emergency meeting
-
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
గాజా సంక్షోభం.. ఇస్లామిక్ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్
జెద్దా: ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో.. అత్యవసరంగా భేటీ కావాలని ఇస్లామిక్ దేశాలకుThe Organisation of Islamic Cooperation పిలుపు వెళ్లింది. ఇస్లామిక్ సదస్సుకు ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియాలోనే బుధవారం(అక్టోబర్ 18వ తేదీన) ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో.. ఈ భేటీని అత్యవసర అసాధారణ సమావేశంగా అభివర్ణించాయి జెడ్డా వర్గాలు. గాజా సంక్షోభం ప్రధానంగా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చర్చించనుంది. ఇజ్రాయెల్ బలగాల మోహరింపు ఎక్కువవుతుండడం.. గాజా అమాయకుల ప్రాణాల రక్షణపైనా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఐసీ.. ఐక్యరాజ్య సమితి తర్వాత రెండో అతిపెద్ద సంస్థ. నాలుగు ఖండాల్లో.. 57 దేశాలకు OICలో సభ్యత్వం ఉంది. ఇస్లాం ప్రపంచ సంయుక్త గళంగా తనను తాను అభివర్ణించుకుంటుంది OIC. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలను సాధారణీకరించడం కోసం చర్చలను నిలిపివేసిన రోజునే.. OIC అత్యవసర సమావేశ పిలుపు రావడం గమనార్హం. -
కామారెడ్డిలో నేడు రైతు జేఏసీ అత్యవసర సమావేశం
-
ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్‌ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. (చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు) -
వచ్చే 8న కిర్లోస్కర్ బ్రదర్స్ ఈజీఎం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) డిసెంబర్ 8న వాటాదారుల అత్యవసర సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. వెలుపలి సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా వాటాదారులకు సూచించింది. కంపెనీలో ఉమ్మడిగా 24.92 శాతం వాటా కలిగిన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అతుల్ కిర్లోస్కర్, రాహుల్ కిర్లోస్కర్ డిమాండుమేరకు ఈజీఎంను చేపట్టినట్లు తెలియజేసింది. కిర్లోస్కర్ సోదరుల మధ్య వివాదాలు తలెత్తడంతో కేబీఎల్ చైర్మన్, ఎండీ సంజయ్ కిర్లోస్కర్ ఒకవైపు, అతుల్, రాహుల్ మరోవైపు చేరారు. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలన్న డిమాండుపై ఈజీఎంను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆరేళ్లలో న్యాయ, వృత్తిపరమైన కన్సల్టెన్సీ చార్జీలకు సంబంధించి కంపెనీ చేసిన వ్యయాలపై పరిశోధన చేపట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ ఎంపికను కోరుతున్నట్లు వివరించింది. కాగా.. బోర్డు ఈ ప్రతిపాదనలను సమర్థించడంలేదని కేబీఎల్ పేర్కొంది. బోర్డు, డైరెక్టర్ల స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని వాదిస్తోంది. -
పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్!
ఉక్రెయిన్‌లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్‌లో ఇలా జరగడం మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉంది. ఇక.. పోలాండ్‌లో మిస్సైల్ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. President Biden on Missile Strike in Poland: "I'm going to make sure we figure out exactly what happened...and then we're going to collectively determine our next step as we investigate and proceed." pic.twitter.com/pY55Feq66m — CSPAN (@cspan) November 16, 2022 -
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040-21111111, 040-29555500 వాగులో ప్రాణాలు అరచేతపట్టుకుని కామారెడ్డి జిల్లాలోని శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని స్థానికులు,పోలీసుల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టుపైనే ఉండి సాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనస్థలానికి పంపించారు. తాడు సాయంతో వారు బాధితులను ఒడ్డుకు చేర్చారు. దీంతో కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. స్థానికులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డుకు చేరిన అనంతరం బాధితులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. -
మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం
జెనీవా: మంకీపాక్స్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్ 23న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..."మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోంది. అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచాలని నిర్ణయించాను. ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేస్తున్నాను" అని చెప్పారు. (చదవండి: ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...) -
తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల అత్యవసర సమావేశం
-
నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్‌ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్‌లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్‌కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్ లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది. పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్‌వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు. తీరప్రాంత స్వాధీనం ఉక్రెయిన్ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్ సముద్రంలోని బెర్డిన్స్క్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంతన లేని గణాంకాలు యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి. అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్‌వర్క్‌లో బ్లాక్ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్‌లో తమ స్టార్లింగ్ ఇంటర్నెట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ఐరాస అత్యవసర భేటీ! ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే. రష్యా విమానాలపై ఈయూ నిషేధం రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. -
ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం
-
పెరుగుతున్న కేసులు.. మంత్రి అత్యవసర సమావేశం
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే.. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులను నేరుగా ఇంటి వద్దకే అందించాలని మంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. (సూర్యాపేటలో కరోనా కలకలం) కరోనా పాజిటివ్ సోకిన వారిని తక్షణమే క్వారంటైన్‌కు తరలించాలని అధికారులను మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలన్నారు. లాక్డౌన్ అమలు మరింత కట్టుదిట్టం కానున్న నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ రూపొందించిన యాప్ ద్వారా సరుకులు, కూరగాయలు పొందాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రజల సహకారం ఉంటే కరోనా వైరస్ అదుపులోకి వస్తుందని.. ఎవరైనా కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయినవారు ఉంటే స్వచ్ఛందంగా అధికారులను సంప్రదించాలని మంత్రి జగదీష్‌రెడ్డి కోరారు. -
‘మా’ అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను?
