fellowship
-
నాస్ ఫెలోగా NIN సైంటిస్ట్ భానుప్రకాష్
జాతీయ వ్యవసాయ అకాడమీ(National Academy of Agricultural Sciences) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో భానుప్రకాష్ చేసిన విస్తృతపరిశోధనలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవకాశం దక్కిందని ఎన్ఐఎన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.మనిషికి ఎంత పోషకాహారం కావాలి? పోషకాహార లోపాలు, నిత్యం ఉపయోగించే వంట దినుసులతో అనేక వ్యాధులను ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే అంశాలపై భానుప్రకాష్ దశాబ్దాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వంట దినుసులతో మధుమేహాన్ని(Diabetes) ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే దానిపై విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయంగా 250 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఐసీఎంఆర్-బసంతి దేవి అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను భానుప్రకాష్ అందుకున్నారు. -
‘మస్క్ ఒక విలన్.. అందుకే రాజీనామా’
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్‌కు తీరుపట్ల యూకేలోని రాయల్ సొసైటీ సైంటిస్ట్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యూరో సైకాలజిస్ట్ ప్రొఫెసర్, గతంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకున్న డొరొతీ బిషప్ తన ఫెలోషిప్‌కు రాజీనామా చేశారు. ఇలాన్‌మస్క్ వివాదాస్పద ప్రవర్తనను నిరసిస్తూ బిషప్ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాయల్‌సొసైటీ ప్రముఖ సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, టెక్నాలజీస్ట్లకు వేదికని ఆమె అన్నారు.బిషప్ ‘గట్ రియాక్షన్’రాయల్‌సొసైటీ ఫెలోషిప్ అందుకున్న మస్క్ ప్రవర్తన సరిగా లేదని, అలాంటి వ్యక్తితో సమానంగా ఫెలోషిప్ పంచుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. రాయల్సొసైటీలో ఇలాన్‌మస్క్ సభ్యత్వాన్ని కొనసాగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధానపరమైన నిష్పాక్షికతకు రాయల్ సొసైటీ సింబాలిక్‌గా నిలిచిందన్నారు. అలాంటిది మస్క్ చర్యలతో సంస్థ ప్రతిష్ట మసకబారుతుందని పేర్కొన్నారు. బిషప్ రాజీనామాను కొందరు ‘గట్ రియాక్షన్’గా అభివర్ణించారు. మస్క్ తన అపారమైన సంపదను, పలుకుబడిని ఉపయోగించి తనతో విభేదించిన వారిని, ముఖ్యంగా శాస్త్రవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బిషప్ విమర్శించారు. ఆమె మస్క్‌ను ‘బాండ్ విలన్’తో పోల్చారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?డబ్బు విరాళం ఇచ్చి డోజ్ సారథిగా..అంతరిక్ష అన్వేషణ, ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణలో చేసిన కృషికి గాను 2018లో రాయల్ సొసైటీ ఫెలోగా ఇలాన్‌మస్క్ ఎన్నికయ్యారు. క్రమంగా తాను కొన్ని అంశాలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ పలుకుబడి, సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలకు సంబంధించి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి ఆయన పెద్ద మొత్తంలో డబ్బును విరాళం ఇచ్చారని, దానివల్ల యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథిగా నియమితులయ్యారనే వాదనలున్నాయి. ఈ చర్యలను పరిగణించి రాయల్ సొసైటీ తన ఫెలోషిప్‌ను పునఃపరిశీలించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. -
ఇండియా ఏఐ ఫెలోషిప్: అర్హతలు ఇవే..
అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ స్కాలర్ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్‌గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.పీహెచ్డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్‌ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి
ఆ అమ్మాయి వయొలిన్ సాధన చేస్తుంటే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. కాని ఇప్పుడు మొత్తం కేరళ ఆ అమ్మాయిని చూసి గర్విస్తోంది. 14 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ వారి ఫెలోషిప్‌కు ఎంపికై రికార్డు సృష్టించింది మార్టినా.ఈ వయసులో ఈ ఫెలోషిప్ సాధించిన వారు దేశంలో లేరు.ఏ వయసు వారైనా కేరళలో లేరు.సంగీతంతో ఆరోహణ దిశలో పయనిస్తోంది మార్టినా. సుప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు రాసిన ‘వాయులీనం’ కథలో భార్య తీవ్రంగా జబ్బు పడితే ఆమెను కాపాడుకోవడానికి భర్త ఆమె ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న వయొలిన్‌ని అమ్మేస్తాడు. ఆమె బతుకుతుంది. అమ్మకానికి వెళ్లిపోయిన వయొలిన్‌ని తలుచుకుని, మిగిలిన డబ్బుతో భర్త కొన్న చీరను చూస్తూ ‘పోనీలేండి జ్ఞాపకంగా పడి ఉంటుంది’ అంటుంది వేదనగా. జీవితంలో కళాసాధన, కళాసాధనకు ఎదురు నిలిచే జీవితం గురించి చెప్పిన కథ ఇది.మార్టినా జీవితంలో తండ్రి కూడా ఇలాంటి త్యాగమే చేశాడు. మొదలైన ప్రయాణం 14 ఏళ్ల మార్టినా ఇప్పుడు వయొలిన్లో గొప్ప పేరు సంపాదించి ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ ఫెలోషిప్ పోందిందిగాని ఇక్కడి వరకూ చేరడానికి ఆమె తండ్రి పడిన కష్టం ఉంది. మార్టినాది కన్నూరు జిల్లాలోని పెరవూర్. తండ్రి చార్లెస్‌కు బాల్యంలో గొప్ప మ్యుజీషియన్ కావాలని ఉండేది కాని ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొద్దోగొప్పో నేర్చుకున్న కీబోర్డుతో చర్చ్‌లో సంగీతం వాయించేవాడు. ఆ డబ్బు సరిపోక మిగిలిన సమయాల్లో ఆటో నడిపేవాడు. భార్య షైనీ గృహిణిగా ఉన్నంతలో సంసారాన్ని లాక్కువచ్చేది. అయితే ఐదారేళ్ల వయసు నుంచే కూతురు మార్టినా సంగీతంలో విశేష ప్రతిభ చూపడం వారికి ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆందోళన కలిగించాయి. ఆనందం కూతురికి సంగీతం వచ్చినందుకు, ఆందోళన అందుకు తగ్గట్టుగా నేర్పేందుకు వనరులు లేనందుకు. ఎనిమిదవ తరగతి వరకూ పెరవూర్లోనే చదువుకున్న మార్టినా అక్కడే ఉన్న ‘రాగం స్కూల్ ఆఫ్ మ్యూజిక్’లో వయొలిన్ నేర్చుకుంది. కానీ తర్వాతి స్థాయి వయొలిన్ నేర్చుకోవాలంటే త్రిశూర్‌లో చేరాలి. అంటే కుటుంబం మొత్తం త్రిశూర్‌కు మారాలి. అక్కడ మొదలైంది సమస్య. ఆటో అమ్మేసిన తండ్రి ఉంటున్న పెరవూర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశూర్‌కు కాపురం మారాలంటే చాలా ఖర్చు. సాధనకు వీలైన ఇల్లు తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం లక్ష రూపాయల విలువైన కొత్త వయొలిన్ కొనాలి. ఇవన్నీ ఆలోచించి తండ్రి ఆటో అమ్మేశాడు. అంతేకాదు తమ చిన్నపాటి ఇంటిని కూడా అమ్మేద్దామనుకున్నాడు. కాని బంధువులకు సంగతి తెలిసి వారు తలా ఒక చేయి వేశారు. 2019లో త్రిశూర్‌కు షిఫ్ట్ అయినప్పటి నుంచి మార్టినా సాధన పెంచింది. ఉదయం ఐదు గంటలకు లేచి స్కూల్ సమయం అయ్యే వరకు సాధన చేసేది. అయితే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. దాంతో మరో ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఏమైనా సరే కూతురిని గొప్ప వయొలినిస్ట్ చేయాలని చార్లెస్ సంకల్పం బూనాడు. జాతీయ విజేత త్రిశూర్‌లో, కొచ్చిలో గొప్ప గొప్ప గురువుల దగ్గర సాధన చేసి వయొలిన్ నేర్చుకుంది మార్టినా. తీగలను మీటి మీటి ఆమె చేతి వేలికొసలు రక్తాన్ని చిమ్మేవి. మెడ మీద వయొలిన్ ఉంచి ఉంచి కదుములు కట్టేవి. అయినా సరే మార్టినా తన సాధన మానలేదు. ఫలితం? ఆల్ ఇండియా వయొలిన్ కాంటెస్ట్ 2022, 2023... రెండు సంవత్సరాలూ ఆమే విజేతగా నిలిచింది. 100 మంది వయొలినిస్ట్లను ఓడించి మరీ! ఆ తర్వాత ‘సౌత్ ఏసియన్ సింఫనీ’లో సభ్యురాలు కాగలిగింది. ఈ సింఫనీ కోసం 11 దేశాల వయొలినిస్ట్లు పోటీ పడుతుంటారు. చివరగా ప్రతిష్ఠాత్మక ట్రినిటీ కాలేజ్ లండన్ ఫెలోషిప్ పోందింది. 14 ఏళ్ల వయసులో ఈ ఫెలోషిప్‌ను పోందిన వారు లేదు. చార్లెస్, షైనీల ఆనందానికి అవధులు లేవు.ఈ గొప్ప కళాకారిణి సంగీతానికి కొత్త శోభను తేవాలని కోరుకుందాం. -
కరీంనగర్ శిరీష: రూ. 50 లక్షల ‘ఇమ్మన’ ఫెలోషిప్! పోషకాహారంపై
గ్రామీణ–పట్టణ కుటుంబాల్లో పోషకాహార లేమి ఏ విధంగా ఉందో మూలాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కరీంనగర్ వాసి శిరీష జునుతులకు ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ ఆక్షన్స్ (ఇమ్మన)నుంచి యాభై లక్షల రూపాయల ఫెలోషిప్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌ను ఆరుగురు అందుకోగా వారిలో మన దేశం నుంచి శిరీష ఒక్కరే కావడం విశేషం. ఫెలోషిప్ వివరాలతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగాల్లో తను చేస్తున్న కృషి గురించి వివరించింది శిరీష. ‘‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో పీహెచ్డీ చేశాను. మేనేజ్‌లో రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాను. అర్బన్ ఫార్మింగ్, మైక్రో గ్రీన్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశాను. ఇప్పుడు ఈ ఫెలోషిప్ అగ్రికల్చర్, న్యూట్రిషన్, హెల్త్ ఈ మూడు విభాగాల్లో చేసిన ప్రాజెక్ట్‌కి వచ్చింది. ఇలా వచ్చిన నగదు మొత్తాన్ని ప్రాజెక్ట్ వర్క్‌కే వాడతాను. నేను గ్రామీణ, గిరిజన స్థాయిల్లో చేసిన ప్రాజెక్ట్ రిజల్ట్‌ని ఇక్రిశాట్లో జరిగిన కాన్ఫరెన్స్‌లో ప్రెజెంట్ చేశాను. స్వీడన్, మలావిల్లోనూ ఈ విశేషాలు తెలియజేయబోతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తులో ప్రెజెంటేషన్‌కి అవకాశం వచ్చిందంటే దీని ప్రాముఖ్యత ఈ సమయంలో చాలా ఉందని అర్ధమవుతోంది. కష్టమైన టాస్క్ అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయగలిగానని ఆనందంగా ఉంది. గ్రామీణ స్థాయికి వెళ్లాలి... వ్యవసాయం అనగానే మన జనాభాకు సరిపడా ఆహారోత్పత్తి జరగాలనే ఇన్నాళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు మన దేశం ఈ విషయంలో రెండవ స్థానంలో ఉంది. పోషకాహారలోపంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. మన దగ్గర చాలా మంది పోషకాహార లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల, వారు సులువుగా ప్రజల్లోకి తీసుకెళతారు. ఈ అధికారులు చెప్పడం వల్ల దీని ప్రభావం కూడా బాగుంటుంది. ఏ సాగు చేయాలి, ఎలాంటి పంటలు వేయాలి, కుటుంబాన్ని బట్టి, వారి పోషకాహార స్థాయులను బట్టి దిగుబడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల మీద ఇంకా సరైన అవగాహన రావాల్సి ఉంది. దీనివల్ల రక్తహీనత, పోషకాహారం లేమి వంటివి తగ్గించవచ్చు. గిరిజనుల ఆహారం అంగన్వాడీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా గ్రామీణ మహిళల కుటుంబాల పోషకాహార స్థాయిలు ఎలా ఉన్నాయి.. అనే దానిమీద స్టడీ చేశాను. మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకోవడం ఇటీవల పట్టణాల్లోనూ పెరిగింది. అయితే, గిరిజనులు ఎప్పటి నుంచో వీటిని తీసుకుంటున్నారు. దీనివల్ల వారి రోగనిరోధకశక్తి పట్టణాల్లో వారికన్నా మెరుగ్గా ఉంది. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడానికి తెలంగాణలోని గిరిజనుల కుటుంబాలను కలుసుకొని స్టడీ చేశాను. రాగి అంబలి, జొన్నరొట్టె, ఆకుకూరలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే అవగాహన తక్కువే. ఈ విషయంగా అవగాహన సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి అందరి కృషి అవసరం’’ అని వివరించింది శిరీష. అవగాహన ముఖ్యం: శిరీష మాది కరీంనగర్ జిల్లా, బొంతుపల్లి గ్రామం. వ్యవసాయం కుటుంబం. బిఎస్సీ హోమ్‌సైన్స్ చేశాక ఎమ్మెస్సీకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత పీహెచ్‌డి చేస్తున్నప్పుడే ఎన్ఐఆర్డిలో జరిగిన మీటింగ్‌లో ఈ ఫెలోషిప్‌కి అప్లయ్ చేసుకోవచ్చు అని తెలిసి అప్లయ్ చేశాను. దాదాపుగా నా చదువు అంతా ఫెలోషిప్స్తోనే గడిచింది. మా అన్నయ్య ఇచ్చే గైడ్‌లైన్స్ కూడా బాగా సహాయపడ్డాయి. – నిర్మలారెడ్డి -
మత్తు వదలరా... మద్యం మానేయాలంటూ హితభోధ!
సాక్షి, హైదరాబాద్: ‘టెన్త్‌లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని ముగ్గురం స్నేహితులం కలిసి బీరు కొనుక్కుని అందులో నీళ్లు పోసుకుని ట్యాంక్ బండ్ కింద ఫ్రెండ్ కారులో కూర్చుని తాగాం. అలా మొదలైన జర్నీ 33 సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. ఆఖరి 7 సంవత్సరాల్లో చివరి మూణ్నెళ్లు సూర్యుడ్ని చూడలేదంటే నమ్మండి’ అంటారు నగరానికి చెందిన కె.మూర్తి (62). ఆయనకు 36వ ఏటే హార్ట్ ఎటాక్ వచ్చి బైపాస్ సర్జరీ జరిగినా మద్యం మానని ఆయన ఇప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి, అరవైలో ఇరవైలా హాయిగా ఉన్నారు. అంతేకాకుండా తనలాంటి మరికొందరి చేత తాగుడు మానిపించే పనిలో బిజీగా ఉన్నారు. నగరానికి చెందిన ఓ టాప్ లేడీ డాక్టర్...20 ఏళ్ల పాటు మద్యానికి బానిసయ్యారు. అర్జున్‌రెడ్డి సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ థియేటర్స్‌కి కూడా తాగి వెళ్లేవారట. అలాంటి మహిళా వైద్యురాలు ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో పూర్తిగా మందు మానేసి ఆల్కహాల్ వ్యసనాన్ని దూరం చేసే మందుగా మారారు. ...ఇలా తాగుడు మానాలని అనుకున్నవారు, విజయవంతంగా మానేసిన వారు..కొత్త పాత ఆల్కహాలిక్స్ కొందరు నగరంలో పలు చోట్ల సమావేశం అవుతున్నారు. తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని కలిపేందుకు వారధిగా మారింది ఆల్కహాలిక్స్ అనానిమస్ ఫెలోషిప్. అమెరికాలో పుట్టి...అంతర్జాతీయంగా మెట్టి... దాదాపుగా 90 ఏళ్ల వయసున్న ఆల్కహాలిక్ అనానిమస్ (ఎఎ) సంస్థ అమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఆల్కహాలిక్స్ను విముక్తుల్ని చేసేందుకు అవసరమైన చికిత్సలో వైద్యులకు కో థెరపీగా గుర్తింపు పొందింది. దీనిలో భాగంగానే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మహిళలు, పురుషులు ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా ఇందులో భాగస్తులు అవుతారు. పరస్పరం ఆల్కహాలిజమ్ కు దూరమయ్యేందుకు సహకరించకుంటారు. ఫీజులు, రుసుములు ఏమీ ఉండవు. వ్యసనం నుంచి బయటపడాలనే ఆకాంక్ష ఒకటే అర్హత. మందులు, ఇతరత్రా ఉపయోగించరు. తాగుడు వ్యసనాన్ని దూరం చేసుకున్నవారిని సోబర్స్గా పిలుస్తారు. ఈ సోబర్స్.. బృందంలో చేరి ఆ విషయాలను విడమరచి చెప్పుకోవడం ఇందులో ప్రధానమైన విశేషం. వీరికి సంబంధించిన సమావేశాలు, ఇతరత్రా విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు. వ్యసన పరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లు కూడా దీనికి అనుబంధంగా పనిచేస్తుంటారు. ట్విన్ సిటీస్‌లోనూ మీటింగ్స్.. ఈ సంస్థ గురించి తెలిసిన నగరవాసులు గతంలో ముంబై వెళ్లి సమావేశాల్లో పాల్గొనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వారానికి 60, 70 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోనూ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్, వైఎంసిఎ నారాయణగూడ, మాదాపూర్, దిల్సుఖ్నగర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో వారానికి డజను దాకా సదస్సులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్లో పీక్స్.. ఈ సంస్థ కార్యకలాపాలు నగరంలో లాక్ డౌన్ టైమ్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ సమయంలో ఆల్కహాలిక్స్, వారి బంధువుల నుంచి హెల్ప్‌లైన్స్‌కి కాల్స్ వెల్లువెత్తాయి. అయితే మీటింగ్స్ నిర్వహించే అవకాశం లేక పలువురికి సాయం చేయలేకపోయాం అంటున్నారీ గ్రూప్ సభ్యులు. రెగ్యులర్ మెంబర్స్‌కి మాత్రం ఆన్లైన్, ఫోన్ ఇన్, జూమ్ మీటింగ్స్ నిర్వహించామని చెప్పారు. ఈ సంస్థ సహకారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 96664 66118/119 (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు
కోవూరు (నెల్లూరు): మండలంలోని ఇనమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు పొన్నవోలు సుధీర్‌రెడ్డి అల్లుడు ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి లండన్ రాయల్ కమిషన్ ఫెలోషిఫ్ అవార్డు అందజేసింది. సాయికుమార్‌రెడ్డి 2018లో లండన్ ఇంపీరియల్ కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆధునిక హైడ్రోజన్ వాయువుతో ఐదు రెట్లు వేగంతో నడిచే విమాన ఇంజిన్ల అభివృద్ధి మీద పరిశోధన చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పరిశోధనకు మెచ్చి 2021లో యంగ్ సెంటిస్ట్ అవార్డును ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయన రాసిన ఆర్టికల్‌ను జనరల్ ఆఫ్ ప్లూయిడ్స్ మెకానిక్స్‌లో ప్రచురించారు. అదే ఏడాది ఇంగ్లాడ్ దేశ రాయల్ కుటుంబంచే నడపబడే రాయల్ కమిషన్ ఆయన ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫెలోషిఫ్ అవార్డును అందజేశారు. ఇటీవల బ్రిటన్æ రాణి ఎలిజిబెత్ కుమార్తె రాయల్ ప్రిన్సెస్ అన్నే డాక్టర్ ఎద్దుల సాయికుమార్‌రెడ్డిని కొద్దిరోజుల క్రితం ప్రెసిడెన్సియల్ విందుకు ఆహ్వానించి రాయల్ ఫెలోషిప్ అవార్డును అందించి ఘనంగా సత్కరించారు. అవార్డు దక్కించకునేందుకు తనకెంతో సహకరించిన తల్లిదండ్రులు, అత్తమామలు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయికుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తనను ప్రోత్సహించిన అన్న స్వర్గీయ సాయిసందీప్రెడ్డికి డాక్టరేట్‌ను అంకితం ఇస్తున్నానని తెలిపారు. చదవండి: (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్నాథ్) -
రెండో విడత మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్
న్యూఢిల్లీ: యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు, అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) రెండో విడతను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్)లతో కలిసి ఈ రెండేళ్ల కోర్సును రూపొందించారు. దీనిలో భాగంగా విద్యార్థులు ఇటు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు క్షేత్ర స్థాయిలోనూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. సుశిక్షితులైన మానవ వనరులకు సంబంధించి నెలకొన్న డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడం మొదలైనవి ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాం లక్ష్యాలు. విద్య, వృత్తిపరమైన అనుభవం ఉన్న 21–30 మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
చట్టసభలను అధ్యయనం చేయాలనుకుంటున్నారా?
