break
-
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
పేదలపై పిడుగు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషాతో ఏపీ స్పెషాలిటీ హాస్పటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్ల బకాయిలకు 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషా.. మరో రూ.300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. -
‘కొంత విరామం కావాలి’
పారిస్: భారత్ తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు దురదృష్టవశాత్తూ ఆ ఘనతను అందుకోలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ఆలోచనల గురించి సింధు వెల్లడించింది. తాజా ఓటమితో చాలా బాధపడుతున్నానన్న ఆమె... మరో చర్చకు తావు లేకుండా ఆటలో కొనసాగుతానని స్పష్టం చేసింది. అయితే శారీరకంగా, మానసికంగా కాస్త విరామం కోరుకుంటున్నానని పేర్కొంది. 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేసింది. ‘పారిస్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. కానీ ఓటమి బాధించింది. ఈ పరాజయం నా జీవితంలో చాలా కఠినమైంది. దీని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే జీవితం ఆగిపోదు. మళ్లీ కొనసాగాల్సిందే. పారిస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎంతో పోరాడాను. గత రెండేళ్లు గాయాలతో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాను. ఈ సవాళ్లను అధిగమించి నా దేశం తరఫున మూడో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం రావడం గొప్పగా అనిపించింది. ఈ స్థాయిలో ఆడటం, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవగలగడం నా అదృష్టం. నేను విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాను కాబట్టి ఎలాంటి చింత లేదు. ఇప్పుడు అభిమానుల మెసేజ్‌లు నాకు ఊరటనందిస్తున్నాయి. నా భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆటలో ఇంకా కొనసాగుతా. అయితే కొంత విరామం తీసుకుంటాను. నా శరీరానికి, మనసుకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. రాబోయే రోజుల కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంటా. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడే ఆటలోనే నాకు ఆనందం దక్కుతుంది’ అని సింధు తన మనసులో భావాన్ని వ్యక్తపర్చింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్‌ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన..
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ, మైనారిటీ బంధు కొందరికే.. జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు. ‘గృహలక్ష్మి’పై సందిగ్ధం.. సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. -
కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?
టాలీవుడ్లో శ్రీలీల ట్రెండ్ కొనసాగుతుంది. 2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యూటీ 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో పాటు గ్లామర్ షోతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఇంకేముంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. రవితేజతో కలిసి చేసిన 'ధమాకా' చిత్రం తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!) ప్రస్తుతం టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఈ కన్నడ బ్యూటీనే ఫస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకు కూడా ఆమెను తీసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఆమెకు ఉన్న క్రేజ్‌నే అని చెప్పవచ్చు. శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా తన కోసం రెడీగా ఉన్నాయి. ఈ బ్యూటీ సిగ్నల్ ఇస్తే అవి కూడా ఖారారు అవుతాయి. రాబోయే రెండేళ్ల వరకూ ఆమె డేట్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) పవన్ కల్యాణ్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా పలు భారీ ఆఫర్లతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె రెండు నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని షాకింగ్ డెషిషన్ తీసుకుందట. నవంబర్ నుంచి జనవరి వరకు ఎప్పుడైనా ఈ బ్రేక్ తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో తన చదువు కూడా పూర్తి అవుతుందట. తాజాగ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ రావడంతో ప్రిపరేషన్ కొనసాగించాలని నిర్ణయానికి శ్రీలీల వచ్చారట. ఆమె సూచన మేరకు టాలీవుడ్ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. -
కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్! ఏంటంటే ఇది..!
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్‌లు ఉంటాయి. అది కామన్‌గా అన్ని ఆఫీసుల్లోనూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కూడా. కానీ ఇక నుంచి వాటి తోపాటు వై బ్రేక్ ఉంటుందట. ఆ..! ఏంటి ఇది అనుకోకండి. అంటే విరామ సమయాన్ని తగ్గించేందుకు ఇలా యజమాన్యం చేస్తుందా అని డౌట్ పడోద్దు. ఎందుకంటే? ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనట. అసలేం జరిగిందంటే..భారతదేశంలో మిలియన్ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని ఓ సర్వేలో తేలింది. కొందరూ ఉద్యోగాలు ఆఫీస్‌లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంతవరకు అధికారులు సర్వేలు చేయడం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయడమే చేశారు అందరూ. కానీ ఇప్పుడూ సీరియస్‌గా తీసుకుని అందుకోసం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యాయి పలు సంస్థలు, ప్రభుత్వాలు. ఈ మేరకు గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్' అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో 'యోగా'ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేసి పని చేయగలిగే సామర్థ్యం పెంచుకునే ఓ సువర్ణావకాశాన్ని ఉద్యోగులు కల్పించేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే ఈ 'వై' బ్రేక్‌ని కార్యాలయాల్లోకి తీసుకురానుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్‌లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్‌గా తయారవ్వతారని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు హ్యుమన్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్ మార్కస్ రాన్నీ ఈ విధానాన్ని స్వాగతించారు. ఆయన ఈ విధానం వల్ల ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్‌గా ఉండేదుకు దోహదపడుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుంది. అలాగే భావోద్వేగ ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఇందులో చేసే '"బ్రీథింగ్ ఎక్స్‌ర్‌సైజ్"లు కారణంగా.. లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుంది. అలాగే ఉద్యోగుల ధ్యాస వేరేవాటిపైకి పోకుండా ప్రస్తుత పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది యోగా. తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, సమస్యలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ 'వై బ్రేక్'ని కార్యాలయాల్లోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు ఫిట్‌గా ఉండి పని బాగా చేస్తారు. లీవ్ పెట్టే వాళ్ల సంఖ్య తగ్గిపోయి, పని సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా సంస్థ మంచి లాభాలను ఆర్జించగలదని అన్నారు. అలాగే జర్నల్ ఆప్ ఆక్యుపేషనల్ హెల్త్‌కి సంబంధించిన ఆరోగ్య నిపుణులు కూడా ఈ యోగా ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానిసింగ్ స్ట్రాంగ్ చేయగలదన్నారు. తాము జరిపిన అధ్యయనాల్లో ఆ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. దీన్ని క్షేత్ర స్థాయిలో అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హుడ్జ్ వ్యవస్థాపకుడు మార్కస్ చెప్పడం గమనార్హం. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్!
పాన్ ఇండియా మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెంట్, జులై మొదటి వారంలో డెలివరీ ఉంటుందని డాక్టర్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వివాహం తర్వాత దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం!) బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఉపాసన పూర్తిగా వైద్యుల వర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) -
'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. షాకింగ్ నిర్ణయం! అయితే తాజాగా కాజోల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది బాలీవుడ్ భామ. 'నా జీవితంలో చాలా కష్టమైన పరీక్షను ఎదుర్కొబోతున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాలో తన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చేసిన పోస్ట్ మాత్రమే తన ఖాతాలో కనిపిస్తోంది. కాగా.. కాజోల్కు దాదాపు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కారణాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) ప్రచారం కోసమేనా? కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆమె రాబోయే వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' కోసం ఇదంతా ప్రచార వ్యూహమని భావిస్తున్నారు. 'ది గుడ్ వైఫ్ - ప్యార్, కానూన్, ధోకా' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్రను పోషించింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. కాగా.. 2016లో అమెరికాలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటించారు. కాజోల్కు మద్దతు అయితే కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి చేస్తుందని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ మీ జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నెటిజన్స్ కాజోల్కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ నిర్ణయంతో ఇకపై మీ అందమైన పోస్టులను కోల్పోతామని కొందరు ఫీలవుతుండగా.. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్) కాగా.. కాజోల్ త్వరలోనే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెటిఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే నటించారు. ఈనెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
ఆర్టీసీలో బ్రేక్ జర్నీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన బ్రేక్ జర్నీ సదుపాయం ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు మారిన ప్రతిసారి టిక్కెట్టును తీసుకునే వారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా మల్టీ సిటీ టిక్కెటింగ్ సౌలభ్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఏదైనా పట్టణం నుంచి దూర ప్రాంతంలో ఉన్న మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లడానికి నేరుగా బస్సు సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి వారు తాము వెళ్లేబోయే ప్రాంతానికి ఎక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందో అక్కడికి చేరుకోవాల్సి ఉండేది. ఇకపై తాము బయలుదేరే చోటునుంచే వెళ్లే గమ్యస్థానానికి ఆన్లైన్ ద్వారా ఒకేసారి నేరుగా టిక్కెట్‌ను పొందవచ్చు. ఉదాహరణకు కడప నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే డైరెక్టర్‌గా ఆర్టీసీ సర్వీసు లేదు. విశాఖపట్టణం ఒక బస్సులో వచ్చి శ్రీకాకుళం వెళ్లాలంటే మరో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంది. అంతేకాకుండా వీరు ఎక్కిన ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే ఈ మల్టీ సిటీ టిక్కెటింగ్ విధానంలో తాము వెళ్లే బస్సులో ఒకే రిజర్వేషన్ చార్జితో ప్రయాణించే వీలు కల్పించారు. మారే బస్సులోనూ ముందుగానే సీటు రిజర్వు అయి ఉంటుంది. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బ్రేక్ జర్నీ సదుపాయాన్ని కల్పించారు. తాము వెళ్లే బస్సుకోసం 2 గంటల నుంచి 22 గంటల వరకు వేచి ఉన్న బ్రేక్ జర్నీలో ఆ టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ముందు వెళ్లే వారి బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా మరమ్మతుకు గురైతే ఆ ప్రయాణీకుడిని మరో బస్సులో వెంటనే పంపించి ప్రయాణానికి ఆటంకం లేకుండా చూస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమలోని 8 జిల్లాల నుంచి విశాఖ పట్టణం మినహా ఇతర దూర ప్రాంతాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్టీ సిటీ టిక్కెటింగ్ (బ్రేక్ జర్నీ) సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ప్రచారం నిర్వహిస్తున్నాం ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన మల్టీ సిటీ టిక్కెటింగ్ సదుపాయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నాం. టిక్కెట్ కౌంటర్లలోనూ ఈ విషయం తెలియజేస్తున్నాం. అక్కడక్కడ పోస్టర్లను కూడా ప్రదర్శించనున్నాం. ఈ కొత్త విధానంలో బ్రేక్ జర్నీకి వీలు కల్పిస్తున్నాం. కడప జోన్ వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె. పుట్టపర్తి, అనంతపురం, హిందూపురం డిపోల నుంచి బ్రేక్ జర్నీ సదుపాయం కల్పిస్తున్నాం. – గోపినాథ్‌రెడ్డి, కడపజోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిరుద్యోగులు సవాల్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో వచ్చిన జీవో 18లను రద్దు కోరుతూ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం రెగ్యులరైజ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చన్న హైకోర్టు.. రెగ్యులర్ పోస్టింగ్ ఆర్డర్స్ ను ఎవరికి ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? -
షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు మాంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్ గతేడాది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్ అనే సినిమాను చేశారు. ప్రస్తుతం మహావీరన్ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ట్విటర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్డేట్స్ నా టీమ్ షేర్ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ బ్రేక్ ఎందుకన్నది మాత్రం ఆయన రివీల్ చేయలేదు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ My dear brothers and sisters, I am taking a break from twitter for a while. Take care, and i will be back soon 👍😊 P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023 -
సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ సంచలన నిర్ణయం!
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈగతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇటీవల కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణతో ప్రేక్షకులను అలరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రం అభిమానుల అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల సుదీప్ నటించిన కబ్జ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ నోట్ విడుదల చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కిచ్చా సుదీప్ నోట్లో రాస్తూ.. ' హాయ్ ఫ్రెండ్స్. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్నా. ప్రస్తుతం నేను స్వల్ప విరామం తీసుకుంటున్నా. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకున్నా. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. సీసీఎల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున మ్యాచులు ఆస్వాదించా. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్డేట్స్తో మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. About my Next ❤️🥂 pic.twitter.com/3vkCmS6FBF — Kichcha Sudeepa (@KicchaSudeep) April 2, 2023 -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె అక్కడ వరుస ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ పలు సినిమాకు సంతకం చేసింది. వీటితో పాటు ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఒకే చెప్పింది. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు క్యూలో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్ వరుసగా పలు చిత్రాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. బాలీవుడ్ సినిమాల విషయంలో సామ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖషి సినిమా తర్వాత ఆమె నటనకు, షూటింగ్‌లకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోందట. ఇదే విషయాన్ని తను సంతకం చేసిన మూవీ నిర్మాతలకు చెప్పిందట. సమంత నిర్ణయాన్ని బాలీవుడ్ నిర్మాతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సామ్ సంతకం చేసిన బాలీవుడ్ చిత్రాల నిర్మాతలు సినిమా ఆలస్యం అయితే తమకు నష్టమని, మిగతా నటీనటుల కాల్షిట్ దృష్ట్యా కూడా సమంత నిర్ణయాన్ని వారు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సామ్ ఆ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు ఫైనలిస్ట్‌గా కీర్తి.. ఆమె 15 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే! -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి సబ్స్క్రిప్షన్ ఆధారిత 'బ్లూ వెరిఫికేషన్' ప్లాన్‌ను మరోసారి వాయిదా వేసుకున్నారు. తాజాగా 'బ్లూ వెరిఫైడ్' బ్యాడ్జ్ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్‌ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపుపై పూర్తి విశ్వాసం వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు. అలాగే వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్‌లో వెరిఫికేషన్ ఉంటే బావుంటుందేమో అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ప్పుడు రీలాంచ్ చేసేదీ ప్రకటించ లేదు. మరోవైపు గత వారంలో 1.6 మిలియన్ల యూజర్లను ట్విటర్ సాధించిందనీ, ఇది "మరో ఆల్ టైమ్ హై" అని మస్క్ ట్వీట్ చేశారు. కాగా నెలకు 8 డాలర్లు బ్లూటిక్‌ను ఫీజును ప్రకటించిన మస్క్ నకిలీ ఖాతాల బెడద కారణంగా దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత నవంబరు 29 నుంచి పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు. కానీ దీని మరోసారి బ్రేకులు వేయడం గమనార్హం. Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation. Will probably use different color check for organizations than individuals. — Elon Musk (@elonmusk) November 22, 2022 Twitter added 1.6M daily active users this past week, another all-time high pic.twitter.com/Si3cRYnvyD — Elon Musk (@elonmusk) November 22, 2022 -
షాకింగ్ నిర్ణయం తీసుకున్న వెంకటేశ్.. సినిమాలకు బ్రేక్?
విక్టరీ వెంకటేశ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవలె విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ ప్రస్తుతం కొత్త కథలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలో కొంతకాలం వరకు ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. మొదటి నుంచి వెంకటేశ్‌కు ఆధ్యాత్మికత ఎక్కువే. ఈ కారణంగానే ఆయన కొన్ని రోజుల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారట. విరామం తర్వాత కొత్త సినిమాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. రాష్ట్రంలో తొలిరోజు 4 కిలోమీటర్ల పాదయాత్రతో ముగించారు రాహుల్ గాంధీ. ఈనెల 26వ తేదీ వరకు జోడో యాత్రకు విరామం ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీకి పయణమయ్యారు రాహుల్. ఈనెల 27న రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు రాహుల్ గాంధీ. దేశ సమైక్యత కోసమే భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నాయని ఆరోపించారు. దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరివెళ్లినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 26న ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి మక్తల్ చేరుకుంటారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను పున: ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..