chittooor distirict
-
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్‌తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
నగరి: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్డేట్స్ ► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. నగరిలో సీఎం జగన్ కామెంట్లు అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు. సీఎం జగన్ ప్రసంగం ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం. మంత్రిరోజా కామెంట్లు ► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు. ► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం ► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం ► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. ► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు. ► రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. 📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. 📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. 📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది. 📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. -
చిత్తూరులో టీడీపీ కార్యకర్తల వీరంగం.. పోలీసులనే రక్తం కారేలా..
పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు. అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు. తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు. రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్. ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం -
మరో నకిలీ టీడీడీ వెబ్‌సైట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
-
నారా లోకేష్ యువ గళానికి జనస్పందన కరువు
సాక్షి, చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు జనస్పందన కరువైంది. అట్టర్ ప్లాప్ దిశగా లోకేష్ అడుగులు పడుతున్నాయి. పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రకు జనం ఆసక్తి చూపించడం లేదు. వ్యక్తిగత సిబ్బంది మినహా కార్యకర్తలు సైతం పెద్దగా కనిపించడం లేదు. జనాలులేక వెలవెల బోతున్న యువగళం పాదయాత్రకు కార్యకర్తలు సైతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విశేషం ఏంటంటే.. కార్యకర్తలకంటే బందోబస్తుకు వచ్చిన పోలీసులు, మీడియా సిబ్బంది సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
-
కబడ్డీ కోర్టులో రోజా.. ఆటగాళ్లలో జోష్ నింపిన నగరి ఎమ్మెల్యే
తిరుపతి తుడా: జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌తో తిరుపతిని క్రీడాపురిగా తీర్చిదిద్దారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం స్థానిక ఇందిరా మైదానంలో మూడోరోజు కబడ్డీ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ప్లేయర్లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త సొబగులు వచ్చాయని తెలిపారు. తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పెద్దపీట వేస్తారని కొనియాడారు. తిరుపతి ఇందిరా మైదానంలో కబడ్డీ లీగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, వేదికపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణ ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం వెనుక తిరుపతి ప్రజలు, వ్యాపారులు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సహకారం ఉందని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అత్యున్నతంగా ప్రోటీలను నిర్వహించడం ఎమ్మెల్యే భూమనకే చెల్లిందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచి శ్రీకాంత్, అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం.. ఆనందం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్రీడలతో ఆర్యోగం, ఆనందం దక్కుతుందని తెలిపారు. ఈఓ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు టీటీడీ పూర్తి సహకారం అందించిందన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా వసతి సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో జోష్ నింపేందుకు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, మేయర్శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: చంద్రబాబు అడగగానే రూ.కోటి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏపాటి విలువ ఉండేదో అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం మొదలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదల వరకు పూర్తిస్థాయిలో వివక్ష కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం చూడబోం అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగానే పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయగానే కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులు కేటాయించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల ఓ ప్రçహసనంగా ఉండేది. 2014–19 కాలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డిఎఫ్) కింద బాబు తన ఇష్టానుసారం నిధులు విడుదల చేయించారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యాయి.అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్)గా మార్పు చేసి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారు. బాబు లేఖలు రాయగానే రెండు దఫాలుగా నిధులు 2020 మే 16న సీఎండీఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ఆ లేఖ అందిన వెంటనే అప్పటి కలెక్టర్ నారాయణభరత్‌గుప్త రూ.70.85 లక్షలను విడుదల చేశారు. ఆ నిధులతో శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 32 తాగునీటి పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ మూడో తేదీన బాబు లేఖ రాయడంతో అధికారులు రూ.29.15లక్షలు విడుదల చేశారు. మొత్తంగా రూ.కోటి నిధులతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా గుక్కెడు నీటికి నోచుకోని జనం సంబరాలు చేసుకున్నారు. రాజకీయాలకతీతంగా కుప్పం అభివృద్ధి 30 ఏళ్లుగా వెనుకబడిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇన్నేళ్లకు గాడిన పడింది. రాజకీయాలకతీతంగా అన్ని నియోజకవర్గాలనూ ప్రగతిబాట పట్టించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు రెండేళ్లలోనే నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి. కేఆర్జే భరత్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తీరిన తాగునీటి సమస్య వర్షాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామంలోని తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. సుమారు 150కి పైగా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల వ్యయంతో మూడు బోర్లు వేయించారు. ఇప్పుడు తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. సురేష్, కృష్ణదానపల్లె, కుప్పం మండలం -
‘వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటు’
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆదర్శవంతంగా వాలంటీర్లు నిలుస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఎస్ఆర్ పురంలో ప్రభుత్వ పథకాలపై వాలంటీర్లతో నారాయణస్వామి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. మంచి కార్యక్రమాలు ఏవి జరిగిన చంద్రబాబుకు గిట్టవని దుయ్యబట్టారు. చదవండి: ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు -
ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి: చెవిరెడ్డి
-
శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ
-
కుప్పం లో జరుగుతున్నా అభివృద్ధి బాబు కి కనిపించలేదా ?
