employeement
-
ట్రంప్ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్ ఏంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరిఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి. ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.- సింహబలుడు హనుమంతు -
8 కోట్ల ఉద్యోగాలపై ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే: ఖర్గే
ఢిల్లీ: దేశంలో గడిచిన నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘ ప్రధాని మోదీ నిన్న(శనివారం) ముంబైలో ఉద్యోగాల కల్పనపై అబద్దాలు చెప్పారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ( ఎన్ఆర్ఏ)పై మీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాను. కోట్ల మంది యువకులు ఎన్ఆర్ఏ ఒక వరం. ఒకే జనరల్ ఎగ్జామ్.. అనేక పరీక్షలను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అభ్యర్థులు సమయం, వనరులను ఆదా చేస్తుంది. .. దీంతో పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ నాలుగు ఏళ్లలో ఎన్ఆర్ఏ ఒక్క పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. దాని నిర్వహణకు కేటాయించిన మొత్తం రూ. 1517 కోట్లకు కేవలం రూ. 58 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు. ఎన్ఆర్ఏ అనేది ఉద్యోగాల నియామకానికి ఏర్పాటు చేశారా?. లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ నిజర్వేషన్లను లాక్కోవడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేస్తున్నారా?’ ’అని మోదీపై ప్రశ్నలు సంధించారు.శనివారం ప్రధాని మోదీ ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొని రిజర్వు బ్యాంక్ రిపోర్టు ప్రకారం 2023-24లో భారత్ 4.7 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొత్తంగా నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి ఉద్యోగాలపై అసత్యాలు ప్రచారం చేసేవారిని మాట్లాడనివ్వకుండా చేసిందని ప్రతిపక్షాలను విమర్శలు చేశారు. పెట్టుబడులు, మౌలిక వనరుల అభివృద్ధి, దేశాభివృద్దిపై అసత్యాలు ప్రచారం చేసే శత్రువులన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. -
‘హెచ్-1బీ వీసా’.. ఆన్లైన్ ఫైలింగ్‌పై కీలక అప్డేట్!
అగ్రరాజ్యం అమెరికా వీసాల పునరుద్దరణ, జారీ వంటి అంశాలపై వరుస ప్రకటనలు చేస్తోంది. కొద్ది రోజుల స్వల్ప వ్యవధిలో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. ఆ తర్వాత హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తాజాగా, ఈ ఏడాది 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అవేంటనేది ఒక్కసారి పరిశీలిస్తే ♦2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్ -1 బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి. ♦ప్రతి ఏటా కేవలం 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది. ♦ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్సీఐఎస్ విభాగం హెచ్-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ♦అక్టోబర్ నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ♦ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ ధరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని యూఎస్సీఐఎస్ అధికారులు సూచిస్తున్నారు. ♦ఈ ఏడాది ప్రత్యేకం హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అందులో మోసాలకు చెక్‌పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా అప్లికేషన్‌ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్‌కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు. ♦ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. ♦ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్‌ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. చదవండి👉 ‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన! -
‘మీలో స్కిల్స్ ఉన్నాయా’.. కొత్త ఏడాది దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు!
చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తూ మరో సంస్థలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీకో శుభవార్త!. మార్కెట్లో పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌కు చెందిన టెక్నాలజీ,మార్కెటింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, రిక్రూట్మెంట్ కంపెనీ ‘మ్యాన్‌పవర్ గ్రూప్’ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వేని విడుదల చేసింది. ఆ సర్వేలో సుమారు 3,100కి పైగా రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 37శాతం నియామకాలు జనవరి - మార్చి 2024 సమయానికి ఆయా కంపెనీలు ఎంత మంది ఉద్యోగుల్ని తొలగించనున్నాయి. ఎంతమందిని నియమించుకోనున్నాయనే విషయంపై ఆరా తీసింది. ఈ సర్వేలో 37 శాతం మేర కంపెనీలో ఉద్యోగుల్ని హైయర్ చేసుకోనున్నాయి. గత ఏడాది పోలిస్తే నియమాకం 5 శాతం ఎక్కువగా ఉంది. సర్వే ప్రకారం... 37 శాతంతో భారత్, నెదర్లాండ్‌లు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో 35 శాతంతో కోస్టారికా- అమెరికా, 34 శాతంతో మెక్సికో 3వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా సగటున 26 శాతం మంది మాత్రమే ఉపాధి పొందనున్నారు. ఈ రంగాల్లో నియామకాల జోరు ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నియామకాల జోరు కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ విభాగాలున్నాయి. ఐటీ కంపెనీలు 44 శాతం, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో 45 శాతం హైయర్ చేసుకోనుండగా కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ రంగంలో 42 శాతం, ఎనర్జీ, యుటిలిటీస్‌లో 28 శాతం జరగనున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. టాలెంట్ గుర్తించ లేక జపాన్‌లో 85 శాతం కంపెనీలు ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవసరమయ్యే నిపుణుల్ని గుర్తించడంలో విఫలమైనట్లు మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే హైలెట్ చేసింది. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్ 82 శాతం, భారత్ 81 శాతంతో కొనసాగుతున్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగాలకు భారీ డిమాండ్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్, ఆటోమొటీవ్ విభాగాలు ఉండగా.. వాటి తర్వాతి స్థానంలో ఐటీ విభాగం ఉంది. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించి వారిని ఆకట్టుకునేలా జీతాలు పెంచుతూ వారితో పనిచేయించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటి అండ్ డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్,హెచ్‌ఆర్‌లలో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ రంగాల్లో స్కిల్ ఉంటే జాబ్ త్వరగా సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అదిగో యువభారత్
‘దేనికీ వెరువని ధైర్యసాహసాలు, ముక్కుసూటితనంతో దూసుకుపోయే యువతే ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు!’ – స్వామి వివేకానంద యూఎన్ఎఫ్పీఏ.. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం (ఆ నివేదిక విడుదలయిన నాటికి) మన దేశ జనాభా.. 142.86 కోట్లు. 142.57 కోట్ల జనాభాతో ఉన్న చైనాను దాటేసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా పాపులేషన్ లిస్ట్‌లో ముందున్నాం. ప్రపంచమంతటా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉంటే.. అది ఒక్క మన దగ్గరే 68 శాతం ఉంది. ఈ జనాభాను ప్రపంచం.. వర్కింగ్ పాపులేషన్ అంటోంది. అంటే శక్తియుక్తులున్న మానవ వనరుల సమూహం.. మనకు అనుకూలమైన అంశం. ప్రపంచంలోకెల్లా అధిక జనాభా గల దేశంగానే కాదు.. అత్యధిక యువత ఉన్న దేశంగానూ ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే స్వామి వివేకానంద కోరుకున్న లక్షణాలతో ఉన్న యువతరం అన్నమాట. అడ్డూ అదుపూ లేని జనాభాతో వనరులను హరిస్తూ.. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని అభివృద్ధి చెందిన దేశాలు ఆగ్రహపడినా.. వెంటనే అసూయపడేలా చేస్తోంది ఈ యువతే. ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్‌గానే కాదు.. ప్రపంచ ఉత్పాదక రంగానికి అవసరమైన అద్భుత మానవ వనరులకూ మన నేలను కేంద్రంగా మలుస్తోంది. ఈ మనుషుల ఎడారిలో కనిపిస్తున్న ఆ ఒయాసిస్సే ఈ దేశం శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాన్నీ కల్పిస్తోంది. జపాన్‌తోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనాభా.. అందులో యువత తక్కువగా ఉండడంతో తీవ్రమైన వర్క్‌ఫోర్స్‌ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఆయా దేశాల ఉత్పాదక రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఆ క్రమంలోనే 68 శాతం వర్కింగ్ పాపులేషన్‌తో మనం చాలా రిచ్‌గా ఉన్నాం.. అనే భావనలోనే కాదు.. ఆ దిశగా కృషిచేస్తే ప్రాక్టికల్‌గానూ ధనికదేశంగా మారగలం. ప్రపంచ మార్కెట్‌ని శాసించగలం. ఈ విషయంలో చైనానూ అధిగమించగలం. సవాళ్లు దేశ ఆర్థికాభివృద్ధికి యువతను ప్రధానవనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కానీ కార్యాచరణలో అదంత ఈజీ కాదు. ఆ లక్ష్యం చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలూ లేవు. ఏ జనాభాలోంచి వర్కింగ్ పాపులేషన్‌ను చూసి మురిసిపోతున్నామో.. ఆ వర్కింగ్ పాపులేషన్లోనే ఏ ఉపాధిమార్గంలేని వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం.. 2022 నాటికి మన దగ్గరున్న నిరుద్యోగిత 23.22 శాతం. 2018లో ఇది 4.9 శాతమే. ఈ పెరుగుదలకు కరోనా పరిస్థితులూ ఒక కారణం. పాండమిక్‌లో కోటీ తొంభైలక్షల యువత ఉద్యోగాలను కోల్పోయిందని కొన్ని సర్వేల సారాంశం. పని ఉన్నవారు కూడా చదువుకు సరిపడా కొలువులు దొరకక దొరికిన కొలువుల్లో తక్కువ వేతనాలతో సర్దుకోవాల్సిన పరిస్థితి. ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్ఐఈ) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే (2022) ప్రకారం ..ఈ నిరుద్యోగ పర్వంలో హరియాణ 37. 4 శాతం, రాజస్థాన్ 28.5 శాతం, ఢిల్లీ 20.8 శాతం పెరుగుదలతో మొదటి మూడు స్థానాల్లో తలవంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతం, తెలంగాణలో 4.1 శాతం పెరిగింది. ఉపాధి కల్పన లేమి.. పట్టణాలు, నగరాల్లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాల్లో మళ్లీ అధిక జనాభాదే మొదటి స్థానం. మిగతా కారణాల్లో.. అక్షరాస్యత.. ఉపాధి కల్పనల మధ్య అసమాన నిష్పత్తి, వ్యవసాయాధారిత పరిశ్రమలు తగినంతగా లేకపోవడం.. వ్యవసాయం నుంచి వలసలు (ఈ రెండిటినీ పరిగణించాలి), కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినడం, ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట్ల.. ఆ కుటుంబంలో ఒకరే వారసత్వ వ్యాపారాన్ని నిర్వహిస్తూండడం.. మిగిలిన వాళ్లకు పనిలేకపోవడం, కుటుంబ బాంధవ్యాలకు లోబడి కార్మికులు, శ్రామికులు స్వస్థలం వదిలి వెళ్లలేకపోవడం వంటివాటితోపాటు మార్కెట్ డిమాండ్‌కి అనుగుణమైన నైపుణ్య శిక్షణ లేకపోవడమూ కనిపిస్తున్నాయి. నైన్ టు ఫైవ్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యువత ప్రధాన వనరుగా ఉపయోగపడకపోవడానికి ఆ తరం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన అడ్డంకులను చూపిస్తున్నారు నిపుణులు. మొదటిది.. కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు కావల్సిన సాఫ్ట్ స్కిల్స్ వారిలో లేకపోవడం. రెండవది.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కావల్సిన మెళవకువలూ కరువవడం. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండూ ఉన్న యువతకూ తగినంత ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా కుటుంబపరమైన మద్దతు లభించడం లేదు. సొంతంగా వ్యాపారం చేద్దామనే యువత ఆశయం, ఉత్సాహం మీద సొంత కుటుంబాలే నీళ్లు చల్లుతున్నాయి.. కెరీర్‌తో తమ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడకుండా నెలనెలా వేతనంతో భద్రమైన జీవితాన్ని గడపాలనే కోరికతో! ప్రయోగాలకు పోయి పిల్లలు నష్టాలను తెస్తే నెత్తికెత్తుకునే ఆర్థిక సామర్థ్యం.. వాళ్లకు అండగా నిలబడే నైతిక స్థయిర్యం లేకపోవడమే ఆ వెనుకడుగుకు కారణం కావచ్చు. అందుకే పిల్లల ఉత్సాహం కన్నా భరోసానిచ్చే ఆర్థిక భవిష్యత్ పట్లే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ జీతపు ఉద్యోగాల దిశగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే నైన్ టు ఫైవ్ జాబులే సర్వస్వం కాదనే సత్యాన్ని గ్రహించాలి. అలాగని ఇలా వ్యాపారం పెట్టగానే అలా కోట్లలో లాభాలు వచ్చిపడతాయి.. అవి తిరిగి పెట్టుబడులుగా మారి.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే నమ్మకాన్ని ఎవరూ ఇవ్వలేరు. కానీ ప్రయత్నం జరగాలి. ఈ రోజు యువత ఆ ధైర్యం చేయలేకపోతే రేపటి యువతకు ఎక్కడి నుంచి ప్రేరణ అందుతుంది? నేడు విజయపథంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటియం, ఓలా వగైరా సంస్థలు నిన్న ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టినవే. ఒడిదుడుకులు తెలిసి.. తట్టుకునే మెకానిజమూ అర్థమై నేడు మార్కెట్లో తమ సేవలకు డిమాండ్ కల్పించుకుంటున్నవే! అందుకే దిగితేకానీ లోతు అంతుబట్టదు. ఐడియాలను కార్యాచరణలో పెడితే కానీ సక్సెస్ చేతికి చిక్కదు. గ్లోబలైజేషన్ తర్వాత రోజ్‌గార్ బజార్ రూపురేఖలు మారిపోయాయి. సర్కారు కొలువుల పరిధి తగ్గుతూ వస్తోందా.. ప్రైవేట్ జాబ్స్ విస్తృతమవుతున్నాయా అనేది తెలియదు కానీ పెను మార్పయితే స్పష్టమయింది. తదనుగుణంగానే యువత అడుగులూ అనివార్యం అయ్యాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా తప్పనిసరి అయిందో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార దక్షత కూడా అంతే తప్పనిసరి అవుతోంది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అందరూ నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కోసమే దరఖాస్తు చేసుకుంటే వాటిని సృష్టించే సంస్థలు ఉండొద్దూ? ఆ సంస్థలను నడిపే వ్యాపారవేత్తలు.. పారిశ్రామిక గణం రావద్దూ? ఆ చొరవ తీసుకోవడానికి.. చూపడానికి కావల్సిన శక్తియుక్తులున్న యువత మన దగ్గరే ఉంది. వారికి కావల్సింది ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక ఆలంబన.. కుటుంబం నుంచి కాసింత నమ్మకం! ఆ రెండూ ఇస్తే ఐడియాలతో స్టార్టప్‌లను పండిస్తూ వాప్యార దక్షతను పెంపొందించుకుంటుంది. బడా పారిశామికవేత్తల పెట్టుబడులను రాబట్టుకుంటుంది. వేలసంఖ్యలో కొత్త కొలువులను సృష్టిస్తుంది. ఆశాకిరణాలు.. నికరంగా వేతనాలు అందే ఉద్యోగాలే చేయాలనే తల్లిదండ్రుల ఒత్తిడినీ, పెట్టుబడుల కొరతనూ లెక్కచేయక ముందడుగు వేస్తున్న యువతా ఉన్నారు. కాబట్టే మన దగ్గర స్టార్టప్ కల్చర్ దినదిన ప్రవర్థమానమవుతోంది. ఎంతోమంది యంగ్ అంట్రప్రెన్యూర్స్ని సృష్టిస్తోంది. ఇందుకు ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ చక్కటి ఉదాహరణ. 2013లో.. అంటే తన పందొమ్మిదో ఏట .. ‘ఓయో రూమ్స్’ ప్రారంభించాడు. సరసమైన ధరలో.. సౌకర్యవంతమైన ఒక బసను వెదకడంలో విఫలమైన ఫ్రస్ట్రేషన్‌తో అతను ఈ కంపెనీని స్థాపించాడు. ఈ రోజు ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా పేరుపొందాడు. ఫోర్బ్స్ – 30 అండర్ 30 లిస్ట్ ఫర్ ఆసియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ వరుసలోనే లాజిస్టిక్ స్టార్టప్ ‘పోర్టర్’ ఫౌండర్ ప్రణవ్ గోయెల్నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్టప్ 500 సభ్యుల టీమ్‌గా..సిఖోయా కాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్స్‌తో వంద మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో విరాజిల్లుతోంది. లెన్స్‌కార్ట్ గురించి తెలుసు కదా! దాని ఫౌండర్ పియూష్ భన్సాల్ కూడా యంగ్‌చాప్.. 2010లో ఆ పోర్టల్‌ను స్థాపించినప్పుడు! ఫోర్బ్స్ – 30 అండర్ 30లో ఉన్నాడు. అందరూ అబ్బాయిలేనా.. మరి అమ్మాయిలూ? అనే క్వశ్చన్ మార్క్ ఇమోజీని డిలీట్ చేయండి. అంట్రప్రెన్యూర్స్‌గా అమ్మాయిల సంఖ్యా తక్కువేం లేదు మన దగ్గర. దేశంలోని 58 శాతం మహిళా అంట్రప్రెన్యూర్స్ .. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించారు. వీళ్లంతా తమ తాతల, తండ్రుల వ్యాపారాన్ని నడుపుతున్నవారు కాదు. ఇండిపెండెంట్ అంట్రప్రెన్యూర్స్. వాళ్లలో ‘మెన్స్ట్రుపీడియా’ ఫౌండర్ అదితి గుప్తా.. మోస్ట్ సక్సెస్ఫుల్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలక్ష్మి సురేశ్.. దేశంలోకెల్లా అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా అంట్రప్రెన్యూర్. 2020లో తన ఇరవయ్యొకటో ఏటకల్లా.. ప్రపంచంలోనే యంగెస్ట్ వెబ్ డిజైనర్ కమ్ సీఈఓగా పేరు పొందింది. తన ఎనిమిదవ ఏటనే కోళికోడ్‌లోని తన స్కూల్‌కి వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసింది. శ్రీలక్ష్మి ‘ఎస్ఈఓ’ అనే వెబ్ డిజైన్ కంపెనీని ప్రారంభించేనాటికి ఆమెకు పదేళ్లు. ఒక్క తన స్కూల్‌కే కాదు దేశంలోని ఇతరత్రా వాటికోసం ఆమె ఓ వంద వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేసింది. వీళ్లంతా దేశంలో స్టార్టప్ కల్చర్ వృద్ధికి ఆశాకిరణాలు! మేధో వలస.. దేశానికి యువత.. బలంగా మారకుండా అడ్డంపడుతున్న మరో సవాలు మేధో వలస. తమ ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, జీతభత్యాలు, వాళ్లు కోరుకున్న జీవన ప్రమాణాలు లేక ఎంతోమంది యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. పైగా మన దగ్గర ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. ఈ వలస తాత్కాలిక పరిణామంలాగే కనిపిస్తుంది కానీ మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల నష్టాన్ని చేకూరుస్తోంది. ఈ మేధో వలసల్లో ముఖ్యంగా ఐఐటీయన్లే ఉంటున్నారు. మన ఐఐటీల్లో శిక్షణ పొందిన విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఐఐటీ పట్టభద్రుల పట్ల విదేశీ సంస్థలకు విపరీతమైన క్రేజ్! దాంతో వీళ్లకు ఊహించని రీతిలో వేతనాలిస్తూ తమ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్‌ని కల్పిస్తున్నాయి. వాళ్లు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అందించడానికీ పోటీ పడుతున్నాయి. అందుకే బ్రెయిన్ డ్రెయిన్‌కి బ్రేక్ పడడం లేదు. ఈ వలసలన్నీ ప్రధానంగా అమెరికాకే తరలుతున్నాయి. విదేశాలకు వెళుతున్న ఐఐటియన్లలో 65 శాతం మందికి అమెరికాయే మజిలీ. ప్రపంచంలోని 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ జారీ చేసే హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నది మన ఐఐటీ విద్యార్థులే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్‌కి విదేశాల్లో 540 శాతం ప్లేస్‌మెంట్స్ పెరిగాయంటే మన ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి దాదాపు లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అంచనా. 2014 నుంచి దాదాపు 2300 మంది సంపన్నులు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలే! త్వరిత గతిన మన దేశాన్ని అభివృద్ధి పరచగల ప్రతిభాసామర్థ్యాలే! అందుకే వేగిరంగా ఈ మేధో వలసను ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అమ్మాయిల భాగస్వామ్యం.. ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) సర్వే ప్రకారం.. పదిహేను నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో దాదాపు యాభై శాతం మంది అమ్మాయిలు ఇటు చదువుకోవడమూ లేదు అటు ఉద్యోగాల్లోనూ లేరు. కారణం.. కుటుంబ బాధ్యతలు, పెళ్లి! ఆశ్చర్యపోకండి! ఈ దేశంలో చాలా విషయాల్లో వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నట్లే స్త్రీ సమానత్వం విషయంలోనూ భిన్నమైన వాతావరణం ఉంది. స్త్రీవాద ఉద్యమాలతో చైతన్యం పొందిన ప్రాంతాల్లోనే ఇంకా అసమానతలు కన్పిస్తుంటే అసలు ఆ ఊసే లేని ప్రాంతాల్లో అమ్మాయిల స్థితి ఎలా ఉండొచ్చు! దీనికి సమాధానమే ఆ సర్వే. దాన్నిబట్టే అర్థమవుతోంది వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యం ఎంతో! ఆడపిల్ల ఉద్యోగం చేయాలా? వద్దా? ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఆ మాటకొస్తే చదువు దగ్గర నుంచే ఆ నిర్ణయం మొదలవుతోంది. అయితే అమ్మాయిది కాదు.. కుటుంబానిది. విద్యావంతుల కుటుంబంలోని అమ్మాయిలకు తమకు ఇష్టమైన చదువు చదివే స్వేచ్ఛ దొరికినా.. కెరీర్ విషయానికి వచ్చేసరికి పెళ్లి అనేది దాన్ని సాగనివ్వడంలేదు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇది పెళ్లికాని అమ్మాయికి కూడా అడ్డంకిగానే ఉంది. ‘ఇంకా ఇలాంటి పరిస్థితులున్నాయా విడ్డూరం కాకపోతే అని ముక్కున వేలేసుకునే పనిలేదు. ఇప్పటికీ మనదేశంలో.. అమ్మాయిలకు చదువు, ఉద్యోగం కన్నా పెళ్లే ఆర్థిక భద్రతను, భరోసాను ఇస్తుంది అని భావించే కుటుంబాలే ఎక్కువ’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి. ఇలా పెళ్లి, పిల్లలు అనే బాధ్యత వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని తగ్గిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ విషయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యత్యాసం తగ్గాలి. అవగాహనా కార్యక్రమాలు పెరగాలి. ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సహాయాలు.. దేశంలో ఇప్పుడు అంట్రప్రెన్యూర్ రంగంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణించేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్మెంట్ అండ్ అంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ. ఆ శిక్షణతో యువత అంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగి.. ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది. స్కిల్ ఇండియా మిషన్.. పాతికేళ్లలోపు యువతకు వృత్తి శిక్షణ, పాలిటెక్నిక్, ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్ డెవలప్మెంట్ వంటి కోర్సులను బోధిస్తోంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వగైరాల ద్వారా స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్‌ను చేపడుతోంది. అంట్రప్రెన్యూర్‌షిప్ దిశగా యువతను ప్రోత్సహించడానికి పెట్టుబడుల కోసం ఆర్థిక మద్దతునూ అందిస్తోంది. పన్ను రాయితీలు కల్పిస్తోంది. కొత్త ఇంక్యుబేటర్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఉన్న ఇంక్యుబేటర్ల సామర్థ్యాన్ని పెంచుతోంది. దేశంలోని పట్టణ, నగరాల్లోని యువత కన్నా గ్రామీణ యువతే అంట్రప్రెన్యూర్‌షిప్ పట్ల ఉత్సుకతతో ఉన్నారు. అందుకే ప్రధాన్‌మంత్రి కుశల్ కేంద్రాలు అంట్రప్రెన్యూర్‌షిప్ హబ్స్‌గా మారి ఆసక్తి ఉన్న ట్రైనీలను అంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఐడీబీఐ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఎస్‌ఈటీఐఎస్) వంటి స్థానిక సంస్థలతో కలసి చదువుకున్న యువతకు స్టార్టప్స్‌లో శిక్షణనిస్తోంది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ అంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డ్స్నీ స్థాపించింది. కాలేజ్స్టూడెంట్స్లోని అంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ని వెలికి తీసి వారికి శిక్షణనిస్తోంది. నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేస్తోంది. సృజనాత్మక రంగాల్లో.. ఉన్నత విద్య మీద నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్‌లో ఇంజినీరింగ్ (బీటెక్ అండ్ ఎమ్‌టెక్)లో కోవిడ్ కంటే ముందు అయిదేళ్లలో దాదాపు 6,37,781 అడ్మిషన్లు పడిపోయాయని తేలింది. అదే సమయంలో సృజనాత్మక రంగాలైన ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, డిజైనింగ్, లింగ్విస్టిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంత్సరంలో 53, 213 మంది విద్యార్థులు పలురకాల ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు పొందారు. ఈ వృద్ధి ఆయా రంగాల్లో కొత్త కొలువులు ఏర్పడేందుకు దోహదపడుతోందనేది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల అభిప్రాయం. ‘భారతీయ సినిమా మీద సోషల్ మీడియా, డిజిటలైజేషన్ ప్రభావాన్ని కాదనలేం. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సినిమా ప్రదర్శన గురించి ఏనాడైనా ఊహించామా? ఈ మార్పు ఆయా రంగాల్లో ఎన్నో కొత్తరకాల∙ఉద్యోగాలకు దారితీస్తోంది. వాటిల్లో వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటివి మచ్చుకు కొన్ని. నేటి యువత ఇదివరకటిలా కెరీర్‌కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పట్టుకు వేళ్లాడట్లేదు. సాంకేతిక విప్లవ ప్రపంచంలో ఎలాగైనా బతకగలమనే ధైర్యం వాళ్లకుంది. ఏ ఉద్యోగమైనా తిండి పెడుతుంది అనే భరోసా కలిగింది. అందుకే నచ్చిన ఉద్యోగాలను ఇచ్చే చదువులను ఎంచుకుంటున్నారు. కొందరైతే చదివిన చదువుతో సంబంధం లేకుండా కొత్త కొత్త కొలువులతో ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాన్నానల అంచనాలను సంతృప్తి పరచడమా లేక తమకు నచ్చినట్టు ఉండడమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనే వాళ్లు తీసుకుంటున్నారు. అలాగని పిల్లల ఇష్టాల్ని సపోర్ట్ చేయని తల్లిదండ్రులే అందరూ అని చెప్పడానికీ లేదు. చాలా మంది పెద్దలు కూడా పిల్లల సృజనాత్మకత మీద నమ్మకంతో వాళ్లకు నచ్చిన దారిలో వాళ్లు వెళ్లే స్వతంత్రాన్నిస్తున్నారు. అండగా నిలబెడుతున్నారు. దాంతో సృజనాత్మక రంగాలైన డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటివాటిల్లో నేటి యువత రాణిస్తోంది. ఆ రంగాలకూ డిమాండ్ పెరిగి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కాబట్టి సృజనాత్మక రంగాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గానే చూడకుండా.. మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగానూ గుర్తించి.. ఆ దిశగా వాటిని సిలబస్‌లో చేర్చాలి’ అంటారు న్యూ ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని కల్చర్ డిపార్ట్మెంట్ అధిపతి మిర్ ఇంతియాజ్. ‘విదేశాల్లో లాగా బయటి క్రియేటివ్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేలా ఓ పాలసీని తయారు చేయాలి. అప్పుడే యువతకు ఫలానా కోర్స్ చదివితే ఫలానా రంగంలో ఫలానా ఉద్యోగాలు ఉన్నాయనే అవగాహన కలుగుతుంది. ఇప్పుడెలాగైతే కంప్యూటర్ సైన్స్ చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలున్నాయని తెలుస్తోందో అలాగా’ అని అభిప్రాయపడుతున్నారు పుణెలోని ఎమ్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లోని ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ డిపార్ట్మెంట్ హెడ్ ఇంద్రజిత్ నియోగి. ‘సీబీఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ పాటర్న్‌లో ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం క్రియేటివ్ కోర్సుల్లో అంట్రప్రెన్యూర్ షిప్ కరిక్యులమ్‌ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారి.. పిల్లల్లోని సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంటుంది’ అని చెబుతున్నారు విద్యారంగ నిపుణులు. ముగింపు దేశంలో ప్రతి ఏటా దాదాపు కోటి మంది యువత వర్క్‌ఫోర్స్‌లోకి వస్తోందని అంచనా. ఇప్పుడున్న అవకాశాలు సరిపోవడం లేదు. అదీగాక మన దగ్గరున్న యువతరం దాదాపుగా.. ఉపాధి కల్పన అంతగాలేని గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందినదే. చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది అమ్మాయిలు సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మారాలని ఆశిస్తున్నారు. వారిలో నేర్చుకునే తపనకు.. సృజనాత్మక ఆలోచనలకేం కొదువలేదు. కావల్సిందల్లా సరైన మార్గదర్శకత్వం.. అవసరమైన మౌలిక సదుపాయాలు. ఇందాకే చెప్పుకున్నట్టు వీళ్లంతా మన దేశ ఆర్థిక ప్రగతికి అవాకాశాలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు యువ జనాభా లేక ఉస్సూరుమంటున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి. అలాంటి దేశాలకు మన యూత్ వరం. మన దగ్గరి ప్రతిభావంతులైన యువతకు వాళ్ల దేశంలో మంచి కొలువులు ఇస్తానని ఇప్పటికే జపాన్ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను మనం ఇంకెన్నో దేశాలతో చేసుకునే వీలుంది. అయితే ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలి. మనకున్న మరో అనుకూలాంశం. పెరుగుతున్న మధ్యతరగతి. వీళ్లే అతిపెద్ద వినియోగదారులు. మన డొమెస్టిక్ గ్రోత్‌కి డ్రైవర్స్. అందుకే పెట్టుబడులకూ మన దేశాన్ని మించింది లేదు. ఆ పెట్టుబడులే ఉద్యోగాలనూ సృష్టిస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతకు ఉపాధి కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఇదే ప్రభుత్వాల ఎజెండా కావాలి. అప్పుడే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం! -
కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్ సెక్టార్)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్‌లీజ్ సంస్థ తమ ‘ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్’ను తాజాగా విడుదల చేసింది. దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్‌లీజ్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది. సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్ (94 శాతం), ఎడ్యుకేషనల్ (93 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (88 శాతం), రిటైల్ (85 శాతం), లాజిస్టిక్స్ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్ సెక్టార్లో భారత్ ‘గ్లోబల్ లీడర్’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ టాడే పేర్కొన్నారు. ‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్ స్కిల్లింగ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ థామస్ పేర్కొన్నారు. -
CM YS Jagan: ఉద్యోగాల కల్పన ఓ రికార్డు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో అరుదైన రికార్డు నమోదు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్.. ఆయా సచివాలయాల్లో ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. అదో రికార్డు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. 2019లో జూలై – అక్టోబర్ మధ్య జరిగిన ఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం గానీ, ఇంత భారీగా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, పరీక్షలు నిర్వహించడం జరగలేదని అధికార వర్గాలు వివరించాయి. ఇంత మంది అభ్యర్థులకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎటువంటి తప్పులకు తావులేకుండా అప్పట్లో ప్రభుత్వం సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడం కూడా ఓ రికార్డే. రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే నియామకాలు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కేవలం అభ్యర్థులు రాత పరీక్షల్లో తెచ్చుకున్న మెరిట్ మార్కుల ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగింది. అవినీతికి ఆస్కారం ఉండకూడదని ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల విధానానికి సైతం ప్రభుత్వం స్వస్తి పలికింది. సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 జూలైలో తొలి విడత నోటిíఫికేషన్ జారీ చేసి, సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించింది. అందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కలెక్టర్ల పర్యవేక్షణలో నియామక ప్రక్రియ నిర్వహించింది. తొలి విడతలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు 2020 జనవరిలో ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా 2020 సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి, ఆ వెంటనే నియామక ప్రక్రియను చేపట్టి, 2021 జనవరి నాటికి పూర్తి చేసింది. సచివాలయాల్లో పని చేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను మరో 8 వేల దాకా కొత్తగా సృష్టించి, వాటిని విద్యుత్ సంస్థల ద్వారా వేరుగా భర్తీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728 2019లో తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి : 1,05,869 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 13,136 రెండు విడతల నోటిఫికేషన్ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529 తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు. -
ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు! భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పించింది. భయానక పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువలేమిటో? డబ్బులు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీల ఆదాయం తగ్గింది. ఉద్యోగం ఉన్నా.. వేతన జీవులకు కష్టాలు తప్పలేదు. మనస్సుకు క్షణం ప్రశాంతత లేకుండా..టార్గెట్లు పెట్టుకొని చేస్తున్న పనితో చివరికి మిగిలేదేంటీ? సోమవారం ఉదయం పొద్దన్నే లేవడం. అక్కడి నుంచి ఉరకులు, పరుగులు. చేయలేనంత పనిభారం. టెన్షన్. రోగాలు. ఇదంతా దేని కోసం. ఇదిగో ఇలాంటి ఆలోచనల్లో నుంచి 'ది గ్రేట్ రిజిగ్నేషన్' పుట్టింది. ది గ్రేట్ రిజిగ్నేషన్..ఉద్యోగులు తమ తమ ఉద్యోగాలకు స్వచ్చందంగా రాజీనామా సమర్పించడమే గ్రేట్ రిజిగ్నేషన్). ప్రస్తుతం ఈ ది గ్రేట్ రిజిగ్నేషన్ అంశం భారత్‌ను కుదిపేయనుందని ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలోని దిగ్గజ కంపెనీలన్నీ దాదాపూ రెండేళ్ల తర్వాత రిటర్న్ టూ ఆఫీస్ కల్చర్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీలు ది గ్రేట్ రిజిగ్నేషన్‌ను ఎదుర్కొనబోతున్నాయంటూ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ సేవల సంస్థ మైఖేల్ పేజ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2022మొత్తం భారత్‌లో దిగ్రేట్ రిజిగ్నేషన్ తీవ్రతరం కానుందని, దాదాపు 86శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తుండగా..ఇది రిక్రూటర్లకు సవాల్‌గా మారిందని రిపోర్ట్ హైలెట్ చేసింది. నాన్ మానిటరీ రివార్డ్స్ అంటే! జీతాలు, బోనస్‌లు, రివార్డ్‌లు ఇలా ఉద్యోగుల్ని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం. అయినప్పటికీ నాన్ మానిటరీ రివార్డ్స్ అంశం ఉద్యోగులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేయడానికి కారణమని తెలుస్తోంది. అంటే ఉదాహారణకు..ప్రమోషన్లు, కంపెనీ యూనిఫామ్స్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, హెల్త్ కేర్ బెన్ఫిట్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ప్రాఫిట్ షేరింగ్, స్టాక్ ఆప్షన్, బోనస్ కమీషన్ కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. నివేదిక ప్రకారం, మనదేశంలో గణనీయంగా 61శాతం మంది నచ్చిన ఉద్యోగంలో తక్కువ శాలరీ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. జీతం తక్కువే అయినా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని భావిస్తుండగా.. ఇందుకోసం భారీ ప్యాకేజీ ఇస్తామన్న కంపెనీల ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ప్రమోషన్లు సైతం వద్దని అనుకుంటున్నారు. లక్షల్లో రాజీనామాలు అన్నీ విభాగాలకు చెందిన సంస్థలు, సీనియారిటీ స్థాయిలు, వయస్సు ఇలా అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించిన సర్వేలో 3,609 మంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కరోనా వల్ల మనదేశంలో రెండేళ్లకంటే తక్కువ కాలంగా ఉద్యోగం చేస్తున్న మూడింట ఒక వంతు అంటే 38శాతం మంది ఉద్యోగులకు రాజీనామా చేస్తున్నారు. వారిలో గణనీయంగా 86శాతం మంది ఉద్యోగులు రాబోయే ఆరు నెలల్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి మరో కొత్త రంగంలో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మాట వినాల్సందే! ఈ సందర్భంగా మైఖేల్ పేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాలా మాట్లాడుతూ..“ఉద్యోగుల పనిని చూసే విధానంలో కరోనా అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉద్యోగులు పనిగంటలు, ఫ్రీడం, వర్క్ ఫ్లెక్సిబులిటీ ఇలా అన్నింటిలో తమకు నచ్చిన విధంగా సంస్థలు ఉండాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో సంస్థలు.. ఉద్యోగుల ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న ఐటీ కంపెనీలు..బాబోయ్ వద్దంటున్న ఉద్యోగులు, కారణం అదే! -
ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది..
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందన్నారు. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాబ్‌మేళాకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రేపు 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులందరికీ అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. -
‘మా ఊరికి రండి.. బదులుగా రూ. 24.5 లక్షలు తీసుకోండి’
రోమ్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇటలీలో గత కొద్ది కాలంగా పట్టణాలు, నగరాలు ఖాళీ అవుతున్నాయి. జనాలు వలస బాట పట్టడంతో ఇళ్లు, ఊర్లు, నగరాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో జనాలను ఆకర్షించడం కోసం.. వలస వెళ్లిన వారిని తిరగి రప్పించడం.. ఖాళీ అయిన ప్రాంతాలు తిరిగి మునపటిలా జనాలతో కలకలలాడటం కోసం వింత ఆఫర్లను ప్రకటిస్తుంది. దానిలో భాగంగా కేవలం రూపాయికే ఇళ్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది ఇటలీ ప్రభుత్వం. దేశంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటే ఏకంగా 24.5లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కాకపోతే కండీషన్స్ అప్లై అంటుంది. మరి ఇంతకు ఆ ప్రాంతం ఎక్కడ.. కండీషన్స్ ఏంటో తెలియాలంటే ఇది చదవండి. ఇటలీలోని కలాబ్రియాలో ప్రస్తుతం కేవలం 2 వేల మంది మాత్రమే ఉంటున్నారు. ఏళ్లుగా ఈ గ్రామం ఆర్థికమాంద్యంతో సతమతమవుతోంది. దాంతో చాలా మంది ఉపాధి కోసం వలస బాట పట్టారు. ఈ క్రమంలో కలాబ్రియా స్థానిక ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు వలసవెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. ఈ ప్రాంతంలో అతి తక్కువ ధరకే ఇళ్లను విక్రయిస్తుంది. ఇక్కడ ఇల్లు కొన్న వారికి మూడు ఏళ్ల వ్యవధికి గాను అక్కడి ప్రభుత్వమే 24 వేల పౌండ్లు(24,87,660 రూపాయలు) చెల్లిస్తుంది. కాకపోతే కొన్ని షరతులు పెడుతుంది. అవేంటంటే.. 40 ఏళ్ల లోపే వారే ఇక్కడ ఇళ్లు కొనడానికి అర్హులు. అంతేకాక అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించి.. వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించాలి. అది కూడా వారు చెప్పిన గడువులోపే. ఇంటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ వ్యాపారం చేయాలనుకునే వారు దరఖాస్తులను 90 రోజుల్లోపు అధికారులకు అందజేయాలి. ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పిలుస్తున్నారు. దీనిపై కలాబ్రియా పట్టణ మేయర్ స్పందిస్తూ.. తమ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇటాలియన్ ప్రాంతంలో నివసించడానికి ప్రజలను ఆకర్షించండి.. ఇక్కడకు వచ్చే వారికి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తాము.. మరింత మెరుగైన విద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తాము.. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తామని తెలిపారు. -
Army Recruitment Rally: ఆగస్ట్ 16 నుంచి విశాఖలో..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని..ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత మాత్రమే రిక్రూట్మెంట్కు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 3లోగా www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్ట్ 9 నుంచి అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయని వివరించారు. దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. భర్తీ చేసే పోస్టులివే: సోల్జర్–జనరల్ డ్యూటీ, సోల్జర్–టెక్నికల్/ ఏవియేషన్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్మన్. అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. వయసు: అభ్యర్థుల వయసు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. -
తూత్తుకుడి బాధితులకు ఉద్యోగాలిస్తాం
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని తుపాకీతో కాల్చి చంపిన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రోడ్ షో, సభలతో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తూత్తుకుడిలో సాగిన తుపాకీ కాల్పులు, సాత్తాన్ కులం పోలీసుల నిర్వాకం, జుడీషియల్ కస్టడిలో తండ్రికుమారుల మరణం తదితర విషయాలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీగా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చిచంపిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఈ రాష్ట్రం ఏటు పోతున్నదో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. ప్రజలపై తుటాల్ని ఎక్కుబెట్టి 13 మంది మరణానికి కారణమైన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కరోనా కారణంగా జీవనం కోల్పోయిన వారికి రూ. 4 వేల సాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే కరుణానిధి జయంతి రోజున ఈ పంపిణికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. చదవండి: అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్ -
ఆ దేశానికి 12 లక్షల మంది ఉద్యోగులు కావాలంట
సింగపూర్: 2025 నాటికి వివిధ సంస్థలు ఎంపిక చేసుకునే ఉద్యోగాలకు డిజిటల్ నైపుణ్యాలే కీలకంగా మారతాయని ఓ సర్వేలో వెల్లడైంది. సింగపూర్ వంటి చిన్న దేశాలు సైతం ఇందుకు సన్నద్ధం కావాలని అంచనా వేసింది. 2025 నాటికి సింగపూర్ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది డిజిటల్ నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమవుతారని తేల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న 22 లక్షల మందిలో వీరి వాటా 55% వరకు ఉంటుందని తేలింది. డిజిటల్ నైపుణ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్‌లో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలను ఆన్లైన్ వార్తాపత్రిక ‘టుడే’లో గురువారం వెల్లడయ్యాయి. ఆస్ట్రేలియా, భారత్, ఇండోనేసియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాతో కలిపి మొత్తం ఆరు దేశాల్లోని 3 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో సింగపూర్ రెండో స్థానంలో, 64%తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ పరంగా చూస్తే ఆస్ట్రేలియాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు..అంటే 22% మంది వినియోగిస్తున్నారు. ఆరు దేశాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 21%తో దక్షిణ కొరియా ఉంది. భారత్‌లోని ఉద్యోగుల్లో 12% మందికే డిజిటల్ స్కిల్స్ ఉన్నప్పటికీ, అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ కోసం అత్యధికంగా 71% మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ విషయంలో సింగపూర్ 59%తో మూడో స్థానం నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు సాంకేతికపరమైన మార్పులకు అనుగుణంగా ఎదిగేందుకు సరాసరిన ఏడు డిజిటల్ స్కిల్స్‌ను నేర్చుకోవాల్సి ఉంటుందని సర్వే అంచనా వేసింది. సింగపూర్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే 12 లక్షల మందిలో.. ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్ నైపుణ్యాలను వినియోగించని వారు, నిరుద్యోగులు/ 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యే వారు, ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరే వారు డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వారితో కలిపి మొత్తం 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్ స్కిల్ ట్రయినింగ్ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే భారత్‌లో, 2025 నాటికి 39 కోట్ల ట్రయినింగ్ సెషన్స్ అవసరమవుతాయని అంచనా వేసింది. 2020–2025 మధ్య భారత్‌తోపాటు, జపాన్, సింగపూర్లలోని డిజిటల్ స్కిల్డ్ సిబ్బందికి అడ్వాన్స్డ్ క్లౌడ్ స్కిల్స్‌లోకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని వెల్లడించింది. ఈ నైపుణ్యాలను ఉద్యోగులు అందిపుచ్చుకోకుంటే 2025 నాటికి డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యం ఉండే సిబ్బంది కొరతను వాణిజ్య సంస్థలు ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది. చదవండి: ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి -
ఉపాధి, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
‘‘వ్యాపారి లాభార్జనపై ఆధార పడి బతుకుతాడనేది అందరికీ తెలిసిందే. అంటువ్యాధుల సమయంలో శవాలను దహనం, ఖననం చేసే వాడు ఆ సమయంలోనే డబ్బు సంపాదించాలని చూస్తాడు. వ్యాపారి కూడా అంటువ్యాధులతో సహా ఏ సందర్భమైనా ధనార్జనే ధ్యేయంగా జీవించడానికి వెనుకా డడు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంటుంది. శవాలను పూడ్చే వ్యక్తి అంటువ్యాధులను సృష్టించడు. కానీ, వ్యాపారి అంటువ్యాధులను సృష్టించగలడు’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1945లో ‘కాంగ్రెస్ పార్టీ, గాంధీ అంటరాని వారికి ఏం చేశారు’’అన్న గ్రంథంలో రాసిన వాక్యాలివి. ఈనెల 20వ తేదీన దావోస్‌లో జరిగిన ‘వరల్డ్ ఎక నామిక్ ఫోరం’ సదస్సు విడుదల చేసిన ‘ది ఇన్‌ఈక్వాలిటీ వైరస్’ నివేదిక, కరోనా విలయతాండవం చేసిన సమయంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారనే విష యాన్ని బయటపెట్టి, అంబేడ్కర్ వ్యాఖ్యలను అక్షర సత్యాలను చేసింది. కరోనా లాంటి వైరస్ సృష్టికి, వ్యాప్తికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. కరోనాయే కాదు, ఇంకా అనేక ఆరోగ్య, వాతావరణ సమస్యలకు ఈ వర్గాలు కారణం. వ్యాపారస్తుల లాభాపేక్ష వల్ల రసాయనాల వాడకం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కల్తీ కారణంగా వ్యాధులు రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం, రోగాల ఉపశమనానికి మందుల కోసం పరుగులు తీయడం... మళ్లీ ఆ మందులు తయారు చేసేదీ వారే. కరోనాతో యావత్ ప్రపంచం విలవిల్లాడుతోన్న కష్ట కాలంలో భారతదేశంలోని వందమంది కోటీశ్వరులు మరిన్ని కోట్లకు పడగలెత్తారని ఆక్స్‌ఫామ్ సంస్థ తాజా నివే దికలో తేల్చిచెప్పింది. భారతదేశంలోని సంపన్నులు కరోనా సమయంలో తమ సంపదను 35 శాతం పెంచుకున్నారు. 