coaches
-
సామాన్యులకూ ఒక సీటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైల్‌కు నాలుగు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అంశంపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే..ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రైల్వే శాఖ నిలిపేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే తయారు చేస్తోంది. ఈ కోచ్‌ల తయారీ పెరుగుతున్నకొద్దీ సంప్రదాయ కోచ్‌లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5,748 కోచ్‌లున్నాయి. వీటిల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సంఖ్య 2,181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్ల సంఖ్య 88. మరో ఏడు జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా.. అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే సరఫరా చేస్తున్నారు. అవసరమైతే రిజర్వ్డ్ కోచ్‌లు తగ్గించి.. దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వేశాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ చార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.దీంతో వెంటనే జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లుంటాయి. వాటిల్లో రెండు జనరల్ కోచ్‌లుంటాయి. ఇప్పుడు అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను అనుసంధానించటం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్‌ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అనువుగా ఉండవు. దీంతో రెండు రిజర్వ్డ్ కోచ్‌లను తగ్గించి వాటి స్థానంలో రెండు జనరల్ కోచ్‌లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగటమే కాకుండా, టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది. నవంబర్‌లో వేయి కోచ్లునవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా పదివేల కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6 వేలు అన్రిజర్వ్డ్ కోచ్‌లు కాగా.. మిగతా 4 వేలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే పదివేల జనరల్ కోచ్‌లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు. అంకెల్లో భారతరైల్వే⇒ 4 ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ స్థానం⇒ 2023 నాటికి మొత్తం రైల్వే ట్రాక్ 1,32,310 కి.మీ రైల్వేలో మొత్తం ఉద్యోగులు 12 లక్షల మందికి పైగా⇒ ఇండియన్ రైల్వేలో మొత్తం జోన్లు 17 దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లు 7,325⇒ దేశంలో రోజూ నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు 13,000⇒ దేశంలో రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2.40 కోట్ల మంది రోజూ దేశంలో నడుస్తున్న రైళ్లలో ప్యాసింజర్ కోచ్‌ల సంఖ్య 84,863⇒ 2024 మార్చి నాటికి (2023ృ24) ఇండియన్ రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు రోజువారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు⇒ రైలు ప్రమాదాలను నివారించడానికి ఇప్పటిదాకా కవచ్‌ను ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ 37 వేల కి.మీ⇒ దేశంలో రోజూ నడుస్తున్న సరుకు రవాణా రైళ్లు 8,000⇒ 2024 అక్టోబర్ నాటికి దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 66 వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 400⇒ 2024, మార్చి నాటికి దేశంలో విద్యుత్ రైల్వే మార్గాలు 62,119 కి.మీ⇒ 202-24 లెక్కల ప్రకారం సగటున ఆన్లైన్లో రోజుకు బుక్ అవుతున్న రైల్ టికెట్లు 12.38 లక్షలు⇒ ఆన్లైన్లో నిమిషానికి బుక్ అవుతున్న రైల్ టికెట్లు 28,000⇒ రోజుకు రైళ్లలో అందిస్తున్న భోజనాలు 16 లక్షలు⇒ కేటరింగ్ ద్వారా ఆదాయం రూ.1,947.19 కోట్లు⇒ ఐఆర్సీటీసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు 12.21 కోట్లు -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
రైలులో మంటలు... నాలుగు బోగీలు దగ్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం(జూన్3) ఢిల్లీ సరితా విహార్‌లో తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటలంటుకున్నాయి. దీంతో రైలులోని నాలుగు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలార్పడానికి ఐదు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. Breaking: Fire in a passenger train near Sarita Vihar, Delhi. 6 fire tenders rushed to the site. Further details awaited. pic.twitter.com/ru0l6UPG8y— Prashant Kumar (@scribe_prashant) June 3, 2024 -
రైలులో అగ్ని ప్రమాదం
ముంబయి: మహారాష్ట్రలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులోని ఐదు కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
దారుణం: ఘోర రైలు ప్రమాదం..33 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 33 మంది మరణించారు. సుమారు 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలు రావల్పిండికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. Pakistan: 30 dead, 80 injured after 10 coaches of Hazara Express derail in Sindh Read @ANI Story | https://t.co/76FRYrynMI#Pakistan #hazaraexpress #Sindh pic.twitter.com/apJHUHBxFE — ANI Digital (@ani_digital) August 6, 2023 హజరా ఎక్స్‌ప్రెస్ రావల్పిండికి వెళ్తుండగా.. షాజాద్‌పూర్, నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 10 బోగీలు పట్టాలు తప్పిపోయాయి. దీంతో 15 మంది అక్కకిడక్కడే మృతి చెందారు. కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్లే ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్ -
16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 8 కోచ్‌లు ఉన్న ఈ ట్రైన్‌కు ఈ నెల 17వ తేదీ నుంచి అదనంగా మరో 8 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ ట్రైన్ బోగీల సంఖ్య 16కు చేరుకోనుంది. అలాగే ఇప్పుడు 530 మంది ప్రయాణికుల సామర్థ్యం మాత్రమే ఉండగా బోగీల పెంపు వల్ల సీట్ల సంఖ్య కూడా 1,128 కి పెరగనుంది. దీంతో పాటు సికింద్రాబాద్–తిరుపతి, తిరుపతి–సికింద్రాబాద్ మధ్య రెండు వైపులా ప్రయాణ సమయం కూడా 15 నిమిషాల వరకు తగ్గనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. ప్రస్తుతం ఈ రైలు ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో గమ్యస్థానం చేరుకుంటుండగా ఈ నెల 17 నుంచి 8 గంటల 15 నిమిషాలకే చేరుకోనుంది. అనూహ్యమైన డిమాండ్... నిత్యం వందలాది మంది భక్తులు హైదరాబాద్ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తరలి వెళ్తారు. దీంతో ఈ రూట్లో రైళ్లకు ఎంతో డిమాండ్ ఉంది. గత నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది. కానీ కోచ్‌లు, సీట్లు పరిమితంగానే ఉండడం వల్ల చాలా మంది వందేభారత్‌లో పయనించలేకపోయారు. 8 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టిన ఈ ట్రైన్లో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ తో పాటు 7 చైర్ కార్లు మాత్రమే ఉన్నాయి.సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఏప్రిల్‌లో 131 శాతం, మే నెలలో 135శాతం, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఏప్రిల్‌లో 136 శాతం, మేలో ఇప్పటి వరకు 38 శాతం చొప్పున ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం.ఇప్పటి వరకు ఈ ట్రైన్లో మొత్తం 44,992 మంది ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 21,798 మంది, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మరో 23,194 మంది చొప్పున రాకపోకలు సాగించారు. పెరుగనున్న సీట్ల సంఖ్య.... కొత్తగా అందుబాటులోకి రానున్న 16 కోచ్‌లలో 14 చైర్కార్లు ఉంటాయి. వీటిలో 1,024 మంది ప్రయాణం చేస్తారు. మరో 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 104 మంది ప్రయాణం చేస్తారు. దీంతో ప్రయాణికుల సంఖ్య 1128 కి పెరగనుంది.కోచ్‌లను రెట్టింపు చేయడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చేయగలుగుతారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగానే ఉందన్నారు. ఇవీ వేళలు.. సికింద్రాబాద్– తిరుపతి సికింద్రాబాద్– తిరుపతి (20701) ఉదయం 6.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఉదయం 7.29 గంటలకు నల్గొండ, 9.35 గంటలకు గుంటూరు, 11.12 గంటలకు ఒంగోలుకు చేరుకుంటుంది. ఒంగోలులో తిరిగి 11.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.29 గంటలకు నెల్లూరుకు మధ్యాహ్నం 2.30 కు తిరుపతికి చేరుకుంటుంది. ప్రతి స్టేషన్లో ఒక నిమిషం పాటు హాల్టింగ్ ఉంటుంది. ఒంగోలులో మాత్రం 3 నిమిషాల పాటు నిలుపుతారు. తిరుపతి–సికింద్రాబాద్ ఈ ట్రైన్ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 4.49 గంటలకు నెల్లూరు, 6.02 గంటలకు ఒంగోలుకు చేరుకుంటుంది. సాయంత్రం 6.05 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరి 7.45 గంటలకు గుంటూరు, రాత్రి 9.49 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోనూ ఒంగోలులో 3 నిమిషాల హాల్టింగ్ సదుపాయం ఉంటుంది. -
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రైలులో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కసరత్తు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా వందేభారత్ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. యాత్రికులు&ప్రయాణికుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ - తిరుపతి మధ్యన తిరుగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రస్తుతం ఉన్న 8 కోచ్ ల నుండి 16 కోచ్ లకు పెంచటానికి అంగీకరించిన PM శ్రీ @narendramodi గారికి, రైల్వేశాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/FhKD07K5MX — G Kishan Reddy (@kishanreddybjp) May 9, 2023 ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్ -
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం (ఫొటోలు)
-
మహిళా జట్లకు మహిళా కోచ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: క్రీడాకారిణిలకు తరచూ ఎదురవుతోన్న కోచ్‌ల వేధింపులకు ముగింపు పలకాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై మహిళల జట్లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా మహిళా కోచ్‌ను తప్పనిసరిగా నియమించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లను ఆదేశించింది. దేశవాళీ టోర్నీ, విదేశీ పర్యటనలకు వెళ్లే అమ్మాయిల బృందంలో మహిళా కోచ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల స్లోవేనియాలో జరిగిన పోటీలకు వెళ్లిన మహిళా సైక్లిస్ట్ పట్ల చీఫ్ కోచ్ ఆర్.కె.శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ‘సాయ్’ అతన్ని పదవి నుంచి తప్పించి, విచారణ చేపట్టింది. మరో మహిళా సెయిలర్‌కు జర్మనీలో ఇలాంటి అనుభవమే ఎదురవడంతో ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ 15 ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ‘సాయ్’ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించేలా ఓ ప్రత్యేక అధికారిని జట్టులో నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. చదవండి: FIFA U17 Womens World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల -
IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..!
Two India A Coaches Tests False Positive For Covid: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన టీమిండియా సైతం ఈ వార్త విని ఆందోళనకు గురైంది. అయితే, ఆ ఇద్దరు కోచింగ్ సిబ్బందికి రెండోసారి కోవిడ్ పరీక్ష నిర్వహించగా, అందులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్లూంఫాంటేన్ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్‌లకు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ప్రాధమిక పరీక్ష ఫలితాలు తప్పు అని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సదరు పత్రిక తెలిపింది. భారత బృంద సభ్యులందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్‌ను యధాతథంగా కొనసాగిస్తున్నారు. ఫాల్స్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు కోచ్‌లను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్‌గా శుభ్‌దీప్ ఘోష్‌లను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపింది. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రకంపనల కారణంగా భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనున్నాయి. అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో.. -
విదేశీ కోచ్‌ల సత్తా! ఒక్కొక్కరి జీతాలు ఎంతంటే..
స్వదేశీ కోచ్‌లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్లు ఈ దఫా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్‌కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్‌ల హవానే ఈసారి కనిపించింది. భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి. వీళ్లే టా(తో)ప్ విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్‌లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్ కోచ్‌లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కొత్తేం కాదు విదేశీ కోచ్‌ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రముఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్‌లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు. విదేశీకే ప్రయారిటీ టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు(50 మంది స్వదేశీ కోచ్‌లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
విజయవాడలో తప్పిన రైలు ప్రమాదం
-
విజయవాడలో తప్పిన రైలు ప్రమాదం
సాక్షి, విజయవాడ: షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయవాడలో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. రైలు అజిత్‌సింగ్ నగర్లో ఉండగా ఇంజన్ నుంచి బోగీలు ఒక్కసారిగా వేరైపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గాభరా పడ్డారు. ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించి రైలును అక్కడి నుంచి పంపించారు. సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరంటే అటు దక్షిణ మధ్య రైల్వేకు, ఇటు తూర్పు కోస్తా రైల్వేకు మింగుడు పడటం లేదు. అందుకే ఈ స్టేషన్ ప్రతిష్టని దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏ స్పెషల్ ట్రైన్ వేసినా విశాఖ స్టేషన్ ముఖం కూడా చూడనివ్వకుండా బైపాస్‌లో పంపించేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు వచ్చే దురంతో ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను కూడా మాయం చేసేసి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు దారి మళ్లించెయ్యడంతో ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం చేస్తున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్... తక్కువ స్టేషన్లలో హాల్టులతో త్వరగా గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రారంభించిన రైలు. అన్నీ ఏసీ బోగీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించేలా ఈ రైలు ఉంటుంది. ఈ ట్రైన్లు ప్రధాన నగరాల మధ్య మాత్రమే పరుగులు పెడుతుంటాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య (ట్రైన్ నం.22203/22204) 2012 జూలైలో వారానికి మూడు రోజులపాటు నడిచేలా రైలుని ప్రారంభించారు. అయితే 1994 నాటి ఐసీఎఫ్ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునికీకరిస్తూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చి ఇచ్చారు. అనంతరం క్రమంగా సమస్యలు మొదలయ్యాయి. పాత కోచ్‌లు కావడంతో ఏసీ నుంచి లీకేజీలు రావడం, బెర్తులు వంగిపోవడం మొదలైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో 2017లో దురంతోకి కొత్త రేక్ మంజూరు చేస్తామంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎట్టకేలకు నెల రోజుల క్రితం ఒక రేక్ (14 బోగీలు)ని దక్షిణ మధ్య రైల్వేకి కేటాయించారు. ట్విటర్లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు 12 కోచ్‌లు పక్కదారి... ఈ రేక్ని చెన్నైలోని పెరంబూర్ ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. దీన్ని కేవలం సికింద్రాబాద్ – విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ కోసం కేటాయించాలంటూ బోగీలపై ట్రైన్ నబర్ కూడా ముద్రించారు. అయితే సౌత్ సెట్రల్ రైల్వే అధికారులు దురంతో కోసం ఇచ్చిన బోగీలను దారి మళ్లించారు. హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి అప్పనంగా అప్పగించేశారు. దురంతోకి మొత్తం 14 కోచ్‌లు కేటాయిచగా అందులో హైదరాబాద్ – చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు 6 కోచ్‌లు, చెన్నై – హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి మరో 6 కోచ్‌లు పెట్టారు. ఇలా దురంతోకి వచ్చిన కోచ్‌లను పక్కదారి పట్టించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దక్షిణ మధ్య రైల్వే, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్విటర్లలో ఫిర్యాదుల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సత్వరమే స్పందించి దురంతోకి రావాల్సిన రేక్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్తేరు వైఫల్యమే కారణమంటూ ఆరోపణలు కోచ్‌లు దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదులపై దక్షిణ మధ్య రైల్వే కుంటి సాకులు చెబుతోంది. వాల్తేరు రైల్వే డివిజన్లో సరైన నిర్వహణ ఉండటం లేదనీ.. ఫలితంగా కొత్త కోచ్‌లు ఏర్పాటు చేసినా త్వరగా పాడైపోతున్నాయంటూ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే.. ఒక ట్రైన్ కోసం కేటాయించిన బోగీలను మరో ట్రైన్‌కు కేటాయించడాన్ని వాల్తేరు అధికారులు సైతం తప్పుపడుతున్నారు. మరోవైపు విశాఖ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ జోన్లు విశాఖపట్నంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏ ట్రైన్నీ విశాఖకు కేటాయించకుండా బైపాస్‌లో పంపించి డీగ్రేడ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.ప్రయాణికుల్లోనూ ఇదే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. పాతికేళ్ల క్రితం ఏసీ బోగీలను వేగంగా వెళ్లే రైలుకి కేటాయిస్తే, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఏసీ ప్రయాణం కంటే అదనపు ఛార్జీని దురంతో పేరుతో వసూలు చేసి ఇలా డొక్కు కోచ్‌లతోనే ఎన్నాళ్లు నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేటాయించిన కోచ్‌లతోనే దురంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
60 ఏళ్లకు మించరాదు!
ముంబై: భారత క్రికెట్ జట్టు కొత్త శిక్షకుల వేటలో పడింది. టీమ్ హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు ఈ నెల 30ని తుది గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది పదవీకాలం వాస్తవానికి ప్రపంచ కప్‌తోనే ముగిసింది. అయితే వెంటనే వెస్టిండీస్ పర్యటన ప్రారంభం అవుతుండటంతో వారికి మరో 45 రోజుల పొడిగింపు లభించింది. బీసీసీఐ ఈ సారి హెడ్ కోచ్ పదవి విషయంలో వయోపరిమితిని విధించడం విశేషం. దరఖాస్తు చేసే వ్యక్తి 60 ఏళ్లకు మించరాదని నిబంధన విధించింది. దీంతోపాటు కొన్ని ప్రధాన అర్హతలను సూచించింది. ప్రధాన టెస్టు జట్టుకు కనీసం రెండేళ్లు ప్రధాన కోచ్‌గా పని చేసి ఉండాలని లేదా అసోసియేట్ జట్టు లేదా ఐపీఎల్ జట్టుకైనా కనీసం మూడేళ్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టింది. 30 టెస్టు మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. లేదంటే బీసీసీఐ లెవల్–3 కోచింగ్ సర్టిఫికెట్ ఉండాలనేది నిబంధన. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే సిరీస్ నుంచి జట్టుతో ఉన్నారు. అదే సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ జట్టుతో చేరినా... కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో అతను పదవి కోల్పోయాడు. అయితే రవిశాస్త్రి మళ్లీ కోచ్‌గా వచ్చాక అరుణ్‌ను తన బృందంలో చేర్చుకున్నాడు. జూలై 2015 నుంచి ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫార్హర్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు టీమిండియాతో కలిసి పని చేస్తున్నారు. వీరిద్దరి శ్రమ వల్లే భారత జట్టు ఫిట్నెస్పరంగా అత్యున్నత ప్రమాణాలు అందుకోగలిగింది. వీరిద్దరి కాంట్రాక్ట్ సైతం ప్రపంచ కప్‌తోనే ముగియగా... మళ్లీ కొనసాగటానికి ఆసక్తి చూపించలేదు. దాంతో కొత్తవారి ఎంపిక ఖాయమైంది. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా ఉన్న సునీల్ సుబ్రమణ్యన్ స్థానంలోనూ మరొకరి నియామకానికి బోర్డు దరఖాస్తులు కోరింది. కొత్తగా ఎంపికయ్యే సహాయక సిబ్బంది పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 24, 2021 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌తో వీరంతా తమ బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 22 వరకు బోర్డు బాధ్యతలు నిర్వర్తించనున్న క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నే ఈ మొత్తం నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. శాస్త్రి కొనసాగుతాడా..! కెప్టెన్ కోహ్లితో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత 57 ఏళ్ల రవిశాస్త్రి జూలై 2017లో బాధ్యతలు చేపట్టాడు. అతని మార్గనిర్దేశనంలో భారత జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు ఓడినా, ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. వన్డేల్లో కొంత కాలంగా అద్భుతమైన రికార్డును కొనసాగించిన టీమిండియా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు వచ్చేసరికి మాత్రం సెమీఫైనల్‌కే పరిమితమైంది. కోచ్‌గా పనితీరుపై గొప్ప ప్రశంసలేవీ పొందకపోయినా... కోహ్లితో సాన్నిహిత్యంతో పాటు జట్టు వరుస విజయాల కారణంగా శాస్త్రి కోచింగ్‌లో పెద్దగా లోపాలేమీ కనిపించలేదు. బాధ్యతలు తీసుకున్న సమయంలో శాస్త్రి లక్ష్యం కూడా వరల్డ్ కప్ అయి ఉండవచ్చు. టోర్నీ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. అతనికి బీసీసీఐ ఏడాదికి రూ. 8.20 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది! తాజాగా బోర్డు చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది ఎవరూ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. తమంతట తాము తప్పుకుంటే తప్ప వారిని కూడా ఈ ప్రక్రియలో పరిశీలనలోకి తీసుకుంటారు. అయితే వీరంతా కొనసాగేందుకు ఇష్టపడతారా అనేదానిపై తమకు స్పష్టత లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పుడే ప్రపంచ కప్ ముగియగా, వచ్చే ఏడాది నవంబరులో గానీ టి20 ప్రపంచ కప్ స్థాయి టోర్నీ లేదు. భారత్‌కు సవాల్‌కు నిలిచే సిరీస్‌లు కూడా ఇప్పట్లో లేవు. కాబట్టి శిక్షణపై శాస్త్రికి అనాసక్తి ఉండవచ్చని సమాచారం. మరోసారి అతను వ్యాఖ్యానంపై ఆసక్తి చూపిస్తే భారత్ కొత్త కోచ్‌ను చూడవచ్చు. -
రైల్లో విమానం లాంటి కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రైల్లోనూ విమానంలో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌లను చూడొచ్చు. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి బోగీలను ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే మార్గం ఇదే. కాబట్టి సముద్ర మట్టానికి సుమారు 5 వేల మీటర్ల ఎత్తులో వెళ్లే సమయంలో ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. ఇందుకోసం విమానాల్లో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌ల లాంటివి అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఎక్కువ ఎత్తులో ప్రయాణికులు శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విమానాల్లో ప్రెషరైజ్డ్ కోచ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం చైనాలోని క్వింగే–టిబెట్ రైల్వే లైనులోనే ఈ తరహా కోచ్‌లను వినియోగిస్తున్నారు. ఆక్సీజన్ పాళ్లు తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా ఈ కోచ్‌లను డిజైన్ చేశారు. -
బోగీల్లో ప్యానిక్ బటన్ -ఈశాన్య రైల్వే
సాక్షి, లక్నో: రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బోగీల్లో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నామని ఈశాన్య రైల్వే విభాగం (ఎన్ఈఆర్) ప్రకటించింది. అలాగే రాత్రి పూట మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. రైళ్ళలో మహిళల భద్రతను బలోపేతం చేయాలన్న యోచన దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళల నియామకాలతోపాటు, రాత్రిపూట రైళ్ళలో మహిళా బోగీలన్నింటిలో మహిళా పోలీసులను నియమించాలని, ప్యానిక్ బటన్ వ్యవస్థను నెలకొల్పనున్నట్లు ఎన్ఈఆర్ సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ప్రకటించారు. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ ప్యానిక్ బటన్‌ను నొక్కిన వెంటనే బోగీ బయట, రైలు డ్రైవర్ వద్ద, కంట్రోల్ రూంలో ప్రమాద హెచ్చరిక లైట్లు వెలుగుతాయని వివరించారు. ప్రస్తుతం, మహిళా ప్రయాణీకులు కాల్ లేదా ఎస్ఎంఎస్ , హెల్ప్‌లైన్ నెంబర్లు,లేదా అత్యవసర పరిస్థితిలో గొలుసు-లాగడం లాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తోందీ కానీ ప్యానిక్బటన్ వ్యవస్థతో తక్షణమే చర్య తీసుకునేఅవకాశం ఉందని తెలిపారు. సబర్బన్ రైళ్ల బోగీల్లో సీసీటీవీ ఏర్పాటును కూడా ఆలోచిస్తున్నామన్నారు. అలాగే మహిళా బోగీలను తొందరగా గుర్తించేందుకు వీలుగా రంగులను మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
ఇప్పుడు కోచ్‌లకు ‘పరీక్షా’కాలం
ఫిట్నెస్ లేని ‘సాయ్’ కోచ్‌లకు ఉద్వాసనే! న్యూఢిల్లీ: ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులనేవి సహజం. కానీ ఇప్పుడు కోచ్‌లు కూడా తమ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి వస్తోంది. లేదంటే తప్పుకోవాలి... తప్పదు! కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌లకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. 40 ఏళ్లు పైబడిన కోచ్‌లు తమ సత్తా చాటుకుంటేనే కొనసాగించాలని, లేదంటే ఉద్వాసన పలకాలని క్రీడాశాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కోచ్‌లు ఈ టెస్టుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వీరికి 800 మీటర్ల పరుగుతో పాటు పలు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆరోగ్య సామర్థ్య పరీక్షలు చేస్తారు. అంటే వారు కోచింగ్‌కు అర్హులేనా అనే విషయాన్ని తేలుస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో త్వరలో నార్త్‌జోన్ నుంచి ఈ టెస్టుల ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ చివరి కల్లా దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీవీపీ రావు చైర్మన్‌గా వ్యవహరిస్తారని క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. -
4500 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టాం: రైల్వే శాఖ
న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల తీవ్రతను తగ్గించేలా రూపొందించబడిన రైలు కోచ్‌లు.. లింకే హోఫ్మన్ బుచ్(ఎల్‌హెచ్‌బీ)లను విస్తరిస్తున్నామని.. ఇప్పటి వరకు ఈ తరహా కోచ్‌లు 4500 భారత రైల్వేలో ప్రవేశపెట్టామని రైల్వే శాఖ వెల్లడించింది. శుక్రవారం రాజ్యసభలో వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే భద్రతపై ఏర్పాటైన అనిల్ కకోద్కర్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను సిఫారసు చేసిందని, ఆ సిఫారసును ప్రభుత్వం ఏ మేరకు అమలు చేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఇచ్చిన సమాధానంలో.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైలు ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని.. వీటిలో బాడీ-బోగి, వీల్-బోగి కనెక్షన్ బాగుండటంతో పాటు.. యాంటీ క్లైంబింగ్ ఫీచర్ సైతం ఉందని తెలిపిన రాజెన్ గోహెల్.. వీటి సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. అలాగే రాకేష్ మోహన్ కమిటీ సిఫారసు చేసిన అంశాల అమలును సైతం విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120 మందికి పైగా మృత్యువాత పడగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాద తీవ్రత పెరగడానికి ఐసీఎఫ్ తరహా కోచ్‌లు కూడా కారణమనే విమర్శలు వినిపించాయి. -
బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!
బరేలి : హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల త్వరలో సాకారం కానుంది. ఇండియన్ రైల్వే అందుకోసం మరో అడుగు ముందుకేసింది. ఇజత్ నగర్, భోజీపురా స్టేషన్ల మధ్య శనివారం స్పానిష్ కు చెందిన టాల్గో కంపెనీ హైస్పీడ్ రైలు కోచ్ లకు సెన్సార్ ట్రయల్ నిర్వహించింది. ట్రయల్ రన్ లో భాగంగా సూపర్ లగ్జరీ కోచ్ లను ఇండియన్ ఇంజన్ తో పట్టాలపై నడిపించినట్లు అధికారులు తెలిపారు. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్పీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. (చదవండి...మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు) టాల్గో కంపెనీ ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితం తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది. అనేక సెన్సార్ల ఆధారంగా నడిచే కోచ్ లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు రైల్వే బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ సెన్సార్ ట్రయల్ నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం బరెలీ నుంచి మొరాదాబాద్ వరకూ ప్రారంభించే బోగీల స్పీడ్ ట్రయల్ జూన్ 12 వరకూ కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రస్తుత ట్రయల్ సందర్భంలో ఈ కోచ్ లు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, త్వరలో న్యూఢిల్లీ ముంబై మార్గంలోని మధుర పాల్వాల్ సెక్షన్ లో జరిగే ట్రయల్ రన్ లో గంటకు 180 నుంచి 200-220 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన కోచెస్ సెన్సార్ ట్రయల్ విజయవంతమైందని ఈశాన్య రైల్వే ఇజత్ నగర్ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం రైల్వే బోర్డులోని ముగ్గురు సభ్యుల బృదం వర్క్ షాప్ కు చేరుకొని, టాల్గో కోచెస్ కు సంబంధించిన వివరాలను అందించిందని, అనంతరం స్పానిష్ టీమ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు, కోచ్ లలోని ప్రతి వస్తువుకు చెందిన పూర్తి సమాచారాన్ని విపులంగా వివరించినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు. -
మోత వేస్తున్న కూత
గ్రామీణ క్రీడ కబడ్డీకి రెండు దశాబ్దాలుగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. తన ఉనికినీ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఈ తరుణంలో ప్రవేశించిన ప్రో కబడ్డీ ఈ క్రీడ దశాదిశను మార్చేంది అమలాపురం. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ పొందిన్న క్రీడలో కబడ్డీ తొలిస్థానానికి చేరింది. క్రీడాకారులను, క్రీడాభిమానులే కాదు.. చిన్నపిల్లలనూ ఇది అమితంగా ఆకర్షిస్తోంది. క్రీడాకారులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రో కబడ్డీ భరోసా కల్పించింది. ఒకప్పుడు భారత జట్టు ఏషియాడ్ క్రీడల్లో కబడ్డీ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించినా ఆ జట్టులోని సభ్యులు ఎవరో పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు ప్రో కబడ్డీ(ప్రొఫెషనల్ కబడ్డీ) పుణ్యమా అని మన దేశ కబడ్డీ క్రీడాకారులకు ఎనలేని గుర్తింపు, వాణిజ్య ప్రకటల్లో అవకాశాలు వస్తున్నాయి. తమకు ఇంతగా గుర్తింపు తెచ్చింది ప్రో కబడ్డీయేనని క్రీడాకారులు, న్యాయనిర్ణేతలు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో గురువారం నుంచి ఆరంభమైన జాతీయ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు వచ్చిన కోచ్‌లు, క్రీడాకారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. -
ఎన్సీఏ కోచ్‌లుగా
► రామన్, హిర్వాణీ, శేఖర్ ముంబై: మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యు.వి. రామన్, నరేంద్ర హిర్వాణీ, టీఏ శేఖర్‌లను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్యానెల్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. రామన్ బ్యాటింగ్, శేఖర్ పేస్ బౌలింగ్, హిర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా పని చేస్తారని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. మరికొంత మంది అసిస్టెంట్ కోచ్‌లు వీళ్లకు సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. ఎన్సీఏ డెరైక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ త్రయాన్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారని చౌదరి తెలిపారు. ఎన్సీఏను శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు. నెల రోజుల్లో అనువైన స్థలం లభించకపోతే అకాడమీని వేరే చోటుకు తరలిస్తామన్నారు. -
కోచ్‌లతో ఆటలా..!
ఏ ఆటైనా ఆడించడం కోచ్ పని... నిర్వహించడం పరిపాలకుడి పని. కోచ్ పనిలో పరిపాలకుడు వేలుపెడితే నష్టమే ఎక్కువ. ఈ చిన్న విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు మరచిపోయారు. తన నియంతృత్వ ఆలోచనా విధానంతో కోచ్‌ను తప్పించారు. మొత్తం దేశంలో హాకీ అంతా తన చేతుల్లోనే ఉండాలనే ఆలోచనతో ఆయన మరోసారి గిల్‌ను గుర్తుకు తెచ్చారు. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన పరిపాలకులు... తమ అహం కోసం కోచ్‌లను తప్పిస్తూ వాళ్లతో ఆటలాడుతున్నారు. సమయం ఇవ్వకుండానే సాగనంపుతున్నారు ఇప్పటికి ఆరుగురు విదేశీ కోచ్‌లపై వేటు వచ్చే ఏడాదే రియో ఒలింపిక్స్ సాక్షి క్రీడావిభాగం ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటారు. అలాగే భారత హాకీలో కొత్త కోచ్ ఎప్పుడు వస్తాడో, ఎంత కాలం ఉంటాడో, ఎందుకు వెళ్లిపోతాడో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం కేపీఎస్ గిల్ హయాంలో స్వదేశీ, విదేశీ అని లేకుండా ‘కోచ్‌లతో కుర్చీలాట’ మొదలైంది. సమాఖ్య పేరు మారినా, అధికారం బదలాయింపు జరిగినా కోచ్‌లతో గిల్లీకజ్జాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్ నేడు తమ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన వారే ఈ ఆటతో ఆటలాడుకుంటున్నారు. తమ పెత్తనమే ఉండాలని కోరుకుంటూ, పట్టుదలకు పోయి ఆటకు అన్యాయం చేస్తున్నారు. రాచ్ నుంచి పాల్ వరకు... రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గిన భారత్‌కు తొలిసారి 2004లో గెరార్డ్ రాచ్ (జర్మనీ) రూపంలో విదేశీ కోచ్ వచ్చారు. అయితే ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, చాంపియన్స్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శన కారణంగా ఆయనపై అదే ఏడాది వేటు వేశారు. ఆ తర్వాత వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా రావడం, బాధ్యత తీసుకోవడం, కొన్నాళ్లు ఉండటం ఆ తర్వాత వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ప్రపంచ కప్ వరకు ఆయనను భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఈ ఫిబ్రవరిలో నియమించారు. ఆరు నెలలు కూడా గడవకముందే ఆయనపై వేటు వేశారు. నాడు గిల్... నేడు బాత్రా పంజాబ్ ‘సూపర్‌కాప్’ కేపీఎల్ గిల్ తన హయాంలో స్వదేశీ కోచ్‌లతో ఓ ఆటాడుకున్నారు. కోచ్‌లను నియమించడం, ఫలితాలు వస్తున్న సమయంలో వారిని అకారణంగా తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు గిల్ హయాంలో ఎనిమిది మంది (జఫర్ ఇక్బాల్, సెడ్రిక్ డిసౌజా, భాస్కరన్, పర్గత్ సింగ్, ఎం.కె.కౌశిక్, హర్చరణ్ సింగ్, సీఆర్ కుమార్, రాజిందర్ సింగ్) స్వదేశీ కోచ్‌లపై వేటు పడింది. ఆ తర్వాత 2004 నుంచి 2015 వరకు ఏడుగురు (గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, రోలెంట్ ఆల్ట్‌మన్స్, గ్రెగ్ నికోల్, టెర్రీ వాల్ష్, పాల్ వాన్ యాస్) విదేశీ కోచ్‌లను తప్పించారు. రోలెంట్ ఆల్ట్‌మన్స్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆనాడు గిల్ నియంతృత్వ ధోరణిపై తిరుగుబాటు చేసిన నాటి భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) ఉపాధ్యక్షుడు, నేటి హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా ఇప్పుడు గిల్ అడుగుజాడల్లో నడస్తుండటం గమనార్హం. పారిశ్రామికవేత్త అయిన బాత్రా భారత హాకీ పురోగతికి తనవంతు కృషి చేస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే మొత్తం హాకీ ఇండియా తన చేతుల్లోనే ఉండాలనుకోవాలనే ఆయన అత్యాశ ఆటకు చేటు చేస్తోంది. గతేడాది కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. అయితే టెర్రీ వాల్ష్ కుదురుకున్నాడని అనుకుంటున్న తరుణంలో ఆయనను సాగనంపారు. ఆయన స్థానంలో వచ్చిన పాల్ వాన్ యాస్‌కు దీనికి మినహాయింపు కాదు. ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ సందర్భంగా మలేసియాతో మ్యాచ్ అనంతరం నరీందర్ బాత్రా నేరుగా మైదానంలోకి రావడం... ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేయడం... ఆయనను అక్కడి నుంచి వెళ్లాపోవాలని కోచ్ పాల్ కోరినందుకే ఆయనపై వేటు పడిందని అంటున్నారు. ఇకనైనా మేలుకుంటారా... రియో ఒలింపిక్స్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత భారత హాకీ జట్టు ఖాతాలో మరో పతకం చేరలేదు. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే వెంటనే కొత్త కోచ్‌ను నియమించడమో లేక హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న రోలెంట్ ఆల్ట్‌మన్స్‌కు మరోసారి చీఫ్ కోచ్ బాధ్యతలు అప్పగించడమో చేయాలి. టెర్రీ వాల్ష్‌ను తప్పించిన తర్వాత కొంతకాలంపాటు ఆల్ట్‌మన్స్ భారత్‌కు తాత్కాలిక కోచ్‌గా పనిచేశారు. రెండేళ్లుగా జట్టుతో ఉన్నందున ఆయనకు భారత హాకీ బలాబలాలపై మంచి అవగాహన ఏర్పడింది. కొత్త కోచ్‌ను నియమించే బదులు రియో ఒలింపిక్స్ వరకు ఆల్ట్మన్స్ను కోచ్‌గా కొనసాగించాలని భారత ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా హాకీ ఇండియా అధికారులు తమ పొరపాట్లను సరిదిద్దుకొని భారత హాకీకి మేలు చేసే నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. విదేశీ కోచ్‌లు వచ్చి పోయారిలా... 1. గెరార్డ్ రాచ్ (జర్మనీ) నియామకం: భారత జట్టు తొలి విదేశీ కోచ్‌గా 2004 జూన్‌లో నియమించారు. ఏథెన్స్ ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. దాంతో అదే ఏడాది డిసెంబరులో రాచ్పై వేటు పడింది. 2. జోస్ బ్రాసా (స్పెయిన్) వేతనం: రూ. 7 లక్షలు (నెలకు) నియామకం: 2009 మేలో కోచ్‌గా ఎంపిక చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: బ్రాసా అధ్వర్యంలో భారత్ 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించింది. అయితే అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందకపోవడంతో భారత్ నేరుగా లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. 2010లో ఆయన కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. 3. నాబ్స్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 6.5 లక్షలు నియామకం: 2011 జూన్‌లో కోచ్‌గా నియమించారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: నాబ్స్ ఆధ్వర్యంలో భారత్ 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే లండన్ ఒలింపిక్స్‌లో భారత్ చిట్టచివరిదైన 12వ స్థానంలో నిలిచింది. 2013 జూన్‌లో ఆయనపై వేటు వేశారు. 4. గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) నియామకం: 2013లో మైకేల్ నాబ్స్‌ను తప్పించాక కొంతకాలంపాటు గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. వేటు పడిందిలా: నికోల్ ఆధ్వర్యంలో భారత్ 2013లో జపాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగింది. ఈ టోర్నీలో టీమిండియా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నికోల్ న్యూజిలాండ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వెళ్లిపోయారు. 5. టెర్రీ వాల్ష్ (ఆస్ట్రేలియా) వేతనం: రూ. 10 లక్షలు నియామకం: 2013 అక్టోబరులో కోచ్‌గా తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. వేటు పడిందిలా: ఆసియా క్రీడలు ముగిశాక హాకీ ఇండియా, సాయ్ అధికారులతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయనను తప్పించారు. 6. వాన్ యాస్ (నెదర్లాండ్స్) వేతనం: రూ. 7.5 లక్షలు నియామకం: ఈ ఏడాది ఫిబ్రవరిలో కోచ్‌గా నియమించారు. 2018 ప్రపంచకప్ వరకు ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వేటు పడిందిలా: ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ టోర్నీ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో మైదానంలో వాగ్వాదం. టోర్నీ ముగిశాక నేరుగా నెదర్లాండ్స్ వెళ్లిపోయిన పాల్ తిరిగి భారత్‌కు రాలేదు. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన వారిలో కోచ్‌గా ఆయన పేరు లేదు. -
ఇద్దరు మనోళ్లే!
భరత్ అరుణ్... రామకృష్ణన్ శ్రీధర్... భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కోచ్‌లు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడీని సీనియర్ జట్టుకు అండగా నిలిచేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఇద్దరికీ యాదృచ్ఛికంగా తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. కెరీర్ ఆసాంతం తమిళనాడుకే ఆడినా... అరుణ్ పుట్టింది విజయవాడలో. అలాగే మైసూర్లో పుట్టినా... శ్రీధర్ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొత్తం హైదరాబాద్ తరఫునే ఆడి ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు అరుణ్ చీఫ్ కోచ్ కాగా, శ్రీధర్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఆర్. శ్రీధర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 44 ఏళ్ల ఆర్. శ్రీధర్ హైదరాబాద్ తరఫున దాదాపు 12 ఏళ్ల కెరీర్లో 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. 15 లిస్ట్ ‘ఎ’ మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో దేశవాళీలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001నుంచే కోచింగ్ వైపు మళ్లి, సుదీర్ఘ కాలం పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా శ్రీధర్ పని చేశాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అతను, ఈ ఏడాది కూడా అదే బాధ్యత నిర్వర్తించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన తర్వాత శ్రీధర్‌కు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. అనంతరం ఈ సీజన్ కోసం ఆంధ్ర జట్టు కోచ్‌గా కూడా ఎంపిక చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో తొలిసారి భారత సీనియర్ జట్టుతో కలిసి పని చేసే అవకాశం లభించింది. భరత్ అరుణ్ పేస్ బౌలర్ అయిన అరుణ్ 1979లో రవిశాస్త్రి కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించిన అండర్-19 జట్టు సభ్యుడిగా తొలిసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1986-87లో భారత్ తరఫున కేవలం 2 టెస్టులు ఆడిన అతను 4 వికెట్లు తీశాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 48 మ్యాచ్‌ల్లో 110 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాట్స్‌మన్‌గా కూడా గుర్తింపు ఉన్న అరుణ్ 1987-88లో రంజీ ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సౌత్‌జోన్ తరఫున సెంచరీ (149) చేయడంతో పాటు డబ్ల్యూవీ రామన్‌తో కలిసి 221 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం అతని కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2008నుంచి ఇటీవలి వరకు ఎన్సీఏలో కోచ్‌గా ఉన్న అరుణ్... ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అకాడమీ కోచింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కోచ్‌గా ఉన్న అతను ఈ ఏడాది కూడా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. -
బోగీలను వదిలి,.. రైలు పరుగు
బెంగళూరు: మైసూరు, బెంగళూరుకు మధ్య ప్రయాణిస్తున్న రైలులో ఇంజిన్‌నుంచి కొన్ని బోగీలు వేరుపడి కొద్ది సేపు రైలు పరుగులు పెట్టింది. శనివారం ఉదయం ఏడున్నరకు 13 బోగీలతో దర్బాంగ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎనిమిదిన్నరకు మండ్య సమీపంలో తొమ్మిదో బోగీ బేరింగ్ విరగడంతో ఆ బోగీ విడిపోయింది. కొద్దిసేపటికి మరో నాలుగు బోగీలు విడిపోయి, మొత్తం అయిదు బోగీలకు రైలుతో లింక్ పోయింది. చాలా సేపటికి పరిస్థితిని గమనించిన డ్రైవర్, రైలును తిరిగి మండ్యకు మళ్లించారు. తొమ్మిదో బోగీ మినహా మిగిలిన బోగీలను రైలుకు తగిలించాక రైలు బెంగళూరు బయలుదేరింది.