-
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?
-
చిత్తూరు జిల్లా: ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే!
సాక్షి, చిత్తూరు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ తరువాత చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. రామచంద్రా పురం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా... నారాయణవనం మండలం లోని 19 పంచాయితీలలోని ఐదు పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులే ఏకగ్రీవం కావడం విశేషం. అంతేగాక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయితీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి.(చదవండి: వైఎస్సార్ జిల్లా: ఏకగ్రీవాలు ఇవే!) ఏకగ్రీవ పంచాయతీలు రాయల చెరువు-మాదాసు మురగదాస్ సి. రామాపురం-సుబ్రమణ్యం రెడ్డి కొత్త వ్యాప కుప్పం-ఇస్మాయిల్ రెడ్డి నారాయణవనం మండలం నారాయణవనం టౌన్- శారద భీముని చెరువు- మురుగేశన్, బొప్పరాజుపాళ్యం- మునికుమారి, కసింమిట్ట- శశికళ, తిరువట్యం- నాగూర్ పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలం కొత్త పాలెం- జి. లోకేష్ మోదం పల్లి- ఎం. సుబ్బులు బొమ్మ సముద్రం- వి. రఘు చిన్న కాలపల్లి-మనోరంజిని ఎం పైపల్లి- జమున పూర్తి మర్ది- పి. సుశీలమ్మ కొత్తపల్లి- కె. బాలాజీ మడి కొత్తపల్లి- కవిత పొలకల- వై. వాసంతి ఇరువారం పల్లి- కె. సులోచన ఇక పూతలపట్టు పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో 11 మంది సర్పంచులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కాగా, ఒకరు టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. నగిరి మండలం వి.కె.ఆర్.పురం సర్పంచిగా నందిని ఏకగ్రీవం వేలవాడి- చంద్రకళ బుగ్గ అగ్రహారం- రవికుమార్ ఆయనంబాకం- శేఖర్ విజయపురం- మురళీకృష్ణ విజయాపురం మండలం మాధవరం- మమత శ్రీహరిపురం-జ్యోతి కోసలనగరం- ఉమా మహేశ్వరి -
అంతులేని విషాదం: చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది
కలకడ : భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతిని విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్య కు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. కలకడవాసులను కళ్లు చెమర్చిన ఈ ఘటన వివరాలు .. కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దుఃఖాన్ని మింగుకుని తల్లిదండ్రులు ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా దాచారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేర డంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి.(చదవండి: పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!) వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి రైలు నుంచి జారిపడి వృద్ధుడు.. చంద్రగిరి: మండలంలోని ముంగళిపట్టు వద్ద రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతనికి సుమారుగా 70 ఏళ్లు ఉంటాయని, చంద్రగిరి–ముంగళిపట్టు మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని పాకాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పాకాల రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. శ్రీసిటీలో ఇంజినీర్ సత్యవేడు: శ్రీసిటీలోని ఈఎంపీ రోడ్డు వద్ద ఆదివారం లారీ ఢీకొని జమిల్ కంపెనీ ఇంజినీర్ ఎస్ మహ్మద్‌హుసేన్(30) మృతి చెందారు. రాయచూర్(కర్ణాటక)కు చెందిన ఎస్.మహ్మద్‌హుసేన్ శ్రీసిటీలోని జెమిల్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం తడలో స్నేహితుని ఇంటికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈఎంపీ రోడ్డు వద్ద లారీ ఢీకొంది. మహ్మద్ హుసేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సత్యవేడు క మ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. భార్య రాయచూర్‌లో ఉంటోంది. ఏడాది కిందటే వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వేట కొడవలితో వీరంగం పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఓ వ్యక్తి వేటకొడవలితో ఆదివారం సాయంత్రం వీరంగం సృష్టించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్ తన పొలంలోని పంటను ఇతరుల మూగజీవాలు మేశాయని ఆ గ్రహం చెందాడు. వేటకొడవలితో గ్రామానికి చెందిన సుబ్బమ్మ, వెంకటనారాయణ, గణేశ్, రమణ, శ్రీనివాసులు, హరిపై దాడి చే సి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన గణేశ్(22)ను వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి మహిళ శక్తి స్వరూపిణి: ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు : చెడుపై పోరులో ప్రతి మహిళ దుర్గాదేవిగా మారాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆకాంక్షించారు. ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణి అని ఆమె అన్నారు. దసరా పండుగను ఎమ్మెల్యే రోజా తన నివాసంలో జరుపుకున్నారు. దుర్గాదేవి పూజలో పాల్గొన్న ఆమె రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా, సామాజికంగా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆయన పరిపాలనలో మహిళలు అందరూ నిజమైన విజయదశమి జరుపుకుంటున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉందన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడానికి తాను నిజంగా గర్వపడుతున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. (అంతిమ విజయం మంచినే వరిస్తుంది.. ) -
టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు : బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవన్, శైలజ టిక్‌టాక్ ద్వారా పరిచయమయ్యారు. నెల క్రితమే వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శైలజది చిత్తూరు కాగా, పవన్ స్వస్థలం మంగళగిరి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య -
చిత్తూరి చిన్నోడి కోసం యూకే ఎంపీలు క్యూ
లండన్: సాయం చేయాలనుకునే వారికి ఎదుటి వారి కష్టాలు చూసి స్పందించే మనసు ముఖ్యం. ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఏదో ఓ రకంగా మనం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. దీనికి వయసుతో పని లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ ఐదేళ్ల చిన్నారి. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఎందరో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక నానా తిప్పలు పడ్డారు. ఇలాంటి కష్టకాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు ఎందరో ముందుకు వచ్చారు. తోచిన సాయం చేశారు. మాంచెస్టర్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాలా అనే ఐదేళ్ల చిన్నారికి కూడా సాయం చేయాలనే కోరిక కలిగింది. తనేమో ఇంకా చిన్న పిల్లాడే. సాయం చేయాలనుకుంటే తన పిగ్గి బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఇచ్చేసి ఊరుకోవచ్చు. కానీ అనీశ్వర్ భారీ మొత్తంలో సాయం చేయాలనుకున్నాడు. (ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి: ఉపాసన) ఈ క్రమంలో సర్ థామస్ మూర్ అనే 100 ఏళ్ల వృద్ధుడు అనీశ్వర్‌కు ఓ మార్గం చూపించాడు. యూకేలో కరోనాతో బాధపడేవారికి వైద్యం అందించడం కోసం 100 ఏళ్ల వయసులో థామస్ మూర్ ఓ సర్కిల్ చుట్టు 100 రౌండ్లు నడిచి విరాళాలు సేకరించాడు. ఈ సంఘటనతో స్ఫూర్తి పొందిన అనీశ్వర్.. మరో 60 మంది పిల్లలతో కలిసి ‘లిటిల్ పెడలర్స్ అనీశ్వర్ అండ్ ఫ్రెండ్స్’ పేరుతో మేలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి దాదాపు 3200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. ఇలా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు సాధించాడు. ఈ మొత్తాన్ని కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు అందించాడు. ప్రస్తుతం యూకేకు సాయం చేయడం కోసం క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభించాడు అనీశ్వర్. (అందం.. సేవానందం..) ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అనీశ్వర్ ఆశయాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి యూకేలో సెలబ్రిటీ అయ్యాడు. బ్రిటీష్ రాజకీయ నాయకులు అనీశ్వర్‌ను కలిసి.. ప్రశంసిస్తున్నారు. వారింగ్టన్ సౌత్ ఎంపీ ఆండీ కార్టర్ అనీశ్వర్ ఆశయాన్ని మెచ్చుకున్నారు. మరో ఎంపీ షార్లెట్ మేనేజర్ ఆగస్టు 6న అనీశ్వర్‌ను కలవనున్నారు. Ever since @UttaraVarmaTOI's article about 5 year old #Telugu boy Aneeshwar's fundraising for COVID I've talked about him. My friend @poonamkaurlal asked to say Namaste so Telugu diaspora contact, @uday_nagaraju, fixed a wonderful chat. Bike ✔ Now on to 🏏 4 Lakhs & counting 🙏 pic.twitter.com/mJ0Nt3ZIOo — Dr Andrew Fleming (@Andrew007Uk) June 28, 2020 -
కరోనాను జయించిన 16 నెలల బాలుడు
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన 16 నెలల బాలుడు కరోనా వైరస్‌ను జయించాడు. తండ్రి, తల్లితో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న ఆ బాలుడు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. తిరుపతి స్విమ్స్ ఉద్యోగి అయిన బాలుడి తండ్రికి తొలుత కరోనా వైరస్ సోకగా, ఆ తర్వాత ఇంట్లో వారికి సోకింది. దాంతో వారంతా క్వారంటైన్లోకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. కాగా, పిల్లాడు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాగా, ఆ బాలుడు కరోనా నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో బాలుడితో పాటు తల్లి, తండ్రిని డిశ్చార్జ్ చేశారు. (తమ్ముడి మృతితో ఆగిన ఇద్దరక్కల గుండెలు! -
స్వీయ నియంత్రణే మందు
-
స్పందనపై నమ్మకాన్ని పెంచండి
‘‘ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యం కావాలి. స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎన్నో ఆశలతో వస్తారు. వారి సమస్యలకు అధికారులు పరిష్కారం చూపగలిగితే ఎంతో సంతో షిస్తారు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో స్పందనపై చిత్తూరు, వెఎస్సార్ కడప జిల్లాల పరిధిలోని ఉన్నతాధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర మున్సిపల్ అడ్మిని్రస్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం బృంద చర్చ నిర్వహించారు. అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీ క్యాంపస్ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ అధికారులకు సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమరి్పంచేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించి అధికారులకు నాణ్యమైన స్పందన జరిపేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతిలో స్పందనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి స్పందన మెరుగ్గా ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. హాజరైన అధికారులు, (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం స్పెషలాఫీసరు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నారు. అర్జీలను తిరస్కరించే సమయంలో ఆలోచించి చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 45,665 ఫిర్యాదులు వస్తే అందులో 8,239 ఫిర్యాదులు తిరస్కరింపబడ్డాయన్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 49,131 సమస్యలు వస్తే 5,476 సమస్యలు తిరస్కరించారని చెప్పారు. సీఎం ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలు చాలావరకు చిన్నచిన్న సమస్యలేనని, వీటిని సకాలంలో పరిష్కరించగలిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పా రు. అయితే చాలా మంది అధికారులు స్పందనలో వచ్చే అర్జీలను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలు సలహాలు, సూచనలు వస్తుంటాయని వాటిని స్వీకరించాలని చెప్పా రు. అధికారులు వివిధ రకాల పనుల్లో ఉన్నప్పటికీ, స్పందనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ స్పందనపై నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల అధికారులకు స్పందన నిర్వహణపై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ వెట్రిసెలి్వ, డీఐజీ రాజశేఖర్ బాబు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీ– 2.చంద్ర మౌళి, ట్రైనీ కలెక్టర్ çపృధ్వీతేజ్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, మదనపల్లె సబ్–కలెక్టర్ కీర్తి చేకూరి, తిరుపతి,చిత్తూరు ఆర్డీవోలు కనక నరసారెడ్డి, సి.రేణుక, డీఆర్వో విజయ చందర్, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్ విజయవంతం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అధికారులకు నిర్వహించిన గ్రూప్ డిస్కషన్ విజయవంతమైందని సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ చెప్పారు. అధికారులు పలు అంశాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ అన్ని స్థాయిల్లో జరగాలని తెలిపారు. చెవిరెడ్డికి సీఎంవో అధికారుల కితాబు తిరుపతి రూరల్ : రాష్ట్రంలోనే వినూత్నంగా, ఆదర్శవంతంగా స్పందన కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కితాబు ఇచ్చారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో స్పందన కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి వర్క్‌షాపులో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, స్పందన కార్యక్రమం రాష్ట్ర కో–ఆర్డినేటర్, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులను కేవలం బాధితులుగా, ఫిర్యాదుదారులుగా కాకుండా, అతిథులుగా చూస్తూ వారికి టీ, స్నాక్స్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారని సీఎంవో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ఎమ్మెల్యే రూ.7 లక్షల సొంత నిధులను సైతం అందించటం అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. స్పందన కార్యక్రమం నిర్వాహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందని సూచించారు. -
పారదర్శకంగానే గ్రామ సచివాలయ నియామకాలు
సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలూ వద్దని చిత్తూరు ఎస్పీ చింతం వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ పోస్టుల్లో అక్రమాలకు, దళారులకు తావుండకూడదని ఇ ప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కొందరు వ్యక్తులు ప్రముఖలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సచివాలయ పోస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని గుర్తించడానికి ఓ బృందాన్ని నియమించామన్నారు. వాట్సప్, ఎఫ్బీ గ్రూపుల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతుందని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోస్టులు ఇప్పిస్తామని నమ్మించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారాలు ట్రోల్ చేసినా డయల్–100, పోలీస్ వాట్సప్ నెంబరు– 9440900005కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్
అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
వ్యవ‘సాయం’ కరువై..అప్పులే దరువై..
