Bank shares
-
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు, జోరును కొనసాగిస్తున్న బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బ్యాంక్,ఆటో,మెటర్ల షేర్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దేశీయ మార్కెట్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మార్కెట్లు ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరిగాయి. దీంతో బుధవారం మార్కెట్ 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 32.99 పాయింట్లతో(0.8%) 54,599.50 ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 20.20 పాయింట్లు (0.12%) పెరిగి 16,300 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది టాటాస్టీల్, ఎన్టీపీసీ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజూకి లాభాల్లో ఉండగా టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, నెస్టల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కార్‌ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పోరేషన్ సబ్స్క్రిప్షన్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి, -
బ్యాంకింగ్ హవా- లాభాల ముగింపు
పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించ దగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు బలపడి 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పుంజుకుని 11,669 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 11,726- 11,557 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో వారాంతాన అమెరికా, యూరోపియన్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలినట్లు తెలియజేశారు. బ్యాంకుల జోరు ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 4.2 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 3.2 శాతం ఎగసింది. అయితే ఐటీ, ఫార్మా 0.9-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ 6.5-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో క్యూ2 ఫలితాల కారణంగా ఆర్ఐఎల్ 9 శాతం పతనమైంది. ఇతర దిగ్గజాలలో దివీస్, ఐషర్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టీసీఎస్, బీపీసీఎల్, యూపీఎల్, ఐవోసీ, విప్రో 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఫైనాన్స్ భళా డెరివేటివ్ కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, హావెల్స్, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, పీఎఫ్సీ, పీవీఆర్, పీఎన్బీ, బంధన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, డీఎల్ఎఫ్ 9- 4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. కోఫోర్జ్, టాటా కెమికల్స్, కేడిలా, ఇన్ఫ్రాటెల్, జీ, అపోలో హాస్పిటల్స్, పేజ్, అరబిందో, పెట్రోనెట్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.7 శాతం క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,563 నష్టపోగా.. 1,099 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 631 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్ షాక్- నష్టాల ముగింపు
కోవిడ్-19 కారణంగా తలెత్తిన పలు సవాళ్లతో బ్యాంకింగ్ రంగం సమస్యలను ఎదుర్కోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తాజాగా అభిప్రాయపడింది. ఈ ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ వాణిజ్య బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 8.5 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఆర్థిక మందగనం, విదేశీ పరిస్థితులు, మారటోరియం తదితర పలు అంశాలు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు విసురుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 194 పాయింట్లు క్షీణించి 37,935 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్ల వెనకడుగుతో 11,132 వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,275-37,769 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ సైతం 11,225- 11,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ఫార్మా, రియల్టీ సైతం ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 4 శాతం పతనంకాగా.. ఫార్మా, రియల్టీ 1.7 శాతం చొప్పున క్షీణించాయి. అయితే ఐటీ 2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్ 6 శాతం పతనంకాగా.. జీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఇండస్ఇండ్, సన్ ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, సిప్లా,, గ్రాసిమ్ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, టీసీఎస్, బీపీసీఎల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కో, బజాజ్ ఆటో 3.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఈక్విటాస్, ఉజ్జీవన్, ఎన్సీసీ, ఆర్ఈసీ, ఇండిగో, జీఎంఆర్, ఐడియా 9-4 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. జిందాల్ స్టీల్, ముత్తూట్ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, నిట్ టెక్, మైండ్‌ట్రీ, అంబుజా సిమెంట్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 5.4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1809 నష్టపోగా.. 869 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 410 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1003 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఫుల్‌మీల్స్ ఖరీదుకే బ్యాంకు షేర్లు!
కోవిడ్ సంక్షోభంతో అన్ని దేశాలతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు సైతం భారీ కరెక్షన్ జోన్లోకి జారాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు ఒకింత ఎక్కువగా పతనమయ్యాయి. చాలా బ్యాంకుల షేర్లు కనిష్ఠాలకు చేరడంతో బ్యాంకు నిఫ్టీ బాగా నష్టపోయింది. ప్రస్తుతం చాలా పీఎస్‌యూ బ్యాంకుల షేర్ల విలువలు పరిశీలిస్తే వాటి ఇష్యూధరల కన్నా చాలా తక్కువకు లభిస్తున్నాయి. మార్కెట్లో ప్రముఖ బ్యాంకుల షేర్లు కొన్ని కలిపితే బయట ఒక మోస్తరు హోటల్లో దొరికే ఫుల్‌మీల్స్ కన్నా తక్కువ కావడం గమనార్హం! ఉదాహరణకు బీఓబీ, పీఎన్బీ, యస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకుల షేర్ల ఉమ్మడి ధర దాదాపు రూ. 150. ఇది ఒక మంచి హోటల్లో ఫుల్‌మీల్స్ ధరకు సమానం. ఈ బ్యాంకులన్నింటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ కలిపితే లక్ష కోట్ల రూపాయల లోపునకు చేరింది. ఇవే కాకుండా, బ్యాంకింగ్‌లో బలమైన షేర్లుగా చెప్పుకునే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల్లాంటి దిగ్గజాల షేర్లు సైతం 2008 సంక్షోభ సమయాలకు చేరాయి. కొంచెంలో కొంచెం కోటక్ బ్యాంక్; ఐసీఐసీఐ బ్యాంకు షేర్లే కాస్త నయమనిపిస్తున్నాయి. ఇక పీఎస్బీ దిగ్గజం ఎస్బీఐ గత ఆర్థిక సంక్షోభ సమయంలో ఉన్న ధర కన్నా దిగువన ట్రేడవుతోంది. నిజానికి గతేడాది చివరకు బ్యాంకింగ్ రంగం కీలకమైన ఎన్పీఏ సమస్య నుంచి బయటపడుతున్నట్లు కనిపించింది. కానీ కోవిడ్ కొట్టిన దెబ్బకు తిరిగి మొండిపద్దులు వెల్లువెత్తుతాయన్న భయాలు బ్యాంకులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం విధించిన మారిటోరియం కారణంగా బ్యాంకుల నిజ పరిస్థితి ఇప్పట్లో బయటపడదని, వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి బ్యాంకుల బాగోతం బయటపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటివరకు ఈ షేర్లపై పెట్టుబడులు పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
బుల్‌చల్!
కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం. ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్ఎస్ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి. పన్ను కోత.. లాభాల మోత... కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది. ► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది. ► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. ► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి. టార్గెట్లు పెరిగాయ్... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి. ఆల్‌టైమ్ హైకి బాటా... స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మిశ్రమంగా మార్కెట్
కొత్త రుణాలపై వడ్డీరేట్లను రెపోరేటు, ఎమ్సీఎల్ఆర్ వంటి ఏదోఒక ప్రామాణిక రేటుతో అనుసంధానించాలన్న ఆర్బీఐ ఆదేశాల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగానికి తగిన తోడ్పాటునందిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. ఆరంభంలోనే 174 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 80 పాయింట్ల నష్టంతో 36,644 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,848 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పుంజుకొని 71.84కు చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 357 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్: ఆర్బీఐ తాజా ఆదేశాల కారణంగా గృహ, వాహన, ఎమ్ఎస్ఎమ్ఈలపై వడ్డీరేట్లు తగ్గుతాయని, దీంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయని ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చౌహాన్ చెప్పారు. హాంగ్‌కాంగ్‌లో అలజడులకు కారణమైన వివాదస్పద బిల్లును అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, వచ్చే నెలలో చర్చలు జరపడానికి అమెరికా–చైనాలు అంగీకరించడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. ఈ జోష్‌తో సెన్సెక్స్ 174 పాయింట్ల మేర లాభపడింది. అయితే వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థ, క్రిసిల్ తగ్గించడం ప్రతికూలత చూపింది, దీంతో ఈ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్183 పాయింట్ల మేర నష్టపోయింది. రోజంతా 357 పాయింటల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్ల స్పీడ్.... అమ్మకాల్లేక అల్లాడుతున్న వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని గడ్కరీ తెలిపారు. పెట్రోల్, డీజీల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. దీంతో కాలుష్యం తగ్గించడానికి గాను ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించగలదన్న అంశంపై స్పష్టత వచ్చింది. దీంతో వాహన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. టాటా మోటార్స్ 8 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్2.8 శాతం, భారత్ ఫోర్జ్2.8 శాతం, మదర్సన్ సుమి సిస్టమ్స్ 2.6%, మారుతీ సుజుకీ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, బజాజ్ ఆటో 1.6%, హీరో మోటొకార్ప్ 1.5%, టీవీఎస్ మోటార్ కంపెనీ 1.4%, అశోక్ లేలాండ్ 1%, ఐషర్ మోటార్స్ 0.7%చొప్పున లాభపడ్డాయి. -
రెండో రోజూ రికార్డు...
స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. నిఫ్టీ 11,700 పాయింట్లపైకి ఎగబాకింది. వాహన, ఐటీ, బ్యాంక్ షేర్ల దన్నుతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు బలపడి 68.74 వద్ద ముగియడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్185 పాయింట్ల లాభంతో 39,057 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 11,713 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైన ముగియడం ఇదే తొలిసారి, ఇక నిఫ్టీ 11,700 పాయింట్లపైకి చేరడం దాదాపు ఏడు నెలల తర్వాత ఇదే ప్రథమం. సెన్సెక్స్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 39,122 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ మొదలై 40 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కొత్త ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు సాధించడం విశేషం. ‘విదేశీ’ పెట్టుబడులతో స్థిరత్వం.... ఆర్బీఐ రేట్ల కోత అంచనాలకు తోడు కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇది మన మార్కెట్‌కు స్థిరత్వాన్ని కల్పిస్తోందని వారంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి పాలసీ నిమిత్తం ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం మంగళవారం ఆరంభమైంది. రెపోరేటును పావు శాతం మేర ఆర్బీఐ తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి. రేట్ల నిర్ణయం రేపు(గురువారం) వెలువడుతుంది. తొలగిన అంతర్జాతీయ వృద్ధి అనిశ్చితి.... అమెరికా, చైనాల్లో తయారీ రంగ గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగిపోయింది. ఫలితంగా సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా, మంగళవారం ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. ఇది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైనా, ఇంట్రాడే, ముగింపులో జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సాధించింది. సెన్సెక్స్ @ 40 సంవత్సరాలు సెన్సెక్స్ మొదలై 40 ఏళ్లు పూర్తయింది. వాస్తవానికి 1986, జనవరి 2న సెన్సెక్స్ మొదలైంది. అయితే సెన్సెక్స్‌కు ఆధార(బేస్) తేదీగా 1979, ఏప్రిల్ 1ని తీసుకోవడంతో సోమవారంతో సెన్సెక్స్‌కు 40 వసంతాలు పూర్తయినట్లు లెక్క. 1979, ఏప్రిల్ 1న వంద పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 40 ఏళ్ల తర్వాత 39,000 పాయింట్లపైకి ఎగబాకింది. డివిడెండ్లను కూడా లెక్కలోకి తీసుకుంటే సెన్సెక్స్ 56,000 పాయింట్లకు చేరినట్లు లెక్క అని బీఎస్ఈ ఎమ్డీ, సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 16 శాతం చక్రగతి వృద్ధిని సాధించింది. మరింత విపులంగా చెప్పాలంటే 1979, ఏప్రిల్ 1న రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే, ఈ 40 ఏళ్లలో దాని విలువ రూ.5.6 కోట్లకు చేరుతుంది. ఇదే కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, పుత్తడి, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు 7–12 శాతం చక్రగతి రాబడులనిచ్చాయి. సెన్సిటివ్ ఇండెక్స్‌లో మొదటి రెండు పదాలు, చివరి పదం కలయికగా సెన్సెక్స్ పదాన్ని మొదటిసారిగా దీపక్ మోహొని అనే స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ వాడారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్‌లో ఆరు షేర్లు అలాగే కొనసాగుతున్నాయి. ఈ షేర్లు– ఐటీసీ, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్. ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు.. సూచీ ఇంట్రాడే క్లోజింగ్ సెన్సెక్స్ 39,122 39,057 సెన్సెక్స్ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు సృష్టించడం గర్వకారణంగా ఉంది. – బీఎస్ఈ సీఈఓ అశీష్ కుమార్ చౌహాన్ -
10,900 పాయింట్ల పైకి నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, షేర్ల వారీ కదలికల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 15 పాయింట్లు పెరిగి 10,905 పాయింట్లకు చేరింది. 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 53 పాయింట్ల లాభంతో 36,374 పాయింట్ల వద్ద ముగిసింది. మరో మూడు వారాల్లో మధ్యంతర బడ్జెట్ రానుండటం, కీలక కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఇటీవల పుంజుకున్న ముడి చమురు ధరలు 1% మేర పతనం కావడం, గత ఐదు రోజులుగా పతనమవుతున్న రూపాయి పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. 297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతులో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 147 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరొక దశలో 150 పాయింట్లవ వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 297 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కొరియా సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో యాక్సిస్ బ్యాంక్ షేర్ లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.679ను తాకిన ఈ షేర్ చివరకు 2 శాతం లాభంతో రూ.676 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► సన్ ఫార్మా షేర్ 5.7% నష్టపోయి రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు చెరో 1 శాతం నష్టపోయాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
బ్యాంక్ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్బ్రెంట్ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి. 198 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లకు నష్టాలు లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ∙వాటెక్ వాబాగ్ షేర్ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్ బ్యాంక్ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. -
9 రోజుల లాభాలకు బ్రేక్
తొమ్మిది రోజుల వరుస లాభాల అనంతరం బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ట్రేడింగ్ చివర్లో బ్యాంక్ షేర్ల నష్టాలు, ఇటీవల బాగా లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ తదితర అంశాల కారణంగా స్టాక్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ ఐటీసీ 3 శాతం లాభపడటంతో నష్టాలు తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో 34,332 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 10,526 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లు బేర్... మొండి బకాయిల నిబంధనలను కఠినతరం చేస్తూ ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను మార్చే ప్రసక్తే లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్. విశ్వనాథన్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 1 శాతం వరకూ నష్టపోయాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు, వర్షాలపై ఆశావహ అంచనాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సెంటిమెంట్ ఆశావహంగా ఉన్నప్పటికీ, తొమ్మిది రోజుల వరుస లాభాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని నిపుణులంటున్నారు. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 197 పాయింట్ల లాభంతో 34,592 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. 125 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 34,270 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. రోజు మొత్తంలో 322 పాయింట్ల రేంజ్లో కదలాడింది. తొమ్మిది రోజుల వరుస లాభాల అనంతరం మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి బలహీనపడటం, ఈల్డ్‌లు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. మిధాని మేజిక్ మిశ్రధాతు నిగమ్ (మిధాని) వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడింది. ఈ ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ ఇటీవలనే స్టాక్ మార్కెట్లో లిస్టైన సంగతి తెలిసిందే. ఇష్యూ ధర, రూ.90తో పోల్చితే 3 శాతం నష్టంతో రూ.87 వద్ద ఈ షేర్ లిస్ట్ అయింది. ఈ ధరతో పోల్చితే ఈ షేర్ 76 శాతం లాభపడి బుధవారం రూ.153 వద్ద ముగిసింది. 2025 కల్లా రక్షణ రంగ వస్తువులు, సేవల విషయంలో 1.7 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమంటూ రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. దీంతో ఈ రక్షణ రంగ కంపెనీ షేర్ జోరుగా పెరుగుతోందని నిపుణులంటున్నారు. -
10,400 దిగువకు నిఫ్టీ
బ్యాంక్ రుణాలకు సంబంధించి మరో రూ.9 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. వాణిజ్య యుద్ధాల భయాలతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 33,686 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 10,360 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడంతో నష్టాలు ఒకింత తగ్గినప్పటికీ, చివర్లో అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా పెరిగాయి. పీఎన్బీలో తాజా రూ.9 కోట్ల స్కామ్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ బ్రాంచ్.. చంద్రి పేపర్స్ అండ్ అల్లైడ్ ప్రోడక్ట్స్‌కు రూ.9 కోట్ల మేర అక్రమంగా రుణాలిచ్చిందంటూ తాజాగా సీబీఐ కేసును నమోదు చేయడంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. భారత్ ఎగుమతి సబ్సిడీ స్కీమ్‌లపై డబ్ల్యూటీఓలో అమెరికా ఫిర్యాదు చేయడం, చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు చర్యలు తీసుకుంటారన్న వార్తలు (ఈ వార్తలను ఆ తర్వాత అమెరికా ఖండించినప్పటికీ)వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా రేకెత్తించాయి. వచ్చే వారమే ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మార్కెట్ పతనం కొనసాగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని సాధించగలదన్న ప్రపంచ బ్యాంక్ అంచనాలు కొంత సానుకూలతను చూపాయని, అయితే వాణిజ్య యుద్ధ భయాలు, రానున్న రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సంశయాలు ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, దేశీయంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగిందని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ కార్తీక్‌రాజ్ లక్ష్మణన్ చెప్పారు. 229 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 31 పాయింట్ల లాభంతో 33,866 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్ షేర్ల పతనం కారణంగా ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. ఒక దశలో 198 పాయింట్ల నష్టంతో 33,637 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 229 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9 పాయింట్లు లాభపడగా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది. ఎమ్ఎమ్టీసీ 20 శాతం అప్... ఈ నెల 19న జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో బోనస్ షేర్ల జారీ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్న ఎమ్ఎమ్టీసీ వెల్లడించడంతో ఎమ్ఎమ్టీసీ 20 శాతం ఎగసింది. యస్ బ్యాంక్ 2 శాతం నష్టపోయి రూ. వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్1.6 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.2 శాతం, ఎస్బీఐ 1.1 శాతం, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 1.3 శాతం వరకూ నష్టపోయాయి. ఫెర్టిలైజర్స్ షేర్ల పరుగు యూరియా సబ్సిడీని 2020 వరకూ కేంద్రం పొడిగించడంతో ఎరువుల షేర్లు కళకళలాడాయి. ఎరువుల సబ్సిడీకి నేరుగా నగదు బదిలీ విధానాన్ని ఆచరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 10 శాతం, నేషనల్ ఫెర్టిలైజర్స్ 5 శాతం, ఆర్సీఎఫ్ 4 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 5.3 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
బ్యాంకు షేర్లు బేర్...!
