Center of Excellence
-
హైదరాబాద్‌లో సైయెంట్–అలెగ్రో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్, సెన్సింగ్ సొల్యూషన్స్ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ కలిసి హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు చేశాయి. ఇది ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమకు కావాల్సిన కొత్త తరం మ్యాగ్నెటిక్ సెన్సార్లు, పవర్ సెమీకండక్టర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.ఇందులో పోస్ట్–సిలికాన్ వేలిడేషన్, డిజైన్ వెరిఫికేషన్ తదితర విభాగాల్లో 100 పైచిలుకు నిపుణులైన ఇంజినీర్లు ఉంటారు. ఇరు సంస్థల భాగస్వామ్యం మరింత పటిష్టమయ్యేందుకు ఇది దోహదపడగలదని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. భారత్‌లో ఆటోమోటివ్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉంటాయని అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్వాలా పేర్కొన్నారు. -
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
ఆటో, ఐటీకి కేరాఫ్‌గా తెలంగాణ
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఆటో, ఐటీకి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని.. రాష్ట్రంలో ఆటోమోటివ్, మొబిలిటీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఉత్తమ మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్ నగరం ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో పలు సంస్థల కార్యాలయా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటిగా, మొబిలిటీ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ కార్యాలయాన్ని హైదరా బాద్‌లో ప్రారంభించడం ఒక మైలురాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. సుస్థిర మొబిలి టీకి మాత్రమే భవిష్యత్తు ఉందని చెప్పారు. మొబిలిటీలో తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇక్కడే.. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ–హబ్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, హ్యుందాయ్ మొబిన్ ఇన్, బిట్స్ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొబిలిటీ రంగంలో దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోర్సుల రూపకల్పన, పరిశోధన, అభివృద్ధి, విద్యార్థులకు శిక్షణలో ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ నానక్‌రాంగూడలో రైట్ సాఫ్ట్వేర్ సంస్థ కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని.. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారిందని చెప్పారు. 2014లో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు 9.05 లక్షల మందికి చేరారని, ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షలకు పెరిగాయని వివరించారు. -
భారత్‌లో బ్లాక్‌బెర్రీ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సాఫ్ట్వేర్, సర్వీసెస్ అందిస్తున్న కెనడా సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023 చివరి నాటికి కెనడా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగానికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది అవతరిస్తుందని వెల్లడించింది. ఆ సమయానికి ఇక్కడ 100 మందికి పైగా ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ ద్వారా నియంత్రించగలిగే తదుపరి తరం వాహనాల అభివృద్ధి, ఐవోటీ పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణలు లక్ష్యంగా ఈ కేంద్రం బ్లాక్‌బెర్రీ రూపొందించిన క్యూఎన్ఎక్స్, ఐవీ ఉత్పాదనలపై పనిచేస్తుంది. ఆవిష్కరణలు, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ బాధ్యతలను హైదరాబాద్ బృందం చేపడుతుంది. ‘నైపుణ్యాలు, ఆవిష్కరణలలో బ్లాక్‌బెర్రీ కొనసాగిస్తున్న పెట్టుబడికి ఈ రోజు మరొక మైలురాయి. ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఆవిష్కర్తలకు నిలయంగా భారత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో ఐవోటీ సాప్ట్వేర్ లీడర్‌గా వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తాం’ అని బ్లాక్‌బెర్రీ ఐవోటీ ప్రెసిడెంట్ మ్యాటిస్ ఎరిక్సన్ తెలిపారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టెల్లాంటిస్, బీఎండబ్లు్య, బాష్, ఫోర్డ్, జీఎం, హోండా, మెర్సిడెస్ బెంజ్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు బ్లాక్‌బెర్రీ క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల వాహనాల్లో బ్లాక్‌బెర్రీ క్యూఎన్ఎక్స్ వినియోగిస్తున్నారు. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
సాగుకు సాంకేతిక సహకారం
సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయ రంగంలో సాంకేతిక అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పని చేస్తామని యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ) సీఈవో అదా డైండో చెప్పారు. విశాఖలో ప్రారంభమైన జీ 20 గ్లోబల్ టెక్ సమ్మిట్–2023లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో పలు అంశాల గురించి మాట్లాడారు. విశాఖలో భిన్నమైన అవకాశాలు.. విశాఖపట్నం చాలా అందంగా ఉంది. నగరంలో ఉన్న భిన్నమైన వాతావరణం కారణంగా అనేక రంగాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్ఆర్డీసీతో చేసుకున్న ఎంవోయూతో భవిష్యత్తులో ఈబీటీసీ విశాఖలోనూ పలు రంగాల్లో కలసి పని చేయనుంది. వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టి స్థిరమైన అభివృద్ధి, సాంకేతికత బదిలీ, ఆవిష్కరణ రంగాలలో ఐరోపా దేశాలు, భారత్ మధ్య సహకారం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడంపై ఈబీటీసీ దృష్టిసారించింది. యూరోపియన్ వ్యవసాయ పద్ధతులు, విధానాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించాలని భావిస్తున్నాం. యూరప్ వ్యవసాయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా స్థిరమైన, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను మా దేశంలో అభివృద్ధి చేశాం. అత్యాధునిక సాంకేతికత, జీపీఎస్ ఆధారిత వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాం. దిగుబడులు పెరిగేలా డ్రోన్ వ్యవస్థ.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. వీటికి ఐరోపా పద్ధతులు తోడైతే మరిన్ని సత్ఫలితాలు సాధించగలం. ఉదాహరణకు ఫీల్డ్ మ్యాపింగ్, రిమోట్æ సెన్సింగ్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఐరోపాలో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, సేంద్రియ వ్యవసాయం తోడైతే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని విశ్వసిస్తున్నాం. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వ్యవసాయ రంగంలో పెద్ద ముందడుగు వేసేలా విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఈబీటీసీ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు అనేక అవకాశాలు కల్పించనున్నాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులు అవలంబించడం, ఎగుమతి ఆధారిత పంటలపై దృష్టిసారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. -
అత్యుత్తమ వాణిజ్య వాతావరణానికి హైదరాబాద్ అడ్డా
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యుత్తమ వాణిజ్య వాతావరణాన్ని అందించడంలో హైదరాబాద్ ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవవనరులతోపాటు అద్భుతమైన మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయన్నారు. వినూత్న డేటా ఆధారిత పరిష్కారాలను అందించే విధంగా హైదరాబాద్‌లో రోష్ ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ అనలిటిక్స్, టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రోష్ ఫార్మా ఎండీ, సీఈవో వి.సింప్సన్ ఎమాన్యుయెల్ సోమవారం కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజసంస్థలు హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ ఆవిష్కరణ, సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గేట్ ఏర్పాటు ద్వారా 2022 చివరి నాటికి వంద మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రోష్తో అనుసంధానమై పనిచేస్తున్న సంస్థలకు ఈ గేట్ అందజేస్తుంది. రోష్ ఫార్మా ఎండీ, కేటీఆర్ మధ్య జరిగిన భేటీలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
పరిశ్రమల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నాలుగోతరం ఇండస్టీ–4 టెక్నాలజీ అభివృద్ధికి ‘కల్పతరువు’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అనేక పారిశ్రామిక సంస్థలకు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’ అన్ని విధాలా ఉపయోగపడనుంది. మంగళవారం ఆర్ఐఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎండీ అతుల్ భట్, ఢిల్లీ నుంచి ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ కలిసి కల్పతరువు ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాం – 1 (ఓసీపీ–1)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్కు చెందిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం అందించే స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందించే అవకాశం లభిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్–హెచ్‌వీపీవీ, హెచ్ఎస్ఎల్, హెచ్‌పీసీఎల్, వీపీటీ, బీఏఆర్సీ వంటి సంస్థలు ఈ సీవోఈని వినియోగించుకోవాలని కోరారు. ఈ సీవోఈతో రాష్ట్రంలో స్టార్టప్‌లు పెరుగుతాయని, పారిశ్రామిక కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశవ్యాప్తంగా 20 సీవోఈలు ఉండగా కల్పతరువు 21వదని, కాని ఇది అన్ని సీవోఈలకు తల్లిగా అవతరించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఎనలటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకొని స్మార్ట్ ఆటోమేషన్‌ను పెంచుకోవచ్చని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ లానే ఇతర పీఎస్‌యూలు కూడా వారి సమస్యల పరిష్కారానికి కల్పతరువును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కల్పతరువు రాకతో 2025 నాటికి రాష్ట్ర తయారీ రంగంలో 25 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓసీపీ–1 కార్యక్రమంలో పాల్గొనే స్టార్టప్‌లు అక్టోబర్ 19 వరకు www.kalpataru.stpi.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాతా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 1,032 మంది పాల్గొన్నారు. -
ఔషధ రంగంలో డీఎఫ్ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్‌లో కొత్తగా ‘క్లోజర్ టు ది ఫార్ములేటర్’ (సీ2ఎఫ్) పేరిట నైపుణ్య కేంద్రాన్ని (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ సహకారంతో సీ2ఎఫ్ మరింత బలోపేతమై అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ అన్నారు. ఔషధాల అభివృద్ధిలో నూతన ఆలోచనలు వాణిజ్య ఉత్పత్తి రూపాన్ని సంతరించుకునేందుకు పట్టే సమయాన్ని సీ2ఎఫ్ తగ్గిస్తుంది. సీ2ఎఫ్ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, డీఎఫ్ఈ ఫార్మా సీఈవో మార్టి హెడ్మన్ పాల్గొన్నారు. -
సైయంట్ 5జీ నెట్వర్క్స్ సీవోఈ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్ తాజాగా తమ ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ ప్లాట్‌ఫామ్.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలకు పేరొందిన ఐఐటీ–హెచ్ అనుభవం .. సీవోఈకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అట్ల తెలిపారు. ఇప్పటికే వివిధ అంశాల్లో సైయంట్‌తో కలిసి పని చేస్తున్నామని, ప్రైవేట్ 5జీ సీవోఈతో ఈ బంధం మరింత బలపడగలదని ఐఐటీ–హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. -
నెలాఖర్లోగా నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు గురుకులాలు ముందస్తు కసరత్తు చేపట్టాయి. ఈ నెలాఖరులోగా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే దరఖాస్తు ప్రక్రియకు ఇరవై రోజులపాటు గడువు ఇవ్వనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరివారం నుంచి ఏప్రిల్ రెండోవారం వరకు ప్రవేశాల నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా, ఆగస్టు రెండోవారం నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసేది. అయితే రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ప్రవేశాల ప్రక్రియ గాడితప్పుతోంది. 2021–22 సంవత్సరానికి డిసెంబర్ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికే వందశాతం అడ్మిషన్లు పూర్తి చేసేలా గురుకులాల సొసైటీలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుకుల సొసైటీలున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు మైనార్టీ సొసైటీ మినహా మిగతా నాలుగు గురుకులాలు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒకే నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకున్న ఖాళీలను భర్తీ చేసేందుకు సొసైటీలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిధిలోని సైనిక పాఠ శాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడ నున్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోగా జారీ చేసేం దుకు గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. ముందంజలో ఎస్సీ గురుకుల సొసైటీ... ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీయూజీసెట్–2022 నోటిఫికేషన్ జారీ చేసి, ఈ నెల 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. జూనియర్ కాలేజీలు, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)ల పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ అండ్ సీఓఈసెట్–2022 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 20న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ వెల్లడించింది. మిగతా సొసైటీలు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. -
ప్రతి నియోజకవర్గంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా దేశంలో నాలుగో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఐవోటీ–ఏఐ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నాస్కామ్ సెంటర్ వ్యవసాయ, వైద్య రంగాల అవసరాలు తీర్చే దిశగా పనిచేస్తుందన్నారు. అలాగే అమెజాన్‌తో సెంటర్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ, వైద్య, సంక్షేమ రంగాలు టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ప్రజలను కేంద్రంగా చేసుకుని టెక్నాలజీని అభివృద్ధి చేయాలని కోరారు. తొమ్మిది టెక్నాలజీలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్–ఆటోమేషన్, హెచ్–కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, బ్లాక్‌చైన్, 5జీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తున్న వర్క్ ఫ్రం హోం విధానం ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దీని ప్రారంభానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలు.. కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల జీవనంలో టెక్నాలజీ గణనీయ మార్పును తెస్తోందన్నారు. అంతర్జాతీయంగా నాణ్యమైన సేవలు అందించే కేంద్రంగా ఏయూ నిలిచిందని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలను సృష్టించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు కలసి పనిచేస్తే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జాని ఘోష్ మాట్లాడుతూ.. టెక్నాలజీ విభిన్న సమస్యలకు పరిష్కారాలను చూపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ షానాయి, రాష్ట్ర ఐటీ, నైపుణ్య శిక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఎల్‌సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సె ల్ (టీఎస్ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్‌సీఈ ఏర్పాటు కోసం టీఎస్ఐసీ, నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు బాటలు వేస్తుందని టీఎస్ఐసీ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ రామ్‌జీ రాఘవ న్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాస్ చెప్పారు. 15 ఎకరాల్లో ఐఎల్‌సీఈ ఏర్పాటు.. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్ ప్రాంగణం’లో ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్‌సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్ సెంటర్లు, డోర్ టు డోర్ సైన్స్ ల్యాబ్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
తెలంగాణాలో ‘ఖేలో ఇండియా’ కేంద్రం
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్‌ను క్రీడాశాఖ వెచ్చించనుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్ కండిషనింగ్ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. ‘ప్రతీ ఎక్స్‌లెన్స్ కేంద్రం 14 ఒలింపిక్స్ క్రీడాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇందులో మూడు క్రీడాంశాలకు ఆయా రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక కేంద్రాలు ఒక నిర్దిష్ట క్రీడలో నైపుణ్యం ఉన్న అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తాయి. 2028 నాటికి పతకాల జాబితాలో టాప్–10లో భారత్ నిలిచేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం వెళ్లిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తొలి రోజుజరిగిన సమావేశాల్లో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిశారు. బుధవారం ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణకు సంబంధించిన సహకారాన్ని గౌతమ్ రెడ్డి కోరారు. (ఆంధ్రప్రదేశ్ నంబర్ 1) 'హునర్ సె రోజ్ గర్' కార్యక్రమంలో భాగంగా పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని ఐటీడీసీ ఛైర్మన్ తెలిపారు. హోటల్ మేనేజ్ మెంట్, వివిధ రకాల వంటలలో ప్రత్యేక శిక్షణ, పర్యాటకరంగంలో ఉద్యోగాల కల్పనకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రతిపాదనలకు కమలవర్ధనరావు సానుకూలంగా స్పందించారు. అనంతరం, ఢిల్లీలోని లోథి హోటల్లో మంత్రి మేకపాటి జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్‌ను కలిశారు. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఎన్టీపీసీ సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం మంత్రి మేకపాటి ప్రతిపాదనపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. మంత్రి మేకపాటి కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు, అప్రెంటిషిప్ కార్యక్రమాలలో భాగస్వామ్యానికి ఎన్టీపీసీ సీఎండీ సంసిద్ధత వ్యక్తం చేశారు. (తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే) ఆ తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనిల్ కుమార్ చౌదరితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి గౌతమ్ రెడ్డి సెయిల్ సీఎండీకి వివరించారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సీవోఈ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం చెబుతామని ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చౌదరి మంత్రి ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. అయితే హెచ్ఆర్డీ కేంద్రాల ద్వారా పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులకు, ఇంజనీరింగ్ యువత రాసే 'గేట్' పరీక్షలకు , అప్రెంటిషిప్ కార్యక్రమాలకు, శిక్షణలో తోడ్పాటు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చారు. అగ్ని, గాలి , కరెంట్ కొలిమిలలో యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలకు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ భాగస్వామ్యంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కృషి చేస్తుందని మంత్రి మేకపాటి ప్రతిపాదనకు అనిల్ చౌదరీ బదులిచ్చారు. ప్రతి రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణతో పాటు రాష్ట్రంలో స్కిల్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం మంత్రి మేకపాటి తొలి రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. సీఎండీలతో సమావేశాలలో మంత్రి మేకపాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. గురువారం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమవుతారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
విశాఖలో ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’.. విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది పనిచేస్తుండగా.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వీరి సంఖ్యను 120కి పెంచనున్నామని, ఇక ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ డైరెక్టర్ (కమ్యూనిటీ ఆపరేషన్స్ ఫర్ ఆసియా పసిఫిక్) వెన్ స్జూ లిన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు, రైడర్లకు పూర్తిస్థాయి మద్దతును అందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రం ఇది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 12వ సెంటర్ భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది. -
సీఓఈ కాలేజీల్లో అడ్మిషన్లు షురూ
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది. జేఈఈ, నీట్, ఎయిమ్స్, ఎంసెట్, క్లాట్, సీఏ–సీపీటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఈ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 20తో ముగియనుంది. రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తించనున్నారు. పదో తరగతి చదివే వారికే: సీఓఈ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులే అర్హులు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సొసైటీలో సీటు పొందాలనుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించుకుని https://www.ts wreis.in, http://www.tgtwgurukulam.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 28 కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 17 కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో 40 సీట్లుంటాయి. మొత్తంగా 1,800 సీట్లకు ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. కాలేజీల వివరాలు, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చారు. -
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భేష్: ఆర్.సి.శ్రీవాత్సవ
సాక్షి, హైదరాబాద్: ములుగు, జీడిమెట్లలో రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఉత్తరాఖండ్ ఉద్యాన సంచాలకుడు ఆర్సీ శ్రీవాత్సవ శనివారం సందర్శించారు. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నూతన సాంకేతిక పద్ధతిలో పెంచుతున్న మామిడి తోటలు, నాణ్యమైన కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను ఆయన పరిశీలించారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పాలీహౌజ్‌లో సాగు చేస్తున్న పంటలు, కూరగాయల నారును తయారు చేసే ప్లగ్ టైప్ నర్సరీలను సందర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అనుసరిస్తున్న సాగు విధానాలను శ్రీవాత్సవ అభినందించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధి కోసం ఉద్యాన శాఖ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్ ఎల్.వెంకట్ రాంరెడ్డి వివరించారు. పంట కాలనీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాఖండ్‌లో సాగులో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, నాణ్యమైన మొక్కల సరఫరా, పాలీహౌజ్ విధానంలో పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం తదితరాల అంశాలపై శ్రీవాత్సవ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా నెల్లిమర్ల గురుకులం
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్ఎస్ఎన్.రాజు తెలిపారు. పట్టణంలోని బీసీ బా లికలు, మత్స్యకార బాలుర పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదల చేశామన్నారు. వచ్చేనెల 1నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ తరగతులతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి సింహాచలంలో బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 12 కళాశాలలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 15న 5వ తరగతి విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ గురుకులాలతో కలిసి అకడమిక్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేనెలలో నిర్వహిస్తామని రాజు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ రఘునాధ్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రామినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రతి జిల్లాలో ‘ఐఐటీ’ కోచింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలిగేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఒక్కో కొత్త జిల్లాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్ణయించింది. అలాగే తగిన వసతులు, సౌకర్యాలు ఉన్న గురుకులాలను సీవోఈలుగా అప్‌గ్రేడ్ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడున్నవి రెండే.