Citizenship Amendment Bill
-
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్ల (సీఏఏ)కు సంబంధించి అనుబంధ చార్జిషీట్లో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్‌కు చెందిన యోగేంద్ర యాదవ్, ఇతర మేథావుల పేర్లను వెల్లడించిన ఢిల్లీ పోలీసులు నేర న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని కాంగ్రెస్ నేత పీ చిదంబరం అన్నారు. సమాచారం, చార్జిషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక దశలుంటాయని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. చదవండి : ‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు ఇంకా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డిస్క్లోజర్ స్టేట్మెంట్లో ఆర్థిక వేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ రాహుల్ రాయ్‌ల పేర్లున్నాయి. కాగా వీరిని తాము నిందితులుగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు అనుబంధ చార్జిషీట్ దాఖలు కావడంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. -
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రతిపాదనల అమలుపై సోమవారం అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్పీఆర్, ఎన్నార్సీ లాంటి చర్యల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ పక్షాన సీఎం కేసీఆర్ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడి తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీర్మాన ప్రతులను చించేసి స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తుండగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని సభ ముందు ఆమోదానికి ఉంచారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని మండలి సైతం ఆమోదించింది. నిప్పులు చెరిగిన కేసీఆర్.. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోం దని మండిపడ్డారు. లౌకిక, ప్రజా స్వామిక, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కేంద్రం మంటగలుపుతోం దని నిప్పులు చెరిగారు. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓసారి విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఏఏ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, దీనిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃసమీక్ష చేయాలని విన్నవించారు. టీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్లో సీఏఏను వ్యతిరేకించిందని, దానికే కట్టుబడి అసెంబ్లీలోనూ వ్యతిరేకంగా తీర్మానిస్తున్నామని ప్రకటించారు. సీఏఏతో దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రజాస్వామిక, లౌకికవాదులంతా దీన్ని నిరసిస్తున్నారని చెప్పారు. వసుధైక కుటుంబవాదానికి వ్యతిరేకం.. తెలంగాణ తన సొంత నిర్మాణం చేసుకుంటూనే, దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ సామాజిక భద్రతలో రాష్ట్ర భద్రత కూడా ఇమిడి ఉన్నందున సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వసుధైక కుటుంబంగా కలలు కంటున్న తరుణంలో, సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తున్న ఈ సమయంలో సీఏఏను తెరపైకి తేవడం సమంజసం కాదన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారు. కొందరు ఎంపీలు, కేంద్ర మంత్రులు దుర్మార్గంగా మాట్లాడారు. గోలీమారో సాలోంకు.. అంటూ బాధ్యత మరిచి వ్యహరించారు. దేశానికి ఇది వాంఛనీయం కాదు. దేశం ఇలాందిటి అంగీకరించదు. ఈ రాక్షాసానందం దేశానికి మంచిది కాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి దెబ్బతింటుంది. దేశానికి వేరే ఇతర సమస్యలేవీ లేనట్లు, ఇదొక్కటే సమస్య అన్నట్లు కల్లోలం లేపొద్దు’అని పేర్కొన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారి సంగతేంటి? ‘సీఎంగా నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. చింతమడక ఇంట్లో పుట్టిన. జన్మపత్రికే ఉంది. బర్త్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి. దేశంలో నాలాగే కోట్లాది మంది సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితేంటి? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఓటరు కార్డు ఇచ్చారు. సీఏఏకు ఓటింగ్ కార్డు పనికి రాదు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు పనిచేయదంటున్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటర్ కార్డు కూడా సీఏఏకు పనిచేయదంటే ఎలా? దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పట్లేదు. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోడ కడతామన్నారు. మయన్మార్ నుంచి చొరబాట్లు రాకుండా భారత్‌లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతామంటే మేమూ మద్దతిస్తాం’అని తెలిపారు. వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా.. ‘ముస్లింలను మినహాయించి కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అవుతారా? అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానిస్తే అసెంబ్లీలోని సభ్యులంతా దేశద్రోహులేనా. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎల్కే అడ్వాణీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తేల్చాయి. అలాంటి విఫల ప్రయోగం మళ్లీ అవసరామా? ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిశీకుల పరిస్థితేంటి? ఇతర ప్రాంతాల్లో వలసవచ్చి ఉంటున్న వారి పరిస్థితేంటి? విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా’అని సీఎం తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ద్వంద్వ వైఖరి ఎందుకు.. ‘పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఎన్నార్సీ చేస్తామని ఉంది. ఎన్నార్సీ చేయం.. ఎన్పీఆర్ మాత్రమే చేస్తామని కేంద్ర హోంమంత్రి అంటున్నారు. నివేదిక ఒకటుంటే, చెప్పేది ఇంకోటుంది. దేన్ని నమ్మాలి. అందుకే అగ్గి పుట్టింది. కేంద్రానికి ద్వంద్వ వైఖరి అక్కర్లేదు. దేశంలో 50–60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి.. ద్వంద్వ వైఖరి ఎందుకు? పౌరసత్వం ఇవ్వాలనుకుంటే రాద్ధాంతం అవసరం లేదు. నేరుగా ఇంకో విధానంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలసి పనిచేస్తున్నంత మాత్రాన అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. కశ్మీర్ విషయంలో 370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతిచ్చింది మేమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్పై స్టే తీసుకురావాలని అక్బరుద్దీన్ అడిగిన అంశంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఒకే భావజాలం ఉన్న ఇతర రాష్ట్రాలను