brahmins
-
బాబు హామీ గాలికి.. టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండిచేయి
సాక్షి, విజయవాడ: టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండి చెయ్యే మిగిలింది. ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా టీటీడీలో చోటు దక్కలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారు.టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వగా, నిన్న ప్రకటించిన పాలకమండలిలో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణునికి కూడా అవకాశం దక్కలేదు. చంద్రబాబు మోసంపై బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి.టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ నియమితులయ్యారు. -
చంద్రబాబుపై బ్రాహ్మణుల కన్నెర్ర
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుపై బ్రాహ్మణులు కన్నెర్ర చేశారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయాన్ని బ్రాహ్మణులు ముట్టడించారు. సరిపెళ్ల రాజేష్(మహాసేన రాజేష్) బ్రాహ్మణ మహిళలను అవమానించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌కి ఇచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. 24 గంటల్లో సరిపెళ్ల రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబు స్పందించ లేదు. బ్రాహ్మణ మహిళలంటే రాజేష్‌కి అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు. బ్రాహ్మణుల సత్తా చంద్రబాబుకి చూపిస్తాం. క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. -
అవసరమైతే గాండీవం ఎత్తాలి.. బ్రాహ్మణులను హేళన చేస్తే ఊరుకునేది లేదు
హుడా కాంప్లెక్స్: ‘అవసరమైనప్పుడు వేదం చదవాలి. గాండీవం కూడా ఎత్తాలి.. సమయం, సందర్భాన్ని బట్టి స్ఫూర్తిని అలవర్చుకోవాలి.. విజ్ఞతను ప్రదర్శించాలి’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం బ్రాహ్మణ రాష్ట్ర సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన బ్రహ్మగర్జన సభలో ఆమె ముఖ్య అతి థిగా ప్రసంగించారు. సింహాలు గర్జించాలని.. అప్పుడే అడ వి ఆర్డర్లో ఉంటుందని, మేఘాలు గర్జించాలని.. అప్పుడే సమాజం చల్లగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా బ్రాహ్మణు లకు ఒక్క రూపాయి ఇవ్వలేదనీ కానీ బీఎస్ఎస్ ప్రభుత్వం అర్చక స్వాములకుజీతాలు ఇస్తోందని, ఉద్యోగ భద్రత కల్పిస్తోందని, దూపదీప నైవేద్యాల సొమ్మును రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచిందని ఆమె గుర్తు చేశారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని 1,600పైగా ఆల యాలకు రూ.16,000 నుంచి రూ.ఐదు లక్షల వరకు ఇచ్చి న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోవాలనే వారికి స్టడీ సర్కిళ్లలో అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. హేళన చేస్తే క్షమించం: బ్రాహ్మణులను చూసి హేళన చేసే వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం క్షమించదని కవిత స్పష్టం చేశా రు. బ్రాçహ్మణులు సైతం రాజకీయంగా రాణించాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో సత్యానంద భారతీస్వామి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యేలు సుధీర్‌రె డ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, పురాణం సతీష్, దేవిప్రసాద్, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి తుల సి శ్రీనివాస్, కోశాధికారి మునిపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బౌద్ధాన్ని కలిపేసుకున్నారు!
బౌద్ధం బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులు గానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి. బౌద్ధుల ‘వైఫల్య సూత్రా’లలో ‘లంకావతార’ అనే ఒక పేరు తటస్థ పడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధ రాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే ‘దశరథ’ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణ వాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబు తారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమా జంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్క డివి? అని ప్రశ్నించుకుంటే – ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహా యానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమ యంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహా రంలోకి తెచ్చారు. అందువల్ల, సంస్కృతం – బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (బీహెచ్ఎస్)గా నిలిచిపోయింది. దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు, బ్రాహ్మణా ర్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు. మహాయాన్ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి. ‘లలిత్ విస్తార్’ అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే, ‘మహా వస్తు’ అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయో గాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో... అలాగే, బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు. ‘లంకావతార్’ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరికొందరు ‘స్వయంభూ నాయక్’ అనీ, ‘వినాయక్’ అనీ, ‘పరిణా యక్’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్, ప్రథాన కపిల్, భూతాంత్, రామ్, వ్యాస్, శుక్ర్, ఇంద్ర్, బలి, వరుణ వంటి అనేక పేర్లతో పిలుచుకునే వారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్ – అని కూడా అన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణా ర్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లి చెట్టుకింద ధ్యానముద్రలో ఉండగా ‘నాగ ముచిళిందు’డనే నాగుపాము వచ్చి, పడగ విప్పి ఆయనకు నీడ నిచ్చింది వంటి కల్పనలు ప్రచారం చేశారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే, నాగజాతి ఆదివా సులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు. బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజ జీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకూ, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోకి తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మథనం. ఈ లోకంలోని దుఃఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మథనపడటం. జాగ్రత్తగా అవలోకిస్తేగానీ,రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు. బుద్ధుణ్ణి ‘భగవాన్’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధమ్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు. సర్వాంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్ అంటే, ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహా మానవుణ్ణి బౌద్ధులు భగవాన్ – పరిపూర్ణతను సాధించిన వాడా అని గౌరవించుకుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి. డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, జీవశాస్త్రవేత్త -
ధూపదీప నైవేద్య భృతి రూ.4వేలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆలనాపాలనా లేని ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తున్న భృతిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు వర్తిస్తున్న ధూపదీప నైవేద్య పథకాన్ని మరో 2,796 ఆలయాలకూ వర్తింపచేయనున్నట్టు చెప్పారు. గోపనపల్లిలో 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని కేసీఆర్ పలువురు పీఠాధిపతుల సమక్షంలో బుధవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. అనువంశిక అర్చకుల విధానాన్ని పునరుద్ధరించాలంటూ కొన్నేళ్లుగా అర్చక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్లో చర్చించి త్వరలో పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లాలోని కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. సర్వజన సమాదరణ ‘లోకా సమస్తా సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. సర్వజన సమాదరణ అన్నది తెలంగాణ ప్రభుత్వ విధానం, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లో ఎంతోమంది పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే 2017లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వంద కోట్ల నిధులను దానికి కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) పథకం కింద రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.150 కోట్లను వెచ్చించింది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సనాతన సంస్కృతి కేంద్రంగా ‘బ్రాహ్మణ సదనం’ను నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణ వివాహాలకు ఉచిత కల్యాణ వేదికగా, కులాలతో ప్రమేయం లేకుండా పేదలు తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాలకు పురోహితులను ఉచితంగా పంపే సేవాకేంద్రంగా విలసిల్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన పుస్తకాలతో సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు చేయాలని కోరారు. వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు అందులో ఉంచాలన్నారు. సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామయ్య ఇచ్చిన ఎకరం స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లోనూ బ్రాహ్మణ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా శృంగేరీ పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆడియో సందేశ రూపంలో ఆశీర్వదించారంటూ వారితోపాటు ప్రత్యక్షంగా విచ్చేసిన ఇతర పీఠాధిపతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు.. ఓం శాంతి.. శాంతి.. శాంతిః అన్న శ్లోకంతో సీఎం ప్రసంగాన్ని ముగించారు. యాగంలో పాల్గొన్న సీఎం బుధవారం ఉదయం తొలుత సదనానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా యాగశాలకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంకు శంఖ నాదం, వేద పఠనం మధ్య వారు తలపాగా, శాలువాలతో ఆశీర్వదించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులను పలకరించారు. ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తర్వాత వాస్తుపూజ నిర్వహించారు. బ్రాహ్మణ సదనం శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తర్వాత సభాస్థలిలో పీఠాధిపతులకు సత్కరించి వారికి పాదాభివందనం చేశారు. పుష్పగిరి పీఠం విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సుభుధేంద్ర తీర్థస్వామి, మదనానంద సరస్వతీ పీఠం మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, సీతారాంబాగ్ జగన్నాథ మఠం వ్రతధర రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సతీశ్, బాల్క సుమన్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, జస్టిస్ భాస్కర్ రావు, అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. -
విప్రో కన్జూమర్ చేతికి బ్రాహ్మిన్స్
న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్‌జీ కంపెనీ విప్రో ఎంటర్ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు. -
వివాదాస్పదంగా నీరా కేఫ్ వేదామృతం పేరు
-
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ సంచలన నిర్ణయం.. సీనియర్ నేతకు బిగ్ షాక్!
బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాషాయ నేతపై వేటు వేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కార్యక్రమంలో బీజేపీ నేత ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు మతం పేరుతో ప్రజలను మోసగించి, వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బు, వనరులతో బ్రాహ్మణులు సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ప్రవీణ్ మిశ్రా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ అధిష్టానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతం సింగ్ లోధీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. అతడిపై వేటు వేసింది. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మాజీ సీఎం ఉమాభారతికి అత్యంత సన్నిహితుడైన ప్రీతం సింగ్ లోధీ..శివ్‌పూరి జిల్లా పిచ్చోర్ స్థానం నుంచి 2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. #MadhyaPradesh: Insult of #Brahmins by #BJP leader Pritam Singh Lodhi in Shivpuri. #Trending #Viralvideo #India pic.twitter.com/VelePtoYHl — IndiaObservers (@IndiaObservers) August 19, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
బుజ్జగింపులో వింత కోణం
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లను బుజ్జగించే పనిలో అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ తలమునకలవుతున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లు ఓటు వేయని కారణంగా ఈ రెండు పార్టీలూ ఓడిపోలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత ఎస్పీ కూడా దానికి వంతపాడింది. మరి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్న క్రమంలో ఇన్నాళ్ళూ ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. మొత్తం మీద, ఎస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. ఈ సరికొత్త బుజ్జగింపు యూపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరం. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2018 నవంబర్ 20న ‘బ్రాహ్మణ పితృస్వామ్యాన్ని తుదముట్టించండి’ అనే పోస్టర్ పట్టుకుని తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు. దాన్ని చూడగానే కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆగ్రహోదగ్రులయ్యారు. తివారీ ఆగ్రహం వెనుక సారం లేనప్పటికీ సరిగ్గా మూడేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మండల్ రాజకీయాల పతాక ధారులు బీఎస్పీ, ఎస్పీలు తన ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటారని తివారీ అసలు ఊహించి ఉండరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా దానికి వంతపాడింది. ఈ మార్పు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. బీఎస్పీ, ఎస్పీ వంటి మండల్ రిజర్వేషన్ల అనుకూల పార్టీలను తమ రాజకీయాలను పునర్నిర్వచించుకునేలా బీజేపీ ఒత్తిడి పెడుతోందా? తమను తాము కొత్తగా ఆవిష్కరించుంటున్న క్రమంలో ఇన్నాళ్లు ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. ఇలాంటి మౌలిక పరివర్తనతో ఈ పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం సాధిస్తాయా అన్నదీ ప్రశ్నే. 2019 లోక్ సభ ఎన్నికల పోలింగ్ అనంతరం లోక్‌నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం యూపీలో 72 శాతం యాదవేతరులు, కొయిరి–కుర్మీ ఓబీసీలు బీజేపీకే ఓటు వేసినట్లు తేలింది. వీరిలో 18 శాతం మంది మాత్రమే ఘట్బంధన్ కూటమికి ఓట్లేశారు. దిగువ తరగతి ఓబీసీలు, దళితులలో ఇంత మౌలిక మార్పు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎందుకంటే బీజేపీలో వారి ప్రాతినిధ్యం కనీస స్థాయిలోకూడా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 44.9 శాతం అగ్రకులాలు, 19.7 శాతం ఓబీసీలు గత యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న బీజేపీకి దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఓట్లు తరలిపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ప్రధాన కారణం ఉంది. మండల్ రాజకీయాలు యూపీలోని దిగువ తరగతి ఓబీసీలకు, దళితులకు భౌతికపరంగా (ఉద్యోగాలు, విద్య), రాజకీయపరంగా (రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు) ఎలాంటి ప్రయోజనాలు కలిగించలేదు. పలుకుబడిన కొన్ని బీసీ, ఓబీసీ కులాలకు మాత్రమే ప్రయోజనాలు సిద్ధించాయి. ఉదాహరణకు, 2017 అక్టోబర్‌లో నియమించిన కమిషన్ కేంద్ర స్థాయిలో ఓబీసీలో ఉప వర్గీకరణకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎమ్లతోపాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీల ప్రవేశంపై గత మూడేళ్ల డేటాను చూస్తే 97 శాతం ఓబీసీ కోటా ప్రయోజనాలు ఓబీసీల్లోని 25 శాతం ఉప–కులాలకు మాత్రమే అందాయి. మొత్తం 983 ఓబీసీ కమ్యూనిటీలకు (ఓబీసీల్లో 37 శాతం) ఉద్యోగాలు, అడ్మిషన్లలో సున్నా ప్రాతినిధ్యం దక్కింది. పైగా, ఓబీసీల్లో 10 కమ్యూనిటీలు మాత్రమే 24.95 శాతం ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందాయి. అంటే రిజర్వేషన్లు రెండంచుల కత్తిలాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దిగువ కులాలను ఐక్యం చేయడంలో రిజర్వేషన్లు ఒక సాధనంగా పనిచేసినప్పటికీ, అదే సమయంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇంత అసమానంగా పంపిణీ కావడంతో ఒక విస్తృతస్థాయి సంఘీభావం, సామూహిక కార్యాచరణ దిగువకులాల్లో లోపించింది. అదే సమయంలో ఏక జాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రబోధించే బీజేపీ వైపు దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ఓబీసీల్లో విశ్వాసం పెరగడానికి కూడా ఇదే కారణం. దిగువ కులాలు చీలిపోవడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం అనేవి మండల్ రాజకీయాలను ద్వంద్వ సంక్షోభంలోకి నెట్టివేశాయి. కుల రాజకీయాల గుణపాఠాలు దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఆందోళనలు నిజమైనవే అయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీ నాయకత్వం వీరి సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించడంపై నిర్లక్ష్యం వహించాయి. పైగా వారి సమస్యలను కనీ సంగా గుర్తించడంలో కూడా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించుకోవడంలో కూడా ఈ రెండు పార్టీలు వెనుకబడ్డాయి. పైగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల వ్యూహాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉదాహరణకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి సాధనను తన నినాదంగా తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రోలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటివి తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి సామాజిక న్యాయం వైపు దిశ మార్చి మహాపరివర్తనకు అదొక్కటే మార్గమని ఢంకా భజాయించింది. కానీ ఆ రెండు ఎన్నికల్లోనూ ఎస్పీ ఘోర వైఫల్యం చవిచూసింది. అదే సమయంలో బీఎస్పీ సైతం ముస్లిం ఓటర్లను గెల్చుకోవడానికి ప్రయత్నించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 100 టికెట్లను ముస్లింల పరం చేసింది. ఇది కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పార్టీ బ్రాహ్మణులను బుజ్జగించడం అనే ప్రయోగం చేస్తోంది. అంటే అభివృద్ది పంథా కానీ మండల్ శైలి రాజకీయాలు కానీ ఈ రెండు పార్టీలకు ప్రయోజనాలు కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. మరోవైపున బీజేపీ నిస్సందేహంగానే కుల ప్రాతిపదికన ఓటర్ల సమీకరణను పునర్నిర్వచించి, ఓబీసీల్లో కొన్ని సెక్షన్లను మరికొన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా నిలిపింది. ఇన్నాళ్లూ తమకు మద్దతు పలికిన వర్గాలను తిరిగి గెల్చుకునే ప్రయత్నం చేపట్టడానికి బదులుగా ఎస్పీ, బీఎస్పీలు తాజాగా బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడిపోయాయి. తమ రాజకీయాలకు కొత్తదనం తీసుకొచ్చే క్రమంలో ఈ రెండు పార్టీలు దళిత బహుజన రాజకీయాలు, సామాజిక న్యాయం, సెక్యులరిజం మౌలిక సూత్రాలకు భిన్న మార్గంలో పయనిస్తున్నాయి. అందుకే సామాజిక న్యాయం, ఉనికిలో ఉన్న కోటాలను అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించడం, కులాలవారీ జనగణనకు ప్రభుత్వ తిరస్కరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుపర్చడం వంటి అనేక కీలక సమస్యలపై ఈ రెండు పార్టీలు ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటాలను చేపట్టలేకపోయాయి. పైగా, అయోధ్యలో బీఎస్పీ నిర్వహించిన బ్రాహ్మణ్ సమ్మేళనం బీజేపీకీ, బీఎస్పీకి మధ్య తేడా లేకుండా చేసింది. ఆ సమ్మేళనంలో బీఎస్పీ ‘జై శ్రీరాం’ అని నినదించడమే కాకుండా పాలక బీజేపీ కంటే రామాలయాన్ని వేగంగా నిర్మిస్తానని శపథం చేసింది కూడా. యూపీలో ఇటీవలి సంవత్సరాల్లో కులపరమైన అత్యాచారాలు, అణచివేత పెరుగుతున్నప్పటికీ బీఎస్పీ తన మౌలిక విలువలతో రాజీపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. బిహార్‌లో ముస్లింలు మజ్లిస్ పార్టీ వైపు తరలిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పార్టీలు ఇకపై ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించడం కూడా సాధ్యం కాదు. పంకజ్ కుమార్ వ్యాసకర్త పీహెచ్‌డి స్కాలర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్,జేఎన్‌యూ -
బ్రాహ్మణ పూజారులకు వరాల జల్లు..!
కోల్‌కతా: బ్రాహ్మణ పూజారులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరాల జల్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ పూజారులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇల్లు కట్టించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 8,000 మంది సనాతన పేద బ్రాహ్మణ పూజారులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది(2021)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హామీపై మమత స్పందిస్తూ సనాతన బ్రాహ్మణులకు గతంలోనే కోల్‌గాట్‌లో భూకేటాయింపు చేశామని తెలిపారు. అయితే చాలా మంది పూజారులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా(నెలకు రూ.1,000తో పాటు ఉచిత ఇంటి హామీ) వారికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. హిందీ దినోత్సవ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక భాషకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోదని, అన్ని భాషలకు సమప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కాగా రాష్ర్రంలో హిందీ సాహిత్య అకాడమీతో పాటు దళిత సాహిత్య అకాడమీని స్థాపించనున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. (చదవండి: దుర్గా పూజ ఆరోపణలు.. స్పందించిన దీదీ) -
ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..
త్రిస్సూర్: కేరళలోని కుట్టుముక్కు మహదేవ దేవస్థానానికి చెందిన టాయిలెట్లలో ఒకటి బ్రాహ్మణులు మాత్రమే వినియోగించాలని రాసి ఉండటం కలకలం రేపింది. పురుషులు.. మహిళలు.. బ్రాహ్మణులు అంటూ మూడు బోర్డులతో మూడు టాయిలెట్లు ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ విషయం ఆలయ కమిటీ సభ్యుల వరకూ వెళ్లడంతో ఆ బోర్డును తొలగించి అర్చకులకు, ఉద్యోగులకు అని మార్చారు. దాదాపు 20 ఏళ్ల కిందట ఆ బోర్డు పెట్టారని, అది తమ నోటీసుకు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అనైతిక ఆచారాలకు ఆలయం, పాలకమండలి వ్యతిరేకమని స్థానిక వార్డు కౌన్సిలర్, సీపీఎం నేత కన్నన్ స్పష్టం చేశారు. మూడు బోర్డుల ఫొటోను సోషల్ మీడియాపై పోస్ట్ చేసిన వ్యక్తిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సమయంలో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. (చదవండి: ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం) -
మాటల మంటలు
కులం, మతం అనేవి మన సమాజంలో చాలా సున్నితమైన అంశాలు. వాటిపై మాట్లాడవలసి వచ్చినా, స్పందించవలసి వచ్చినా ఎవరైనా అత్యంత జాగురూకతతో మెలగడం తప్పనిసరి. రాజకీయ రంగంలో, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారైతే ఈ విషయంలో మరిన్ని రెట్లు మెల కువతో వ్యవహరించడం తప్పనిసరి. ఆ మాటలు కొంచెం అటూ ఇటూ అయినా... వేరే అర్థం స్ఫురి స్తున్నాయని అనిపించినా అలా మాట్లాడినవారికి మాత్రమే కాదు... మొత్తం సమాజానికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్తాన్‌లో సోమవారం జరిగిన అఖిల్ బ్రాహ్మణ్ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, ఆ తర్వాత చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ‘జన్మతః బ్రాహ్మణులు ఉత్కృష్టమైనవారని సమాజం భావిస్తుంద’ని ఆయన ఆ ట్వీట్లో చెప్పారు. వారి త్యాగం, తపస్సువల్ల వారు ఆ స్థాయికి చేరుకున్నారని, వారు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటున్నారని కూడా కొనియాడారు. సమాజంలో విద్య, విలువలు విస్తరించడంలో వారి పాత్ర ఉన్నదన్నారు. భిన్న సామాజికవర్గాలు సభలూ, సమావేశాలు నిర్వ హించుకోవడం, వాటికి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావడం ఇటీవలికాలంలో పెరి గింది. ఆ వర్గాల వెనకున్న ఓటు బ్యాంకు ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. అలా సభలకు హాజరయ్యే నేతలు సహజంగానే ఆ వర్గం గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. తమ వంతుగా ఆ సామాజిక వర్గానికి చేయదల్చుకున్నదేమిటో ప్రకటిస్తారు. అయితే ఆ క్రమంలో మాట్లాడే మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వారు గుర్తించాలి. ట్వీట్లో ఓంబిర్లా ప్రస్తావించిన ఇతర అంశాల మాటెలా ఉన్నా ‘జన్మతః వారు ఉత్కృష్ట మైనవార’ని అనడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పౌరుల కులం, మతం, ప్రాంతం, జెండర్ వగైరాల ఆధారంగా వివక్ష ప్రదర్శించకూడదని చెబుతోంది. ఒక సామాజికవర్గాన్ని ప్రశం సిస్తే, వారి కృషిని మెచ్చుకుంటే దాంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా అభ్యంతరపెట్టే వారుండరు. కానీ సమాజంలో అందరికంటే ఫలానా సామాజిక వర్గం ఉన్నతమైనదని చెప్పడ మంటే ఇతరులంతా వారితో పోలిస్తే తక్కువవారని ధ్వనించడమే అవుతుంది. ఇలా నోరు జార డంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబును చెప్పుకోవాలి. ఆయన నేరుగా దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని ప్రశ్నించి అందరినీ దిగ్భ్రాంతిపరిచారు. గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది నిరుడు ఏప్రిల్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీలు బ్రాహ్మణులేనని వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వివరణ నిచ్చారు. వర్తమాన పరిస్థితుల్లో కుల సమీకరణలు పెరిగాయి. ఒకప్పుడు సమాజంలో అణచివేతకు గురయ్యామనుకునే వర్గాలవారు తమ డిమాండ్ల సాధనకు ఏకమయ్యేవారు. తాము ఎదుర్కొం టున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టేవారు. ఆ వర్గాలవారు కొద్దో గొప్పో హక్కులు సాధించుకోగలిగా రంటే, తమ పట్ల సమాజంలో సాగుతున్న వివక్షను ఏమేరకైనా రూపుమాపగలిగారంటే అలా ఎలు గెత్తి చాటడం పర్యవసానంగానే. పాలకులుగా ఉన్నవారు భిన్న సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తమంత తాము గుర్తించి పరిష్కరించడం సాధ్యంకాదు. ఆయా వర్గాలు ముందుకొచ్చి తమ సమస్యలు చెప్పుకున్నప్పుడే పరిష్కారం దిశగా బలమైన అడుగులు పడతాయి. వ్యవసా యంలో సంక్షోభం ఏర్పడి అది అంతకంతకు పెరుగుతుండటం, అందులో ఉపాధి అవకాశాలు నానాటికీ అడుగంటడం, ఆర్థిక సంస్కరణల అనంతరం కులవృత్తులు దెబ్బతినడం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు మునుపటితో పోలిస్తే తగ్గుముఖం పట్టడం వంటివన్నీ ఇతర కులాల్లో సైతం అభద్రతాభావం ఏర్పరిచాయి. రిజర్వేషన్లు అందుకుంటున్న సామాజికవర్గాల్లో వాటిని వర్గీక రించాలన్న డిమాండ్లు ముందుకొచ్చాయి. గుజరాత్లో వ్యాపారాల్లో, చిన్న చిన్న కుటీరపరిశ్రమల్లో నిమగ్నమై ఉండే పటేళ్లు తమకు రిజర్వేషన్లు కావాలని నాలుగేళ్ల క్రితం ఉద్యమించారు. వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లతోనే భిన్న సామాజిక వర్గాలు రోడ్డెక్కాయి. జనరల్ కేటగిరిలో ఉండే కొన్ని కులాలు తమను బీసీలుగా గుర్తించాలని ఆందోళనలు చేస్తే, తమను ఎస్టీల్లో చేర్చాలని కొన్ని బీసీ కులాలు డిమాండ్ చేశాయి. నిజానికి ఈ పరిస్థితులను గుర్తించబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జనరల్ కేటగిరీలోని నిరుపేద వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. జనరల్ కేటగిరీలోని భిన్న సామాజిక వర్గాలు సమావేశాలు జరుపుకోవడం, తీర్మా నాలు చేయడం, ఆందోళనలకు దిగడం పర్యవసానంగానే ఈ కోటా నిర్ణయం వెలువడింది. ఓంబిర్లా సాధారణ రాజకీయవేత్త అయితే ఆయన చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో! కానీ ఆయన దేశంలోని అత్యున్నత చట్టసభలో స్పీకర్‌గా ఉన్నారు. కనుకనే ఇప్పుడింత వివాదం రేగింది. ఓంబిర్లా రాజకీయాలకు కొత్త కాదు. ఆయన 2003 నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కోట నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి పార్లమెంటులో ప్రవేశించారు. అంతక్రితం ఆయన ఆరెస్సెస్‌లో చురుగ్గా పనిచేసినవారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందినవారు. ఇప్పుడు స్పీకర్‌గా సమర్ధవంతంగా పనిచేస్తూ సభలో విపక్షాలనుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. గత నెలలో పార్లమెంటు సమా వేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతలు చేసిన ప్రసంగాలే ఇందుకు నిదర్శనం. అటువంటి నాయకుడు ఒకరి గురించి మంచిమాటలు చెబుతున్న ప్పుడు అవి వేరే అర్ధం స్ఫురిస్తున్నాయేమోనన్న మెలకువ ప్రదర్శించడం అవసరం. -
వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యలు
జైపూర్: ఓ కులానికి మద్దతుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ కులాలు, మతాలను ప్రోత్సహించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్‌లో కోటాలో మంగళవారం జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటా. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన ప్రసంగ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గుజరాత్ ఎమ్మెల్యే, ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేస్తూ.. ‘రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ ఇలా కులాలను ప్రోత్సహించడం సరికాదు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కులాలను పెంచిపోషిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై పౌరహక్కుల సంఘం కూడా స్పందించింది. స్పీకర్ వ్యవహారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. బాధ్యత గల పదవిలో ఉన్న బిర్లా ఇలా ఓ వర్గాన్ని పొగుడుతూ మాట్లాడం సరికాదని ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని పేర్కొంది. समाज में ब्राह्मणों का हमेशा से उच्च स्थान रहा है। यह स्थान उनकी त्याग, तपस्या का परिणाम है। यही वजह है कि ब्राह्मण समाज हमेशा से मार्गदर्शक की भूमिका में रहा है। pic.twitter.com/ZKcMYhhBt8 — Om Birla (@ombirlakota) September 8, 2019 -
అన్ని కులాలకు సంక్షేమ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఆనందకరమైన జీవితాన్ని అందించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరుస్తోందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్‌లో వివేకానంద విదేశీ విద్యాపథకం కింద ఎంపికైన విద్యార్థులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. విద్యార్థులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశాక, సభనుద్దేశించి ప్రసంగించారు. సరస్వతి ఉన్న దగ్గరే లక్ష్మి ఉంటుందని, సమా జంలో గౌరవం పొందే వ్యక్తులు విద్యావంతులు మాత్రమేనన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణ గడ్డపై నివసించే ప్రతీ వ్యక్తి సంతోషంగా జీవిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. బ్రాహ్మణ, జర్నలిస్టు, న్యాయవాదుల సంక్షేమానికి నిధులిచ్చిన ప్రభుత్వం మనదేనన్నారు. స్వచ్ఛ భారత్‌పై దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో సర్వే జరిగితే అందులో 6 తెలంగాణ జిల్లాలు ముందున్నాయన్నారు. పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని, పలు చట్టాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంద న్నారు. యాదాద్రి గుడిలో అద్భుతమైన కట్టడాలు జరుగుతున్నాయని, చరిత్రలో నిలిచి పోయే గుడి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వం పురోహితులకు ఆర్థిక సహాయం చేస్తుందని, అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులిస్తున్నామన్నారు. అనంతరం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి మాట్లాడుతూ వివేకానంద విద్యా పథకం కింద 54 మంది ఎంపికయ్యారని, వీరిలో అమెరికాకు 27 మంది, ఆస్ట్రేలియాకు 12, కెనడాకు 8, ఫ్రాన్స్‌కు ఒకరు, జర్మనీకి నలుగురు, యూకేకు ఇద్దరు వెళ్తున్నారన్నారు. వీరికి రూ.10.80 కోట్ల విలువైన మంజూరీ పత్రాలు ఇచ్చామన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా అమలయ్యే కార్యక్రమాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, వివిధ పథకాల కింద దరఖాస్తుకు సెప్టెంబర్ 20 వరకు అవకాశం ఉందన్నారు. విద్యాపథకం కింద లబ్ధిదారుకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు తక్కువగా వచ్చిన జిల్లాల నుంచి మరిన్ని స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మీ కాంతరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
నాడు స్వర్గం.. నేడు నరకం
సాక్షి, ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగం. ఆయన హయాంలో ప్రతిఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు అందాయి. అందులో భాగంగానే బ్రాహ్మణుల సంక్షేమానికి ఆయన పెద్ద పీట వేశారు. వారి కోసం 24 రకాల పథకాలను అమలు చేశారు. ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్రవ్యాప్తంగా 30 వేల దేవాలయాల్లో ప్రభుత్వ ఖర్చులతో ధూపదీప నైవేద్యం సేవలను అందుబాటులోకి తెచ్చారు. తద్వారా అర్చకులకు ఎంతో మేలు చేశారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు హయాంలో బ్రాహ్మణుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయాల అభివృద్ధిని సైతం నిర్లక్ష్యం చేయడంతో ఎన్నో ఆలయాలు పాడుబడిపోయాయి. వాటిపై ఆధారపడి జీవించే అర్చకులు అష్టకష్టాలకు గురయ్యారు. బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలూ అమలుచేయకపోవడంతో వారంతా సమాజంలో వెనుకబడ్డారు. ఆ తర్వాత వైఎస్సార్ స్వర్ణయుగంలో కోలుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో బ్రాహ్మణుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆలయాల గురించి ఆలోచించేవారే లేకపోవడంతో అర్చకుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశార్థకంగా మారిపోయింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం.. ఎంత కేటాయించిందో, వాటిని ఎవరు కాజేశారో, అర్హులకు ఎంత లబ్ధి చేకూరిందో చెప్పాలని