chinta mohan
-
చంద్రబాబు పరమ పవిత్రుడు కాదు: చింతా మోహన్
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది అబద్ధమని.. పంది కొవ్వు, చేప నూనె కలిసిందనేది.. జరగని పని అంటూ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై చంద్రబాబు చూపించిన రిపోర్టులు తప్పు.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు పరమ పవిత్రుడు కాదన్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ మాటలు తీవ్ర అభ్యంతరకరమన్నారు.చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు.. అమరావతిలో వేల కోట్లు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. కృష్ణా నదిలో రాజధానిని కట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా.. పోలవరంపై ఎవరు ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలి. పోలవరం రాజకీయ నాయకులకు వరంగా మారింది.. పోలవరం పెద్ద మోసం అంటూ చింతామోహన్ వ్యాఖ్యానించారు. -
ప్రసాదం శాంపిల్స్ ను ఇతర రాష్ట్రాల ల్యాబ్ లకు పంపాలి
-
త్వరలో ఏపీసీసీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీరే?
సాక్షి, ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ పార్టీకి త్వరలో అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా కసరత్తు చేపట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి రాజీనామా చేసిన తర్వాత నియమితులైన శైలజానాథ్ ఆ స్థాయిలో పనితీరు కనబర్చలేదని హైకమాండ్ నిర్దారణకు వచ్చింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి, కనీసం తాము ఉన్నామని చాటుకోవాలని భావిస్తోంది. చదవండి: ‘బీజేపీని చూస్తుంటే జాలేస్తుంది.. ఏపీలో అంతా రివర్స్’ ఇందుకోసం పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారని అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ పేర్లు ఏఐసిసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లపై ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ సేకరించనున్నారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్, విజయవాడలలో స్వయంగా పర్యటించేందుకు ఉమెన్ చాందీ పర్యటను ఖరారు చేసుకుంటున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, పల్లంరాజు తదితర నేతలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంది. ఈ సీనియర్ల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను జనవరి నెలాఖరులోగా హైకమాండ్‌కు అందించనున్నారు. ఏపిసిసి చీఫ్ పదవిపై సీనియర్లెవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, పోటీ కూడా నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర రాజకీయ చిత్రంలో కనీసం కాంగ్రెస్ పార్టీని ఉనికినైనా చాటగలిగే నాయకుడు కావాలని హైకమాండ్ ప్రయత్నిస్తోంది. పీసీసీ రేసులో ఉన్న చింతామోహన్ కు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ కాగా, 67 ఏళ్ల పై వయసు ఉండడంతో ఆయన రాష్ట్ర మంతటా చురుగ్గా తిరిగి పార్టీని గాడిలో పెట్టలేరనే వాదన ఉంది. అయితే గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యదర్శిగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవిపి సన్నిహితుడిగా పేరుపొందారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు 52 ఏళ్ల వయసులో ఉండడంతో పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఈ ఇద్దరిలో పదవి ఎవరికి ఇస్తారో చూడాలి. -
రేసులో సాకే, చింతా మోహన్, పద్మశ్రీ!
