Drug Peddler
-
అప్పు అడిగితే డ్రగ్ పెడ్లర్‌గా మార్చాడు!
సాక్షి, సిటీబ్యూరో: తనను అప్పు అడిగిన చిన్ననాటి స్నేహితుడిని డ్రగ్ పెడ్లర్‌గా మార్చాడో వ్యక్తి. ముంబైలో ఉండే సప్లయర్స్‌ను కూడా పరిచయం చేశాడు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యం అమ్మి దండిగా సంపాదించ వచ్చని ప్రేరేపించాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ నిందితుడిని పట్టుకుని 13.9 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్ స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహ్మద్ హనీఫ్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై క్యాబ్ డ్రైవర్‌గా మారి 2016లో బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూడేళ్ల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన అతను తన స్వస్థలంలోనే ఉంటున్నాడు. నెలకు రూ.16 వేల జీతానికి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న హనీఫ్‌కు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత మొత్తం అప్పు కావాలంటూ తన చిన్ననాటి స్నేహితుడు చాంద్ పీర్ను కోరాడు. ఆరి్థకంగా బలపడాలంటే డ్రగ్స్ దందా చేయాలని, ముంబై నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ ఖరీదు చేసి తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మితే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్‌కు మంచి డిమాండ్ ఉంటుందనీ సలహా ఇచ్చాడు. అందుకు హనీఫ్ అంగీకరించడంతో ముంబైకి చెందిన డ్రగ్స్ సప్లయర్స్ విక్కీ, రోహిత్‌లను పరిచయం చేశాడు. దీంతో వారి వద్దకు వెళ్లిన హనీఫ్ 13.9 గ్రాములు ఎండీఎంఏ ఖరీదు చేశాడు. దానిని తీసుకుని నేరుగా నగరానికి వచి్చన అతను కస్టమర్ల కోసం కార్ఖానాలోని దోభీఘాట్ వద్ద వేచి ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో తూర్పు మండల టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్‌రెడ్డి, పి.నాగరాజు తన బృందంతో దాడి చేసి హనీఫ్‌ను పట్టుకుని డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా అధికారులకు అప్పగించి పరారీలో ఉన్న చాంద్ పీర్ కోసం గాలిస్తున్నారు. -
మస్తాన్ సాయి అరెస్ట్‌తో కదులుతున్న డ్రగ్స్ డొంక
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి కేసులో సంచనల విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి అరెస్ట్‌తో డ్రగ్స్ డొంక కదులుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. తాజాగా మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం బయటకొచ్చింది. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయితో మస్తాన్‌సాయి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోగా.. డ్రగ్స్ కవాలి, తీసుకురావలిన వాట్పాప్‌లో ప్రీతి చాటింగ్ చేసినట్లు వెల్లడైంది.కాగా గుంటూరులో సోమవారం రావి మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతడికి హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి సెల్ ఫోన్లో భారీగా పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేయగా..వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలోనూ మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచ్చింది. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
రాడిసన్ డ్రగ్స్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో విక్రయిస్తున్నారు. హైదరబాద్‌లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరబాద్‌తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్‌లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్‌ను పిటీ వారింట్‌పై హైదరాబాద్‌కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్‌తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్ వెల్లడించారు. -
పోలీస్ కస్టడీకి గోవా డ్రగ్ పెడ్లర్ స్టాన్లీ
-
హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
-
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల నడుమ.. ఈసీ ఆదేశాలతో డీజీపీగా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన పూర్తిస్థాయిలో కొనసాగించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాదకద్రవ్యాల విషయమై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారాయన. Govt. of Telangana resolved to make Telangana, a drug-free State. Let’s all unite to drive away the drugs from the territory of our State. All drug peddlers and consumers are hereby warned in this regard. Stringent legal action would be initiated against the violators. Let’s… — DGP TELANGANA POLICE (@TelanganaDGP) December 20, 2023 -
డ్రగ్ పెడ్లర్‌గా మారిన భగ్న ప్రేమికుడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడి సలహా మేరకు డ్రగ్ పెడ్లర్‌గా మారి హైదరాబాద్‌తో పాటు నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేయడం మొదలెట్టాడు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్–నాబ్) అతనితో సహా 14 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి 42 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకుంది. చేస్తున్న ఉద్యోగాలు మానేసి.. నెల్లూరులోని ఫతేఖాన్‌పేటకు చెందిన జె.ఆషిక్ యాదవ్ గతంలో బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్న రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి కూడా ఉన్నత చదువుల కోసం అక్కడికే రావడంతో ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే ఇద్దరి మధ్యా వివాదాలు ఏర్పడటంతో ఆమె ఆషిక్‌కు దూరమైంది. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురైన ఆషిక్ మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. బెంగళూరు, గోవాలకు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసి వినియోగించే వాడు. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్‌కు వచ్చిన ఆషిక్ నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో నెలకు రూ.22 వేల జీతం వస్తున్నా సరిపోకపోవడంతో గత జూన్‌లో ఆ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. మనమే ఆ దందా చేద్దామంటూ.. ఈ క్రమంలో నెల్లూరుకే చెందిన ఇతని క్లాస్మేట్ రాజేష్ వ్యాపార నిమిత్తం ఆగస్టులో హైదరాబాద్ వచ్చాడు. డ్రగ్స్ వినియోగించే అలవాటు ఉన్న ఇతడు ఆషిక్ నుంచి వాటిని తీసుకునే వాడు. నగరంలో మాదకద్రవ్యాలకు ఉన్న డిమాండ్ గుర్తించిన రాజేష్ తామే ఆ దందా చేద్దామని, మార్కెట్లో ఎక్స్టసీ పిల్స్‌కు మంచి డిమాండ్ ఉందని, వాటినే తీసుకువచ్చి విక్రయిద్దామని చెప్పాడు. దీంతో గోవాకు చెందిన తన స్నేహితుడు బాబాతో పాటు బెంగళూరుకు చెందిన సాయి చరంద్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తున్న ఆషిక్ వాటిని నగరానికి తీసుకువచ్చి రాజేష్‌కు అప్పగిస్తున్నాడు. ఇతడు నగరంతో పాటు నెల్లూరులోని తన స్నేహితులు, రెగ్యులర్ కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నాడు. అక్కడ ఒక్కో ఎక్స్టసీ పిల్‌ను రూ.1000కి ఖరీదు చేసి... ఇక్కడ రూ.3 వేలకు అమ్ముతు న్నారు. గత మంగళవారం గోవా వెళ్లిన ఆషిక్ అక్కడ బాబాకు రూ.60 వేలు చెల్లించి 60 ఎక్స్టసీ పిల్స్ ఖరీదు చేసుకువచ్చాడు. వీటిని తన వద్ద ఉంచుకున్న రాజేష్... శనివారం రెండు పిల్స్‌ను ఆషిక్‌కు ఇచ్చి తమ కస్టమర్లకు అందించమని చెప్పాడు. ఇతడి కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శనివారం ఉదయం అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద ఆషిక్‌ను పట్టుకుని రెండు పిల్స్ స్వాధీనం చేసుకుంది. అతడిచ్చిన సమాచారంతో సోమ వారం ఎస్ఆర్ నగర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ పై దాడి చేసింది. అక్కడ రాజేష్‌తో పాటు 12 మంది చిక్కారు. వీరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి మరో 40 పిల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. డ్రగ్స్‌తో అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్లో రేవ్ పార్టీలు డ్రగ్స్ ఖరీదు చేసిన కొందరు గతంలో అమీర్‌పేట, ఎస్సార్నగర్ల్లోని సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్ పార్టీలు చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఓ బర్త్‌డే పార్టీతో పాటు న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు వీరి నుంచి ఈ పిల్స్ ఖరీదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. టీఎస్–నాబ్ అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆషిక్, రాజేష్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించిన పోలీసులు రెగ్యులర్‌గా డ్రగ్స్ ఖరీదు చేసే 33 మందిని గుర్తించారు. వీరి వద్ద ఈ డ్రగ్ కొనుగోలు చేస్తున్న వారిలో నెల్లూరుకు చెందిన సంపత్, నిహార్, మోహిత్, అశోక్, అమిత్, జై, వసీమ్, ఫయాజ్, శ్రీరామ్, గౌతమ్, గిరిధర్, హనీష్, వేలాసరి, డాక్టర్ పునీత్, డాక్టర్ అరుణ్ మత్, డాక్టర్ ప్రశాంత్, నగరానికి చెందిన శ్రీరామ్, హృతిక్ ఉన్నారు. వీరిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా మిగిలిన వాళ్లు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు డాక్టర్లు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
కారు బోనెట్ మీద మహిళ... అలాగే తీసుకెళ్లిన పోలీసులు..
భోపాల్: మధ్యప్రదేశ్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న నెపంతో అరెస్టైన యువకుడిని విడిచి పెట్టమంటూ ఓ తల్లి పోలీసు కారు బోనెట్ ఎక్కి కూర్చుంది. దీంతో పోలీసులు ఆమెను అలా బోనెట్ పైన కూర్చుండగానే అమానుషంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లారు. స్థానికుల్లో ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్, నర్సింగ్ పూర్లో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అనిల్ అజ్మేరియా, సంజయ్ సూర్యవంశీ అనే ఇద్దరు ఎస్సైలు నీరజ్ డెహరియా అనే కానిస్టేబుల్ తో కలిసి అక్కడి వెళ్లారు. అక్కడ సోను కహార్ అనే యువకుడి ఇంటిని సోదా చేయగా రూ. 3 లక్షలు విలువ చేసే 20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సోను కహర్ ను పోలీసు కస్టడీకి తరలించే క్రమంలో కారు ఎక్కించగానే అతడి తల్లి మోహిని కహార్ వచ్చి వారికి అడ్డుపడింది. తన బిడ్డను విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళమీద పడి ప్రాధేయపడింది. అయినా కూడా వారు కనికరించకపోవడంతో పోలీసు వాహనం బోనెట్ ఎక్కి కూర్చుని బ్రతిమాలింది. అంతలో చుట్టూ జనం గుమికూడటంతో కారుని అలాగే పోలీసు స్టేషన్ కు పోనిచ్చారు పోలీసులు. అక్కడున్న వారిలో ఎవరో ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. వెంటనే ఆ ఇద్దరు ఎస్సైలను, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. #MadhyaPradesh के #Narsinghpur जिले से रोंगटे खड़े करने वाला वीडियो सामने आया है.वायरल वीडियो में एक प्राइवेट नम्बर की चलती कार में लटकी महिला को थाने में ले जाते देखा जा सकता है.तीन पुलिस वाले सस्पेंड कर दिए गए है.@abplive @drnarottammisra @DGP_MP @brajeshabpnews pic.twitter.com/ltVroZuigX — AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) July 5, 2023 -
17కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 17కిలోల గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. నగరంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం అడవిమామిడిపల్లి వద్ద గంజాయిని తరలిస్తున్న ని స్సార్ నుంచి 15.225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయితోపాటు బైక్‌ను, నిస్సార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్‌లోని జిరాయిత్‌నగర్‌లో సోదాలు నిర్వహించగా అక్బర్ అనే వ్యక్తి నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి నిజామాబాద్‌కు బస్సులో గంజాయిని తరలించినట్లు విచారణలో తేలిందన్నారు. బస్సులలో తీసుకువచ్చిన గంజాయిని స్థానికంగా అమ్ముతారని తెలిపారు. జిల్లాలో గంజాయి అమ్మకాలు సాగిస్తే వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందించాలని, వారి వి వరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు. సీఐలు స్వప్న, వేణుమాధవరావు, ఎస్సై రాంకుమార్, హెడ్‌కానిస్టేబుల్ శివప్రసాద్, రాజన్న, కానిస్టేబుళ్లు ఉత్తమ్, రాంబచన్, శివ, విష్ణు, భోజన్న, హమీద్, గంగారాం, మంజుల, సుకన్య, అవినాష్ పాల్గొన్నారు. -
హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా? బంగారాన్ని మించిన ధర
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్రాము బంగారం రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి సిటీకి సరఫరా అవుతున్న హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా..? ఏకంగా గ్రాము రూ.10 వేలు. వ్యవస్థీకృతంగా ఈ డ్రగ్ నెట్వర్క్ నడిపిస్తున్న అంతరాష్ట్ర సరఫరాదారుడిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. ఇతడికి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ముంబైలోని అంథేరీ వెస్ట్ ప్రాంతంలో నివసించే మిరాజ్ కాజీ అక్కడి పబ్స్‌కు వెళ్లే క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. తానూ ఇదే దందా చేయాలని నిర్ణయించుకుని ఆ నగరంలో ఉన్న డ్రగ్ సప్లయర్ సూరజ్ గోస్వామితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతడి నుంచి హోల్‌సేల్‌గా కొంటూ ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఉన్న అనేక మంది వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముతున్నాడు. హైక్వాలిటీ ఎండీఎంఏ డ్రగ్‌ను గ్రాము రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి అందించడం కోసం 40 గ్రాముల ఎండీఎంఏ తీసుకున్న మిరాజ్ ఇక్కడకు చేరుకున్నాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు తన బృందంతో నిఘా ఉంచారు. చార్మినార్ ప్రాంతంలో మిరాజ్ ఉన్నాడన్న సమాచారం అందుకుని వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గోస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతడి నుంచి ఈ మాదకద్రవ్యాన్ని సిటీలో ఎవరెవరు ఖరీదు చేస్తున్నారు? వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వా«దీనం చేసుకున్న డ్రగ్‌ను చార్మినార్ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పు.. రూ. 50 వేలు ముంబైలోని మూతపడిన కర్మాగారాల్లో తయారవుతున్న ఎండీఎంఏ డ్రగ్ దేశ వ్యాప్తంగా అనేక మెట్రో నగరాలకు సరఫరా అవుతోంది. దీనికోసం ప్రత్యేకంగా నెట్వర్క్ పని చేస్తోంది. ఈ డ్రగ్‌ను తరలించే క్యారియర్లను ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేల చొప్పున సరఫరాదారులు చెల్లిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందిదని కొత్వాల్ సీవీ ఆనంద్ అన్నారు. ఏఓబీ టు ముంబై సింథటిక్ డ్రగ్స్ ముంబై నుంచి నగరంతో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి సరఫరా అవుతోంది. ఈ దందా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు ఈస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన భార్యభర్తలు బిల్కిస్ మహ్మద్ సులేమాన్, అలీ సాగర్ సైఫుద్దీన్ రాంపుర్వాలా కొన్నేళ్లుగా గంజాయి దందాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఏడు, మరొకరిపై 15 కేసులు నమోదయ్యాయి. ఏఓబీలో గంజాయి పండించే శ్రీనివాస్ నుంచి గంజాయి ఖరీదు చేసే రకీబ్ అనే ముంబై వాసి అక్కడి విక్రయిస్తున్నాడు. బిక్విస్, సైఫుద్దీన్ తమకు పరిచయమైన జహీరాబాద్‌కు చెందిన ముర్తుజా షేక్ ద్వారా రకీబ్‌ను సంప్రదించారు. తమకు, గంజాయి పండించే వారికి మధ్య దళారిగా ఉండాలని కోరడంతో ఇతడు అంగీకరించాడు. శ్రీనివాస్ నుంచి ఖరీదు చేసిన 110 కేజీల గంజాయిని మంబై తరలించడానికి రకీబ్... అబ్దుల్ అనే వ్యక్తికి చెందిన కారు రూ.20 వేలకు అద్దెకు మాట్లాడుకున్నారు. ఈ సరుకు తీసుకురావడానికి అబ్దుల్ తన భార్య హసీనాతో కలిసి ఏఓబీకి వెళ్లాడు. శ్రీనివాస్‌ను కలిసి 110 కిలలో గంజాయి తీసుకొని కారు సీట్ కింద ప్యాకెట్ల రూపంలో దాచాడు. ముంబై వెళ్తూ ఇమ్లీబన్ దగ్గర ఆగి 20 కిలోలు జహీరాబాద్‌కు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ డి.సంతోష్ కుమార్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేసి బిలి్కస్, సైఫుద్దీన్ , ముర్తుజా షేక్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్ -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
యాపిల్ బాక్సుల్లో చెరస్ డ్రగ్ రవాణా!.. ఇది చాలా రేటు గురూ
సాక్షి, హైదరాబాద్: గార్లిక్ బ్రెడ్–రూ.160, దోశ–రూ.250, ఫ్రూట్ సలాడ్–రూ.300, సీఫుడ్ సూప్–రూ.320.. ఎడ్విన్ కేసులో అరెస్టు అయిన డ్రగ్ పెడ్లర్ బాలమురుగన్‌కు చెందిన మోర్గన్స్ ప్లేస్ రెస్టారెంట్ మెనూ ఇది. అక్కడకు వెళ్లిన ఎవరైనా ఇంత రేటా..? అంటే.. అంతా విలువ ఉంటుందని చెప్తుంటారు నిర్వాహకులు. బాలమురుగన్ సరఫరా చేసే చెరస్ కూడా ఇలానే ఎక్కువ రేటు ఉంటుందని, ఎందుకంటే అతడి నుంచీ అదే సమాధానం వస్తుందని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెప్తున్నారు. దీనికి అతడి నుంచి వచ్చే సమాధానం వర్తీ స్టఫ్ సార్ అని. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ పర్వత ప్రాంతాల్లో అది పండటమే కారణం. తదుపరి విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామ్‌గోపాల్ పేట పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తులాల లెక్కన విక్రయం... హోటళ్ల వ్యాపారం చేసే బాలమురుగన్‌కు రాజస్థాన్‌లోని కోట, బుండి, పుష్కర్‌లతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌కోట్, గోవాలోని అంజునా బీచ్‌ల్లో మోర్గన్స్ ప్లేస్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. అనునిత్యం రద్దీగా ఉండే వీటిలో నాణ్యమైన ఆహారం అందిస్తున్న నేపథ్యంలోనే రేటు సైతం ఎక్కువని మురుగన్ ప్రచారం చేసుకుంటాడు. అతడు సరఫరా చేసే చెరస్ విషయంలోనూ ఇదే సూత్రం అవలంబిస్తున్నాడు. మనాలీలో దొరికే గంజాయి ఆకులు, పుష్పాల నుంచి తీసే ఈ జిగురు లాంటి పదార్థాన్ని అతగాడు కేజీల్లో ఖరీదు చేస్తున్నాడు. దాన్ని గోవా సహా ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ తులాల లెక్కన అమ్ముతున్నాడు. ఒక్కో తులం పెడ్లర్లకు రూ.5 వేలకు అమ్ముతుండగా అది వినియోగదారుడి వద్దకు చేరేసరికి రూ.10 వేలు దాటుతోంది. యాపిల్ బాక్సులు ఆర్డర్ ఇస్తూ... తన హోటల్స్ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా బాలమురుగన్ అనునిత్యం గోవా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌ల మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాడు. గతంలో మనాలీ నుంచి ఇతగాడే చెరస్‌ను రవాణా చేసేవాడు. కూరగాయల మధ్యలో కేజీ చొప్పున ప్యాక్ చేసిన చెరస్ పెట్టి తీసుకువచ్చేవాడు. అయితే గడిచిన రెండుమూడేళ్లుగా నిఘా పెరిగిపోయింది. దీంతో ఇతగాడు యాపిల్స్ మార్గం అనుసరిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హోల్‌సేల్ యాపిల్ వ్యాపారుల నుంచి తన హోటల్ కోసమంటూ 10, 15 బాక్సులు ఆర్డర్ ఇచ్చేవాడు. వాటిని ప్యాక్ చేసే వారిని మ్యానేజ్ చేయడం ద్వారా ఒక్కో దాంట్లో కేజీ చొప్పున చెరస్ ప్యాకెట్లు పెట్టించేవాడు. ఈ బాక్సులపై ప్రత్యేక గుర్తులు పెట్టి మిగిలిన వాటిలో కలిపేసేవాళ్లు. ఈ పార్శిల్స్ గోవా వచ్చిన తర్వాత తొలుత తనకే సమాచారం ఇచ్చేలా ట్రాన్స్‌పోర్టు వ్యాపారులనూ మేనేజ్ చేసేవాడు. అలా వారి వద్దకు వెళ్లి ప్రత్యేక గుర్తులతో ఉన్న బాక్సులు తీసుకువెళ్లేవాడు. తాము సహకరిస్తున్నది చెరస్ రవాణాకని అటు హిమాచల్, ఇటు గోవాలో ఉన్న వారికీ తెలిసేది కాదు. గోవా నుంచి ఇతర రాష్ట్రాల్లోని పెడ్లర్స్‌కు హోల్‌సేల్‌గా సరఫరా చేసేవాడు. మురుగన్‌కు మరికొందరు పెడ్లర్స్... ఏళ్లుగా చెరస్, కొకైన్ వ్యాపారం చేస్తున్న బాలమురుగన్‌కు నగరంలోనూ కొందరు పెడ్లర్స్ ఉంటారని పోలీసు విభాగం అనుమానిస్తోంది. వారి వివరాలు గుర్తించడానికి లోతుగా విచారించాలని నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్‌పేట పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. -
డ్రగ్ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమాని. ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బోర్కర్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హెచ్–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా.. -
Hyderabad: గంజాయి సరాఫరా.. మహిళా డ్రగ్ పెడ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ ఆకాశ్ కుమార్ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్ నవాజుద్దీన్, వినాయక్, బానావత్ కిషన్, బానావత్ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
పుణే కేంద్రంగా డ్రగ్స్ దందా
హిమాయత్‌నగర్: సోషల్ మీడియా వేదికగా సింథటిక్, ఎండీఎంఏ డ్రగ్ దందా చేస్తున్న పెడ్లర్లను హెచ్‌న్యూ టీం గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన 40 గ్రాముల సింథటిక్, 30 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నైజీరియాకు చెందిన మహమద్ టొయిరూ బకారీ 2013లో ముంబైకి టూరిస్ట్ వీసాపై వచ్చాడు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ స్థానికుడైన అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయతో కలిసి పుణేలో డ్రగ్స్ రవాణా, సరఫరా చేస్తున్నాడు. వీరు కొకైన్ (సింథటిక్) అమ్ముతున్న విషయాన్ని అక్కడి నార్కోటిక్ బృందం పసిగట్టి 2019లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2020లో రిలీజైన ఈ ఇద్దరూ ముంబైకి చెందిన మరో వ్యక్తి అజయ్‌కుమార్ చౌపల్ను జతకలుపుకున్నారు. పుణే నుంచి వీరు సిటీకి సింథటిక్ డ్రగ్‌ను రవాణా చేస్తూ పంజగుట్ట పరిధిలో విక్రయిస్తున్నట్లు హెచ్‌న్యూ టీం గుర్తించి కొద్దిరోజుల క్రితం అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయ, అజయ్‌కుమార్ చౌపల్లను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం మహమద్ టొయిరూ బకారీని అరెస్ట్ చేసి ఇతని వద్ద ఉన్న 40 గ్రాముల కొకైన్(సింథటిక్), 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో..యూపీలోని గయాస్పుర్కు చెందిన మహ్మద్ అలీంఖాన్ నగరానికి చెందిన కొందరి కాంటాక్టస్‌ను సేకరించి వీరికి ఇన్‌స్ట్రాగామ్ వేదికగా సరఫరా చేసేందుకు గోల్కొండ పీఎస్ పరిధిలో ఉండగా..హెచ్‌న్యూ టీం పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇతని వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఒక మొబైల్, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందాపై ఏదైనా సమాచారం తెలిస్తే ప్రజలు 8712661601 నంబర్లో ఫిర్యాదు చేయాలని జోయిల్ డేవిస్ కోరారు. సమావేశంలో హెచ్న్యూటీం డీసీపీ గుమ్మి చక్రవర్తి, ఇన్స్పెక్టర్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెలలో అరెస్టు చేసిన గోవా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌కు పెద్ద బ్యాగ్రౌండే ఉంది. గోవా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డ్రగ్ డీలర్ సదానంద్ చిముల్కర్‌కు సమీప బంధువు ఇతడు. భూయ్ అనే మారు పేరు కూడా ఉన్న చిముల్కర్ 2010–14 మధ్య గోవా సహా అనేక రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించాడు. ప్రీతీష్‌ను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్న ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అంజునా ప్రాంతానికి చెందిన డ్రగ్స్ డాన్ సదానంద్ అలియాస్ భుయ్ చిముల్కర్‌కు ప్రీతీష్ బోర్కర్ సమీప బంధువు. సదానంద్ జీవశైలి, సంపాదన, డబ్బు ఖర్చు చేసే విధానం..ఇవన్నీ చూసిన ప్రీతీష్ తానూ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సదానంద్‌కు సరఫరా చేసే వారి నుంచే ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, ఎక్స్టసీ, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేసే అమ్మడం మొదలెట్టాడు. సదానంద్‌ను గోవా యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ) అధికారులు 2010 జనవరిలో అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత సదానంద్ అడ్డం తిరిగాడు. అసలు తాను డ్రగ్సే అమ్మలేదని, తన కారులో ఏఎన్సీ అధికారులే వాటిని పెట్టారని కోర్టులో పిటిషన్ వేశాడు. లంచం ఇవ్వనందుకే ఇలా చేశారంటూ ఆరోపించాడు. అయితే పోలీసులు చూపించిన ఆధారాలతో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో గోవా పోలీసులు సదానంద్‌ను కట్టడి చేయడానికి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు. గోవా పోలీసు చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్ కేసులో నిందితుడి ఆస్తులు, బంగారం, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంకు ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దీనికి తోడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాశారు. దీంతో ఆ అధికారులు సదానంద్‌పై 2014లో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా డ్రగ్స్ డాన్‌పై ఈడీ కేసు నమోదు కావడం కూడా గోవాలో అదే తొలిసారి. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రీతీష్ బోర్కర్ తన ఉనికి బయటపడకుండా దందా చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా సింథటిక్ డ్రగ్స్ అయిన ఎక్స్టసీ పిల్స్, ఎల్ఎస్డీ బోల్ట్సŠ, ఎండీఎంఏ మాత్రమే అమ్మేవాడు. అప్పుడప్పుడు మాత్రం చెరస్‌ను సరఫరా చేస్తుండేవాడు. అయితే ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న గోవా పోలీసులు 2014 నవంబర్‌లో అక్కడి సియోలిమ్ వద్ద పట్టుకుని జైలుకు పంపారు. అప్పట్లో ఓ కస్టమర్‌కు నేరుగా డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్లిన ప్రీతీష్ పట్టుబడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఇతగాడు తన పంథా మార్చాడు. ఎవరికీ కనిపించకుండా, కొరియర్స్ ద్వారానే డ్రగ్స్ సరఫరా చేపట్టాడు. ఇన్నాళ్లకు మళ్లీ హబ్సిగూడకు చెందిన కస్టమర్ల కోరిక మేరకు వారికి డ్రగ్స్ సరఫరా చేయడానికి గత నెల్లో హైదరాబాద్‌కు వచ్చి హెచ్–న్యూకు చిక్కాడు. -
డెత్ డ్రాప్.. డ్రగ్ ట్రాప్! ఎవరికీ చిక్కకుండా కొత్త పంథాలో ‘సరుకు’ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి. ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య డార్క్ వెబ్‌లో ఆర్డర్లు తీసుకుని.. హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్‌లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు. బికర్మీ యాప్‌లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. ►హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్‌ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్‌కుమార్, పి.భూషణ్‌రాజ్ డార్క్‌వెబ్‌లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు. ►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్‌ను పంపిస్తున్నారు. కొరియర్లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్‌కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్‌లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్‌గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్‌లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు. నిఘా పెట్టి.. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. –సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
హైదరాబాద్ నగరాన్ని ఆందోళనకు గురి చేస్తోన్న డ్రగ్ మాఫియా
-
ప్ర‘మాదక’ ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా.. వినియోగం.. విక్రయం.. ఇన్నాళ్లూ ఈ కోణాలే బయటపడేవి. విదేశీయుల నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల దాకా ఎందరో పట్టుబడ్డారు. సినీ ప్రముఖులూ డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ తొలిసారిగా డ్రగ్స్ కారణంగా ఓ యువకుడు మరణించిన విషయం బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువ మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యేవి నార్కోటిక్ సబ్స్టాన్సస్. కృత్రిమంగా తయారు చేసేవి సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్. గంజాయి, ఓపియం, కొకైన్లతోపాటు గంజాయి నుంచి ఉత్పత్తి చేసే చెరస్, హష్ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్ నార్కొటిక్స్ కిందికి వస్తాయి. కెటామిన్, ఎఫిడ్రిన్, పెథిడిన్ వంటివి సైకోట్రోపిక్ డ్రగ్స్. హైదరాబాద్‌లో నార్కోటిక్స్ వినియోగం ఎక్కువ. ఈ ఉత్పత్తులు ప్రధానంగా ఆదిలాబాద్, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని వరంగల్, మెదక్, జహీరాబాద్లతోపాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి, హష్ ఆయిల్ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి కూడా వివిధ రూపాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. నైజీరియన్ల నుంచి లోకల్ దాకా.. ముంబై, గోవా, ఢిల్లీ, చండీగఢ్ తదితర చోట్ల డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లు, ఇతర ఆఫ్రికా దేశాల వారిని వినియోగిస్తున్నారు. వీరు డ్రగ్స్‌ను రవాణా చేసి, తీసుకున్న డబ్బును డీలర్లకు పంపి.. వారిచ్చే కమీషన్ తీసుకుంటారు. నైజీరియన్లు పట్టుబడినా తమకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా డీలర్లు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో డ్రగ్స్ బానిసలైన స్థానిక యువకులు డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లుగా మారుతున్నారు. కొందరు నేరుగా డార్క్‌నెట్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. నిఘా పెరిగితే గోవాకు వెళ్తూ.. డ్రగ్స్‌కు వారాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. పబ్బులు, ఫామ్‌హౌజ్‌లు, రిసార్టుల్లో శని, ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు, కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. పెడ్లర్లు తెలిసినవారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. వీటిని వినియోగించేవారిలో వీఐపీలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు, వారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక గంజాయి, హష్‌ఆయిల్ వంటివాటిని చిన్నస్థాయి ఉద్యోగులు, విద్యార్థులు వంటివారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నిఘా పెరిగితే.. యువత గోవా వంటి చోట్లకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. కొందరు అక్కడే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘తొలి మరణానికి’ సంబంధించిన యువకుడు కూడా గోవాలో జరిగిన పార్టీతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో ఎఫిడ్రిన్ తయారీ! అల్లోపతి ఔషధాల తయారీలో ఉపయోగించే ఎఫిడ్రిన్ కూడా మాదకద్రవ్యాల తరహాలోనే మత్తునిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. కొన్ని ముఠాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో భారీగా ఎఫిడ్రిన్ తయారు చేసి.. ఇతర ప్రాంతాలు, విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానికంగా ఈ డ్రగ్ వినియోగం తక్కువేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హెచ్– న్యూ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ)’ ఆవిర్భవించింది. సీనియర్ అధికారులతో కూడిన ఈ వింగ్ గత 51 రోజుల్లో మొత్తం 20 ముఠాలను పట్టుకుంది. పెడ్లర్లు, వినియోగదారులు సహా 120 మందిని అరెస్టు చేసింది. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు. వీటితో ప్రమాదకరమే.. హెరాయిన్: బ్లాక్ట్రా, చివా, నెగ్రా, హార్స్ మారుపేర్లు. కరిగించి ఇంజెక్షన్లా తీసుకోవడం (ఇంజెక్టింగ్), ముక్కుతో పీల్చడం (నోజింగ్), సిగరెట్లో నింపుకొని కాల్చడం (స్మోకింగ్) చేస్తారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతోపాటు కోమాలోకి వెళ్లి మరణించే ప్రమాదం ఉంటుంది. కొకైన్: స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా దీనికి మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకొని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం (స్పైకింగ్) చేస్తారు. దీనివల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. గాంజా, చెరస్, హష్ ఆయిల్: ఓ మాల్గా పిలుస్తుంటారు. గంజాయి ఆకులను సిగరెట్లో నింపుకొని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్ ద్వారా సేవిస్తారు. వీటితో ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఎవరినీ వదిలిపెట్టం నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పాటు చేశాం. ఈ విభాగం స్థానికంగా జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలతోపాటు వాటి మూలాలను కనిపెట్టి చెక్ పెడుతుంది. మాదకద్రవ్యాలతో ఏ రకమైన ప్రమేయం ఉన్నా.. ఎవరినైనా వదిలిపెట్టం. డ్రగ్స్ వ్యవహారాలపై సమాచారం ఉన్న వారు 9490616688, 040–27852080 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –డీఎస్ చౌహాన్, అదనపు సీపీ విష వలయంలో విద్యార్థులెందరో.. నగరంలో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులతోపాటు విద్యార్థులు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్–న్యూ ఏర్పడిన రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్టు చేశాం. విక్రేతలు, వినియోగదారులుగా చిక్కిన వారిలో వివిధ కాలేజీలతోపాటు యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ డ్రగ్స్ దందాలపై నిఘా పెట్టాం. –‘హెచ్–న్యూ’కు చెందిన అధికారి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది డ్రగ్స్ ప్రభావం నాడీ వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. అవి సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను అతిగా ప్రేరేపించి అకారణ ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే వేరే లోకంలో ఉన్న భ్రాంతి కలుగుతుంది. కొద్దిరోజులు తరచూ డ్రగ్స్ తీసుకుంటే బానిసవడం ఖాయం. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా డ్రగ్స్‌కు అలవాటు మానుకునేలా చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ అభినయ్, న్యూరాలజీ, కన్సల్టెంట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్‌తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్‌లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్‌గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్‌ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్‌లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్‌తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
డ్రగ్స్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
-
టోనీకి రిమాండ్..చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు(గురువారం) నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. టోనీకి ఈనెల 14 వరకూ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో టోనీని చంచల్‌గూడ జైలుకు తరలించారు.