Defeated
-
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
నగాల్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డ 27 ఏళ్ల నగాల్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 3–6, 3–6తో ప్రపంచ 564వ ర్యాంకర్ యిబింగ్ వు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. కేవలం రెండు విన్నర్స్ కొట్టిన నగాల్ ఎనిమిది అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 23,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 52 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత నగాల్ గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. స్వీడన్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఆడాల్సిన సమయంలో నగాల్ వెన్నునొప్పి కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. నగాల్ గైర్హాజరీ అంశం వివాదాస్పదమైంది. డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాలంటే 50 వేల డాలర్ల వార్షిక ఫీజు తనకు చెల్లించాలని నగాల్ డిమాండ్ చేసినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఆరోపించింది. -
అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. బంగ్లాను చిత్తు చేసిన భారత్ (ఫోటోలు)
-
వైశాలి చేతిలో హంపి ఓటమి
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్ గేమ్‌లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్ అర్మగెడాన్ గేమ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్ లిరెన్ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. -
IPL 2024: కోల్‌కతాకే కిరీటం
సన్‌రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదలైన సన్‌రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్‌లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
Lok sabha elections 2024: హిమజ్వాల!
పేరులో మంచు ఉన్నా హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది... ఆపరేషన్ కమలం... సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్‌ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్‌సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు ప్రాణసంకటం...! తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్‌కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.సర్వేల మాటేంటి? దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.పర్యాటక స్వర్గధామమైన హిమాచల్‌లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్‌సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాదల్కు చుక్కెదురు
బార్సిలోనా: స్పెయిన్ దిగ్గజం, 12 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 5–7, 1–6తో డి మినార్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత నాదల్ మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్లో పరాజయం చవిచూశాడు. తుంటి గాయంతో నాదల్ ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. బ్రిస్బేన్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా ప్లేయర్ జోర్డాన్ థాంప్సన్ చేతిలో ఓడిపోయాడు. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్‌పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో జరిగిన సెమీస్‌లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు. ఈ గేమ్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు. -
జొకోవిచ్‌కు షాక్
కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్ లూకా నార్దీ మూడో రౌండ్లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నార్దీ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, జొకోవిచ్ సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఈ గెలుపుతో మాస్టర్స్ సిరీస్, గ్రాండ్‌స్లామ్ టోర్నిలలో జొకోవిచ్‌ను ఓడించిన అతి తక్కువ ర్యాంకర్‌గా నార్దీ గుర్తింపు పొందాడు. -
భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారీ పరాజయాలతో పాటు పలు ఆసక్తికర ఫలితాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్‌లో ఓ సీటులో భార్యను భర్త ఓడించగా, మరోచోట అల్లుడు, మామ.. ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇంకో సీటులో అన్నదమ్ములిద్దరూ ఓటమి పాలయ్యారు. రాజస్థాన్‌లోని సీకార్ జిల్లాలో గల దంతారామ్‌గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా ఆయన భార్య రీటా సింగ్ జేజేపీ నుంచి పోటీ చేశారు. వీరేంద్ర సింగ్ తన భార్యను ఓడించారు. వీరేంద్ర సింగ్ గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈయన పీసీసీ మాజీ చీఫ్ నారాయణ్ సింగ్ కుమారుడు. మార్వార్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రిచ్‌పాల్ మిర్ధా కుమారుడు విజయపాల్ మిర్ధా.. దేగానా నుంచి, మరో కుమారుడు ఖిన్వ్సర్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఇంతకంటే విచిత్రమైన ఉదంతం ధోల్పూర్లో చోటుచేసుకుంది. ధోల్పూర్లో కాంగ్రెస్‌కు చెందిన శోభారాణి కుష్వాహా.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు శివచరణ్ కుష్వాహపై విజయం సాధించారు. జైపూర్‌లోని ఫూలేరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన విద్యాధర్ చౌదరి అల్లుడు శైలేష్ సింగ్, దీగ్ కుమ్హెర్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాజస్థాన్‌లో 199 స్థానాలకు నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 70 సీట్లు వచ్చాయి. 14 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇది కూడా చదవండి: 17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్! -
17 మంది రాజస్తాన్ మంత్రుల ఓటమి
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుగాలులకు పలువురు మంత్రులు ఓటమి దిశలో కొట్టుకుపోయారు. రాజస్తాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయిన గోవింద్ రామ్ మేఘ్వాల్ సహా 17 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. ఓడిన మంత్రుల్లో రమేశ్ చంద్ మీనా, షాలే మొహమ్మద్, భన్వర్ సింగ్ భటి, శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్‌లాల్ అంజనా, బీడీ కల్లా, జహిదా ఖాన్, ప్రతాప్‌సింగ్ కచరియావాస్, భజన్‌లాల్ జాతవ్, మమతా భూపేశ్, పర్సాదీ లాల్ మీనా, సుఖ్రామ్ విష్ణోయ్, రామ్‌లాల్ జాట్, ప్రమోద్ జైన్ భయ్యా, రాజేంద్ర యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు సన్యమ్ లోధా, రాజ్‌కుమార్ శర్మ, బాబులాల్ నగార్, దానిష్ అబ్రార్సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య సైతం విజయం సాధించలేకపోయారు. ముఖ్యమంత్రి గెహ్లోత్ 25 మంది మంత్రులతో కలిసి ఈసారి తమ గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకోగా కొద్దిమంది మాత్రమే గెలుపు తలుపు తట్టారు. సర్దార్‌పుర స్థానంలో గెహ్లోత్ గెలిచారు. నలుగురు బీజేపీ ఎంపీల గెలుపు బీజేపీ ఏడుగురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. వీరిలో నలుగురు విజయం సాధించారు. విద్యాధర్ నగర్ బీజేపీ మహిళా ఎంపీ దియా కుమారీ, ఝోట్వారా ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్, తిజారా ఎంపీ బాబా బాలక్ నాథ్, రాజ్యసభ సభ్యుడు కిరోడిలాల్ మీనాలు గెలిచారు. -
బోపన్న జోడీ ఓటమితో మొదలు
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ను రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీccతో ప్రారంభించింది. రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీతో జరిగిన రెడ్ గ్రూప్ తొలి లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 4–6తో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి తమ సvస్ను రెండుసార్లు కోల్పోయింది. -
హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొదట ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై క్షిపణులతో బాంబు దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ యోధులను భూ ఉపరితలంపై ఓడించింది. కాగా ఇజ్రాయెల్‌కు చెందిన ప్రత్యేక దళం కిబ్బట్జ్ నగరాన్ని హమాస్ యోధుల చెర నుండి విడిపించింది. ఈ దళంలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉండటం విశేషం. వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబరు 7న హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు వారు ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం ఈ నగరాన్ని విడిపించే బాధ్యతను లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందానికి అప్పగించింది. ఈ టీమ్‌లో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ 13 మంది కిబ్బట్జ్ నగరంలోకి ప్రవేశించి, హమాస్ యోధులను ఓడించారు. హమాస్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ తన మొత్తం సైన్యాన్ని భూ ఉపరితలంపైకి దింపింది. ఈ సైన్యంలో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు పావువంతు మంది మహిళలే. గ్రౌండ్ జీరో వద్ద కూడా మహిళా సైనికులు హమాస్ యోధులతో భీకరంగా పోరాడుతున్నారు. అయితే లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందం కొన్ని గంటల్లో వంద మంది హమాస్ యోధులను హతమార్చింది. ఈ నేపధ్యంలో ఈ ఫోర్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పాటు, ఈ మహిళా యోధులను ఇజ్రాయెల్ సింహాలుగా పిలుస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్- హమాస్ మధ్య 19 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 7,044 మంది మరణించారు. వీరిలో 1400 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వారు కాగా, 6546 మంది గాజా స్ట్రిప్‌కు చెందిన వారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 756 మంది మృతి చెందారు. ఇది కూడా చదవండి: చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా? -
అంకిత రైనా పరాజయం
జపాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఒసాకాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 181వ ర్యాంకర్ అంకిత 4–6, 2–6తో ప్రపంచ 174వ ర్యాంకర్ మొయుక ఉచిజుమా (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన అంకితకు 2,804 డాలర్ల (రూ. 2 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
శ్రీజకు నిరాశ
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్ర్నీప్లో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విభాగాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీజ 5–11, 6–11, 9–11తో ఇటో మిమా (జపాన్) చేతి లో ఓడిపోయింది. డబుల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ–దియా (భారత్) జోడీ రెండో రౌండ్ లో 7–11, 6–11, 6–11తో సన్ యింగ్షా–వాంగ్ యిది (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–హరీ్మత్ జోడీ 6–11, 7–11, 8–11తో తొమోకాజు–హినా హయాటా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ
లండన్: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్‌లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్ పార్టీ 1,384, కన్జర్వేటివ్ పార్టీ 1,041, లిబరల్ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
Ranji Trophy: రహానే సేన చేతిలో హైదరాబాద్ పరాజయం
ముంబై: తమిళనాడుతో తొలి మ్యాచ్‌లో వెలుతురులేమితో ఓటమిని తప్పించుకున్న హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. రంజీ ట్రోఫీ టైటిల్‌ను 41 సార్లు సాధించిన ముంబై జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్ ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 173/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగుల వద్ద ఆలౌటైంది. ముంబై ఎడంచేతి వాటం స్పిన్నర్ షమ్స్ ములానీ (7/94) హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. 437 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై... హైదరాబాద్‌కు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్ విఫలమై 67.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (65; 10 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమ్స్ ములానీ (4/82), తనుష్ కొటియాన్ (5/82) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. -