(సాక్షి, బిజినెస్ విభాగం) రూ.12,700 కోట్ల రుణ కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ ఒక్క నెలలోనే 41 శాతం పతనమైంది. ఒక్కసారిగా అంతా అప్రమత్తం కావటంతో మరిన్ని బ్యాంకుల్లో రుణ కుంభకోణాలు, ఇతర మోసాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు సైతం పాతాళానికి పడిపోతున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌ల కష్టాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్న విశ్లేషకులు ప్రస్తుతం వీటికి దూరంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు. వారి విశ్లేషణల సమాహారమే ఈ కథనం... రూ.2 లక్షల కోట్ల మేర మూలధన నిధులను సమకూరుస్తామని కేంద్రం చేసిన ప్రకటనతో కెరటాల మాదిరి ఎగసిన ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు... ఇపుడు ఏడాది కనిష్టానికి పడిపోతున్నాయి. గత నెలలో అన్ని సూచీల కంటే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అధికంగా... 16.4% నష్టపోయింది. ఇక ఇదే నెలలో నిఫ్టీ 5 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 7.2%చొప్పున నష్టపోయాయి. రెండేళ్ల క్రితం 2016 జనవరిలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 20 శాతం నష్టపోయింది. ఆ నెలలో నిప్టీ 5 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 7.2% చొప్పున నష్టపోయాయి. అసలు కారణం పీఎన్బీ! తాజా పతనానికి పీఎన్బీ రూ.12,700 కోట్ల కుంభకోణమే ప్రధాన కారణం. మొండి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండడం, రుణ వృద్ధి నానాటికీ తగ్గుతుండడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండులా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.12,700 కోట్ల రుణ కుంభకోణం వెలుగులోకి రావడం బ్యాంక్ షేర్ల హవాను మసకబార్చింది. అంతే కాకుండా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంకుల్లో వెలుగు చూసిన మరిన్ని మోసాలు పరిస్థితులను మరింత దిగజార్చాయి. షేర్ల పరంగా చూస్తే.., పలు షేర్లు తాజాగా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. బలహీనంగా.. ప్రభుత్వ బ్యాంక్ షేర్లు ప్రభుత్వ రంగ షేర్ల విషయమై సెంటిమెంట్ ప్రతికూలంగా మారిందని నిపుణులంటున్నారు. అందుకని ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లకు దూరంగా ఉండడమే మంచిదని వారు సూచిస్తున్నారు. వీటికి బదులుగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చని వారు చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో అత్యంత బలహీనంగా ఉన్న షేర్లంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లేనని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్(వెల్త్) జగన్నా«థమ్ తూనుగుంట్ల వ్యాఖ్యానించారు. బ్యాంక్‌లకు సంబంధించి ప్రతికూల వార్తలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయని, దీంతో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్) సెగ్మెంట్లో ఇతర సురక్షిత కంపెనీల వైపు ఇన్వెస్టర్లు తరలిపోతున్నారని వివరించారు. పీఎన్బీ పతనమే అధికం... గత నెల ఆరంభంలో రూ.172 వద్ద ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ నెల రోజుల తర్వాత 41 శాతం పతనమై రూ.101కు పడిపోయింది. ఇది 20 నెలల కనిష్ట స్థాయి. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్(పీసీఏ) ప్లాన్ కింద ఆర్బీఐ ఈ బ్యాంక్‌ను కూడా చేర్చే అవకాశాలు అధికంగా ఉండటంతో రేటింగ్‌ను తగ్గిస్తున్నామని బీఎన్పీ పారిబా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మొత్తం 11 పీఎస్‌బీలు ఇప్పుడు ఈ పీసీఏ పరిధిలో ఉన్నాయి. పీసీఏ పరిధిలో ఉన్న బ్యాంక్‌లు భారీ స్థాయి రుణాలివ్వడానికి వీలుండదు. ఫలితంగా ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని నిపుణులంటున్నారు. మొత్తం దేశం రుణావసరాలను 70 శాతం వరకూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే తీరుస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధి ఏ తీరుగా ప్రభావితమవుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొన్నది. బ్యాంక్ రుణ కుంభకోణాలు,మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం సరైన చర్యలు తీసుకోకుంటే పెద్ద నష్టమే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరునెలల్లో మరిన్ని మొండి బకాయిలు... మరోవైపు ఆర్బీఐ ‘ఒత్తిడి రుణాల’కు సంబంధించిన నియమ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. రుణ పునర్వ్యస్థీకరణ ప్రణాళికలకు సంబంధించిన కొన్ని విధానాలను రద్దు చేసింది. రుణ ఎగవేతలను తక్షణం గుర్తించాలని, సంబంధించిన వివరాలను ప్రతి శుక్రవారం ఆర్బీఐ క్రెడిట్ రిజిస్ట్రీలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రుణ పునర్వ్యస్థీకరణ ప్రణాళికల రద్దు కారణంగా మరో 2.8 లక్షల కోట్ల రుణాలు తాజాగా మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని అంచనా. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల వల్ల రుణ ఎగవేతలను త్వరగానే గుర్తించే వీలు కలుగుతుందని, సకాలంలో సత్వర చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని నిపుణులంటున్నారు. దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సానుకూలమైన చర్యేనని కేర్ రేటింగ్స్ పేర్కొంది. అయితే రానున్న ఆరు నెలల్లో మొండి బకాయిల స్థాయిలు మరింతగా ఎగిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మూలధన నిధులు ఏ మూలకు? ప్రభుత్వం అందించనున్న రూ.2 లక్షల కోట్ల మూలధన నిధులతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల దశ తిరిగిపోతుందని అంతా భావించారు. ఈ ప్రణాళికను వెల్లడించినప్పటి నుంచి బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి కూడా. అయితే తాజాగా వెలుగులోకి వస్తున్న మోసాల వరుస చూస్తుంటే, ఈ మూల ధన నిధులు భవిష్యత్తు వృద్ధికి కాకుండా ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్న మొండి బకాయిలకు, నష్టాలకు కేటాయింపులకు కూడా సరిపోయేటట్టు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు పీఎన్‌బీకు ప్రభుత్వం రూ.5,700 కోట్లు మూలధన నిధులు ఇవ్వనుంది. పీఎన్బీ రుణ కుంభకోణం దీనికి రెట్టింపునకు పైగా రూ.12,700 కోట్ల మేర ఉండటం గమనార్హం. -
బ్యాంక్ షేర్లు బేర్
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో రికార్డ్ స్థాయిలో ముగిసిన స్టాక్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి మూడు వారాల కనిష్టానికి బలహీనపడడం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపేలా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వ్యాఖ్యలు చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇక వీటికి తోడు బాండ్ ఈల్డ్స్ పెరగడంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ముడిచమురు ధరలు ఎగియటంతో పాటు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ప్రధానంగా మిడ్‌క్యాప్ షేర్లు నష్టపోయాయి. ఇండెక్స్‌లు చూస్తే బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 34,771 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 10,700 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఈ ఏడాది భారత ఐటీ సర్వీసులు టర్న్ అరౌండ్ కాగలవని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొనడంతో ఐటీ షేర్లు–విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 5 శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వడ్డీరేట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ అచార్య వ్యాఖ్యానించారు. బ్యాంక్‌లకు ఈ క్యూ3లో రూ.15,000–25,000 కోట్ల రేంజ్లో ట్రెజరీ నష్టాలు రావచ్చన్న అంచనాలు కూడా జత కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి. -
ఆంధ్రాబ్యాంక్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
కొన్ని మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆంధ్రాబ్యాంక్ షేరు 3.5 శాతం ఎగిసి రూ.62.05 వద్ద ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 16.40 లక్షల షేర్లు (6.98 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.51 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 25 పైసల నుంచి 35 పైసలకు పెరిగింది. ఈ యాక్టివిటీ లాంగ్ బిల్డప్‌ను సూచిస్తున్నది. రూ. 60 స్ట్రయిక్ వద్ద భారీ కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది. కాల్ ఆప్షన్ నుంచి 3.10 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 12.40 లక్షల షేర్లకు తగ్గింది. పుట్ ఆప్షన్లో 6.8 లక్షల షేర్లు యాడ్‌కాగా బిల్డప్ 10.90 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 65, రూ. 70 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా వరుసగా 50 వేలు, 7 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద 13.40 లక్షలు, 17.50 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఆంధ్రాబ్యాంక్ షేరు రూ. 60 సమీపంలో మద్దతు పొందుతూ క్రమేపీ రూ. 65 స్థాయిని అధిగమించవచ్చని, రూ. 60 మద్దతును కోల్పోతే మాత్రం క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
లాభాల్లో బ్యాంక్ షేర్లు
► సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ► కలసివచ్చిన షార్ట్ కవరింగ్ ► 122 పాయింట్ల లాభంతో 29,531కు సెన్సెక్స్ ► 43 పాయింట్ల లాభంతో 9,144కు నిఫ్టీ సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. నేడు(గురువారం) మార్చి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో స్టాక్ సూచీలు ఎగిశాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 29,531 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 9,144 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది వారం గరిష్ట స్థాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా షేర్లు నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి లాభాల్లో ప్రపంచ మార్కెట్లు... అమెరికా వినియోగదారుల విశ్వాస గణాంకాలు పటిష్టంగా ఉండడం, ముడి చమురు ధరలు పెరగడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఈ జోష్‌తో బుధవారం ఆసియా మార్కెట్లు(చైనా మినహా) లాభాల్లో ఉండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉండడం, రూపాయి 17 నెలల గరిష్ట స్థాయికి బలపడడం, జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టడం..., ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.6,415 కోట్లు నికర కొనుగోళ్లు జరపడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. వాహన షేర్లు స్కిడ్.. మొండి బకాయిల సమస్య పరిష్కారంపై కసరత్తు చేస్తున్నామని, దీనికి సంబంధించి ఈ వారంలోనే ఆర్థిక మంత్రి, ఆర్బీఐ అధికారులు, బ్యాంక్ అధినేతలతో సమావేశం అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో బ్యాంక్ షేర్ల లాభాల పరుగు బుధవారం కూడా కొనసాగింది. ఎస్బీఐ 2 శాతం లాభపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 శాతం చొప్పున పెరిగాయి. భారత్ స్టేజ్–త్రి వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలను వచ్చేనెల 1 నుంచి సుప్రీం కోర్ట్ నిషేధించడంతో వాహన షేర్లు కుదేలయ్యాయి. హీరో మోటొకార్ప్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ షేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి.30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో, 14 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 1.8 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.2 శాతం, కోల్ ఇండియా 1 శాతం, హెచ్డీఎఫ్సీ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈలో 1,669 షేర్లు నష్టపోగా, 1,182 షేర్లు లాభపడ్డాయి. -
స్వల్ప నష్టాలు
►ఎగ్జిల్ పోల్‌కు ముందు అప్రమత్తత ►49 పాయింట్ల నష్టంతో 29,000కు సెన్సెక్స్ ►17 పాయింట్ల నష్టంతో 8,947కు నిఫ్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ముందు అప్రమత్తత నెలకొనడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టపోయింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 29,000 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 8,947 పాయింట్లకు తగ్గాయి. లోహ, వాహన, ఫార్మా, రియల్టీ, బ్యాంక్ షేర్లు క్షీణించాయి. ఒడిదుడుకుల్లో సూచీలు.... రేపు(గురువారం) ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నందున ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అవకాశాలు బలం పుంజుకోవడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ప్రతికూల ప్రభావం చూపాయి. స్టాక్ సూచీలు రెండేళ్ల గరిష్ట స్థాయిలను తాకడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో లాభాల స్వీకరణ జరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఈ వారంలోనే యూరోప్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానాన్ని వెలువరించనున్నదని, ఈ కారణంగా స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ ఒక దశలో 50 పాయింట్లు లాభపడగా, మరో దశలో 91 పాయింట్లు నష్టపోయింది. చివరకు 49 పాయింట్లు క్షీణించింది. లోహ షేర్లకు నష్టాలు.. గత ఏడాది చైనా జీడీపీ 6.7 శాతంగా ఉంది. ఈ ఏడాది జీడీపీ లక్ష్యాన్ని చైనా 6.5 శాతంగా నిర్దేశించికుందని వార్తలు వచ్చాయి. దీంతో చైనా వృద్ధిపై ఆందోళనతో లోహ షేర్లు నష్టపోయాయి. ప్రపంచంలో లోహాలను అధికంగా చైనాయే వినియోగిస్తుంది కాబట్టి లోహ షేర్లు కుదేలయ్యాయి. హిందాల్కో, హిందుస్తాన్ జికంŠ, సెయిల్, వేదాంత, టాటా స్టీల్ నాల్కో, 2నుంచి 4 శాతం రేంజ్లో పతనమయ్యాయి. -
బ్యాంకు, రియాల్టీలకు ఉర్జిత్ షాక్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ షాకిచ్చింది. కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ, ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953 పాయింట్లకు దిగజారింది.. అయితే డిసెంబర్ 10 నుంచి పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకోనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ షేర్లు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 1శాతం నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం ఆర్బీఐ ప్రకటనకు తన లాభాలను చేజార్చుకోలేదు. ఈ ఇండెక్స్ 0.56 శాతం లాభాల్లోనే నడుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నిఫ్టీ రియాల్టీ(16శాతం), నిఫ్టీ ఆటో(11శాతం), నిఫ్టీ బ్యాంకు(5.5శాతం)లు పడిపోయాయి. కాగ, ఆర్బీఐ నేడు వెలువరించిన పాలసీ సమీక్షలో రెపోను 6.25గా, రివర్స్ రెపోను 5.75గా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లన్నీ దెబ్బకొట్టింది. -
బ్యాంక్ షేర్లే.. మార్కెట్ లీడర్లు!
ప్రధాన సూచీల్ని మించిన బ్యాంక్ ఇండెక్స్ * గడిచిన ఏడాదిలో 18.38% పెరిగిన బ్యాంక్ నిఫ్టీ * బ్యాంకుల్లో రూ.లక్ష కోట్లు దాటిన ఫండ్స్ నిధులు * ప్రధాన ప్రైవేటు బ్యాంక్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు * ఎస్బీఐ కన్నా 80 శాతం ఎక్కువున్న * హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ సాక్షి, బిజినెస్ విభాగం: అన్ని రంగాల షేర్లూ కలగలిసి ఉండే సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారంనాడు 0.4 శాతం వరకూ క్షీణించాయి. కానీ బ్యాంకు షేర్లు మాత్రమే ఉండే బ్యాంక్ నిఫ్టీ... ఏకంగా 1 శాతానికి పైగా పతనమయింది. అంటే బ్యాంకు షేర్లు బాగా పతనమైనట్టేగా? నిజమే!! కానీ అదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే గడిచిన ఏడాదిలో బ్యాంకు షేర్లు బీభత్సంగా పెరిగాయి. అందుకని మిగతా షేర్లు పడ్డపుడు ఇవి మరి కాస్త ఎక్కువ పడే అవకాశాలుంటాయి. గడిచిన రెండేళ్ల నుంచీ చూసినా, ఏడాదిగా చూసినా... ఆరునెలలతో పోల్చినా ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఆయిల్, ఆటో తదితర రంగాల షేర్లకంటే బ్యాంకు అత్యంత వేగంగా పెరిగాయి. ప్రధాన సూచీలతో పోల్చినా బ్యాంక్ నిఫ్టీ అధిక రాబడులిచ్చింది. ఈ కాలంలో బ్యాంక్ ఇండెక్స్ జోరు ఎన్ఎస్ఈ నిఫ్టీతో పోలిస్తే రెట్టింపునకుపైనే వుంది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ రెండేళ్లలో నిఫ్టీ 8.85 శాతం పెరిగితే, బ్యాంక్ నిఫ్టీ 24.50 శాతం ఎగిసింది. 2015 సెప్టెంబర్ నుంచి చూస్తే నిఫ్టీ 12.69 శాతం పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ 18.38 శాతం ర్యాలీ జరిపింది. బ్యాంకులు సమస్యల్లో ఉన్నా... నిజానికి మన దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా ఇన్ఫ్రా తర్వాత బాగా దెబ్బతిన్న రంగమేదైనా వుంటే అది బ్యాంకింగ్ రంగమే. బ్యాంకుల మొండి బకాయిలు రూ.4 లక్షల కోట్లను మించిపోయాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు 10 శాతాన్ని దాటాయి. కనిష్ట ఎన్పీఏలతో మంచి లాభాలు ఆర్జించే ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మొండి బకాయిలు కూడా ఇటీవల 5 శాతాన్ని చేరిపోయాయి. ఇన్ఫ్రా రంగం పట్ల ఇన్వెస్టర్లు మక్కువేమీ చూపించటం లేదు. దానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. కానీ బ్యాంకుల షేర్లను ఎగబడి కొంటున్నారు. దాంతో వీటి విలువలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే తొలుత లాభపడేది బ్యాంకింగ్ రంగమేనని, ఎన్పీఏల పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉండే అవకాశం లేదనేది.. ఈ పెట్టుబడులకు ఫండ్ మేనేజర్లు చెబుతున్న సమాధానం. అన్ని ఫండ్లకూ వీటిపైనే మక్కువ... అటు విదేశీ ఇన్వెస్టర్లుగానీ, ఇటు దేశీయ ఫండ్స్‌గానీ గత కొద్ది నెలలుగా బ్యాంకుల షేర్లలో వారి పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు గతేడాది చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో వారి పెట్టుబడుల్ని తగ్గించుకున్నప్పటికీ, అటుతర్వాత మళ్లీ భారీగా నిధులు తరలించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, కొటక్ బ్యాంకుల్లో అయితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారి గరిష్ట పరిమితుల్ని చేరిపోయాయి. దీంతో వారికిపుడు ఆయా షేర్లను స్పెషల్ విండోల్లో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. స్పెషల్ విండో అంటే ఒక విదేశీ ఇన్వెస్టరు అమ్మితేనే, మరో విదేశీ ఇన్వెస్టరు దానిని కొనొచ్చు. ఇక బ్యాంక్ షేర్లలో దేశీయ ఫండ్స్ పెట్టుబడులు ఈ ఏడాది ఆగస్టు చివరికి రూ.లక్ష కోట్లను మించాయి. జూలై చివరికికి వీటిలో ఫండ్స్ పెట్టుబడులు రూ.82,042 కోట్లు కాగా, ఆగస్టునాటికి రూ.1,05,115 కోట్లకు చేరాయి. అదే సాఫ్ట్వేర్ షేర్లలో రూ.38,749 కోట్లు, ఫార్మా షేర్లలో రూ.38,206 కోట్ల చొప్పున ఫండ్ల పెట్టుబడులున్నాయి. ఫండ్స్ మొత్తం ఆస్తుల్లో ఆగ స్టు చివరినాటికి బ్యాంకింగ్ షేర్ల వాటా 20.90 శాతానికి చేరింది. అగ్రగామి హెచ్డీఎఫ్సీ బ్యాంక్... ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక పెట్టుబడుల్ని ఆకర్షించింది ప్రైవేటు దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకే. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.40 లక్షల కోట్లు. ఫైనాన్షియల్ రంగానికి కేంద్రంగా వున్న యూరప్‌లో ఏ ప్రధాన బ్యాంకుకూ లేనంత మార్కెట్ విలువ ఈ భారతీయ బ్యాంకుకు ఉంది. ఇది 14 వేలకుపైగా బ్రాంచీలున్న ఎస్బీఐ మార్కెట్ విలువకన్నా దాదాపు 80% ఎక్కువ. ఎస్బీఐ మినహా మిగిలిన మన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటి మార్కెట్ విలువా కలిపినా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కన్నా తక్కువే. అతి తక్కువ శాతం ఎన్పీఏలతో ప్రతి త్రైమాసికంలోనూ 20-30% లాభాల్ని స్థిరంగా ఆర్జిస్తున్న ఏకైక బ్యాంక్ కావడంతో ఇన్వెస్టర్లు దీన్ని ఎగబడి కొంటున్నారు. ఇండియాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరును కొనాలంటే విదేశీ ఇన్వెస్టర్లకు స్పెషల్ విండో ద్వారానే సాధ్యమవుతున్నందున, వారు అమెరికా నాస్డాక్లో లిస్టయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్‌ను భారత్‌లో ధరతో పోలిస్తే 23% ప్రీమియంకు కొనేస్తున్నారు. బ్యాంక్ ఇండె క్స్ పరుగుకు కారణం... బ్యాంక్ నిఫ్టీ ప్రధాన సూచీల్ని బాగా అధిగమించడానికి ముఖ్య కారణం కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంకే. 