england tour
-
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్‌లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భలే ఛాన్స్.. ఇంగ్లండ్‌కు పయనం!
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోహిత్ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. వాళ్లందరికీ అవకాశం ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్‌లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్‌కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ట్రిప్‌లో భాగమైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా(అంచనా) ఎన్టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్‌దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 -
ఐపీఎల్లో రాణించినా పట్టించుకోలేదు.. ఇక నేను టీమిండియాకు ఆడటం కష్టమే..!
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు. గడిచిన ఐపీఎల్ సీజన్లో తన పర్ఫామెన్స్‌ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది. ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు. చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అతను సఫారీలతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని రాహుల్ త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)లో వైద్యుల పర్యవేక్షనలో ఉన్న అతను మెరుగైన చికిత్స నిమిత్తం జర్మనీకి వెళ్లనున్నట్లు టీమిండియా వర్గాలు వెల్లడించాయి. రాహుల్ జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆతర్వాత జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. England bound ✈️📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm— BCCI (@BCCI) June 16, 2022 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియాలోని మెజార్టీ సభ్యులు ఇవాళ లండన్ విమానం ఎక్కారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్ తదితరులు ఇవాళ ఉదయం ముంబై నుంచి లండన్‌కు బయల్దేరారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించగా.. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: 'రోహిత్ అందుబాటులో లేకపోతే కెప్టెన్‌గా అతడే సరైనోడు' -
టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కు కేఎల్ రాహుల్ దూరం..!
ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కూడిన భారత జట్టు రేపు (జూన్ 16) లండన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఈ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమేనని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ రాహుల్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రాహుల్ గాయం నుంచి కోలుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ సహచర సభ్యులతో రేపు ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉన్నా అతను ఇంకా ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) లోనే ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా టీమిండియా మొత్తం రేపు లండన్ ఫ్లైట్ ఎక్కనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు కూడా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే పంత్, శ్రేయస్ ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించాల్సి ఉంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చదవండి: వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్ -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు తొలి అవకాశం
ముంబై: ఐపీఎల్లో సత్తా చాటిన ఇద్దరు యువ పేస్ బౌలర్లకు భారత జట్టు పిలుపు లభించింది. ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొట్టిన ఉమ్రాన్ మలిక్, పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన అర్ష్‌దీప్ సింగ్‌లకు మొదటిసారి టీమిండియా అవకాశం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కొంత విరామం తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9న (ఢిల్లీ), 12న (కటక్), 14న (విశాఖపట్నం), 17న (రాజ్‌కోట్), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వేగం...పొదుపు... ప్రస్తుత ఐపీఎల్ ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు ఉమ్రాన్, అర్‡్షదీప్ ఎంపిక చూపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ తన అసలు సిసలు ఫాస్ట్ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం 150 కి.మీ. వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (156.9 కి.మీ.)ను నమోదు చేశాడు. వేగంతో కొన్నిసార్లు గతి తప్పినా... ఎక్కువ భాగం నియంత్రణతో కూడిన బౌలింగ్‌ను ప్రదర్శించిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. అర్‡్షదీప్ ఖాతాలో 10 వికెట్లే ఉన్నా పొదుపైన బౌలింగ్ (7.70 ఎకానమీ)తో ఆకట్టుకున్నాడు. వారిద్దరూ వచ్చారు... 2021 టి20 ప్రపంచకప్‌లో ఆడినా ఎక్కువ భాగం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న అతనికి సహజంగానే భారత జట్టులో చోటు లభించింది. 2019 తర్వాత భారత జట్టుకు ఆడని దినేశ్ కార్తీక్ కూడా ఐపీఎల్ ప్రదర్శనతోనే తిరిగి రావడం విశేషం. ఈ సీజన్లో 191.33 స్ట్రయిక్‌రేట్‌తో 287 పరుగులు చేసిన అతను డెత్ ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని దీపక్ చహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పేర్లను సెలక్టర్లు పరిశీలించలేదు. భారత జట్టు చివరిగా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడగా... అందులో భాగంగా ఉన్న సంజు సామ్సన్, మొహమ్మద్ సిరాజ్ మాత్రం జట్టులో చోటు కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు -
ఐపీఎల్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ పర్యటనకు రహానే దూరం
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడు, భారత క్రికెటర్ అజింక్య రహానే కండరాల గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ టోర్నీతోపాటు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా రహానే గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఫీల్డింగ్ చేయలేదు. రహానే కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్లో రహానే ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 133 పరుగులు సాధించాడు. -
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు..
