Bathukamma Celbrations
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి
-
బతుకమ్మ ఊరేగింపులో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
-
Bathukamma Celebrations: డీజీపీ కార్యాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
పది రోజుల పాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు
-
హాంగ్ కాంగ్లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం, సాయంత్రం, ఎవరింటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్'. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందంగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు. -
Bathukamma: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3న ట్యాంక్‌బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు 25 నుంచి ప్రారంభం కానున్నాయని, బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని తెలిపారు. -
మలేషియాలో బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా ఈ వేడుకలు జరిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. వీరితో ఆపటు ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ కాంతారావు, తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టిలతో పాటు పలువురు తెలంగాణ ప్రముఖులు ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీలతో పాటు ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు . -
Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
బాసరలో ముగిసిన ఉత్సవాలు భైంసా(ముధోల్): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్‌లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం సాక్షి వరంగల్: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లా‹స్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్లోని బిగ్ రాంచ్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్‌లో ఆయుధ పూజ సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు
కాన్సాస్ : కాన్సాస్ తెలుగు సంఘం(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలు పూజారీ శ్రీనివాసా చార్య నిర్వహించిన గౌరీ పూజతో ప్రారంభమయ్యాయి. తెలుగు వారందరూ సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో రావడంతో అమెరికాలో అచ్చమైన తెలుగు పండగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్ లంకలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకల్లో బతుకమ్మ తయారు చేయడం, గోరింటాకు అలంకరణలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేశారు. ఉత్తమ బతుకమ్మలకు పట్టు చీరలను బహుమతిగా అందించారు. తర్వాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికీ కాన్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర ధన్యవాదాలు తెలిపారు. -
సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సిడ్నీ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా.. ఖండాంతరాలకు వ్యాపించాయి. వాడవాడలా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. 'ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్' అధ్వర్యంలో సిడ్నీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని తెలుగువారందరూ వేడుకలలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా సిడ్నీలో తెలంగాణ వాతావరణం అలుముకుంది. ఈ వేడుకల్లో విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆట్సా ప్రెసిడెంట్ రాజ్ బద్దం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
పూల జాతరతో పరవశించిన సిడ్నీ నగరం
సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (ఎస్‌బీడీఎఫ్) మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బతుకమ్మ ఆట పాటతో సిడ్నీ నగరం పూలజాతరతో పరవశిచింది. బతుకమ్మ ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేసి.. వాటిని తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడి ఆడారు. సిడ్నీ బతుకమ్మ చైర్మన్ అనిల్ మునగాల ఈ సందర్భంగా మాట్టాడుతూ.. తెలంగాణ ఎన్నారైలు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా మనససంతా తెలంగాణపైనే ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యంని తెలిపారు. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎస్‌బీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ అన్నారు. ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత ఇనుగుల పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జానపద గాయినీ వాణి వోలోలా తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించింది. తెలంగాణ జానపద గీతాలతో సురేందర్ మిట్టపల్లి అలరించారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరు. సిడ్నీ బతుకమ్మ ప్రధాన కార్యదర్శి అశోక్ మాలిష్ వందన సమర్పణ చేస్తూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలెంటీర్స్, అడ్వయిజరీ బోర్డు, సమన్వయకర్తలు, ప్రదీప్ రెడ్డి సేరి, గోవెర్దన్ రెడ్డి ముద్దం, వినయ్ కుమార్ యమా, ప్రాశాంత్ కుమార్ కడపర్తి, చేసిన కృషి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి గుమ్మడివాలి, కిషొర్ యాదవ్, సునీల్ కల్లూరి, మిథున్ లోక, ప్రదీప్ తెడ్ల, శశి మన్నెం, కిషొర్ రెడ్డి పంతులు, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి ఏలేటి, కిరణ్ అల్లూరి, మరియు ఇతర సంగాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో హోరెత్తించారు. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు భారీగా ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికి, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు సుమారు గత పది సంవత్సరాలుగా విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్ వారు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని, సంబరాలు విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవుల లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, కల్వ నికిత, నంగునూరి సౌజన్య, గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, తోట గంగాధర్, మారుతి, శ్రీధర్ పోచంపల్లి, సాయిరాం మంత్రిలు వ్యవహరించారు. స్పాన్సర్స్ గురు అకాడమీ, ఆర్కా మీడియా, వేలన్ ట్రేడర్స్, ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టింకర్ టోట్స్, ఆర్జిజి స్టోర్స్, చింతకింది రమేశ్, ముదం అశోక్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాథుల నంగునూరి సౌజన్య రమణ, గర్రేపల్లి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, నందగిరి శిల్పా అజయ్ ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఘనంగా ‘తామా’ బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ, దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అమెరిన్డ్ సోలుషన్స్, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సమర్పణలో సెప్టెంబర్ 28న ఈ వేడుకలు జరిగాయి. ఇందులో సుమారు 1700 మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. ప్రపంచమంతా నివసిస్తున్న తెలుగువారు అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగను భాద్రపదమాసములో జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అన్ని ప్రాంతాల తెలుగువారు నిర్వహిస్తున్నారు. ఏడు వరుసల్లో రంగు రంగుల పూలను పేర్చి, పసుపుతో గౌరమ్మను బతుకమ్మపైన పెట్టి రెండు అగరుబత్తులను వెలిగించి.. అన్ని బతుకమ్మలను ఒక ప్రాంగణంలో పెట్టి మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఇండియా నుంచి ప్రముఖ జానపద గాయకులు డా. శ్రీనివాస లింగా హాజరయ్యారు. ఆయన తన పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. లింగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని యాసలతో పాటలు వినిపించడం కార్యక్రమానికే ఒక వన్నె తెచ్చింది. దాదాపు 500 మహిళలు 100 పిల్లలు లింగా పాటలతో రెండు గంటలపాటు బతుకమ్మ ఉత్సాహంగా ఆడి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ బతుకమ్మ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహిరంచిన స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల, గీత వేదుల విజేతలను ప్రకటించారు. గెలచిన విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరు బహుమతులను అందజేశారు. ప్రియా బలుసు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ కోలాటం కర్రలు స్పాన్సర్ చేశారు. బతుకమ్మ ఆటకు ముందు ప్రేక్షకులకు ఒక ప్రశ్నావళి నిర్వహించి.. అందులో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందచేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న శశికళ పెనుమర్తి, నీలిమ గడ్డమణుగు, శాంతి మేడిచెర్ల, శ్రీదేవి దాడితోట, హేమశిల్ప ఉప్పల, శ్రీవల్లి శ్రీధర్, దాస్యం మాధవిలు పెద్దలను, చిన్నారులను ఆకట్టుకున్నారు. బతుక్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల్లో అత్యంత మక్కువతో పనిచేసిన కార్యకర్తలు.. వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ మూట తదితరులను వేడుకల్లో పాల్గొన్న మహిళలు అభినందించారు. ‘తామా’ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అట్లాంటా ప్రజానీకం, స్పాన్సర్స్, ఆడియో లైటింగ్ అందించిన శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సురేష్ ఓలం, స్టేజీ, ఫోటోబూత్లను చక్కగా అలంకరించిన ఉదయ ఈటూరు, మీడియా సహకారం అందించిన టీవీ9 శివకుమార్ రామడుగు, టీవీ5, మనటీవీ ప్రవీణ్ పురం, టీవీ ఆసియా అంజలి చాబ్రియా తదితరులకు ‘తామా’ అధ్యక్షులు వెంకీ గద్దె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
విపంచి.. వినోదం పంచి
-
సియాటిల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సీటెల్: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సియాటిల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంబరాలకు సియాటిల్ నలుమూలల నుంచి 4000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమానికి తెలుగు సినీపరిశ్రమకు చెందిన యాంకర్ అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన గాయని స్వాతి కూడా యూకే నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరిద్దరు తమదైన శైలిలో అక్కడున్న వారితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. బోథెల్ వాలంటీర్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడడుగుల బతుకమ్మ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్మండ్ జట్టు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధోల్ తాషా సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. టాటా సియాటిల్ బృందం ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ వంశీరెడ్డి, బోర్డు డైరెక్టర్లు నవీన్ గోలి, ప్రదీప్ మెట్టు, ఆర్వీపీ గణేష్, మనోహర్, నిక్షిప్త, అజయ్, ఆర్సీ శ్రీకాంత్, శివ అధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన టాటా సియాటిల్ బృందం సభ్యులను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ, కార్యక్రమానికి హాజరైనవారందరూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. టాటా సియాటిల్ బృందం ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలంగాణ అసోసియేషన్స్ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా), తెలుగు అసోసియేషన్ వాట్స్ (వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్) తో కలిసి నిర్వహించింది. -
గవర్నర్ బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ శనివారం నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా గవ ర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, నందివర్ధనం తదితర పూలను సేకరించి, విభిన్న రీతుల్లో అలంకరించే బతుకమ్మ.. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అనుబంధం కలిగిన ప్రజలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, కోరికలు తీరాలని కోరుకునే పండుగ బతుకమ్మ. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’అని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. -
న్యూజెర్సీలో కనుల పండువగా బతుకమ్మ వేడుక
న్యూజెర్సీ: తెలంగాణలో విశేష ప్రజాదరణ పొందిన పూలపండుగ బతుకమ్మ సంబరాలను విదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా న్యూజెర్సీలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఏఐసీసీతో కలిసి బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెర్సిపానీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. రావణ సంహారం అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. ఆటపాటలతో ఆద్యంతం కనులపండువగా బతుకమ్మ పండుగ జరిగిందని నిర్వాహకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీదత్తారెడ్డి, అరుణ్, భానోజీరెడ్డి తెలిపారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్దంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో 600 మంది పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ముందుతరాలవారికి అందించేందుకు పండుగలు తోడ్పతాయని అన్నారు. ఈ వేడుకలు మరచిపోలేని అనుభూతిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు మన సంస్కృతిని తెలియజెప్పుతాయిని పేర్కొన్నారు. -
డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కోపెన్‌హెగెన్: తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా డెన్మార్క్‌లో తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) అధ్వర్యంలో యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి అజిత్ గుప్త దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంబరాలకు ఆడపడుచులు అధిక సంఖ్యలో బతుకమ్మలను తీసుకువచ్చి ఆట పాటలతో, కోలాటాల విన్యాసాలతో ఆనందంగా పాల్గొన్నారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాడ్ అధ్యక్షుడు సామ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బ్రెగ్జిట్ తర్వాత యూరప్‌లో టాడ్ అతిపెద్ద అసోషియేషన్‌గా అవతరించి 4 వసంతాలు పూర్తి చేసుకొని, తెలంగాణ పండగలను పెద్ద ఎత్తున జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేష్వర్ రెడ్డి, రమేష్ పగిల్ల, జయచందర్ రెడ్డి కంది, వాసు నీల, దాము లట్టుపల్లి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కంకుంట్ల, రాజు ముచంతుల, కర్నాకర్, నర్మద దేరెడ్డి, ఉష, ప్రీమియం సభ్యులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. -
సాగర అలల్లో.. పూల పడవల్లో..
-
డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు
-
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. టీపాడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. టీపాడ్ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బోట్ చైర్మన్ శారదా సింగిరెడ్డి, బోట్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రఘువీర్ బండారులు బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.