Deccan Chronicle
-
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి గుడివాడ రియాక్షన్
-
యూటర్న్ బాబు.. ఎందుకంత ఉలికిపాటు?
విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్‌పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.ఇక సంగతి ఏమిటి?విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్‌పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్‌కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖ స్టీల్‌పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
విశాఖ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి
-
మీడియా ఆఫీస్ పై టీడీపీ దాడి..
-
డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ దాడి.. తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు)/అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్న టీడీపీ.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో పత్రికా స్వేచ్ఛపైనా దాడికి దిగింది. విశాఖ నగరంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ సంఘాల నేతలు దాడి జరిపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కథనంలో పేర్కొంది. వారి మాటల సారాంశాన్ని వివరిస్తూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీంతో టీడీపీ అనుబంధ సంఘాలైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగునాడు మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై మెరుపు దాడి చేశారు. కార్యాలయం గేటు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి కార్యాలయం అద్డాలు, ఫరి్నచర్, పూల కుండీలను పగులగొట్టారు. కార్యాలయంలోని మహిళా సిబ్బందితో వాగ్వీవాదానికి దిగి దుర్భాషలాడుతూ దూషించారు. కొంతమంది తెలుగు మహిళలు కార్యాలయం ఎదుట డెక్కన్ క్రానికల్ పేరుతో కూడిన పోస్టర్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టగా.. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యాలయ ప్రహరీ గోడపైకి ఎక్కి బోర్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పత్రిక యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను బూతులు తిట్టారు. ఊహించని పరిణామంతో క్రానికల్ కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులకు ఫిర్యాదు దాడి ఘటనపై విశాఖ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడికి పాల్పడి కార్యాలయ ఆస్తులకు పెట్రోల్ పోసి నిప్పటించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుకరాళ్లతో కార్యాలయ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో వివరించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం పోలీసులకు అందజేశారు. దాడి సరికాదు: సీపీఐ పత్రికల్లో వచ్చిన వార్తల్లో అవాస్తవం ఉంటే ఖండించాలి కానీ పత్రికా కార్యాలయాలపై దాడికి పాల్పడటం సరైనది కాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, జనసేన వాటి వైఖరిని స్పష్టం చేయాల్సి ఉందన్నారు. దాడి అప్రజాస్వామికం డీసీ కార్యాలయంపై టీడీపీ విద్యారి్థ, తెలుగు మహిళా విభాగం దాడిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై డెక్కన్ క్రానికల్‌లో ప్రచురించిన కథనాన్ని భరించలేని టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాప్ ఖండన డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై టీడీపీ ప్రభుత్వ దాడిగా అభివరి్ణంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి దాడులపై కఠినంగా వ్యవహరించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హేయమైన చర్య: ఏపీడబ్ల్యూజేఎఫ్ డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి హేయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. దాడిని ఏపీబీజీఏ రాష్ట్ర నాయకులు కె.మునిరాజ్, వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.చంద్రబాబు బాధ్యత వహించాలి: వైఎస్ జగన్ డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీకి చెందిన వ్యక్తులు దారుణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. మీడియాను అణచివేసేందుకు టీడీపీ గుడ్డిగా చేసిన మరో ప్రయత్నం ఇది అని దుయ్యబట్టారు. కొత్త పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంçœున నిరంతరం జరుగుతోందన్నారు. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై ఎల్లో బ్యాచ్ దాడి