12 బ్యాంకింగ్ షేర్లున్న బ్యాంక్ నిఫ్టీలో ఈ షేరుకు 28% వెయిటేజి వుంది. తర్వాత ఎస్బీఐకి 16%, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 13%, కొటక్ బ్యాంక్‌కు 12%, యాక్సిస్ బ్యాంక్‌కు 11% వెయిటేజీ వున్నాయి. ఈ ఐదు బ్యాంకులూ కలిసి ఇండెక్స్‌ను శాసిస్తున్నాయి. ఇప్పుడు రూ.1312 ధర ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఒక శాతం తగ్గినా, పెరిగినా, దాదాపు 20,000 పాయింట్ల స్థాయిలో వున్న ఈ ఇండెక్స్ 3 శాతం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ షేరు 52 శాతం ర్యాలీ జరపగా, 2015 ఇదే నెల నుంచి 27 శాతం ఎగిసింది. ఈ రెండేళ్లలో ఎన్పీఏ సమస్యలతో ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ, యాక్సిస్‌లు క్షీణించినా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కారణంగా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ సాగించగలిగింది. బ్రోకింగ్ సంస్థల హెచ్చరికలు... అయితే ఇదే సందర్భంలో మూడు ప్రముఖ అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలు భారత్ ఈక్విటీల పట్ల, ప్రత్యేకించి బ్యాంకింగ్ షేర్ల పట్ల హెచ్చరికలు జారీ చేశాయి. మోర్గాన్ స్టాన్లీ తన ఎమర్జింగ్ మార్కెట్స్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోలో ఇండియా వెయిటేజిని 32.5 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ షేర్ల పరుగు ఎక్కువకాలం ఉండబోదని, భారత్ బ్యాంకుల డిపాజిట్, రుణ వృద్ధి మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి పడిపోయిందని పేర్కొంది. మరోవైపు భారత్ షేరు విలువలు బాగా ఖరీదైపోయాయని, వీటిని తగ్గించుకోవాలంటూ ‘అండర్‌వెయిట్’ హెచ్చరికను ఈ వారం ప్రారంభంలో మరో దిగ్గజ బ్రోకింగ్ సంస్థ క్రెడిట్‌సూసీ తన క్లయింట్లకు జారీ చేసింది. -
బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్
♦ మొండి బకాయిల ప్రక్షాళనకు ఆర్బీఐ, ప్రభుత్వం చర్యలు ♦ దీంతో బ్యాంక్ షేర్లవైపు మొగ్గుతున్న ఫండ్ మేనేజర్లు న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ సంస్థలు బ్యాంక్ షేర్లలో జోరుగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల బ్యాంక్ షేర్ల పెట్టుబడులు రికార్డ్ స్థాయికి, రూ.94,000 కోట్లకు పెరిగాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ పేర్కొంది. మొండి బకాయిల ప్రక్షాళనకు ప్రభుత్వం, ఆర్బీఐలు గట్టి ప్రయత్నాలు చేస్తుండటమే దీనికి కారణమని ఈ సంస్థ వ్యవస్థాపకులు సిద్ధాంత్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు అందిస్తుండడం కూడా మరో కారణమని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు కేటాయింపులు పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మొండి బకాయిల సమస్యతోనే బ్యాంక్ షేర్లను ఫండ్స్ తగ్గించుకున్నాయన్నారు. సెబీ గణాంకాల ప్రకారం., మేలో మ్యూచువల్ ఫండ్ ఏయూఎమ్‌ల్లో 20.28 శాతంగా ఉన్న బ్యాంక్ షేర్లు జూన్ నాటికి 20.4 శాతానికి పెరిగాయని జైన్ తెలిపారు. -
తగ్గిన నిఫ్టీ, పెరిగిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 7,912 వద్ద ముగింపు ♦ 36 పాయింట్ల లాభంతో 25,880కు సెన్సెక్స్ బ్యాంక్ షేర్ల లాభాలకు ఐటీ షేర్ల నష్టాలు గండి కొట్టడంతో స్టాక్ మార్కెట్ గురువారం స్వల్పలాభాలతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్ వరుసగా ఆరో రోజూ లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఆరు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 25,880 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 16 వారాల తర్వాత సెన్సెక్స్‌కు ఇది ముగింపులో గరిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఈ ఏడాది గరిష్ట స్థాయి(7,978 పాయింట్లు)ని తాకిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 3 పాయింట్లు క్షీణించి 7,912 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, షేర్లు నష్టపోయాయి. ముడి చమురు ధరలు రికవరీ కావడం, అంతర్జాతీయంగా మార్కెట్లు లాభాల్లో ఉండడం సానుకూల ప్రభావం చూపాయి. ఆరు రోజుల్లో సెన్సెక్స్‌కు 1,206 పాయింట్ల లాభం ఆసియా మార్కెట్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ 25,980 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్ల జోరుతో 26వేల పాయింట్లను దాటింది. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో ఇంట్రాడేలో 27,783 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 36 పాయింట్ల లాభంతో 25,880 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,206 పాయింట్లు లాభపడింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 368 పాయింట్లు లాభపడింది. మొండి బకాయిలకు జరపాల్సిన కేటాయింపులకు సంబంధించి కంపెనీల సంఖ్య(150) నుంచి 20 కంపెనీలను ఆర్బీఐ తొలగించిందన్న వార్తలతో బ్యాంక్ షేర్లు దూసుకుపోయాయి. తొలగించిన కంపెనీల మొండి బకాయిలకు కేటాయింపులు జరపాల్సిన అవసరం లేకపోవడంతో బ్యాంకుల రుణ వ్యయం తగ్గి లాభదాయకతపై ఒత్తడి మరింతగా తగ్గుతుందన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయని విశ్లేషకులుంటున్నారు. విప్రో 7 శాతం డౌన్... నికర లాభం 1.6 శాతం తగ్గడంతో విప్రో షేర్ 7 శాతం క్షీణించి రూ.559 వద్ద ముగిసింది. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 14 లాబాల్లో, 16 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా 2.8 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, టాటా మోటార్స్ 1.8 శాతం, ఓఎన్జీసీ 1.4 శాతం, హెచ్డీఎఫ్సీ 0.9 శాతం, సిప్లా 2 శాతం, మారుతీ 0.7 శాతం, సన్ ఫార్మా 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.4 శాతం చొప్పున పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, భెల్ 2.8 శాతం, హీరో మోటొకార్ప్ 1.7 శాతం, ఐటీసీ 1.6 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.5 శాతం, అదానీ పోర్ట్స్ 1.2 శాతం చొప్పున తగ్గాయి. 1,494 షేర్లు నష్టాల్లో, 1,080 షేర్లు లాభాల్లో ముగిశాయి. -
7,100 దిగువకు నిఫ్టీ లాభాల స్వీకరణతో నష్టాలు
♦ 362 పాయింట్ల నష్టంతో 23,192కు సెన్సెక్స్ ♦ 115 పాయింట్ల నష్టంతో 7,048కు నిఫ్టీ గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఎగసిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు నష్టపోయి 23,192 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 115 పాయింట్లు(1.60 శాతం) నష్టపోయి 7,048 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. 527 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ జనవరిలో ఎగుమతులు 14 శాతం క్షీణించడం,(ఎగుమతులు క్షీణించడం ఇది వరుసగా 14 వ నెల) భారత మౌలిక రంగానికి ఇండియా రేటింగ్స్ సంస్థ నెగిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడం, డాలర్‌తో రూపాయి మారకం 31 పైసలు క్షీణించడం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 23,689 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. 23,692-23,165 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 362 పాయింట్లు(1.54 శాతం) నష్టపోయి 23,192 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద సెన్సెక్స్ 527 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లు బేర్ మార్చి క్వార్టర్లో కూడా మొండి బకాయిలు పెరిగే అవకాశాలున్నాయని, ఫలితంగా లాభాలపై ప్రభావం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎస్బీఐ 7 శాతం క్షీణించి రూ.156 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజే ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.8,422 కోట్లు హరించుకుపోయింది. సోమవారం 22 శాతం ఎగసిన బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం వరకూ క్షీణించింది. పీఎన్‌బీసహా పలు బ్యాంక్ షేర్లు4-7 శాతం రేంజ్లో పడిపోయాయి. -
మళ్లీ నష్టాల్లోకి సెన్సెక్స్
వాహన, బ్యాంక్ షేర్లు బేర్ 208 పాయింట్ల నష్టంతో 25,044కు సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 7,610కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ లాభాలు ఒక్కరోజులోనే ఆవిరయ్యాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) వ్యాఖ్యల కారణంగా వాహన షేర్లు, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యల కారణంగా బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, జీఎస్టీ బిల్లు ఆమోదంపై అనుమాన మేఘాలు తొలగకపోవడం వంటి అంశాలూ ప్రభావం చూపడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 208పాయింట్లు (0.82 శాతం)నష్టపోయి 25,044 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు (0.95 శాతం)నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25వేల పాయింట్ల దిగువకు(24,930), నిఫ్టీ 7,600 పాయింట్ల దిగువకు(7,575 పాయింట్లు) పడిపోయాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ నష్టాల్లోనే ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 594 పాయింట్లు, (2.31 శాతం), నిఫ్టీ 171 పాయింట్లు(2.20 శాతం)చొప్పున తగ్గాయి. వాహన, బ్యాంక్ షేర్లు విలవిల: ప్రభుత్వ విభాగాల వినియోగం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ కార్లను కొనుగోలు చేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేయడం, ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిష్ట్రేషన్లు వద్దని చెప్పడంతో వాహన షేర్లు ముఖ్యంగా డీజిల్ వాహనాల్ని తయారు చేసే కంపెనీల షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు 3 శాతం వరకూ పతనమయ్యాయి. మొండి బకాయిల సమస్యను నివారించడానికి బ్యాంకులు కేటాయింపులను ఎలా వినియోగిసాయోనన్న విషయాన్ని తనిఖీ చేయనున్నామని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించడంతో బ్యాంక్ షేర్లు బాగా పతనమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 3.6 శాతం వరకూ నష్టపోయాయి. ట్రెండ్‌కు విరుద్ధంగా లోహ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 3.41 శాతం, హిందాల్కో 0.7 శాతం, వేదాంత 0.3 శాతం చొప్పున లాభపడ్డాయి. సంపద సృష్టిలో టీసీఎస్ టాప్ గత ఐదేళ్ల కాలంలో (2010-2015) సంపద సృష్టి అధికంగా జరిగిన కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోయిన కంపెనీల్లో ఎంఎంటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. గత ఐదేళ్లలో టీసీఎస్ కంపెనీలో అత్యధికంగా రూ.3,45,800 కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో ఐటీసీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ నిలిచాయి. -
షార్ట్ కవరింగ్‌తో లాభాలు
104 పాయింట్ల లాభంతో 27,563కు సెన్సెక్స్ నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు స్టాక్ మార్కెట్ బుధవారం బ్రేక్ వేసింది. ఇటీవల కాలంలో బాగా పతనమైన షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లు కాస్త లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 27,563 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,375 పాయింట్ల వద్ద ముగిశాయి. భారత్‌లో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలేవీ తీసుకోబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభయమివ్వడం, చైనా సూచీ షాంఘై రికవరీ కావడం సెంటిమెంట్‌కు బలమిచ్చింది. ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగినా... వడ్డీరేట్ల పెంపుకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం బుధవారం అర్థరాత్రి వెలువడే అవకాశాలుండడం, జులై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,655 షేర్లు లాభాల్లో, 1,170 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,348 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,194 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ,3,56,085 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ షేర్లు బేర్ కాగా మొండి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో బ్యాంక్ షేర్లు బేర్‌మంటున్నాయి. ఇప్పటివరకూ దాదాపు పదికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. పలు బ్యాంకుల షేరు ధరలు ఏడాది కనిష్ట స్థాయిని తాకాయి.