‘‘ఆదివారం జరిగిన ‘మా’ ఫ్రెండ్లీ అసోసియేషన్ మీటింగ్‌కి మీరు ఎందుకు రాలేదు? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. దానికి అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘25ఏళ్లలో ఎప్పుడూ ‘ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్’ జరగలేదు. 25 రోజుల కిందట నేను షూటింగ్లో ఉండగా ‘ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నాం.. మీరు రావాలి’ అంటూ నాకు ఓ లెటర్ వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా జనరల్ బాడీని ఆహ్వానించాల్సిన బాధ్యత నాకే ఉంది. కొత్త కమిటీ ఎంపికై 6 నెలలు కూడా కాకముందే ఈ జనరల్ బాడీ ఎందుకు జరుగుతోంది? అవసరం ఉందా? పైగా, నేను పిలవాల్సినదాన్ని ఎవరో పిలిచారు కాబట్టి దానికి నేను వెళ్లడం సబబు కాదని కొందరు పెద్దలు నాకు చెప్పారు. రెండు మూడు రోజుల తర్వాత ఇది ఫ్రెండ్లీ సమావేశమని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా నేను హాజరు కావాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఓ సినిమాలో 30మంది ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ కోసం ఆదివారం నేను డేట్స్ ఇచ్చాను కాబట్టి షూటింగ్లో ఉన్నా. జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందని మళ్లీ ఓ సర్క్యులర్ వచ్చింది. ఈ సమావేశానికి నేను అడ్డుపడుతున్నానంటూ రాశారు. ‘మా’ కార్యక్రమాలకు అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను? ఇది ఏ సమావేశమో తెలియకుండా నేను వెళితే అక్కడ జరిగే పరిణామాలకు నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పనికిరాని ఓ సమావేశం అంటూ ఈసీ మెంబర్ పృథ్వీగారు కూడా పేర్కొన్నారు.. ఇందుకు ఆయన్ని నేను తప్పుబట్టడం లేదు. కొందరేమో ఇది ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు.. అక్కడి ‘మా’ ఫ్లెక్సీల్లోనేమో సర్వసభ్య సమావేశం అని ఉంది. ఫ్రెండ్లీ సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయవాది ‘మా’ బైలాస్ మార్చాలి, పనికిరాని పాయింట్లు ఉన్నాయని చెప్పడం బాధగా అనిపించింది. పైగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలంటే 20శాతం సభ్యులు ఆమోదించాలని ప్రింటెడ్ కాపీలతో వచ్చారంటే ఇది ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చించి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. రూ.2 కోట్లతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నాం. 30లక్షలు బ్యాంకులో ఉంది, మరో 1.70కోట్లు బ్యాంకుకు రానుంది.. వేడుకకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందుకు రండి.. ‘మా’ సంస్థ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. ఇవి ఆగిపోయేలా ఎందుకు ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్.. మా ఫ్రెండ్లీ మీటింగ్‌గా ఎందుకు టర్న్ అయ్యిందో మాకు తెలియడం లేదు’’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. -
హూజూర్‌నగర్ ఉపఎన్నికలు సీపీఐ అత్యవసర సమావేశం
-
రసవత్తరం కర్ణాటకం..