విశాఖపట్నం, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార దాడులు మరో మలుపు తిరిగాయి. నిష్పక్షపాతంగా కథనాలు రాసే మీడియా సంస్థలనూ ఎల్లో బ్యాచ్ వదలడం లేదు. తాజాగా.. ఇవాళ నగరంలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి తెగబడ్డాయి. టీడీపీకి సంబంధించిన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాలు.. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించాయి. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోవాలని చూశాయి.ఈ క్రమంలో సిబ్బంది అడ్డుకోవడంతో.. వాళ్లలో టీడీపీ కేడర్ వాగ్వాదానికి దిగారు. ఆపై ఆగ్రహంతో టీఎన్ఎస్ఎఫ్కు చెందిన కొందరు సంస్థ కార్యాలయంపై రాళ్లు రువ్వి.. బయట ఆ సంస్థ బోర్డును కాల్చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కథనాలు రాస్తే.. బాగోదంటూ హెచ్చరిస్తూ వాళ్లు బహిరంగంగానే నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో డీసీ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలు తమ కర్తవ్యాల్ని ఆపలేవంటూ డీసీ తన ఎక్స్‌ఖాతాలో సందేశం ఉంచింది. .@JaiTDP goons attacked Deccan Chronicle office after we published an unbiased report on VSP privatisation Intimidation tactics won’t silence us, @JaiTDP, @BJP4India, @JanaSenaParty... #PressFreedom #StandWithJournalism pic.twitter.com/RTh0rE0kMB— Deccan Chronicle (@DeccanChronicle) July 10, 2024దాడిని ఖండించిన జర్నలిస్ట్ యూనియన్లుఇదిలా ఉంటే.. క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ విభాగాల దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’’ అని యూనియన్ పోలీస్ శాఖను కోరింది. అలాగే.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా తమ కార్యకర్తలను అదుపుచేయాలని రాజకీయ పార్టీలకూ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మరోవైపు.. ప్రజాస్వామ్యంలో దాడులనేవే సమంజసం కాదని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (జాప్ )అంటోంది. డెక్కన్ క్రానికల్ పై దాడిని ఖండింస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఒక వార్త తమకు వ్యతిరేకంగా వచ్చిందని దాడికి దిగారు. విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం పత్రికా కార్యాలయంలో పనిచేసేవారితో పాటు ప్రజాస్వామ్య వాదులను భయాందోళనకు గురిచేసింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం. .. దాడికి పాల్పడిన బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధం. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి సంఘటనల్ని సమర్థించరని భావిస్తున్నాం అని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డిలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?: వెంకట్రామి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అరెస్ట్‌పై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. డీసీ వెంకట్రామిరెడ్డి రూ.9వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలిసి వెంకట్రామిరెడ్డి కుట్ర చేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశాం. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ జరిగింది అని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈడీ రిమాండ్ రిపోర్టుపై వెంకట్రామిరెడ్డి స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చాలాసార్టు విచారణకు హాజరయ్యాను.. సహకరించాను అని తెలిపారు. కాగా, వెంకట్రామిరెడ్డి అరెస్ట్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో వెంకట్రామి రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామి రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్! -
డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
-
డెక్కన్ క్రానికల్ చైర్మన్‌పై సెబీ నిషేధం
సాక్షి, ముంబై: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలు నిర్వహించకుండా డెక్కన్ క్రానికల్ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ టి. వినాయక్ రవి రెడ్డి, పరుశురామన్ కార్తీక్ అయ్యర్, ఎమ్డీ, ఎన్. కృష్ణన్‌లపై రెండేళ్లపాటు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఈ మేరకు సెబీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీ బీ మౌలీ అండ్ అసోసియేట్స్ భాగస్వామి మణి ఊమెన్‌పై ఏడాదిపాటు నిషేధం వేసింది. ఒక సంవత్సరం పాటు ఏ లిస్టెడ్ కంపెనీకి సెక్రటేరియల్ సేవలను అందించవద్దని కంపెనీ సెక్రటరీ శంకర్‌ను ఆదేశించింది. తగినన్ని నిల్వలు లేకుండానే షేర్ల బై బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించిందని రెగ్యులేటరీ వెల్లడించింది. తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలపై గతంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. కాగా గత ఏడాది ఆగస్టులో బ్యాంకు మోసానికి సంబంధించి కంపెనీ కార్యాలయాలు, ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. 2017 లో రూ .217 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. బెంగళూరు, కేరళ డెక్కన్ క్రానికల్ ఎడిషన్లను ఇటీవల మూసివేసింది. -
