BR ambedkar jayanti
-
దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు
స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ తెలుసు. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినం మనందరికీ తెలుసు కదా. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటినుంచీ భారత్ గణతంత్ర దేశంగా మారింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలోని రచనా (డ్రాఫ్టింగ్) కమిటీ దాదాపు మూడేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని కూలంకషంగా పరిశీలించి 1949 నవంబర్ 26న ఆమోదించింది. అదే రాజ్యాంగ దినోత్సవం. గతంలో దీన్ని నేషనల్ లా డే గా జరుపుకునేవాళ్లం. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటినుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)గా జరుపుకుంటున్నాం. పౌరుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఆ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించిన చరిత్రాత్మక సందర్భానికి బుధవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇదీ నేపథ్యం... భారత్‌కు స్వాతంత్య్రం రావడం ఖాయమని 1945 కల్లా తేలిపోయింది. దాంతో స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ చుక్కానిలా దిశానిర్దేశం చేసే రాజ్యాంగం అవసరమైంది. దాని నిర్మాణం కోసం కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా 1946 డిసెంబర్లో 389 మంది ఉద్ధండులతో రాజ్యాంగ పరిషత్ (అసెంబ్లీ) ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించేందుకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అలా రాజ్యాంగ రచనకు ఉద్దేశించిన సంస్థ పుట్టుకలోనే ప్రజాస్వామిక విలువలు దాగుండటం విశేషం! అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖులు ఇందులో సభ్యులు. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. 1946 డిసెంబర్ 9న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ రూపమిచ్చింది. ఇందుకు రెండేళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ వ్యవధిలో డ్రాఫ్టింగ్ కమిటీ 11సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపునిచ్చింది. డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పుచేర్పులతో రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది.రాజ్యాంగమంటే కేవలం రాత ప్రతి కాదు. ఒక జాతి జీవన విధానం. దేశమంతటికీ నిరంతర చైతన్యస్ఫూర్తి– బాబాసాహెబ్ అంబేడ్కర్– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను బీజేపీ అగ్ర నాయకత్వం ఆదివారం విడుదల చేయనుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంకల్ప్ పత్రాన్ని ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అజెండాలుగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి హామీలను ఇప్పటికే నెరవేర్చిన తరుణంలో ఈసారి అలాంటి ఏఏ కీలకమైన హామీలకు మేనిఫెస్టోలో చోటుకలి్పస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే నాలుగు ప్రధాన కులాలు.. పేదలు, రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా హామీలను ప్రస్తావించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ ఛైర్మన్, రక్షణ మంత్రి రాజ్నా«థ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయింది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలకోసం నమో యాప్ సహా 35 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇలా లక్షలాది మంది పార్టీ మద్దతుదారుల నుంచి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ముఖ్యాంశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మార్గసూచీని ప్రకటించడంతో పాటు మోదీ గ్యారెంటీలకు సంబంధించిన హామీలను మరోమారు ప్రకటించే అవకాశాలున్నాయి. మతపరమైన అంశాలతో పాటు జాతీయవాద అంశాలను ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నాయని కమలనాథులు చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత. పలువురు నాయకులు పూల మాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు పెరికె వరప్రసాద్ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. అంతటి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం జగన్ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు. అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. ఇక నారా లోకేష్ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం: బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం జగన్ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద. తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్ భారతీయులంతా గర్వించదగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు అంబేద్కర్ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోంద చదవండి: బీఆర్ అంబేడ్కర్ జయంతి.. సీఎం జగన్ ట్వీట్ -
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ఈ యుగం బాబాసాహెబ్‌దే! దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2 pic.twitter.com/Lt1TQ5711D — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023 -
అంబేడ్కర్‌కు తెలంగాణ ఘన నివాళి ఇది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండటం రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలోని ఆర్టికల్–3ను పొందుపరిచిన తెలంగాణ బాంధవుడికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి అని ప్రకటించారు. రాష్ట్ర నూతన సచివాలయానికి ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’అని పేరుపెట్టి సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు. శుక్రవారం అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయన్నారు. సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధు, గురుకులాలు, ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిధి, అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, టీఎస్ ప్రైడ్, మూడెకరాల భూపంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలు, కార్యక్రమాలతో దళితులు ఎంతో ఎదుగుతున్నారని, చేయూతనిస్తే సమాజంలో ఎవరికీ తీసిపోమనే విషయాన్ని రుజువు చేస్తున్నారని పేర్కొన్నారు. -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పి తాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమనేత ‘ 98497 41695 రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు -
స్వేచ్ఛ, సమానత్వమే అంబేడ్కర్ జీవిత సూత్రాలు
సాక్షి, అమరావతి: స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కుల, మత రహిత భారతదేశం కోసం జీవితకాలం పాటు పోరాటం చేశారన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వర్ధమానుడి బోధనలు సదా ఆచరణీయం వర్ధమాన మహావీరుడు ప్రబోధించిన అహింసా మార్గం సదా ఆచరణీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన వర్ధమాన మహావీరుడి జయంతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జైన్ సమాజ్ ప్రతినిధులు గవర్నర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జైన్ సమాజ్ ప్రతినిధులు మనోజ్ కొఠారి, పబ్నాలాల్, సుక్రజ్, దినేష్, కిశోర్, నరేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ భావాలు అజరామరం
సాక్షి, అమరావతి: భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో బాబాసాహెబ్ చిత్రపటానికి సీఎం జగన్ ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పాల్గొన్నారు. జీసస్ మహాత్యాగానికి గుర్తు ‘గుడ్ ఫ్రైడే’ ‘కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ముఖ్య ఘట్టాలు’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ ఏసు ప్రభువు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని సీఎం తెలిపారు. -
Ambedkar Jayanti 2022: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
-
బీఆర్ అంబేడ్కర్ జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలే.. కేంద్రప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా పథకాలు రూపొందిస్తూ.. సామాజిక న్యాయం దిశగా కృషిచేస్తున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణంలో నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జేపీ నడ్డా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు Tributes to Dr. Babasaheb Ambedkar on his Jayanti. He has made indelible contributions to India’s progress. This is a day to reiterate our commitment to fulfil his dreams for our nation. pic.twitter.com/mLTgmJ8tNi — Narendra Modi (@narendramodi) April 14, 2022 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తూ అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చదవండి: రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్: సీఎం జగన్ కార్యక్రమానికి మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నిన్నటి మంత్రి వర్గ విస్తరణలో అంబేద్కర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్ తూచ తప్పకుండా పాటించారని, మహనీయుడు అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే స్పూర్తిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు వక్తలు అన్నారు. -
రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ‘‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకుపైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022 చదవండి: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన -
Ambedkar Jayanti 2022: అంబేడ్కర్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమీర్‌పేట గ్రీన్‌పార్క్ మ్యారీగోల్ట్ హోటల్లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. అంబేడ్కర్ దేశానికే గర్వకారణం: గవర్నర్ దేశం పూర్వవైభవం సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలు, ఆదేశాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన చట్టబద్ధ కార్యాలయాలు, సంస్థలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనకు నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్ దేశానికే గర్వకారణమని, చురుకైన సంఘ సంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని గవర్నర్ కొనియాడారు. అణచివేతపై మానవత్వం సాధించిన విజయానికి అంబేడ్కర్ అసలైన ఉదాహరణ అని, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదలతో పాటు ప్రతీఒక్కరికీ రాజ్యాంగ హక్కులు దక్కేలా అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ కీర్తించారు. అంబేడ్కర్‌కు సీఎం నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూటికి నూరు శాతం రాయితీ కింద అందిస్తోందని తెలిపారు. -
Ambedkar Jayanti 2022: మలి అంబేడ్కరిజమే మేలు!
అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే ఆయన కృషి కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన కృషిని ‘తొలి అంబేడ్కరిజం’గా పరిగణించాలి. రాజ్యాంగ రచనా సమయంలో– అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా, విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. మొత్తం సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఈ బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి. తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాల్సిన తరుణమిది. అంబేడ్కర్ ఆలోచనలు, కృషిని గతం లో కంటే భిన్నంగా ప్రజాపోరాట శక్తులూ, పాలక శక్తులూ గుర్తిస్తుండటం చూస్తున్నాం. గతంలో చాలాకాలం పాటు అంబేడ్కర్‌ను ఏ మాత్రమూ గుర్తించని సామాజిక శక్తులు 1980 ల నుంచి హఠాత్తుగా ఆయనను ఆరాధించడంలోని ఔచిత్యం ఏమిటి? ప్రపంచ వ్యాప్త సామాజిక ఆర్థిక సంక్షోభం ప్రారంభం; సోషలిజం సహా సకల సైద్ధాంతిక భావజాలాల్లో సంక్షోభం; సామాజిక చైతన్య కేంద్రాల విస్ఫోటనం జరిగి... అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ సిద్ధాంతాలు అనే సరికొత్త కేంద్రాల చుట్టూ సమీకృతమయ్యేందుకు శకలాలుగా మారడం వంటి పరిణామాలు సంభవించాయి. ఈ సామాజిక నేపథ్యంలో ప్రబలంగా ముందుకొచ్చిన కుల అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా అంబేడ్కర్, ఆయన సిద్ధాంతాలు నిలిచాయి. ఈ నూతన ఒరవడి నుంచి లబ్ధి పొందేందుకు పాలక వర్గాలు సైతం అంబేడ్కర్‌ను తలకెత్తుకుంటున్నాయి. అయితే సమకాలీన సమాజంలోని ప్రగతిశీల శక్తులూ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ మూల తాత్వికతను గ్రహించడంలో విఫలమై... తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలన కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత, అçస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతోనూ; ఇటు స్వాతంత్రోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందార్ల తోనూ సైద్ధాంతిక భావజాల పరంగా, భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేయవలసి వచ్చింది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్టు/కార్మికోద్యమాల్లో కులం పాత్ర, వర్గపోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కుల నిర్మూలన పోరాటానికున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోనూ తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడటం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన కృషి దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన సైద్ధాంతిక, రాజకీయ కృషిని తొలి అంబేడ్కరిజంగా పరిగణించాలి. అంబేద్కర్ సుదీర్ఘకాలంగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా సమగ్ర మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. 1955లో ఆయన ‘భారతీయ బుద్ధ మహాసభ’ను స్థాపించారు. 1956 ఆక్టోబర్ 14న 22 ప్రమాణాలతో రూపొందిన ‘ధర్మ చక్ర ప్రవర్తన’ సమావేశంలో లక్షలాది ప్రజల సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ‘నవయాన’ బౌద్ధాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేడ్కర్‌ను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’ సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణిచివేత పునాదిగా శుద్ధ అగ్రకుల వ్యతిరేకతను, ధిక్కారాన్ని మాత్రమే సూచించేదిగా లేకపోవడమనేది ఆయన దృక్పథంలో వచ్చిన విస్తృతిని తెలియజేస్తుంది. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ధ దృక్పథమే భారత విముక్తి మార్గంగా అంబేడ్కర్ బోధించారు. భారతీయ సమాజంలో అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా... విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. దళితులు, బహుజనులు, శ్రామికులు, మహిళలు తదితర అణగారిన ప్రజల దక్పథం పునాదిగా... మొత్తం భారత సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఆయన బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి.సామాజిక, వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది. ఈ అవగాహనతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన స్వప్నించారు. 1956 సెప్టెంబర్ 30వ తేదీన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్పీఐ)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన జీవితపు చరమదశలో ‘ఆర్పీఐ’ ద్వారా కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను సమీకరించే పనికి శ్రీకారం చుట్టారు. బౌద్ధం ప్రభావంతో... సామాజిక సమానత్వం, వర్గపోరాటం అనే ద్విముఖ కార్యాచరణ పునాదిగా రాజకీయ పార్టీని నడపాలని ఆయన భావించారు. ఇంతలో ఆయన 1956 డిసెంబర్ 6వ తేదిన మరణించారు. ఆయన మరణానంతరం 1957లో ఆర్పీఐ ఏర్పడింది. అంబేడ్కర్ దార్శనిక పరిణామాన్ని సక్రమంగా ఆకళింపు చేసుకోలేని అంబేడ్కర్‌వాదులు చీలిపోయారు. అమెరికాలో ‘బ్లాక్ పాంథర్స్’ తరహాలో మహారాష్ట్రలో కూడా ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం కుల అత్యాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరింది. అయితే అస్తిత్వాన్ని మించి, అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులేనని ఈ ఉద్యమం నిర్వచించింది. ఆ తర్వాత 1980–90లలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ తరం సాంకేతిక విప్లవ కాలంలో ముందుకొచ్చిన... ఆధునికానంతర వాద దార్శనికత ప్రభావంతో ఏర్పడిన అస్తిత్వ ఉద్యమాల ఒరవడిలో అంబేడ్కరిజం దేశ రాజకీయ యవనికపై ప్రబలంగా ముందుకొచ్చింది. ఆ కాలంలో వివిధ సంస్థలూ, వ్యక్తులూ అంబేడ్కర్‌వాద లేబుల్‌ను విస్తృతంగా వినియోగిస్తూ ఆయన దార్శనికతను కుల అస్తిత్వానికి సంబంధించినదిగానే (తొలి అంబేడ్కరిజం) కుదించి చూసేవారు. మలి అంబేడ్కరిజంలోని బౌద్ధ భావజాలం, సమతా వాదం వంటి అంశాలను ఇప్పటికీ వారు అస్సలు పట్టించుకోనేలేదు. బ్రాహ్మణిజం, కేపిటలిజం అనే రెండు రకాల సామాజిక శత్రువులను అంబేడ్కర్ గుర్తించారు. పెట్టుబదారీ సామ్రాజ్యవాదం కంటే అగ్రకుల నియంతృత్వానికి (బ్రాహ్మణిజం) మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉండటం వల్ల... హిందూ సామ్రాజ్యవాదాన్ని ముందుగా నిర్మూలించాలన్నది అంబేడ్కర్ లక్ష్యం. అందుకే ఆయన పోరాటాలన్నీ అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేక పోరాటాలే. అయితే మలి అంబేడ్కరిజంను ఆయన ప్రతిపాదించిన అనంతరం అతి కొద్ది కాలంలోనే మరణించడం వల్ల... ఆయనలోని పరిణామం వారి తర్వాత తరాలకు ఆచరణాత్మక పద్ధతుల్లో నేర్చుకునేందుకు అవకాశం కలగకపోవడం దురదృష్టకరం. అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. వివిధ దార్శనికతల కలనేత. పాలకవర్గాలే కాకుండా, అంబేడ్కర్ వాదులు, వామపక్షవాదులు సైతం అంబేడ్కర్ దార్శనికతను విమర్శనాత్మక, విప్లవాత్మక దార్శనికుడుగా చూడకుండా ఒక దేవునిగా, విగ్రహమాతృనిగా పూజిస్తున్న వైనం దురదృష్టకరం. మలి అంబేడ్కరిజంలోని సమతావాద స్వభావాన్ని ఆకళింపు చేసుకోకుండా, తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని మేధావులు, సామాజిక ఉద్యమశక్తులు సత్వరం గ్రహించాల్సిన తరుణమిది.కొందరు అస్తిత్వ వాద నాయకులు శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కరిజాన్ని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరిని కుల అస్తిత్వ/వామపక్ష ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. (నేడు అంబేడ్కర్ జయంతి) వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ పాత్రికేయుడు ∙95503 67536 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
-
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
నెల్లూరు జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేడ్కర్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ‘‘సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్. అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నానని’’ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. విశాఖపట్నం: నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో చారిత్రాత్మక అభివృద్ధికి పునాదులు వేసిన మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగాలంటే అంబేద్కర్ ఆశయాల ఆచరణ ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి మేకతోటి సుచరిత నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుందన్నారు. నెల్లూరు: జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా: అంబేడ్కర్ 130 వ జయంతి సందర్బంగా ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ ఛైర్మన్ లింగం నిర్మల, వైస్ ఛైర్మన్ చందమూరి నారాయణరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. హిందూపురం అంబేడ్కర్ సర్కిల్లో 25 అడుగుల అంబేడ్కర్ కటౌట్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయవాడ: బిఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్.. ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతి లాల్ దండే.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు శామ్యూల్ ఆనంద్.. జాయింట్ కలెక్టర్లు మాధవిలత, మోహన్, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను అధికారులు పరిశీలించారు. చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్ సూపరండీ బాబూ.. -
విశాఖలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
నేడు మార్కెట్‌కు సెలవు
సాక్షి, ముంబై: బాబా అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్చంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. తిరిగి గురువారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. మహారాష్ట్ర నూతన సంవత్సర ఆరంభ దినం ‘గుడి పడ్వా’ పండుగ కారణంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. -
సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేడ్కర్
సాక్షి, అమరావతి: నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ‘భారత సమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేడ్కర్. బుధవారం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు) -
అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన పలు పార్టీల నేతలు
-
అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్