భారత పార్లమెంట్.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌ల పూర్తి సమాచారం... ఆర్ఎస్ఆర్ఎస్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ చైర్ అండ్ రాజ్యసభ ఫెలోషిప్స్ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్ అండ్ స్టడీ’ (ఆర్ఎస్ఆర్ఎస్) స్కీమ్‌గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్‌లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్‌షిప్‌లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యసభ ఇంటర్న్‌షిప్– అర్హతలు ► భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్‌షిప్ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు. గ్రాడ్యుయేట్స్ ఐదుగురు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐదుగురికి(మొత్తం 10 మంది) ఇంటర్న్స్‌గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ద్వారా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్న్స్ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ► ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్ సెక్షన్, బిల్ ఆఫీస్, టేబుల్ ఆఫీస్, కమిటీ సెక్షన్స్ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్ సూపర్విజన్/మెంటారింగ్ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. ► ఇంటర్న్‌షిప్ గడువు నాటికి ఇంటర్న్లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్వైజర్/మెంటార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. రాజ్యసభ ఫెలోషిప్– అర్హతలు ► మొత్తం నాలుగు ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ► కాలవ్యవధి: ఫెలోషిప్ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. ► అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ► రీసెర్చ్ గ్రాంట్: రాజ్యసభ ఫెలోషిప్స్ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్‌కు రీసెర్చ్ గ్రాంట్‌గా రూ.8లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్‌గా ఇస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► రాజ్యసభ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in ► రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in ► దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 ► వెబ్సైట్: https://rajyasabha.nic.in/rsnew/ fellowship/felloship_main.asp -
సీఓ2తో బ్యాటరీ..ఐఐటీ శాస్త్రవేత్తలకు ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్ : కాలుష్యకారక కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)తో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక స్వర్ణ జయంతి ఫెలోషిప్ లభించింది. లోహాలతోపాటు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఇంధనాన్ని నిల్వ చేసే ఈ బ్యాటరీ 2024లో భారత్ అంగారక ప్రయోగానికి, కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. హైదరాబాద్ ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ అండ్ క్రియేటివ్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ నానోమెటీరియల్స్ క్లుప్తంగా కార్బన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖరశర్మ కొంతకాలంగా కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ రకమైన బ్యాటరీ తయారీ సాధ్యమే అని ఇప్పటికే నిరూపించారు కూడా. ఈ ఆలోచనను నిజరూపంలోకి తెచ్చేందుకు స్వర్ణజయంతి ఫెలోషిప్ ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డులు కూడా తమ వంతు సహకారం అందిస్తాయి. ఈ సరికొత్త బ్యాటరీ తయారీ పూర్తయితే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్ను గణనీయంగా తగ్గించవచ్చు కూడా. అంగారకుడిపైనా అదే వాయువు... 2024లో అంగారకుడిపైకి ఒక అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అరుణగ్రహ వాతావరణంలో దాదాపు 95 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆ గ్రహంపై తిరిగే రోవర్లు, ల్యాండర్లను నడిపేందుకు ఈ వాయువుతో నడిచే బ్యాటరీలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బ్యాటరీల బరువు తగ్గడంతోపాటు అతితక్కువ ప్రాంతంలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. తద్వారా ప్రయోగ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేసిన సీఓ2 బ్యాటరీ ప్రతిపాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వర్ణ జయంతి ఫెలోషిప్ ఆసరాగా నమూనా సీఓ2 బ్యాటరీని తయారు చేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. -
ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) 2019 – 20 ఏడాదికి ఫెలోషిప్‌ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఐఐటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రేణుజాన్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి సీఎఫ్హెచ్ఈలో ఫెలోషిప్ కోర్సు ప్రారంభమవు తుందన్నారు. ఫెలోషిప్‌కు ఎంపికై న వారికి తొలి ఏడాది శిక్షణలో నెల కు రూ.50 వేలు ఇస్తామన్నారు. -
తెలుగు విద్యార్థులకు అన్యాయం..
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఫెలోషిప్ ఎంపికలో తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగు పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే నేషనల్ ఫెలోషిప్‌లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే ఎంపిక చేసిందని ఆరోపిస్తున్నారు. 2018–19 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫెలోషిప్‌నకు ఎంపికైన ఓబీసీ విద్యార్థుల జాబితాను యూజీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 1,000 మందిని ఎంపిక చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 54 మంది తెలుగు వారే ఎంపికయ్యారు. మరో 13 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను కలుపుకొంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 67 మంది మాత్రమే ఎంపికయ్యారు. పరిశోధనలో మేటిగా ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారని పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో లోపం ఉందని ఆరోపిస్తున్నారు. యూజీసీ ఎంపిక కమిటీ కావాలనే తెలుగు విద్యార్థులపై వివక్ష చూపిందని పేర్కొంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? నేషనల్ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసే విద్యార్థి ఎంఫిల్/పీహెచ్‌డీలో రిజిస్టర్ అయి ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారే ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని యూజీసీ ప్రకటించింది. ఈ అర్హతలతో పాటు విద్యార్థులకు పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా (మెరిట్) ఎంపిక చేస్తామని యూజీసీ ప్రకటించింది. అన్ని అర్హతలు కలిగి ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.25 వేల చొప్పున, తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.28 వేల చొప్పున యూజీసీ ఇస్తుంది. కంటింజెన్సీ కింద మొదటి రెండేళ్లు ఏటా కనీసంగా రూ.10 వేలు, రెండేళ్ల తర్వాత ఏటా కనీసంగా రూ.20 వేలు ఇస్తుంది. ఈ నిబంధల ప్రకారం అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐదారు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. అందులో 54 మందినే ఎంపిక చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే ఇది ముమ్మాటికి తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే. ఏ ప్లస్ గ్రేడ్ అక్రెడిటేషన్ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 7 మందినే ఎంపిక చేయడం సరికాదు. ఇక్కడ నెట్/సెట్ కలిగిన వారు వేలల్లో ఉన్నారు. పీహెచ్‌డీలు చేస్తున్న వారు ఉన్నారు. నాణ్యమైన పరిశోధన ఇక్కడే జరుగుతోంది. యూజీసీలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అన్యాయం చేశారు. కావాలనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించి తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. – విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెనగాని దయాకర్ -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని షేక్ నజ్మాసుల్తానా చదువులో ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ యూనియన్ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఈ ఫెలోషిప్ కింద ఎంఎస్ చేయడానికి నజ్మాసుల్తానాకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున రెండేళ్లపాటు ప్రోత్సాహకంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌కు ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో నజ్మాసుల్తానా ఒకరు కావడం విశేషం. చదువులో మేటి గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మాసుల్తానా చదువులో చిన్ననాటి నుంచి ప్రతిభ కనబరిచేది. తండ్రి అమీర్‌బాషా మిలటరీలో కెప్టెన్‌గా పనిచేయగా, తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. నజ్మాసుల్తానా 2013లో ట్రిపుల్ ఐటీలో పీయూసీలో చేరి, ఆ తరువాత ఇంజనీరింగ్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచి తీసుకుంది. అందులోనూ ప్రతిభ కనబరిచింది. ఇంజినీరింగ్‌లో 9.1 సీజీపీఏతో ఉత్తీర్ణురాలైన నజ్మాసుల్తానా ఐఐటీ మద్రాస్‌లో సిరామిక్ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. బయో మెటీరియల్స్‌పై అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్స్‌ను సైన్స్ జర్నల్స్‌కు సమర్పించింది. ఆగస్టులో ఫ్రాన్స్‌కు.. నజ్మాసుల్తానా యూరప్‌లోని ఫ్రాన్స్‌లో గల గ్రెనోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రథమ సంవత్సరం, జర్మనీలోని డామ్స్ట్రాడ్లో ఉన్న టెక్నికల్ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదవనుంది. యూరప్‌లోని నాలుగు దేశాల (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్)కు చెందిన ఏడు యూనివర్సిటీలు కలసి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించి రెండేళ్ల ఎంఎస్ కోర్సును అభివృద్ధి చేశాయి. ఈ కోర్సులో చేరేందుకు ప్రతిభావంతులైన యూరోపియన్ విద్యార్థులకు, యూరోపియనేతర విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి. నజ్మాసుల్తానా ఆగస్టు మూడో వారంలో ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. నజ్మా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులు అమీర్‌బాషా, ముజాహిదా సుల్తానాలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు సన్మానించారు. -
గిరిజనులకు ఇక నేషనల్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగలకు చెందిన పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. గతంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ద్వారా ఫెలోషిప్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఫెలోషిప్ కార్యక్రమ అమలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో పరిశోధన విద్యార్థుల ఎంపికను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. గైడ్ టీచర్ల ఎంపిక ప్రక్రియ మొదలు దరఖాస్తు విధానం, సబ్జెక్టుతో పాటు ప్రజెంటేషన్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ధారిస్తుంది. కార్యక్రమ అమలులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది. గిరిజన పరిశోధన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘నేషనల్ ఫెల్లోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్స్’కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీల పరిధిలో 157 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన తెగల నుంచి పరిశోధన విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 750 మంది గిరిజన పరిశోధన విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం కింద అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాగ్రత్తగా వడపోసి అర్హులను ఎంపిక చేసేందుకు శాస్త్రీయ పద్ధతిని అవలంభించనున్నారు. పీవీటీజీ తెగలకు చెందిన గిరిజనులకు 3 శాతంతో పాటు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు పరిశీలించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కేంద్రానికి పంపిస్తారు. అనంతరం వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వడపోసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఎంఫిల్ విద్యార్థులకు ప్రతి నెల రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.22 వేలు కంటింజెన్సీ కింద ఇస్తారు. అదేవిధంగా పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.28 వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందిస్తారు. కంటిజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. సగటున ఒక్కో పరిశోధన విద్యార్థికి ఏడేళ్ల కాలానికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఎంఫిల్‌కు... రెండేళ్ల పాటు ప్రతి నెలా 25 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా 22 వేలు ఇస్తారు. పీహెచ్డీ... ఐదేళ్ల పాటు ప్రతి నెల 28 వేల చొప్పున ఇస్తారు. కంటింజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. -
ఓటమిని కాదు..సవాళ్లను స్వీకరించండి
ప్రతిష్టాత్మక లండన్ రాయల్ సొసైటీలో భారతీయ మహిళా శాస్త్రవేత్త స్థానం సంపాదించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరుగా భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ ఎంపికయ్యారు. అంతేకాదు రాయల్ సోసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళా సైంటిస్ట్‌గా కాంగ్ ఘనతను దక్కించుకున్నారు. సైన్స్ రంగంలో వారి అసాధారణమైన రచనలు చేసిన ప్రపంచవ్యాప్తంగా 51 ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాను ఏప్రిల్ 16న ప్రకటించింది. వీరిలో కాంగ్ ఒకరు. రాయల్ సొసైటీ విజ్ఞాన శాస్త్రంలో శ్రేష్ఠమైనది. తన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్. వెల్లూరులోని ప్రముఖ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూర్ గాస్ట్రో ఇంటెస్టినల్ సైన్స్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న కాంగ్, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (బయోటెక్నాలజీ సెన్సెస్, సాంకేతిక మంత్రిత్వ విభాగానికి అనుబంధ సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ప్రాణాంతకమైన రోటా వైరస్ అంటువ్యాధుల నిరోధంపై ఆమె చేసిన కృషికిఈ గుర్తింపును గడించారు. భారతీయ పిల్లల్లో సహజంగా రోగనిరోధక శక్తే తక్కువగా ఉండటమే రోటా వైరస్ అంటురోగాలకు కారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో రోటా వైరస్ టీకా ఎందుకు సమర్థవంతమైంది కాదు అనే అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఆమె ఏర్పాటు చేసిన క్లినికల్ లాబ్ పరిశోధనలు సహకరించాయి. భారతదేశం సహా చైనా, బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలకు, టీకా తయారీ దారులకు ఈ ల్యాబ్ శిక్షణ ఇస్తుండటం విశేషం. అందుకున్న అవార్డులు 2010లో అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీ ఫెలోషిప్, 2011లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2013లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, 2015లో పబ్లిక్ హెల్త్ ఫ్యాకల్టీ, 2006లో భారత ప్రభుత్వం నుంచి విమెన్ బయోసైంటిస్టు ఆఫ్ ది ఇయర్ , 2016 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డున, అవార్డును కూడా గెలుచుకున్నారు. 2016 లో (లైఫ్ సైన్సెస్) ఇన్ఫోసిస్ సైన్స్ బహుమతిని అందుకున్నారు. మహిళలకు ఆమె ఇచ్చే సలహా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోని మహిళలకుఏ సలహా ఇస్తారు అని అడిగినపుడు ‘పెద్ద ఛాలెంజెస్ను స్వీకరించండి..మీకు మీరే గానీ, ఇతరుల సహకారంతోగానీ ప్రతి అంశాన్ని పూర్తిగా అన్వేషించండి..ఎట్టి పరిస్థితులలోనూ ఓటమిని అంగీకరించకండి’ అని చెప్పారు. నిజానికి ప్రొఫెషనల్ సలహా విషయంలో మహిళలకు, పురుషులకు పెద్ద వ్యత్యాసం ఉండదన్నారు. అయితే మహిళలను వెనక్కి నెట్టకుండా సాధికారిత వైపు నడిపించాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందనన్నారు. అలాగే నాయకత్వం స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళల సాధికారతకు మద్దతు అందించడం చాలా అవసరమని కాంగ్ అభిప్రాయపడ్డారు. -
రాయల్ ఫొటోగ్రాఫర్
ఛాయాశిల్పి పైన ఒక ఎర్రలైటు. దాని పక్కన మరో సాధారణ లైటు. ఆ లైట్ల కింద టేబుల్ పైన ఒక డిష్, డెవలపర్, ఫిక్సల్, వాటర్.. నెగటివ్‌ను డెవలప్‌చేసిన తర్వాత కనిపించే ఫొటో! తొమ్మిదో తరగతి సైన్స్ క్లబ్లో చేసిన ఆ ప్రయోగం అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఫొటోలు డెవలప్‌చేయడం ఎలా?’ అనే ఉత్సుకతతో తన కెరీర్‌కు శ్రీకారం చుట్టారు కుసుమ ప్రభాకర్. ఫొటోలు డెవలప్ చేయాలంటే ముందు ఫొటోలు తీయాలి కదా. అలా మొదలైన అభిరుచి ప్రభాకర్‌ని ఒక ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా మలిచింది. 1969 నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా బీఎస్సీ పూర్తి చేయలేకపోయినా చక్కటి ఫొటోగ్రాఫర్‌గా రాణించారు. 1977లోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రాఫర్స్‌లో సభ్యుడయ్యారు. ‘‘షట్టర్ నొక్కితే బొమ్మ వస్తుంది. కానీ నాకు కావలసింది ఆ బొమ్మ వెనుక ఉన్న ఆలోచన. దానిలో భావం ప్రతిఫలించాలి. జీవితాన్ని పట్టుకోవాలి. ఈ తపనతోనే నా జర్నీ ప్రారంభించాను. అనేక ప్రాంతాలు తిరిగాను. ఈ అన్వేషణలోనే ‘ది రాయల్æఫొటోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ గురించి తెలిసింది. 1853లో ఆవిర్భవించిన సంస్థ అది. 1984లో ఆ సంస్థలో నాకు అసోసియేట్‌షిప్ లభించింది. ఆ సంస్థ నుంచే ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ లభించింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు ప్రభాకర్. 1986లో ‘లైఫ్ ఇన్ కామన్వెల్త్’ అనే అంశంపైన కామన్వెల్త్ దేశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరిగినప్పుడు ఆ పోటీల్లో ప్రభాకర్ తీసిన ఫొటోలకు స్పెషల్ మెరిట్ అవార్డు లభించింది. ఆ పోటీల కోసం లంబాడాల జీవితాన్ని ఆయన ఇతివృత్తంగా ఎన్నుకున్నారు. వెలుతురు లేని నీడలు! ‘‘పెయింటింగ్ విత్ లైట్, పెయింటింగ్ విత్ షాడోస్.. సాధారణంగా ఏ ఫొటోగ్రాఫరైనా లైట్ల వెలుతురులోనే ఫొటోలు తీస్తారు. కానీ నా ఫొటోల్లో ఆ వెలుతురు ఉండదు. నీడలు మాత్రమే కనిపిస్తాయి. తల్లీబిడ్డల అనుబంధం, లంబండాల నృత్యాలు, ఆనందోత్సాహాలు వంటి ఛాయా చిత్రాలు నా ఫొటోగ్రఫీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అవన్నీ ఎలాంటి వెలుతురు అవసరం లేకుండా తీసినవే..’’ అని చెప్పారు ప్రభాకర్. కామన్వెల్త్ పోటీల్లో గెలుపొందడమే కాకుండా ప్రత్యేక ఆహ్వానంపైన నెల రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉండిపోయారు. మరిన్ని మెళకువలు నేర్చుకొన్నారు. ఆ తరువాత ఇండియాకు వచ్చి అనేక ప్రాంతాల్లో పర్యటించి జీవితాన్ని, ప్రకృతిని, సమాజ పరిణామాలను ప్రతిబింబించే అనేక చిత్రాలను షూట్ చేశారు. భావాల బంధనం ఫొటోగ్రఫీ కోసం వరంగల్‌లోని ఓ శరణాలయంలో చిన్నారులతో అనేక రోజులు గడిపారు ప్రభాకర్. వాళ్లలో లైంగిక వేధింపులకు గురైన ఓ అమ్మాయి మతిస్థిమితం కోల్పోయి తరచుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు; ఆకలో, ఇంకే బాధో తెలియని మరో చిన్నారి కంఠ నాళాలు తెగిపోతాయేమోనన్నంతగా అరుస్తున్నప్పుడు వారి ముఖకవళికలను ప్రభాకర్ కెమెరా వడగట్టింది ‘‘అలా 8 నెలల పాటు తీసిన ఫొటోల్లో 20 ఫొటోలను మాత్రమే పోటీకి పంపాను. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఆ పోటీల్లో పాల్గొన్నారు. భారత్ నుంచి నాకు అవార్డు లభించింది’’ అని ప్రభాకర్ తెలిపారు. గత నెల 24న ఆయన ఈ ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌ను సొంతం చేసుకున్నారు. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే! భావోద్వేగాలకు పటంలో ఘనీభవింపజేసే శక్తి ఒక్క కెమెరాకు మాత్రమే ఉంది. క్లిక్‌మనిపించే ఆ క్షణం ఒక జీవన సత్యం. అయితే ప్రతి దృశ్యం ఛాయాచిత్రం కాలేదు. దాని వెనుక ఉన్న భావం మాత్రమే ఒక అద్భుతమైన ఫొటో అవుతుంది. అలాంటి ఫొటోలను క్లిక్‌మనిపించడమే అభిరుచిగా, అలవాటుగా, వృత్తిగా, ప్రవృత్తిగా మలచుకున్నారు ప్రముఖ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ కుసుమ ప్రభాకర్. ఎన్నో అవార్డులను, అభినందనలను అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫిక్ సొసైటీ ఫెలోషిప్ ఆయనను వరించింది. గత మూడు దశాబ్దాల్లో ఈ ఫెలోషిప్‌ను పొందిన రెండో తెలుగు ఫొటోగ్రాఫర్ ప్రభాకరే. 1987లో అప్పటి ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజన్‌బాబుకు ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత కుసుమ ప్రభాకర్ ఈ అవార్డును అందుకున్నారు. -
‘వారికి’ యూజీసీ ఫెలోషిప్ ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ (నెట్)కు అర్హులు కాని విదేశీయులు, రిటైర్డ్ ప్రొఫెసర్లకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) ఫెలోషిప్ ఇవ్వరు. యూజీసీ గురువారం ఈ మేరకు కొత్త నిబంధనలు జారీ చేసింది. నిధుల కొరత, విద్యార్థుల నుంచి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ తెలిపింది. -
శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో ప్రత్యేక గౌరవం!
ఆధ్యాత్మిక సేవా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 37 కోట్లమంది ప్రజలకు చేరువైన ఆయన్ను ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించగా ప్రస్తుతం బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి యూనియన్ ప్రత్యేక హానరరీ ఫెలోషిప్ ను అందించి సత్కరించింది. హింసలేని సమాజాన్ని సృష్టించడంకోసం, ప్రపంచశాంతికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి సంఘం (ఎన్ఐఎస్ఏయు) ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా యోగా, మెడిటేషన్, ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి పరచేందుకు కృష్టి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ ప్రత్యేక సత్కారాన్ని అందించినట్లు ఎన్ఐఎస్ఏయు ఓ ప్రకటనలో తెలిపింది. రవిశంకర్ కృషి ప్రపంచ శాంతికి మరింత సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. వసుదైక కుటుంబం, సత్యమేవ జయతే అన్న సూత్రంతో, ప్రపంచదేశాలను ఒకే కుటుంబంగా మార్చాలన్న శ్రీ శ్రీ అసాధారణ ప్రయత్నాన్ని అక్కడి విద్యార్థులు కొనియాడుతున్నారు. ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందిస్తూ.. అదే మార్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత శ్రీ శ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వంలో నడవాలని బ్రిటన్ లో నివసిస్తున్న భారత విద్యార్థులంతా ఆశిస్తున్నట్లు ఎన్ ఐ ఎస్ ఏ యు అధ్యక్షుడు సనం ఆరోరా తెలిపారు. -
ఫెలోషిప్
ఫుల్బ్రైట్ - నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్స్ యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఇఎఫ్).. ఫుల్బ్రైట్-నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెరికాలోని ఎంపిక చేసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు చేసేందుకు ఈ ఫెలోషిప్లను ఇవ్వనుంది. ఫెలోషిప్ వ్యవధి: ఒకటి లేదా రెండేళ్లు. ఫెలోషిప్ వివరాలు జే-1 వీసా మంజూరుకు సాయం. విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణానికి (రానుపోను) అయ్యే ఖర్చులు ఇస్తారు. ట్యూషన్ ఫీజు; జీవన, సంబంధిత వ్యయాలను చెల్లిస్తారు. అర్హతలు * అమెరికాలోని నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతో సత్సమానమైన డిగ్రీని ఇండియాలోని గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పొంది ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ లేనివారు పీజీ చేసి ఉండాలి. * సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం. నాయకత్వం, సంఘ సేవలో చెప్పుకోదగ్గ అనుభవం. * అమెరికాలో ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసి ఉండకూడదు. డిగ్రీ కోర్సుకు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చివరి తేదీ: జూన్ 15 వివరాలకు: www.usief.org.in -
వివాదంలో మరో విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ: హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం ఇంకా చల్లారకముందే దేశ రాజధాని లో ప్రముఖ యూనిర్శిటీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం రేపింది. తన సమస్యను వారంలోగా తేల్చాలని ...లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను ఉద్దేశించి రెండు లేఖలు రాశాడు. తనకు రావాల్సిన గ్రాంట్ ను మంజూరు చేయకుండా వివక్షను గురి చేసి, వేధిస్తున్నారని దళిత స్కాలర్ మదన్ మెహర్ ఆరోపిస్తున్నాడు. తన పీహెచ్‌డీని ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలిపి వేసిన తన ఫెలోషిప్‌ను తక్షణమే కొనసాగించాలని అతడు డిమాండ్ చేశాడు. వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు. అయితే యూనివర్శిటీ వాదన దీనికి భిన్నంగా ఉంది. సదరు విద్యార్థి బ్రస్సెల్స్, బెల్జియంలో పర్యటన కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న రూ 66,000 ను యూనివర్శిటీకి తిరిగి చెల్లించాల్సింది ఉందన్నారు. విద్యార్ధి తన ఫెలోషిప్ కొనసాగించడానికి అనుమతించే ముందు, ఆ మొత్తం డబ్బులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుదని వైస్ ఛాన్సలర్ హెచ్. శర్మ బుధవారం పేర్కొన్నారు. వర్శిటీ కంట్రోలర్, ఫైనాన్స్ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతోనే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు చెప్పారు. మరోవైపు విద్యార్థిని ఒక కంట కనిపెట్టమని యూనివర్శిటీ భద్రతా అధికారిని అప్రమత్తం చేశామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు. మరోవైపు సమస్యలపై వర్సిటీ అధికారులు ఫిబ్రవరి 8న విద్యార్థులతో భేటీ కానుంది. కాగా జనవరి 17 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. -
యూజీసీపై రివ్యూ ప్యానెల్
న్యూఢిల్లీ: నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలోషిఫ్లు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలోచనపట్ల దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతున్న నేపథ్యంలో దానిపై పూర్తిస్థాయిలో పరిశీలనలు జరిపి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురితో ఓ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అసలు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇస్తున్న పరిశోధన గ్రాంటులను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఆ ప్యానెల్‌కు ఆదేశించింది. నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలో షిప్‌లు చెల్లించొద్దని యూజీసీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పరిశోధక విద్యార్థిలోకంతోపాటు పీజీ విద్యార్థులకు కూడా కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్నారు. గత ఎనిమిది రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మెట్టు దిగొచ్చిన కేంద్రం తమ నిర్ణయాన్ని ఇప్పుడే అమలు చేయొద్దని యూజీసీకి సూచించింది. అయితే, ఇది కంటి తుడుపుచర్యేనని, కేంద్రం తన ప్రకటనను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకున్నప్పుడే తాము ఆందోళన విరమిస్తామంటూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. -
ఫెలోషిప్ కోసం విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్: ఫెలోషిప్ కింద చెల్లించే మొత్తాన్ని పెంచాలని, క్రమం తప్పకుండా ఫెలోషిప్ అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఐఐసీటీ, సీసీఎంబీల్లో పనిచేస్తున్న విద్యార్థులు ఈ మేరకు సీసీఎంబీ కాంప్లెక్స్ నుంచి తార్నాకలో హుడా కాంప్లెక్స్ వరకు గురువారం మధ్యాహ్నం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. -
ఫెలోషిప్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్ఆర్డీ ఫెలోషిప్‌లు అందజేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. హెచ్ఆర్డీ ఫెలోషిప్ (లాంగ్‌టెర్మ్) విభాగాలు: టాక్సికాలజీ, జీనోమిక్స్, జరియాట్రిక్స్,స్టెమ్‌సెల్ రీసెర్చ్, క్లినికల్ ట్రైల్స్, డిసీజ్ మోడలింగ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్లినికల్ సైకాలజీ, క్వాలిటీ కంట్రోల్, మోడరన్ బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, డ్రగ్ కెమిస్ట్రీ, ఆపరేషనల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ ఎథిక్స్, హెల్త్ ఎకనమిక్స్. వ్యవధి: విభాగాన్ని బట్టి ఆరు మాసాల నుంచి ఏడాది వరకు. ఫెలోషిప్: పనిచేస్తున్న సంస్థలోనే పరిశోధన కొనసాగించేవారికి నెలకు రూ.20,000; ఇతర సంస్థల్లో పరిశోధన చేసేవారికి నెలకు రూ.40,000 అందజేస్తారు. కంటిన్జెన్సీ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ అదనం. అర్హత: ఎండీ/ ఎమ్మెస్/ ఎండీఎస్/ ఎంబీబీఎస్/ఎంవీఎస్సీ/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉండాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్త/ హెల్త్ రీసెర్చర్‌గా పనిచేస్తూ ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.icmr.nic.in -
మూడు రెట్లు పెరిగినబ్రిటన్ స్కాలర్ షిప్‌లు
భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యం లండన్: భారత్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో బ్రిటన్ తన ఉపకారవేతనాల పథకాన్ని మరింత విస్తరించింది. చీవెనింగ్ స్కాలర్‌షిప్‌ల పథకంపేరిట విద్యార్థులకు అందించే ఫెలోషిప్లను మూడురెట్లకు పైగా, 150కి పెంచారు. 2015- 16 సంవత్సరంనుంచి కేటాయింపును 24 లక్షల పౌండ్లకు (రూ. 24.68 కోట్లకు) పెంచారు. ప్రస్తుతం అమలులో ఉన్న 6 లక్షల పౌండ్లనుంచి (రూ. 6.18 కోట్లనుంచి) పెంచిన ఈ స్కాలర్షిప్లను రెండేళ్లపాటు అమలు చేస్తారు. నాయకత్వ సామర్థ్యం ఉన్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు బ్రిటన్‌లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునేందుకు స్కాలర్‌షిప్‌ల హెచ్చింపు మరింత ప్రోత్సాహకరం కాగలదని బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ వ్యవహారాల మంత్రి హ్యూగో స్వైర్ చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో అందించే ఈ స్కాలర్ షిప్‌ల పథకానికి బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ వ్యవహారాల కార్యాలయం నిధులందిస్తుంది. ఏడాది వ్యవధితో కూడిన మాస్టర్స్ డిగ్రీ కోర్సుకు ఈ స్కాలర్షిప్లు అందిస్తారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు మినహా 110కిపైగా దేశాల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందిస్తారు. -
పొత్తుల్లోనూ జిత్తులే..!
భాగస్వాములకూ బాబు వెన్నుపోట్లు మిత్రులను మోసగించడంలో ఘనాపాఠి బీజేపీకి ముచ్చటగా మూడుసార్లు చుక్కలు ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గకుండా పలు కుట్రలు 1999లో, 2004లోనూ కమలనాథులకు షాక్ ఈసారి కూడా ముప్పుతిప్పలు పెట్టిన బాబు 2009లో టీఆర్ఎస్, లెఫ్ట్‌లకు ఇదే పరిస్థితి సీహెచ్ శ్రీనివాసరావు నమ్ముకొన్న వారిని చివరకు నట్టేట ముంచడంలో చంద్రబాబు ఘనాపాఠి. మిత్రత్వమంటూనే మోసగించడంలో ఆయన అందెవేసిన చేయి. అప్పుడు... ఇప్పుడు... టీడీపీ అధ్యక్షునితో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎప్పుడూ నిండా మునుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు తహతహలాడిన బాబు, చివరకు ఆ పొత్తును వీలైనంతగా అపహాస్యం పాలు చేశారు. నామినేషన్ల దాఖలు తుది గడువు ముగిసేదాకా అటు మిత్ర పక్షాన్ని, ఇటు సొంత పార్టీ నేతలను కూడా నానా అవస్థలకు గురి చేశారు. పొత్తును నవ్వులాటగా, హైడ్రామాగా మార్చి ఇరు పార్టీల నేతలనూ ఏమార్చారు. పొత్తులో భాగంగా సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 15, 25 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిని బీజేపీకిచ్చేందుకు టీడీపీ అంగీకరించడం తెలిసిందే. కానీ పొత్తు పై ఎడతెగకుండా చర్చలు ‘సా.....గినా’ ఇరుపార్టీల మధ్య చివరి క్షణం దాకా అంతులేని గందరగోళమే, అస్పష్టతే! ఏ స్థానం ఎవరికన్న దానిపై లొల్లే లొల్లి. పొత్తుపై బాబు మడ త పేచీ పెడతారన్న బీజేపీ క్షేత్రస్థాయి నేతల అనుమానమే చివరికి నిజ మైంది. పొత్తు ధర్మాన్ని ఇలా పరిహసించడం బాబుకు కొత్తేమీ కాదు. 2004 బీజేపీతో అంటకాగినప్పుడూ, 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడూ ఆయన చేసింది అచ్చం ఇదే! ఎప్పుడూ అంతే 1999 ఎన్నికల్లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి కరిష్మా, కార్గిల్ యుద్ధ విజయ ప్రభావ ఫలితంగా బీజే పీ గాలి వీస్తుండటంతో ఆ పార్టీతో జతకట్టారు. బీజేపీకి 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి టీడీపీ 269 స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ అండతో బాబు 180 అసెంబ్లీ స్థానాలు, అంటే 70 శాతం సీట్లను కైవసం చేసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం సగమే, అంటే 12 స్థానాలే గెలిచింది. బాబు వెన్నుపోటే ఇందుకు కారణమని బీజేపీ రాష్ట్ర నేతలు అప్పట్లో వాపోయారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎక్కడ బలపడిపోతుందోనన్న భయంతో ఆ పార్టీ ఎదగకుండా చేసేందుకు బాబు తెరవెనుక మిత్రద్రోహానికి పాల్పడ్డారని, ఆ అభ్యర్థులు గెలవకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని చెబుతారు. టీడీపీ శ్రేణులతో సహాయ నిరాకరణ చేయించి వారిని వెన్నుపోటు పొడిచారు. తమ అగ్రనేతల ఇమేజీని సొమ్ము చే సుకుని భారీగా లాభపడ్డ బాబు, తమను మాత్రం ఇలా వెన్నుపోటుతో వంచించారంటూ బీజేపీ నేతలు ఆక్రోశించారు. 2004 ఓటమి నెపం బీజేపీపైకి 1999 ఎన్నికల విజయమంతా తన ఘనతేనని అప్పట్లో బాబు గొప్పలు పోయారు. బాబు అపర చాణుక్యుడంటూ పచ్చ పత్రికలు కూడా యథాశక్తి ఆకాశానికెత్తేసి తరించాయి. కానీ 2004కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆ ఎన్నికల్లో బాబు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దానికి 27 అసెంబ్లీ స్థానాలిచ్చి టీడీపీ 267 చోట్ల పోటీ చేసింది. బీజేపీ 2 సీట్లలో మాత్రమే గెలవగా, టీడీపీ కూడా 47 స్థానాలకు పరిమితమై మట్టికరిచింది. కనీసం బాబు నక్సలైట్ల దాడి బాధితుడన్న సానుభూతి కూడా పని చేయలేదంటే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఎంతగా వెల్లువెత్తిందో అర్థం చేసుకోవచ్చు! ఈ ఘోర పరాభవం పూర్తిగా స్వయంకృతమే అయినా, బీజేపీ వల్లే ఓడిపోయామంటూ విమర్శలు గుప్పించారు బాబు. పైగా బీజేపీ మతతత్వ పార్టీ అని, దానితో మరెప్పుడూ కలవబోమని ప్రకటించారు! అన్నట్టూ, ఆ ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన పలు స్థానాల్లో కూడా టీడీపీ నేతలను స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దించి వారిని ఓడించారు బాబు!! కొత్త పొత్తుల్లోనూ వెన్నుపోట్లే ఇక 2009 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీని వదులుకుని కొత్త పొత్తులకు తెర తీశారు బాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతత్వంలో కాంగ్రెస్‌ను ఢీకొనడం సులువు కాదని గ్రహించి, ముందు నుంచే టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ సహా మరికొన్ని చిన్నాచితకా పార్టీలను మచ్చిక చేసుకుని మహాకూటమికి తెర తీశారు. కానీ ఆ కొత్త మిత్రులకు కూడా తనదైన మార్కు వెన్నుపోట్లను రుచి చూపిన ఘనుడు బాబు! టీఆర్ఎస్కు 40 అసెంబ్లీ, 9 లోక్‌సభ, సీపీఐకి 14 అసెంబ్లీ, ఒక లోక్‌సభ, సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లిచ్చారు. కానీ పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి, టీఆర్ఎస్కు ఇచ్చిన మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలను బరిలో నిలిపారు. పైగా మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, మక్తల్‌లో కొత్తకోట దయాకర్‌రెడ్డిలను టీడీపీ బీఫారాలిచ్చి మరీ పోటీ చేయించిన చరిత్ర బాబుది! చివరికి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా టీడీపీ అభ్యర్థిని దించేందుకు ప్రయత్నించారు. అంతేగాక చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి జితేందర్‌రెడ్డికి చివరి రోజు మధ్యాహ్నం బీ ఫారమిచ్చి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. కానీ సమయం మించిపోవడంతో సాధ్యపడలేదు. ఇలా నమ్మిన ప్రతి ఒక్కరినీ మర్చిపోకుండా వెన్నుపోటు పొడవనిదే నిద్రపోని నాయకుడు బాబు! నేడూ అంతే తాజాగా బీజేపీతో పొత్తులంటూ డ్రామా నడిపిన బాబు, చివరికి సీట్ల సంఖ్య కూడా ఖరారయ్యాక... బీజేపీ అభ్యర్థులు బాగా లేరంటూ మడతపేచీకి దిగడం టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. బీజేపీ ఏ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలో కూడా తానే నిర్ణయించాలన్నట్టుగా బాబు వ్యవహరించడం ఆ నేతలకు మింగుడు పడటం లేదు. పొత్తుల డ్రామాలు నడిపించి, చివరకు అందులోనూ గందరగోళం రేపి... చివరికి ఓటమికి బీజేపీయే కారణమని నిందించడానికే బాబు ఇలా చేస్తున్నారన్న అనుమానాలు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.