East Godavari district
-
ఎమ్మెల్యేలకు ముడుపులు.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల దందా
తూర్పుగోదావరి జిల్లా : పేరుకే ఉచిత ఇసుక విధానం. కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేశ్చగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు.బాట ఛార్జీల పేరుతో లారీకి రూ.2,500వరకు వసూలు చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంప్‌లో తన అనుచరులతో దగ్గరుండి వసూలు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి.. మొత్తంలో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్‌గా మారాయి. -
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
విద్యుత్ షాక్‌కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
ప్రజల్లో తిరుగుబాబు మొదలైంది: జక్కంపూడి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్‌కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్‌ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు. -
సినిమా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నేలకూలిన 150 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా (నిద్ర గన్నేరు) వృక్షాన్ని తిరిగి అదే ప్రదేశంలో బతికించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటించారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి బుధవారం కూలిన చెట్టును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కెమికల్ ట్రీట్మెంటు ద్వారా ఈ చెట్టును మళ్లీ చిగురింప జేసేందుకు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ముందుకొచి్చందన్నారు. -
తూర్పు ఏజెన్సీలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్
-
బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు... కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాలో పని చేశాడు... గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు... ఇతడు టార్గెట్ చేసింది కూడా రాజకీయ నేతల్నే... రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకంతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 40 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు...ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 37 పోలీసుస్టేషన్లలో ఇతడిపై కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా పంథా మారలేదు... ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు నేర చరిత్ర ఇది. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఇతగాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క సామాన్యుడి జోలికీ వెళ్లలేదు. నాటి ఎమ్మెల్సీ ఆకుల లలిత నుంచి రూ.10 లక్షలు కాజేసిన కేసులో 2017, మరో ప్రముఖుడిని బురిడీ కొట్టించి 2019ల్లో జైలుకెళ్లిన ఇతగాడు తాజాగా మరో ఎమ్మెల్యేకు టోకరా వేసి శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన విషయం విదితమే. 50 ఏళ్ల వయస్సున్న ఈ నిందితుడు ఇప్పటి వరకు 21 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఒక్కోసారి ఒక్కో విధంగా... తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ కేసు నిరూపితం కావడంతో ఆ తర్వాతి ఏడాది ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటికీ నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు. విజయనగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయని, మీ నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాల్సిందిగా మీమీ ఎమ్మెల్యేలకు సూచించాలంటూ ఎర వేశాడు. డిపాజిట్ పేరుతో కొంత మొత్తం బ్యాంకు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. ఈ నేరంపై విజయనగరం రెండో టౌన్ పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ అనేక మందిని ఇలానే మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి పంపారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచే రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుకు వెళ్లాడు. ఇలానే మరికొందరిని ముంచి జైలుకు వెళ్లివచ్చాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నెంబర్లు... బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెంబర్ 197ను సంప్రదించి అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్‌పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చిపురుపల్లి, పొన్నూరు, కారంచేడు తదితర నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాలు పేరుతో దాని ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ ఎర వేశాడు. వారి పీఏలకు విషయాన్ని ‘వివరించి’ ఒక్కో అభ్యర్థికి రూ.1,060 చొప్పున ముందస్తు డిపాజిట్ చేయాలంటూ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశాడు. కొందరు నిరుద్యోగుల్నీ ఉద్యోగాల పేరుతో ముంచాడు. ఈ నేరాలకు సంబంధించి బీజేపీ నాయకుడు రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచి్చన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్థన్‌లను టార్గెట్ చేశాడు. వారితో పాటు వారి పీఏలకూ ఫోన్లు చేసి రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాల పేరే చెప్పాడు. మీమీ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పించుకోండని సూచించాడు. ఒక్కో అభ్యర్థికీ సంబంధించి ముందుగా దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి మొత్తం రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమని కోరాడు. వీరు అలానే చేయగా మొత్తం డ్రా చేసుకుని స్వాహా చేశాడు. హన్మంతరావు రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తానే ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టు అయ్యాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీ నుంచి... ఇతగాడి ఘరానా నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉండి 2017 జనవరిలో విడుదలైన బాలాజీ నాయుడు సిటీతో పాటు ఏపీ, తెలంగాణల్లో మళ్లీ మోసాలు చేశాడు. ఆ ఏడాది సెపె్టంబర్ 12న తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు కాల్ చేసిన బాలాజీ నాయుడు తాను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా ఐదు శాతం చెల్లిస్తే ఆ మెత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లారు. 2019లోనూ ఓ ప్రజాప్రతినిధిని మోసం చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఏకంగా ప్రముఖులనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న ఇతగాడిని కట్టడి చేయడానికి అనువైన మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు వారి సంబంధీకులు, సిబ్బంది ఈ మోసగాడి పం«థాను దృష్టిలో ఉంచుకోవాలని, ఫోన్ ద్వారా సంప్రదించే వారిని పూర్తి స్థాయిలో నమ్మవద్దని హితవు పలుకుతున్నారు. -
తూర్పు గడ్డపై ఫ్యాన్ హోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ జోరుగా తిరుగుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూర్పు గడ్డపై వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో బలంగా ఉందనుకున్న జనసేనపై నమ్మకం సడలి ఆ పార్టీ నేతలు జారుకోవడం, టీడీపీ ఆదరణ కోల్పోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ స్థానాల్లో 15 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కన్నబాబు కన్నుల్లో ఆనందమే రెండుసార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధితో తనదైన ముద్ర వేసుకున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడకే. వివాదరహితుడు, అందరితో కలిసిపోయేతత్వం ఈయనకు సానుకూల అంశాలు. ఆయన స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసినప్పుడు 40 వేల ఓట్లు పైచిలుకు సాధించిన రికార్డు ఉంది. జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావుపై పలు స్టేషన్లలో 19 కేసులున్నాయి. దీంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ప్రత్తిపాడులో ఫ్యాన్ పవర్ ప్రత్తిపాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ నిలిచారు. వీరిద్దరూ వరుసకు తాత, మనవరాలు. సీనియర్ నాయకుడు కావడం, వివాదరహితుడనే పేరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సుబ్బారావుకు కలిసి వచ్చే అంశాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండటం సుబ్బారావుకు ప్లస్ పాయింట్. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బరిలో నిలిచిన సత్యప్రభకు రాజకీయాలు కొత్త. పారీ్టలో తన భర్త దివంగత రాజాతో విభేదాలున్న వర్గం సత్యప్రభకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం ప్రతికూలాంశం.కాకినాడ మరోసారి కేకకాకినాడ సిటీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హ్యాట్రిక్ విజయం దిశగా పయనిçస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాకినాడలో దాదాపు అన్ని వర్గాల సాన్నిహిత్యంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్మార్ట్ సిటీ నిధులతో సుందర నగరంగా తీర్చిదిద్దడం, ఎన్నికల మేనేజ్మెంట్లో నైపుణ్యం, ముక్కుసూటితనం ద్వారంపూడికి మూడోసారి గెలుపునకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ద్వారంపూడికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు సొంత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత, టీడీపీలో గ్రూపుల గోలతో ఎదురీదుతున్నారు. ‘తోట’కే విజయ ఫలంపూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంపేట. రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేచింది ఇక్కడ. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరు 2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేటలో పాత ప్రత్యర్థులే. ఈ రెండుసార్లు కూడా తోటదే గెలుపు. మూడోసారి మళ్లీ తలపడుతున్నారు. మహానేత వైఎస్ కేబినెట్లో మంత్రిగా తోట చేపట్టిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు నరసింహంకు సానుకూలత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి నెహ్రూకు పారీ్టలోని వ్యతిరేక వర్గంతోపాటు జనసేన రెబల్‌గా బరిలో ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు తోడుకావడం మైనస్.