సమీకరించి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఎన్పీఆర్పై స్టే తెచ్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు. తక్షణమే అమలు నిలిపేయాలి: సీఎల్పీ నేత భట్టి ఎన్పీఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే సరిపోదని, ఆ చట్టం అమలు కాకుండా నిరోధించినప్పుడే తీర్మానానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక తీర్మాన చర్చలో భట్టి మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దేశ పౌరుడో కాదో నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. బర్త్ సర్టిఫికెట్లు, మీ తల్లిదండ్రులు ఎక్కడివారనే సమాచారాలపై ధ్రువపత్రాలు ఇవ్వకపోతే.. శరణార్థి శిబిరాలకు పంపుతామనే కేంద్ర నిర్ణయం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన లాంటి వారెందరో ఎన్పీఆర్ నియామవళికి అనుగుణంగా ఈ దేశ పౌరులమో కాదో నిరూపించుకోవడం కష్టమన్నారు. ఈ దేశ పౌరులకు ఆందోళనకరంగా మారిన సీఏఏ, ఎన్పీఆర్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మోదీ ప్రభుత్వం ఈ సమస్యను ఒక మత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పౌరుల భద్రత, క్షేమం కోసం చట్టాలు చేయాల్సిన కేంద్రం కొన్ని వర్గాలను అణచివేసేలా చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలను తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కేరళ తరహాలో వాటి అమలు ప్రక్రియ నిలిపేస్తూ జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్యం సిగ్గుచేటు: సుమన్ మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అందరూ సమానమనే రాజ్యంగ సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఎన్పీఆర్, సీఏఏ చట్టాలతో కేంద్రం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రగతిశీల, మేధోవర్గాలపై దాడులు చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. వసుధైక కుటుంబంలా జీవనం సాగిస్తున్న దేశ ప్రజల్లో పౌరసత్వ చట్టం కల్లోలం రేపిందన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడితోనే అన్నివర్గాల ప్రజలు సురక్షితంగా ఉంటారని సుమన్ అన్నారు. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏ, ఎన్పీఆర్ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసిన మరుక్షణమే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఒక వర్గం మెప్పు కోసం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పుకుండా.. ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాక్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పాసంఖ్యాకులు అణచివేతకు గురవుతున్నారని, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నామే తప్ప.. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలోనూ ఎన్నార్సీ, ఎన్పీఆర్ సర్వేలు జరిగాయని కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు రాద్ధాంతం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ధోకా చేయొద్దనే వ్యాఖ్యలపై అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌రెడ్డి మధ్యలో స్పీకర్‌ను కోరారు. మరోసారి రాజాసింగ్ మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తీర్మాన ప్రతులను చించి తన నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. చదవండి: పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు -
ఢిల్లీ అల్లర్లపై మూడొరోజూ దద్దరిల్లిన ఉభయసభలు
-
హస్తినలో హైటెన్షన్
-
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ
న్యూఢిల్లీ: రెండు రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వీధులన్నీ తగలబడిన వాహనాలు, ధ్వంసమైన, లూటీ అయిన దుకాణాలు, మూసివేసి ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలతో నిర్మానుష్యంగా కనిపించాయి. గోకుల్‌పురిలో చోటు చేసుకున్న పలు చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మంగళవారం రాత్రి ఒకసారి, బుధవారం మరోసారి ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ పర్యటించారు. (ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ ) పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండగా భావిస్తున్న ఈ అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. (‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’) కాగా, అల్లర్ల కారణంగా చనిపోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక కాలువలో గుర్తించారు. రాళ్ల దాడిలో ఆయన చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనాలి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై లోతైన సమీక్ష జరిపాం. పోలీసులు, ఇతర భద్రత వ్యవస్థలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో ఉన్న రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఫ్లాగ్ మార్చ్ అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతను అజిత్ దోవల్‌కు కేంద్రం అప్పగించిన నేపథ్యంలో.. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవతో కలిసి దోవల్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అమూల్య పట్నాయక్ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. శ్రీవాస్తవను దోవల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 22కి పెరిగిందని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని జీటీబీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను పోలీసులు కాకుండా, వైద్యులు వెల్లడించడం గమనార్హం. అల్లర్ల కారణంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలను, షాపులను మూసేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. దుకాణాలను లూటీ చేయడంతో జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి 106 మందిని అరెస్ట్ చేశామని, 18 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజల సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు 011–22829334, 011–22829335 కూడా ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఐబీ ఉద్యోగి మృతి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత అంకిత్ మళ్లీ బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని ఆయన తండ్రి దేవేంద్ర శర్మ తెలిపారు. అంకిత్ మృతదేహాన్ని మురికి కాలువలో వేయడాన్ని తమ కాలనీలోని కొందరు మహిళలు చూశారని, ఎవరికైనా చెపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ మహిళలను వారు బెదిరించారని అంకిత్ సోదరుడు అంకుర్ వెల్లడించారు. అంకిత్ శరీరంపై కత్తిగాట్లు కూడా ఉన్నాయన్నారు. ఆర్మీని పిలిపించాలి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్మీని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అల్లర్లకు కారణం బీజేపీ కార్యకర్తలేనని ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ ఆరోపించారు. ఢిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని, అల్లర్ల కట్టడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజాయితీగా కృషి చేయడం లేదని వారు విమర్శించారు. ఢిల్లీ సరిహద్దులను ఇప్పటికైనా మూసేయాలని, పొరుగు ప్రాంతాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలి రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీ అతలాకుతలమవడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం సమావేశమైంది. ఈ ఘర్షణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ హింసకు బాధ్యత వహించాలన్నారు. తర్వాత మీడియా సమక్షంలో కేంద్రానికి కొన్ని సూటిప్రశ్నలు సంధించారు. ► హింస జరుగుతుంటే అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడ? ఏం చేస్తున్నారు ? ► ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సీఏఏ నిరసనలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ఎలాంటి నివేదికలు ఇచ్చాయి? ► ఢిల్లీలో చెలరేగిన హింస హోంశాఖ చెబుతున్నట్టు అప్పటికప్పుడు జరిగినవా? లేదంటే హోంశాఖ సహాయ మంత్రి చెబుతున్నట్టు ఎవరైనా రెచ్చగొట్టినవా? ► ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగుతాయని స్పష్టమైన సంకేతాలు వచ్చినప్పుడు ఢిల్లీలో ఎన్ని బలగాలను మోహరించారు? ► ఢిల్లీ పోలీసుల చేతుల్లోంచి పరిస్థితులు జారిపోయినట్టు గ్రహించినప్పుడు భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించలేదు? అమిత్ షా రాజీనామా కోరడం హాస్యాస్పదం: బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ విమర్శించింది. పోలీసులతో కలిసి నిరంతరంగా పనిచేస్తూ ఢిల్లీలో పరిస్థితుల్ని అదుపులో ఉంచడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ అల్లర్ల విషయం ప్రస్తావనకు రాలేదన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సీఏఏపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనల నేపథ్యంలో రెచ్చగొట్టేలా ప్రసంగించిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇందిరాగాం«ధీ హత్య సందర్భంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసాకాండను ఈ దేశంలో పునరావృతం అయ్యేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని ఆదేశించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని అధికారులకు సూచించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించింది. అల్లర్లలో ఐబీ అధికారి మృతి చెందడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన హింస నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రతిస్పందించిన తీరుని ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. ‘మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. మురళీధర్ వ్యాఖ్యానించారు. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని సూచించింది. బాధితులు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది జుబేదా బేగంని నియమించింది. ఆ వీడియోలు చూశారా? సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలనీ జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ బెంచ్ ఆదేశించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగం వీడియోని చూశారా? అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పోలీస్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) రాజేష్ డియోలను కోర్టు ప్రశ్నించింది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ని తాను చూడలేదనీ తుషార్ మెహతా జవాబిచ్చారు. బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మల వీడియోలను తాను చూశాననీ, మిశ్రా వీడియోను మాత్రం చూడలేదని రాజేష్ డియో కోర్టుకి వెల్లడించారు. అనంతరం కోర్టులో బీజేపీ నేతల వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. సుప్రీం అక్షింతలు హింసను సకాలంలో గుర్తించడంలో, విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్లక్ష్యం 20కి పైగా పౌరుల మరణానికి దారి తీసిందని పోలీసులను ధర్మాసనం మందలించింది. అయితే సీఏఏపై చెలరేగిన హింసకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హింస చెలరేగిన సందర్భంలో ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా చట్టబద్దంగా వ్యవహరించాలని పోలీసులకు హితబోధ చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. షహీన్ బాఘ్ నిరసనలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళడానికి ‘అనుకూల వాతావరణం అవసరమని’ వ్యాఖ్యానించింది. ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి వ్యాన్‌లో తరలిపోతున్న ముస్లింలు -
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
-
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్ ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
రాష్ట్రమంతా ‘వికేంద్రీకరణ’ కోరుకుంటోంది
సాక్షి, తాడేపల్లి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా సమర్థిస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంశంపై ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, మైనార్టీ శాసనసభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించడం జరిగిందన్నారు. అనేక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, నాయకులు కూడా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో వికేంద్రీకరణ నిర్ణయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. (ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు.. ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుల విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరుల్లో అభద్రతా భావం ఏర్పడిందని, వీటిపై కూడా సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లో ఉండే మైనార్టీలు అక్కడ ఇమడలేకపోతున్నారో.. వారికి రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం ఇస్తామని వారు చెప్పిన తీరును బట్టి వైఎస్సార్ సీపీ ఆ రోజున మద్దతు ఇచ్చిందని, ఇవాళ కేంద్రం వైఖరి వేరే విధంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర బిల్లులను పూర్తిగా వ్యతిరేకించారన్నారు. ('తాను, కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు') ప్రజలకు అన్యాయం చేసే ప్రతీ చట్టాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్ఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని సీఎం వైఎస్ జగన్ కడప బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్పీఆర్ను కూడా వ్యతిరేకిస్తున్నామని, 2010, 2015 సంవత్సరాల్లో ఎన్పీఆర్ చేశారని, కానీ.. వాటికి భిన్నంగా 2020లో చేస్తోందని.. 13ఏ, 13బీ రెండు కాలమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారని, కేంద్రం ప్రస్తుతం తెచ్చిన ఫార్మట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మైనార్టీ నాయకుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఎవరికీ హాని జరగకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. -
సీఏఏ, ఎన్పీఆర్పై రజనీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గళాలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం వివాదాస్పద చట్టానికి మద్దతుగా నిలిచారు. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్ వెల్లడించారు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత, పాకిస్తాన్ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని రజనీకాంత్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్ చివరకు మద్దతు పలకడం విశేషం. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి : వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9 — ANI (@ANI) February 5, 2020 -
దేశ సామరస్యతపై కుట్ర
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు. షహీన్బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్‌లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు. బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు. ఢిల్లీ వాసులు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్‌పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. -
వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘంగా కొనసాగుతున్న పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనలో వరుసగా కాల్పుల ఉదంతంతో ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రోజుల వ్యవధిలో రెండు వరుస కాల్పుల సంఘటనలు జరిగిన తరువాత ఎన్నికల కమిషన్ సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ) డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ ను పదవి నుండి తొలగించింది. అలాగే సీనియర్ అధికారి కుమార్ జ్ఞానేష్ తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. తగిన అధికారి కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మూడు పేర్లతో కూడిన ప్యానెల్ పంపవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనకు కేంద్రంగా ఉన్న షాహీన్ బాగ్ వద్ద భద్రతా పరిస్థితిని ఆదివారం సమీక్షించింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి బిస్వాల్ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. కాగా గురువారం, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక యువకుడు నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. నివారం షాహీన్ బాగ్ వద్ద పోలీసు బారికేడ్ల దగ్గర నిలబడి షాట్లు పేల్చడంతో కపిల్ గుజ్జర్ (25) "జై శ్రీ రామ్" అంటూ కాల్పులకు తెగబడ్డాడు. తన దేశంలో హిందువులు మాత్రమే వుంటారని నినదించాడు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం మరోసారి కాల్పుల సంఘటనతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ 5వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుమార్ జ్ఞానేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు నిరసనగా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జామియా మిలియా వద్ద ఆదివారం కాల్పుల ఘటన చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది -
‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు. మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు. 26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు. -
పౌర నిరసనలు : వారంతా ఏమైపోయినట్టు..?
లక్నో : పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరసనల కారులపై విమర్శలు గుప్పించారు. లక్నోలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశ విభజన అనంతరం హిందువులు, సిక్కులు, బౌద్ధుల సంఖ్య బంగ్లాదేశ్‌లో 30 శాతం, పాకిస్తాన్ 23 శాతంగా ఉండేదని చెప్పారు. కానీ, ఆ జనాభా నేడు కేవలం బంగ్లాదేశ్‌లో 7శాతంగా, పాకిస్తాన్లో 3 శాతంగా ఉందన్నారు. మరి మిగతా జనాభా ఎటు పోయినట్టని అమిత్‌షా ప్రశ్నించారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న ‘దేశ భక్తులు’ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అఫ్గాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురవుతున్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం పొందే వీలు కల్పించారు. -
పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’
లక్నో : నెల రోజులపాటు ఉధృతంగా సాగిన పౌరసత్వ నిరసనలు మరోసారి మొదలయ్యాయి. లక్నోలోని క్లాక్ టవర్ వద్ద శుక్రవారం రాత్రి సీఏఏకు వ్యతిరేకంగా సుమారు 50 మంది మహిళలు, విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. నిరసనకారుల సంఖ్య శనివారానికి మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అయితే, పోలీసుల తీరు దొంగల మాదిరిగా ఉందని నిరసనకారులు విమర్శిస్తున్నారు. ధర్నా జరిగే చోటు నుంచి బ్లాంకెట్లు, ఆహార పదార్ధాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లక్నో పోలీసులు స్పందించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్లాక్ టవర్ వద్ద ఆందోళన చేపట్టారని పోలీసులు తెలిపారు. టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారని, అందుకనే వారి వద్ద నుంచి బ్లాంకెట్లు, ఇంతర సామాగ్రిని సీజ్ చేశామని వెల్లడించారు. వందల కొద్దీ బ్లాంకెట్లను పంచి పెడుతుండగా.. అడ్డుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఇదిలాఉండగా.. పోలీసులు బ్లాంకెట్లు, టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. Meanwhile this is the video of the ' kambals being taken into kabza ' by the @lkopolice at the clock tower 's #CAA_NRCProtests last night ... https://t.co/6rbLaRIKV9 pic.twitter.com/muvUMWlGlK — Alok Pandey (@alok_pandey) January 19, 2020 -
ఫేక్ ఫొటో: డిటెన్షన్ సెంటర్లో తల్లి..
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలో డిటెన్షన్ సెంటర్లే లేవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తుండటంతో.. చోటు ఖాన్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ‘డిటెన్షన్ సెంటర్లు లేవు కదా..!!’ అని పేర్కొంటూ.. కంచె లోపల నుంచి బిడ్డకు పాలు పడుతున్న ఓ తల్లి ఫొటోను దాంతోపాటు బెంగాళీలో దాని నేపథ్యాన్ని రాసుకొచ్చాడు. ‘పౌరసత్వ చట్టం కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ఈ దంపతుల వేదన చూడండి. అతనేమో హిందువు, ఆమెనేమో ముస్లిం. ఎన్నార్సీ కారణంగా ఆ మహిళ డెటెన్షన్ క్యాంప్‌లో బందీ అయింది. అందుకే ఈ దుస్థితి. నరేంద్ర మోదీ పాలనలో ఇలాంటి మరెన్నో చూస్తాం’అని చోటు ఖాన పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటో ఫేక్ అని తేలింది. అర్జెంటీనా దంపతులకు చెందిన ఈ ఫొటో గత ఆరేళ్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.‘controappuntoblog.org’ అనే బ్లాగ్‌లో 2013 జనవరి13న ఈ ఫొటో తొలిసారిగా అప్లోడ్ అయిందని పేర్కొంది. అర్జెంటీనాలోని ఒక ప్రాంతంలో ఉద్రిక్తలు చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ కంచె ఏర్పాటు చేశారని, ఆ సమయంలో కొన్ని కుటుంబాలు కంచెకు ఆవల మరికొన్ని ఇవతలి వైపున ఉండిపోయానని స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న డిటెన్షన్ సెంటర్లకు, సీఏఏ ఆందోళనలకు ఈ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదని ఇండియా టుడే వెల్లడించింది. -
ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే లక్ష ఆఫర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8866288662....నా పేరు అరోహి త్రిపాటి. నన్ను కలుసుకోవాలంటే 8866288662కు ఫోన్ చేయండి....నన్ను ప్రేమించాలన్నా, నాతో డేటింగ్ చేయాలన్నా, ఇదే సమయం ఫోన్ నెంబర్ 8866288662...సన్నీ లియోన్ అభిమానులారా! ఆమెను 8866288662 ఫోన్ నెంబర్లో కలుసుకోవచ్చు.....ఇలాంటి ట్వీట్లతోపాటు 15 జీబీ డేటా ఉచితంగా కావాలంటే.....నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఆరు నెలలపాటు ఆరు నెలల పాటు ఉచితం. మొదటి వెయ్యి కాల్స్‌కు మాత్రమే పరిమితం....అమెజాన్ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం....ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఉచితం, ఈ ఫోన్ నెంబర్ 8866288662కు ఫోన్ చేయండి....’ అంటూ ఒకే నెంబర్‌తో అనేక ఆఫర్లు ట్విట్టర్లో శనివారం నుంచి వచ్చి పడుతున్నాయి. ఇంతకు ఈ టోల్‌ఫ్రీ నెంబర్ ఎవరిదంటే...‘పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను సమర్థించేవాళ్లు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి!’ అంటూ భారతీయ జనతా పార్టీ ఇటీవల దీన్ని ఆవిష్కరించింది. సీఏఏను అపహాస్యం చేయడానికా లేదా ఈ రీతిగానైనా సీఏఏకు మద్దతు సమీకరించాలన్న ఉద్దేశమా తెలియదుగానీ ఇది ట్విటర్ల చేతిలో మాత్రం వ్యంగ్యాస్త్రం అయింది. -
భీమ్ ఆర్మీ చీఫ్ ఆరోగ్యంపై ఆందోళన..
సాక్షి, న్యూఢిల్లీ : పౌర చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై జైలులో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యం బాగాలేదని, తక్షణమే వైద్యసాయం అందించకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆజాద్‌కు ప్రతి రెండు వారాలకు ఒకసారి అదనపు ఎర్ర రక్త కణాలను రక్తం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు హర్జీత్ సింగ్ భట్టీ చెప్పారు.గత వారం కిందటే ఆయనకు వైద్య చికిత్స అందించాల్సి ఉందని, ప్రస్తుతం ఆజాద్ తలనొప్పి, కడుపునొప్పితో బాధిపడుతున్నారని డాక్టర్ భట్టి తెలిపారు. సత్వరమే ఆయనకు చికిత్స అందించకుంటే అతడి రక్తం మందమై గుండె పోటుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతించడలేదని అన్నారు. కాగా గత ఏడాదిన్నరగా ఈ వ్యాధికి ఆజాద్ వైద్యచికిత్స తీసుకుంటున్నారని, అదే విషయం ప్రస్తుతం ఆయన ఉంటున్న తీహార్ జైలు అధికారులకు తెలిపామని భీమ్ ఆర్మీ ప్రతినిధి కుష్ అంబేడ్కర్‌వాది తెలిపారు. మరోవైపు ఆజాద్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను పరిశీలించిన జైలు వైద్యుడు నిర్ధారించారని జైలు అధికారులు పేర్కొనడం గమనార్హం. -
భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం
-
పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?
సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం: పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరమవుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు, రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కునుహరించివేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామాలన్నింటికీ కేంద్ర బిందువైన పౌరసత్వ సవరణ చట్టం నిజంగానే భారతీయుల హక్కులకు భంగం కలిగిస్తుందా.. లేదా కేంద్రం హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు దేశంలోని మైనార్టీలకు ఎటువంటి హాని కలిగించదా.. అదే విధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఒక వర్గం ప్రయోజనాలు దెబ్బతింటాయా.. వీటిలో ఎన్నార్సీ పాత్ర ఏమిటి అనే అంశాలను ఒకసారి గమనిద్దాం. వారికి మాత్రమే మినహాయింపు కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాఖ్ తదితర బిల్లులను ఆమోదించిన తర్వాత నరేంద్ర మోదీ సర్కారు పౌరసత్వ చట్టం- 1955కు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రవేశపెట్టగా అనేక చర్చల అనంతరం బిల్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఆమోదం పొందింది. ఈ క్రమంలో డిసెంబరు 12న రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. కాగా పౌరసత్వ చట్టం-1955 ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరన్న విషయం తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు సడలిస్తూ..పాస్‌పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు 2015లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. వీటికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది. (‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం) పౌరసత్వ సవరణ చట్టం గెజిట్‌లో పేర్కొన్న అంశాలు ‘డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. పాస్‌పోర్టు చట్టం 1920లో సీ క్లాజులో సెక్షన్ 3లో ఉన్న సబ్‌సెక్షన్ 2 ప్రకారం లేదా విదేశీయుల చట్టం 1946లోని కొన్ని ప్రొవిజన్లు తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 2లోని సబ్ సెక్షన్1 బీ క్లాజులో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది’ అని భారత న్యాయ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొంది. అదే విధంగా ప్రాథమిక చట్టంలోని సెక్షన్ 6ఏకు సవరణ చేసి 6బీలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు వెల్లడించింది. అదే విధంగా భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలేవీ వర్తించవని పేర్కొంది. అంతేకాకుండా సెక్షన్ 7డీ, సెక్షన్ 18కు సవరణలు చేసినట్లు తెలిపింది. అదే విధంగా కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన వారు కనీసం ఐదేళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలు కలిగి ఉండాలని తెలిపింది. ఇంతకుముందు ఈ పరిమితి 11 ఏళ్లుగా ఉండేది. (సీఏఏ : మరో కీలక పరిణామం) ముస్లింలకు వ్యతిరేకం కాదు: అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా... ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు. మతతత్వ రాజకీయాలకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు. ఇందుకు స్పందించిన అమిత్ షా.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని.. అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది అని విమర్శించారు. చీకటి రోజు: సోనియా గాంధీ ఇక పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. దీనిని విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయంగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. (సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) ఎన్నార్సీ అమలైతే.. ఇక ప్రస్తుతం సీఏఏతో పాటు ఆందోళనలకు కారణమవుతున్న మరో ముఖ్య అంశం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ). జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులందరితో కూడిన జాబితాను క్లుప్తంగా ఎన్నార్సీ అంటారు. పౌరుల దగ్గర ఉన్న వివిధ పత్రాల ఆధారంగా వారు భారత పౌరులేనని నిర్ధారిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశముంటుంది. అదే విధంగా వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లభిస్తాయి. అయితే నిజానికి ఎన్నార్సీ అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. ఇది గనుక చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే అక్రమ వలసదారులు మాత్రమే లక్ష్యంగా మారతారు. అయితే ఇందులో ఓ చిక్కు ఉంది. ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువ. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే.. సీఏఏ ప్రకారం వారికి సులభంగానే భారత పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి. (ఎన్ఆర్సీపై ఆందోళన వద్దు..) ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్నార్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశం నుంచైనా భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన వారూ దేశంలో ఉండటానికి వీలు ఉండదు. దీంతో ఈ దేశాల నుంచి వచ్చిన మెజారిటీ వర్గ ప్రజలు మాత్రమే చిక్కుల్లో పడతారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ ప్రకారం భారతీయులు ఎవరికీ నష్టం లేదని చెబుతున్నప్పటికీ ఎన్నార్సీ ద్వారానే అక్రమ వలసదారులను గుర్తిస్తారు కాబట్టి.. ఇది కచ్చితంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సరైన పత్రాలు లేని వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని.. అలాంటప్పుడు ఇందులో సమస్య ఏముందని సీఏఏ, ఎన్నార్సీని సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ సైతం దేశ శ్రేయస్సు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అక్రమవలస దారులకు మాత్రమే తాము వ్యతిరేకం అని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం: సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రణరంగంగా జామియా వర్సిటీ ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..! కొన్ని రాజకీయ శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయి: గడ్కరీ అనవసర భయాలు సృష్టిస్తున్నారు: మోదీ -
ఆ బిల్లు పూర్తిగా చదవలేదు: గంగూలీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించాడు. తను సీఏఏకు సంబంధించిన బిల్లు పూర్తిగా చదవలేదని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశాడు. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టానికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగూలీ కుమార్తె సనా.. సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేసిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో సనా ట్రోల్స్ బారిన పడింది. అయితే ఆ పోస్టు నిజం కాదని, సనా చిన్నపిల్ల కాబట్టి తనను రాజకీయాల్లోకి లాగొద్దని గంగూలీ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో సీసీఏపై అభిప్రాయాన్ని చెప్పకుండా గంగూలీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు.(పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలపై కేంద్రం వివరణ) ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్కరు శాంతి కలిగి ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లును నేను చదవలేదు. కాబట్టి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయం గురించి మాట్లాడటం సరికాదు. అయితే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ చట్టంతో ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎవరు నష్టపోతారు అనే విషయాల గురించి చర్చ జరగాలి. అయితే నాకు ప్రతీ ఒక్కరి సంతోషమే ముఖ్యం’ అని పేర్కొన్నాడు.(‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం) -
మజ్లిస్‌కు భయపడి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద మజ్లిస్ పార్టీకి భయపడే పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసిందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం సీఎం.. ఒవైసీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. -
వలస పాలనకు ప్రతిరూపమీ చట్టం
ఒక విదేశీ శక్తి.. పాలనకు సంబంధించి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? ‘‘జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అని ఏనాడో గాంధీజీ ‘హిందూ స్వరాజ్’లో రాసిన అంశాన్ని జాతి ఎన్నటికీ మర్చిపోకూడదు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇప్పుడు చట్టమైంది. న్యాయస్థానాలు ఈ చట్టాన్ని తోసిపుచ్చినా లేక దాని అమలుపై స్టే విధించినా జాతీయ రాజ్యమైన భారతదేశం స్వభావం గురించి ఇది కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర దేశాల భూభాగాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చి, ఉపశమనం కలిగించి, పౌరసత్వాన్ని మంజూరు చేయడం అనే భావనను ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. సమస్యల్లా ఏమిటంటే, భారత్ వంటి ఉదార ప్రజాస్వామిక దేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని మతం నిర్ణయించవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై మూడు భావధారలు వ్యాప్తి చెందుతున్నాయి. మొదటగా, సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినవారు.. ఇరుగుపొరుగు ఇస్లామిక్ దేశాల్లో మతపర మైనారిటీలను తొక్కిపెడుతున్నారని, వీరికి రక్షణ కల్పించాలనే ప్రాతిపదికను ఎంచుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలను అణిచివేయరు కాబట్టి వీరిని పౌరసత్వ సవరణ బిల్లునుంచి మినహాయించవచ్చని వీరి వాదన. శ్రీలంక హిందువులకు మినహాయింపు ఎందుకు? పైగా, ఇతరదేశాల్లో ప్రత్యేకించి శ్రీలంకలోని హిందూ, ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ఈ బిల్లులో ఎందుకు మినహాయించారు అంటే 1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని లక్షల మంది శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు వారికోసం మరొక నిబంధన చేర్చాల్సిన అవసరం లేదని వీరి వాదన. పైగా, నాటి భారత, పాక్ ప్రధానులు నెహ్రూ, లియాఖత్ మధ్య 1950లో కుదిరిన ఒప్పందానికి భారత్ కట్టుబడగా, పాకిస్తాన్ దాన్ని గౌరవించలేదని వీరు వాదిస్తున్నారు. భారత్‌లోని మైనారిటీలను ఇండియా పరిరక్షిస్తూ రాగా, పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కి వలస వచ్చారని వీరి వాదన. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల జనాభా శాతం బాగా తగ్గిపోతూండగా, భారత్ లోని ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందన్న వాస్తవమే తమవాదనకు నిదర్శనం అని చెబుతున్నారు. అంటే ముస్లింలు కోరుకుంటే ఇస్లామిక్ దేశాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు కానీ ఇతర దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు మాత్రం ఆశ్రయం కోరి భారత్‌కి మాత్రమే రాగలరు కాబట్టి వారి పట్ల జాతి సానుభూతితో ఉండాలని వీరు చెబుతున్నారు. ఇక రెండోవాదన ఈశాన్య భారత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి నుంచి వస్తోంది. భారతదేశంలోకి ఏ మతానికి సంబంధించినవారైనా సరే.. వలస రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వలసలు వెల్లువెత్తితే తమ ప్రాంతం వనరులను ఊడ్చేస్తారని, తమ భాష, సంస్కృతి కూడా క్షీణించిపోతుందని వీరి భయం. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే వలసలు మరింతగా పెరిగి స్థానిక ప్రజలు అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముందని వీరి భావన. అందుకే వలస వచ్చే విదేశీయులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలు చాలావరకు సద్దుమణుగుతాయి. దేశంలో పేలవమైన పాలన, జాతీయ పౌర పట్టిక అమలు సమయంలో తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం చూపడం లేదు. ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, హిందువులు, ముస్లింలు కానీ రానున్న సంవత్సరాల్లో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించడం లేదు. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్థిక దుస్థితి రీత్యా, ఇప్పటికే తక్కువగా ఉన్న ఉద్యోగాలను వలస ప్రజలు కొల్లగొడతారని, స్థానికుల ఆర్థిక అవకాశాలను తగ్గించివేస్తారని ప్రజలు భయపడుతున్నారు. దేశ లౌకిక, సామాజిక నిర్మాణంపైనే దాడి ఇక మూడో వాదన మతపరమైన వివక్ష ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారినుంచి వస్తోంది. ఈ బిల్లు నుంచి ముస్లింలను మినహాయించాలని వీరు కోరుకోవడం లేదు. పైగా ఈ చట్టం దేశ లౌకిక సామాజిక నిర్మాణంపైనే దాడిగా వీరు భావిస్తున్నారు. పొరుగుదేశాలనుంచి అణచివేత కారణంగా భారత్‌కు వస్తున్నవారు మతపర కారణాలతోటే కాకుండా జాతి, భాషా పరమైన కారణాల వల్ల కూడా వలస వస్తున్నారని వీరి వాదన. దారిద్య్రం వంటి ఆర్థిక కారణాలే వలసలను ప్రభావితం చేస్తుం టాయి. పైగా బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి దృష్టి మరల్చడానికి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పైగా ఈ చట్టం దేశంలో మతపరమైన విభజనను మరిం తగా పెంచి ముస్లిం కమ్యూనిటీని ఏకాకులను చేస్తుంది. దేశంలో మతతత్వపరమైన వాతావరణం పెరుగుతున్న తరుణంలో మైనారిటీలు అణచివేతకు పాలబడి రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ముస్లిం పైన అయినా విదేశీయుడిగా ముద్రవేయడమే కాకుండా తాము విదేశీయులం కామని వారే నిరూపించుకోవలసి ఉంటుంది. జాతీయ పౌర పట్టీ ప్రక్రియ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది తగిన డాక్యుమెంటేషన్ కలిగిలేరు. ఇలాంటి వ్యక్తులను పొరుగుదేశాలు అంగీకరించవు కాబట్టి వీరిని శాశ్వతంగా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచాల్సి వస్తుందేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇలాంటి వారి జనాభా కూడా అధికంగా ఉంటోంది. పైగా నిర్బంధ శిబిరాలను ఏర్పర్చి అసంఖ్యాక ప్రజలను వాటిలో పెట్టి నిర్వహించడం భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి కారణంగా ఇంత అదనపు భారాన్ని మోయడం సాధ్యమేనా? ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల మదుపు, ప్రత్యేకించి విదేశీ మదుపులు వెనక్కి పోతాయి. దీనివల్ల ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదముంది. మరోవైపున ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక దాని పూర్వాపరాలను పట్టించుకోకుండా దాన్ని అమలు చేయవలసిందేనా? పైగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో చేసిన వందలాది హామీలలో ఒక ప్రత్యేక హామీ కోసం ప్రజలు పార్టీలకు ఓటు వేయరు కూడా. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పౌరసత్వ సవరణ చట్టం కారణం కాదు. అనేక ఇతర అంశాలు, ప్రత్యేకంగా ఆర్థిక దుస్థితిని నేర్పుగా పక్కన బెట్టేశారు. అందుకే పాలకపార్టీ హిందూ అనుకూల, ముస్లిం అనుకూల వైఖరిలలో ఏదో ఒకదానిని ప్రజలు స్వీకరించే ఎజెండాతో పనిచేస్తోందా? ఏకజాతిగా మనుగడ సాగించలేం! గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆనాడు హిందూ స్వరాజ్‌లో ‘‘ది హిందూస్ అండ్ మహమ్మదియన్స్’ పదవ అధ్యాయంలో గాంధీ ఇలా చెప్పారు. ‘భారత్ ఏక జాతిగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే అనేక మతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విదేశీయులు ప్రవేశించడం అనే ఒక్క కారణం జాతిని ధ్వంసం చేయలేదు. వారు దేశంలో భాగం అవుతారు... జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అందుచేత, దేశాన్ని మతపరంగా విభజించి పాలించాలనే బ్రిటిష్ వలస పాలకుల అసంపూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మనం మతపరంగా విభజించే ఎజెండాను అమలు చేసుకుంటూ పోతున్నామా? ఒక విదేశీ శక్తి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? అరుణ్ కుమార్ (ది వైర్ తోడ్పాటుతో) వ్యాసకర్త మాల్కొమ్ ఎస్ ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, రచయిత