లండన్: 3 టీ20లు, 5 వన్డేల సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. లీసెస్టర్ వేదికగా న్యూజిలాండ్ మహిళలు, ఇంగ్లండ్ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దృవీకరించాయి. కివీస్ బృందం బస చేస్తున్న హోటల్‌ను బాంబు పెట్టి పేల్చేస్తామని సదరు అగంతకుడు కివీస్ మేనేజ్మెంట్లోని ఓ వ్యక్తికి మెయిల్ చేశాడు. అయితే ఈ బెదిరింపు నమ్మదగదిగా లేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొట్టిపారేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఇటీవల కివీస్ పురుషుల జట్టు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా బెదిరింపులు వచ్చి ఉండవచ్చని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు బెదిరింపు తర్వాత కివీస్ మేల్ క్రికెటర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టేడియం బయట తమ ఆటగాళ్లపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కివీస్ ప్రధాని జెసిండా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్ జట్టు వైదొలిగిన తర్వాత ఇంగ్లండ్ జట్టు సైతం పాక్ టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..! -
మూడు కాదు.. ఐదు.. ఈసీబీకి ఆ ఆఫర్ ఇచ్చాం: బీసీసీఐ
Team India Tour Of England In July: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్ నిర్ణయాత్మక ఐదో టెస్టు వాయిదా పడిన నాటి నుంచి రీ షెడ్యూల్ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత ఆటగాళ్లకు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా ఆడేందుకు విముఖత చూపారని, కాబట్టి తాము ఓడినట్లు టీమిండియా అంగీకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక... మ్యాచ్ రద్దు కావడం వల్ల తమకు వాటిల్లిన నష్టం గురించి, విజేతను నిర్ణయించే అంశంలోనూ జోక్యం చేసుకోవాల్సిందిగా ఐసీసీ వివాద పరిష్కార కమిటీ(డీఆర్సీ)కి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో... మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆఖరి టెస్టు రద్దు కావడం వల్ల ఈసీబీకి జరిగిన నష్టాన్ని(సుమారు 40 మిలియన్ పౌండ్లు) పూడ్చేలా.. వచ్చే ఏడాది టూర్లో అదనపు టీ20లు ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా వీటిని ధ్రువీకరించారు. క్రిక్‌బజ్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘అవును.. నిజమే.. జూలైలో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో రెండు ఎక్స్ట్రా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీబీకి చెప్పాం. మూడు టీ20లకు బదులు ఐదు మ్యాచ్‌లు ఆడతాం. అంతేకాదు రద్దైన టెస్టు మ్యాచ్ కూడా ఆడతాం. అయితే, మా ఆఫర్‌ను అంగీకరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అనేది వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లండ్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. -
65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే?
లండన్: టీమిండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ దాదాపు 65 రోజుల తర్వాత తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దీంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ పరస్పరం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోను సూర్య తన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ స్టార్ తన భార్యతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్ ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో తెగవైరల్ అవుతోంది. కాగా సూర్యకుమార్ యాదవ్ గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌కు ముందు బయోబబుల్ కోసం తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తూ 10 రోజులు మళ్ళీ క్వారంటైన్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో ఈ జంట లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. చదవండి:Mohammed Siraj: సిరాజ్ ఎంపిక, విజయంలో ఆయన పాత్రే కీలకం! View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
లండన్ చేరిన భారత జట్టు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్‌గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్‌హామ్ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్‌లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్ ఈ నెల 13న ముగియనుంది. గంగూలీ...లార్డ్స్ టెస్టు చూసేందుకు! బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడు. భారత్‌ను తాజాగా ‘రెడ్’ లిస్ట్ నుంచి ‘అంబర్’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
పాక్ రివెంజ్.. హీరో మాత్రం అతనే!
భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. శుక్రవారం నాటింగ్హమ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ బాబర్ అజామ్ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. బ్యాట్జులిపించిన లిమాయ్ అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్. కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్లో) భారీ షాట్ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. The moment Liam Livingstone struck England's fastest T20I century 💪#ENGvPAKpic.twitter.com/nEkYA8iQsf — The Cricketer (@TheCricketerMag) July 16, 2021 -
టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. బీసీసీఐ అలర్ట్!
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. మరోవైపు 20 రోజుల బ్రేక్ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్ బారినపడ్డ(అసింప్టోమెటిక్ లక్షణాలు) విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్ లేఖను పంపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్యాంప్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. -
Viral Video: సూపర్ ఉమెన్ స్మృతి మంధాన.. జస్ట్ వావ్
ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది. Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v — Female Cricket (@imfemalecricket) July 3, 2021 కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది. -
ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్ బెంగాల్ మహిళా క్రికెటర్.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్-19, అండర్-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు. -
Team India England Tour: బ్యాకప్ కీపర్‌గా భరత్
న్యూఢిల్లీ: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు వెంబడి అదనపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ వెళ్లనున్నాడు. బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నా... అతను పర్యటన మధ్యలో గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ ఒకరు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ శ్రీకర్ భరత్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ టోర్నీలో ఆడే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో కోల్‌కతాలోని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెడతాడు. చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ -
రెండు వారాలు ముంబైలో... పది రోజులు సౌతాంప్టన్‌లో...
ముంబై: మూడున్నర నెలల ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణం మొదటి మజిలీ ముంబైకి చేరుకుంది. జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టూర్లో భాగంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతుంది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. రెండు ప్రత్యేక విమానాల్లో... టీమిండియా జట్టు సభ్యులు సురక్షితంగా ముంబైకి చేరుకునేందుకు బీసీసీఐ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ, చెన్నైల నుంచి ఈ విమానాలు బయలుదేరాయి. ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరారు. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎక్కగా... రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిన మయాంక్ అగర్వాల్ కూడా వీరితో జత కలిశాడు. ఇదే ఫ్లయిట్ హైదరాబాద్‌కు వెళ్లింది. మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిలతోపాటు సిరాజ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దీంట్లో ప్రయాణించి ముంబై చేరారు. ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు పుజారా, జడేజా, అక్షర్, షమీ మాత్రం తమ ‘నెగెటివ్ రిపోర్ట్’లతో కమర్షియల్ ఫ్లయిట్ల ద్వారా విడిగా ముంబై చేరారు. అలా అయితే ఎలా... తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫెనల్‌కు సంబంధించిన నిబంధనలపై ఐసీసీ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. టెస్టులో ఇరు జట్ల ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాని సమయంలో వర్షం కారణంగా ఆట రద్దయిపోతే ఎలా... మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఎలా... వీటిపై ఇంకా ఐసీసీ మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 4 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది. వారికి కాస్త సడలింపు... ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్‌కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు. మరోవైపు ఐపీఎల్‌లోనే కరోనా పాజిటివ్‌గా తేలిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా కోలుకున్నాడు. స్టేడియం పక్కనే... లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్‌కు వెళ్లిపోతుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ కొనసాగుతుండగానే టీమిం డియా క్వారంటైన్ మొదలవుతుంది. అయితే మ్యాచ్ జరిగే ఏజియస్ బౌల్ మైదానానికి ఆనుకునే ఉన్న హోటల్లోనే ఉండాల్సి రావడం కొంత వెసులుబాటు. ఇక్కడ భారత్ 10 రోజుల పాటు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది. -
కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే..
ముంబై: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కోహ్లీ సేనకు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసును అక్కడే ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యూకే ఆరోగ్య శాఖ పర్యవేక్షించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్ తొలి డోసును భారత్‌లో తీసుకున్న కోహ్లి అండ్ కో, రెండో డోసును ఇంగ్లండ్‌లో తీసుకోనుంది. 18 ఏళ్ల దాటిన వారు కోవిడ్ టీకాను తీసుకోవచ్చని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని బీసీసీఐ ప్రకటించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా ఇతర ఆటగాళ్లంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లకు మూడు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగా, రెండు వారాల క్వారెంటైన్ నిమిత్తం ఇదివరకే ముంబై చేరుకున్న భారత బృందం.. ఇంగ్లండ్‌కు వెళ్లాక అక్కడ కూడా పది రోజులు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీమిండియాకు బ్రిటన్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. జట్టు సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా చదవండి: రిటైర్మెంటే ఫైనల్: ఏబీ డివిలియర్స్ -
భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్..
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా పని చేస్తున్న అతను.. 2020లో పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో అతనికి జాతీయ జట్టుకు సేవలందించే అవకాశం దక్కింది. కాగా, ఒడిశాకు చెందిన శివ్ సుందర్ దాస్ 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడి 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. అతను 4 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఆడనుంది. చదవండి: టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు -
భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఓ సంఘటన త్వరలో చోటు చేసుకోనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈనెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. ఆనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటారని, ఆ సమయంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి
ముంబై: ఒకానొక సమయంలో తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించారు. ప్రపంచంలో తానొక్కడే ఒంటరి వాడినని ఫీలైనట్లు తెలిపాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెటర్’ పాడ్‌కాస్ట్‌లో భాగంగా కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వెల్లడించాడు. పాడ్‌కాస్ట్ సందర్భంగా నికోలస్, కోహ్లిని ఉద్దేశించి ‘‘మీ కెరీర్లో డిప్రెషన్‌కు గురైన సందర్భాలు ఏవైనా ఉన్నాయా’’ అని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి ‘‘అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దాదాపు చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితి అనుభవించి ఉంటారు. ఆ సమయంలో మనం దేన్ని కంట్రోల్ చేయలేం. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్ టూర్లో నేను ఇలాంటి పరిస్థితి అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది. నేనేం చేయలేకపోతున్నాననే బాధ నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’’ అన్నాడు కోహ్లి. ‘‘ఆ సమయంలో వృత్తి పరమైన నిపుణుడు మనతో పాటు ఉంటే బాగుండు అనిపించింది. అంత మందితో కలిసి ఉన్నప్పటికి నేను ఒంటరిగానే ఫీలయ్యేవాడిని. అయితే దీని గురించి ఎవరికి చెప్పలేదు. నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో వివరించేందుకు ఓ నిపుణుడితో మాట్లాడటం అవసరం అనిపించింది. కానీ ఆ సమయంలో ఎవరు లేరు. అప్పుడనిపించింది జీవితంలో ప్రతి దశలో మనకు ప్రొఫేషనల్ అవసరం ఉంటుంది అని. మనం ఎలా ఉన్నాం.. దేని గురించి ఆలోచిస్తున్నాం... దేని వల్ల మనం సరిగా నిద్ర పోలేకపోతున్నాం.. లేవలేక పోతున్నాం.. మన మీద మనకు నమ్మకం లేదు.. ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి.. మనం చెప్పేది వినడానికి ప్రొఫేషనల్ అవసరం ఎంతో ఉంది అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ పరిస్థితుల నుంచి బయటపడగలిగాను’’ అన్నాడు కోహ్లి. 2014 ఇంగ్లాండ్ టూర్లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0,7, 6, 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్‌లోకి వచ్చాడు. చదవండి: వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' -
విరాట్ కోహ్లి ఈజ్ బ్యాక్!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్ బై వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది... భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. (చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) -
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆగస్టు–సెప్టెంబర్ 2021లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్తాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఏడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్–ఇంగ్లండ్ మధ్య పోరునే ‘సెంటర్ పీస్ ఈవెంట్’గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4–8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12–16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25–29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్ 2–6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్ 10–14) జరుగుతాయి. పాకిస్తాన్‌లోనూ...: 16 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ టీమ్ పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ సిరీస్ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయల్దేరతాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్తాన్లో పర్యటించింది. -
మన దేశంలోనే జరిపేందుకు ప్రయత్నిస్తాం
దుబాయ్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అవసరమైతే ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించే విధంగా అక్కడి బోర్డులో బీసీసీఐ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నా... మన దేశంలో నిర్వహించాలనేదే తమ ఆలోచన అని అతను అన్నాడు. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో కోవిడ్–19 పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సౌరవ్ వెల్లడించాడు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు జరగాల్సి ఉంది. ‘భారత గడ్డపై దీనిని జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం. గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి. ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్ జరిగేందుకు ఏమాత్రం అ వకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహిం చి చూపించడం సంతోషంగా ఉంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ధోని సా ధించిన ఘనతలను బట్టి చూస్తే అతనిడి అన్ని విధాలా గౌరవించుకోవాలన్న గంగూలీ... ప్రస్తు త పరిస్థితుల్లో ధోని వీడ్కోలు మ్యాచ్ విషయంపై మాత్రం ఏమీ చెప్పలేనని స్ప ష్టం చేశాడు. తన మార్గదర్శ నంపై ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయనే విమర్శలపై కూడా ‘దాదా’ పెదవి విప్పాడు. సుమారు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తను అయ్యేరే కాదు, కోహ్లి... ఇంకే ఆటగాడు అడిగినా సాయమందిస్తానని చెప్పాడు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదని హితవు పలికాడు.