జగ్గిరెడ్డిని ఆపతరమా..? కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యనే మరో సారి పోరు సాగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోను వీరిద్దరే ప్రత్యర్థులు. 2009లో తప్ప మిగిలిన అన్నిసార్లూ చిర్లదే గెలుపు. జగ్గిరెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సానుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిర్ల గెలుపు వాకిట ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు పొత్తుతోనే చిత్త య్యే వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్‌కు భంగపాటే... అపజయం ఎరుగని రాజకీయ నాయకురాలిగా పేరున్న సిట్టింగ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ పిఠాపురం బరిలో నిలిచారు. 2009లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా పేరుంది. నియోజకవర్గంలో ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి పరిచయాలున్న గీతతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీపడుతున్నారు. తనకున్న పరిచయాలు, కలుపుగోలుతనం, జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవంతో పిఠాపురంలో పవన్‌కు చుక్కలు చూపిస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికలప్పుడు కనిపించి తరువాత ముఖం చాటేస్తారనే భయం ఉంది. ‘పెద్ద’రికానికి బ్రేకు తప్పదు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు టీడీపీ వరుస విజయానికి బ్రేక్ వేసే వైపు అడుగులేస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి దొరబాబు చేసిన కృషి విజయం వైపు నడిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి ఆశాభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్ర తిరగేసి చూస్తే పెద్దాపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక్కడి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన చినరాజప్ప ఈ సారి తప్పకుండా ఓటమి చవిచూస్తారని అంటున్నారు. తునిలో టీడీపీ తూర్పుకు దండమే తూర్పు సెంటిమెంట్ నియోజకవర్గం తుని. రెండు, మూడు సందర్భాలు మినహాయిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పారీ్టనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టాలని వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా ధీమాగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సాయం అర్థించి వస్తే కాదనలేని మనస్తత్వం రాజాను గెలిపిస్తుంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె దివ్యను బరిలోకి దింపినా ఎదురీదక తప్పడం లేదు. రామకృష్ణుడు మోసానికి గురైన తమ్ముడు కృష్ణుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరడంతో గెలుపు మరింత సులువైంది. కమలానికి కంటి తడి తప్పదు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యరి్థగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలోకి దిగగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీపడుతున్నారు. చేయి తిరిగిన వైద్యుడిగా పేరొందిన శ్రీనివాస్‌ను బలహీనవర్గాల కోటాలో ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల మద్ధతుతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.స్థానికులను కాదని పురందరేశ్వరికి బీజేపీ సీటు కేటాయించడంతో కమళనాథుల కుమ్ములాటలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకునే నేతలకు పట్టంకడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది గతంలో సినీ నటుడు మురళీమోహన్ విషయంలో చూసిన ఈ ప్రాంత జనం పురందరేశ్వరి అభ్యరి్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.‘బుచ్చిబాబు’ను వెంటాడుతున్న పాపాలు ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎదురీదుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు అతని అనుచరగణం సాగించిన అరాచకాలు, సెటిల్మెంట్లు ఈ ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. నాడు చేసిన తప్పులు ఇప్పుడు కొద్దోగొప్పో బాగుందనుకుంటున్న పార్టీకి మైనస్‌గా మారాయి. సమస్యల పరిష్కారంలో సామాజికంగా కొన్ని పక్షాలను దూరం పెట్టిన ప్రభావం ఇప్పుడు వ్యతిరేకతగా మారి ఓటమి అంచులకు చేరుస్తోందని ఆ వర్గాలే భావిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్‌కు బలమైన రెండు సామాజికవర్గాల మద్దతుతో ఈసారి కూడా గెలుపు సునాయసమేనని విశ్లేíÙస్తున్నారు. సునీల్..గెలుపు జిగేల్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది.వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌తో జనసేన అభ్యర్థి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయశ్రీనివాస్ పోటీపడుతున్నారు. సునీల్‌కు మెట్ట ప్రాంత మండలాల్లో పారీ్టరహితంగా నేతలతో ఉన్న బంధుత్వాలు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. సునీల్‌తో పోటీపడుతోన్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ స్థానికేతరుడు, కనీస పరిచయాలు లేకపోవడం ప్రతికూలతగా మారింది. మిత్రపక్షం టీడీసీలో అంతర్గత కుమ్ములాటలు, వారి నుంచి ఎదురవుతోన్న సహాయనిరాకరణతో ఎదురీదుతున్నారు. గొల్లపల్లి గుప్పెట్లో రాజోలు ఎమ్మెల్యే, మంత్రిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం, ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు, రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయావకాశాలకు ఢోకా లేకుండాపోతోంది. గతంలో గొల్లపల్లి చేసిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు, వందేళ్లుగా జరగని సఖినేటిపల్లి– నర్సాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.580 కోట్లు కేటాయింపు సానుకూల అంశాలై గెలుపు ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్ ఈ ప్రాంతంతో పరిచయం లేకపోవడంలో ఓటమి ఖరారుగా కనిపిస్తోంది. అనపర్తి సత్తికి కంచుకోట అనపర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోటగా మరోసారి నిలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలనకుతోడు అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించిన సత్తికి గెలుపు సునాయాసమేనంటున్నారు. ఓటమి ఖాయమనే సర్వే నివేదికలతో వెనక్కు తగ్గిన టీడీపీ, బీజేపీని బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి పోటీకి పెట్టింది. ఈ పరిణామాలతో విస్తుపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ‘దేశం’ సర్దుకోవలసిందే అమలాపురం నియోజకవర్గంలో మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సీనియర్‌గా అన్ని వర్గాలతో మమేకం కావడం, అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో విశ్వరూప్ విజయానికి ఢోకా లేదు. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ప్రజలతో పెద్దగా మమేకమవకపోవడం ప్రతికూలతగా మారింది. సొంత పారీ్టలోనే కాకుండా కూటమిలోని జనసేన నేతలు కూడా తెరవెనుక వ్యతిరేకంగా పనిచేస్తుండటం మైనస్.‘రాజా’నగరమే ఇక్కడ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్యరి్థగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీపడుతున్నారు. రూ.1773 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1377 కోట్లతో అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని పలువురిని మోసం చేయడం వంటి కేసులుండటంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేనతో జతకట్టిన టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత బలరామకృష్ణకు ప్రతికూల అంశం. బలరామకృష్ణ ఏకైక నమ్మకం పవన్ సామాజికవర్గం.రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ రయ్..రయ్ రాజకీయ దురంధరుడైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రామచంద్రపురం బరిలోకి దిగిన అతని తనయుడు, విద్యావంతుడు పిల్లి సూర్యప్రకాశ్ విజయానికి చేరువలో ఉన్నారు. స్థానికుడు, తండ్రి బోస్ ద్వారా గ్రామ,గ్రామాన ఉన్న విస్తృతమైన పరిచయాలు సానుకూల అంశాలు. బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు చెందిన బలమైన సామాజిక వర్గాలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వైఎస్సార్సీపీ పక్షాన నిలవడం ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్థానికేతరుడు, నేరచరిత్ర, అమలాపురం పరిసరాల్లో ఉన్న కేసులు, జనసేన నుంచి సహాయ నిరాకరణ ప్రతికూల అంశాలు.మార్పు కోరుతున్న ‘రూరల్’ రాజమహేంద్రవరం రూరల్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆ«ధిపత్య సామాజిక వర్గానికి చెందిన గోరంట్లపై బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన గోరంట్ల ఇక్కడ మూడోసారి తలపడుతుంటే, నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమితులై ప్రగతికి శ్రీకారం చుట్టడంతో వేణుకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీకి ప్రసాదమే అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఫ్యాన్‌గాలి బలంగా వీస్తోంది. దేశంలో ఎస్సీ సామాజికవర్గం బలంగా ఉన్న రెండో పార్లమెంటు స్థానం అమలాపురం కావడం, ఆ సామాజికవర్గం ముద్ర వైఎస్సార్సీపీపై బలంగా ఉండటంతో కలిసి వచ్చే అంశం. రాపాకకు ప్రత్యరి్థగా టీడీపీ నుంచి పోటీచేస్తోన్న గంటి హరీ‹Ùమాధుర్‌కు రాజకీయాలపై పెద్దగా అవగహన లేకపోవడం మైనస్. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వర్గవైషమ్యాలు హరీ‹Ùకు ప్రతికూలంగా ఉన్నాయి.మండపేటలో వేగుళ్ల ఎదురీతమండపేటలో ఈ సారి వైఎస్సార్సీపీ దెబ్బకు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోకవర్గంలో తొలిసారి టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బరిలోకి దిగారు. సొంత సామాజికవర్గంతోపాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి టీడీపీని కాదని కలిసి వస్తుండటం సానుకూలంగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. వేణుకు ‘వరమే’మృదు స్వభావి, నీటి పారుదల ఇంజనీర్‌గా రైతులకు చేసిన సేవలు పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యరి్థ, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావును గెలుపు తీరానికి చేరుస్తున్నాయి. వివాదరహితుడు, విద్యావంతుడు, జడ్పీ చైర్మన్‌గా ఈ ప్రాంతాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర, స్థానికుడు కావడం తదితర అంశాలు గెలుపునకు సానుకూలంగా మారాయి. ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికేతరుడు కావడం మైనస్‌గా ఉంది. పొత్తు సమన్వయం లేకపోవడం, ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో గిడ్డికి ఎదురుగాలి వీస్తోంది.రాజమండ్రి సిటీలో సీటు చిరిగిపోయినట్లే రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎదురీదుతోంది. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను గెలుపు బాటలో పయనింపచేస్తున్నాయి. కళ్లెదుట కనిపిస్తున్న సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన నగర సుందరీకరణ భరత్‌కు సానుకూలంగా మారింది. నగరంలో దశాబ్దన్నర కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న ప్రత్యరి్థ, టీడీపీ అభ్యరి్థగా ఆదిరెడ్డి వాసుపై నెలకొన్న అసంతృప్తే అతనికి మైనస్‌గా మారింది. తల్లి నగరపాలక సంస్థ మేయర్‌గా, భార్య భవానీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నగరాభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడంతో వాసుకు ప్రతికూలంగా మారింది. -
Memantha Siddham: ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. కొనసాగుతున్న సీఎం జగన్ ప్రభంజనం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పల్లె పల్లెలో జన గోదారి..సీఎం జగన్‌కు జేజేలు (ఫొటోలు)
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన కోనసీమ (ఫొటోలు)
-
గోదావరి తీరం.. జననేత కోసం పోటెత్తిన జనం (ఫొటోలు)
-
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్‌గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్‌గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ బాహాటంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన బాబు స్వపక్ష నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. దీనికి తోడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది. ఆది నుంచీ ఉన్న వారికి భంగపాటు తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిడదవోలులో ‘సోషల్’ వార్ నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, టీడీపీ నేత కుందుల సత్యనారాయణలు సీటు కోసం నువ్వా నేనా? అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు. అధినేత ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో వార్‌కు దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా నాయకుడే ఎమ్మెల్యే అవుతాడని ఇరు వర్గాలూ పోస్టులు పెడుతూండటంతో ద్వితీయ స్థాయి నాయకులు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తనకే కేటాయించాలని టీడీపీ అధిష్టానానికి కుందుల సత్యనారాయణ భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నుంచి మరో ముగ్గురు బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో పాటు తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తుండగా.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ సైతం రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని, తామే పోటీ చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పడటం లేదు. గోపాలపురం.. గందరగోళం గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఆది నుంచీ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. కనీస సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని బాబు ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాల అగ్గి మరింతగా రాజుకుంది. అప్పటి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద బలప్రదర్శనకు దిగుతున్నారు. కొవ్వూరులో ఎస్సీలకు అవమానం ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కొవ్వూరులో ఆ సామాజిక వర్గాలకు ఘోర అవమానం ఎదురవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి, తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబుకు అందలం వేయడం.. జవహర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కొవ్వూరు అభ్యర్థిత్వం తనదేనంటూ చెప్పుకుంటూండటంతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. రాజానగరం.. గరంగరం రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే సీటు తనకే వరిస్తుందని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధిష్టానానికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఇచ్చారని.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో అగ్గి రాజేస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, జనసేనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరోవైపు బొడ్డు వెంకట రమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గం ఇప్పటికే పార్టీ అధినేతపై గరంగరంగా ఉంది. ఒకవేళ టీడీపీకే ఈ సీటు కేటాయించినా ఇటు పెందుర్తి వర్గం, అటు జనసేన శ్రేణులు వెంకట రమణ చౌదరికి జెల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని జనసేనకే కేటాయించినా ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం రూరల్‌లో తేలని పంచాయితీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ – జనసేన మధ్య నెలకొన్న పంచాయితీ నేటికీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూండగా.. తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఇతరులెవరికైనా ఉందా? తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. -
మద్దిపాటి వర్సెస్ ముళ్ళపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరావు వర్గాల మధ్య ముసలం
-
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గ విభేదాలు
-
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్‌కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్‌కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం. -
జనం.. జైత్రయాత్ర
రాష్ట్రంలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ పాలనలో తాము సాధించిన సాధికారతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అవహేళన చేసి కించపరిస్తే.. జగన్ వారందరినీ చేయిపట్టి అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఎన్నడూలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. బడుగులకు లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి బాటలు వేశారు. పదవుల్లోనూ అధిక ప్రాధాన్యమిచ్చిన ఏకైక సీఎం జగన్’ అని వివరించారు. నందిగామ (పెనుగంచిప్రోలు): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి. జై జగన్.. జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పట్టణంలోని గాంధీ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలి వచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు, నేతలు పిలుపునివ్వటంతో ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. జగనన్న పాలనలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్నమాటలను ఎవరూ మరచి పోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు. సామాజిక సాధికారత విధానంగా...: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా కాకుండా విధానంగా అమలు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా మోసం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే ఈ వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్లోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. శాసనçÜభలో, శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం రూ.2,650 కోట్లు కేటాయిస్తే, సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలోనే రూ.23,175 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి..: జోగి అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తిగా, పూలే ఆలోచనలను జోడించి సీఎం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సామాజిక న్యాయం ఒక్క జగన్ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆనక కనకమేడల రవీంద్రకు కేటాయించటం బడుగు, బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న వైఖరి అర్ధమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో అందరూ జగన్‌కు మద్దతు పలకాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్‌కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్‌ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
అభయమిచ్చారు.. ఆదుకున్నారు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు గ్రామంలో జక్కంపూడి గణేశ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి న సీఎం వైఎస్ జగన్‌కు పలువురు తమ సమస్యలు తెలియజేశారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశించిన మూడు గంటల్లోనే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొత్తం ఆరుగురు అర్జీదారులకు రూ.5.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ మాధవీలత అందించారు. ధవళేశ్వరానికి చెందిన ఆర్జీ బాలకృష్ణ డిసెంబర్లో మలేసియాలో జరిగే వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు వెళ్లేందుకు ప్రయాణఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షల చెక్కు అందజేసినట్లు తెలిపారు. అలాగే వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అన్నవరానికి చెందిన పెయ్యాల బాబురావుకు రూ.లక్ష, రాపాక వెంకట సూర్యనారాయణకు రూ.25 వేలు, వాడపల్లికి చెందిన దాకే చంద్ర ఫణికుమార్కి రూ.లక్ష, పోతవరానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్‌కు రూ.25 వేలు చెక్కు అందజేశామన్నారు. తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పెనుగొండకు చెందిన కె.లక్ష్మీకుమారికి రూ.50 వేలు చెక్కు అందజేయడంతో పాటు ఉద్యోగం కోసం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు తెలిపారు. పోతవరానికి చెందిన తోట ఇంద్రకుమారి ఇంటి స్థలం పట్టా కోసం సీఎంను కలిశారని.. ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10:15 గంటలకు తాడెపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. రాజానగరం మండలం దివాన్‌చెరువు డి.బి.వి.రాజు లే-అవుట్లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అనంతరం తాడెపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదీ చదవండి: ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర