dalai lama
-
14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్‌లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. బౌద్ధాచార్యులైన ఒక దలై లామా ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.జూన్‌లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! దర్శనాలకు సమయమౌతుండగా మిస్ డోల్మా త్సెరింగ్ తేఖాంగ్ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్ తేఖాంగ్?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఆమె.వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్ తేఖాంగ్నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్ పెన్పా త్సెరిన్ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్. సిక్యోంగ్ పెన్పా త్సెరిన్... ప్రవాస టిబెటన్ ప్రభుత్వ ప్రధాని. ‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్ తేఖాంగ్. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. తేఖాంగ్ కలవరంగా చూశారు. ‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాం...’’ అన్నారు మిస్ తేఖాంగ్! నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్లుమీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్ తేఖాంగ్. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. -
రామ్ గోపాల్ వర్మ నాటి హాట్ బ్యూటీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే
బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాత కూడా. అంతే కాదు తనొక మోడల్, చివరకు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. ఇలా సినిమా రంగానికి దగ్గరగా ఉన్న తను బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకుంది. తను ఇప్పడు ఇండియన్ నన్‌గా గుర్తిపు పొందింది. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లతో పోటీ బర్ఖా మదన్ 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో ఎంట్రీ 1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి'లో బర్ఖా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ యొక్క నాల్గోవ సీజన్లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది. రామ్ గోపాల్ వర్మ భూత్‌లో బర్ఖా మదన్ బర్ఖా తన కెరీర్లో సెలెక్టివ్‌గా ఉంటూ, రామ్ గోపాల్ వర్మ యొక్క అతీంద్రియ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించినప్పుడు విమర్శకులతో పాటు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ సినిమా మెప్పస్తుంది. 2003 చలన చిత్రం అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్‌లతో కలిసి కూడా నటించింది. బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్ సోచ్ లో,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను కూడా నిర్మించిన బర్ఖా మదన్‌కు బౌద్ధ గురువు దలైలామా అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
దలైలామాపై చైనా గూఢచారి నిఘా
దలైలామాపై చైనా గూఢచారి నిఘా -
బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా.. ‘దలైలామా’ ఈవెంట్ వేళ కలకలం
పట్నా: కోవిడ్ మరోమారు విజృంభిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది భారత్. ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహార్‌లోని గయా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ముగ్గురు ఇంగ్లాండ్, ఒకరు మయన్మార్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విదేశీయులను ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని గయా సివిల్ సర్జన్ రంజన్ కుమార్ సింగ్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 33 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబర్ 20న వారంతా బ్యాంకాక్ నుంచి గయా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇంగ్లాండ్ దేశీయులను బోధ్ గయాలోని హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచగా.. మయన్మార్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లారు. బోధ్ గయాలో డిసెంబర్ 29న బౌద్ధమత గురువు దలైలామా ప్రసంగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా విదేశీ భక్తులు హాజరవుతారని అంచనా. 50 దేశాలపైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు మూడు రోజుల ముందు నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్ గంజ్‌లో శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పురస్కారం ప్రదానం చేశారు. యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. -
ఇండియాకు దలైలామా
1959 టిబెటన్ తిరుగుబాటు ప్రారంభంలో తమ ప్రాణాలను కాపాడుకోడానికి దలైలామా, ఆయన పరివారం ఆ ఏడాది మార్చి 30 న భారతదేశంలోకి ప్రవేశించి, ఏప్రిల్ 18న అస్సాంలోని తేజ్‌పూర్‌కు చేరుకున్నారు. నాటి నుంచీ దలైలామా ఇండియాలో ఉంటున్నారు. గుజరాత్లో 2010లో జరిగిన ‘ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్’లో ఆయన మాట్లాడుతూ... ‘పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్‌ది, ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని, భారతమాత పుత్రుడిని’ అన్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో 14వ దలైలామా ఒకరు. శాంతి, అహింసా మార్గంలో టిబెట్ దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు అర్ధ శతాబ్దం పైగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈయనకు ఈ బహుమతిని ప్రదానం చేశారు. దలైలామా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశం ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ అనే కుగ్రామంలో 1935వ సంవత్సరం జూలై ఆరవ తేదీన జన్మించారు. ఆయన రెండున్నర సంవత్సరాల వయస్సులోనే బుద్ధుని అవతారంగా గుర్తింపు పొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు తన వారసునిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. లామో ధోండ్రబ్ (నేటి దలైలామా) పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలన వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే 1954వ సంవత్సరంలో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం చైనా హస్తగతం అయింది. ఆ దశలో టిబెట్ పరిరక్షణ కోసం దలైలామా... మావోసేటుంగ్, చౌ ఎన్ లై మొదలైన నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ అజ్ఞాత ప్రదేశం... భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ధర్మశాల. భారతదేశంలో ఆశ్రయం పొంది ‘ధర్మశాల’లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా. ఆయన ఒక సందర్భంలో... తన శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. నోబెల్ బహుమతి అందుకునే సమయంలో దలైలామా ‘‘నోబెల్ శాంతి పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వాతంత్య్రం కోసం పోరాడేవారికి, అణగదొక్కబడే వారికి... ప్రపంచ శాంతి కోసం పాటుపడే వారికీ ఈ బహుమతి అంకితం’’ అని పేర్కొన్నారు. -
చెత్తగా తీసిన సినిమా అది.. బాలేదంతే!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! బాలేదంతే! ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినందున, రైట్–వింగ్ ద్వేషాన్నీ, ప్రచారాన్నీ ప్రేక్షకులు తిప్పికొట్టారని చాలా మంది అనాలోచిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది నిజం కాదు. ఇంకో అభిప్రాయం లేనంత చెత్తగా తీసిన సినిమా అది. అంతే! – మణిముగ్ధ శర్మ, విద్యావేత్త ఎదుర్కోక తప్పదు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను తాను ‘పీటర్ ద గ్రేట్’ (రష్యా చక్ర వర్తి)తో పోల్చుకుని, రష్యా తిరిగి తన భూభాగాలను పొందే తపనతో ఉందని చెబుతున్నారు. ఒక కథనం ప్రకారం, రష్యా ఆక్రమించుకున్న అత్యధిక ఉక్రెయినియన్ భూభాగా లను ‘రష్యన్ రీజియన్’గా ఏకం చేసే పథకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వడానికి ఇది సందర్భం కాకపోతే ఇంకేమిటి? – ఒలెక్సీ సోరోకిన్, ఉక్రెయిన్ జర్నలిస్ట్ శాంతి శాంతి ముస్లిం సమాజం శాంతియుతంగా ఉండాలని నా సలహా. దుందుడుకు చర్యలు దేశంలోని లౌకికవాదాన్ని బలహీనపర్చడానికే పనికొస్తాయి. – యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి వేరుగా మాట్లాడకూడదా? టీకాల పట్ల అసమ్మతిపూరిత అభిప్రాయం ఉన్నవాళ్లను పర్యవేక్షించడానికీ, వారి మీద కేసులు వేయడానికీ ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసిందని వార్త. పోలీసులు కాదు, అటార్నీ జనరల్ కాదు, స్వయంగా ఆరోగ్య మంత్రిత్వశాఖే రంగం లోకి దిగుతోంది. ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసులను తప్పనిసరి చేసిన తెల్లారే ఇది జరుగుతోంది. – ఎలీ డేవిడ్, పరిశోధకుడు మన ప్రేమ అందాలి మొత్తం విశ్వం పట్ల పరోపకార బుద్ధితో ఉండట మనే భావనను గనక గట్టిగా పరిగణిస్తే, ఇంక శత్రువులు ఉండే అవకాశం ఎక్కడ? నిజంగా మానవాళి వాస్తవిక శత్రువులు ఏమంటే– కోపం, ద్వేషం లాంటి ప్రతికూల ఉద్వేగాలు. చెప్పాలంటే, ఈ భావనలు అధికంగా ఉన్నవాళ్ల పట్ల మనం మరింత కరుణతో వ్యవహరించాలి. – దలైలామా, బౌద్ధ గురువు ఆందోళనాపూరిత భవిష్యత్ కర్ణాటకలోని ఒక రోడ్డు మీద ఉరితీసిన ‘నూపుర్ శర్మ’ దిష్టిబొమ్మ వేలాడుతోంది. అధికారులకు నా అభ్యర్థన ఏమిటంటే, దయచేసి దాన్ని తొలగించొద్దు. ఇండియా మారిన బాధాకరమైన తీరుకు ఇంతకంటే ప్రతీకాత్మక చిత్రం ఇంకొకటి ఉండదు. ఇది మన భవిష్యత్తు, దాన్ని మనం ప్రదర్శించుకోవాలి. – ఆనంద్ రంగనాథన్, రచయిత తోసేస్తే సరి మే నెలలో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. నలభై ఏళ్లలో అమెరికాలో ఇదే అత్యధికం. మే నెల కల్లా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతుందన్న ‘నిపుణులు’ తప్పని మరోసారి తేలింది. ఇంకేం? రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నిందిద్దాం. – అఫ్షైన్ ఇమ్రానీ, కార్డియాలజిస్ట్ -
రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా
ధర్మశాల: దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు. అనంతరం, టిబెటన్ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై స్పందించిన దలైలామా.. ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు దేశాలు సైతం రష్యాను కోరాయి. తాజాగా టిబెటియన్ ఆధ్యాత్యిక నేత దలైలామా.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు. దలైలామా సోమవారం మాట్లాడుతూ.. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. కాగా, రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. అహింస మాత్రమే సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. అప్పుడే శాంతియుత ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ క్రమంలోనే.. మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలని కోరారు. అందరి మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే నిజమైన శాంతి ఏర్పడుతుందని పేర్కొన్నారు. -
లద్దాఖ్‌లోకి చొరబడిన చైనీయులు..
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని చైనీయులు కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే, గత వారం ప్రధాని మోదీ దలైలామాకు 86వ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దలైలామాతో మాట్లాడినట్లు అంగీకరించడం ఇదే తొలిసారి. కాగా, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపని భారత ప్రభుత్వం.. దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం చైనాకు మింగుడుపడడం లేదు. 2019లో మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా దలైలామా పుట్టిన రోజుని అంశంగా తీసుకుని చైనీయులు ఇలానే నిరసన తెలిపారు. -
కరోనా సునామీ : దలైలామా సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విలయంతో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలుముందుకొస్తున్నాయి. కరోనా నిర్యూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీ ఆఫర్లు) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భయంకరమైన కరోనా సునామిలో తోటి భారతీయ సోదర, సోదరీ మణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్ట్‌ను కోరానని ఆయన చెప్పారు. ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసిపోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు 3లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్న క్రమంలో మంగళవారం నాటికి 3,23,144 మంది కొత్తగా క రోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54 శాతంగాఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) -
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ) ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది.మరోవైపు ఇదొక చారిత్రాత్మక చర్యగా, చైనాకు స్పష్టమైన సందేశంగా ధర్మశాల అభివర్ణించింది. ఈ నిర్ణయం ప్రస్తుత దలైలామా, టిబెటన్ బుద్ధిస్ట్ లీడర్లు, టిబెట్ ప్రజలదే అని టీపీఎస్ఏ స్పష్టం చేస్తోందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించింది. దీనిపై స్పందించిన చైనా అమెరికాపై మండిపడుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. టీపీఎస్ఏ చట్టం టిబెటన్ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయంగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు లాబ్సాంగ్ సాంగాయ్ పేర్కొన్నారు. దీని కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. చైనా ఇప్పటికే తరువాతి దలైలామాను నియమించే ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తొమ్మిదేళ్ల క్రితం టిబెట్‌పై దాడి చేసి, చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును దారుణంగా అణచివేసిన చైనా టిబెట్ బౌద్ధమతాన్నికూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశంలో 80 వేల మంది టిబెటన్లు ప్రవాసంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 150,000 మంది ఉన్నారు. -
ఒక్క మంత్రంతో కరోనా వైరస్ మాయం..!
ధర్మశాల: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రాలు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. వుహాన్ నగరంలో కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 130 మంది చనిపోగా వేలాది మంది ఆ వైరస్ బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు ఆయన భక్తులు.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్బుక్ వేదికగా దలైలామాను కోరారు. (ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం : చైనా అధ్యక్షుడు) దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుందని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు. తార మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. మంత్రం జపించి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎలాంటి బాధలు ఉండవు అని దలైలామా పేర్కొన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు స్వయంగా తన గొంతును ఫేస్బుక్లో పోస్టు చేశారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వైరస్ లక్షణాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. (ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!) -
దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది
సిమ్లా: టిబెట్ మతపెద్దలు బుధవారం ధర్మశాలలో సమావేశమై దలైలామా వారసుడి ఎంపిక విషయమై చర్చించారు. లామాకే సర్వాధికారాలు ఉండి తన వారసుడిని ఎన్నుకునే ఆచారం అనాదిగా వస్తుందని.. అదే ప్రస్తుత లామా కొనసాగిస్తారని తీర్మానం చేశారు. 3 రోజులపాటు జరిగిన టిబెటన్ మత సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ బౌద్ధ లామాలు, టిబెట్ మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. టిబెట్‌లో 800 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఆయన కొనసాగిస్తారని.. తదుపరి లామాను ఎన్నుకునే హక్కు కేవలం ప్రస్తుత లామాకు మాత్రమే ఉందని, నిర్ణయం పూర్తిగా దలైలామా వ్యక్తిగతమని పేర్కొన్నారు. అంతేకాక చైనా ఎన్నుకునే లామాను.. టిబెటన్లు ఎన్నడూ గౌరవించరని, లామాను నిర్ణయించే అధికారం ఇతర వ్యక్తులకు, ప్రభుత్వానికి లేదంటూ ఈ మేరకు నొక్కిచెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత మత గురువులలో ఒకరైన దలైలామాను చైనాలోనే కాక ప్రపంచం నలుమూలలా అనుసరిస్తున్నావారు ఉన్నారు. నిత్యం ఆయనను గౌరవిస్తూ.. నిర్దేశించిన మార్గంలో నడిచేవారు ప్రపంచం నలువైపులా ఉండడంతో.. దలైలామా వారసుడిని ఎంపిక చేసే అర్హత ప్రపంచానికి ఉందని గతవారం యూఎస్ రాయబారి శ్యాముల్ బ్రౌన్ తెలిపారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంపిక చేసే హక్కు చైనాకు మాత్రమే ఉందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తదుపరి దలైలామా ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠను అధిగమించడానికి ఐక్కరాజ్యసమితి సహా ఇతర ప్రపంచ దేశాలు చర్చలు జరపాలని యూఎస్ తరపున కోరారు. ముఖ్యంగా మత స్వేచ్ఛ, మానవ హక్కులు గురించి పట్టించుకునే యూరోపియన్ దేశాల ప్రభుత్వాలు దలైలామా వారసుడిని ఎంపికపై దృష్టి సారించాలని శ్యాముల్ బ్రౌన్ పేర్కొన్నారు. దలైలామాను తాను చాలాసార్లు యూఎస్‌లో కలిశానని అన్నారు. టిబెట్ బౌద్ధులకు మాత్రమే దలైలామా వారసుడిని ఎంపిక చేసే అధికారం ఉందని, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పునరుద్ఘటించారు. సాధారణంగా టిబెట్‌కే పరిమితమైన దలైలామా వెతుకులాటలో.. ప్రస్తుతమున్న 14వ దలైలామాను ఎన్నుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. టిబెట్‌కు చెందిన ప్రస్తుత 14వ దలైలామా కేవలం రెండేళ్ళ వయసులో 1937 సంవత్సరంలో ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల వయస్సులో అతను అధికారికంగా 14వ దలైలామాగా గుర్తించబడ్డారు. 1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు తరలి వచ్చి ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. 1989లో ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అయితే దలైలామా వారసుడు చైనా నుంచే వస్తాడని ఇప్పటికే చైనా ప్రకటించింది. తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక తన వారసుడిని నిర్ణయిస్తానని దలైలామా 2011లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు. తాను మరణించిన తరువాత.. చైనా ఏకపక్షంగా వ్యవహరించి తన వారసుడిని ప్రకటిస్తే.. అతడిని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండబోదని గతంలో స్పష్టం చేశారు. తదుపరి దలైలామాను నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కబోదని, తన వారసుడు భారత్‌లోని తన అనుచరుల్లో ఒకరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి దలైలామా వారసుడి ఎంపిక విషయంలో దలైలామా స్పందన చైనాకు మింగుడు పడటం లేదు. గతంలో దలైలామా మాట్లాడుతూ.. తన తర్వాత వచ్చే దలైలామా ఒక వేళ మహిళ అయితే.. ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. -
సారీ చెప్పిన దలైలామా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా ప్రపంచ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు దలైలామా కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయని మండిపడ్ద సంగతి విధితమే. గతంలో స్త్రీ పురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన దలైలామా క్షమాపణలు చెప్పారు. -
‘ఆమె చాలా అందంగా ఉంటేనే లాభం’
టిబెట్ : ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా ఇంటర్నెట్ వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. దలైలామా వ్యాఖ్యల పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయంటూ నెజటిన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. in the end, yet another patriarch — Alan (@CityLondonAlan) June 28, 2019 -
భవిష్యత్‌లో మహిళా దలైలామా!
ముంబై: భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘భవిష్యత్‌లో సమర్థవంతమైన మహిళ వస్తే కచ్చితంగా ఆమె మహిళా దలైలామా అవ్వచ్చు. ఎందుకంటే, బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారవాదమైంది. ప్రస్తుతం భారత్, టిబెట్ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు. చిన్ననాటి నుంచే మానసిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మెదడు ప్రశాంతంగా ఉండాలి. మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానం భారత్‌లో 3 వేల ఏళ్ల కంటే పురాతనమైంది. 3 వేల ఏళ్ల పురాతన నాగరికత కలిగిన దేశం భారత్ ఒక్కటే. మెదడుని ప్రశాంతంగా ఉంచే పద్ధతులు భారత్‌లో అప్పటి నుంచే ఉన్నాయి. ఆనందం అనేది ప్రశాంతతకు సంబంధించినది. అయితే 20వ శతాబ్దంలో అత్యంత హింస చెలరేగుతోంది. 21వ శతాబ్దం మాత్రం దీన్ని పునరావృతం చేయరాదు. దయా హృదయంతో మానవ మేధస్సు అత్యంత ఆవశక్యమైంది’ అని దలైలామా అన్నారు. -
కర్ణాటకలో దలైలామా హత్యకు కుట్ర
దొడ్డబళ్లాపురం: బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టుగా కర్ణాటకలోని రామనగరలో పట్టుబడిన టెర్రరిస్టు వెల్లడించినట్టు తెలిసింది. గత ఆగస్టు 7న రామనగరకు వచ్చిన ఎన్ఐఏ బృందం జేఎంబీ టెర్రరిస్ట్ మునీర్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతడు అక్కడ పలు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. పోలీసులు గాలిస్తుండడంతో భారత్‌లోకి చొరబడి బట్టల వ్యాపారిగా మారి బెంగళూరు, రామనగరలో మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై ఎన్ఐఏ నిఘా వేసి పట్టుకుంది. విచారణలో మునీర్ ఒక్కొక్కటీ బయటపెడుతుంటే దర్యాప్తు అధికారులే నివ్వెరపోతున్నారు. దలైలామా తరచూ మైసూరు సమీపంలోని బైలుకుప్పె టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారు. ఆ సమయంలో హత్య చేయాలని రామనగరలో కుట్ర పన్నినట్లు మునీర్ వివరించాడు. దలైలామాను హత్య చేయడం ద్వారా భారత్ సహా పలు దేశాల్లో చిచ్చు పెట్టాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా అనుమానిస్తున్నారు. 2018 జనవరి 18న బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన కార్యక్రమంలో బాంబు పెట్టి దలైలామా, బిహార్ గవర్నర్ ఇద్దరినీ ఒకేసారి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు మునీర్ బయటపెట్టాడు. ఈ కుట్రలో పాల్గొంటున్న ముగ్గురు అనుమానితులను ఎన్ఐఏ అరెస్టు చేయడంతో పథకం పారలేదు. -
‘గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు’
పనాజి : మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు. ‘మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు. -
అమా సిస్టర్ ఆఫ్ లామా
ఆమె చుట్టూ బాలల వికసిత వదనాలు. అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లాంటì ఆ ముఖాలను చూస్తుంటే ఆమెకి మరో ప్రపంచమే తెలియదు. ఎందుకంటే అది ఆమె సృష్టించుకున్న ప్రపంచం! ‘బాల్యానికి కష్టాలు ఉండకూడదు. బాల్యం ఒత్తిడులకు లోను కాకూడదు. బాల్యం చిదిమిన మొగ్గ అవకూడదు...’ అనుకున్నారు ఆమె. ఆమె పేరు.. జెట్సన్ పెమా. అందరూ పిలుచుకునే పేరు.. ‘అమా’. అమా అంటే అమ్మ. దలైలామాకు సొంత చెల్లి! జన్మభూమి అని చెప్పుకోడానికి ఓ దేశం అంటూ లేకుండా కాందిశీకుల్లా వచ్చి, ఆశ్రయం ఇచ్చిన పొరుగు దేశంలో తలదాచుకుని బతుకు వెళ్లబారుస్తున్నామనే ఆవేదన ఓ వైపు.. దేశాల మధ్య ఆధిపత్య పోరులో పిల్లలు నలిగిపోకూడదనే బాధ్యత మరోవైపు... ఈ రెండే జెట్సన్ పెమా జీవితాన్ని నడిపిస్తున్నాయి. 52 వేల మంది పిల్లలు, వారి భవిష్యత్తు కోసం స్థాపించిన విద్యాసంస్థలతో కాందిశీకులకు అండగా నిలుస్తున్నారు ‘అమా లా’. అమా లా అంటే టిబెట్ భాషలో ‘టిబెట్ దేశమాత’ అని. 77 ఏళ్ల జెట్సన్ పెమాను మనదేశం ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించింది. మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘నారీశక్తి’ని ప్రదానం చేసి గౌరవించింది. చైనా ఆక్రమణతో చెల్లాచెదురు జెట్సన్ పెమా 1940, జూలై ఏడవ తేదీన టిబెట్‌లోని లాసాలో పుట్టారు. నలుగురు పిల్లల్లో చిన్నది. అమె పెద్దన్న టెన్జిన్ గ్యాస్‌తో. అతడే ప్రస్తుత 14వ దలైలామా. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నప్పుడు సంభవించిన అభద్రతల కారణంగా టిబెట్ వాసులు భారీ సంఖ్యలో దేశం వదిలి పారిపోయారు. వేలాది టిబెటన్లు ఇండియాకి వచ్చేశారు. అలా వచ్చిన వారిలో పెమా కుటుంబం కూడా ఉంది. మొదట కాలింపాంగ్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్, ఆ తర్వాత డార్జిలింగ్‌లోని లోరెటో కాన్వెంట్లో చదువుకున్నారు పెమా. ఉన్నత చదువుల కోసం 1960లో కేంబ్రిడ్జికి వెళ్లారు. ఇంగ్లండ్, స్విట్జర్లాండ్లలో చదువు పూర్తయిన తర్వాత 1964లో తిరిగి ఇండియాకి వచ్చేశారు. అమ్మలా అక్కున చేర్చుకున్నారు అప్పటికి ఆమె పెద్దక్క త్సెర్లింగ్ దోల్మా టాక్లా జబ్బు పడ్డారు. దోల్మాను చూసుకోవడంతోపాటు దోల్మా సంరక్షణలో ఉన్న టిబెట్ అనాథ పిల్లల బాధ్యత కూడా పెమా తీసుకున్నారు. తమ ఆశ్రయంలో ఉన్న పిల్లలతోపాటు, దారీతెన్నూ లేకుండా పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలిపోయిన వేలాది చిన్నారులను చేరదీశారామె. కాందిశీకులుగా వచ్చి అనాథలుగా మారిన పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా వారికి ఒక నీడనిచ్చి, అన్నం పెట్టారామె. కానీ అది మాత్రమే సరిపోదని ఆమె అనుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గ్రామాలు! కాందిశీకులుగా మారిన చిన్నారుల కోసం బడి పెట్టించారు పెమా. మొదట్లో ఇది తాత్కాలిక అవసరమనే అనుకున్నారు. ఆశ్రయం కల్పించి, ఆరేడేళ్లు వచ్చిన పిల్లల్ని సమీపంలోని పాఠశాలల్లో చదివించేవారు. అయితే టిబెట్ నుంచి వలసల ప్రవాహం తగ్గలేదు కదా ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి హిమాలయ పర్వత శ్రేణులలో ఆమె ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజెస్’ పేరుతో స్కూళ్లను స్థాపించారు. ఆ స్కూళ్లలో టిబెట్ పిల్లలు, హిందూ, క్రైస్తవ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ పిల్లలు కూడా చదువుకుంటున్నారిప్పుడు. జెట్సన్ పెమా చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52 వేల మంది ఏ దారీతెన్నూ లేని పిల్లలను గ్రాడ్యుయేట్లను చేశారు. మొత్తం పది రెసిడెన్షియల్ స్కూళ్లు, 17 డే స్కూళ్లు, మూడు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, నాలుగు కాలేజీలు, మూడు హాస్టళ్లను స్థాపించారు. మహిళల్నీ, వృద్ధుల్నీ చేరదీశారు పిల్లల సంరక్షణకు ఒక చక్కటి దారి పడింది. చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు ఉద్యోగాలలో స్థిరపడే వరకు ఒక ఆశ్రయం కావాలి. అందుకోసం యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేశారు జెట్సన్ పెమా. ఇక భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలలో తలదాచుకున్న మహిళలు, వృద్ధులకు ఒక దారి చూపించాలి. అందుకోసం ఆశ్రమాలు నెలకొల్పారు. టిబెట్ నుంచి భారత్‌కు వచ్చిన మహిళలు, వృద్ధులు ఆ ఆశ్రమాలలో తలదాచుకుంటున్నారు. అందుకే వీరంతా జెట్సన్ పెమాను ‘మదర్ ఆఫ్ టిబెట్’ గా అంతా అభిమానిస్తున్నారు. యునెస్కో పురస్కారం అమా జెట్సన్ ప్రతిపాదించిన ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజ్’ ఆలోచన వినూత్నమైంది. ఆ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడంలోనూ ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత వాటి స్థాపనలో నిమగ్నమయ్యారు. భారత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆమె టిబెట్ పిల్లల పునరావాసాన్ని ఒక యజ్ఞంలా చేశారు. ఆ సేవలను గుర్తించిన యునెస్కో 1999లో ఆమెను అవార్డుతో గౌరవించింది. టిబెట్‌ను వదిలేయడమేనా?! పిల్లలు, మహిళలు, వృద్ధులు... ఒక్కమాటలో చెప్పాలంటే నిరాశ్రయులందరికీ ఆశ్రయం కల్పించారు జెట్సన్ పెమా. భారతదేశం తల్లిలా ఆదుకుంటే, ఆ దేశంలో తమ వాళ్ల కోసం తన ఒడిని విశాలం చేసింది పెమా. మరి తాము కోల్పోయిన టిబెట్‌ను అలా వదిలేసుకోవడమేనా? ఆమెలో ఆవేదన రగులుతూనే ఉండేది. దలైలామా ఆదేశంతో వాస్తవాల అన్వేషణ కోసం విస్తృతంగా ఆమె పర్యటించారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసుల కోసం ఏర్పాటైన మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టిబెట్ పరిపాలనలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా పెమానే. – మంజీర -
దలైలామాను కలిశారో.. అంతే..
సాక్షి, న్యూఢిల్లీ: బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను విదేశీ నాయకులు ఎవరైనా కలిస్తే.. దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ చైనా శనివారం ఘాటు హెచ్చరికలు జారీచేసింది. టిబేట్ మతనాయకుడైన దలైలామాను 'వేర్పాటువాద' నేతగా భావిస్తున్న చైనా.. ఆయనకు ఏ దేశమైన ఆతిథ్యమిచ్చినా, విదేశీ నాయకుడు ఎవరైనా ఆయనను కలిసినా సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విదేశీ నేతలు ఎవరైనా వ్యక్తిగతంగా దలైలామాను కలుసుకోవచ్చునని భావిస్తూ ఉండవచ్చునని, కానీ, తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అలా చేయరాదని చెప్పుకొచ్చింది. 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దలైలామా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. నోబెల్ శాంతిపురస్కారాన్ని గెలుచుకున్న దలైలామాను చైనా ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణిస్తూ వస్తోంది. మరోవైపు దలైలామా తన హిమాలయ మాతృభూమి అయిన టిబేట్‌కు సముచితమైన స్వతంత్ర ప్రాతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దలైలామాను ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కలిస్తే.. అది చైనా ప్రజల సెంటిమెంట్‌కు విరుద్ధమైన తీవ్ర నేరమే' అంటూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ మినిష్టర్ ఝాంగ్ యిజియాంగ్ అన్నారు. గతంలో ప్రపంచ నేతలు ఎవరైనా దలైలామాను కలిస్తే.. చైనా నిరసన తెలిపిదే. కానీ, తాజాగా దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు కనిపిస్తోంది. -
'చంపాలనుకుంటే చంపేస్తారంతే..'
ఇంపాల్ : ఉగ్రవాదులకు ప్రత్యేక మత అభిమానం ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. వారు చంపేయాలనుకుంటే చంపేస్తారని, ఉగ్రవాదాన్ని కొనసాగించడమే వారి అభిమతంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ముస్లిం ఉగ్రవాది, క్రైస్తవ ఉగ్రవాది అంటూ ఉండడని, ఏ మతానికి చెందినవారైనా ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఇంపాల్‌లో ఓ రిసెప్షన్ పాల్గొన్న సందర్భంగా ఆమన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కూడా విమర్శలు చేశారు. అమెరికానే తన తొలి ప్రాధాన్యం అనే ట్రంప్ నినాదం సరికాదని అన్నారు. హింస పరిష్కారాన్ని చూపెట్టబోదని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మనం సృష్టించుకున్నవేనని అన్నారు. దాదాపు వెయ్యేళ్ల అహింసా చరిత్రను కలిగిన భారతదేశం ప్రపంచ శాంతిని స్థాపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను తమ నియంత్రణలో పెట్టుకోవాలని, ఆగ్రహం ప్రజల రోగ నిరోధక శక్తిని హరిస్తుందని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కూడా హితవు పలికారు.