నపిల్లలా ట్రాక్‌పై జంప్ చేస్తూ వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు దానిని ట్విటర్లో షేర్ చేస్తూ సోమాలియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్‌ను ఏకిపారేశారు. ''ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు కనీస అవగాహన లేని వ్యక్తిని పంపించడం తప్పు.. సరైన ప్రాక్టీస్ లేకుండానే ఆమెను దేశం తరపున బరిలోకి దించడం అవమానం కిందే లెక్క.. మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారు..''అంటూ కామెంట్ చేశారు. The Ministry of Youth and Sports should step down. It's disheartening to witness such an incompetent government. How could they select an untrained girl to represent Somalia in running? It's truly shocking and reflects poorly on our country internationally. pic.twitter.com/vMkBUA5JSL — Elham Garaad ✍︎ (@EGaraad_) August 1, 2023 చదవండి: Ind vs WI 3rd ODI: 18 ఏళ్ల రికార్డు తిరగరాసిన టీమిండియా! ఒక్కొక్కరు ఇలా.. -
పారిస్ ఒలింపిక్స్‌కు అవినాశ్ సాబ్లే అర్హత
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో అర్హత సాధించాడు. పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హీట్స్‌లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచాడు. -
పారుల్, తజిందర్‌లకు స్వర్ణ పతకాలు
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం ఉన్నాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో పారుల్ చౌధరీ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుధా సింగ్ (2013, 2017), లలితా బబర్ (2015) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం నెగ్గిన మూడో భారతీయ అథ్లెట్‌గా పారుల్ నిలిచింది. మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్‌కే చెందిన 19 ఏళ్ల శైలీ సింగ్ రజత పతకం గెలిచింది. శైలీ సింగ్ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల తజిందర్‌పాల్ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. బిలాల్ సాద్ ముబారక్ (ఖతర్), ఘరీబ్ అల్ జిన్కావి (కువైట్) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా తజిందర్‌పాల్ గుర్తింపు పొందాడు. మూడో రోజు పోటీల తర్వాత భారత్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో తొమ్మిది పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది. -
400 మీ. పరుగుపందెంలో చరిత్ర.. 31 ఏళ్ల రికార్డు బద్దలు
ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది. 22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్‌డోర్‌లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. ¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta. 49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova. 49.26 Femke Bol (2023) 49.59 Kratochvilova (1982) 49.68 Nazarova (2004) 49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE — juanma bellón (@juanmacorre) February 19, 2023 -
Asian indoor athletics championships: షాట్‌పుట్‌లో తజీందర్ పాల్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్‌లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్‌కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా -
World U-20 Athletics Championships: భారత్‌కు మరో పతకం
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. -
World U20 Championship: కాంస్యం నెగ్గిన రూపల్ చౌదరీ
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్ (బ్రిటన్; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్ ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్ సభ్యురాలిగా ఉంది. -
భారత రిలే జట్టుకు రజతం
కలి (కొలంబియా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్డ్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్డ్ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్ మినహా భరత్, ప్రియా, కపిల్ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 🇮🇳The Indian U-20 4x400m mixed relay team of Bharath, Priya, Kapil & Rupal make the nation proud💥 They finish with a timing of 3.17.76, a new Asian U-20 record, to win 🥈 at the #U20WorldChampionships #Athletics pic.twitter.com/2890EMphNM — The Bridge (@the_bridge_in) August 2, 2022 That effort by #TeamIndia 🇮🇳🫡 pic.twitter.com/gkOW1y1MZk — Athletics Federation of India (@afiindia) August 3, 2022 -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్‌ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
కాలిఫోర్నియా: మూడు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పురుషుల 5000 మీటర్ల భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్ సాబ్లే తన పేరిట మరో జాతీయ రికార్డును లిఖించుకున్నాడు. అమెరికాలో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో 27 ఏళ్ల అవినాశ్ 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ ఇండియన్ ఆర్మీ అథ్లెట్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 1992లో బర్మింగ్హమ్ వేదికగా భారత అథ్లెట్ బహదూర్ ప్రసాద్ 13 నిమిషాల 29.70 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అవినాశ్ సవరించాడు. అవినాశ్ ఖాతాలో ఇది మూడో జాతీయ రికార్డు కావడం విశేషం. ప్రస్తుతం అవినాశ్ పేరిట 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, హాఫ్ మారథాన్ జాతీయ రికార్డులు ఉన్నాయి. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భాగమైన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో అవినాశ్‌కు పతకం రాకపోయినా జాతీయ రికార్డును తిరగరాశానన్న సంతృప్తి లభించింది. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 15 నుంచి 24 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం దక్కింది. #BreakingNews 🚨 Olympian & #TOPScheme 🏃♂️ #AvinashSable breaks 30-yr old long standing record of Bahadur Prasad (13:29.70/1992) in 5000m, setting a new #nationalrecord with a brilliant performance of 13:25.65 in Sound Running Track meet in San Juan Capistrano 🇺🇸 #Athletics 1/2 pic.twitter.com/vNxWGhi7mT — SAI Media (@Media_SAI) May 7, 2022 -
యర్రాజి జ్యోతికి స్వర్ణం
కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది. నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్‌కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్‌గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు. మహేశ్వరికి కాంస్యం... మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. -
ద్యుతీ చంద్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ అథ్లెట్ ద్యుతీ చంద్‌కు నిరాశ ఎదురైంది. 60 మీటర్ల విభాగంలో ఆమె సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఆరో హీట్‌లో పోటీపడ్డ ఈ ఒడిశా అథ్లెట్ 7.35 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఈ విభాగంలో 46 మంది బరిలోకి దిగగా ద్యుతీ చంద్‌కు 30వ ర్యాంక్ దక్కింది. -
23 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు
పాటియాలా: ఫెడరేషన్ కప్ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్ హీట్‌లోనూ మరో స్టార్ స్ప్రింటర్ హిమదాస్ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది. -
పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు
టోరన్ (పోలాండ్): ఒర్లెన్ కోపెర్నికస్ కప్–2020 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ మీట్లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్ డుప్లాన్‌టిస్ పోల్‌వాల్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల డుప్లాన్‌టిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి... 2014లో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్–6.16 మీటర్లు) నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. -
దివ్యా రెడ్డికి రెండు పతకాలు
ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు, జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సొంతం. కానీ ఒలింపిక్స్‌లో పతకం మాత్రం ఆమెను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈసారి ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ద్యుతీచంద్ సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసులో 11.22 సెక్లనలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతీచంద్ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌కు వన్నె తెచ్చిన ద్యుతీచంద్.. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్ దాదాపు ఐదేళ్లుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న ద్యుతీచంద్ చాలాకాలం తర్వాత తన ప్రాక్టీస్‌ను భువనేశ్వర్‌కు మార్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సింథటిక్ ట్రాక్ ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్‌లో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించారు. గచ్చిబౌలి గట్టిగా మారిపోవడంతో ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. ప్రాక్టీస్ చేసే సమయంలో కాళ్లకు అసౌకర్యంగా మారడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో తన ప్రాక్టీస్‌ను కొన్ని రోజుల పాటు భువనేశ్వర్‌లో కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రతీక్షణం ముఖ్యమేనని భావిస్తున్న ద్యుతీచంద్.. తాత్కాలికంగా తన సొంత రాష్టంలో ప్రాక్టీస్ కొనసాగించనున్నారు. హైదరాబాద్‌లో ప్రాక్టీస్ తర్వాతే ఆమె కెరీర్ ఉన్నత స్థాయికి వెళ్లడంతో ఇక్కడే ప్రాక్టీస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం గచ్చిబౌలి సింథటిక్ ట్రాక్ పేలవంగా మారిపోవడంతో ఇక్కడ ఆమె ప్రాక్టీస్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక్కడ పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ గచ్చిబౌలిలోనే ఆమె తిరిగి ప్రాక్టీస్ చేయనున్నారు. ఎంతోమందికి ద్యుతినే స్ఫూర్తి భారత అథ్లెట్లలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ద్యుతీచంద్ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత్‌లో అథ్లెట్లకు తగినంత ప్రాచుర్యం లభిస్తుందంటే అందుకు ద్యుతీచంద్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తన ప్రాక్టీస్‌ను ద్యుతీచంద్ ఆకస్మికంగా భువనేశ్వర్‌కు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఆమె కోచ్ నాగపురి రమేశ్‌ను ఫోన్లో సంప్రదిస్తే.. ఇక్కడ ప్రాక్టీస్‌కు తాత్కాలికంగా విరామం మాత్రమే ఇచ్చారన్నారు. ట్రాక్ ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రాక్ కారణంగా ఏమైనా గాయాలైతే తేరుకోవడం కష్టమని భావించడంతోనే గచ్చిబౌలిలో ప్రాక్టీస్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారన్నారు. పరిస్థితులు మెరుగైన తర్వాత ద్యుతీచంద్ యథావిధిగా ఇక్కడ ప్రాక్టీస్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ద్యుతీచంద్‌ను చూసి చాలామంది అథ్లెట్లుగా రాణిస్తున్నారన్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి పలువురు అథ్లెటిక్స్ను ఎంచుకోవడానికి ద్యుతీనే ప్రధాన కారణమన్నారు. ఓవరాల్‌గా భారత్‌లో అథ్లెటిక్స్‌కు మరింత గుర్తింపు రావడానికి ద్యుతీచంద్ కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. 40 మంది అథ్లెట్లకు శిక్షణ హైదరాబాద్‌లో ఏర్పాటైన భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్)- గోపీచంద్-మైత్ర ఫౌండేషన్ ఎంతోమంది ప్రతిభావంతులకు అండగా నిలుస్తుందని నాగపూరి రమేశ్ అన్నారు. తెలంగాణ అథ్లెట్లు దీప్తి, శ్రీనివాస్‌లు అంతర్జాతీయ-జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో ఈ ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన యూత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో దీప్తి, శ్రీనివాస్‌లు రెండేసి పతకాలు సాధించిన విషయాన్ని రమేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 200 మీటర్ల పరుగులో దీప్తి కాంస్యం సాధించగా, మెడ్లే రిలేలో రజతం సాధించిందన్నారు. ఇక శ్రీనివాస్ కూడా ఇదే ఈవెంట్లో రజతం, స్వర్ణాలు గెలుచుకున్నారన్నారు. ప్రస్తుతం గోపీచంద్-మైత్ర ఫౌండేషన్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారని తెలంగాణ నుంచి తొలి ద్రోణాచార్య అవార్డు అందుకున్న నాగపూరి రమేశ్ తెలిపారు.