Challa vamshi chand reddy
-
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది: వంశీచంద్ రెడ్డి
-
మేము ఇచ్చిన ఆ 5 హామీల వల్లే గెలిచాం..
-
పోతిరెడ్డిపాడుపై బహిరంగ చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీఆర్ఎస్ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ, అవాస్తవ వాదనను టీఆర్ఎస్ నేతలు ముందుకు తెస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు ప్రత్యక్షంగానైనా, వర్చువల్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారానైనా సిద్ధమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరును బహిర్గతం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ఆ ప్రకటనలో వంశీ పేర్కొన్నారు. -
ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యతను వదిలేసి.. ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోందని, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్‌రెడ్డి విమర్శించారు. గత 15 ఏళ్లుగా గ్రామాల్లో ఉపాధి హామీలో భాగంగా కోట్లాది మందికి పనులు కల్పించిన దాదాపు 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఆయన గురువారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పనికూడా అప్పజెప్పి ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్న పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం మోపడం ప్రభుత్వం చేస్తున్న శ్రమదోపిడీగా వంశీచంద్ అభివర్ణించారు. అన్యాయంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే పునర్నియమించాలని, పంచాయతీ, జూనియర్ పం చాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. -
రైతుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ అధికార పీఠం పదిలం చేసుకోవడం కోసమే రైతుబంధు పేరిట రైతులను ముంచుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఓట్లు దండుకోవడం కోసం టీఆర్ఎస్ జిమ్మిక్కుల పథకాలు రూపొందిస్తుందని, రైతుల ఓట్ల కోసం రైతుబంధు పథకాన్ని సృష్టించారని విమర్శించారు. రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి సీఎంకి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ ఏడాది వర్షాకాలానికి 5వ విడత 59 లక్షల 30 వేల మంది రైతులుంటే కేవలం 50 లక్షల 84 వేల మందికి రైతుబంధు డబ్బులను చెల్లించి మిగతా 8 లక్షల 46 వేల మంది రైతుల నోట్లో మట్టి ఎందుకు కొట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో 5 లక్షల 43 వేలు, 3వ విడతలో 5 లక్షల 21 వేలు, 4వ విడతలో 17 లక్షల 80 వేలు, 5వ విడతలో 8 లక్షల 46 వేలు కలిపి మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించలేదని లెక్కలు చెప్పారు. ఈ ఏడాది 5వ విడత రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు అవసరమైతే, కేవలం 5,294 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. -
వంశీచంద్‌రెడ్డిపై దాడి
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి పోలింగ్‌బూత్ వద్ద శుక్రవారం ఉదయం కల్వకుర్తి నియోజకవర్గ కాం గ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనకు ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. జంగారెడ్డిపల్లిలోని పోలింగ్‌బూత్ వద్దకు వంశీచంద్‌రెడ్డి చేరుకుని క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ బూత్ లోపలికి వెళ్లారు. దీనికి బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. క్యూలో ఉన్న వారికి కాంగ్రెస్‌కు ఓటేయమని వంశీచంద్‌రెడ్డి ప్రచారం చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. తాను అభ్యర్థినని పోలింగ్‌బూత్‌లోకి వెళ్లడానికి అనుమతి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పోలింగ్ బూత్‌లోకి దూసుకువచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వంశీ చంద్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అక్కడే ఉన్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో బీజేపీ కార్యకర్తల దాడిలో వంశీచంద్‌రెడ్డి గాయపడ్డారని తెలియడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆయనను నిమ్స్‌కు తరలించిన అనంతరం జాతీయ రహదారిపైకి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ మల్లీశ్వర్‌లు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని కాం గ్రెస్, టీడీపీనేతలను సముదాయించారు. నిమ్స్‌లో నేతల పరామర్శ నిమ్స్‌లో చేరిన వంశ్చంద్ను కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, వీహెచ్, కేవీపీ, కోదండరెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. చికిత్స అనంతరం వంశీచంద్‌రెడ్డి ప్రైవేట్ అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్లారు. చికిత్స తీసుకుంటున్న వంశీచంద్‌రెడ్డి -
80 మేకలు సజీవ దహనం
ఆమనగల్లు : ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ పరిధిలోని చిన్నతండాలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మేకలదొడ్డికి నిప్పంటుకోవడంతో దొడ్డిలో ఉన్న 80 మేకలు సజీవ దహనమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. చిన్నతండాకు చెందిన పాత్లావత్ గోప్యానాయక్ వ్యవసాయ భూమి లేకపోవడంతో మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి మేకలను మేపి చిన్నతండా సమీపంలోని వాగు వద్ద ఉన్న మేకల దొడ్డిలో ఉంచి ఇంటికొచ్చాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు దొడ్డికి నిప్పంటుకోవడంతో అందులో ఉన్న 80 మేకలు సజీవదహనం అయ్యాయి. మంటలకు తాళలేక మేకలన్నీ ఒకదానిపై ఒకటి పడి కాలిన తీరు చూసి పలువురు రైతులు కంటతడి పెట్టారు. మేకల పెంపకం ఆధారంగా జీవిస్తున్న గోప్యానాయక్ కుటుంబం మేకల మృతితో వీధిన పడినట్లు అయ్యింది. విషయం తెలియడంతో గురువారం ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోప్యానాయక్‌ను పరామర్శించి వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం అందించారు. సంఘటనా స్థలాన్ని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ సభ్యురాలు వల్లి పంతునాయక్, సర్పంచ్ శ్వేతాఆనంద్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు శ్రీరాములు, హుమ్లానాయక్, కడ్తాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, ఆమనగల్లు ఎస్సై మల్లీశ్వర్‌లు పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు గోప్యానాయక్ కోరుతున్నారు. -
పాలమూరుకు శత్రువు జూపల్లి: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: పాలమూరుకు మొదటి శత్రువు మంత్రి జూపల్లి కృష్ణారావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి జూపల్లిని ప్రజల్లోనే దోషిగా నిలబెడతానని హెచ్చరించారు. నల్లగొండకు, డిండికి నీళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. జూపల్లి కృష్ణారావు గతంలో చెప్పిన ప్రకారమే నల్లగొండకు నీళ్లు ఇవ్వాలన్నారు. అయితే పాలమూరుకు అన్యాయం చేసే విధంగా జీఓను తెచ్చారని ఆరోపించారు. -
'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా'
నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ప్రశ్నించే హక్కు, అర్హత కానీ వంశీచంద్ కు లేదని జూపల్లి అన్నారు. ఇన్నాళ్లు కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఈ ఏడాది కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరిచ్చి తీరుతామని ఆయన తెలిపారు. తనను రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా అని జూపల్లి ఎమ్మెల్యే పై మండిపడ్డారు. వంశీచంద్ రెడ్డి సొంతూరు అప్పారెడ్డిపల్లికి వచ్చి మీటింగ్ పెడతామని మంత్రి జూపల్లి అన్నారు. -
ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్
హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడు వచ్చినా టీఆర్ఎస్ నేతలకు ఓట్లు కాదు.. ఏట్లే పడతాయని విమర్శించారు. సాగునీటి రంగానికి సంబంధించి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పాలపూర్ రంగారెడ్డికి అనుసంధానం చేయడం సరికాదన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. డిండి పాలమూరు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీఎంకు లేఖ రాసిన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. డిండిని పాలమూరు రంగారెడ్డితో అనుసంధానం చేస్తే ఉద్యమం తప్పదన్నారు. అనుసంధానం జరిగితే అది టీఆర్ఎస్ నేతల వైఫల్యమే అవుతుందన్నారు. -
‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’
గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ శ్రీ కోరారు. ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆమె లేఖ ద్వారా విన్నవించారు. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ అవినీతి, ఆక్రమాలు ప్రశ్నించినందుకు, తన గూండాలు, అనుచరులు ద్వారా బెదిరింపులు వస్తున్నాయని పద్మశ్రీ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తన పై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. కాగా ఈ విషయంపై పద్మశ్రీ ఇప్పటికే విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
విద్యా వ్యాపారంలోకి సీఎం కుటుంబం
అందుకే ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్నారు: ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: విద్యావ్యాపారంలోకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబం వచ్చిందని, అందుకే ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలను స్థాపించిన కేసీఆర్ కుటుంబానికి ప్రయో జనం చేకూర్చడానికే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రైవేట్ వర్సిటీల బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. ఉన్నత విద్యారంగాన్ని బలహీన పర్చడానికే వర్సిటీలకు వీసీలను నియమించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులలో దోచు కుంటున్న సొమ్మును కేసీఆర్ కుటుంబసభ్యులు విద్యా వ్యాపారంలోకి మళ్లిస్తు న్నారని, భారీగా పెట్టుబడులు పెడుతున్నారని వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఏ ఆంధ్రా విద్యాసంస్థలను తెలంగాణ నుంచి తరిమేస్తామని అప్పుడు హెచ్చరించారో వాటిలోనే భారీగా వాటాలు కొంటున్నారని ఆరోపించారు. మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ సీటకూ భారీగా ఫీజులు పెంచారని విమర్శించారు. -
మరో రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివక్షను ప్రదర్శిస్తున్నారని, ఇలానే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కలసి ఆయన గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు నష్టం జరుగుతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ ,రంగారెడ్డి పాతజిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే సీఎం కేసీఆర్ రాజకీయ కుట్ర వల్ల భవిష్యత్తులో జలయుద్ధం వచ్చే ప్రమాదముందన్నారు. టీఆర్ఎస్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఖరీఫ్‌కు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీరు అందించకపోతే ఉద్యమం చేసి సాధించుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు ఉన్నా కల్వకుర్తికి నీళ్లు లేవని విమర్శించారు. పాలమూరు జిల్లాకు పూర్తి స్థాయిలో నీరిచ్చినపుడే బంగారు తెలంగాణ సాధ్యమని, సాగునీటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. -
కర్షకుల కన్నీరు పట్టదా?: వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కర్షకులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పండిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్దతు ధర రాక కష్టపడి పండించిన పంటను రైతే తగలబెట్టుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. కరువు, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పంట పెట్టుబడికి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. కరువు దృష్ట్యా పాడి రైతులకు ఉచితంగా పశుగ్రాసం, మందులు సరఫరా చేయాలని వంశీచంద్ కోరారు. -
ఉప ఎన్నికలకు సిద్ధమా: వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్వేలు, సభ్యత్వంతో టీఆర్ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోందని, బోగస్ కాకుంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పరిపాలన అంతా బోగస్ అని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలు తోందని అన్నారు. టీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని చేయించుకున్న సర్వే కూడా బోగస్ అని అన్నారు. -
కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వంశీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి, సాగునీటి రంగానికి తక్కువగా నిధులను కేటాయించడం ద్వారా తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని సీఎం కేసీఆర్ చెప్పుకున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించు కోకుండా, వ్యవసాయ సమస్యలకు బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేశారని ఆరోపించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులను కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతలను పూర్తి చేయకుంటే రైతులతో కలసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2,722 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కమీషన్లు వచ్చే పథకాలకు, కార్యక్రమాలకే ఈ బడ్జెట్లో నిధులను కేటాయించారని ఆరోపించారు. -
'కేఎల్ఐ ప్రాజెక్టుపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు'
హైదరాబాద్: టీఆర్ఎస్ మేనిఫెస్టో మొదటి అబద్ధాల పుస్తకం అయితే.. రాష్ట్ర బడ్జెట్ రెండో అబద్ధాల పుస్తకమని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2017 ఖరీఫ్ కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు పదే పదే చెబుతూ మోసగిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. హామీ నెరవేరాలంటే బడ్జెట్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఆ మేరకు ఎందుకు నిధుల కేటాయింపు జరపలేదని.. దీంతో కేఎల్ఐ పూర్తి చేయడంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని తెలుస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రూ.1,772 కోట్లు బడ్జెట్ లో కేటాయింపు చేయాల్సింది.. కానీ కేవలం వెయ్యి కోట్లే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ రైతులను ఉరికంబం ఎక్కించేలా ఉందని, మొత్తం బడ్జెట్ లో నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. 'ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ వ్యవసాయంపై చూపుతున్న నిర్లక్ష్యమే దీనికి కారణం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్చి 8, 2017 వరకు 2,722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీఆర్ వ్యవసాయానికి బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక కేటాయింపులు చేశారు. పాలకు ప్రోత్సహకాలను నాలుగు రూపాయలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అది అమలు చేయకపోవడం దారుణం. హరీష్ రావు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు. బూటకపు మాటలు చెబుతున్నారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు. జనం తిరగబడి మీ భరతం పట్టె సమయం దగ్గర పడుతోంది' అని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. -
హామీలపై సీఎం కేసీఆర్ మోసం: వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పిన సీఎం ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. సమస్యలపై నిరసనలకు అవకాశం ఇవ్వకుండా, ధర్నా చౌక్‌ను కూడా శివార్లలోకి తరలించే ప్రయత్నం దారుణమన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు సీఎం కేసీఆర్ కట్టుబడలేదని ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు చేసిన సమీక్షలు రాజకీయ సమీక్షలేనని, విపక్షాల ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాల్లో ఉంటే అవినీతి బండారం బయటపడుతుందనే వారిని సమీక్షలకు పిలవడం లేదని ఆరోపించారు. కల్వకుర్తిలో 3.5 కిలోమీటర్లు తవ్వాల్సిన కాలువను కేవలం అరకిలోమీటరు మాత్రమే తవ్వి, మిగిలిన నిధులను టీఆర్ఎస్ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు. -
'బలిపీఠం ఎక్కించేలా కేసీఆర్ పాలన'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుతుందనుకుంటే.. సీఎం కేసీఆర్ పాలన బడుగుల బతుకులను బలిపీఠం ఎక్కించేలా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతిలో కేసీఆర్ మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు రూ.6738 కోట్లు అయితే, ఖర్చు చేసింది రూ. 3 - 4 కోట్లు మాత్రమేనన్నారు. మేనిఫెస్టోలో రూ.25 వేల కోట్లు బడుగుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని చెప్పారని.. ఆచరణలో ఆ హామీ ఎటుపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీసీల పట్ల కేసీఆర్ చూపుతున్న ప్రేమ మొసలి కన్నీరు లాంటిదే అన్నారు. అసెంబ్లీలో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. దాన్ని తప్పించుకునేందుకే బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ నీరు గార్చడం వల్ల బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోకుండా చిత్తశుద్ధితో ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు అవాస్తవం
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు అవాస్తవ మని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. వారు తనపై విమర్శలు చేసినా... మాట్లాడిన భాష హుందాగా ఉందని, మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని చూసి నేర్చుకోవాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పంప్ హౌస్‌లలో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికే జూపల్లి తనను దుర్భాషలా డుతూ మాట్లాడారని, ఆయనకు తాను క్షమాపణ చెప్పే సమస్యే లేదన్నారు. దేవుడి మాన్యాలు కాజేసిన వారిని, బ్యాం కులు లూటీ చేసిన వారిని ఏమనాలో అవే వ్యాఖ్యలు తాను చేశాన న్నారు. గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూపల్లి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయ డంవల్ల తాను కూడా విమర్శలు చేయా ల్సి వచ్చిందన్నారు. తాను చేసిన ఆరోప ణలపై బహిరంగ చర్చకు సవాల్ విసిరితే తోక ముడిచిన జూపల్లి.. ఇప్పుడు తనపై విమర్శలు చేయిస్తున్నారన్నారు. -
దొంగను దొంగా అనక ఏమంటారు?
హైదరాబాద్: దేవుడి మాన్యాన్ని దోచుకున్నోడిని మోసగాడు కాక మరేమంటారు.. బ్యాంకులను ఎగ్గొట్టిన వాడిని 420 కాక మరేమంటారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పంప్‌హౌస్ డిజైన్ మార్పు వెనక జూపల్లి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. నా ప్రశ్నలకు జూపల్లి దగ్గర సమాధానం లేకే తోక ముడిచారన్నారు. తాను జూపల్లికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. దొంగను దొంగ అనక ఏమంటారని ప్రశ్నించారు. దొంగ దారిన కాలేజీలు పెట్టి, పేద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు దోచుకుంటున్న కసిరెడ్డి నారాయణ రెడ్డితో నాకు పోలికా.. అని ఎద్దేవ చేశారు. జూపల్లి కి లగడపాటి మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరిందని.. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం లగడపాటి కబ్జా భూమిని ఎందుకు స్వాదీనం చేసుకోవట్లదేని ప్రశ్నించారు. ఒక్కరు ఒక్కరుగా కాదు.. అందరు ఓకే సారి వచ్చినా సరే.. సింహం సింగిల్ గా వస్తది.. పందులు గంపులుగా వస్తాయి. ఎంత మంది వస్తారో రండి.. వాస్తవాలు నిరూపించేందుకు నేను రెడీ అని ఆవేశపూరితంగా ప్రసంగించారు. -
‘ఆ మంత్రిది 420 చరిత్ర’
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విరుచుకుపడ్డారు. జూపల్లి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జూపల్లి చరిత్ర తెలిస్తే తెలంగాణ ప్రజలు ఆయన్నుఅసహ్యించుకుంటారన్నారు. లూటీలు.. నేరాలు.. ఫోర్ ట్వంటీ.. చరిత్ర జూపల్లిది అని విమర్శించారు. దేవుని మాన్యాన్ని కాజేసిన దగుల్బాజీ జూపల్లి అని ఘాటుగా విమర్శలు సంధించారు. బ్యాంకు లూటీ అంశంలో స్వంత గ్రామంలో ప్రజలు తరిమికొడితే పారిపోయి హైదరాబాద్‌కు వచ్చిన చరిత్ర, ప్రుడెన్షియల్ బ్యాంకు ముంచిన చరిత్ర జూపల్లిదన్నారు. హైదరాబాద్ లో తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని హుసేన్ సాగర్‌లో తోసి చంపిన ఆరోపణలు జూపల్లిపై వున్నాయన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా .. అని సవాల్ విసిరారు. ఖబర్దార్ జూపల్లి మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. గతంలో కేఎల్ఐ కాల్వలను వెడల్పు తగ్గించి కాంట్రాక్టర్ల వద్ద లంచాలు దండుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ పాలమూరు కాల్వలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. నీతితో కూడిన రాజకీయాలు నావి .. నీతిమాలిన రాజకీయాలు జూపల్లివి అని అన్నారు. తన జీవితం కాంగ్రెస్‌తో మొదలైందని.. కాంగ్రెస్ లోనే అంతమౌతుందన్నారు. -
‘రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా’
హైదరాబాద్: ముడుపుల కోసమే మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పంపు హౌస్ డిజైన్ మారుస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పంప్‌హౌస్ డిజైన్ మార్చవద్దని నివేదించినప్పటికీ నాలుగో కమిటీ వేసి డిజైన్ మారుస్తున్నారని తెలిపారు. ఈ మార్పు వల్ల సర్కారుపై అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని చెప్పారు. ఆ కంపెనీ నుంచి మంత్రి జూపల్లి కి రూ. 50 కోట్లు ముడుపులు ముట్టాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పంప్ హౌస్ డిజైన్ మార్పు సరికాదన్న నిపుణుల కమిటీ రిపోర్టులపై మంత్రి జూపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ రిపోర్టులు తప్పని మంత్రి రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. బహిరంగ చర్చ తేదీని, వేదికను మంత్రి జూపల్లే ఖరారు చేయాలని అన్నారు. -
నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
జూపల్లికి ఎమ్మెల్యే వంశీచంద్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడు తున్న పాలమూరు జిల్లాకు నీరివ్వ కుండా డిండి రిజర్వాయరుకు నీళ్లు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం లోని 62వేల ఎకరాలకు నీళ్లు అంది స్తా మన్న టీఆర్ఎస్.. మోసం చేస్తోందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడగ్గానే కల్వకుర్తి ఆయకట్టుకు నీరివ్వకుండా ఆయకట్టులో లేని డిండి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన విమర్శిం చారు. ఈ విషయమై మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి జూపల్లికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కోసం మాట్లాడాలని కోరారు. జూపల్లి అసమర్థత, చేతకాని తనంతోనే పాలమూరుకు మరోసారి అన్యాయం జరుగుతోందని వంశీచంద్ విమర్శించారు. -
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న టీఆర్ఎస్
కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల భూము లను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ భక్షక ప్రభుత్వంగా మారిందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ భూసేకరణ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం భూ సేకరణను రాజ్యాంగబద్ధంగా చేస్తు న్నామని మంత్రి కేటీఆర్ సభలో చెప్పి నా... క్షేత్ర స్థాయిలో రాజ్యాంగాన్ని ఉల్లం ఘిస్తున్నారన్నారు. జీఓ 45పై హైకోర్టు స్టే ఉందని, జీఓ 123 రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ సురేష్‌కుమార్ ఖేత్ పేర్కొన్నారని గుర్తుచేశారు. భూసేకరణచట్టం 2013 ప్రకారం పట్టాభూములకు, అసైన్డ్ భూములకు సమాన పరిహారం ఇవ్వాల న్నారు. గ్రామసభ తీర్మానం, సామాజిక సర్వే, 80 శాతం అంగీకారం ఉంటేనే భూసేకరణ చేయాలని చట్టం చెబుతు న్నదని వంశీచంద్ వివరించారు.