నవంబర్ 30 కల్లా ఖాళీ చేయండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, సరోజినీదేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, ఇండియాబుల్స్‌కు స్వాధీనం చేయాలంటూ డెక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యాన్ని ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ డీసీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ భవనంలో డీసీ పత్రిక నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలం టే ఇబ్బందులు ఎదురవుతాయన్న హైకోర్టు, ఖాళీ చేసేందుకు నవంబర్ 30 వరకు డీసీ యాజమాన్యానికి గడువునిచ్చింది. ఆలోపు భవనాన్ని ఖాళీ చేయకుండా భవనం స్వాధీనం నిమిత్తం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఇండియాబుల్స్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. భవనాన్ని తాకట్టుపెట్టి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి డీసీ యాజమాన్యం రూ.100 కోట్ల రుణం తీసుకుంది. అయితే ఈ అప్పును డీసీహెచ్ఎస్ యాజమాన్యం తిరిగి చెల్లించకపోవడంతో తాకట్టుపెట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సీఎంఎం కోర్టు ఇండియాబుల్స్‌కు అనుమతిచ్చింది. దీనిని సవాలు చేస్తూ డీసీహెచ్ఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల సీఎంఎం కోర్టు ఆదేశాలు చెల్లవన్న డీసీ యాజమాన్యం వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్సీఎల్టీలో విచారణ డీసీహెచ్‌ఎల్‌పై జరుగుతోందని, ఇండియాబుల్స్‌కు తాకట్టుపెట్టిన భవనం వెంకట్రామిరెడ్డి పేరు మీద ఉందని, అందువల్ల ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఆ ఆస్తికి వర్తించవని ధర్మాసనం తెలిపింది. సర్ఫేసీ చట్టం కంపెనీలకే తప్ప వ్యవస్థాపకులకు కాదంది. -
సబ్బం హరికి నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. బకాయిలను 60 రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు మాధవధారలోని వుడా లేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విష్ణు వైభవం అపార్టుమెంట్, విశాఖ బీచ్‌రోడ్‌లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఇదీ నేపథ్యం.. నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్ క్రానికల్ భవనాన్ని 2014లో కోటక్ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80 కోట్లకు సబ్బం హరి పాడుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యం డెబిట్ రికవరీ అపిలేట్ అథారిటీ (డీఆర్ఏపీ)లో కేసు ఫైల్ చేసింది. అథారిటీ డీసీ వాదనను సమర్ధిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్ మహేంద్ర అప్పీల్‌కు వెళ్లింది. మరో వైపు ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఏసీఎల్‌టీ)కి రిఫర్ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది. విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టిన సీతమ్మధారలోని సబ్బం హరి నివాసం ఉంటున్న ఇల్లు చెల్లింపులో ఎలాంటి సందేహం లేదు రూ.60 కోట్ల ఆస్తులను కొలాట్రల్ సెక్యురిటీ పెట్టి కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నా. రూ.1.50 కోట్ల వరకు తిరిగి చెల్లించా. వడ్డీ సహా రూ.9.54 కోట్లు చెల్లించాలని బ్యాంకు నోటీసు ఇచ్చింది. డక్కన్ క్రానికల్ కేసులో తుది తీర్పు వెలువడగానే బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా కోటక్ మహేంద్రాయే నేరుగా చెల్లిస్తుంది. ఈ రుణ బకాయిల చెల్లింపు విషయంలో సందేహ పడాల్సిన పనిలేదు. – సబ్బం హరి, మాజీ ఎంపీ నిబంధనల ప్రకారమే నోటీసులు బకాయిలు వసూలు కాకపోవడం వల్లే సబ్బం హరి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించాం. తుది తీర్పు వెలువడగానే సబ్బం హరి రుణాన్ని వడ్డీ సహా సెటిల్ చేస్తామని కోటక్ మహేంద్ర లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఎదురు చూశాం. తుది తీర్పు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. అందువల్లే నోటీసులు జారీ చేశాం. – మానం ఆంజనేయులు,చైర్మన్, విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు -
విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?
-
విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి?
బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు. కొంతకాలం క్రితం భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చిన హృతిక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడని రిపోర్టులు వస్తున్నాయి. సుసానే ఖాన్‌ను హృతిక్ రోషన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారట. ఈ కపుల్ మళ్లీ చేసుకోబోతున్నారని పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే హృతిక్, సుసానే మళ్లీ పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదని వారి సన్నిహిత వర్గాలు చెప్పినట్టు డెక్కన్ క్రోనికల్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లల అవసరాల కోసం కలిసి గడుపుతున్నారని, కచ్చితంగా వారి పిల్లలు, తల్లిదండ్రుల నుంచి అంతులేని ప్రేమను పొందుతూ.. ఆనందంగా గడుపుతున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. అయితే హృతిక్, సుసానేలు చాలా స్వతంత్ర ఆలోచనలు కలిగి వారని, ఒకవేళ వారు మళ్లీ కలిసే ఉద్దేశ్యం ఉంటే, బయటికి వెల్లడిస్తారని తెలిపాయి. బాల్య స్నేహితులైన హృతిక్, సుసానేలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశాబ్దానికి పైనే కాపురం కూడా చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టాక.. విడాకులు తీసుకున్నారు. కంగనారనౌత్‌తో హృతిక్ చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీరి వివాహ బంధం బీటలు వారింది. కానీ కంగనాకు హృతిక్‌కు ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి, వారి బంధం కూడా రచ్చ రచ్చ అయింది. దాదాపు ఐదు సంవత్సరాల కిందట హృతిక్, సుసానేలు వేరుపడ్డారు. తమ వివాహాన్ని చట్టబద్ధంగా రద్దు చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతం వీళ్లిద్దరూ స్నేహితుల్లా అయితే గడుపుతున్నారు. తమ పిల్లలకు సంబంధించిన బర్త్ డే పార్టీల్లో.. సమ్మర్ వెకేషన్లలో వీళ్లిద్దరూ జంటగా అగుపిస్తూ ఉన్నారు. భార్యభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా కలిసి ఉంటూ.. వీళ్లిద్దరూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు. తరచుగా హృతిక్ తన పిల్లలు, సుసానేతో కలిసి సినిమాలకు, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. విడిపోయినప్పటికీ, హృతిక్, సుసానేలు ఒకరికొకరు సపోర్టు ఇచ్చుకుంటూ.. ప్రోత్సహించుకుంటూ కూడా ఉంటున్నారు. సుసాన్ తన నుంచి విడిపోయాక, ఆమె కెరీర్ ఎంపికలను హృతిక్ గౌరవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకుల కోసం మళ్లీ ఈ జంట ఒక్కటి అయ్యేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. హృతిక్ తన తప్పు తెలుసుకొని ఇప్పుడు సుసానేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం. విడాకులు తీసుకున్న చాలా వరకు జంటలు, కొన్నేళ్ల తర్వాత వేరే వాళ్లను వివాహం చేసుకుంటూ ఉన్నారు. కానీ హృతిక్, సుసానేలు విడిపోయాక, మళ్లీ కలువబోతున్నారని వార్తలు రావడం బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
డెక్కన్ క్రానికల్ ఆస్తుల అమ్మకం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఆస్తుల వేలం తప్పదా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే జరిగేట్టుంది. కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా శ్రేయి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్‌కు చెందిన విజన్ ఇండియా ఫండ్ ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళిక (రిసొల్యూషన్ ప్లాన్)కు రుణదాతల నుంచి ఆమోద ముద్ర పడలేదు. శ్రేయి ప్రతిపాదనపై జరిగిన ఈ–ఓటింగ్‌లో రుణదాతల నుంచి 55 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. ప్రణాళిక ఆమోదం పొందాలంటే కనీసం 66 శాతం ఓట్లు రావాల్సిందే. శ్రేయి రూ.800 కోట్లకుపైగా ఆఫర్ చేసినట్టు సమాచారం. శ్రేయితోపాటు జీ గ్రూప్, టైమ్స్ గ్రూప్ బిడ్లను దాఖలు చేశాయి. అయితే పరిష్కార ప్రణాళిక కోసం రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన మొత్తం 357 రోజుల గడువు జూలై 10తో ముగిసింది. తదుపరి విచారణ జూలై 17న జరుగనుంది. ఈ సందర్భంగా ఎన్సీఎల్టీ ఏం చెబుతుందనేదే డీసీ భవిష్యత్తును నిర్దేశించనుంది. శ్రేయి రివైజ్డ్ ప్లాన్.. అయితే ఈ–ఓటింగ్ తర్వాత విజన్ ఇండియా ఫండ్ పాత ప్రతిపాదనకు మార్పులు చేస్తూ మరో ప్లాన్‌ను సమర్పించినట్టు సమాచారం. కొత్త ప్లాన్‌ను పరిశీలించడమా లేదా అన్నది ఈ నెల 17న ఎన్సీఎల్టీ బెంచ్ తుది నిర్ణయం తీసుకోనుంది. పరిశీలించాల్సిందిగా ఎన్సీఎల్టీ ఆదేశిస్తే కొత్త ప్రతిపాదనపై రుణదాతల కమిటీ తిరిగి చర్చిస్తుంది. ఈసారి రివైజ్డ్ ప్లాన్‌ను కమిటీ తిరస్కరిస్తే డెక్కన్ క్రానికల్ ఆస్తుల అమ్మకం తప్పదు. రిసొల్యూషన్ ప్లాన్‌కు ఎన్సీఎల్టీ ఇప్పటికే తగినంత సమయం ఇచ్చిందని ప్రముఖ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. అప్పుల మీద అప్పులు.. డెక్కన్ క్రానికల్ తమకు రూ.7,937 కోట్లు బకాయిపడిందని ప్రధాన రుణదాతలు క్లెయిమ్ చేస్తున్నారు. వీటితోపాటు రూ.3,044 కోట్లు చెల్లించాలంటూ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రిసొల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ)ను ఆశ్రయించారు. మమతా బినానీ డెక్కన్ క్రానికల్ ఆర్పీగా వ్యవహరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.954 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.808 కోట్లు, కెనరా బ్యాంకు రూ.723 కోట్లు, ఎల్ఐసీ రూ.464 కోట్లు, ఎస్బీఐ పెన్షన్ ఫండ్ రూ.340 కోట్లు, టాటా క్యాపిటల్ రూ.182 కోట్లు, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు రూ.72 కోట్లు డెక్కన్ క్రానికల్ బాకీ పడింది. 2017 జూలైలో దివాలా ప్రక్రియ మొదలైంది. లిక్విడేషన్ ఇలా.. కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా రిసొల్యూషన్ ప్లాన్‌కు ఆమోదముద్ర పడకపోతే లిక్విడేషన్ (ఆస్తుల అమ్మకం) చేపడతారు. లిక్విడేటార్ను ఇందుకోసం నియమిస్తారు. లిక్విడేటార్గా రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌ను కొనసాగించాలా లేదా కొత్తవారిని నియమించాలా అన్నది రుణదాతల కమిటీ నిర్ణయిస్తుందని న్యాయవాది ఎస్.రాజశేఖర రావు తెలిపారు. తొలుత కంపెనీకి ఉన్న ఆస్తులను మదింపు చేస్తారు. వీటిని వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇస్తారు. అధిక మొత్తంలో బిడ్ దాఖలు చేసిన కంపెనీ/వ్యక్తులకు ఆ ఆస్తిని విక్రయిస్తారు. ఇలా అమ్మగా వచ్చిన మొత్తంలో ప్రాధాన్యత క్రమంలో తొలుత రిసొల్యూషన్, లిక్విడేషన్ ఖర్చులు, దివాళా కాబడ్డ కంపెనీలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు చెల్లిస్తారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులకు, అన్సెక్యూర్డ్ క్రెడిటార్లకు, ప్రభుత్వ పన్నులు, ఇతర రుణదాతలు, షేర్హోల్డర్లకు చెల్లించాల్సి ఉంటుందని న్యాయవాది సాయి కిరణ్ పాటిల్ వెల్లడించారు. -
డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ మొదలైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మేరకు తాత్కాలిక పరిష్కార నిపుణుడిని (ఐఆర్పీ) నియమించింది. అలాగే 180 రోజులపాటు మారటోరియం విధించింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఈ మీడియా సంస్థపై ఉన్న ఇతర కేసుల విచారణ 180 రోజులపాటు నిలిచిపోనుంది. డెక్కన్ క్రానికల్‌కు రుణమిచ్చిన కెనరా బ్యాంకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుకు డెక్కన్ క్రానికల్ రూ.723.75 కోట్లు బాకీ పడింది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ 2016 ప్రకారం దివాలా ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇంటెరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌కు డెక్కన్ క్రానికల్ బోర్డుపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఐఆర్పీ నిర్దేశిత సమయంలో రుణదాతలతో చర్చించడంతోపాటు బాకీ పడ్డ కంపెనీ ఆర్థిక స్థితిని అధ్యయనం చేసి మూసివేయాలా లేదా పునరుద్ధరించాలా అన్న అంశాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. నిజానికి డెక్కన్క్రానికల్కు కెనరా బ్యాంక్‌తో పాటు పలు ఇతర బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థలు కూడా రుణాలు మంజూరు చేశాయి. -
యాక్సిస్ బ్యాంక్ ద్వారానే కార్యకలాపాలు
డెక్కన్ క్రానికల్‌కు డీఆర్టీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) సంస్థ ఆర్థిక వ్యవహారాలు, ప్రకటనలు, సర్క్యులేషన్ ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలన్నీ యాక్సిస్ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) డీసీహెచ్ఎల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే డీసీహెచ్ఎల్ ఇతర బ్యాంకుల్లో నిర్వహిస్తున్న కరెంటు ఖాతాల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రవీణరెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తమ బ్యాంకు నుంచి డీసీహెచ్ఎల్ తీసుకున్న రూ.430 కోట్ల రుణం వసూలు కోసం యాక్సిస్ బ్యాంకు గతంలో డీఆర్టీని ఆశ్రయించింది. ఇందులో భాగంగా డీసీహెచ్ఎల్ ఆర్థిక కార్యకలాపాలన్నీ తమ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఇటీవల మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అప్పులేని బ్యాంకుల ద్వారానే ఆదాయ, వ్యయాల ఖాతాలను డీసీహెచ్ఎల్ నిర్వహిస్తోందని, అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లోనే ఆదాయ, వ్యయాల ఖాతాలు నిర్వహించాల్సి ఉందని యాక్సిస్ బ్యాంకు డీఆర్టీకి నివేదించింది. ఈనెల 19న ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో డీసీహెచ్ఎల్ కౌంటర్ దాఖలు చేయకపోగా, ఆ సంస్థ తరఫున న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీచేస్తూ ప్రధాన పిటిషన్‌పై విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. -
దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం
హైదరాబాద్: దక్కన్ క్రానికల్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తల్లి టి.ఊర్మిళాచంద్రశేఖర్‌రెడ్డి(82) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారిలో ఒకరైన వెంకట్రామిరెడ్డి దక్కన్ క్రానికల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంత్యక్రియులు గురువారం పంజగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
మా భర్తల అరెస్ట్ అక్రమం
హైకోర్టులో వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిల సతీమణులు పిటిషన్ 14 రోజుల కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టుకు సీబీఐ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ టి.వినాయక్ రవిరెడ్డిల అరెస్ట్‌ను సవాలు చేస్తూ వారి సతీమణులు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. ఈ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయమూర్తి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిలకు స్వేచ్ఛనిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా, సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చడాన్ని సవాలు చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్ మణి ఓమెన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. డీసీ డెరైక్టర్ల కస్టడీ పిటిషన్‌పై 19న విచారణ వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి... కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి గడువునిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి రాజ్యసభ మాజీ సభ్యుడిగా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డికి జైలులో ప్రత్యే క సౌకర్యాలు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆడిట్ బ్యూ రో ఆఫ్ సర్క్కులేషన్ చైర్మన్‌గా పనిచేశారని, కోటి రూపాయల వరకు ఆదాయపన్ను చెల్లిస్తున్నారని తెలిపా రు. పట్టభద్రుడని, అనారోగ్యంతో ఉన్న ఆయనకు జైలుగా ప్రత్యేక కేటగిరీ కింద సౌకర్యాలు కల్పించాలని నివేదించారు. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలుంటే తెలపాలని సీబీఐకి సూచి స్తూ దీని విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. -
చీటింగ్ కేసులో ‘డీసీ’ వెంకట్రామిరెడ్డి అరెస్టు
ఆయన సోదరుడు వినాయక్ కూడా.. సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై ‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. బెంగళూరుకు చెందిన సీబీఐ ‘బ్యాంకు సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ యూనిట్’కు సంబంధించిన దర్యాప్తు అధికారులు శనివారం వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రమోటర్ల నివాసాలు, సికింద్రాబాద్‌లోని దక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. డీసీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆయన సోదరుడు వినాయక్ రవి రెడ్డిలను అదుపులోకి తీసుకుని కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. కెనరా బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, వినాయక్ రవి రెడ్డి, వైస్ చైర్మన్ పి.కె అయ్యర్‌లపై ఐపీసీ సెక్షన్ 120బీ, 420 , 468, 471 ల కింద కేసులు నమోదు చేసింది. తప్పుడు పత్రాలను తనఖా పెట్టి రూ.357.77 కోట్ల రుణం పొందారని కెనరా బ్యాంకు చేసిన ఫిర్యాదుపై 2013 జూలైలో ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం సీబీఐ అధికారులు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఆయన్ను సీబీఐ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశముంది. కాగా, 2008-2012 మధ్య మోసం, కుట్రపూరిత చర్యలతో కెనరా బ్యాంకుకు రూ.1,230 కోట్ల నష్టాన్ని కలిగించారని దక్కన్ క్రానికల్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. -
విహారి సెంచరీ
* ఆంధ్రా బ్యాంక్ విజయం * వన్డే నాకౌట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: హనుమ విహారి (115) సెంచరీ సాధించడంతో ఆంధ్రా బ్యాంక్ 40 పరుగుల తేడాతో డెక్కన్ క్రానికల్ (డీసీ)పై విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు పోటీపడుతున్న ఈ వన్డే నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. రవితేజ (56), అభినవ్ కుమార్ (53) రాణించారు. డీసీ బౌలర్ షాదాబ్ తుంబి 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన డెక్కన్ క్రానికల్ జట్టు 8 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రణీత్ కుమార్ (96), షాదాబ్ తుంబి (72) జట్టు విజయం కోసం శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో బీడీఎల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఎన్స్‌కాన్స్‌పై గెలిచింది. తొలుత ఎన్స్‌కాన్స్ 8 వికెట్లకు 250 పరుగులు చేసింది. అరుణ్ దేవా (95), హుస్సేన్ (56) అర్ధసెంచరీలు చేశారు. బీడీఎల్ బౌలర్లు శ్రవణ్ 4, శివశంకర్ 3 వికెట్లు తీశారు. తర్వాత బీడీఎల్ మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమర్థ్ (80), కె. సుమంత్ (57 నాటౌట్), రాహుల్ సింగ్ (53), యతిన్ రెడ్డి (46) సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. -
బెంబేలెత్తించిన అశ్విన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్ బౌలర్ అశ్విన్ యాదవ్ (7/64) విజృంభించడంతో డెక్కన్ క్రానికల్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 166 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ సింగ్ (57 బంతుల్లో 63, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేశాడు. మిగతా వారిలో ఒక్క ప్రణీత్ కుమార్ (36) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్బీహెచ్ కూడా తడబడింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎస్బీహెచ్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనిరుధ్ (76 బంతుల్లో 74, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. అహ్మద్ ఖాద్రీ 40 పరుగులు చేయగా, డెక్కన్ బౌలర్ ఆకాశ్ భండారీ 3 వికెట్లు తీశాడు. షిండే 5 వికెట్లు తీసినా.... ఆంధ్రాబ్యాంక్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఈఎంసీసీ భారీ స్కోరు సాధించింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ అమోల్ షిండే 5 వికెట్లు పడగొట్టినప్పటికీ భారీ స్కోరుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈఎంసీసీ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సూర్యతేజ (102 బంతుల్లో 83, 10 ఫోర్లు), శరత్ (81 బంతుల్లో 50, 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. విక్రమ్ సూర్యతేజ 44, రవితేజ 38, విశ్వజిత్ పట్నాయక్ 35, ఆకాశ్ 30 పరుగులు చేశారు. -
నిఖిల్‌దీప్ శ్రమ వృథా
జింఖానా, న్యూస్‌లైన్: ఈఎంసీసీ బౌలర్ నిఖిల్‌దీప్ (5/52) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినప్పటికీ ఆ జట్టుకు విజయం చేకూరలేదు. హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో ఈఎంసీసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత డెక్కన్ క్రానికల్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (76), రాజన్ (50), రాహుల్ సింగ్ (58) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఈఎంసీసీ 158 పరుగులకే చేతులెత్తేసింది. సూర్యతేజ (95 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డెక్కన్ క్రానికల్ బౌలర్ షబాబ్ తుంబి 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో ఎన్స్‌కోన్స్ బౌలర్ రోహన్ 5 వికెట్లు పడగొట్టి బీడీఎల్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. తొలుత బీడీఎల్ 191 పరుగులకు కుప్పకూలింది. యతిన్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో రాణించగా... సంతోష్ (40), సుమంత్ (30) ఫర్వాలేదనిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఎన్స్‌కోన్స్ వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసి నెగ్గింది. తన్మయ్ అగర్వాల్ (84 నాటౌట్), ఇబ్రహీం ఖలీద్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించగా... అజ్మత్ ఖాన్ 34 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎస్బీహెచ్: 316/8 (అనిరుధ్ సింగ్ 49, సుమంత్ 47, కుషాల్ 54, ఆకాశ్ 41); ఏఓసీ: 272 (సచిన్ 49, పెంటారావు 129; ఆల్ఫ్రెడ్ అబ్సొలేమ్ 4/34, ఆకాశ్ బండారి 4/47). ఆంధ్రాబ్యాంక్: 242/6 (నవీన్ రెడ్డి 48, రవితేజ 67, విహారి 48, అభినవ్ కుమార్ 36 నాటౌట్); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 165 (బాషా 51, లలిత్ మోహన్ 3/37). -
సుప్రీంలో డీసీకి చుక్కెదురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రింటింగ్ ప్రెస్ ఖాళీ చేయడానికి సంబంధించిన కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్ఎల్)కి దేశ అత్యు న్నత న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయమంటూ డీసీహెచ్ఎల్ వేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వద్ద తీసుకున్న రూ.110 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను ఫిబ్రవరి 28, 2014 కల్లా డీసీహెచ్ఎల్ ఖాళీ చేయాలంటూ రాష్ర్ట హైకోర్టు నవంబర్ 11న తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ డీసీహెచ్ఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోటక్ బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు పార్టీలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో విచారణకు స్వీకరించదగ్గ అర్హత ఈ కేసుకు లేదని కోటక్ బ్యాంక్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ బి.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేసును ఉపసంహరించుకోమని డీసీహెచ్ఎల్ను కోరగా అందుకు డీసీహెచ్ఎల్ ఆమోదం తెలిపింది. అంతక్రితం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సవరణలు కోరుతో తిరిగి అదే కోర్టును ఆశ్రయించేలా డీసీహెచ్ఎల్కు సుప్రీం కోర్టు వీలుకల్పించింది. -
డెక్కన్ క్రానికల్ నష్టం 14 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.301 కోట్ల ఆదాయంపై రూ.14.06 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ తొమ్మిది నెలల కాలాన్ని పూర్తి ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తూ అక్టోబర్7న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసం నాటికి 18 నెలలను ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తూ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్, 2012 నాటికి డీసీహెచ్ఎల్ రూ.843.41 కోట్ల ఆదాయంపై రూ.1,040 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్, 2013తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.91.20 కోట్ల ఆదాయంపై రూ.26.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతంలో రూ.10 కోట్ల మిగులు నిధులతో పాజిటివ్ నెట్‌వర్త్ ఉంటే ఇప్పుడది రూ. 4 కోట్ల నెగిటివ్ నెట్‌వర్త్‌లోకి జారుకున్నట్లు డీసీహెచ్ఎల్ బ్యాలెన్స్ షీట్ తెలియచేస్తోంది. డీసీహెచ్ఎల్ మూలధనం రూ.41.79 కోట్లు అయితే రూ.45.85 కోట్ల లోటును చూపించింది. సిక్ ఇండస్ట్రీగా పరిగణించమని బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీ-కనస్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించగా, దాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు డీసీహెచ్ఎల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్30, 2013 నాటికి సాధారణ వడ్డీకింద రూ.502.28 కోట్ల అప్పులు ఉన్నట్లు మాత్రమే ప్రకటించింది. ఈ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలను, బకాయిలను కంపెనీ ఎక్కడా పేర్కొనలేదు. సీబీఐ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థల దర్యాప్తులు జరుగుతున్నాయని, అలాగే ఇప్పటికే బకాయిపడ్డ కొన్ని సంస్థలు స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. -
డెక్కన్ క్రానికల్‌కు ఆధిక్యం
జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో రెండో రోజు డెక్కన్ క్రానికల్ 61 పరుగుల ఆధిక్యం సాధించింది. ఎన్స్కాన్స్తో గురువారం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ 345 పరుగులు చేసింది. సందీప్ (73), సందీప్ రాజన్ (60), షబీబ్ తుంబి (54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ అజహరుద్దీన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తొలి రోజు ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసిన ఎన్స్‌కాన్స్ జట్టు... అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 6 పరుగులు చేయడంతో డెక్కన్ క్రానికల్స్ జట్టు 61 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మరో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఎస్బీహెచ్ జట్టుపై ఈఎంసీసీ జట్టు 133 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలరోజు ఇన్నింగ్స్‌లో ఈఎంసీసీ 343 పరుగులు చేయగా... రెండో రోజు ఇన్నింగ్స్‌లో ఎస్బీహెచ్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనూప్ పాయ్ (63), కుషాలి జిల్లా (68) అర్ధ సెంచరీలతో చెలరేగారు.