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు మాత్రమే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒకటి, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో మరొకటి ఉంది. గురుకుల కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. ఈ సీవోఈల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అక్కడ ఇంటర్ తరగతులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్‌ను కూడా అందిస్తారు. ఎంసెట్‌తో పాటు ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కీలకమైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. మెడిసిన్ చదవాలనుకున్న వారిని నీట్ పరీక్షకు సన్నద్ధం చేస్తారు. కీలక విద్యా సంస్థలతో అవగాహన.. సీవోఈలలో ఫ్యాకల్టీని నియమించే అంశంపై గురుకుల సొసైటీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ తరగతులు బోధించే వారున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రముఖ శిక్షణా సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ ఏడాదే ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన గురుకుల సొసైటీ.. ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అతి త్వరలో వీటికి ఆమోదం లభించే అవకాశముందని.. ఆ వెంటనే తగిన వసతులు, సౌకర్యాలున్న గురుకులాల్లో ప్రత్యేకంగా సీవోఈలను ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల 27న లేదా 28న ఈ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా తదితర æప్రముఖ సం స్థలు రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించాలని భావిస్తోంది. వీటి అనుమతుల విషయంలో కీలక నిబంధనలు ఉండేలా చూస్తోంది. ప్రముఖ సంస్థల ఆసక్తి.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు వర్సిటీలను రాష్ట్రం లో అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంస్థలతోపాటు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో వర్సిటీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. తాజాగా రిలయన్స్ సంస్థ ఇక్కడ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరించింది. రాష్ట్రంలో క్యాంపస్‌లున్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సుల ను ప్రైవేటు వర్సిటీల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా జాగ్ర త్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. ఏ రంగంలోనైనా ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్పించేలా కోర్సులను డిజైన్ చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భవనాలు ఉంటేనే సరిపోదు.. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు 50 నుంచి 100 ఎకరాల వరకు స్థలాలు ఉన్నాయి. విశాలమైన భవనాలు ఉన్నాయి. అంత మాత్రాన ప్రైవేటు వర్సిటీని స్థాపించేందుకు ముందుకు వచ్చినా వాటన్నింటికి అనుమతివ్వొద్దని భావిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు, బ్రాండ్ ఇమేజ్ ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని అనుమతిచ్చే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు తెలిసింది. స్థలాలు, భవనాలు చూసి అనుమతులు ఇస్తే హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున యూనివర్సిటీల మంజూరులో అనేక జాగ్రత్తలు తీసుకునేలా నిబంధనలు సిద్ధం చేసింది. దేశంలో ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు 300 వరకు ఉంటే అందులో పేరున్నవి 50 కూడా లేవని, అందుకే రాష్ట్రంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. -
రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి
అధికారులకు పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతు వారీగా యాసంగి పంటల విస్తీర్ణం వివరాలను సమగ్రంగా సేకరించాలని అధి కారులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జిల్లా వ్యవసాయా ధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, రైతు వారీగా, పట్టాదారు వారీగా భూమి వివరాలను, పంట సాగు విస్తీర్ణం వివరాలను సేకరించాలని సూచించారు. కొత్తగా నియమితులైన 1,311 వ్యవసాయ విస్తరణాధి కారుల సేవలను వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఆ దిశగా వ్యవసాయ శాఖ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్.. తాము అమలు చేస్తున్న పలు పథకాల గురించి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. -
హైదరాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల విస్తరణలో భాగంగా సాఫ్ట్వేర్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ తాజాగా హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ని ప్రారంభించింది. 2020 నాటికల్లా ఈ కేంద్రంలో 1,000 ఉద్యోగాల మేర కల్పించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు పార్కర్ హ్యారిస్ మంగళవారమిక్కడ తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల ఇది తమకు అతి పెద్ద కార్యాలయమని ఆయన పేర్కొన్నారు. సేల్స్‌ఫోర్స్‌కి ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబైలలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.