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి. సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు. మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ. కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్‌ప్లాన్‌లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు. రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం.. ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ! 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు -
వైఎస్సార్ సీపీ నేతల కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని జరుగుతున్న సమావేశానికి అందుబాటులో ఉన్న నాయకులు హాజరయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్‌జగన్‌పై హత్యాయత్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరు తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కె. పార్థసారధి, వరప్రసాద్, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, పార్థసారధి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. -
నేడు మంత్రివర్గం అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులందరూ బుధవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనానికి రావాలని సీఎం కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఆదేశాలు వెళ్లాయి. మధ్యాహ్నం మంత్రులతో కలసి సీఎం భోజనం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు వారితో సమావేశమవుతారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మంత్రులతో సీఎం భేటీపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని, సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో సమావేశంపై శ్రేణుల్లో పలు రకాల ఊహాగానాలున్నాయి. అయితే శాసనసభ రద్దు వంటి తీవ్ర నిర్ణయాలేమీ ఉండవని, ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితులేమీ లేవని సీఎం సన్నిహితులు స్పష్టంగా చెబుతున్నారు. రాజకీయ అంశాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై భేటీలో లోతుగా చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రగతి నివేదన సభ, ఎన్నికలపై.. కొంగర కలాన్ ప్రాంతంలో సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు 10 రోజులే గడువు ఉన్నందున అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో చర్చించే అవకాశముందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సభ నిర్వహించడం సాధ్యమా, నిర్వహించాల్సి వస్తే ఏర్పాట్లు, బాధ్యతలు, పని విభజన, వీలు కాకుంటే వాయిదా నిర్ణయంపైనా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వస్తే మంచిదా, విడివిడిగా వస్తే టీఆర్ఎస్కు లాభమా, లోక్‌సభతో పాటు జరిగితే ప్రయోజనమా, వాటి కోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రుల అభిప్రాయాలు అడగనున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండటానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ జరగనుంది. అధికారులతో ఎన్నికల టీంపై.. రాష్ట్ర స్థాయిలో పలు శాఖల హెచ్‌వోడీల నియామకాలు, మార్పులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగులు, కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలకు స్థానచలనం జరిగే అవకాశముందని తెలుస్తోంది. అధికారులతో ఎన్నికల టీమ్ సిద్ధం చేసుకోడానికి జిల్లాల వారీగా మంత్రుల అభిప్రాయాలు సీఎం అడగనున్నారని సమాచారం. అలాగే చాలా కాలంగా పెండింగులో ఉన్న ఉద్యోగుల పీఆర్ఎసీపై అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చ జరగనుంది. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు, మార్కెట్ కమిటీల భర్తీపైనా మంత్రుల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. మంత్రులు, ప్రముఖులకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు, రాష్ట్రాభివృద్ధి నిధులపై చర్చించే అవకాశముంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల పొత్తులు, కాంగ్రెస్‌తో టీడీపీ చెలిమి, ప్రభుత్వ పథకాలు, అమలు తీరు, ప్రజల అభిప్రాయంపైనా మంత్రుల అభిప్రాయాలు సీఎం అడిగి తెలుసుకోనున్నారు. -
యూపీలో వర్షాలకు 58 మంది బలి
లక్నో: భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఒక్కరోజే 31 మంది మృతిచెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 58 మందికి పెరిగింది. సహరాన్‌పూర్‌లో 11 మంది, మీరట్‌లో 10 మంది మరణించారు. మీరట్‌లో 23 సెం.మీల వర్షపాతం నమోదైంది. శారద, గాగ్రా నదులు ప్రమాదకర స్థాయిల్లో ప్రవహిస్తున్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్ తెలిపింది. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, అందులో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఇద్దరు యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయారు. వందల్లో వరద మృతులు.. ప్రస్తుత రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఆరు రాష్ట్రాల్లో 537 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ అత్యవసర ప్రతిస్పందనా కేంద్రం(ఎన్ఈఆర్సీ) తెలిపింది. మహారాష్ట్రలో గరిష్టంగా 139 మంది మృతిచెందగా, కేరళలో 126 మంది, పశ్చిమ బెంగాల్లో 116 మంది, ఉత్తరప్రదేశ్‌లో 70 మంది, గుజరాత్లో 52 మంది, అసోంలో 34 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 26 జిల్లాలు, పశ్చిమబెంగాల్లో 22 జిల్లాలు, అసోంలో 21 జిల్లాలు, కేరళలో 14 జిల్లాలు, గుజరాత్లో 10 జిల్లాలు వరదలకు గురయ్యాయి. అసోంలో సుమారు 2.17 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. యమున వరదలపై అత్యవసర భేటీ యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించారు. హాత్ని కుంద్ బ్రిడ్జ్ నుంచి హరియాణా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఆదివారం ఆ నీరు ఢిల్లీకి చేరుకునే అవకాశాలున్నాయి. -
బ్రిటన్ రాణికి, రాజుకు ఏమైంది?
లండన్: బ్రిటన్ రాణి, రాజు అధికారిక భవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ ఉద్యోగులతో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశం కలకలం రేపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ పిలిప్ ఆరోగ్యంపై ఊహాగానాలు బయలుదేరాయి. వారికేమైనా అయిందా అనే ఆందోళనలు బయలుదేరాయి. చాలామంది ప్యాలెస్‌పై జెండా వైపు కూడా చూశారు. సాధారణంగా ప్యాలెస్‌లో ఎవరైనా చనిపోవడంలాంటి సంఘటనలు జరిగితే జెండాను అవనతం చేసి ఎగురవేస్తారని, అలాంటిదేమైనా జరిగిందేమోనని జెండావైపు చూసి నెమ్మదించారు. అయితే, ఈ సమావేశం ఎప్పటి మాదిరిగానే జరిగే సమావేశమేనని, రాజు, రాణి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. తాజాగా రాయల్ స్టాఫ్ ఆఫీసర్లు, లార్డ్ చాంబర్లెయిన్, ఎలిజెబెత్ ప్రైవేట్ సెక్రటరీ క్రిస్టోఫర్ గైట్ ఏర్పాటుచేశారని, అందుకే ఈ అత్యవసర సమావేశం జరిగిందే తప్ప ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. బ్రిటన్ రాణి ఎలిజెబెత్‌కు 91 ఏళ్లుకాగా.. ప్రిన్స్ ఫిలిప్ వచ్చే నెలలో 96లోకి అడుగుపెట్టనున్నారు. -
భద్రతామండలి అత్యవసర సమావేశం
న్యూయార్క్: సిరియాలో అంశంపై చర్చించేందుకు నేడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం అత్యవసర సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో సిరియాలోని అలెప్పో నగరంలో జరుగుతున్న వైమానిక దాడులను నిలిపివేసే విషయంపై చర్చించనున్నారు. అమెరికా, రష్యా జరుపుతున్న వైమానికదాడుల్లో అలెప్పో తీవ్రంగా ప్రభావితమౌతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర అలెప్పో నగరంలో ఉన్న ఘర్షన వాతావరణాన్ని తొలగించాలని శుక్రవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలెప్పోలో కేవలం 900 మందిని లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడుల్లో 2,75,000 మంది ప్రభావితమౌతున్నారని.. సిటీని ఈ విధంగా ధ్వంసం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇవాళ్టి సమావేశంలో వైమానిక దాడులను ఆపేయాలనే ముసాయిదా తీర్మాణాన్ని ప్రవేశపెడతారని భావిస్తున్నా.. ఈ ప్రతిపాదనను రష్యా అంగీకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. -
మన దేశం పరిస్థితి ఏమవుతుంది?
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం వల్ల తమ దేశంపై పడే ఆర్థిక ప్రభావం గురించి చర్చించేందుకు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద బ్రెగ్జిట్ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. యెన్ ఎలా ఉండబోతోంది, బ్రిటిష్ ప్రాంతంలో ఉన్న జపనీస్ కంపెనీల పరిస్థితి ఏంటో కూడా సమీక్షిస్తారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేయడంతో టోక్యో స్టాక్ ఎక్స్చేంజి దారుణంగా దెబ్బతింది. జపాన్ కంపెనీల ఎగుమతుల మీద కూడా దీనిప్రభావం గట్టిగానే ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే బ్రసెల్స్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని టోక్యో భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అశనిపాతంలా తగిలింది. యూకేలో జపాన్ కంపెనీలు 1300కు పైగా ఉన్నాయి. అమెరికా తర్వాత ఈ దేశమే యూకేతో వాణిజ్యం ఎక్కువగా చేస్తోంది. -
తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం
- ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రైల్వే జీఎం గుప్తా సాక్షి, హైదరాబాద్ః తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు. ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్ టక్కర్, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు భేటీకానున్నారు. తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాపు గర్జన తీవ్ర రూపం దాలుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పంపిస్తున్నారు. -
మళ్లీ పాము కలకలం..
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి పాము కలకలం సృష్టించింది. దీంతో జిల్లా కలెక్టర్ మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాల్లోని 52 శాఖల అధికారులు హాజరయ్యారు. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స గదిలోకి పాము చొరబడింది. దీంతో సిబ్బంది ఆ పామును చంపేసి ఎవరికీ తెలియకుండా కాల్చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కాంతీలాల్‌దండే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యగా మారిన పాములు, ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై అన్ని శాఖల అధికారుల నుంచి సూచనలు తీసుకోనున్నట్టు తెలిసింది. -
సీనియర్ మంత్రులతో మోదీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సీనియర్ మంత్రలుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై ఈ సందర్భంగా చర్చించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు. మరోవైపు పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ సహా మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కాగా పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. వారిలో నలుగురు సాధారణ పౌరులు కాగా, ఇద్దరు పోలీసులు ఉన్నారు. మరో పదిమంది గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.