behaviour
-
దేవుని సేవకు ఇదోమార్గం..
భక్తి ఎక్కువైతే కొందరు ఊహాతీతంగా ప్రవర్తిస్తారు. వరగుణ పాండ్యన్ అనే రాజు ప్రవర్తన ఇందుకు మంచి ఉదాహరణ. తిరవిడై మరుదూర్ అనే ఊళ్లో ఆలయానికి కావలసిన నూనెను తీయడం కోసం ఒక రోజు నువ్వులు ఆరబెట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ శివభక్తుడు వచ్చి ఓ పిడికెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.దేవుడి కోసం ఉపయోగించాలని ఎండబెట్టిన నువ్వుల్ని ఇలా నోట్లో వేసుకోవచ్చా? అది తప్పు కదా? అపచారం కదూ! అక్కడ కాపలా ఉన్నవారు ఇది చూశారు. ‘అయ్యో... అపచారం అపచారం’ అంటూ పరుగున వచ్చి అతనిని పట్టుకుని తీసుకుపోయి రాజు వరగుణ పాండ్యన్ ఎదుట హాజరుపరచారు.వరగుణ పాండ్యన్ అతని వంక తీక్షణంగా చూశాడు. నుదుట బొట్టుతో పరమ శివభక్తునిలా కనిపించిన అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈయన ఇలా చేయడమేమిటీ అని అనుకున్న రాజు నమ్మలేకపోతున్నాడు.‘నువ్విలా చేయడమేమిటీ?’ అని అడిగాడు. దానికి ఆ భక్తుడు ఇలా చెప్పాడు... ‘నేను ఆకలి వల్ల అలా చేశాను. ఈ ఊరు నాకు ఎంతో నచ్చింది. శివాపచారం చేస్తే ఏడు జన్మలకు ఈ ఆలయానికి గానుగ ఆడించే ఎద్దుగా పుడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చేశాను’ అన్నాడు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసేవారు. పుడితే ఈ ఊళ్ళో పుట్టాలి. అదీనూ గానుVýæ ఆడించే ఎద్దుగా. ఆ ఆలయంలో సేవ చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ అవకాశం దక్కుతుందని తెలిసి ఆ భక్తుడు అలా చేశాడు.రాజు వరగుణ పాండ్యన్ భక్తుణ్ణి నోరు తెరవమన్నారు. శివభక్తుడు నోరు తెరిచాడు. అతని నోటిని రాజు చీలుస్తాడని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ రాజు భక్తుని నోటిలో అంటుకుని ఉన్న నువ్వుల్ని తీసి తన నోట్లో వేసుకున్నాడు. ‘మీరు చేసిన అపచారాన్ని నేనూ చేశాను. మీతో కలిసి నేనూ గానుగ ఆడించే ఎద్దుగా పుడతాను’ అన్నాడు రాజు. ఇలా ఉంటుంది అపరిమత భక్తిగలవారి ప్రవర్తన. ప్రవర్తనలోని తప్పొప్పుల కన్నా వారి భావన ప్రధానమని గ్రహించాలి. – యామిజాల జగదీశ్ -
పవన్.. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్‌లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్‌కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్దం అయిపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకు వచ్చి తనను, తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్ధి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! అంటూ ముక్తాయింపు ఇచ్చారు. నిజానికి ఆయన వద్దకు వెళ్లేవారంతా మెజార్టీ సినిమా అభిమానులే. లేదా జనసేన కార్యకర్తలు. నిజంగానే వచ్చినవారు ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని, ఎవరి వద్ద అయినా అభ్యంతరకర వస్తువులు ఉంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చినవారిని బ్లేడ్ బ్యాచ్‌తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమికూడి ఆయనను కలవడానికి ప్రయత్నించారట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్ కల్యాణ్ బసకు వచ్చారట. వెంటనే ఆయనను, అనుచరులను లోనికి పంపించేశారట. అది చూసి ఒళ్లు మండిన ఒక జనసేన కార్యకర్త తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్లి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట. 'నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని ఆయన చేతిమీదో, లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా! అప్పుడు రక్తం వస్తుంది కదా! లేదా బట్టలు చిరుగుతాయి కదా! ఇన్నాళ్లుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్‌కల్యాణ్ చెప్పలేదే!' పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్ళించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది. 'పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరిని కలవాలన్నది తన కోరిక అని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాష' అని చెప్పారు. వచ్చిన జనసైనికులను కలవడానికి ఇష్టం ఉండదు కానీ, ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితో ఫోటో దిగాలని ఉందని అంటే ఎవరు నమ్ముతారు? నిజంగానే అలా ఉంటే ప్రతీ ఊరుకు వెళ్లి అక్కడివారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడుతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి.. అప్పుడు పిఠాపురం అవసరాలు, సమస్యల గురించి తెలుసుకోవలసిన అవసరం లేకుండా పోతుందేమో! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 'టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్‌కల్యాణ్ 2019 ఎన్నికలలో పేకాట క్లబ్‌లు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు అదే వర్మను తనను గెలిపించాలని వేడుకుంటున్నారు'. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు.. పర్వతాలు ఎవరికి తలవంచవు అంటూ డైలాగులు చెప్పిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జనసైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతులలో పెడుతున్నానని ఆయన చెప్పారు. ప్లీజ్.. ఈ ఒక్కసారైనా తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నానని అంటున్నారు. ఎందుకింత బేలతనం! 'ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేతే ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది'! జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ గురించి ఆయన మాట్లాడుతూ గ్లాస్ పగిలితే మరింత పదును తేలుతుందని ఓ పిచ్చి డైలాగు చెప్పారు. పగిలిన గ్లాస్ ఎవరికి ఉపయోగపడదు. జాగ్రత్తగా, ఎవరికీ ప్రమాదం లేకుండా ఆ ముక్కలను బయట పడేస్తారు. పగిలిన గ్లాస్ ముక్కను జనసేన కార్యకర్తలు పట్టుకున్నా, వారికి చేతులు తెగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. ఆ సంగతి కూడా తెలియకుండా సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం. 'పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీచేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు?' సినిమా షూటింగ్‌లు మానుకుని ఇక్కడ ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జనసైనికులు కూడా విశ్వసించరు. తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సంతోషమే. కానీ 'పదేళ్ల జనసేన ప్రస్తానంలో ఎందరు నాయకులు తయారయ్యారు. చివరికి టీడీపీ నుంచి పొందిన ముష్టి 24 సీట్లలో మూడు తగ్గించుకుని, అందులో కూడా ఓ ఆరేడు సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి'. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా?అలా చేశారంటే ఏమిటి దాని అర్దం! జనసేనకు నేతలు లేరనే కదా? ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్ భావిస్తున్నట్లే కదా? జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్‌కు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ సీటును కూడా జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు ఇవ్వబోతున్నారట. టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి టిక్కెట్ ఇచ్చారు. భీమవరంలో టీడీపీ నేత పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి టిక్కెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్‌సభ సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? పదేళ్లలో పట్టుమని పది నియోజకవర్గాలలో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా! ఈ పాటి దానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవ చేస్తున్నారు!. 'షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కానీ, తాను అలా చేయలేదని పవన్‌కల్యాణ్ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా, పవన్‌కల్యాణ్ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న'. 2019లో సుమారు 140 నియోజకవర్గాలలో పోటీచేసిన జనసేన 2024లో పద్దెనిమిది నియోజకవర్గాలలో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలియదా! పవన్‌కల్యాణ్ ఎంతగా భయపడుతున్నారంటే, మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని, దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని పవన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కల్యాణే ఒప్పుకుంటున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్‌లు తిరుగుతున్నాయని ఆయనే చెబుతున్నారు కనుక, ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్‌కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
45 కిలోల భారీ ఆకారంలో.. బుజ్జి కుక్క పిల్ల!
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు. ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు. క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్‌తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
భూకంపాన్ని పసిగట్టిన పక్షులు?.. వీడియో వైరల్!
జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 -
చిన్నపిల్లల లాగులు తడుపుతున్న లోకేష్..
-
ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా?
ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం!. చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు.. సెల్‌ఫోన్‌కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు. సెల్‌ఫోన్ లేకుండా పిల్లలు ఫుడ్ తినాలంటే.. పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు. అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు. తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి- కాంప్లెక్స్ విటమిన్ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ఇవీ మార్గదర్శకాలు.. ప్రీ స్కూల్ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు.. పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5 కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి. పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్ఫోన్లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం. పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి ముందు మీరే మారండి. --ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే ఏం చేయాలి?) -
సూపర్ యాక్టింగ్ బ్రో..
-
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని.. ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్‌ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి.. గత ఏప్రిల్‌లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు.. కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో.. గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ.. ఆ మధ్య అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్‌లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
జనసేనకు డ్యామేజ్.. పవన్ వీరభక్తులు ఏం చేయబోతున్నారు?
తన రాజకీయాలన్నీ చంద్రబాబు కోసమే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ నిర్మాణం జరగకపోయినా పవన్ మీది అభిమానంతో కొనసాగుతున్న కేడర్‌లో తాజా ప్రకటన అసహనం కలిగిస్తోందా? చంద్రబాబుతోనే తన ప్రయాణం అంటున్న పవన్‌కల్యాణ్ వీరభక్తులు ఏం చేయబోతున్నారు? ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ కళ్యాణ్‌కి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా పవన్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే నాయకుడే తమ ఆశలను తుంచేశారని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్సీపీని అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలనే అభిప్రాయాన్ని పవన్ వెల్లడించారు. ఇదే ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ చాలామంది టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీకి నిర్మాణం లేకపోయినా, కార్యకర్తల గురించి పవన్ ఏనాడు పట్టించుకోకపోయినా.. తమకోసం పవన్ కోసం ఏదో సాధిస్తాడని పరితపించారు. చంద్రబాబుతో కలసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకోవడాన్ని చాలామంది జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని విడిచిపెట్టడమే మార్గంగా భావించి బయటకు వెళ్లిపోతున్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, నేతలను టార్గెట్ చేసి మాట్లాడటం, చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం నడుచుకోవడం జరుగుతోంది. ఇద్దరి మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నా, ఎక్కడా బయట పడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ముసుగు రాజకీయాన్ని బట్టబయలు చేసి, చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న బంధాన్ని బాహ్య ప్రవంచానికి తెలియజేయడంతో.. జనసేన పార్టీని చాలా వరకూ డ్యామేజ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య తాజా పరిణామాలు విభేదాలు సృష్టించాయి. పొత్తు కుదిరితే తమ సీటు ఎక్కడ పోతుందో అనే ఆందోళన మొదలైంది. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి ఏర్పడింది. చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? మరో వైపు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే పవన్ అభిమానులు, కార్యకర్తలు పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం జనసేనలో ముసలం పుట్టింది. ఇక్కడ పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేనకు గుడ్‌బై చెబుతున్నారు. మండపేట నుంచి గత మూడు సార్లుగా టీడీపీ నేత వేగుళ్ళ జోగేశ్వరరావు వరుసగా ఎన్నికవుతున్నారు. అందువల్ల టీడీపీజనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ జనసేన పోటీ చేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. ఈ పరిణామాల నేపథ్యంలో తమకిష్టం లేని పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేకపోతున్న అనేక మంది జనసేన కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
పోలీసులపై చంద్రబాబు దురుసు ప్రవర్తన అమానుషం: మల్లాది విష్ణు
-
పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
-
ఎడిటర్ కామెంట్: కర్నూలు పర్యటనలో చంద్రబాబు విపరీత ప్రవర్తన
-
పొలిటికల్ కారిడార్: హెల్త్ డైరెక్టర్ తీరుపై అధికారవర్గాల్లో చర్చ..
-
షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో షాపింగ్స్ మాల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. 2020 నుంచి 8 ప్రధాన పట్టణాల్లో 16 కొత్త మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా వంటి ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఉన్నా కానీ.. కొత్త మాల్స్ రూపంలో 15.5 మిలియన్ చదరపు అడుగులు వాణిజ్య స్థలం గత 30 నెలల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలో 255 మాల్స్, వీటి నుంచి స్థూల లీజు విస్తీర్ణం 77.4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులో ఉంది. 2022 జూన్ నాటికి భారత్‌లో మొత్తం 92.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం, 271 మాల్స్రూపంలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. గ్రేడ్ ఏ మాల్స్‌కు డిమాండ్.. దేశ రాజధాని ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం షాపింగ్ మాల్ విస్తీర్ణం ఏర్పాటై ఉంది. ముంబై 18 శాతం, బెంగళూరు 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. ‘‘రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పరిపక్వత దశకు చేరుకుంది. చిన్న సైజు నుంచి గ్రేడ్ ఏ మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ మాల్స్‌లో95 శాతం లీజు స్థలం నిండి ఉంది. నాణ్యమైన రియల్ ఎస్టేట్‌కు డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. డెవలపర్ల నుంచి నాణ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి అవసరం’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం.. పెట్టుబడులకు, రీట్లకు గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో 39 శాతం విస్తీర్ణం గ్రేడ్ ఏ పరిధిలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. వీటి పరిధిలో స్థూల లీజు విస్తీర్ణం 36 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. టాప్–8 పట్టణాల్లో మొత్తం గ్రేడ్ ఏ మాల్స్ 52 ఉన్నాయి. గ్రేడ్ బీ కేటగిరీలో 94 మాల్స్ ఉండగా, 29.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు అందుబాటులో ఉంది. గ్రేడ్ సీ పరిధిలో 125 మాల్స్ 27.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి. -
14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు నిషేధం
ఇదివరకు పూర్వం గ్రామంలో ఎవరైన దారుణమైన పనులు చేస్తే గ్రామపెద్దలు గ్రామ బహిష్కరణ వంటి శిక్షలు వేసేవారు. అదీకూడా అలాంటి పనులు మరెవరు చేయకూడదని అలాంటి శిక్షలు విధించేవారు. రాను రాను అవి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉండటమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కనుమరుగైపోయాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్ యుగంలో కూడా నగర బహిష్కరణలు ఉన్నాయంటే నమ్ముతారా!. ఔను నిజం ఒక దేశంలోని టీనేజర్ని ఒక నగరం మొత్తం బహిష్కరించింది. ఎందుకు బహిష్కిరించారు ఏం జరిగిందనే కదా. వివరాల్లోకెళ్తే....యూకే చెందిన 14 ఏళ్ల కీలాన్ ఎవాన్స్ని ఒక పట్టణం మొత్తం బహిష్కరించింది. కీలాన్ యూకేలోని వెస్ట్ మెర్సియా అనే పట్టణంలో నివశిస్తున్నాడు. ఐతే అతను ఆ పట్టణంలోని వ్యాపారులను, స్థానికులను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆన్లైన్లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు. అంతేకాదు యూకేలోని కోర్టు అతని క్రిమినల్ బిహేవియర్ కారణంగా అతను పట్టణంలో ఉండకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అతను 2025 వరకు కూడా పట్టణంలోకి ప్రవేశించకూడదని చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సముహంలో కూడా ఉండకూడదని కూడా పేర్కొంది. ఎప్పుడైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఎదుర్కొవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షలు అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకుండ ఉండేందుకేనని కోర్టు స్పష్టం చేసింది. ఐతే యూకేలో యువకులపై ఇలాంటి శిక్షలు చాలా అసాధారణం. కానీ కీలాన్ దారుణమైన ప్రవర్తన కారణంగానే యూకే ఇలాంటి శిక్షలు విధించింది. (చదవండి: రైల్వే ఫ్లాట్ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్) -
తీరు మార్చుకోని టీడీపీ సభ్యులు
-
తప్పతాగి కానిస్టేబుళ్ల చిందులు.. సెల్ఫోన్లో వీడియోలు
సాక్షి, ఖమ్మం: విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను, హోంగార్డును ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు హద్దులు దాటి ప్రవర్తించారు. (చదవండి: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..) అమ్మపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు నలుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డు బయలుదేరారు. దారిలో ఓ బెల్ట్ షాపులో ఆగారు. పుల్గా మద్యం సేవించి అక్కడ నానా హంగామా చేశారు. తాము కానిస్టేబుళ్లమన్న విషయాన్నే మరిచిపోయి చిందులు వేశారు. చివరకు వీరి చిందులు వేస్తున్న దృశ్యాలను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించడంతో వీరి బండారం బయటపడింది. ఆ వీడియో వాట్సాప్ ద్వారా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ వద్దకు వచ్చింది. విధి నిర్వహణలో ఉండి మద్యం సేవించడంపై నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పు చేస్తే ఏంతటి వారినైన ఊరుకునేది లేదని హెచ్చరించారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి.. -
కన్నవారికే ‘ప్రాణ భయం’ ..
సాక్షి, నాగోలు(హైదరాబాద్): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతే కాకుండా వేధింపులకు గుర్తి చేస్తున్న తన కుమారుడిపై తల్లి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మాన్సూరాబాద్ శ్రీరాంనగర్‌కాలనీ చెందిన కౌసల్యదేవి, లింగయ్య భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురి వివాహం జరిగింది. పెద్ద కుమారుడు భార్యాపిల్లలతో మరో ప్రాంతంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులతో ఉంటూ ఆస్తి కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రెండేళ్లుగా తమను చీకటి గదిలో బంధించి సరిగా తిండి పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. చిన్న కుమారుడు రాజశేఖర్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎల్బీనగర్ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మాటల్లో దించి.. మాయచేసి.. -
వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?
Work From Home: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సమకాలిన అంశాలపై స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం ఉండాలా? వద్దా ? దాని వల్ల ఉపయోగాలు నష్టాలపై ఆయన వరుసగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. అవన్ని నవ్వులు పూయించడంతో పాటు చర్చకు సైతం దారి తీస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం తొలగించి, తన భర్తను ఆఫీసుకు రమ్మనకపోతే తమ దాంపత్య బంధానికి వీడాకులు తప్పవంటూ ఇటీవల ఓ గృహిణి చేసిన రిక్వెస్ట్‌ని షేర్ చేసిన హర్ష్ గోయెంకా... తాజాగా మరో వీడియోను వదిలారు. నెలల తరబడి వర్క్‌ఫ్రం హోంకి అలవాటైన ఉద్యోగులు.. ఆఫీసులకు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశంపై ఫన్నీగా చిత్రీకరించిన వీడియోను షేర్ చేశారు. ఆఫీసులో ఉద్యోగులు ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పటికీ... వారంతా ఇంటి నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. Scene at workplace after over a year of zoom/teams meetings 😀😀😀! pic.twitter.com/sCCVpMurma — Harsh Goenka (@hvgoenka) September 13, 2021 హర్స్ గోయెంకా ట్వీట్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా ఉన్నప్పటికీ వాస్తవం అదేనంటూ రీ ట్వీట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. చదవండి : Viral Video: ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ! -
కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): తమను కులం నుంచి వెలివేశారని, న్యాయం చేయాలని ఠాణా మెట్లెక్కిన ఓ మహిళకు సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సై లింగారెడ్డి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫిర్యాదు స్వీకరించకపోగా నానా బూతులు తిట్టి కుల పెద్దల వద్దే తేల్చుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారని సదరు మహిళ పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బోయవాల్మీకి కులానికి చెందిన ముస్తే సునీత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. అప్పటినుంచి ఆ కులంలోని ఎవ్వరి ఇళ్లలో శుభకార్యాలు జరిగినా వీరిని పిలవడం లేదు. తమ తప్పులేదని మొత్తుకున్నా కులపెద్దలు వినడం లేదు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు శనివారం సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన గోడును రెండో ఎస్సై లింగారెడ్డితో చెప్పుకుంటుండగా ఒక్కసారిగా దుర్భాషలాడారని ఆరోపించింది. ఆయన తిట్టిన బూతులకు మనస్తాపం చెందిన ఆమె పోలీస్‌స్టేషన్ ఎదుటే బైఠాయించింది. ఎస్సై ఉపేందర్‌రావు బాధితురాలితోపాటు రెండో ఎస్సైని పిలిచి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కుల పెద్దల నుంచి తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై లింగారెడ్డి స్పందిస్తూ.. తాను కించపరిచేలా మాట్లాడలేదని పేర్కొన్నారు. చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..? -
అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు!
సాక్షి, అడ్డగూడూరు(నల్లగొండ): సాకే ఇష్టం లేక కుటుంబీకులో, లేక మరేదైనా కారణంతో గానీ.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని చాపలో చుట్టి పడేసి వెళ్లారు. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండల పరిధిలో కంచనపల్లి గ్రామం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. కంచన్లపల్లి స్టేజి వద్ద వృద్ధుడు చాపలో చుట్టబడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి పక్షవాతం వచ్చినట్లు గుర్తించి 108 అంబులెన్స్‌లో మోత్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి వివరాలు ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
మధుర భాషణం.. నిజమైన భూషణం
మాటే మంత్రము.. అవును.. మాట మంత్రమే కాదు.. మనకు, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే, కార్యసాధనకు ఉపకరించే అద్భుతమైన తంత్రం కూడా..!! పక్షులు కిలకిలా రావాలే చేయగలవు. కొన్ని జంతువులు భయంకరంగా గర్జించగలవు, కొన్ని జంతువులు జలదరించే తీరులో ఘీంకరించగలవు, కొన్ని జంతువులు కేవలం మొరగడం మాత్రమే చేయగలవు తప్ప మాట్లాడలేవు. ఏ జీవరాశికీ లేని వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే ఉంది. వాక్కు అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. అరుదుగా లభించినవాక్కు అనే వరాన్ని వివేచనతో, విచక్షణతో ఉపయోగిస్తూ, సందర్భోచితంగా సంభాషిస్తూ మన్నన పొందడం విజ్ఞత కలిగిన మానవుని లక్షణం. కిరీటాలు, భుజకీర్తులు, సువర్ణహారాలు, పరిమళభరిత ద్రవ్యాలతో చేసే స్నానం, చందన సుగంధ ద్రవ్యాలు శరీరానికి అద్దుకోవడం, సువాసనాభరితమైన పుష్పహారాలు ధరించడం లేదా చిత్ర విచిత్ర రీతుల్లో కురులను దువ్వుకోవడం అనేవి మానవునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. ఉత్తమ సంస్కారం చేత అలవడిన మధురమైన వాక్కు ఒక్కటే అద్వితీయమైన అలంకారమై ప్రకాశిస్తుంది. ఒక మనిషిని సంఘంలో గౌరవించే విధానికి చాలావరకు మాటతీరు లేదా వాక్చాతురి కారణమౌతుంది. మృదువుగా సంభాషించే సౌజన్యశీలితో మాట్లాడడానికి సంఘంలో ఎవరైనా ఇష్టపడతారు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎదుటివారిపై హుంకరిస్తున్న విధాన మాట్లాడితే, ఆ వ్యక్తి చెంత ఎవరూ చేరరు కదా..!! ‘‘మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది’’ అన్నది చిరకాలంగా మనకు తెలిసిన ఆర్యోక్తే కదా.. హితకరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చాతుర్యం అన్ని సమయాల్లోనూ కార్యసాధకమై రాణిస్తుంది. మృదుభాషణం కలిగినవారు తమ మాటలతో ఎదుటివారిని నొప్పించకుండానే తమకు కావలసింది సాధించుకుంటారని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. అయితే, మాటతీరు అన్నివేళలా మృదువుగా ఉంటే సరిపోదు. సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి అవతలివారితో మనం సంభాషించే విధానంలో కొంత గట్టిగానూ మాట్లాడవలసి రావచ్చు. వాగ్గేయ శిరోమణి త్యాగరాజు చెప్పినట్లు ‘సమయానికి తగు మాటలాడి’ అన్నచందాన సంభాషించి, ఎదుటివారిని మెప్పించగలగాలి. అయితే, సంభాషణా వైఖరి వారిని గాయపరిచేది గానూ, నొచ్చుకునేదిగానూ ఉండ కూడదు. విషయం వారికి అర్థమై, మన మనోగతాన్ని వారు గుర్తెరగాలి. ఏది ఏమైనా తూటాలవంటి మాటలకంటే, తేనెలు నిండిన తేటలతో మాట్లాడే మాటలే మన గెలుపును శాసిస్తాయి. అందరితో మిత్రత్వాన్ని సాధిస్తాయి. మనిషి మాటతీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. నోటినుంచి వచ్చే మాట ద్వారానే మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటలతో మనం సాధించ వలసిన కార్యాన్ని కూడా సులువుగా సాధించవచ్చు. మృదుభాషి, మితభాషి అందరికీ అనాదిగా అలవాటున్న పదాలే! మృదుభాషి అంటే మృదువుగా మాట్లాడేవాడనీ, మితభాషి అంటే అవసరమైతేనేగానీ నోరు విప్పడనీ అందరికీ అవగతమే. అయితే, చిరకాలంగా, ఎంతోమందిని గొప్పవారిగా, సంస్కారవంతులుగా నిలబెట్టిన అరుదైన సంభాషణా లక్షణం మరొకటి ఉంది. వాళ్ళంతా పూర్వభాషిగా భాసించడమే వారికున్న ప్రత్యేక గుణం. పూర్వభాషి అంటే, తానే ఎదుటివారితో చొరవ తీసుకుని ఆహ్లాదకరమైన తీరులో భాషించడం. ఎదుటివ్యక్తి తనకు అంతగా తెలియకపోయినా, ఎంతో చక్కటి వాక్కులతో అతన్ని ముందుగా మర్యాదగా పలకరించి, తరువాత అతనితో విషయాన్ని మృదువుగా వివరించడమే పూర్వభాషి లక్షణం. ఈ రకమైన మాటతీరు ఉన్నవారు అత్యంత ప్రతిభా వంతులుగా తమను తాము నిరూపించు కున్నట్లు చరిత్ర తెలియజేస్తోంది. ఆనాటి శ్రీరాముని నుంచి నేటి తరంలో విజయవంతమైన నాయకుల్లో అధిక శాతం పూర్వభాషులే. ఎటువంటి భేషజాన్నీ తనతో మాట్లాడేవారితో ప్రదర్శించని వ్యక్తిగా పూర్వభాషి గుర్తించబడతాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతి పదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకో లేమన్నది సత్యమైన విషయమే కదా..!! మాట్లాడే విధాన్ని బట్టి అది ఎదుటివారి మానసాన్ని గెలిచే విజయ సూచికగా పనిచేయగలదు. ఎందుకంటే మాట అనేది మనసుని తాకుతుంది. అది సుతారంగా, ఎదుటివారిని గౌరవించేలా ఉండాలి గానీ, వారి మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదు. మాటే మనిషికి అనుకోకుండా ఎదురైన కష్టాన్నీ పోగొడుతుంది. ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం అడుగవలసి వచ్చినప్పుడు, వారితో లలితమైన రీతిలో సంభాషిస్తే, తోచినంత సహాయాన్నీ, తోడ్పాటును అవతలి వ్యక్తి మనకు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా, మాటే మనిషికి కష్టాన్నికూడా తీసుకురావచ్చు. అహంకారంతో కూడిన సంభాషణా శైలి ఎప్పుడైనా సరే మనకు కష్టాలనూ తెచ్చిపెడుతుంది, మనకు శత్రువులనూ పెంచుతుంది. గొడ్డలితో నరకబడ్డ వృక్షమైనా మళ్ళీ చిగురిస్తుంది, కానీ, మాటలచేత మనసు ముక్కలైతే, మళ్ళీ పూర్వస్థాయిలో అనుబంధం పెరగదనేది ఋజువైన విషయమే కదా.. మనం మాట్లాడే మాట కోమలంగా ఉంటే ఎదుటివారి ఎదను పువ్వులా తాకుతుందని, అదే కటువుగా ఉంటే, కత్తిమొనలా వారిని గాయపరచి, వారితో ఉన్న స్నేహాన్నీ, సాన్నిహిత్యాన్నీ కూడా దూరం చేస్తుందన్న గౌతమ బుద్ధుని వాక్కులు అక్షర సత్యం. పదునైన ఈటెల పోటు కన్నా, కరుకైన మాటల పోటు ఎదుటివారి హృదయాలకు లోతైన గాయాన్ని చేస్తుంది. భారతదేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించిన ఘనులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో ప్రతిభాశాలిగా ఎన్నో విజయాలను సాధించడంలో ఆయన సంభాషణాశైలి ఉపకరించిందని సన్నిహితులు చెబుతారు. అమెరికా అధ్యక్షుల్లోనే అగ్రగణ్యునిగా వినుతికెక్కి, అప్రతిహత విజయాలను సాధించిన అబ్రహం లింకన్ కూడా మృదుభాషేనన్న విషయం గమనార్హం. మనిషి ఉత్థాన పతనాలను వారు మాట్లాడే మాటలే శాసిస్తాయి. ఉత్తమరీతిలో జీవన ప్రస్థానం సాగడానికి మంచి ఉపకరణంగా భాసిస్తాయి. నాలుకపై మాట్లాడే ప్రియమైన మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని మెచ్చుకునేలా చేస్తాయి. మనిషికి నలుగురిలో గౌరవాన్ని సంతరించేది సమయోచిత భాషణం..!! అదే, అందరినీ సన్నిహితులను చేసి, అలరించే విలువైన భూషణం..!! – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతిపదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకోలేమన్నది సత్యమైన విషయమే కదా..!! -
ఎన్నికల బరిలో ‘దేశం’ చీటర్స్
తెలుగుదేశం పార్టీ నేతలు సచ్ఛీలురని, తాను నిప్పు, నిజాయతీ పరుడనని చంద్రబాబు చెబుతుంటాడు. కానీ ఆయన తన పార్టీ తరఫున జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల బరిలో అవినీతి పరులు, మోసగాళ్లు, రౌడీయిజం చెలాయించే వాళ్లకే టికెట్లు ఇచ్చి నిలబెట్టారు. వీరిలో ప్రైవేట్ వ్యక్తుల భూముల కబ్జాలు, వెంచర్ల పేరుతో రూ.కోట్లు కాజేసి చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదైన ఒక అభ్యర్థి ఉండగా, ఇంకో అభ్యర్థిపై అవినీతి, అక్రమాలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మరో అభ్యర్థి అయితే రౌడీయిజం చెలాయిస్తూ వివాదాస్పదుడిగా చరిత్రకెక్కారు. మచ్చలేని, అవినీతి లేని నేతలకే టికెట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసభలో ఊదరగొడుతున్నాడు. మరి ఈ నేతలకు టికెట్లు ఇవ్వడంపై ఆయన ఎంతటి నిప్పో అర్థమవుతోంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి నేరచరితులు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రధానంగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపైనే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అధికార పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. అందరూ ఈ ఐదేళ్లు అనేక పథకాలు, పనుల పేరుతో కమీషన్లగా వందల రూ.కోట్లు దోచుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు చేసిన పనులు చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రలోభాలు, తాయిలాలపైనే అధారపడి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులపైకేసులు నమోదైనట్లు వారే ఆఫిడవిట్లో పేర్కొన్నారు. మరి కొంత మందిపై కేసుల నమోదు కాకపోయినా వివాదాస్పద వైఖరి, అడ్డగోలు వ్యవహరాలు మాత్రం లెక్కకు మించి ఉన్నాయి. జిల్లాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి మళ్లీ టికెట్లు దక్కించుకున్న ఉదయగిరి, కోవూరు టీడీపీ అభ్యర్థులు బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై కేసులు లేనప్పటికి తరచూ వివాదాస్పద వైఖరి, కాంట్రాక్టర్లను బెదిరింపుల్లో నిత్యం హల్చల్ చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన అనేక మంది నేతలు వివాదాలు, భూదందాలతో నిన్నటి వరకు హడావుడి చేసిన వారే. అయితే అధికారం చేతిలో ఉండటంతో ఎన్ని అరాచకాలు చేసిన ఎక్కడా కేసులు నమోదు కాని పరిస్థితి. జిల్లాలో సీఎం చంద్రబాబు మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈక్రమంలో అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వ్యవహార శైలిపైన చర్చ సాగుతోంది. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడుల్లా పదేపదే మచ్చలేని పాలన అందించే నేతలు అంటూ కొనియాడుతుంటారు కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రియల్ కేసుల్లో పోలంరెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థానికంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధి హోదాలో కాంట్రాక్ట్ వర్కులు నిర్వహిస్తూ అందినంత మేరకు గడిచిన ఐదేళ్లలో భారీగా దండుకున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కేసులకు సంబంధించి వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఘట్కేసర్ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పోలంరెడ్డిపై తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ, హబ్సిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నంబర్ 287/13 నమోదైంది. ఈ కేసు పోలంరెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీకి, కొనుగోలుదారులకు మధ్య ఉంది. నాంపల్లి అడిషనల్ చీఫ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్–463/14గా కేసు జరుగుతోంవది. సెక్షన్ 406, 420 కింద కేసులు ఉన్నాయి. కేసు నంబర్ 40/2015తో ఘట్కేసర్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీసీ నంబర్ 396/16 ఎల్బీ నగర్ కోర్టులో సెక్షన్ 465 ,418, 420, 423, 663, 468 కింద కేసులు నమోదయ్యాయి. కేసు నంబర్ 457/2017తో ఘట్కేసర్లో నమోదైందని కేసు సీసీ నంబర్ 4075/18 కింద ఎల్బీ నగర్ కోర్టులో నడుస్తోంది. సెక్షన్ 120(బీ), 406, 464, 506, రెడ్‌విత్ 420 కింద నమోదైంది. బడా కాంట్రాక్టర్‌గా చీటింగ్ కేసుల్లో బొల్లినేని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చీటింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏసీబీ కేసు కూడా ఉండటం గమనార్హం. స్థానికంగా నేతలకు అందుబాటులో ఉండకపోవటంతో పాటు ఫైబర్ చెక్‌డ్యాంల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పసుపు కుంభకోణంలోనూ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీ నేతలపైనే కేసులు నమోదయ్యాయి తరచూ స్థానికంగా వివాదాస్పద వైఖరితోనే బొల్లినేని రాజకీయం చేస్తుంటారు. ప్రధానంగా రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. బొల్లినిని రామారావు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు. ఇతనిపై ఎఫ్ఐఆర్ నంబర్ 0495/2017న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్ పూర్ స్టేషన్లో సెక్షన్ ఐపీసీ 420, 406, 467, 468, 569, 471, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. నగదు చెల్లింపు వ్యవహారంలో కేసు నమోదు. లలిత్పూక్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్ 4895/2017తో కేసు కొనసాగుతోంది. లతిత్పూర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 0908/2017తో ఠానాలో కేసు నమోదైంది. ఇది కూడా లలిత్పూర్ కోర్టులో సెక్షన్ 120బీ, 420, 467, 468, 504, 471,406 తదితర సెక్షన్ల కింద నమోదై అయి విచారణ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నంబర్ 0203/2017తో కేసు నమోదైంది. పీసీ109, 120బీ, 420 తదితర సెక్షన్ల కింద, కరప్షన్ యాక్ట్ 13(1),సీ, 13(2)బి,డీ కింద ఏసీబీ కోర్టులో కేసు కొనసాగుతోంది. కురుగొండ్లది వివాదాస్పద వైఖరి కాంట్రాక్టర్లను బెదిరించడం, అధికారులపై మైక్‌లు విసిరి నానా గందరగోళం చేయడం పోలీసు ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసి దూషించడం ఇదంతా వెంకటగిరి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ వివాదాస్పద వైఖరి. నెల్లూరులో అద్దెక భవనాన్ని తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేయండా దౌర్జన్యంగా ఆక్రమించి, రౌడీయిజం చేసిన ఘటనలు ఉన్నాయి. అతను అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, పార్టీలో సీనియర్ నేతగా ఉండటంతో వివాదాలు జరిగి పోలీసు స్టేషన్ వరకు వ్యవహారాలు వెళ్లినా ఎక్కడా మాత్రం కేసులు నమోదు కాని పరిస్థితి.