తైవాన్‌లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్‌లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
Malaysia Open 2022: సింధుకు మళ్లీ నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్‌లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
బార్టీకి షెల్బీ షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 43వ ర్యాం కర్ షెల్బీ రోజర్స్ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఎనిమిదో గేమ్‌లో బార్టీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్‌లో, ఆ తర్వాత పదో గేమ్‌లో తన సరీ్వస్‌లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో చివరి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 12వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్ హ్యారిస్ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్‌ను ఓడించగా... టాప్ సీడ్ జొకోవిచ్ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్)పై, జ్వెరెవ్ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్ సోక్ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్ (మొనాకో) –రిండెర్క్నిచ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
French Open 2021: స్వితోలినా ఇంటిముఖం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా... వారి సరసన తాజాగా ఐదో సీడ్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–2తో స్వితోలినాను ఓడించి వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా నెట్‌వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు సాధించగా... స్వితోలినా సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/4), 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, నాలుగో సీడ్ సోఫియా (అమెరికా) 4–6, 6–4, 6–1తో పెగూలా (అమెరికా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 7–5తో 18వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17వ సీడ్ సాకరి (గ్రీస్) 7–5, 6–7 (2/7), 6–2తో 14వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. వరుసగా 12వ ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) వరుసగా 12వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో బెరాన్కిస్ (లిథువేనియా)పై గెలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాదల్ 6–3, 6–3, 6–3తో కామరూన్ నోరి (బ్రిటన్)పై, సిట్సిపాస్ 5–7, 6–3, 7–6 (7/3), 6–1తో ఇస్నెర్ (అమెరికా)పై, ష్వార్ట్‌జ్‌మన్ 6–4, 6–2, 6–1తో ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. -
భారత్ పరాజయం
దోహా: సాకర్ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత్‌కు తమకన్నా మెరుగైన జట్టు ఖతర్ చేతిలో పరాజయం ఎదురైంది. గ్రూప్–ఇలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–1 స్కోరుతో ఓడిపోయింది. ఆట మొదలైన కాసేపటికే ఖతర్ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడులకు పదును పెట్టారు. అయితే భారత డిఫెండర్లు చురుగ్గా స్పందించడంతో నిరాశ తప్పలేదు. 13వ నిమిషంలో ఖతర్ స్ట్రయికర్ అబ్దెల్ అజిజ్ గోల్‌పోస్ట్ కుడివైపు నుంచి క్రాస్‌షాట్ ఆడగా... అది బార్‌పైనుంచి బయటకు వెళ్లిపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. 30వ నిమిషంలో భారత స్ట్రయికర్ మన్వీర్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చాడు. గోల్ కోసం అతను చేసిన ప్రయత్నాన్ని డిఫెండర్లు నీరుగార్చారు. అయితే మరో మూడు నిమిషాల తర్వాత ఖతర్ బోణీకొట్టింది. 33వ నిమిషంలో యూసుఫ్ నుంచి వచ్చిన పాస్‌ను ఈ సారి అబ్దెల్ అజిజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఆతిథ్య జట్టుకు గోల్ సాధించి పెట్టాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఖతర్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో స్కోరు సమం చేసేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఖతర్ 1–0తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలోనే డిఫెండర్ బెకెకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. దాంతో సింహభాగం మ్యాచ్‌ను భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. -
నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!
శాంతిపురం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరా జయం పాలైంది. ఈ నేపథ్యంలో టీడీపీని కాపాడుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వయత్నాలు చేస్తున్నారు. రెండు రోజులుగా పలువురు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి, ధైర్య వచనాలు వినిపిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కీలక నాయకులతోపాటు కింది స్థాయి వారికి కూడా అధినేత నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇకపై తన మార్గంలో తాను కుప్పం నుంచి సమాచారం తెప్పించుకుని, పార్టీ వ్యవహారాలను స్వ యంగా చూసుకుంటానని చెబుతున్నట్టు సమాచారం. టీడీపీ అధికారం కోల్పోయాక టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగులకు పరిమితమైన చంద్రబాబు ఇప్పుడు నేరుగా ఫో న్లలో మాట్లాడుతుండటం విశేషం. తాను నమ్మిన కొందరు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా అంతా బాగుందని నమ్మించారని ఆయన చెప్పినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉండగా అడ్డంగా సంపాదించుకున్న వారు ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్లడం, ఉన్న వారు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో సమస్య వచ్చిందని ఆయన సముదాయిస్తున్నారు. కొందరు ఇచ్చిన సమాచారాన్ని నమ్మి అంతా బాగుందని అనుకుంటే ఫలితాలు తారుమారయ్యా యని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు మళ్లీ గ్రామాల్లోకి వె ళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలావుండగా కొందరు టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లినా సొంత పార్టీ వారు కూడా కలవకుండా ముఖం చాటేస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