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేనంటూ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని పారీ్టలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి -
వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్ పేర్కొన్నారు. 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా అంతకు ముందు దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ‘పుట్టిన రోజు సందర్భంగా 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదు. మేం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం.’ అని అన్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు. -
’టీటీడీలో ఆడిట్ అధికారులను నియమించాలి’
సాక్షి, తిరుపతి : టీటీడీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మాజీ ఎంపీ చింతా మోహన్ లేఖ రాశారు. టీటీడీలో తక్షణమే ఆడిట్ అధికారులను, ఒక ఐఆర్ఎస్ అధికారిని నియమించాలని కోరారు. టీటీడీ సభ్యులు కుప్పం నుంచి వచ్చే కూరగాయలను అధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచే కూరగాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్ తరలింపుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. తిరుమల, తిరుపతిలో వడ్డీ వ్యాపారులు ప్రజల్ని దోచుకుంటున్నారని, పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాలు అన్ని గవర్నర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నెల 23లో టీటీడీ స్పందించకపోతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు. -
టీటీడీలో రోజురోజుకు ముదురుతున్న బంగారం వివాదం
-
కోట్లు దండుకునేందుకే ‘పోలవరం’ ప్రాజెక్ట్
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): పోలవరం ప్రాజెక్ట్ పేరుతో నాయకులు కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసిన సొంటి రామ్మూర్తి అనే ఐఏఎస్ అధికారి రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రణాళికను రూపొందించగా, అది రూ.10 వేల కోట్లకు, ప్రస్తుతం రూ.56 వేల కోట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌కు రూ.ఆరు వేల కోట్లు కూడా ఖర్చు కాలేదన్నారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లి ముడుపులు తీసుకుంటున్నారని, అవినీతితో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. దావోస్ పర్యటనలో చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. అంకెల గారడీ తప్ప కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని, అంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపారని విమర్శించారు. రైతులకు బడ్జెట్లో పెద్దపీట వేశామని బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు అప్పులివ్వడం.. తిరిగి వసూలు చేయడం గొప్ప విషయమేమీ కాదన్నారు. ఆత్మ గౌరవం పేరుతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పరువు మంటగలిసిందన్నారు. చంద్రబాబు రూ.లక్ష కోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారంటున్నారని, వాటి వివరాలను బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. దుగరాజపట్నం పోర్టు కోసం గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 100 మంది సంతకాలు చేసి మంజూరు చేయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం పదెకరాలనూ ఇవ్వక ఆగిపోయిందన్నారు. నాయకులు భవానీ నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్, వెంకటయ్య, రామచంద్రయ్య, పరిమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా చింతామోహన్‌కు పోటీగా జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గాలాజు శివాచారి మరో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. -
‘పవన్ ఎవరో నాకు తెలియదు’
సాక్షి, విజయనగరం: జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని, జనసేన పార్టీకి చిహ్నం(సింబల్) లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని గతంలో చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు వెల్లడించారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
1993లో చిరంజీవి రాజకీయాల్లో వచ్చి ఉంటే..
పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు అవినీతి వరంగా మారిపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. సొమ్మొకడిదీ సోకొకడిదీ అన్నట్టుగా పోలవరాన్ని మార్చేశారని అన్నారు. అవినీతి మచ్చ లేదంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరంలో అవినీతే మరకగా మారిందని వ్యాఖ్యానించారు. పోలవరంలో 50శాతం పైగా అవినీతి ఉందని స్పష్టంగా చెప్పారు. నితిన్ గడ్కరీ కి పేరులోనే నీతి ఉందని కానీ ఆయన చేసేది అంతా అవినీతేనని తూర్పారబట్టారు. పోలవరం పేరుతో చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడని చెప్పుకొచ్చారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు తెలిపారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు తన జీవితకాలంలో పూర్తి చేయలేరు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో సినిమా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని పెట్టుబడులు తెచ్చారో వెల్లడించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎక్కడ డబ్బుంటే అక్కడ చంద్రబాబు ఉంటారని విమర్శించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసన్మానాల పేరుతో ప్రజా«ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటితో ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. అసలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది చంద్రబాబేనన్నారు. మరోవైపు లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజధాని డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో విడతల వారీగా సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణశైలి, డిజైన్లు అసాధారణ రీతిలో, అపూర్వంగా ఉండాలని ఆయన నార్మన్ ఫోస్టర్ సంస్థకు సూచించారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నచ్చేలా రాజధాని డిజైన్లు ఉండాలని, అలా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. -
'అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు'
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అవినీతి తప్ప.. అభివద్ధి లేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తుళ్లూరు శపించబడ్డ ప్రాంతమని.. అక్కడ ఎవరు అడుగు పెట్టినా పతనమే అని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరకొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారన్నారు. తన ఇంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పోలవరం పేరు చెప్పి తండ్రీ కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నంద్యాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానంటున్న ముద్రగడ యాత్ర పై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికి ఉందని.. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు టీడీపీ నాయకుడిలాగా మాట్లాడుతున్నారన్నారు. బెదిరించే వైఖరీలో మాట్లాడటం తప్పని అన్నారు. -
'చంద్రబాబు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి'
తిరుపతి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు పతనం దిశగా వెళుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రెండెకరాల స్థలంలో పంటలు పండించామని చెప్పుకొచ్చాడని గుర్తుచేశారు. అయితే వంకాయలు, బెండకాయలు, పాలు ఎక్కడ అమ్మారో చూపాలని ప్రశ్నించారు. తిరుపతిని లేక్ సిటీగా చేస్తానని చెప్పిన చంద్రబాబు దుగరాజపట్నం ఓడరేవుకు 200 ఎకరాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, దుగరాజపట్నం ఓడరేవును రద్దు చేసిన ఘనత బీజేపీ, టీడీపీలదేనని ఎద్దేవా చేశారు. ఇదే గనక తెలంగాణలో జరిగి ఉంటే అక్కడి ప్రజల్లో విప్లవం వచ్చి ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే లైన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సీఎంగా చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో తిరుపతి అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, తిరుపతి అభివృద్ధి కోసం 13 రూపాయల పనులు కూడా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే తిరుపతి అభివృద్ధి జరిగిందన్నారు. 300 పడకల ప్రసూతి ఆసుపత్రికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుందని, క్యాన్సర్ ఆసుపత్రిని రద్దు చేశారని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ఒక్కరే లాభపడ్డారని, దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పక్కనుంటూనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేదల గొంతులు కోసి వేల కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నైనారు శ్రీనివాసులు, తాళ్లపాక గోపాల్, సావిత్రియాదవ్, శాంతి యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం
-మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోట: వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో పోర్టుకు అనుకూలంగా చట్టం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోర్టు రాకుండా అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పోర్టు సాధన కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఆయన వెంట పుచ్చలపల్లి సర్పంచ్ ఇంధ్రసేనయ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంకయ్య, కోట, వాకాడు మండలాల నాయకులు ఉన్నారు. -
దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదు
మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ వాకాడు: యూపీఏ ప్రభుత్వం విభజన చట్టం కింద మంజూరు చేసిన దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదని –తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. వాకాడులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పోర్టును అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పోర్టు కోసం దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం భావితరాలకు ద్రోహం చేయడమేనన్నారు. ఓడరేవు వస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చారిత్రిక నేపథ్యమున్న ఓడరేవు నిర్మాణం కోసం పోరాడుతామన్నారు. -
దుగ్గరాజపట్నం పోర్టుకు ఆ ఇద్దేరే అడ్డంకి
తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ధ్వజం చిట్టమూరు: వాకాడు మండలం దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడే అడ్డంకని కాంగ్రెస్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చిట్టమూరులో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోర్టు వస్తే లక్షల మంది రైతులు, వేలాది మంది నిరుద్యోగులు బతుకులు బాగుపడతాయన్నారు. కానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ఇద్దరూ కమ్మక్కై పోర్టు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ పోర్టుకు పక్కనే ఉన్న ఓ ప్రవేటు పోర్టు యజమానులకు లొంగిపోయి తమ స్వప్రయోజనాలకు పోర్టు ద్వారా హెలికాప్లర్లు వాడుకుంటూ ప్రభుత్వ పోర్టు నిర్మాణం చేపట్టకుండా చూస్తున్నారని ఆరోపించారు. రూ.25 వేల కోట్లతో నిర్మాణం జరిగే వి«దంగా ప్రణాళికలు తయారు చేశారన్నారు. డిసెంబర్ 31 లోపు పోర్టు నిర్మాణ పనులు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్టులో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని చింతామోహన్ ఆరోపించారు. -
దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు
మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ నాయుడుపేట: దక్షణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాయుడుపేట ఆర్అండ్బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుగరాజపట్నం ఓడరేవును తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాలు దుగరాజపట్నం ఓడరేవుతో ఎంతో అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. ఓడరేవుకు అనుబంధంగా వంద పరిశ్రమలు వచ్చే అవకాశ ఉందని తద్వారా లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు లక్షమంది రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రైవేటు పోర్టుల నుంచి హెలికాప్టర్లను వినియోగించుకుంటూ వారికి వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అమ్ముడు పోతున్న జిల్లా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిని చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, వెంకటయ్య, సుబ్బయ్య ఉన్నారు. -
న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి
-న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రాధాన్యం కరువు - తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సాక్షి ప్రతినిధి, తిరుపతి భారత న్యాయ వ్యవస్థలో మార్పులు ఎంతో అవసరమని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాలకు న్యాయం సులభంగా అందేలా మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ అందరికీ న్యాయం అందడం లేదన్నారు. పవర్ ఫర్ ఎవర్ అన్న చందాన డబ్బున్న వారికే న్యాయం త్వరగా దొరుకుతుందన్నారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడారు. 125 కోట్ల భారత జనాభాలో 109 కోట్ల మంది బీసీ, ఎస్సీ, గిరిజన,మైనార్టీలు ఉన్నారనీ, ఈ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కరికి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రాతినిధ్యం దొరకలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ముగ్గురు కీలక న్యాయమూర్తులుగా ఉన్నారన్నారు. న్యాయవాదుల ఫీజులు పెరగడంతో న్యాయం అనేది పేదలకు దూరమవుతుందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే రూ.1 కోటి, హైకోర్టుకు వెళ్లాలంటే రూ.10 లక్షలు ఉండాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం దక్కడం లేదన్నారు. తాను వ్యక్తులను తప్పుపట్టడం లేదనీ, వ్యవస్థలోని లోపాలను చెబుతున్నానన్నారు. ఇదేనా సామాజిక న్యాయం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను వ్యక్తిగా పోరాటం చేయాలనుకుంటున్నట్లు మోహన్ చెప్పారు. అవసరమైతే భారత రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. -
'స్వర్ణభారతి ట్రస్ట్ కు రూ. 160 కోట్లు మళ్లించారు'
తిరుపతి కల్చరల్: పదవుల్లో ఉండి అడ్డంగా వేలకోట్లు దోపిడీ చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులపై తక్షణమే సీబీఐ విచారణ జరపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేడ్కర్ భవన్లో మం గళవారం నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 160 కోట్ల కేంద్ర నిధులు స్వర్ణభారతి ట్రస్ట్‌కు మళ్లించిన ఘనత వెంకయ్య నాయుడిదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, తీసుకొచ్చిన దుగ్గరాజట్నం, కేన్సర్ ఆసుపత్రి, మన్నవరం, 7,008 నిరుపేదల నివాస గృహాలను రద్దు చేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చింతామోహన్ హెచ్చరించారు. ఎలాంటి పదవులు లేకుండా తన వ్యాపార మేథస్సుతో ఆస్తులు సంపాదించిన వైఎస్ జగన్‌పై సీబీఐ విచారణ చేయడం సరికాదన్నారు. అనంతరం చింతామోహన్ వినూత్నంగా రోడ్డుపైకి వచ్చి చేతిలో చీపురు పట్టి చెత్త ఊడ్చి నిరసన తెలిపారు. రోడ్డులో చెత్త ఊడ్చినట్లు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఊడ్చేస్తానంటూ చింతామోహన్ సంకేతాలిచ్చారు. -
'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'
సత్యవేడు: హైదరాబాద్‌లో రూ. లక్ష కోట్ల విలువజేసే 1,000 ఎకరాల భూమిని దోచుకున్న భూ రాబందుల బాగోతం టీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుతుందన్న భయంతోనే సెక్షన్ 8 అమలును టీడీపీ కోరుతోందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పనులను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఆ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే నీరు -చెట్టు పేరుతో వెచ్చిస్తోందన్నారు. ఉపాధి పథకం టీడీపీ నాయకుల ఆర్ధికాభివృద్ధి పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాజకీయ సంక్షోభం తప్పదని ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని, చంద్రబాబు స్థానంలో నారా లోకేష్‌బాబు సీఎంగా రావవచ్చని జోస్యం చెప్పారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఈ హాస్పిటల్‌ను విజయవాడకు తరలించేందుకు సదరు మంత్రి ప్రయత్నిస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే.. కాంగ్రెస్ ఊరుకోబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఓ అధికారి రూ. 15 లక్షలు ఓ పెద్ద నేతకు సమర్పించి సత్యవేడుకు వచ్చారన్నారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!