84 శాతం కుటుంబాలు ఉపాధిని, ఆదాయాలను కోల్పో యాయి. ప్రతి గంటకు లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. దాదాపు 13 కోట్ల మంది కార్మికులు ఉద్యో గాలు కోల్పోయారు. హోటళ్ళు, పర్యాటక రంగం, రిటైల్ దుకాణాలు, వినోద సంబంధితమైన వ్యాపారాలు, చిన్న చిన్న హాస్పిటల్స్, ఫిట్నెస్ సెంటర్లు, చిన్న, మధ్య తరహా ప్రైవేట్ పాఠశాలలు, రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఎక్కు వగా ఉపాధిని కోల్పోయారు. అయితే కొన్ని వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కార్యకలాపాలు మిగిలాయి. అందులో కార్పొరేట్ సర్వీసులు, లీగల్ సర్వీసులు, పబ్లిక్ సేఫ్టీ, ఐటీ సర్వీసులు ప్రముఖంగా ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళలో మహిళల శాతం అధికంగా ఉన్నది. మెకంజా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వే, పురుషులకన్నా దాదాపు రెండు రెట్లు అధికంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోయినట్లు తేల్చింది. చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారవేత్తల ఆదాయాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఇప్పటి వరకు ఒకకోటీ 6 లక్షల 70 వేల మంది కరోనా దాడికి గురయ్యారు. ఒక లక్షా 53 వేల మంది మరణించారు. ఇవి ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన వివరాలను సేకరించలేదు. చాలా మంది కరోనా వల్ల చనిపోయినప్పటికీ ప్రభుత్వాలు వాటిని ఇతర వ్యాధుల కింద చూపెడుతున్నాయి. ఒక కోటి మందికి పైగా కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యం కాకుండా ప్రైవేట్ గానే చికిత్స చేయించుకున్నారు. సరాసరిగా ఒక లక్ష రూపా యలు ఖర్చు పెట్టినా లక్ష కోట్ల రూపాయలు కరోనావల్ల నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో మనం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి నేర్పిన అనుభవాల నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రాధాన్యంగా ఉండాలి? విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 కోట్లకు పైగా ఉన్న వలస కార్మికులకు తిరిగి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారనేది ప్రశ్న. దీనికి బడ్జెట్లో ప్రాధాన్యత ఉండాలి. సంపన్నులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వర్గాలను ఇటు వైపుగా ఆలోచింపజేయాలి. దావోస్‌లో విడుదల చేసిన నివే దికలో ఆక్స్‌ఫామ్ చేసిన ముఖ్యమైన సూచన ఇక్కడ ప్రస్తావించాలి. వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న కోటీశ్వరులపైన ప్రత్యేకంగా కరోనా పన్నును విధించి, దానితో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాలి. మరొక ముఖ్యమైన అంశం వైద్య, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు. ముఖ్యంగా వైద్యరంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పటికీ దేశంలో వైద్యం మీద అవుతున్న ఖర్చులో 75 శాతం ఖర్చుని ప్రజలే భరిస్తున్నారు. 2015–16లో కేంద్ర ప్రభుత్వం 17,90,783 కోట్లు ఖర్చు చేస్తే, అందులో వైద్యరంగానికి వెచ్చించింది 34,131 కోట్లు. ఇది బడ్జెట్ ఖర్చులో 1.91 శాతం మాత్రమే. నూటికి నూరు శాతం మందికీ అత్యవసరమైన, ప్రాణప్రదమైన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాల శ్రద్ధకు ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. 2020–21 బడ్జెట్లో వైద్యరంగం వాటా 2.22 శాతం మాత్రమే. అదే రక్షణ రంగానికి చూస్తే, 2015–16లో 2 లక్షల 25 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో అది 12.61 శాతం. 2020–21 వరకు అయిదేళ్లలో ఒక కోటీ 39 లక్షల 63 వేల 845 కోట్ల రూపాయలను రక్షణ కోసం ఖర్చు చేస్తే, ప్రజల ఆరోగ్యానికి 3 లక్షల 11 వేల 921 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. దీనిని బట్టి ప్రభుత్వాల ప్రాధాన్యతేమిటో మనకు అర్థం అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, కరోనా లాంటి సమస్యలు మళ్ళీ ఎదురైతే ఈసారి ప్రజలను రక్షించడం ఎవరి వల్లా కాదు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే ఎక్కువగా ఖర్చును భరించారు. కాబట్టి సంఘాలు, సంస్థలు, వేదికలు, రాజకీయ పార్టీలు బడ్జెట్‌కు ముందే, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. ఆరోగ్యరంగంతో సహా అన్ని రంగాలకు ప్రాధా న్యతాక్రమంలో కేటాయింపులు ఉండేలా డిమాండ్ చేయాలి. ఇప్పటికైనా పౌరసమాజం మేల్కొనకపోతే, సామాన్యజనం పాలిట కోవిడ్ లాంటి మరిన్ని మహమ్మారులు మృత్యు శకటాలుగా మారతాయన్నది సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
ఉద్యోగాలపై ఆర్థికశాఖ కాకిలెక్కలు
తెలంగాణ ఉద్యమం పుట్టింది ఉద్యోగాల కోసం. 1,200 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డది తెలంగాణ వొస్తే ఉద్యోగాలొస్తాయని. తెలంగాణ వొచ్చి ఏడేండ్లు కావస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు లోనై మళ్లీ ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు (నాగులు, రవీంద్ర నాయక్). ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న పిదప ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. అప్పుడే ఉద్యమం సఫలీకృత మైనట్లు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియా మకాల గురించి కొనసాగింది. నియామకాలకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరించింది అన్నది ప్రశ్న. ప్రభుత్వ ఆర్థికశాఖ ఇచ్చిన ఉద్యోగ వివరాలను చూద్దాం. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అనుమతించిన 1,50,326 పోస్టు లకుగానూ 1,32,898 పోస్టులను నోటిఫై చేయగా అందులో 1,26,641 భర్తీ అయ్యాయనీ, మిగిలింది కేవలం 23,685 ఖాళీలు మాత్రమేననీ పేర్కొన్నారు. భర్తీ చేసినవాటిల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,594; పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుద్వారా 31,972; విద్యుత్ సంస్థల్లోని ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,972; పంచాయతీరాజ్ శాఖలో 10,763 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా; శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొంది. పోలీస్ శాఖలోని నియామకాల్లో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న హోం గార్డులు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి, అవిపోగా కొత్తగా ఉద్యోగాలు లభించింది ఎంతమందికో ఆర్థికశాఖ వివరిస్తే బాగుం డేది. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం కొత్త నియామకాల కిందకి రాదు. పంచాయతీ రాజ్‌లో శాఖాపరమైన పదోన్నతులద్వారా 11,278 పోస్టులను భర్తీచేసినట్లు చెప్తున్నరు. శాఖాపరమైన పదో న్నతులలో కిందిస్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీచేస్తేనే ఆ పోస్టులు భర్తీ అయినట్లు. కేవలం ఉద్యోగ ప్రకటనలిచ్చి తద్వారా భర్తీచేసిన నియామకాలే లెక్కలోకి వస్తాయన్న విషయం ఆర్థికశాఖకు తెలువదనుకోవాలా? పాఠశాల విద్యలో 8,463 పోస్టులు భర్తీచేసినట్లు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలోని 1,061 ఖాళీల భర్తీకి అనుమతులి చ్చినా ఇప్పటి వరకు ఒక్కపోసు ్టకూడా భర్తీ చేయలేదని తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడు టీచర్స్‌తో పాటు, హెడ్మాస్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, బోధనేతర సిబ్బం దితో కలిపి 25,000 ఖాళీలున్నట్లు లోగడ విద్యాశాఖమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. ఇందులో భర్తీ చేసింది. 8,463. చేయవలసింది 16,537. ఆర్థికశాఖ మాత్రం విద్యాశాఖలో 10వేల ఉద్యోగాల వరకే ఉంటాయంటున్నది. అదేం లెక్కో. యూనివర్సిటీలలో భర్తీ చేయమని 1,061 పోస్టులకు అనుమతులిచ్చినా ఒక్కపోస్టుకూడా భర్తీ చేయలేదంటున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ సకాలంలో బ్లాక్ గ్రాంటు, జీతాలు, పెన్షన్లు, బకాయిలివ్వని ఆర్థికశాఖ యూనివర్సిటీలపై నిందమోపడం అన్యాయం. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలకు రెండున్నర సంవత్సరాలనుండి వైస్ చాన్స్లర్లు, పాలకమండళ్లు లేవు. అలాంటప్పుడు నియామకాల ప్రక్రియ ఎలా చేపడతారో ఆర్థికశాఖనే వివరించాలి. ఒక్క యూనివర్సిటీలలోనే కాదు ఖాళీలున్నది, డిగ్రీ కాలేజీల్లో 2,730 లెక్చరర్ పోస్టులుంటే ప్రస్తుతమున్నది 1,419. ఖాళీలు 1,311. జూనియర్ కళాశాలల్లో మంజూరు అయిన పోస్టులు 5,278. ఇందులో పనిజేస్తున్న వారు 836. ఖాళీలు 4,442. మొత్తంగా ఉన్నత విద్యలోని బోధన, బోధనేతర ఉద్యోగాలన్నీ కలిపి ఉన్నవి 14,006. ఇందులో పనిచేస్తుంది మాత్రం 3,685. ఖాళీలు 10,321. యూనివర్సీటీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కళాశాలలు నడుస్తున్నది పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే అన్నది నగ్నసత్యం. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు కావస్తున్నా ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. అటెండర్, డ్రైవర్, వాచ్‌మన్, స్వీపర్, స్కావెంజర్ లాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగులు 24 లక్షల 54 వేలు. ఇందులో సాంకేతిక విద్యకు సంబంధించినవారు 5,30,128. మిగతావాళ్లు పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదోతరగతి వాళ్లు. దేశంలో నిరుద్యోగిత పోస్టు గ్రాడ్యుయేట్లలో 21.6 శాతంగా ఉంటే మనరాష్ట్రంలో మాత్రం అది ఏకంగా 33.9 శాతం. 2013– 14 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడే ముందు వీరిలో నిరుద్యోగిత 7.3 శాతం. నాలుగురెట్లకు పైగా పెరిగిందన్న మాట. దీనికి కారకులు ఎవరు? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు తోడు తాజాగా నిరు ద్యోగుల ఆత్మహత్యలు మొదలైన ఈ తరుణంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఉద్యోగాల భర్తీకై చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. ఎన్. రాంచందర్ రావు వ్యాసకర్త ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
కుటుంబాలు 140.. ఉద్యోగులు 114
భవిత ఉన్నతికి విద్యార్థి దశే కీలకం. ఈ విషయాన్ని హనుమంతునిపాడు మండలంలోని కూటాగుండ్ల గ్రామం బాగా తెలుసుకుంది. అందుకే నాడు కూలీలతో నిండిపోయిన గ్రామం నేడు వందలమంది ఉద్యోగులతో కళకళలాడుతోంది. వీరు ఈ ఘనత సాధించడానికి తల్లిదండ్రుల సహకారం, గురువుల స్ఫూర్తి, విద్యార్థుల పట్టుదలే కారణాలుగా నిలిచాయి. సాక్షి, హనుమంతునిపాడు: పిల్లలు తమలా కష్టపడకూడదనే ఒక్క ఆలోచనతో మండలంలోని కూటాగుండ్ల గ్రామస్తులు ఒక్కటయ్యారు. కూలీ పనులు చేశారు.. కష్టపడి పంటలు పండించుకున్నారు. ఎలాగో సంపాదించి తమ పిల్లల చదువుల కోసం ఖర్చు చేశారు. ఇలా వారి సంకల్పం ఎదిగి ఇప్పుడు పిల్లలంతా ఉద్యోగాల్లో స్థిర పడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా నేటి చరిత్ర. గతంలో ఈ గ్రామంలో చదువుకున్న వారు ఐదారుగురు మాత్రమే ఉండగా ఇప్పుడు దాదాపు అంతా అక్షరాస్యులుగా మారారు. చదవండి: ఒక పోస్టుకు 32 మందే పోటీ.. గ్రామంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాలో వీరందరికీ విద్యా బీజాలు వేసి వారి ఉన్నతికి ప్రథాన కారణంగా నుంచుంది. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామంలోనే విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఆ తర్వాత పై చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లి తమ తల్లిదండ్రుల కలలు సాకారం చేయడంలో సఫలం చెందారు. గురువుల స్ఫూర్తితో.. ‘మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూస్తున్నారు. మీరు అలా కాకూడదు. బాగా చదువుకుంటేనే ఉన్నత స్థానం వస్తుంది’ అంటూ విద్యార్థుల్లో వారి గురువులు ఉత్సాహాన్ని నింపడంతో చిన్నతనం నుంచే విద్యపై మక్కువ పెంచుకున్నారు. వారి సలహాలతో విద్యార్థులు పోటీపడి చదివేవారు. ఇలా ఎక్కువ మంది విద్యార్థులు చేరడంతో స్కూల్‌ను 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత గ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. అప్పటి వరకు నేర్చుకున్న క్రమశిక్షణే వారి ఉద్యోగ సాధనకు పనికి వచ్చింది. తమ ఇష్టం వచ్చిన కోర్సులను ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో చదువు కోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే కేవలం విద్యార్థులే కాకుండా.. విద్యారి్థనులు కూడా వారితో పోటీ పడటం నేర్చుకున్నారు. ప్రస్తుతం దాదాపు 20 మంది మహిళలు బీటెక్, ఎంటెక్, ఎంబీలు పూర్తి చేయగలిగారు. ఉద్యోగాల ఖిల్లా విద్యార్థుల శ్రమకు తోడు.. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో నేడు ఈ గ్రామం ఉద్యోగాల ఖిల్లాగా మారింది. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నత చదువులు చదివి వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 80 కుటుంబాలు, ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలుండగా 500 మంది జనాభా ఉన్నారు. అయితే వీరిలో ఏకంగా 114 మంది ఉద్యోగులుండటం గమనార్హం. వీరిలో ఉధ్యాయులు, ఇంజినీయర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 10, ఇంటర్ చదివిన వారు మాత్రం పోలీస్, ఆర్మీ ఉద్యోగాలు సా«ధించారు. ఎస్సీ కాలనీలో ఎక్కువ మంది బిలాయి, చెన్నై, చతీష్ఘడ్ ,మధ్య ప్రదేశ్, కూర్బా, ముంబయి వంటి ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. వీరంతా పండగలు, శుభకార్యాలకు గ్రామం వచ్చినప్పుడు సందడి వాతావరణం నెలకొంటుంది. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటుంటారు. ఆరాధ్య దైవం అయిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లకు వచ్చి మొక్కలు తీర్చుకొని వెళ్తుంటారు. హోం టు డెస్క్ గ్రామంలో అత్యధికంగా 35 మందికి పైగా బెంగళూరు, హైదరాబాదు, ముంబై ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గ్రామంలో ఉన్న 80 కుటుంబాలకు గాను రెండు మూడు కుటుంబాలు మినహా ప్రతి ఇంట్లో ఉద్యోగులున్నారు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో గత ఏడు నెలల నుంచి గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు అందిస్తున్నారు. ఉన్నత చదువుల వల్లే ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గ్రామానికి చెందిన ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివారు. అందుకే మంచి ఉద్యోగాలు సాధించారు. ప్రతి ఇంటిలో ఇద్దరు, ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లున్నారు. దేవిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, ఉపాధ్యాయుడు అమ్మా, నాన్న ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న, గురువు వెంకటేశ్వరెడ్డి ప్రోత్సాహంతో కష్టపడి బీటెక్ చదివాను. వ్యవసాయం చేసి నన్ను, తమ్ముడిని బీటెక్ చదివించారు. వారి కష్టానికి ఫలితంగా బెంగళూరులో టెక్ మహేంద్ర ప్రైవేటు లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా. పావులూరి ప్రసాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోషంగా ఉంది అందరి సహకారంతో కష్టపడి బీటెక్ వరకు చదివాను. ప్రస్తుతం బెంగళూరులో టీసీఎం ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా కావడంతో ప్రస్తుతం ఇంటి నుంచే సేవలు అందిస్తున్నా. -పి.తరుణ్ ఉన్నత విద్య సాకారం నన్ను, అన్నను, చెల్లిని అమ్మానాన్నలు బీటెక్ వరకు చదివించారు. అమ్మనానతో పాటు మాటీచర్ వెంకటేశ్వరెడ్డి స్ఫూర్తిగా నిలవడంతో అన్న రవితేజ మద్రాసులో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. చెల్లి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తోంది. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా. -దేవిరెడ్డి విద్యాసాగర్ డెల్ కంపెనీలో మా స్నేహితులతో కలిసి డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. అమ్మ నాన్న కూలీ పనులు చేసి నన్ను చదివించారు. ఇప్పుడు జీవితం హాయిగా ఉంది. -కొత్తపల్లి సుదీర్ -
ఆకాశంలో సగం.. అవకాశాలు మృగ్యం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, ఇలా అన్నిస్థాయిల వ్యక్తులు, కుటుంబాలు ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ తరగతి వర్గాలకు భవిష్యత్‌పై ఆందోళనలు ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయి. విభిన్న రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (ఫార్మల్ సెక్టార్‌లోని 2.1 కోట్ల శాలరీడ్ జాబ్స్‌తో సహా) భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మహిళలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా పడటంతో ‘ఆమె’పై వివక్ష మరింత పెరుగుతోంది. ఇప్పటికే పురుషులతో పోల్చితే దాదాపుగా అన్ని రంగాల్లోని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మహిళల శాతం మరింత తగ్గిపోతోంది. చదవండి: భారత మహిళలకు కమల ఆదర్శం గత డిసెంబర్లో 9.15 శాతమున్న వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఉమెన్ (డబ్ల్యూపీఆర్) ఈ ఏడాది ఆగస్టు కల్లా 5.8 శాతానికి తగ్గిపోయినట్టు బెంగళూరు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్’ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాజా పరిశోధనలో వెల్లడైంది. స్వయం ఉపాధి, తదితర రంగాల్లోని వారు ఉద్యోగం, ఉపాధి ద్వారా సంపాదించే ఆదాయంతో, లాక్డౌన్ విధించాక, అన్‌లాక్ మొదలయ్యాక ఉపాధి, ఉద్యోగం ద్వారా పొందే ఆదాయాన్ని పోల్చినప్పుడు ఆయా అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్వయం ఉపాధి, క్యాజువల్ వర్కర్లు, దైనందిన వేతనం/నెల జీతమొచ్చే వర్కర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. గణనీయంగా తగ్గిన మహిళా ప్రాతినిధ్యం.. గత డిసెంబర్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వివరాలు, సమాచారం సేకరించి మళ్లీ వారు లాక్డౌన్ విధించాక ఏప్రిల్, ఆగస్టు నెలల్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించారు. డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో 32 శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కొనసాగగా, ఆగస్టు వచ్చేటప్పటికీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ తమ పాత ఉద్యోగాల్లో చేరినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రధానంగా విద్యా, రిటైల్, డొమెస్టిక్ వర్క్ వంటి రంగాల్లో మహిళలు ఎక్కువ ప్రభావితమయ్యారు. కోల్‌కతాలో ఇళ్లల్లో పనిచేసేవారు 40 నుంచి 50 శాతం మంది మహిళలు తమ పనులు కోల్పోయినట్టు పశ్చిమ్ బంగా పరిచారిక సమితి వెల్లడించింది. చదవండి: దీపం జ్యోతి పరబ్రహ్మ.. మహిళా శక్తిని పెంచేందుకు చర్యలు అవసరం: యాక్షన్ ఎయిడ్ ఇండియా రాబోయే నెలల్లో పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక, లింగపరమైన అసమానతలు పెరగనున్న నేపథ్యంలో మహిళా శక్తిని వర్క్‌ఫోర్స్‌లోకి, పనుల్లోకి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరముందని యాక్షన్ ఎయిడ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ ఛాచ్ర పేర్కొన్నారు. బీడీలు చుట్టే వారు మొదలుకుని, ఇళ్లల్లో పనిచేసే వారు, వ్యవసాయ కార్మికులు ఇలా వివిధ రంగాలకు చెందిన మహిళా వర్కర్లను రిజిష్టర్ చేసి లింగపరమైన అసమానతలు దూరం చేయడంతో పాటు గ్రామీణ, ఇతర స్థాయిల్లో పిల్లల సంక్షేమ, సహాయ కార్యక్రమాలను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ (ఐసీడీఎస్)ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గృహహింస పెరుగుతోంది.. ‘ఇంట్లో, బయటా మహిళలపై ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమస్యలపై దంపతుల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. దీంతో మహిళలపై గృహహింస పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అంతా ఇళ్లల్లోనే అన్ని సమయాల్లో ఉండటంతో గృహిణులపై పనిభారం రెండింతలు పెరిగింది. దీనికి తోడు వారిపై భవిష్యత్‌పై భయాలు, ఆందోళనలు పెరిగి మానసిక ఒత్తిళ్లకు ఎక్కువగా గురవుతున్నారు. భర్త, భార్య సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది.. 7, 8 నెలలుగా కొనసాగుతున్న పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితే భవిష్యత్‌లో కంఫర్టబుల్‌గా ఉంటారు. భర్తలు కూడా పురుషాధిక్య ధోరణిని విడనాడి భార్యలు కుటుంబం కోసం చేస్తున్న శ్రమ, త్యాగాలను గుర్తించి గౌరవిస్తే కుటుంబ బంధాలు బలపడతాయి. ఈ ఏడాది జీవించడమే ముఖ్యమని, ఆరోగ్యంగా ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా జీవించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగమో లేక ఏదో ఒక ఉపాధి అవకాశం కోసమే చూడకుండా మహిళలు ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. తక్కువ ఖర్చుతో చేయగలిగే చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటి అవకాశాలు పెంచుకునే దిశలో కృషి చేయాలి’ – ‘సాక్షి’తో సైకాలజిస్ట్ సి.వీరేందర్ -
‘అడ్డుగోడ’కు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని యెనుమలవారిపల్లి గ్రామం... యెర్రవారిపాలెం మండల పరిధిలోని ఈ గ్రామంలో ఉండేది 30 కుటుంబాలే. అలాంటి చోటు నుంచి వచ్చిన ఒక అమ్మాయి జాతీయ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రాంతీయ అసమానతలు, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యం చాలా ఎక్కువగా కనిపించే హాకీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఆట ఒక్కటే సరిపోదు. అంకితభావం, పట్టుదల, పోరాటపటిమ, దృఢసంకల్పం కావాలి. ఇవన్నీ కలబోసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇటిమరపు రజని దశాబ్దకాలంగా గోల్‌కీపర్‌గా భారత జట్టులో కొనసాగుతోంది. ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజని ... మరో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతోంది. వేగంగా దూసుకుపోయి... సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన రజని పాఠశాలస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హాకీ స్టిక్ చేతబట్టింది. ఆ తర్వాత విశేషంగా రాణిస్తూ పోయింది. గోల్‌కీపర్‌గా తొలి అవకాశం లభించగా... అదే పొజిషన్లో తన ఆటను మెరుగుపర్చుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా అండర్–14 రాష్ట్ర స్థాయిలో మొదలైన ప్రయాణం భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు సాగింది. జోనల్ ప్రదర్శన తర్వాత తొలిసారి 2009లో రజని భారత జట్టులోకి ఎంపికై ంది. అదే ఏడాది న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి భారత టీమ్ జెర్సీలో గోల్‌పోస్ట్ ముందు రక్షణగా, సగర్వంగా నిలబడింది. ఇది ఆమె కెరీర్లో మధుర క్షణంగా నిలిచింది. మరో ఒలింపిక్స్ కోసం... ఇటీవలే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న రజని తన అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడింది. పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగంగా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జట్లలో ఆమె సభ్యురాలు. భారత జట్టు తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఏడాది ముందుగా 2015లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు కూడా గోల్‌కీపర్‌గా రజని కీలకపాత్ర పోషించింది. రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్‌లో రజని భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఆడిన మన భారత మహిళల జట్టులో తానూ ఉండటం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకమని ఆమె చెబుతుంది. ఇప్పుడు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత జట్టులోనూ ఆమె కూడా ఉంది. దాని సన్నాహాలు కొనసాగుతుండగానే కరోనా కారణంగా అంతా మారిపోయింది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, తాను కూడా చక్కటి ప్రదర్శన కనబర్చాలని రజని కోరుకుంటోంది. శిక్షణకు బ్రేక్... ‘ఫిబ్రవరి 16న బెంగళూరు ‘సాయ్’ సెంటర్లో భారత జట్టుకు ఒలింపిక్స్ శిబిరం ప్రారంభమైంది. నెల రోజులకు పైగా అంతా బాగానే సాగింది. కోచ్ జోయెర్డ్ మరీన్ కొత్త పద్ధతుల్లో చక్కటి శిక్షణ అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కారణంగా క్రీడా కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో సుమారు రెండు నెలల కేవలం ఫిట్నెస్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్‌కే ప్లేయర్లు పరిమితమయ్యారు. సడలింపుల తర్వాత ఆటగాళ్ళంతా ఇంటిపై బెంగ పెట్టుకోవడంతో హాకీ ఇండియా శిక్షణకు విరామం ఇచ్చింది. నెల రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రీడాకారిణులు కొత్త ఉత్సాహంతో తిరిగి రావాలని ఫెడరేషన్ కోరుకుంటోంది. అంతా తిరిగొచ్చాక మళ్లీ శిక్షణ మొదలవుతుంది. షెడ్యూల్ ప్రకారం మరో నాలుగు నెలల పాటు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేది సందేహమే. అదొక్కటి చాలు... పదకొండేళ్లుగా భారత్‌కు ఆడుతున్నా నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వరంగ సంస్థలో గానీ ఉద్యోగం లభించలేదు. ఏ క్రీడాంశంలోనైనా ఇన్ని సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడిన వారికి ఏదో ఒక ఉద్యోగం లభించడం సహజం. కానీ దురదృష్టవశాత్తూ నాకు అలాంటి అవకాశం దక్కలేదు. నా జట్టులోని సహచరులు అందరికీ వారి వారి రాష్ట్రాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా తగిన గుర్తింపు, హోదా ఉన్నాయి. నేను మాత్రం ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో అడ్డంకులను అధిగమించి భారత హాకీకి ప్రాతినిధ్యం వహించా. ఇప్పటికైనా నేను స్థిరపడేందుకు తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. –ఇటిమరపు రజని, భారత హాకీ గోల్‌కీపర్ -
స్కిల్ వర్సిటీ @ ఏపీఎస్ఆర్టీసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ స్కిల్ యూనివర్సిటీగా మారి పలు కార్యక్రమాల్ని చేపట్టింది. అంతర్జాతీయ స్ధాయిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసి అక్కడే భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించనుంది. జేసీబీలు, క్రేన్లు కొనుగోలు వాటిపైనా శిక్షణ ఇవ్వనుంది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ద్వారా ఏటా 5 వేల మంది స్కిల్డ్ డ్రైవర్లను అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ కార్యక్రమం కింద దేశంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద కేంద్రం గ్రాంటుగా నిధుల్ని అందించనుంది. ఈ నిధులతో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ, సబర్బన్ సర్వీసులను పెంచుకునే అవకాశం ఉంది. సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశ పెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుగోలు చేసుకుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకునేందుకు అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ, విజయవాడలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా సిటీ సబర్బన్ సర్వీసులు లేవు. దీంతో ఆ ప్రాంతాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యుఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది. ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. కాకినాడకు 20 కి.మీ పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యుఎంటీసీకి అందించింది. కాకినాడకు చుట్టుపక్కల ఉన్న పెద్దాపురం, రామచంద్రపురం, సామర్లకోట, కరపల నుంచి సిటీ సర్వీసులు నడపే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ వరకు 10 వేల సిటీ సర్వీసులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 60 శాతం చిన్న బస్సులు, మిగిలిన 40 శాతం పెద్ద బస్సులు అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రైవర్ల కొరత తీర్చేందుకే శిక్షణ కేంద్రాలు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లిప్ కార్ట్‌తో ఓ సర్వే నిర్వహించగా, ప్రతి వెయ్యి వాహనాలకు 600 మంది డ్రైవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. రాష్ట్రంలో ఒక్క విజయవాడలో మాత్రమే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఉంది. అందువల్లే ఆర్టీసీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. నామ మాత్రంగా నిధులు కేటాయించి కాలం చెల్లిన బస్సులకు వర్క్‌షాపులలో మరమ్మతులు చేయించి డ్రైవింగ్‌కు సిద్ధం చేసింది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్‌ను అధ్యాపకుడిగా నియమించి ‘జూమ్ కార్’ తరహాలో డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పుతారు. స్క్రాప్ బస్సుకు ఇంటెలికార్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి డ్రైవింగ్‌ను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో 200 మందికి అంతర్జాతీయ స్థాయిలో డ్రైవింగ్ నేర్పిస్తారు. భారీ వాహనాల లైసెన్స్ కోసం శిక్షణ తీసుకునే వారు డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాలను మాత్రమే భరించాలి. స్క్రాప్ బస్సులను వినియోగించి ఆదాయం ఏటా ఆర్టీసీలో 1,600 బస్సులు స్క్రాప్ కింద వస్తున్నాయి. 10 లక్షల కి.మీ తిరిగిన బస్సులను స్క్రాప్‌గా గుర్తిస్తున్నారు. వీటికి రూ.లక్షతో కొత్త ఇంజిన్ ఏర్పాటు చేసి పలు చోట్ల వీటిని వినియోగించడం ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనతా బజార్ల కోసం ఈ బస్సులను వినియోగించనుంది. వుమెన్ ఫ్రెండ్లీ కార్యక్రమం కింద మెరుగైన సౌకర్యాలతో మొబైల్ టాయిలెట్లుగా బస్సులను తీర్చిదిద్ది, ఎక్కడ అవసరమైతే అక్కడకు తరలించే ఏర్పాట్లు చేసింది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విధానంలో వీటిని అప్పగించనున్నారు. పట్టణాలు/నగరాల్లో చెత్తను తీసుకెళ్లే విధంగా హైడ్రాలిక్ బస్సులుగా వినియోగించనున్నారు. పలు బస్సులను కార్గో సర్వీసులుగా మార్చి.. ఏపీ సివిల్ సప్లయిస్, బెవరేజెస్ కార్పొరేషన్, సీడ్స్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్‌ల ద్వారా రూ.450 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుంది. వచ్చే ఏడాదికి కార్గో ద్వారా రూ.2 వేల కోట్ల వ్యాపారం చేసేలా ఆర్టీసీ లక్ష్యం విధించుకుంది. ఏసీ బస్సులు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో వీటిని కరోనా పరీక్షల కోసం వినియోగించనున్నారు. మొత్తం 53 బస్సులను కరోనా పరీక్షలకు వినియోగించేలా ‘సంజీవిని’ అనే కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆర్టీసీ అడుగులు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే ఆర్టీసీ అడుగులేస్తుంది. జనతా బజార్లకు బస్సులను సిద్ధం చేయడం, పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా సర్వీసులు ఏర్పాటు చేయడం వంటివి చేపడుతున్నాం. ఆర్టీసీకి గత ఏడాది మార్చి 21 నుంచి జూన్ 21 వరకు రూ.1,215 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది ఇదే సీజన్లో కోవిడ్ కారణంగా కేవలం రూ.86 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నాన్ టిక్కెట్ రెవెన్యూ పెంచుకునేందుకు స్క్రాప్ బస్సులను సాంకేతికంగా పరీక్షించి రవాణా శాఖ ద్వారా ఫిట్నెస్ పరీక్షలు చేయించి తిప్పి కొంత ఆదాయాన్ని సాధిస్తున్నాం. – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
పిల్ల బంట్లు.. న్యాయపోరాటం
‘దిస్ ఈజ్ యాన్ ఆర్డర్’ అని పై అధికారి చెప్పినప్పుడు ఇక మాట్లాడేందుకు ఏమీ ఉండదు. చెప్పింది చేసేయడమే. కానీ బ్రైస్ కసావెంట్ ‘ఐకాంట్’ అనేశాడు గన్ తీసి లోపల పెట్టేసుకుంటూ! బ్రైస్ కెనడాలో అటవీ సంరక్షణ అధికారి. అప్పటికీ ఒకసారి తన పైఅధికారి ఆర్డర్ మీద తల్లి ఎలుగుబంటిని షూట్ చేసేశాడు. తల్లిని అంటి పెట్టుకుని ఉన్న ఆ రెండు ఎలుగు పిల్లల్ని కూడా షూట్ చేసేయమన్నాడు పై ఆఫీసర్. ‘పాపం పోనివ్వండి’ అన్నాడు బ్రైస్. మాంసం, చేపలు ఉన్న ఫ్రీజర్ డోర్లను బద్దలు కొట్టేసి లోపలంతా చెల్లాచెదురు చేసింది తల్లే గానీ పిల్లలు కాదు. పైగా వాటి ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కూడా ఏవో ఉన్నాయి. ఆ పిల్లబంట్లను పశువైద్యశాలకు తరలించాడు బ్రైస్. పై అధికారికి ఇదంతా కోపం తెప్పించింది. ముఖ్యంగా తన ఆర్డర్‌ని లెక్కచెయ్యకపోవడం! వెంటనే బ్రైస్ని ఉద్యోగంలోంచి ఫైర్ చేసేశాడు. ఐదేళ్ల క్రితం మాట ఇది. ఐదేళ్లుగా బ్రైస్ తన ఉద్యోగం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరికి కోర్టు బ్రైస్కి అనుకూలంగా శుక్రవారం తీర్పు ఇచ్చింది. ‘ఆదేశాలను, విధానాలను ఎవరైనా శిరసావహించవలసిందే. కానీ జీవకారుణ్య దృష్టితో చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అంతరాత్మ ఇచ్చిన ఆర్డర్‌ని పాటించక పోవడమే నేరం అవుతుంది’ అని జడ్జి తీర్పు చెప్పారు. -
మైక్రోసాఫ్ట్‌లో 1500 కొత్త ఉద్యోగాలు!
అట్లాంటా : సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ స్పేస్ లలో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం 75 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 523,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయం రూపుదిద్దుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదికల్లా అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ కార్యాలయం కొలువు దీరనుంది. జార్జియాలో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజం పెట్టుబడులు పెట్టడంపై ఆ రాష్ర్ట గవర్నర్ బ్రియన్ పి. కెంప్ ఆనందం వ్యక్తం చేశారు. దీని ద్వారా కంపెనీకి, రాష్ర్టానికి ఇరువురికి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (అందుకే అట్లాంటిక్‌తో భాగస్వామ్యం: ఆకాశ్ అంబానీ ) అట్లాంటాలో పెట్టుబడులు పెట్టడం పట్ల మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్ మాట్లాడుతూ.."టెక్ కంపెనీ సంస్థలకు కేంద్రమైన అట్లాంటాలో మేము పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. దీని ద్వారా ఇతర ప్రాంతాలకు మా ఉనికి విస్తరించడానికి అవకాశం ఉంది. మేం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంస్థకి సాంకేతికంగా, ఆర్థికంగా మరింత లాభం చేకూరుతుంది” అని టెర్రెల్ కాక్స్ అభిప్రాయపడ్డారు. ఇక కరోనా క్రైసిస్‌లోనూ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడవ త్రైమాసికంలో భారీ లాభాలను, ఆదాయాన్ని సాధించినట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. (లాక్డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు ) -
‘పారిశ్రామికాభివృద్ధి సాధించటమే లక్ష్యం’
సాక్షి, విజయవాడ: నిరుద్యోగ యువతను పరిశ్రమలతో అనుసంధానించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వ తరహాలో అప్రెంటీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు.. విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని మంత్రి గౌతమ్‌రెడ్డి గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపనకు ఎవరు ముందుకొచ్చినా పూర్తి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామని గౌతమ్ రెడ్డి తెలిపారు. -
హ్యాష్‌ట్యాగ్‌లు..గెలుపు మంత్రాలు !
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఒకప్పుడు ఎన్నికలంటే నినాదాలే. అవెంత కొత్తగా ఉంటే జనాన్ని అంతగా ఆకర్షించేవి. రోటీ కపడా ఔర్ మకాన్ అన్నా, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్నా జనంలోకి ఎంత బలంగా వెళ్తే పార్టీకి ఎన్నికల్లో అంతలా ఓట్లు కురిసేవి. ఇప్పుడు కాలం మారింది. ఇవాళ రేపు అందరూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. అందులో ట్రెడ్డింగ్‌లో ఉన్న అంశాలంటే అందరికీ ఎక్కడ లేని ఆసక్తి. అవే హ్యాష్‌ట్యాగ్‌లు. ఆ హ్యాష్‌ట్యాగ్ ఎంత క్యాచీగా ఉంటే నెటిజన్లను అంతగా ఆకర్షిస్తుంది. ఎన్నికల నినాదాలకు మించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు కొందరు కన్సల్టెంట్లను కూడా నియమిస్తున్నారు. మండే ఎండలతో పోటీ పడేలా బయట ఎండల వేడి. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ల హీట్. ప్రతీ పార్టీ రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, పరారీలో ఆర్థిక నేరగాళ్ల నేపథ్యంలో రాహుల్‌గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపాలదారుడే దొంగ) అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో తన పేరుకి ముందు చౌకీదార్ అని తగిలించుకోవడంతో అది వైరల్‌గా మారింది. అంతే కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు, సోషల్ మీడియాలో మోదీ వీరభక్తులు తమ పేరు మందు చౌకీదార్ అని తగిలించుకోవడం మొదలు పెట్టారు. మైన్బీ చౌకీదార్ హ్యాష్‌ట్యాగ్ (నేను కూడా కాపలాదారుడినే) సోషల్ మీడియాలో ఇప్పుడు క్రేజ్‌గా మారింది. ఇలాంటి క్యాచీ హ్యాష్‌ట్యాగ్‌లే ఎన్నికల్లో ప్రభావితం కూడా చూపిస్తాయన్న అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. తెలంగాణలో బీజేపీ సోషల్ వార్ రూమ్‌లో పనిచేస్తున్న లావణ్య శెట్టి ఎన్నికలంటే ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిలా పోరాడాలని అన్నారు. ‘సైనికుడంటే సరిహద్దుల్లో తుపాకులతో కాపలా కాయాల్సిన పని లేదు. మన దేశ దశ దిశను నిర్ణయించే ఎన్నికల్లో పనిచేయడం అంటే ఓ రకంగా యుద్ధం చేస్తున్నట్టే. ఇలాంటి సమయంలో పార్టీ విజ యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడే‘ అని వ్యాఖ్యానించారు. సోషల్ సైన్యం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల విస్తీర్ణానికి అనుగుణంగా 20–30 మందితో ఐటీ సెల్ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ గ్రూప్స్, యూ ట్యూబ్, టెలిగ్రామ్‌లలో చురుగ్గా ప్రచారం. గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుసంధానం పెరగడానికి హిందీతో పాటు ఇతర 15 ప్రాంతీయ భాషల్లో ఎన్నికల ప్రచారం బీజేపీ సొంతంగా సృష్టించిన నమో యాప్‌తో దేశం నలుమూలలా ఉన్న వివిధ వర్గాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతీ పన్నా ప్రముఖ్ వ్యూహ రచనలో మునిగితేలిన ఆర్ఎస్ఎస్.. బూతు స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ 15– 20 మంది వృత్తి నిపుణులు, పార్టీ కార్యకర్తలతో రాష్ట్రాల స్థాయిలో ఐటీ సెల్స్.. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు ఘర్ ఘర్ కాంగ్రెస్ యాప్, శక్తి యాప్ ద్వారా ఎన్నికల ప్రచార నిర్వహణ.. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ గ్రూప్స్‌లో చురుగ్గా కార్యకర్తలు.. నెటిజన్లను ఆకర్షించే హ్యాష్ ట్యాగ్స్, గ్రాఫిక్స్, మీమ్స్ రూపొందించడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలు కేంద్రం లోటుపాట్లను ఎత్తి చూపించడానికి ప్రత్యేక బృందాలు.. ఎన్నికలూ ఉద్యోగాలిస్తాయ్ .. ఉద్యోగాల్లేవని యువత రోడ్డెక్కి నిరసనలు చేస్తూ ఎన్నికల్లో తమ పవర్ చూపించడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు అవే ఎన్నికలు చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాపై అవగాహన ఉండి, రాజకీయాలు లోతుగా అర్థం చేసుకోగలిగి, వీడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం, కాస్తో కూస్తో సృజనాత్మకత ఉంటే చాలు ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్, షేర్‌చాట్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సంస్థలు రా రమ్మంటూ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ ఉద్యోగాలు ఏంటంటే కంటెంట్ మేనేజర్స్ కంటెంట్ ఎడిటర్స్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఫ్యాక్ట్ చెకర్స్ వీళ్ల పనేంటంటే నిరంతరం ఆ యాప్‌లను పర్యవేక్షిస్తూ, అం దులో వస్తున్న అంశాల్ని గమనిస్తూ ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినా, తప్పుడు వార్తల్ని ప్రచారం చేసినా, ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా అవమానించేలా పోస్టులు, మీమ్స్ పెట్టినా వెంటనే సదరు యాజ మాన్యాల దృష్టికి తీసుకువెళ్లాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా ఫేస్బుక్ వ్యవహరించి ఆ దేశ కాంగ్రెస్ ముందు విచారణకు కూడా జుకర్‌బర్గ్ హాజరు కావడంతో ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియా దిగ్గజాలు ముందు జాగ్రత్త వహించాయి. ఈ ఎన్నికల సీజన్లో వివిధ సంస్థలు 13 వేల ఉద్యోగాలు కల్పించాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఫేస్బుక్ 6,500 మంది సమీక్షకుల్ని నియమించినట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఫేస్బుక్లో పోస్టులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వెంటనే ఈ బృందాలు వాస్తవాలను పరి శీలించి సదరు అకౌంట్లను రద్దు చేస్తాయి. ఇక ఫ్యాక్ట్ చెకర్స్ ఉద్యోగాలకే ప్రస్తుతం డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏది రియలో, ఏది వైరలో తెలుసుకోవడం కష్టంగా మారింది. భారత దేశంలోని 15 భాషల్లో వచ్చే కంటెంట్‌ని జల్లెడ పట్టడం మామూలు విషయం కాదు. అందుకే వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. భారత్ ఎన్నికల్లోనైనా తమ పరువు నిలుపుకోవడానికి ఫేస్బుక్ థర్డ్ పార్టీ ద్వారా 2 వేల మంది ఫ్యాక్ట్ చెకర్స్ని నియమించింది. గత ఏడాదితో పోలి స్తే ఈ ఏడాది కంటెంట్ మేనేజర్, కంటెంట్ ఎడిటర్ ఉద్యోగాలు 72% పెరిగాయని జాబ్ సెర్చ్ ఇంజన్ ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ వెల్లడించారు. కంటెంట్ మేనేజర్స్‌కి జీతాలు కూడా బాగానే ఇస్తున్నారు. ఏడాది అనుభవం ఉంటే చాలు ఈ ఎన్నికల సీజన్లో నెలకి 30 వేల వరకు సంపాదించవచ్చు. అదే అయిదేళ్ల అనుభవం ఉంటే 50 వేల రూపాయల వరకు ఇస్తున్నట్టు సోషల్ మీడియా సంస్థల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థుల్ని పంపించే ఇన్ఫోసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ రావు చెప్పారు. ఇక అప్పుడే డిగ్రీ చేసిన వారికి కూడా కంప్యూటర్ పరిజ్ఞానంలో దిట్టలైతే చాలు వాళ్లకి ట్రైయినింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు. మొత్తం ఓటర్లు : 90 కోట్లు ఇంటర్నెట్ వాడే ఓటర్లు : 50కోట్లు 18–19 ఏళ్ల వయసు వారు : 1.5కోట్లు ఫేస్బుక్ వాడేవారు : 29.4 కోట్లు వాట్సాప్ వాడేవారు : 25 కోట్లు ట్విటర్ వాడేవారు : 3 కోట్లు ఇన్స్టాగ్రామ్ వాడేవారు : 6–8 కోట్లు -
ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య
గోస్పాడు: ప్రత్యేకహోదా రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లెల్లకు చెందిన జమాల్‌బాషా(27)కు ఏడాది క్రితం ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన హరిఫాతో వివాహమైంది. డిగ్రీ చదివినా ఏ ఉద్యోగమూ రాకపోవడంతో సెల్ఫోన్లు మరమ్మతు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే చాలీచాలని సొమ్ముతో జీవనం సాగించడం కష్టమైందని నిత్యం సతమత మవుతుండేవాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే తన లాంటి చదువుకున్న వారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేదని, కనీసం ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకునేవాడినని తరచూ అంటుండేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య హరిఫా చెబుతోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వాపోయింది. ఇదే విషయమై గోస్పాడు ఎస్ఐ నరేష్‌ను అడగ్గా.. మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ లభ్యం కాలేదని చెప్పారు. జమాల్‌బాషా భార్య చెబుతున్న సూసైడ్ నోట్‌పై అనుమానాలు ఉన్నాయన్నారు. -
'విద్యావ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ హామీ ఇచ్చిన కేజీ టూ పీజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన టీచర్స్ సమస్యలను పరిష్కరించడాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయారన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయకున్నా సర్కార్‌కు ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఉద్యోగికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే ఇప్పటికీ ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేకపోయింది.. అందుకే కాంగ్రెస్ నిరుద్యోగులకు 3 వేల నిరుద్యోగ భృతిని ప్రకటించినట్టు ఉత్తమ్ తెలిపారు. మరోవైపు గాంధీభవన్‌లో డీఎడ్ అభ్యర్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. మార్కుల పర్సెంటేజ్ అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నష్టపోతున్నామని అభ్యర్థులు ఆయనకు వివరించారు.