chalasani srinivas
-
7 మండలాల విలీన వివాదంపై చలసాని కీలక వ్యాఖ్యలు
సాక్షి విజయవాడ: ఏడు మండలాల విలీన వివాదంపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నది అవాస్తవం..చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని.. రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోనే ఉంది. విభజన ఆస్తులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని చలసాని డిమాండ్ చేశారు.ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించారు. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై దుర్మార్గంగా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల మద్య సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.’’ అంటూ చలసాని వ్యాఖ్యానించారు. -
విభజన హామీలను వెంటనే అమలు చేయాలి
-
ప్రత్యేక హోదా వద్దన్నవారు దుర్మార్గులు: చలసాని శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు. ‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్‌ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు. -
నీతిమంతులకు ఓట్లు వేయండి: చలసాని
ఏలూరు: నీతిమంతులకు ఓట్లు వేయాలని, అవసరం అయితే స్వతంత్ర్యంగా పోటీ చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చలసాని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. వేల సంవత్సరాల విశిష్టత కలిగిన హేలాపురి(ఏలూరు)లో ప్రజలను చైతన్యం చేయడానికే వచ్చామన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం, నయవంచన చేస్తే అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. ఎవరూ వ్యక్తిగత విమర్శలకు పోవద్దని కోరారు.1200 మంది విద్యుత్ ఉద్యోగులను హింసించింది ఎవరని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసులు వేయించారని తెలిపారు. తెలుగు జాతి సమైక్యత, భావజాల సమైక్యతగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే వారిలో ఒక్కరూ కేంద్ర మంత్రి లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రా ద్రోహులను ఢిల్లీకి పంపడం వల్ల ఏపీకి ఈ గతి పట్టిందన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ఓటర్లు ప్రశ్నించాలన్నారు. అవినీతి పరులను ఎన్నుకోవద్దని సూచన చేశారు. -
‘చలన చిత్ర పరిశ్రమ తీరు బాధాకరం’
సాక్షి, పశ్చిమగోదావరి : విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆంధ్ర మేధావుల ఫోరమ్ కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాలకొల్లులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రైల్వే బడ్జెట్లో గుజరాత్‌కు రూ. 500 ఓట్లకు పైగా కేటాయించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు కనీసం బడ్జెట్లో స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోజు నిర్వహించే ఓట్ ఆఫ్ పేజ్‌లో ప్రతీ ఒక్కరు పాల్గొని మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. విభజన హామీల విషయమై చలన చిత్ర పరిశ్రమ స్పందించకపోకపోవడం చాలా బాధాకరమని చలసాని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో సాంప్రదాయ జల్లికట్టు విషయమై తమిళ చలనచిత్ర పరిశ్రమ ఒకే తాటి పైకి వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
‘ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలి కారణంగానే’
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి దురదృష్టకరమని ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి కేసులో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. జై ఆంధ్ర ఉద్యమ వీరులకు గౌరవం ఏదీ? విభజన హామీల అమలుపై అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా నవంబర్ 12 నుండి విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడతామని ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబరు 1) నాడు జై ఆంధ్ర ఉద్యమ వీరులను గౌరవించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి అండగా ఉంటాం : చలసాని
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బంద్ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు చనిపోవడం బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. దుర్గారావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోదా కోసం బంద్ నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌ను ఇతర పార్టీలు కానీ, ప్రజలు కానీ ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. శాంతియుతంగా బంద్‌లు, దీక్షలు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చునని దానిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో కూడా తాము దీక్షలు చేస్తామంటే చంద్రబాబు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.. చంద్రబాబు నడి రోడ్డుపై దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ, ఎవరైనా దీక్షలు చేస్తే పోలీసులచే అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి అందరం అండగా ఉంటామని పేర్కొన్నారు. హోదా కోసం చంద్రబాబు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. -
‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది. -
ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటి?
ఒంగోలు: భారతీయ జనతా పార్టీని ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటో చెప్పాలని ప్రత్యేక హోదా–విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మహారాష్ట్రకు రైల్వే బడ్జెట్లో రూ. 50 వేల కోట్లు కేటాయించారని, కానీ తెలుగు రాష్ట్రాలకు కేవలం రూ. 5,600 కోట్లు ముష్టిగా వేశారని అలాంటప్పుడు బీజేపీని ఉత్తర భారతీయ జనతా పార్టీ అనడం సమంజసమేనంటూ తన వాదనను సమర్థించుకున్నారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటిస్తున్నారని, ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తనతో పాటు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బీజేపీ చెప్పే అభివృద్ధి ఏంటో స్పష్టం చేస్తామని చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న రాజకీయ పార్టీలతో పాటు అనేక పార్టీలు తామే ఉద్యమాలు మొదలు పెట్టామంటూ చెప్పుకోవడం సరికాదని, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తామే హోదా ఉద్యమాన్ని ప్రారంభించామనేది జనానికి తెలుసన్నారు. రాజకీయ పార్టీ జెండాలకు అతీతంగా సినీ హీరోలు కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం మునుకోటి, భాను ప్రాణత్యాగం చేశారని, వారి ఆత్మలు శాంతించాలంటే హోదా సాధని తప్పనిసరన్నారు. జూలైలో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్నాయని, యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా నెలలో కనీసం ఒక్కరోజు వారికి నచ్చిన సమయంలో ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఎక్కడైతే జాతీయ రహదారి కలుస్తుందో ఆ ప్రాంతంలో 24 గంటల బంద్ చేపడతామని తెలిపారు. దీంతో బంద్ ప్రభావం మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని పేర్కొన్నారు. హోదాకు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నామని సినీ నిర్మాత, నటుడు మాదాల రవి ప్రకటించారు. ప్రగతిశీల శక్తులు అందరూ కలిసి వచ్చి మొండి వైఖరి అవలంబిస్తున్న బీజేపీ మెడలు వంచేందుకు భగత్‌సింగ్‌లా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చుకునేందుకు తగిన నిధులు కేటాయించే వరకు పోరుబాట పడదామన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. సినీ సంగీత దర్శకులు ఖుద్దూస్ మాట్లాడుతూ కళా చైతన్యం లేకుండా ఏ ఉద్యమం కూడా విజయం సాధించలేదని, అందుకే ప్రత్యేక హోదా సాధనక కోసం తాను పాటలకు సంగీతం అందించానని, ఇటీవల తాను సంగీతం అందించిన ఓ పాటను పాడి వినిపించారు. కవులు, కళాకారులు గజ్జెకట్టి ప్రజలను ఉద్యమం వైపు నడిపించేందుకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు -
హోదా ఉద్యమంలో కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులు
-
వారిని ఆంధ్రాద్రోహులుగా ప్రకటిస్తాం
విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక హోదా సాధన సమితి భవిష్యత్ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చలసాని శ్రీనివాస్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అప్పలనాయుడు, సదాశివరెడ్డి, విశ్వనాద్, రఫీ, రాయప్ప, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా కార్యక్రమాలు చేశామన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి సాధన సమితి కమిటీలు ఏర్పాటు చేసి, పదిలక్షల కరదీపికల ప్రచురిస్తామని తెలిపారు. జూన్ 15 తరువాత విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యా సంస్థల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఊరేగింపులు కూడా చేపడతామని చెప్పారు. జూలై నుంచి యూనివర్శిటీలకు బస్సు యాత్రను చేపట్టి, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కడప ఉక్కు..ఆంధ్రుల హక్కని, గిరిజన విశ్వవిద్యాలయం తదితర సంస్థల కోసం ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. జాతీయ రహదారులు రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతాల్లో రహదారుల నిర్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హోదా కోసం కలిసి వచ్చే అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్ధతుకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, హోదా సాధన సమితి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీ నెగెటివ్ ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు.‘ కేంద్రం అన్ని హామీలను నేరవేర్చిందని ప్రచారం చేస్తున్నారు. విభజన హామీల్లో ఏం నెరవేర్చారో చెప్పాలని సవాల్ చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు బుందేల ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేవలం పదిహేను వందల కోట్ల నిధులు ఇచ్చి, దానికి కూడా యూసీలు ఇవ్వలేదు. సిగ్గులేకుండా బీజేపీ నాయకులు కేంద్రాన్ని సమర్ధిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకు వెళ్లబోతున్నాం. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోంద’ని రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర నేత, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..నయవంచన మాటలతో బీజేపీ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. హోదా కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తామని, సమస్య ఉన్న చోట్ల ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. -
కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్‌లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి : రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిధుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విధ్యార్థులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు హోదా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అలా చేస్తేనే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. 20 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో హోదా దీక్షలు ప్రారంభమవుతాయి.. ఆగస్టు 15లోపు శుభవార్త వినాలంటే.. హోదా ఉద్యమాన్ని ఇప్పటినుంచే మరింత తీవ్రతరం చేయాలి’ అని అన్నారు. ఏపీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం : చలసాని బీజేపీ నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది లేదు కానీ.. ఏపీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయబోతున్నాం. హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరు కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుంది. ప్రజాభిష్టానికి తలవంచే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టారు’ అని తెలిపారు. -
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
-
హోదా ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలి: చలసాని
సాక్షి, విజయవాడ : ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్న ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హితవు పలికారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆయన విజయవాడలో మీడియాకు తెలియచేశారు. ఇకనైన హోదా ద్రోహులు ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలంటూ చురకలంటిచారు. రాష్ట్రానికి హోదా సాధనకై తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన ఆయన, ఈ నెల 24న బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్ దీపాలు ఆపేసి చీకటి దినంగా పాటించాలని ప్రజలను కోరారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని, 24 గంటలపాటు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని చలసాని తెలియచేశారు. బాబుది రెండు నాల్కల ధోరణి హదో విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. జపాన్ తరహా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎలా చేయాలో తమకు తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయాలన్న చంద్రబాబు, ఇప్పుడు విజయవాడలో ఎందుకు దీక్ష చేస్తున్నారంటూ నిలదీశారు. చంద్రబాబుకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా జంతర్‌మంతర్ వద్ద గానీ, ప్రధాని నివాసం ముందుకానీ దీక్ష చేయాలని సూచించారు. ప్రత్యేకహోదా కావాలన్న బాబు, అంతలోనే మాటమార్చి ప్యాకేజీకి అంగీకరించి సన్మానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏప్రిల్ 20న ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. మోదీ రాష్ట్రాన్ని నిలువునా ముంచారు ఆంధ్రప్రదేశ్‌ను, ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిలువునా ముంచారని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. హోదా ద్రోహులకు ఏపీ ప్రజలు సమాధి కడతారని, విభజన సమయంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే రాష్ట్ర బీజేపీకి పడుతుందని అన్నారు. హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాయని, కానీ అధికార టీడీపీ మాత్రం పాల్గొనలేదని తెలియచేశారు. దీన్ని బట్టే చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆందోళనలు, ఉద్యమాలు చంద్రబాబు చెప్పినట్లే చేయాలంటున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరించి ఉద్యమంలో పాల్గొనకుండా కుట్రలు చేస్తున్నారని బాబురావు ఆరోపించారు. -
చంద్రబాబుపై చలసాని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అవిశ్వాస తీర్మానాలు, ఆమరణ దీక్షపై కనీసం స్పందించని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక కోసం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్ సీపీ ఎంపీల పట్ల కేంద్రం దారుణంగా వ్యవహరించిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సోమవారం(ఏప్రిల్16) జరగనున్న బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. బంద్‌లు రాష్ట్రాభివృద్ధికి అడ్డంకని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లు చేయలేదా అని ప్రశ్నించారు. చేతనైతే ఉద్యమాలకు సహకరించండి లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చలసాని హెచ్చరించారు. ఈ బంద్‌లో జాతీయ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకం కలిగించొద్దని ఆయన తెలిపారు. అంతేకాక రాష్ట్ర స్థాయి పరీక్షలు వాయిదా వేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావును కోరామన్నారు. తమ బంద్ భవిష్యత్ తరాలకు, విద్యార్థుల ఉద్యోగాల కోసమే అన్నారు. సోమవారం జరగనున్న ఈ రాష్ట్ర బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని చలసాని కోరారు. -
ఈ నెల 16న ఏపీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నీ వామపక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 16న నిర్వహించదలచిన బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. టీడీపీ దుష్ట చర్యలను బంద్ ద్వారా ప్రజలకు తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా పోరాటంతోనే హోదా.. కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా బంద్‌కు అన్ని పార్టీలతో పాటు సీపీఎం కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు తెలిపారు. భారతీయ జనతాపార్టీపై యుద్ధం చేస్తామని, దొంగ దీక్షలతో నరేంద్ర మోదీ అబద్ధాలకోరుగా మారిపొయారని విమర్శించారు. ప్రజాపోరాటంతోనే కేంద్రంపై పోరాడి హోదా సాధించుకుంటామన్నారు. మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హతలేదని మండిపడ్డారు. బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రమంతా హోదా కోసం పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సంతోషాల నగరమంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది జపాన్ పోరాటమైతే.. తమది ఆంధ్రప్రదేశ్ పోరాటమని ఆయన తెలిపారు. మోదీ నియంతలా అడ్డుకున్నారు ఈనెల 16న చేపట్టిన ఏపీ బంద్‌కు సీపీఐ పార్టీ మద్దుతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రధాని మోదీ నియంతలా అడ్డుకున్నారని ఆ పార్టీ నేత రామకృష్ణ ఆరోపించారు. ప్రధానమంత్రి నిరసన దీక్ష చేపట్టడం అన్యాయమని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనచైతన్య వేదిక పూర్తి మద్దతు ప్రకటించింది. నాలుగేళ్లు రాష్ట్రంలో ప్రజానీకాన్ని ప్రత్యేక హోదా విషయంలో మభ్య పెట్టిన కేంద్ర రాష్ట్రాల వైఖరిని వ్యతిరేకించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి కోరారు. గతంలో మాదిరిగా బంద్‌ను విఫలం చేయటానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరన్నారు. బంద్ సఫలం కావటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు
-
అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు
విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం. 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం. 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం. 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు. -
ఏ1 కేంద్రం.. ఏ2 రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా పోవడంలో ఏ1 ముద్దాయి కేంద్రమైతే, ఏ2 ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమని ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హోదా కోసం వైఎస్సార్సీపీ సాగిస్తున్న పోరాటంలో నిజాయతీ ఉందన్నారు. ‘‘సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై మూడుసార్లు యూటర్న్ తీసుకున్నారు. 2014 మే 26న కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రూ.లక్షల కోట్లు వచ్చి ఉండేవి. హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం రూ.లక్షల కోట్లు నష్టపోయింది. హోదా కోసం పోరాడితే కేసులు పెట్టారు. విభజన హామీల కమిటీ ఏర్పాటు చేయాలన్నాం. ఒక్క కమిటీ వేయలేదు. రూ.73,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని చెబితే ఒక్క రూపాయి కూడా రాబట్టుకోలేకపోయారు. కోర్టు చెప్పినా జరగలేదు. ప్రత్యేక హోదా సంజీవని కాదంటారు. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా ద్వారా దక్కించుకున్న కేటాయింపుల గురించి వివరించాం. అమరావతిని పారదర్శకంగా నిర్మించాలని అడిగితే అభివృద్ధి నిరోధకులు అంటున్నారు. మాట్లాడితే హేళన చేస్తారు. మేం బాలకృష్ణను విమర్శిస్తే లోకేశ్‌కు కోపం వస్తోంది. చంద్రబాబు ఇప్పటిదాకా పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారు. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి’’ అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
తీర్మానం చర్చకు స్వీకరించకపోవడం దారుణం
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడితే చర్చకు స్వీకరించక పోవడం దారుణమని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన నియంతృత్వ పోకడలతో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ప్రతిపక్షానికి ఉన్న ప్రజాస్వామిక హక్కులను కేంద్రం నీరుగార్చుతోందని ధ్వజమెత్తారు. ఈ నెల 11న విజయవాడలో అంతిమ పోరాటంకు అఖిలపక్షం సిద్దమవుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, ఎదురుదాడికి దిగుతోందన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాల్సిందేనని, విభజన సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రేపు జనసేన, వామపక్షాలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ సర్వతోముఖాభివృద్దికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం వెయ్యికి పైగా పోరాటాలు చేస్తామని, 16 రాజకీయ పక్షాలు, 42 ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిస్తే వెళ్లామని, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్ నేతలను కూడా కలిశామని వివరించారు.జనసేన అధినేతను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తుమన్నారు. ఈ నెల 11న అఖిలపక్షం కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్ జగన్ కూడా ఉమ్మడి పోరాటానికి కలిసి వస్తామని చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టే దీక్షలకు ప్రత్యేక హోదా సాధన సమితి పూర్తి మద్దతు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఒకమెట్టు దిగి వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ మంత్రులు కలిసి అఖిలపక్షానికి ఆహ్వానించాలని ఈ సందర్భంగా చలసాని కోరారు. సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీ సృష్టించిందని విమర్శించారు.అసత్యాలు ప్రచారం చేయడమే వారి లక్ష్యమని, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏం చేసుకుంటారో.. చేసుకోండని బరితెగించి చెబుతోందని వ్యాఖ్యానించారు. ఏపీపై కోపంతో.. కుట్రతో వ్యవహరిస్తోందని అన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన హోదా సాధన సమితి నేతలు
-
జగన్‌తో హోదా సాధన సమితి నేతల భేటీ
సాక్షి, గుంటూరు : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా సాధనసమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి నరేష్, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. హోదాపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని హోదా సాధన సమితి నేతలతో ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడగకపోవడం వల్లే హోదా రాలేదని, ఒక వేళ చంద్రబాబు అడిగి ఉంటే హోదా వచ్చి ఉండేదని చెప్పారు. ప్రత్యేక హోదాకు కేబినేట్ ఎప్పుడో ఆమోదం తెలిపిందని.. ప్లానింగ్ కమిషన్‌ను చంద్రబాబు కలిస్తే హోదా వచ్చేదని, కాలయాపన చేసి ప్రస్తుతం డ్రామాలాడుతున్నాడని వారికి వివరించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదు, ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికేనని అన్నారు. హోదా కోసం పోరాడే వారందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అలాగే హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా అంశం విషయంలో మొదటి నుంచి వైఎస్ జగన్ ఒకే మాటపై నిలబడి, ఈ అంశాన్ని సజీవంగా ఉంచారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ప్రశంసించారు. అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలను కలుపుకుని.. ప్రత్యేక హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా కోరారు. ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షలో పాల్గొనే ఎంపీలకు తాము సంఘీభావం తెలుపుతామని వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు తెలిపారు. -
వేదికపై అశోక్‌బాబు.. వెనుదిరిగిన చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌తో పాటు ఎపీఎన్జీవో నేత అశోక్‌బాబు తదితరులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చిన చలసాని, వేదికపై ఉన్న అశోక్‌బాబును చూసి సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నిర్వాహకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. హోదా ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా చలసాని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తులే.. మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉపయోగించుకునే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
జైట్లీ, సుజనా భేటీపై సర్వత్రా విమర్శలు
సాక్షి, విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యంగా కలవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్నామని బయటకు చెబుతూ, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు : చలసాని ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఓ వైపు ప్రత్యేక హోదా అంటూనే మరోవైపు చర్చలు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. హోదాపై టీడీపీ మూడు సార్లు మాట మార్చిందని ఆయన గుర్తుచేశారు. హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను అర్ధాంతరంగా ముగిస్తే ఆ రోజును చీకటి దినంగా పాటిస్తామని అన్నారు. ఈ నెల 28వ తేదీన విద్యార్థి సంఘాలతో, యువజన నేతలతో సమావేశమై జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. జేపీసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, కర్ణాటకలో ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేలా అక్కడికి వెళ్లి పని చేస్తామని ఆయన తెలిపారు. టీడీపీ ముసుగులో గుద్దులాట మానాలి : మధు ఓ వైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతున్నారు, మరోవైపు సుజనా చౌదరి, జైట్లీతో చర్చలు జరుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ముసుగులో గుద్దులాట విధానాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు చేతకానితనం వల్లే : రామకృష్ణ చంద్రబాబు చేతకానితనం వల్లే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో ప్రత్యేక హోదా వద్దని చెప్పింది చంద్రబాబే, ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లు మంతనాలతో కాలం గడిపారని, ఇప్పుడు మళ్లీ సుజనా చేత జైట్లీతో చర్చలు జరిపించడం టీడీపీ అవకాశవాదానికి నిదర్శనం అని విమర్శించారు. సుజనా చౌదరి సొంతంగా చర్చలు జరపలేదని, చంద్రబాబు చెబితెనే ఆయన చర్చలు జరిపారని అన్నారు. మోడీ అంటే చంద్రబాబుకు భయం అందుకే మళ్లీ చర్చలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో పోరాటానికి కలిసిరావాలని ఆయన డిమాండ్ చేశారు. -
మోడీకి కేసీఆర్ ఊడిగం చేస్తున్నారు