followers
-
టార్గెట్ వంశీ.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపులు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.గన్నవరం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యుద్ధానికి సిద్ధం.. ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా!
-
అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
-
ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం. -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
జగన్ ను కలిసేందుకు పోటెత్తిన అభిమానులు
-
హిందూపురంలో బాలకృష్ణ హింసా రాజకీయం
-
ట్రెండ్ సెట్టర్.. 100M క్రాస్..
-
ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. -
ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు
-
‘ఎక్స్’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్’హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. దేశంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెయ్‌మార్‌కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్‌కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్ స్విఫ్ట్‌కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్ కర్దాషియన్‌కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్‌లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
కుప్పంలో దారుణం..
-
పులివెందులలో ‘పచ్చ’మూకల బరితెగింపు..
-
పోలీస్ స్టేషన్ లో YSRCP నేతపై టీడీపీ దాడి
-
చిత్తూరులో ఆగని టీడీపీ హింసాకాండ
-
YSRCP కార్యకర్తలపై టీడీపీ దాడులు..
-
విధ్వంసమే విధానమా..?
-
క్యాష్ ‘హంట్’
జనాలతో సందడిగా ఉండే ప్రాంతం అది..ఒక వ్యక్తి తొందరతొందరగా వచ్చి ఫుట్‌పాత్‌పై ఉన్న చెత్తకుండీకి అంటించి ఉన్న కవర్ తీసుకొని అందులోని 500 రూపాయల నోట్ జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. మనుషులే లేని మరో నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన పాతబస్టాండ్లోకి వేగంగా వెళ్లి ఇనుప చువ్వలో దాచిన వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్లాడు మరొకతను. వ్యూస్, లైక్స్ కోసమేనా?? సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, క్రికెట్ స్టేడియం వంటి పరిసర ప్రాంతాలతోపాటు బస్టాండ్లు, పార్కులు, ఫ్లైఓవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. నగరంలో న్యూ ట్రెండ్‌గా మారింది ఈ తరహా ట్రెజర్..కాదుకాదు క్యాష్ హంటింగ్. నగరంలోనే కాదు..నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో సైతం మనీ హంటింగ్ కొనసాగించడం విశేషం. కొందరు వ్యక్తులు ఇలా డబ్బులను వివిధ ప్రాంతాల్లో పెట్టి అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తు న్నారు. వీటి కోసం ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికగా ప్రత్యేకంగా సైట్లు, సోషల్ పేజ్‌లు తయారు చేసుకున్నారు. ఇందులోని ఫాలోవర్స్ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లో అక్కడకు చేరుకొని డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్. మరికొందరు యాక్సెసరీస్ ప్యాక్ చేసి పెట్టి వారి స్టోర్ లేదా బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సోషల్ మీడియా అకౌంట్లకు పెద్దఎత్తున ఫాలోవర్స్ ఉండటం విశేషం. సోషల్‌మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్‌ను ఆకర్షించడం, వ్యూస్, లైక్స్ సంఖ్య పెంచుకోవడానికి ఈ తరహా ట్రెజర్ హంటింగ్ నిర్వహిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సోషల్‌మీడియాలో ఫేమ్‌తో పాటు యాడ్స్ రూపంలో ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు హంట్ వీడియో పెడతారా అని ఫాలోవర్స్ చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా ఎవరు ముందు వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారనేది కూడా వీడియో తీసి అదే సోషల్ సైట్లలో పెడుతుంటే వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు.