bowling
-
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలువగా... స్పిన్నర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
‘టాప్’ ర్యాంక్‌లో షాహిన్ అఫ్రిది
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది తొలిసారి టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షాహిన్ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. హాజల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో షాహిన్ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. -
CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ 1996-2007 మధ్యలో 39 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీథరన్ రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ 1996-2011 మధ్యలో 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 నాలుగు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో మురళీ అత్యుత్తమ గణాంకాలు 4/19గా ఉన్నాయి. మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఈ స్థానాన్ని అక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38గా ఉన్నాయి. మలింగ తర్వాత వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ నిలిచాడు. అక్రమ్ 1987-2003 మధ్యలో 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో అక్రమ్ అత్యుత్తమ గణాంకాలు 5/28గా ఉన్నాయి. ఈ జాబితాలో భారత బౌలర్ జహీర్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచకప్‌లో జహీర్ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (18 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు) ఐదో స్థానంలో.. కివీస్ స్పీడ్‌గన్ ట్రెంట్ బౌల్ట్ (19 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) 10వ ప్లేస్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 5వ తేదీ నుంచి వరల్డ్‌కప్ స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. -
వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా!
ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగాటోర్నీలో పది స్టేడియాల్లో 48 మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. ఇక వరల్డ్‌కప్‌కు బీసీసీఐ టీమిండియా బెస్ట్ టీంను ఎంపిక చేసే పనిలో ఉంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌తో వరుసగా టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు చేసే ప్రదర్శన ద్వారా తుది జట్టుపై ఒక అంచనాకు రానున్నారు. ఇకపోతే గాయాలతో దూరమైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు కూడా వరల్డ్‌కప్ ఆడాలనే ఉత్సాహంతో త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు వీరంతా ఎన్సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్లో వేగంగా కోలుకుంటున్నారు. టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసినట్లు సమాచారం. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే ఏడు ఓవర్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్నెస్ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్‌లో ఇవాళ వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్‌తో ఆగస్టులో ఆడతాడో లేదో అనే దానిపై ఒక అంచనాకు రావొచ్చు''అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇 #CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu — BCCI (@BCCI) June 27, 2023 చదవండి: #ICCWorldCup2023: 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా! #ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు.. -
ఐపీఎల్-2023లో అత్యంత చెత్త బౌలర్ ఎవరు..?
ఐపీఎల్లో బ్యాటర్లు రాజ్యమేలే ఆనవాయితీ ఈ సీజన్లోనూ కొనసాగింది. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి బౌలర్‌ను బ్యాటర్లు చితకబాదారు. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ లాంటి బౌలర్లు వికెట్లయితే పడగొట్టారు కానీ, పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ లాంటి బౌలర్లు ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (5/5) నమోదు చేసి, ఆ మరుసటి మ్యాచ్‌లోనే (4-0-52-1) తేలిపోయారు. ఇలాంటి ఘటనలు 73 మ్యాచ్‌ల్లో చాలా సందర్భాల్లో రిపీటయ్యాయి. ఐపీఎల్-2023లో కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి, అత్యంత చెత్త ఎకానమీ నమోదు చేసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం.. ఉమ్రాన్ మాలిక్.. 4 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ తిరిగి దక్కించుకున్న ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. ఈ సీజన్‌లోకెల్లా అత్యంత చెత్త ఎకానమీ (8 మ్యాచ్‌ల్లో 10.85 ఎకానమీతో 5 వికెట్లు) కలిగిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్ (6 మ్యాచ్‌ల్లో 10.77 ఎకానమీతో 3 వికెట్లు) ఉన్నాడు. ఈ ముంబై పేసర్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని తన జట్టు ఓటములకు ప్రధాన కారకుడిగా నిలిచాడు. విజయ్‌కుమార్ వైశాక్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఆర్సీబీ పేసర్ 7 మ్యాచ్‌ల్లో 10.54 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ పేసర్ 10 మ్యాచ్‌ల్లో 10.52 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది వేలానికి ముందు భారీ ధరకు ట్రేడ్ అయిన ఈ కేకేఆర్ ఆల్‌రౌండర్ ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడి 10.48 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో చెత్త ఎకానమీ కలిగిన టాప్-5 బౌలర్లంతా పేసర్లే కాగా.. బెస్ట్ ఎకానమీ కలిగిన టాప్-4 బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి ఐపీఎల్ 2023 బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ (14 మ్యాచ్‌ల్లో 7.19 ఎకానమీతో 11 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (14 మ్యాచ్‌ల్లో 7.37 ఎకానమీతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (15 మ్యాచ్‌ల్లో 7.42 ఎకానమీతో 19 వికెట్లు), కృనాల్ పాండ్యా (15 మ్యాచ్‌ల్లో 7.45 ఎకానమీతో 9 వికెట్లు) టాప్-4లో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్‌గా గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ (16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రషీద్ ఖాన్ (16 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు), మోహిత్ శర్మ (13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2023లో టాప్-3 బౌలర్లంతా గుజరాత్‌కు చెందిన వారే కావడం విశేషం. వీరి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. చదవండి: ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..? -
IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!
ఐపీఎల్(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్ మీటర్ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్థం కాని పిచ్‌ల కారణంగా టి20 క్రికెట్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టి20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టి20 మ్యాచ్‌ను కాస్త టి10 మ్యాచ్‌లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది. అయితే క్యురేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్‌లు రూపొందించనట్లు పేర్కొంటున్నారు.అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్ 16వ సీజన్లో బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
Rahul Gandhi:16 ఏళ్ల బాలుడి ప్రతిభకు రాహుల్ గాంధీ ఫిదా
జైపూర్: రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ గ్రామానికి చెందిన ఓ బాలుడి ప్రతిభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అతడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కోరారు. దీపక్ శర్మ అనే వ్యక్తి పోస్టును షేర్ చేశారు రాహుల్. అందులో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు.. చేల వల కట్టి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కోరుతున్నాను.’ అని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు సీఎం గెహ్లోత్.‘తప్పకుండా.., ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాము’ ట్వీట్ చేశారు. हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022 ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
సంచలన బౌలింగ్‌తో మెరిసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్. సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో సంచలనం సృష్టించాడు. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్‌ను సాయి కిషోర్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఐ డ్రీమ్ తిర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ (4-3-2-4) వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమదోఉ చేశాడు. నాలుగో ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడెన్లు అంటేనే సాయి కిషోర్ ఎలా బౌలింగ్ చేశాడనేది తెలుస్తోంది. మరి ఇలాంటి అద్బుత ప్రదర్శన చేస్తే తన జట్టు గెలవకుండా ఉంటుందా. ఐడ్రీమ్ తిర్పూర్పై చేపాక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్.. ప్రతీ బౌలర్ కలలు గనే స్పెల్ వేశావు.. నీ బౌలింగ్‌కు ఫిదా అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టులో ససిదేవ్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సాయి కిషోర్ 4 వికెట్లు, సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్ తీశారు. Sai Kishore on 🔥 #TNPL2022 pic.twitter.com/nDIi05Fmvn — Santhosh Kumar (@giffy6ty) July 22, 2022 చదవండి: క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలానే ఉంటాయి. ఆటగాళ్ల తమ చర్యలతో ఒక్కోసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తుంటారు. ఇక బౌలర్లయితే తమ బౌలింగ్ యాక్షన్‌తో దృష్టిని మొత్తం తమవైపు తిప్పుకుంటారు. మలింగ, బుమ్రా, పాల్ ఆడమ్స్ ఇలాంటి కోవకే చెందినవారే. తాజాగా విలెజ్ క్రికెట్ లీగ్‌లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు. మాములుగా స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎంతో కొంత లైనఫ్ తీసుకొని బౌలింగ్ చేయడం సహజం. ఇప్పుడు మనం చెప్పుకునే బౌలర్ మాత్రం కాస్త వినూత్న పద్దతిని అనుసరించాడు. క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్‌తో కన్ఫ్యూజ్ అయిన బ్యాటర్ డిఫెన్స్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే తన బౌలింగ్‌పై జార్జ్ మెక్‌మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్ యూ క్రికెట్'' అంటూ ట్వీట్ చేశాడు. Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5 — George McMenemy🏏 (@McMcMenemy) June 20, 2022 చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా?
టి20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్, వార్విక్ షైర్ మధ్య మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ చేసిన తప్పుకు ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ జట్టు తప్పు చేస్తే పీల్డ్ అంపైర్‌కు వెంటనే యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే క్రికెట్ పుస్తకాలు మాత్రం అంపైర్‌కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్ అంపైర్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టులోని ఒక ఫీల్డర్.. బ్యాటర్ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్ లేదా లెగ్ అంపైర్‌లో ఎవరో ఒకరు.. పీల్డర్ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్ లేదా బౌలర్ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్ జట్టుకు వార్నింగ్ ఇస్తూ డెడ్ బాల్‌గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్‌కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్‌బాల్‌గా పరిగణించి.. బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు. లా 45.5.5: ఫీల్డర్ లేదా బౌలర్.. బ్యాటర్లతో ఫిజికల్‌గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్ తీసుకోవాలి లా 45.5.6: బౌలింగ్ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్ అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు వివరిస్తారు. లా 45.5.7: బౌలర్ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్‌బాల్‌గా కౌంట్ చేస్తారు. లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు. లా 45.5.9: స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం. లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్ జట్టుపై ఏ యాక్షన్ తీసుకున్నారనేది వివరించాలి. -
కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్ లీ తన కొడుకు ప్రీస్టన్తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న ప్రీస్టన్కు కనీసం టచ్ చేసే అవకాశం రాలేదు. ఈలోగా బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడిన బ్రెట్ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్నాడు. Blink and you'll miss it 😳 Brett Lee has shown no mercy to his son 😂 👉 https://t.co/PytmEwGeQa pic.twitter.com/bWcQQ9WAnw — Fox Cricket (@FoxCricket) December 30, 2021 -
PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్!
Babar Azam bowls for the first time in international cricket: ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ రెండో టెస్ట్‌లో అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బౌలింగ్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్ బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ బౌలింగ్ చేసిన బాబర్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా బాబర్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ తైజుల్ ఇస్లాం క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్ జారవేయడంతో తృటిలో తొలి వికెట్‌ను చేజార్చుకున్నాడు. కాగా బాబర్ లిస్ట్ -ఏ కేరిర్‌లో 12 వికెట్లు సాధించాడు. ఇక బాబర్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి బాబర్..నీకు బౌలింగ్ కూడా వచ్చా? అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ విజయానికి చేరువలో ఉంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 300-4 వద్ద డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఒక్కడే 8 వికెట్లు పడగొట్టాడు. కాగా ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ తడబడుతుంది. చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్ ఆఫర్! Babar Azam's 1st Over of his International Cricket Career. Babar Azam So Beautiful Bowling@babarazam258 #PAKvBAN #Pakistan #CricketTwitter pic.twitter.com/h9U6nqhSAS — School Education Department & Government of Pak (@SedCorners) December 8, 2021 -
IND Vs AUS: రెస్ట్ అన్నారు.. బౌలింగ్‌తో సర్ప్రైజ్
Virat Kohli Surprise Bowling Vs Aus.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి బరిలోకి దిగడం లేదని.. అతని స్థానంలో తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు రోహిత్ శర్మ మ్యాచ్ ప్రారంభానికి ముందు పేర్కొన్నాడు. అందుకు అనుగుణంగానే మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో కోహ్లి పేరు లేదు. దీంతో కోహ్లి రెస్ట్ అని అంతా భావిస్తున్న సమయంలో సడెన్‌గా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కోహ్లి బౌలింగ్ వేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏడో ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చిన కోహ్లి తర్వాత వేసిన 13వ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన కోహ్లి 12 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయితే పార్ట్ టైం బౌలర్‌గా కోహ్లి బౌలింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్‌తో ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. చదవండి: T20 WC 2021: మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు The GOAT Allrounder @imVkohli 🐐❤️#IndvAus #TeamIndia #ViratKohli pic.twitter.com/vCY5z1rorg — Bang VK Haters™ (@BangVKH) October 20, 2021 King @imVkohli Bowling 😍🔥💥#INDvsAUS #T20WorldCup2021 pic.twitter.com/c9jY9GKOZy — 𝐌𝐛 𝐅𝐚𝐧 𝐍𝐚𝐧'𝐂 🔔 (@MbFanNanC) October 20, 2021 -
‘రోహిత్ శర్మను రెండు రకాలుగా బౌల్డ్ చేస్తా’
పరిమిత ఓవర్లలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు ఓపనర్ రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమిర్ అన్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బౌలింగ్ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని అమిర్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరితో కలిసి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్.. వారిద్దరూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. కోహ్లితో పోలిస్తే రోహిత్‌కు బౌలింగ్ చేయడం సులభమని పేర్కొన్నాడు. కోహ్లి ఒత్తిడిలో మెరుగ్గా రాణిస్తాడని తెలిపాడు. అయితే ఈ క్రమంలో వారిద్దరికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను తాను ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్‌తో ఔట్ చేయగలనని తెలిపాడు ఈ మాజీ పాకిస్తానీ బౌలర్. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అమిర్ పాకిస్తాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్, ధావన్, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్ చేసి అమిర్ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లి సేన.. రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఇటీవల జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు.. -
చెన్నైకి అదనపు బౌలర్ కావాలి!
సాధారణంగా ఐపీఎల్ గ్రూప్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ఒత్తిడిలో కనిపించదు. కానీ ఈ సారి అలా అనిపిస్తోంది. ఆ జట్టు వీరాభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్దగా చప్పుడు చేయడం లేదంటే వారూ కొంత ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తోంది. చెన్నై వ్యూహాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతీ ఒక్క ఆటగాడు తన సొంత ప్రదర్శనతోనే జట్టును గెలిపించగలడని అనిపిస్తున్న ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే చెన్నై పూర్తి వ్యతిరేకంగా ఉంది. పోలికలు అనవసరం కానీ జట్టుగా చూస్తే మ్యాచ్‌లు గెలిచేందుకు అన్ని రకాల అర్హత ఉంది. అయితే ఇది జరగాలంటే ధోని సమర్థంగా నడిపించాల్సి ఉంది. ఆటగాళ్లనుంచి అత్యుత్తమ ఆటను రాబట్టుకోవడం ధోనికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఒక్కసారి ధోని తప్పుకుంటే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటికీ ఏదో రూపంలో ధోని జట్టుతో కొనసాగితే తప్ప టీమ్ కూర్పు చాలా మారిపోవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ధోని కొన్ని చిన్న చిన్న సమస్యలు చక్కబెట్టాల్సి ఉంది. పిచ్ బాగుంటే ఒక అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటే మంచిది. అన్ని జట్లూ ఇలాగే చేస్తున్నాయి. చెన్నైలో అయితే జడేజా తన 4 ఓవర్లు పూర్తిగా వేసేవాడు. కానీ ఇక్కడ అతడిని నమ్ముకోలేం. బౌలర్ కోసం ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకునే అవకాశం సూపర్ కింగ్స్‌కు ఉంది. నేటి మ్యాచ్‌లో విజయ్ స్థానంలో రాయుడు ఆడటం దాదాపు ఖాయం కాబట్టి బ్యాటింగ్ బలపడుతుంది. మరి బౌలింగ్ సంగతి చూసుకుంటే మిడిలార్డర్లో ఆడే రుతురాజ్‌ను పక్కన పెట్టి ఒక స్పెషలిస్ట్ బౌలర్‌ను తీసుకుంటే మంచిది. ఇలాంటి టోర్నీలో మిడిలార్డర్లో ఆడటం ఒక యువ ఆటగాడికి అంత సులువు కాదు. అందుకు బదులుగా 4 ఓవర్లు బాగా వేయగల బౌలర్ పనికొస్తాడు. బలహీనంగా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బలమైన ఢిల్లీని ఓడించింది. అయితే ఇది మరీ పెద్ద విజయమేమీ కాదని నా భావన. విలియమ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే హైదరాబాద్ ఓడిపోయేది. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్లో వార్నర్ తడబడుతున్నాడు. బెయిర్‌స్టో అర్ధ సెంచరీ చేసినా అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. విలియమ్సన్ రాకతో ప్రస్తుతానికి జట్టు బ్యాటింగ్ బలం కాస్త పెరిగింది. సందీప్, కౌల్, థంపిలను కాదని లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారో ఈ మ్యాచ్ చూస్తే అర్థమైంది. చక్కటి నియంత్రణతో పాత కాలం బౌలర్ల తరహాలో నటరాజన్ మంచి యార్కర్లు వేయగలడని తెలిసింది. ఇన్నేళ్ళలో బ్యాటింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. 360 డిగ్రీల షాట్లు వచ్చాయి. అయితే కచ్చితత్వంతో, సరిగ్గా బౌలింగ్ చేస్తే ఇప్పటికీ బ్యాట్స్మెన్ల వద్ద సమాధానం లేదని గత మ్యాచ్ నిరూపించింది. అంచనా వేయడం కొంత కష్టమే అయినా... నా దృష్టిలో నేటి మ్యాచ్‌లో చెన్నైదే పైచేయిగా కనిపిస్తోంది. -
మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్
-
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!
కొలంబో: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిన ఒక ఘటన జరిగింది. ఇదే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్ పీహెచ్డీ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్ స్పిన్ వేసిన అతను, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఆఫ్ స్పిన్ బంతులు విసిరాడు. అతను లెఫ్టార్మ్‌తో వేసిన తొలి బంతికి జేసన్ రాయ్ సింగిల్ తీశాడు. వెంటనే మెండిస్ తన బౌలింగ్‌ను మారుస్తున్నట్లు అంపైర్‌కు చెప్పాడు. ఈసారి అతని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నాడు. మూడు ఓవర్లలో కామిందు వరుసగా 3, 15, 9 పరుగులు ఇచ్చాడు. అతని మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండటంతో మెండిస్‌కు బౌలింగ్ మార్చాల్సిన అవసరం లేకపోయింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయి క్రికెట్లో ఒక బౌలర్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్లో అక్షయ్ కర్నేవర్ (భారత్), జెమా బార్స్బై (ఆస్ట్రేలియా)లాంటి కొందరు ఉన్నా జాతీయ జట్టు తరఫున ఇలాంటి బౌలింగ్ శైలి (ఆంబిడెక్స్ట్రస్) ఎవరికీ లేదు. గతంలో హనీఫ్ మొహమ్మద్, గ్రాహం గూచ్, హసన్ తిలకరత్నే ఇలాంటి ఫీట్‌ను ప్రదర్శించినా అదంతా సరదాకు మాత్రమే! సీరియస్‌గా బౌలింగ్ చేసే ఒక రెగ్యులర్ బౌలర్‌కు ఇలా రెండు చేతులతో బంతులు వేయగల సత్తా ఉండటం మాత్రం కచ్చితంగా విశేషమే. బ్యాట్స్‌మెన్‌కు అనుగుణంగా ఒకే ఓవర్లో బౌలింగ్ మార్చుకోగలడం జట్టుకు అదనపు బలం కూడా కాగలదు. శ్రీలంక అండర్–19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్ బ్యాటింగ్‌లో మాత్రమే ఎడంచేతి వాటమే. Kamindu Mendis, Sri Lanka's captain during January's U19 @CricketWorldCup, has been called up to his country's T20I squad for the first time. Here's a clip of him in action - and no, that's not a mirror, he really does bowl both right-arm and left-arm spin! pic.twitter.com/rhjJP4wku1 — ICC (@ICC) 23 October 2018 -
సత్తాచాటుతున్న ఉమాదేవి
ఏలూరు రూరల్: ఆమె బౌలింగ్ ప్రారంభిస్తే ప్రత్యర్థులకు హడలే. బాల్ గింగిరాలు తిరుగుతూ వస్తుంటే ఎంతటి బ్యాట్స్ఉమెన్ అయినా చిత్తు కావల్సిందే. ఆమే దేవరపల్లికి చెందిన మహిళా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.ఉమాదేవి. ఆరేళ్లగా క్రికెట్ సాధన చేస్తున్న ఈమె ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది. దేవరపల్లి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న ఈమె ఆంధ్ర మహిళ కుంబ్లేగా అందరిచే కితాబు అందుకుంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈమె నిరంతర సాధన చేసి క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. తోటి క్రీడాకారిణిల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి 13 వరకూ గుంటూరులో ఏసీఓ మహిళ అకాడమీలో అండర్–19 జోనల్‌స్థాయి మ్యాచ్‌లు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఉమాదేవి నార్త్‌జోన్ జట్టును తన బౌలింగ్ ప్రతిభతో కుప్పకూల్చింది. 4 వికెట్లు తీసి జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. మూడేళ్లుగా అండర్–16, 19 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. నేడు అండర్–19లో కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, హైదరాబాద్ తదితర జట్లతో తలపడి జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కృషి చేస్తోంది. ఈమె ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నెలకు రూ.4 వేలు ఉపకార వేతనం అందిస్తున్నారు. సహాయ కార్యదర్శులు ఎం. వగేష్‌కుమార్ ఉమాదేవికి సహకారం అందిస్తున్నారు. కోచ్ ఎస్. రమాదేవి వద్ద శిక్షణ పొందుతున్న ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రత్నకుమారి వ్యవసాయం చేస్తున్నారు. -
‘మీరట్ కత్తెర’ పదునెక్కింది!
భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చగలడు... చివర్లో బౌలింగ్‌కు వచ్చి హిట్టింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి మ్యాచ్‌ను గెలిపించగలడు... మధ్య ఓవర్లలో మ్యాచ్‌పై పట్టు పోతుందేమో అనిపించినప్పుడు వచ్చి నేనున్నానంటూ వికెట్ తీసి ఆటను మలుపు తిప్పగలడు... ఇక మన ఆట ముగిసిపోయిందని అనిపించినప్పుడు క్రీజ్‌లోకి వచ్చి బ్యాట్స్‌మన్‌లా బాధ్యతగా ఆడగలడు... దక్షిణాఫ్రికా పర్యటనలో అతను చేయలేని పని ఏదైనా ఉందా? కేప్‌టౌన్‌లో తొలి టెస్టు తొలి రోజు నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో తొలి టి20 వరకు భువీ ముద్ర బలంగా కనిపించింది. ఎంత గొప్పగా ఆడినా దిక్కులు పిక్కటిల్లే సంబరాలు ఉండవు. మ్యాచ్ మ్యాచ్‌కూ జుట్టు రంగు మార్చుకునే కొత్త వేషాలు కనిపించవు. దేశంలో కత్తెరలకు కేరాఫ్ అడ్రస్ మీరట్ నగరం నుంచి వచ్చిన ఈ స్టార్ మూడు ఫార్మాట్లలో కేవలం తన ఆటతోనే అంతటా తానై కనిపించాడు. సాక్షి క్రీడా విభాగం:దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిన తొలి టెస్టులో మన జట్టు తరఫున చెప్పుకోదగ్గ విశేషం ఏదైనా ఉందీ అంటే అది భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రమే. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి సఫారీల స్కోరును 12/3కు పరిమితం చేసిన అతను అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్‌లలో కీలక పరుగులు కూడా చేశాడు. కానీ ఇలాంటి ఆట తర్వాత కూడా అతడిని రెండో టెస్టు నుంచి దూరంగా ఉంచారు. కారణమేదైనా ఈ తప్పుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో టెస్టులో భువీని మళ్లీ తీసుకోగా... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మరోసారి పదునైన బౌలింగ్‌తో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో పట్టుదలగా ఆడిన చేసి పరుగులే జట్టును గెలిపించి అతడిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిపాయి. ఆ తర్వాత వన్డేల్లోనూ చక్కటి ఆటతీరు ప్రదర్శించిన భువనేశ్వర్... తాజాగా టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మూడు ఫార్మాట్లలో తన విలువేంటో చూపించాడు. మొత్తంగా అటు కోహ్లి తర్వాత ఇటు భువీనే దక్షిణాఫ్రికా పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాడు. బంతి రంగు మారిందంతే... భువనేశ్వర్ పరిమిత ఓవర్ల బౌలర్ మాత్రమే అన్నట్లుగా ఇటీవలి వరకు అతనికి గుర్తింపు కొనసాగింది. కెరీర్ ఆరంభంలో పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించే, పెద్దగా వైవిధ్యమేమీ చూపకుండా కచ్చితత్వంతో బంతులు విసిరే బౌలర్‌గానే కనిపించాడు. టి20ల్లో పరిస్థితులు బాగుంటే ఆరంభంలో ఒక్క స్పెల్‌లోనే అతనితో నాలుగు ఓవర్లు వేయించేసి కెప్టెన్ పని ముగించేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అతను ఒకే తరహాలో లేదా స్వింగ్‌ను మాత్రమే నమ్ముకొని బంతులు వేసే బౌలర్ కాదు. పిచ్‌పై తేమ తగ్గిపోయిన తర్వాత కూడా అతను ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు అతని బౌలింగ్‌లో వేగం 120–130 కిలో మీటర్ల మధ్యలోనే ఉండింది. ఇప్పుడు 140 కిమీ కూడా దాటుతోంది. పైగా వేగాన్ని అందుకునే ప్రయత్నంలో గతి తప్పడం లేదు. అద్భుతంగా మలుచుకున్న ఫిట్నెస్ కూడా అందుకు కారణం. దాని వల్లే మైదానంలో ఫీల్డింగ్‌లో కూడా చాలా చురుగ్గా మారిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో అతని ప్రదర్శన చూస్తే ఇక అతను ఏమాత్రం ఒకే తరహా శైలి బౌలర్ మాత్రం కాదని అర్థమైపోయింది. సఫారీ గడ్డపై జోరుగా... భువనేశ్వర్ టెస్టు కెరీర్లో 2014 ఇంగ్లండ్ సిరీస్‌లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ ఈ పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్ వికెట్ కూడా పడగొట్టాడు. అయితే వికెట్లు తీసిన తీరుకంటే భువీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భువీదే ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకరంగా మారిన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 33 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ ఎల్గర్, మార్క్రమ్లతో పాటు డివిలియర్స్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేసి భువీ ఈ మ్యాచ్ చేయిదాటిపోకుండా చూశాడు. ఈ కష్టాన్ని గుర్తించే కాబోలు ఆరో వన్డేకు ముందు ‘నిజంగా విశ్రాంతి ఇవ్వాల్సిందంటే భువనేశ్వర్‌కే’ అంటూ కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆల్‌రౌండర్ అంటూ హార్దిక్ పాండ్యాపై అందరి గురి నిలిచింది కానీ భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అసలైన ఆల్‌రౌండర్ భువనేశ్వరే. తొలి టి20 మొదటి స్పెల్‌లో 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువీ, తన చివరి ఓవర్లో మరో 3 వికెట్లతో మ్యాచ్‌ను గెలిపించడం విశేషం. కొత్త అస్త్రంతో... ఆటపై బ్యాటింగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో బౌలర్లు ప్రతీ సారి భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటోంది. అదే క్రమంలో భువనేశ్వర్ ‘నకుల్ బాల్’ను ప్రత్యేకంగా సాధన చేశాడు. టి20 మ్యాచ్‌లో అతను దానిని సమర్థంగా ఉపయోగించాడు. ఇందులో సఫలం అయ్యేందుకు దాదాపు ఏడాదిగా శ్రమిస్తున్నట్లు భువనేశ్వర్ చెప్పాడు. నకుల్ బాల్ అనేది బేస్‌బాల్ క్రీడ నుంచి వచ్చింది. పేరులో నకుల్స్ (వేలి మెటికలు) ఉన్నా అవేమీ ఉపయోగించరు. వేలి గోళ్లతో పట్టు బిగించి ఆ తర్వాత బంతిని వదులుతారు. బంతిని సంధించే సమయంలో సాధారణ బంతిలాగే వేగాన్ని కొనసాగిస్తే బ్యాట్స్‌మెన్ దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే బౌలర్ కూడా దీనిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తీవ్ర సాధన అవసరం. గతంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్‌తో కొంత సఫలం కాగా, సునీల్ నరైన్ బాగా వాడాడు. అయితే టాంపరింగ్ ఆరోపణలతో యాక్షన్‌ను మార్చుకున్న తర్వాత నరైన్ దీనికి దూరమయ్యాడు. -
అతడి కోసమే మ్యాచ్‌లు చూస్తా : హీరోయిన్
భారత్ లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే లవ్ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పింది. క్రికెట్ అంటే తనకు ఇష్టమని చెప్పిన రాశీఖన్నా, బుమ్రా బౌలింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తుంటానని తెలిపింది. బుమ్రా మ్యాచ్ లో ఉంటే రాత్రులు మేలుకొని మరి మ్యాచ్ చూస్తుందట ఈ భామ. గతంలోనూ బుమ్రా బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా తెరకెక్కిన తొలి ప్రేమ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
-
బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు!
సాక్షి, బంజారాహిల్స్: అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది. క్రికెట్ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కివీస్ చేతిలో విండీస్ చిత్తు
టాంటన్: మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. కైషోనా నైట్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లీ కాస్పెరెక్ (10–6–17–3) అద్భుత బౌలింగ్‌తో అదరొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 18.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 151 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడిన రాచెల్ ప్రీస్ట్ (55 బంతుల్లో 90; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కివీస్‌ను గెలిపించింది. -
అదరహో అశ్విన్...
నిలకడైన ప్రదర్శనకు మారుపేరుగా మారిన ఆఫ్ స్పిన్నర్ భారత విజయాల్లో కీలకపాత్ర ఒక రికార్డుతో ఇమ్రాన్‌ఖాన్‌లాంటి దిగ్గజాన్ని దాటేశాడు. మరో రికార్డుతో మాల్కం మార్షల్‌లాంటి మరో లెజెండ్‌ను మరిపించాడు. కుంబ్లేకు, హర్భజన్‌కు కూడా సాధ్యం కాని అనేక గణాంకాలు అలవోకగా వచ్చి చేరుతున్నారుు. అతనిని వదిలి పెట్టలేమన్నట్లుగా అంకెలు అతనితో అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారుు! భారత్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలవడం, స్పిన్నర్లు గెలిపించడం మొదటిసారి కాదు, ఆ విజయాలు మనకు కొత్త కాదు. కానీ ఇలా చేతి నుంచి బంతి దాటడమే ఆలస్యం... అలా వికెట్లు అతని ఒళ్లో వాలిపోతున్నారుు. రవిచంద్రన్ అశ్విన్ చేస్తున్న మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పాహిమాం అంటున్నారు. సూర్యుడు తూర్పున ఉదరుుంచడంలాంటిదే ఇన్నింగ్సలో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం అంటూ అతనిపై అభినందనలు కురుస్తుంటే... అతిశయోక్తిగా అనిపించినా చావుపుట్టుకలు ఎంత సహజమో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం అంతే సహజమంటూ మరో మాజీ క్రికెటర్ తనదైన భావాన్ని ప్రదర్శించాడు. ఐదేళ్ల స్వల్ప కెరీర్లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అతని రికార్డులు నిలుస్తుండగా, ఇదే తరహాలో జోరు కొనసాగితే వేరుు వికెట్ల మైలురారుు కూడా చిన్నదిగా మారిపోతుందేమో! ఇప్పటికే వరుసగా నాలుగు జట్లు ఈ చెన్నై స్టార్ దెబ్బ రుచి చూశారుు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రమాద హెచ్చరిక జారీ అరుునట్లే! సాక్షి క్రీడా విభాగం దాదాపు మూడేళ్ల క్రితం జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అశ్విన్ 42 ఓవర్లు పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ దెబ్బకు భారత్ ఆడిన తర్వాతి ఏడు టెస్టుల్లో అతనికి చోటు లభించలేదు. అరుుతే ఈ వైఫల్యం నుంచి అతను పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన యాక్షన్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. క్యారమ్ బాల్‌పై అమితంగా ఆధారపడకుండా రెగ్యులర్ ఆర్మ్ బాల్‌పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత అశ్విన్‌కు ఎదురు లేకుండా పోరుుంది. అశ్విన్ ఇంజినీరింగ్ బుర్ర కూడా అద్భుతాలు సృష్టించడంలో బాగా పని చేసింది. అప్పటి వరకు హర్భజన్ తర్వాత మాత్రమే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చిన అశ్విన్, ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయాడు. వికెట్లలో, రికార్డులలో భజ్జీని వెనక్కి తోస్తూ ఆల్‌టైమ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచేందుకు కావాల్సిన అర్హతను అందుకున్నాడు. వేదిక ఏదైనా... ‘ప్రస్తుతం స్పిన్నర్ల కోసమే తయారు చేస్తున్న పిచ్‌లను మేం ఆడినప్పుడు రూపొందిస్తే నా వికెట్లు, కుంబ్లే వికెట్ల సంఖ్య ఎక్కడో ఉండేది’ హర్భజన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. విశ్లేషణకంటే ఒక రకమైన అసూయ, ఒక ఆఫ్ స్పిన్నర్‌గా తనను అశ్విన్ దాటేసి వెళుతున్నాడనే బాధ ఈ మాటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఇందులో వాస్తవం ఉంది. అశ్విన్ అద్భుత బౌలింగ్ అంటూ బ్రాకెట్లో పిచ్ షరతులు వర్తిస్తారుు అంటూ జోక్ చేసిన రోజులు కూడా ఉన్నారుు. కానీ ఇప్పుడు అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చివరి టెస్టు జరిగిన ఇండోర్ వికెట్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించలేదు. అనూహ్యంగా టర్న్లాంటివి దొరకలేదు. అరుునా సరే అశ్విన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. గత దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో పిచ్‌లపై విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే అరుునా... న్యూజిలాండ్ వైపు నుంచి కూడా పిచ్‌ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. పైగా అశ్విన్ తీసిన వికెట్లు చూస్తే పిచ్ అనుకూలతకంటే అతని తెలివితేటలే ఎక్కువగా కనిపిస్తారుు. కోహ్లి చెప్పినట్లు ‘పిచ్ ఒక్కటే వికెట్లు అందించదు, బౌలర్లో కూడా సత్తా ఉండాలి. బంతిని భుజం నుంచి వదిలేటప్పుడే మనం ఏం చేయాలనేది బుర్రలో ఉండాలి. అప్పుడే పిచ్‌పై పడిన తర్వాత బంతి స్పందిస్తుంది’. ఈ రకంగా చూస్తే అశ్విన్ పక్కా ప్లానింగ్ అతని ప్రదర్శనలో కీలకమని అర్థమవుతుంది. ఇటీవల నాటి పేస్ వికెట్లు లేకపోరుునా... సంప్రదాయంగా స్పిన్‌కు అంతగా అనుకూలించని వెస్టిండీస్‌లో కూడా అశ్విన్ తాజా సిరీస్‌లో 17 వికెట్లు తీయగలిగాడు. అంటే అతని ఆట ఎంతో మెరుగైందనే విషయం మాత్రం వాస్తవం. కుదేలైన కివీస్... రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు, మూడు సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు, కేవలం 17.77 సగటుతో 27 వికెట్లు... తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అశ్విన్ అద్భుత గణాంకాలివి. కేవలం మూడు టెస్టుల్లో 27 వికెట్లతో అతను సత్తా చాటాడు. సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్ చేయడం, కెప్టెన్ కోహ్లి ఆశించిన సమయంలో, కీలకమైన క్షణంలో వికెట్ తీసి మ్యాచ్‌ను మళ్లీ మన చేతుల్లోకి తీసుకు రావడం రొటీన్‌గా సాగిపోరుుంది. కాస్తరుునా మెరుగైన ప్రదర్శన ఇద్దామని భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌ను అశ్విన్ దారుణంగా దెబ్బ తీశాడు. మూడు టెస్టుల్లో కొన్ని సందర్భాల్లో కివీస్‌కు ఆధిపత్యం ప్రదర్శించే మంచి అవకాశాలు లభించినా అశ్విన్ వల్లే మన జట్టు కోలుకోగలిగింది. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్సలో అతని బౌలింగ్ జోరు చూస్తే పది వికెట్లు అతనికే దక్కుతాయేమోనని అనిపించింది. దిగ్గజ క్రికెటర్ సంగక్కర సొంతగడ్డపై వరుసగా నాలుగు సార్లు అశ్విన్‌కే అవుటైతే, ప్రస్తుతం ప్రపంచ టాప్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విలియమ్సన్ కూడా నాలుగు సార్లు తన వికెట్ అశ్విన్‌కే అప్పగించాడు. ఈ రెండింటికి మధ్య మరో టెస్టు స్టార్ హషీం ఆమ్లా కూడా అతని దెబ్బకే తలవంచాడు. 2013లో 0-4తో చిత్తుగా ఓడిన ఆసీస్, ఇప్పటికే అశ్విన్ బౌలింగ్ రుచి చూసింది. అంతకుముందు ఏడాది అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే ఇంగ్లండ్ మన గడ్డపై సిరీస్ గెలవగలిగింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు మళ్లీ మన వద్దకు వస్తున్నారుు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సొంతగడ్డపై మరో 10 టెస్టులు వరుసగా ఆడనుండటంతో అశ్విన్ రికార్డుల బాక్స్‌లు బద్దలు చేయడం మాత్రం ఖాయం. ఘనతల గని... 7 అశ్విన్ కెరీర్లో (39 టెస్టులు) ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. అతనికంటే ముందు ఇన్ని సిరీస్ అవార్డులు అందుకోవడానికి ఇమ్రాన్‌ఖాన్‌కు 70 టెస్టులు పట్టారుు. అశ్విన్ అరంగేట్రం తర్వాత భారత్ 8 టెస్టు సిరీస్‌లు గెలిస్తే 7సార్లు అశ్విన్ బెస్ట్ ప్లేయర్‌గా నిలవడం విశేషం. 4 వరుసగా అశ్విన్ నాలుగు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. గతంలో ఇమ్రాన్, మార్షల్లు మాత్రం ఇలా అందుకున్నారు. 6 కుంబ్లే (8) తర్వాత అశ్వినే అత్యధికంగా ఆరు పర్యాయాలు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు. 1 అశ్విన్ 39 టెస్టులోనే 220 వికెట్లను పడగొట్టాడు. ఇన్ని టెస్టుల తర్వాత ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. 1 అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 413 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.