నేల తల్లినే నమ్ముకుని రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కష్టాల సేద్యంలో అప్పులే దిగుబడి అయినా గుండె దిటవు చేసుకున్నాడు. ఏదో ఒక రోజు తన ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో వ్యవసాయానికి అప్పులు చేస్తూ వచ్చాడు. చివరకు అప్పుల మోత పెరిగి, రుణదాతల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో కుంగిపోయాడు. పురుగుల మందును ఆశ్రయించాడు. తాను నమ్ముకున్న భూమాత ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. సాక్షి, చౌడేపల్లె/ చిత్తూరు: అప్పులు తీర్చలేక పురుగుల మందుతాగి రైతు బలవన్మరణం చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. దిగువపల్లె పంచాయతీ భవానీ నగర్‌కు చెందిన ఏ.దొరస్వామినాయుడు(43) నిరుపేద రైతు. అతనికి పక్షిరాజపురానికి సమీపంలో పొలం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న పొలంలో నాలుగేళ్ల కాలంలో నాలుగు బోర్లు వేశాడు. ఇందు కోసం రూ.4లక్షలు అప్పు చేశాడు. అలాగే ఇతరుల వద్ద వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నాడు. 1000–1050 అడుగుల లోతుతో బోర్లు వేసినా ఆశించిన ఫలితం శూన్యం. ఇటీవల వేసిన బోరులో అరకొరగా నీళ్లు రావడంతో ఆ గంగనే నమ్ముకున్నాడు. పంట బాగా పండితే అప్పులు తీర్చవచ్చనే కొండంత ఆశతో మళ్లీ లక్ష రూపాయలకు పైగా ఖర్చుచేసి టమాట పంట సాగు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది కృష్ణమూర్తి అనే వ్యక్తిని వ్యవసాయంలో భాగస్వామిగా చేసుకుని ఇరు కుటుంబాల మహిళల నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి, వ్యవసాయానికి రూ.85వేలు పంట రుణం తీసుకున్నాడు. అప్పటికే బ్యాంకు, ప్రైవేటు రుణాలు కలిపి రూ.12లక్షల వరకు అప్పు చేరింది. ఈ నేపథ్యంలో ఉన్న బోరులో నీటి సామర్థ్యం తగ్గి పంటలకు నీళ్లు సరిపోలేదు. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో ఆందోళన చెందాడు. మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అప్పులు కంటికి కునుకు లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భోజన సమయంలో తన కుటుంబ సభ్యుల వద్ద అప్పుల విషయమై తీవ్రంగా కలత చెందినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం టిఫిన్ చేయకుండా అన్యమనస్కంగా పొలానికి వెళ్లాడు. బోరు వద్ద కూర్చుని ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. అక్కడే దరిదాపుల్లోని పొలం పనిలో ఉన్న అతడి చిన్నాన్న భార్య గోపాలమ్మ అతడిని చూసి వ్యవసాయ పనులు చేస్తున్నాడని తలచి కొంతసేపటికి వెళ్లిపోయింది. అప్పటికి ఉదయం 9 గంటలు. 10.30 గంటల సమయంలో ఆర్ఆర్ కాలనీకి చెందిన అంజి అటు వైపు వెళ్లాడు. బోరు వద్ద నోటిలో నురుగ వస్తూ, అపస్మారక స్థితిలో పడి ఉన్న దొరస్వామిని చూశాడు. అతడి పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉండడంతో విషయం అర్థమైంది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దొరస్వామి కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన దొరస్వామి నాయుడుని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య భారతి, పిల్లలు రేవతి, కీర్తి, జయంతి, జగదీశ్ ఉన్నారు. ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ మృతురాలి భార్య తన పిల్లల్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం పలువురినీ విచలితుల్ని చేసింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ అనిల్‌కుమార్, ఆర్ఐ ప్రకాష్, వీఆర్వో నారాయణ మృతుని పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మదనపల్లె ప్రభుత్వాçసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం దొరస్వామినాయుడు కుటుంబాన్ని ఆదుకుంటా మని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆయన మృతుని కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ సంతాపం వ్యక్తం చేశారు.