cbi enquiry
-
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
ఐఎంజీ భూములపై సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, సాక్షి: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు భూముల అక్రమ కేటాయింపుపై విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఐఎంజీకి కేటాయించిన భూములపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలు జరిగినట్లు సరైన అధారాలు లేవని హైకోర్టు తేల్చింది. 2004కు ముందే ఐఎంజీకి 850 ఎకరాలు భూమి కేటాయించినట్లు తెలిపింది.సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన విచారణలో.. ఐఎంజీ భూముల ఆక్రమ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసిట్లు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించింది.‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సందేశ్‌ఖాలీ కేసు: మమత సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
కోల్‌కతా: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని తప్పుపడుతూ మమత సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(జులై 8) కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరినో కాపాడటానికి ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మొత్తం నిరుత్సాహపరిచిందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వారి భూములు కబ్జా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలతో అక్కడి మహిళలు ఒక ఉద్యమాన్నే నడిపారు. దీంతో షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ.. ‘లిక్కర్ స్కామ్ అనేదే లేదు’
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. అనంతరం, కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీబీఐ దాదాపు 9 గంటల పాటు నన్ను ప్రశ్నించింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మద్యం కుంభకోణంలో అన్ని తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు. ఆప్ 'కత్తర్ ఇమాందార్ పార్టీ'. ఆప్‌ని అంతం చేయాలనుకుంటున్నారు. కానీ, దేశ ప్రజలు మాతోనే ఉన్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదన్నారు కేజ్రీవాల్. కావాలనే ఇదంతా చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ స్కామ్ అనేది కేవలం కల్పితం మాత్రమేనని కేజ్రీవాల్ అన్నారు. అయితే, లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్పీసీ 161 కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. లిఖితపూర్వకంగా కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు సీబీఐ అధికారులు. కాగా, విచారణ సందర్బంగా మద్యం పాలసీ రూపకల్పన, సౌత్‌గేట్‌కు ప్రయోజనంపై ఆరా తీసినట్టు సమాచారం. Delhi | CBI questioning was conducted for 9.5 hours. I answered all the questions. The entire alleged liquor scam is false and bad politics. AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/dMG5C1TMGb — ANI (@ANI) April 16, 2023 అంతకుముందు.. కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. Delhi CM Arvind Kejriwal arrives at his residence from CBI office after nine hours of questioning in the liquor policy case. pic.twitter.com/Y8Plv570IQ — ANI (@ANI) April 16, 2023 -
వివేకా హత్య వెనక వారసత్వం పోరు ఉందనే ప్రచారం: అవినాష్ రెడ్డి
-
ఈ నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతా : ఎంపీ అవినాష్ రెడ్డి
-
Custom Milling Rice: సీఎంఆర్‌పై సీబీ'ఐ'
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింతల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి పెట్టింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారుల సహకారంతో చాలా రాష్ట్రాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర అధికారులు కలిసి వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, నాసిరకం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. 74 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో త్వరలోనే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, సీఎంఆర్ అప్పగింతల్లో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ నేతల అండతో మిల్లర్లు సీఎంఆర్ కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా ఢిల్లీకి ఉప్పందినట్లు తెలిసింది. మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ అధికారుల సంపూర్ణ సహకారం కూడా ఉందని భావిస్తున్న సీబీఐ ఆ దిశగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 4 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో తనిఖీలు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీనితో పాటు సకాలంలో కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు ప్రైవేటుకు అమ్ముకోవడం, దీనికి కొందరు ఎఫ్‌సీఐ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల శాఖల అధికారులు సహకరిస్తుండటాన్ని కూడా గుర్తించింది. సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యంలో నాణ్యత లోపిస్తున్నా, ఎఫ్‌సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల కిందట ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్‌కుమార్ మిశ్రా సహా 74 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 37 మంది ఎఫ్‌సీఐ అధికారులు కాగా మిగతావారిలో మిల్లర్లు, దళారులు, గోదాముల నిర్వాహకులు ఉన్నారు. ఉత్పత్తి సామర్థ్యానికి మించి కొనుగోళ్లు మిశ్రా ఎఫ్‌సీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన సమయంలోనే తెలంగాణ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉత్పత్తి సామరŠాధ్యనికి మించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మిశ్రా చాలా రాష్ట్రాల మిల్లర్లతో కుమ్మక్కై, కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోటా గడువు పెంపునకు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా విచారణ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ గడువు దాటినా ఎఫ్‌సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీఎంఆర్ అప్పగింతలో అవకతవకలు రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌పూల్ కింద ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ! రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు లేబర్ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగాసీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికీ పెండింగ్‌లో 2021–22 వానాకాలం బియ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్ మిల్లింగ్ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఎఫ్‌సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్లో 70.21 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్‌ఎంటీలే. ఇక గత యాసంగి సీజన్‌కి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్ఎంటీ సీఎంఆర్ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందింది. 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో ఈ నెల 9న ఆ రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
తెలంగాణ ఉద్యమంలో జాగృతి విశేషంగా కృషి చేసింది: కవిత
-
సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ అరాచకాల్ని అడిగేటోళ్లు ఎవరూ లేరని ఆమె మండిపడ్డారు. దీనిపై యువతలో చైతన్యం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబై విచారణ తర్వాత తొలిసారి కవిత స్పందించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో సోమవారం మాట్లాడుతూ.. సిస్టమ్‌ను మనం కాపాడుకుంటే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుతుందన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వాళ్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయి. ఎవరు మాట్లాడితే వాళ్లపై సీబీఐ వస్తోంది. దేశ వ్యాప్తంగా సీబీఐ దాడులు జరుతున్నాయి. నాపై కూడా జరుగుతున్నాయి. సీబీఐ దాడులకు భయపడేది లేదు’ అని కవిత మరోసారి స్పష్టం చేశారు. చదవండి: బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు -
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక
సాక్షి, ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ విచారణ కొనసాగుతోంది. అభిషేక్ Abhishek Boinpally ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఏ9 నిందితుడు, ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ ప్రశ్నిస్తోంది. వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది సీబీఐ. ఈ క్రమంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు(సహ నిందితుడు) ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఈ కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనేది ఆరోపణలు వినవస్తున్నాయి. -
ఆప్ సర్కార్‌పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటోందని ఆరోపించారు. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్ఎస్ నేతల గ్యాంగ్ రేప్, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని పేర్కొన్నారు. -
న్యాయపరంగా పోరాటం
సాక్షి, హైదరాబాద్: బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాకుంటే.. బాధితులకు న్యాయం జరిగేదాకా న్యాయపరంగా బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, డ్రగ్స్ సహా ఎనిమిదేళ్లుగా సాగుతున్న అనేక ఘటనలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పబ్బులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారం ఘటనపై ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిందితులకు అండగా నిలబడుతున్నట్లు స్పష్టమౌతుందని చెప్పారు. ఇందులో రాష్ట్ర హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని వెల్లడించారు. దీంతో పోలీసులు నిష్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. అధికార పార్టీ పెద్దలు, ఎంఐఎం నేతల కుటుంబసభ్యులను కేసు నుంచి తప్పించడానికి సీసీ ఫుటేజీను, ఇతర ఆధారాలను తారుమారు చేసి కేసును పక్కదారి పట్టించేందుకు పోలీస్‌శాఖ శతవిధాలా ప్రయత్నిస్తోందని బండి ఆరోపించారు. -
సీబీఐ విచారణ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో బాలికపై అత్యాచార ఘటన దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, పూర్తిస్థాయి విచారణను సీబీఐకి అప్పగిం చాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అను బంధ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిం చేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు. సర్కారు తీరుతో డ్రగ్, పబ్ కల్చర్ టీఆర్ఎస్కు భజన చేసే వారికి పబ్‌ల అను మతి ఇస్తున్నారని.. పబ్ లైసెన్సులను ని యంత్రించకపోవడం వల్లనే రాష్ట్రంలో దారు ణ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారని నిలదీశారు. డ్రగ్స్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ‘మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు ధైర్యం గా ఫిర్యాదు చేసినా.. పోలీసుశాఖ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా.. నేరాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చూడాలని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం రొమేనియా బాలికపై రేప్ ఘటనను నిర సిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్ఎస్ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వ ర్యంలో శనివారం డీజీపీ కార్యాలయ ముట్ట డి చేపట్టారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్య క్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్ యువ జన కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు ఆందోళ నకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అనంతరం వెంకట్, సునీతారావు మీడియా తో మాట్లాడారు. బాలికపై అత్యాచారం విష యంలో రాజకీయ డ్రామా నడుస్తోందని వెంకట్ మండిపడ్డారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏం చేస్తున్నాయని సునీతారావు ప్రశ్నించా రు. పోలీసులకు గాజులు, చీరలు పంపిస్తా మని, వాటిని వేసుకుని ఇంట్లో కూర్చోవాల న్నారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి అమ్నీషియా పబ్ వద్ద ధర్నాకు దిగారు. పబ్‌ను సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. -
‘మెడికల్ పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ మంత్రుల ప్రమేయం ఉన్నందున సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆషామాషీ విచారణ చేస్తే నిగ్గు తేలదని, ఆలస్యం చేయకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు రేవంత్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాపై పేద, మధ్య తరగతి విద్యార్థులు వారం రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, వర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన వారిని మెరిట్ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేయించి, తర్వాత ఆ సీటును బ్లాక్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. స్వయంగా మంత్రులకు చెందిన కాలేజీలే దందా చేస్తుంటే సాధారణ పోలీసు విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసించగలమా? ఈ దందాపై కఠిన వైఖరి ప్రదర్శించాలి’అని రేవంత్ కోరారు. -
రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది అంత ముఖ్యమైన విషయమా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అరెస్ట్‌పై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇదంతా ముఖ్యమైన విషయమా ? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని నొక్కి చెప్పింది. ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు పంపింది. దానికి మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
బత్రాపై సీబీఐ దర్యాప్తు.. కారణమేంటి?
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్‌ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐకి హెచ్ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్‌ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
‘రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణ చేయొచ్చు’
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైఎస్సార్సీపీ ఎంపీ, ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె.ఇందిరా ప్రియదర్శినిపై బ్యాంకులను మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్బీఐ సర్క్యులర్ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఇండ్–భారత్‌తోపాటు, రాజు, ఆయన భార్య, కుమార్తె దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. సదరు కంపెనీలకు నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుం డా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తునకు అడ్డుకావని స్పష్టం చేసింది. రుణంగా తీసుకున్న రూ.30.94 కోట్లు చెల్లించకపోవడంతో ఎస్బీఎస్, ఐఓబీ, యాక్సిస్, సిండికేట్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బరోడా బ్యాంక్.. ఇండ్–భారత్ కంపెనీ బ్యాం కు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాయి. మరో కేసులో ఆర్బీఐ సర్క్యులర్‌ను తప్పుబడుతూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను జూలై 16 కి వాయిదా వేసింది. -
అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అర్నబ్ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది'
-
'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది'
సాక్షి, తాడేపల్లి: అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి పెద్ద స్కామ్ అని మేము ముందునుంచి చెప్తున్నాం. బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయి. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. (టీడీపీ బాత్రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు) ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ వెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మీరు తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరం. న్యాయస్థానలపై మాకు గౌరవం ఉంది. హైకోర్టులో కామెంట్స్‌పై సమాధానం చెప్పలేము. ఆర్డర్‌పై మాత్రమే సమాధానం చెప్పగలం' అని అంబటి పేర్కొన్నారు. (రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
-
అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి
పట్నా: తన సోదరుడి మృతి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి గురువారం డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శ్వేతా సింగ్ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. సుశాంత్ మరణానికి సంబంధించి నిజాలు తెలుసుకోవడానికే తప్ప మరేదో ఆశించి తాము సీబీఐ విచారణ కోరలేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి వాస్తవాలు బయటపడినపుడే సుశాంత్ అభిమానులు, శ్రేయోలాభిలాషులు ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.(ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం: పవార్) కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక మలుపుల అనంతరం అతడి ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియా డబ్బు తీసుకుని సుశాంత్‌ను మోసం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా బిహార్ సర్కారు కేంద్రాన్ని కోరడంతో సానుకూల స్పందన వచ్చింది.(మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు) అయితే ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేస్తూ.. కొన్ని వాట్సాప్ చాట్ల స్క్రీన్షాట్లు బహిర్గతం చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో శ్వేత ఈ మేరకు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీబీఐ విచారణ ప్రారంభించడం సరికాదంటూ రియా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.(‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) -
సుశాంత్ కేసులో కీలక మలుపు : రియాకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో ) ఈ సంఘటన మొత్తం ముంబైలో జరిగిందని, సుశాంత్ మరణించిన వెంటనే, ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. (వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే) ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది హై ఫ్రొఫైల్ కేసు...ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బిహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సుశాంత్ తండ్రి తరఫున బిహార్ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ హాజరయ్యారు. (సుశాంత్ కేసు : మరో వివాదం) కాగా సుశాంత్ ఆత్మహత్యకు మాజీ ప్రియురాలు రియా కారణమంటూ సుశాంత్ తండ్రి కృష్ణకిషోర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో రియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని కూడా ఆయన కోరారు. అటు సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. దీనికి తోడు సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్, ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.