బ్రాహ్మణ పెద్దలు డిమాండ్ చేస్తున్నా.. పాలకులు మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా బ్రాహ్మణులను మోసం చేసిన నేపథ్యంలో వారి పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేగాకుండా నలుగురు బ్రాహ్మణులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి ఆ సామాజికవర్గం పట్ల తనకున్న చిత్తశుద్ధిని జగన్ నిరూపించుకున్నారు. దీంతో బ్రాహ్మణులంతా హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. బ్రాహ్మణుల కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలివే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాహ్మణులు, అర్చకులు, అర్చకేతరుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. వాటిలో కొన్ని పూర్తిగా గ్రాంటు రూపంలో ఇవ్వగా, మరికొన్ని గ్రాంటుతో పాటు రుణంగా ఇచ్చారు. గ్రాంటు రూపంలో ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోగా, రుణాన్ని మాత్రం స్వల్ప వడ్డీతో నెలసరి వాయిదాలలో తిరిగి చెల్లించారు. ఆ వివరాలు... ♦ ఉపనయన గ్రాంటు కింద రూ.25 వేలు ♦ రూ.5 వేలలోపు ఆదాయం కలిగిన అర్చకుని కుటుంబంలోని పిల్లలకు విద్యారుణం కింద రూ.33 వేల గ్రాంటు. 60 నెలల్లో తిరిగి చెల్లించే సౌకర్యం. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన వైద్య విద్యార్థులకు, 5 వేలలోపు ర్యాంకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల చదువుకు, వసతి, భోజనం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది. రూ.5 వేల నుంచి రూ.12,500లోపు జీతం తీసుకుంటున్న వారికి రూ.33 వేలు వడ్డీలేని విద్యా రుణం. ♦ అర్చకుని కుమారుడు లేదా కుమార్తె వివాహం కోసం లక్ష రూపాయల రుణం. ♦ అర్చకుని సోదరి వివాహానికి రూ.60 వేల రుణం ♦ ఇల్లు కట్టుకునేందుకు రూ.2.50 లక్షల గ్రాంటు. 2015 ఏప్రిల్ 1 నుంచి రూ.2.50 లక్షల రుణం. ♦ ఇంటి మరమ్మతుల కోసం 4 శాతం వడ్డీకి లక్ష రూపాయల రుణం. ♦ 65 సంవత్సరాల వయసు దాటిన వారికి వృద్ధాప్యపు భృతిగా నెలకు రూ.1,500. ♦ 4 శాతం వడ్డీతో మోటారు సైకిల్‌కు రుణం. ♦ సొంతిల్లు లేని అర్చకునికి ఇంటి అద్దె, సామాజిక జీవిత బీమా పథకం కింద లక్ష రూపాయల వరకు పాలసీ. చంద్రబాబు హయాంలో బ్రాహ్మణులను మోసం చేసింది ఇలా... బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ప్రకటించినప్పటికీ కేటాయింపులు కేవలం రూ.230 కోట్లే. అందులోనూ రూ.15 కోట్లకుపైగా అవినీతి. బీఎస్సీ, బీఈడీ చేసిన యువతులు జీవనం కోసం మామిడికాయల కొట్టుపెట్టుకునేందుకు రుణం ఇస్తామన్నారు. వారు దరఖాస్తు చేయగా, టీడీపీ నేతలతో సంతకం పెట్టించుకుని వస్తే మంజూరు చేస్తామన్నారు. దీంతో వారు రుణ ప్రయత్నాలను విరమించుకున్నారు. ♦ ఓవర్సీస్ పథకం అంటూ ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. 2015–16 మొదలు 2018–19 వరకు రుణం మంజూరు చేసింది కేవలం ముగ్గురికే. ♦ గాయత్రీ పథకం కింద అకడమిక్ ఎక్సలెన్సీ కింద టాపర్‌గా నిలిచిన వారికి రూ.10 వేలు మొదలు రూ.20 వేల వరకు ఇవ్వాలి. కానీ మూడు సంవత్సరాలలో ప్రకటించింది 55 మందికి మాత్రమే. ♦ గ్రూప్–1 కోచింగ్‌లకు వశిష్ట స్కీము కింద సాయం అందించాలి. కానీ, నాలుగేళ్లలో 64 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా సాయం అందలేదు. ♦ ద్రోణాచార్య స్కిల్ డెవలప్మెంట్ కింద నాలుగేళ్లలో 23 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కరికీ సాయం అందలేదు. ♦ చాణుక్య పథకం కింద ఇ–ఆటోలు, టాక్సీలు కొనుగోలు చేసుకునేందుకు రుణం అందించాలి. వాటికి 869 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 185 మందికే మంజూరు చేశారు. ♦ కశ్యప పథకం కింద 1,186 మంది అనాథలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు దరఖాస్తు చేసుకోగా, 850 మందికే ఇస్తున్నారు. వీరికి పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ♦ గరుఢ అంత్యక్రియలకు సంబంధించి 129 మందికి మాత్రమే ఇచ్చారు. శివార్చకులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో బ్రాహ్మణ డిక్లరేషన్ అంశాలలో శివార్చకులను బీసీ డీగా చేస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటికీ వారిని పట్టించుకోకుండా మోసం చేశారు. చంద్రబాబు మోసానికి ప్రస్తుత ఎన్నికల్లో శివార్చకులు, బ్రాహ్మణులు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. - వైఎస్సార్ సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యుడు రెంటచింతల మధుసూదనశర్మ, మార్కాపురం వైఎస్సార్ హయాంలోనే ధూపదీప నైవేద్యాలు ప్రారంభం ఆలయాల్లో ప్రస్తుతం సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ధూపదీప నైవేద్య కార్యక్రమాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారు. అలాగే ఉపనయనం, ఇంట్లో పెళ్లి ఖర్చులకు సాయం చేసేవారు. ప్రస్తుతం ఆ విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్ పలు హామీలివ్వడం ఆనందంగా ఉంది. – శ్రీనివాస దీక్షితులు బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్ హామీ అభినందనీయం బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో హామీలు ఇవ్వడం అభినందనీయం. బ్రాహ్మణుల కార్పొరేషన్‌కు చట్టబద్ధత, రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని జగన్‌ను కోరగా, సానుకూలంగా స్పందించడం హర్షనీయం. ప్రస్తుత ప్రభుత్వంతో కార్పొరేషన్ పథకాలకు చెందిన నిధులు కూడా బ్రాహ్మణులకు రాకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయి. - కె.వి.రవికిరణ్‌శర్మ, అర్చక, పురోహిత విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, బొట్లగూడూరు జీవో నంబర్ 76 అమలు చేయాలి వైఎస్సార్ పాలనలో జీవో నంబర్ 76 ఇవ్వడం ద్వారా వంశపారంపర్యంగా ఆలయాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించాయి. దానిని అమలుచేయాలంటూ టీడీపీ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. ధూపదీప నైవేద్యాలను కూడా కొన్ని ఆలయాలకే పరిమితం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించడం హర్షణీయం. - డాక్టర్ జి.శ్రీనివాసమూర్తి -
నీకేందుకు ఓటేయ్యాలి చంద్రబాబు?
విజయనగరం మున్సిపాలిటీ: బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీకే ఈ ఎన్నికల్లో తమ మద్దతని బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ తెలిపారు. గురువారం విజయనగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి.. ఎన్నికల మేనిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో బ్రాహ్మణులకు ఏం చేశారని ఓటేయ్యాలని ప్రశ్నించారు. 1984 టీడీపీ ఆవిర్భావం తరువాత వంశపారపర్య అర్చకత్వాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు. రూ.2,000 కోట్ల ఆస్తులున్న అగ్రిగోల్డ్ సంస్థను దివాలా తీయించిన ఘనత చంద్రబాబుకు, అతని కుమారుడు లోకేష్‌కు దక్కుతుందన్నారు. బతకటానికి ఇబ్బందులు పడుతున్న తొమ్మిది మంది అర్చకులు ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక్కరికైనా ఆర్థిక సాయం చేయలేదన్నారు వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ మతాలు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. వైఎస్ జగన్ బ్రాహ్మణులకు కొన్ని స్థానాలు కేటాయించారని ఆ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘం నేతలు కె.పి.ఈశ్వర్, భారద్వాజ చక్రవర్తి, చంద్రశేఖర్ శర్మ, మంగిపూడి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు ఇబ్బందులు’
అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బ్రాహ్మణ అధ్యయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణ సమస్యలపై వైఎస్ జగన్, అధ్యయన కమిటీ వేయడం హర్షణీయమన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల కోసం రూ.1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులను బాబు ఆదుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పేరు చెప్పి టీడీపీ కార్యకర్తలకు లోన్లు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు ఆరోపించారు. బాబు హయాంలో బీసీలకు అన్యాయం: నరసయ్య గౌడ్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ అధ్యయన కమిటీ సభ్యులు నరసయ్యగౌడ్ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఆరు పేజీల హామీలిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయలను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చినట్లు ప్రకటించారే గానీ చట్టబద్ధత కల్పించలేదని వ్యాఖ్యానించారు. బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు నరసయ్య గౌడ్ తెలిపారు. -
‘ఆరుట్ల’ జంట..ఇండిపెండెంట్ల పంట
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు మొదటిసారిగా 1962లో జరిగాయి. తెలంగాణలో మొత్తం 106 శాసనసభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది. అంతకుముందు కాస్త బలంగా కనిపించిన కమ్యూనిస్టులు బాగా దెబ్బతిని పదిహేను స్థానాలకు పడిపోయారు. కొత్తగా వచ్చిన స్వతంత్ర పార్టీ మూడు సీట్లు, సోషలిస్టులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లు పందొమ్మిది మంది గెలిచారు. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని బలమైన అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలిచిన సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే రెడ్లు అత్యధికంగా 41 మంది గెలిస్తే ఆ తర్వాత బ్రాహ్మణులు పన్నెండు మంది గెలిచారు. రెడ్లు క్రమేపీ రాజకీయంగా పుంజుకుంటే బ్రాహ్మణులు వెనుకబడి పోయారు. కాగా బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఈసారి పన్నెండు మంది బీసీ నేతలు ఎన్నికయ్యారు. వారిలో మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు ముగ్గురు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, గౌడ ఇద్దరు, యాదవ ఒకరు, పద్మశాలి ఒకరు, ఉప్పర ఒకరు, కురుమ ఒకరు గెలిచారు. వెలమ సామాజిక వర్గం నుంచి ఏడుగురు, ముస్లింలు ఏడుగురు గెలుపొందారు. ఎస్సీలలో పద్దెనిమిది మంది రిజర్వుడ్ స్థానాలలో గెలిస్తే, ఒకరు జనరల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైశ్యులు ముగ్గురు గెలిచారు. కమ్మ సామాజికవర్గం వారు ఇద్దరు గెలిచారు. ఎస్టీ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా 19 మంది గెలుపొందడం ఈ ఎన్నికల్లో గమనించదగిన పరిణామం. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్ నుంచి ఇరవై ఒక్కమంది గెలిస్తే సీపీఐ పక్షాన ఏడుగురు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు నల్లగొండ నుంచి గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా పది మంది గెలుపొందారు. ఆ రోజులలో పార్టీలతో పాటు వ్యక్తుల ప్రభావం ఎక్కువగానే ఉండేది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులలో మర్రి చెన్నారెడ్డి, టీ.అంజయ్య, పీ.నర్సారెడ్డి, జీ.సంజీవరెడ్డి, సీ.మాధవరెడ్డి, ఎమ్.బాగారెడ్డి, పీ.రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఎం.రాంగోపాల్‌రెడ్డి రెండుచోట్లా ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. సీపీఐ నుంచి గెలిచిన ప్రముఖులలో విఠల్‌రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కె.రామచంద్రారెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి నుంచి గెలిస్తే, ఆయన సతీమణి కమలాదేవి ఆలేరు నుంచి విజయం సాధించి, ఉమ్మడి శాసనసభలో ప్రవేశించిన తొలి దంపతుల జంటగా రికార్డు నెలకొల్పారు. ఇంకా సంయుక్త సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర పార్టీ నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గీయులు నాటి ఎన్నికల్లో గెలుపొందారు. పెరిగిన వెలమల ప్రాతినిధ్యం ఈ ఎన్నికల్లో వెలమ సామాజికవర్గం నుంచి ఏడుగురు గెలిస్తే వారిలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు, సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంటుగా ఒకరు నెగ్గారు. గెలిచిన ప్రముఖులలో జలగం వెంగళరావు, జేవీ నరసింగరావు, ఎన్.యతిరాజారావు ప్రభృతులు ఉన్నారు. 1952 నుంచి పరిశీలిస్తే.. వెలమ సామాజిక వర్గం నుంచి చట్టసభలకు ఎన్నికయ్యే వారి సంఖ్య స్వల్పంగానైనా పెరుగుతుండటం గమనించవచ్చు. పట్టుపెంచిన బీసీలు వెనుకబడిన తరగతులకు ఈ ఎన్నికలలో ప్రాధాన్యం పెరిగిందని చెప్పాలి. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది, సీపీఐ నుంచి ముగ్గురు, ఇండిపెండెంటుగా ఒకరు ఎన్నికయ్యారు. ఈ వర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ప్రముఖులలో జి.రాజారాం, ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్య, కళ్యాణి రామచంద్రరావు ఉండగా, సీపీఐ నుంచి బి.ధర్మబిక్షం గెలుపొందారు. కాగా మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాల నుంచి ఎక్కువ మంది గెలవడం విశేషం. ఎస్సీలు.. ఇతరులు.. షెడ్యూల్ కులాల వారు 19 మంది గెలవగా, వారిలో ఒకరు జనరల్ స్థానం నుంచి విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందనే చెప్పాలి. 16 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే, కేవలం రెండుచోట్లే సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్. కాంగ్రెస్ ప్రముఖులలో కోదాటి రాజమల్లు, టీఎన్ సదాలక్ష్మి, సిలారపు రాజనరసింహ, అరిగే రామస్వామి, పి.మహేంద్రనాథ్, సుమిత్రాదేవి ప్రభృతులు ఉన్నారు. ఇంకా ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులలో.. సీపీఐ ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్ ఖమ్మం నుంచి గెలుపొందారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వైశ్యులు ముగ్గురు గెలిస్తే వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. అందులో కొత్తూరు సీతయ్య గుప్తా ముఖ్యులని చెప్పాలి. ఎస్టీలు ఇద్దరు కాంగ్రెస్ నుంచి విజయం సాధించగా కె.భీమ్రావు సీనియర్ నేత. పార్శీ వర్గం నుంచి రోడా మిస్త్రి జూబ్లిహిల్స్ నియోకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. మజ్లిస్‌కు బీజం.. ముస్లింలు ఏడుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన ఐదుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఇండిపెండెంటుగా మరొకరు ఎన్నికయ్యారు. హైదరాబాద్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకుని మజ్లిస్ పార్టీని విజయపథంలోకి తీసుకువచ్చిన సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా ఫత్తర్‌గట్టి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో పాతబస్తీలో అత్యధికంగా కాంగ్రెస్ నేతలే గెలుస్తుండేవారు. ఎంఐఎంకి ఈ ఎన్నికలలోనే బీజం పడిందని చెప్పవచ్చు. ఇక, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ముస్లిం ప్రముఖులలో ఎమ్.ఎమ్.హషీం, కమాలుద్దీన్ అహ్మద్ ఉన్నారు. ‘వందేమాతరం’ అంటే అందరికీ దడే.. 1962 ఎన్నికలలో బ్రాహ్మణులు 12 మంది గెలిస్తే, కాంగ్రెస్ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరు, స్వతంత్ర పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు 4గురు గెలిచారు. కాంగ్రెస్ ప్రముఖులలో పీవీ, లక్ష్మీకాంతరావు, వాసుదేవ కృష్ణాజీ నాయక్, అక్కిరాజు వాసుదేవరావు, హయగ్రీవాచారి ఉన్నారు. సీపీఐ నుంచి గెలిచిన ప్రముఖుల్లో కేఎల్ నర్సింహారావు, పర్సా సత్యనారాయణ ఉన్నారు. ఇండిపెండెంట్లలో వందేమాతరం రామచంద్రరావు పేరెన్నిక గన్నవారు. ఈయన కాంగ్రెస్ నేతలను గడగడలాడించేవారు. ఎన్నికల పిటిషన్లు వేయడంలో, వారిని అనర్హులను చేయించడంలో దిట్టగా నాటి రోజుల్లో పేరొందారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
ట్విటర్ సీఈవోపై భగ్గుమన్న బ్రాహ్మణులు
న్యూఢిల్లీ : ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్ తన ట్విటర్ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. ట్విటర్ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్.. జాక్ డోర్సీ కావాలని ఆ పోస్టర్ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు.. ఆ పోస్టర్‌ను ఆఫర్ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. -
నమ్మిన సిద్ధాంతం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారు
-
పూజారులు వెలివేశారు.. భార్య వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: ‘నేను బ్రాహ్మణుడిని.. నా తండ్రి వైజాగ్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేసేవారు. ఆ సమయంలో నేను బ్రాహ్మణులపై రాసిన పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణసమాజం నన్ను వెలివేసింది. అప్పటి నుంచి మానసిక క్షోభకు గురయ్యాను. వ్యవస్థపై కక్ష పెంచుకున్నాను. అందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని ఎత్తుకెళ్లా. నాలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కసితోనే ఇలా చేస్తున్నాను’ అని ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లు, శఠగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన ప్రముఖ సినీ గేయరచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ పేర్కొన్నారు. చోరీ కేసులో అరెస్టైన కులశేఖర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా, సింహాచలం బృందావన్‌కాలనీకి చెందిన కులశేఖర్ నగరంలోని మోతీనగర్‌లో అద్దెకుంటున్నాడు. ఒకవైపు బ్రాహ్మణ సమాజం వెలివేయగా మరో వైపు కట్టుకున్న భార్య కూడా అతడిని వదిలేసి పిల్లలతో సహా వెళ్లిపోయింది. దీంతో తాను పిచ్చివాడినయ్యానని చెప్పుకొచ్చాడు. తరచూ పోలీసులకు చిక్కుతున్నా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా అది మరింత పెరుగుతున్నట్లు తెలిపాడు. ప్రముఖ సినీ గేయ రచయితగా గుర్తింపు పొందిన కులశేఖర్ వంద సినిమాలకు పాటలు రాశాడు. అందులో 50 శాతం సూపర్ హిట్ కావడం విశేషం. రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినా అతని వైఖరిలో మార్పు రాలేదు. 2008 నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే కాకుండా తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బ్రాహ్మణులకు ఆర్థిక,రాజకీయ సాధికారత లేదు
సాక్షి, విశాఖపట్నం: బ్రాహ్మణులు పేరుకు ఉన్నత సామాజిక వర్గమే అయినప్పటికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారిత లేదు. గడిచిన 50 – 60 ఏళ్లలో ఏదైనా వర్గం బాగా నష్టపోయిందంటే అది బ్రాహ్మణ జాతే. బ్రాహ్మణుల్లో ఎంట్రప్రెన్యూర్స్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్‌పై ఆధారపడతారు. ఇప్పుడు వాళ్లకు ఆ అవకాశాలు కూడా లేవు. టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. రామాలయంలో పనిచేసే అర్చకుడు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఆరోజు ఆయన ఇంట్లో పరిస్థితి చూస్తే జాలేసింది. ఈ ఘటనతోనే అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రపోజల్ పెట్టా. దేవాలయాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చేలా చూశాం. ప్రధాన అర్చకులకు రూ.50 వేలు పెట్టాం. ఆ రోజు ఇప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సపోర్టు చేశారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాలకు నిధులు ఇచ్చి తద్వారా ఆ అర్చకులనూ ఆదుకోవాలి. ఇందుకోసం ఆనాడు నేను తీసుకొచ్చిన జీవో 76ను ఒక లెవల్‌కు తీసుకొచ్చాక ఆగిపోయింది. ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి : అర్చకుల పేరిట ఉన్న సర్వీస్ ఈనాం ల్యాండ్స్, దేవుని పేరిట ఉన్న ల్యాండ్స్‌ను కాపాడాలి. ఇదే ఆలోచనతో కార్పొరేషన్లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశాను. రిటైర్డ్ ఎస్పీ, రిటైర్డ్ ఆర్డీవోను, ఒక ఎక్స్పర్ట్ లీడర్‌ను పెట్టాను. గుడవర్తి పద్మావతి కేసులో ఈ కమిటీ పర్ఫెక్ట్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టారని కేసు పెడతారా..? ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అర్చక వృత్తిలో బ్రాహ్మణులొక్కరే కాదు.. ఇతర కులాల వారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి. ట్రస్ట్ బోర్డులను ధార్మికచింతన ఉన్న వారికే అప్పగించాలి. 2007లో స్థానికంగా ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయడం, అర్చకులకు వారసత్వ హక్కులు పునరుద్ధరించేందుకు రాజశేఖరరెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ సాధికారత లేకపోవడం వలన చాలా నష్టపోతున్నాం. మా జనాభా మూడు శాతం ఉందనుకున్నా ఏడుగురు ఎమ్మెల్యేలుండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్‌లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీ వారికి అవకాశాలు కల్పించాలి. చివరగా.. పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా. నేను పార్టీలోకి చేరడానికి ఇక్కడకు రాలేదు..నా వ్యూస్‌ను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చా. – ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
అర్చక హక్కు
-
షార్ట్‌ఫిల్మ్‌లో బ్రాహ్మణులను కించపరిచారు