తిరుపతి కల్చరల్: ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక అసలు కథ మరొకటి ఉందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు తమకు హైదరాబాద్‌లో ఉన్న వెయ్యి ఎకరాల భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు తగలడంతో దాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర పడిందన్నారు. కానీ టీడీపీ నేతలు ఏసీబీకి దొరికిపోవడంతో వారి నిజస్వరూపం బయట పడిందని చెప్పారు. ఏపీలో ఆగస్టు చివరికల్లా రాజకీయ సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అధికార పార్టీ నాయకులే తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే చిత్తూరు, కడప జిల్లాలు అభివృద్ధి చెందడంతోపాటు లక్ష ఉద్యోగాలు వస్తాయని, అయినా ప్రభుత్వం దానిపై దృష్టి సారించడంలేదన్నారు. -
'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ శనివారం తిరుపతిలో జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నిలకు మాత్రం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన ఓ ఒక్క హామీ అమలు చేయలేకపోయారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేస్తానని చింతా మోహన్ తెలిపారు. అందుకోసం సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చింతా మోహన్ ప్రకటించారు. -
'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'
తిరుపతి : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని, దేశ రాజకీయాల్లో జేబీ పట్నాయక్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కాగా గుండెపోటుతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ జేబీ పట్నాయక్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. జేబీ పట్నాయక్ మృతదేహం మరికాసేపట్లో సాంస్కృతిక విద్యాపీఠం వద్దకు తీసుకెళ్లి.. అనంతరం ప్రత్యేవ విమానంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తరలిస్తారు. -
'రిగ్గింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి'
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని... టీడీపీ అక్రమ పద్దతులు అనుసరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో చింతామోహన్ మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఒంటి గంట తర్వాత రిగ్గింగ్ చేయడానికి టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని విమర్శించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టీడీపీ మట్టికరుస్తుందని... కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 15న మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తమ అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నిక శుక్రవారం ప్రారంభమైంది. -
ఏకగ్రీవం కోసం పాట్లు
ఎన్నికల హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి పార్టీ కేడర్‌లో అసంతృప్తి కాంగ్రెస్ మాటల యుద్ధం తెలుగుదేశం అధినాయకత్వంలో ఆందోళన తిరుపతి: ఉప ఎన్నికను ఎలాగైనా ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిపై కేడర్‌లో అసంతృప్తి గుబులు. దీంతో ఏకగ్రీవం వైపే ఆలోచి స్తోంది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అగ్రనేతలు పైకి నటిస్తూన్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, అభ్యర్థి అల్లుడు సంజయ్ సైతం ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జన్మభూమి కమిటీల్లో పూర్తిగా కాంగ్రెస్ నుంచి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం.. పూర్వం నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న వారి అసంతృప్తికి కారణమైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల్లో సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్? శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం నాయకుడు పీఆర్‌మోహన్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా నియమితులైనట్లు తెలిసింది. చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా నియమించడానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. వారిలో సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరితో పాటు మరో ఐదుగురిని నియమించినట్లు సమాచారం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా పీఆర్ మోహన్ శాప్ చైర్మన్‌గా పనిచేశారు. ఏకగ్రీవం కోసం పాట్లు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిమాణాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది.