Gautam Reddy
-
అది ముమ్మాటికీ చెంప దెబ్బే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరు పతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ధర్మం నాలుగు పాదాల నడుస్తు న్నదని చెప్పడానికి నిదర్శ నంగా నిలిచాయి. సుప్రీం వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటివే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలంటే కుదరదని సుప్రీం వ్యాఖ్యలు రుజువు చేశాయి. ఇక ప్రాయశ్చిత్త దీక్ష నాటకాలు అన్నీ వట్టివేనని కుండబద్దలు కొట్టినట్లయింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న సుప్రీం... సిట్ విచారణ ఎందుకంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని ప్రజలకు అర్థమైంది. ఒక వ్యక్తిని రాజకీయంగా హత్య చేసేందుకు పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్న నీచ రాజకీయం ‘చంద్రబాబు అండ్ కో’దని అందరికీ అర్థమైంది.సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే∙ప్రసాదం నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోవడం, వాసన రావడం... ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పదే పదే చెబుతూ వచ్చారు. అదీకాకుండా అసలు ఈ తతంగమంతా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టాకే జరిగింది. దానిని వదిలేసి అదేదో జగన్ హయాంలో జరిగిందంటూ మసిపూసి మారేడుకాయను చేసే ప్రక్రియను తలకెత్తుకున్న చంద్రబాబు తలదించుకొనేలా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారా లెక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాల్లో భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆల య ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రపైన మాయని మచ్చ వేయగలిగారు. ఆయన వ్యాఖ్యలు నిజమా, కాదా అని తెలుసుకోకుండా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేశారు. జనాన్ని నమ్మించేందుకు దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో బలైపోయారు. వాస్తవానికి జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయలేదు. చేసింది చంద్రబాబు. కానీ, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ డానికి కారకులైంది పవన్. ఇప్పుడు పవన్ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఏం చేయా లన్నదానిపై మల్లగుల్లాలు పడాల్సిన దుఃస్థితి నెలకొంది. ఇప్పటికైనా పవన్ తొందరపడకుండా నింపాదిగా రాజకీయాలు చేస్తేనే చంద్రబాబు వ్యూహాల నుండి తప్పించుకుని తనదైన శైలిలో తన అభిమానుల మనసులో ముద్ర వేసుకో గలుగుతారు. ఇక బీజేపీ పెద్దలు అచ్చంగా చంద్ర బాబు మౌత్ పీస్‌లుగా మారినట్లు కనిపించింది.ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై స్పందించిన తీరు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ చెబుతూనే, లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవడం అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. పాలకులు ఎవరున్నా అంతటి నీచ పరిస్థితికి దిగజారే అవకాశాలు ఉండవు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన దాఖలాలు ఉన్నాయి కదా! కేవలం 2014–19 మధ్యే ఆయన హయాంలో 14 సార్లు వెనక్కు పంపారు కదా! అంతమాత్రం చేత చంద్రబాబు హయాంలో జంతు కొవ్వు కలిపిన లడ్డూలు తయారైనట్లు భావించాలా? ఇది ఏమాత్రం సహేతుకం?ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుకు పూర్తిగా దూరమైనట్లు చంద్రబాబు గ్రహించి ఈ కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనివల్ల హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవచ్చని ఆయన భావించి ఉంటారని అనుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఆ నివేదికను ఒక రాజకీయ వేదిక మీద ఎందుకు చంద్రబాబు చదువుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అంటే ఎవరికైనా ఇట్టే ఆగ్రహావేశాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, జగన్ ప్రధానికి లేఖ రాయడం, సీజేఐకి కూడా రాస్తానని చెప్పడం, నేషనల్ మీడియాకు వాస్తవాలు వివరించడం, సుబ్బారెడ్డి లాంటి వారు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, కరుణాకర్ రెడ్డి లాంటి వారు ప్రమాణాలు చేయడం ఇలా అనేకానేక కార్య క్రమాల నేపథ్యంలో సామాన్య మానవుల్లో ఆలో చన రేకెత్తింది. కల్తీ జరిగిందని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. ఏది ఏమైనప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సామన్య జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నీయాంశంగా మారాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేలా సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రజలు స్వాగతిస్తారు. దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద నోరు విప్పాలి. ప్రజల్లో దెబ్బతిన్న మనోభావాలను తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలి.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు,వైయస్సార్ టీయూసీ -
ఉక్కు కార్మికుల ఎదురుతెన్నులు
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డు కుంటామనీ, అన్ని యూనియన్ల లీడర్లను తీసుకెళ్లి ప్రధానితో సమావేం ఏర్పాటు చేస్తామనీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ‘ఎటువంటి త్యాగాల కోసమైనా సిద్ధం’ అన్నారు పవన్ కల్యాణ్. రాజీనామా పేరుతో ప్రగ ల్భాలు పలికారు గంటా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ‘పొరపాటున జగన్ అనే వ్యక్తి ఓడిపోతే ప్రైవేటీకరణ తప్పద’ని జగన్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో దాదాపు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అటువంటి ప్లాంట్ 18 వేల మందికి ప్రత్య క్షంగానూ, 23 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. సాగర తీరాన నెలవై ఉన్న విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం లభించింది. ఇటువంటి కామధేనువు లాంటి ప్లాంట్ మూసి వేత దిశగా అడుగులు వేస్తోంది. అదీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థం వల్ల! ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో రెండు అన్నపూర్ణ, కృష్ణ పర్నేసులను ఆపేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క ఫర్నేస్‌తో అతి తక్కువ ఉక్కును ఉత్పత్తి చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల్లేవు.రెండు నెలలుగా పర్మినెంట్ ఉద్యోగులకూ వేతనాల్లేవ్. పీఎఫ్ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు అందించాల్సిన సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారు. కార్మి కులు దాదాపు 1300 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమే.అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా కూడా బాబు, పవన్‌లు కార్మికులను కలిసిన దాఖలాలు లేవు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీనివాస వర్మ చాలా నిర్మొహమాటంగా పెట్టుబడుల ఉపసంహ రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలను వెనక్కు తీసుకుంటోందన్నారు. ఇక రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జాడ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించారు. సీఎంగా తనకు కేంద్రం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. 2021లోనే కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాస్తూ ఈ ప్లాంటు ఆవశ్యకతను చాలా స్పష్టంగా వివరించారు. దీనిని ఎటువంటి పరిస్థి తుల్లోనూ అమ్మివేయద్దని కోరారు. ఇటువంటి లేఖనే టీడీపీ, జనసేన ఎందుకు రాయలేక పోతోంది? మోదీ, షా అంటే ఆ పార్టీల అధినేతలకు భయం అన్నది అర్థమ వుతోంది. కానీ, జగన్ నిర్మొహమాటంగా కేంద్రానికి చెప్పడమే కాకుండా విశాఖలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తుందని చెప్పారు. ఆయన చెప్పింది ఇప్పుడు నిజమనే భావన కనిపిస్తోంది. ప్లాంట్ నష్టపోకుండా లాభాల్లో నడవాలంటే బొగ్గు గనులు, ఉక్కు గనులు కేటాయించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంటు ఏర్పాటైన తొలినాళ్లలో దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. దీనికి సొంతంగా ఉక్కు, బొగ్గు గనులు లేవు. వీటిని ప్రైవేటు సంస్థల నుండి, వేరే రాష్ట్రాల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అనాలోచితంగా దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నులకు పెంచారు. దీంతో అప్పుల ఊబిలోకి ఇది కూరుకుపోయింది. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చేసిన రుణాలు కూడా పెద్ద భారంగా మారాయి. దీనిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించే ప్రయత్నం చేయ బోతోంది.ప్రైవేటైజేషన్‌లో భూమి ఎక్కువగా ఉంటే కొనేందుకు సంస్థలు ముందుకొస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే దాదాపు 20 వేల ఎకరాల భూమి ఉంది. ప్లాంటు పరిధిలో 11 వేలు, టౌన్ షిప్ పరిధిలో 500 ఎకరాలు, రిజర్వాయర్ పరిధిలో 500 ఎక రాలు, నిరుపయోగంగా మరో 7 వేల ఎక రాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉంది కాబట్టి అనేక ప్రైవేటు సంస్థలు ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గద్దల్లాగా వాలు తున్నాయి. ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ఆ సాకుతో ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమవుతోందన్న విమర్శ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కార్మికుల కడుపు కాలకముందే కేంద్ర పెద్దలు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలతో ప్లాంట్‌కు పున ర్జీవం పోయాలని ప్రజలు కోరుతున్నారు. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455 -
కపటపు పొత్తుల ఎత్తులు... చిత్తు!
మరో మూడు మాసాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమర శంఖరావం వినిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపు సాధ్యాసాధ్యాలను విశ్లేషించుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కూడా ఖరారు చేసే పనిని వేగవంతం చేస్తున్నాయి. అధికార వైసీపీ తన అభ్యర్థుల ప్రకటనను రెండు వారాల క్రితం నుండే ప్రారంభించింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఇదే అసలు సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. సీఎం అభ్యర్ధి ఎవరు అన్నదానిపై ఉన్న సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేననీ, ఇందులో రెండో ఆలోచనే లేదనీ చెప్పారు. అందుకు పవన్ కూడా అంగీకరించారని అన్నారు. దీంతో ఇప్పటి వరకూ ‘సీఎం ... సీఎం ...’ అంటూ గొంతు చించుకుని నినాదాలు చేసిన జన సైనికులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లోకేశ్ బాహా టంగా సీఎం అభ్యర్థిని ప్రకటించినా... జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండి పోవడంతో రా్రçష్టంలో ఆ పార్టీని నమ్ము కున్న సామాజికవర్గ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇదిలా ఉండగా పీకే వ్యూహాలు మొట్ట మొదటిగా జన సేన పార్టీపైనే ప్రయోగించడం మొదలుపెట్టారన్న వాదన ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ ఇంత బాహాటంగా చంద్రబాబే సీఎం అని చెప్పడానికి ప్రశాంత్ కిశోర్ సలహానే కారణమని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేసిన చంద్రబాబు వ్యూహానికి ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ సలహా మరింతగా ఉపయోగడిందని అంటున్నారు. పవన్ కల్యాణ్‌ను జీరో చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండబోదని, వచ్చే సీట్లన్నీ కేవలం తెలుగుదేశం, చంద్ర బాబు ఇమేజ్‌తోనే వచ్చాయని ప్రజల్లోకి, పార్టీ కేడర్‌లోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్ కిశోర్ సూచన గన్ షాట్‌గా పనిచేసిందన్నది విశ్లేషకుల మాట. నిన్న మొన్నటి వరకూ టిక్కెట్ల కేటాయింపు అంశంలో జనసేనాని అలిగితే చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తెలుగుదేశం – జనసేన పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన సీట్లు పోతున్నాయన్న బాధ తెలుగు తమ్ముళ్లలో ఉంది. ఇక జనసేనానిని నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురమే అన్న ఆందోళన కూడా జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పార్టీ ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఉంటుంది తప్ప గెలిచే అవకాశాలు ఉండవని వ్యూహాత్మకంగా ఒక వాదనను తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్లు పార్టీ కేడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం జనసేనను పలుచన చేశారని తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత పవన్‌ను సీఎంగా చూడాలన్న అభిలాష నెరవేరకుండా ఉండేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్ను తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందొకసారి 28 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు లేదా మూడు పార్లమెంటు స్థానాలంటూ మీడియాకు లీకులిచ్చి తమను, తమ పార్టీని తక్కువగా జనానికి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీకి 20 సీట్లు మాత్రమే ఇస్తామంటూ చంద్రబాబు చెబుతున్నారన్న ప్రచారాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కినుక వహిస్తే వచ్చే ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు పవన్‌ను కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. అసలు పవన్ లక్ష్యాన్ని మరిచారా, లేక పవన్ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడకు పవన్ గురయ్యారా అని రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. పార్టీ ఏర్పాటుచేసి 10 ఏళ్లు దాటిన తరువాత కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం జనసేన అధినేతకు లేక పోవటం, అందివచ్చిన ప్రతి అంశాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబుకు ఉన్న నైపు ణ్యం వంటి కారణాల వల్ల తమ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలబడ లేక పోతోందని జనసైనికులు వాపోతున్నారు. తాము బలంగా ఉన్నామని అనుకొంటున్న ఉభయ గోదావరి జిల్లా ల్లోనూ తమకు కావల్సిన సీట్లను అడిగి తీసుకోవడంలో జనసేనాని పూర్తిగా వైఫల్యం చెందారని జనసైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాక తెలుగుదేశం ప్రస్తుతం నియమించుకున్న రాజకీయ సలహాదారు తెలుగుదేశానికి ఉపయోగ పడేలా సలహాలు ఇస్తారనీ, తమకు మాత్రం ఆ సలహాలు నష్టం చేకూర్చేలా ఉంటాయనీ వారి అభిప్రాయంగా కనిపి స్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో రానున్న రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టే... తెలుగుదేశంవారు పథకం ప్రకారం తమ పార్టీని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపా రని జనసేన కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండటం ఇప్పుడు ఆ పార్టీలో పలు అనుమానాలకు తావిస్తోంది. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: గౌతమ్ మన మధ్య లేడనే విషయం నమ్మడానికి మనసుకి కష్టంగా ఉందని, ఎంత చెప్పినా ఆయన లేని లోటు తీరనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం జగన్.. గౌతమ్ చిత్రపటానికి నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని, ప్రతీ అడుగులో గౌతం తనకు తోడుగా ఉండేవాడని సీఎం జగన్ అన్నారు. రాజమోహన్ గారికంటే గౌతమ్ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేదని, తన ప్రోత్సాహంతోనే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనకు తోడుగా, స్నేహితుడిగా ఉండేవారన్నారు. వయసులో పెద్దవాడైనా.. ఆ గర్వం కనిపించేది కాదని, పైగా సోదర భావంతో మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్సీపీ మొత్తం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. -
కార్మికలోకం రుణం తీర్చుకున్నారు!
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కళ్లారా చూడాలని రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్మికలోకం పరితపించింది. ఆయన పాదయాత్రలో అడుగడుగునా కార్మికుల అడుగు జాడలు ప్రస్ఫుటంగా కనిపిం చాయి. ప్రతిచోటా కార్మికులు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలతో ఆయనను కలిశారు. వారి వారి సమస్యలను ఓపికతో విన్న జగన్మోహన్ రెడ్డి అక్కడే వారికి హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రావడానికి... కార్మికవర్గం పడిన శ్రమ, తాపత్రయం కూడా కారణాలే. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 11 ఏళ్లు. ఈ సందర్భంగా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును తలుచుకోవడం అవసరం. తాడిత, పీడిత ప్రజలు, కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగానే 2019 మే 30న అందరి ఆశీస్సులతో జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 రకాల కార్మిక యూనియన్లకు చెందిన ప్రతి ఒక్కరూ జగన్ విజయంలో ప్రధాన భూమిక పోషించినవారే. అందుకే అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుండే పాదయాత్రలో తనకు వచ్చిన వినతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు జగన్. ముఖ్య మంత్రిగా తొలి సంతకం అవ్వ–తాతలకు పింఛన్ పెంపు ఫైల్‌పై చేశారు. తర్వాత ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుండి ఏకంగా రూ. 10 వేలకు వేతనాన్ని పెంచారు. ఒకేసారి వేతనాన్ని 300 శాతం పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. అదేక్రమంలో డ్వాక్రా సంఘాల్లో పనిచేసే యానిమేటర్లు, బుక్ కీపర్లకు రూ. 10 వేల వంతున గౌరవ వేతనం అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అర్హత, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అందుకే పారిశుద్ధ్య కార్మికులకు రూ. 18 వేల వంతున వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇక అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 11,500, ఆయాలకు రూ. 7 వేల వంతున వేతనాల పెంపు చేశారు. గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుండి రూ. 4 వేలకు వేతనాన్ని పెంచారు. వారితోపాటే హోం గార్డులకు కూడా వేతనాలు పెంచి బడుగు జీవుల జీవితాల్లో దీపావళి కాంతులు నింపారు. పథకాలన్నీ కార్మిక నేస్తాలే! వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వెఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ భీమా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలు నిరుపేదల ఇళ్లల్లో సంక్షేమ సంక్రాంతిని నింపాయి. నగదు బదిలీ ద్వారా 24 రకాల పథకాల పేరిట లబ్ధిదారులకు రూ. 84,402.68 కోట్లు ఇచ్చారు. అలాగే నగదు బదిలీతో సంబంధం లేకుండా మరో 5 రకాల పథకాల ద్వారా 1,52,69,364 మంది లబ్ధిదారులకు రూ. 15,714.58 కోట్ల మేర లాభం కలిగించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో రూ. 1,00,117.26 కోట్లమేర ప్రజలకు లబ్ధి చేకూరింది. ఇందులో అసంఘటిత, సంఘటిత రంగాల్లో ఉన్న కార్మిక వర్గమే ఎక్కువ ప్రయోజనం పొందిందని వేరే చెప్పనవసరం లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల ముందుకే తీసుకెళ్లారు సీఎం జగన్. అప్పటివరకూ వివిధ రంగాల్లో చిన్నా చితకా వేతనాలకు కార్మికులుగా పనిచేస్తున్న యువతీ యువకులు ప్రభుత్వో ద్యోగులుగా, ప్రతినిధులుగా మారారు. విద్య, వైద్యాలను దరిచేర్చి... పేదలకు విద్య, వైద్యం అందకపోవడం వల్ల వారి అభివృద్ధి సాధ్యం కావటంలేదని గ్రహించి... ఆయా రంగాల్లో ‘నాడు–నేడు’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ తరహా సేవలను నిరుపేదల ముంగిటకు తీసుకొచ్చారు. ఇది ఆశించినదానికంటే మంచి ఫలితాల నిచ్చింది. అదేక్రమంలో ఆరోగ్య శ్రీ సేవల పరిధిని పెంచి నిరుపేదలైన కార్మికుల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అచ్చంగా కార్మికలోకాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక బీమా, కార్మికులకు గుర్తింపు కార్డుల అందజేత వంటి అనేకానేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంటిలో మహిళలు ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి వస్తుందని బలంగా నమ్మిన సీఎం జగన్ మహిళల పేరుతోనే సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కార్మిక మహిళలే ఎక్కువగా ఫలితం పొందుతున్నారు. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలకు భరోసా కల్పించారు. (క్లిక్: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?) అమరావతిలోనూ... మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మార్చిన చంద్రబాబు... ఆ మహానగరంలో నిర్మించ తలపెట్టిన నవ నగరాల్లో ఏ నగరంలో కూడా కార్మికులు ఉండకూదనీ, అలా ఉంటే సామాజిక సమతౌల్యం లోపి స్తుందనే పక్షపాత ధోరణిని ప్రదర్శించారు. కార్మిక వర్గాలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. పాదయాత్రలో ఉన్న జగన్‌కు నివేదించాయి. దానికి తీవ్రంగా స్పందించిన జగన్ అధికారంలోకి రాగానే ఆ అసమానతలను రూపు మాపి, అక్కడే కార్మిక వర్గానికి కూడా స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఆయన నిలబెట్టు కున్నారు. (క్లిక్: బాబు బ్రాండ్ రాజకీయాలు) ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి కార్మికులు చేసిన శ్రమ ఊరకే పోలేదు. ఆయన అధికారంలోకి రాగానే కార్మికుల రుణం తీర్చుకున్నారు. - డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్, రాష్ట్ర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు (నేడు వైకాపా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం) -
‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా రామ్కీ ఎన్విరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా దీన్ని రీబ్రాండ్ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్‌కు సంబంధించి తమ తొలి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈఎల్వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ .. రీసైక్లింగ్ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్ ప్రక్రియలో మదర్‌బోర్డులను ప్రాసెస్ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు .. రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేస్తోంది. -
విదేశీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో–2022లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రతి అంశంలో ఏపీ ప్రత్యేకత కనిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న ఎక్స్పోకి ఏర్పాట్లపై అధికారులతో గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎక్స్పోకి ప్రభుత్వం తరఫున మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవనుంది. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చాయి. ఈ నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది మంత్రికి వివరించారు. ఏపీ పెవిలియన్‌లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐటీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు తీసుకున్న చర్యలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. పర్యటన ఇలా.. ఈ నెల 13న 100 మంది సభ్యులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 14న పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం, రోడ్ షో నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 250 మందికి పైగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నేతృత్వంలో భారీ సమావేశం ఉంటుంది. 15న ప్రపంచ స్థాయి సకల సదుపాయాలతో కూడిన డీపీ వరల్డ్ ఫెసిలిటీ సైట్ విజిట్‌లతోపాటు వివిధ ఎమిరేట్ కంపెనీలతో బీ2జీ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశమై ఏపీ గురించి చర్చిస్తారు. -
సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు..
సాక్షి, విజయవాడ: చర్చలతో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి కూడా జీతం తగ్గలేదన్నారు. పే స్లిప్‌లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి -
టీడీపీలో ప్రతి నేత సంఘ విద్రోహశక్తే
సాక్షి, అమరావతి: మహిళలను అవమానిస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ నేతలకు నారీ సంకల్ప దీక్షలు చేసే అర్హత లేదని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలోని ప్రతినేత సంఘ విద్రోహశక్తేనని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష అన్నారు. నిస్సిగ్గుగా అత్యాచార నిందితులతో ఆ పార్టీ సంకల్ప దీక్షలు చేస్తోందని మండిపడ్డారు. లోకేష్ పీఏ మహిళలను లైంగికంగా వేధించలేదా? అని నిలదీశారు. మహిళా కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేయడం అందరూ చూశారన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం, దగా చేయడమేనని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు జరిగాయని గుర్తు చేశారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ పేరుతో ఎంతోమందిని వ్యభిచార కూపంలోకి దించారని నిప్పులు చెరిగారు. వనజాక్షిలాంటి అధికారిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుల తల్లి రిషితేశ్వరిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాను నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. -
1.08 లక్షల కిలోల బియ్యంతో తండులాభిషేకం
మధురానగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని లోక కల్యాణార్ధం 1.08 లక్షల కిలోల బియ్యంతో బాబాకు విశేషంగా అభిషేకం (తండులాభిషేకం) జరిగింది. ఉదయం తండులాభిషేకాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు నూతన సంవత్సర క్యాలెండర్లు, ప్రసాదాన్ని అందజేశారు. తండులాభిషేకాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో నమోదు చేసి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. బాబాను మంత్రి వెలంపల్లి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి దర్శించుకున్నారు. తండులాభిషేకంకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా అందజేస్తున్న దృశ్యం -
ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణానికి సంబంధించి సీఐడీ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఇందులోని సూత్రధారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ చైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని టెరాసాఫ్ట్ కంపెనీకి రూ.321 కోట్ల విలువైన టెండర్లు అప్పగించడమే కాకుండా రూ.121 కోట్ల పనులకు అక్రమ చెల్లింపులు జరిపారన్న విషయం సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. టెండర్ల ఎంపికలో టెరాసాఫ్ట్ ఎండీ.. టెరాసాఫ్ట్‌కు ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని.. టెండర్ల గడువును ఒక వారం పొడిగించి బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించిన మర్నాడే ఆ కంపెనీతో టెండర్లు వేయించారన్నారు. టెరాసాఫ్ట్‌కు ఈ రంగంలో అనుభవం లేకపోయినా టెండర్లు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వైనంపై బేస్ పవర్ సిస్టమ్స్ అనే కంపెనీ ఫిర్యాదు చేస్తే దానిపై దర్యాప్తు చేయకుండా, ఏకంగా ప్రభుత్వమే బేస్ పవర్ సిస్టమ్స్‌పై కేవియట్ దాఖలు చేసిందంటే ఈ కుట్ర వెనకున్న వారి హస్తం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ప్రతీఒక్కరూ శిక్ష ఎదుర్కొక తప్పదన్నారు. ప్రస్తుతం 19 మంది అనుమానితులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, దర్యాప్తు తర్వాత కీలక వ్యక్తుల పాత్ర బయటకు వస్తుందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత పురోగమించాలి
సాక్షి, అమరావతి: కళాత్మకత, సంస్కృతి సంప్రదాయాలకు చేనేత వస్త్రం జీవం పోస్తుందని, గాంధీజీ స్వయంగా రాట్నం ఒడికి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికి బ్రిటిష్ వారిని తిప్పికొట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆప్కో భవన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఘన చరిత్ర కలిగిన చేనేత కొత్త ట్రెండ్లకు అనుగుణంగా పురోగమించాలని, అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించి నేత వస్త్రాలను శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికుల అభివృద్ధికి పాటుపడ్డారని, మళ్లీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేతకు ఊతమిస్తున్నారన్నారు. పాదయాత్రలో నేత కార్మికుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్ ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా రూ.24 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారని చెప్పారు. చేనేత వంటి అనేక చేతి వృత్తులతో మన సంస్కృతిని సుసంపన్నం చేసి వెనకబడిన వర్గాలు నిలదొక్కుకునేలా సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందేలా చేనేత కార్మికులకు ఆధునిక డిజైన్ వస్త్రాల తయారీ శిక్షణకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆర్గానిక్ వస్త్రాల నేత, రసాయన రహిత వస్త్రాలు, కొత్త డిజైన్లు, రెడీమేడ్ వస్త్రాల తయారీపై రాష్ట్రంలో గట్టి కృషి జరుగుతోందని రామకృష్ణారెడ్డి అభినందించారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్: మంత్రి గౌతమ్‌రెడ్డి చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక ధర్మవరం ప్రాంతంలో 48 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సీఎం జగన్ తన పాదయాత్రలో ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారన్నారు. నేత కార్మికులను ఆదుకునేందుకు గతేడాది రూ.600 కోట్లు ఖర్చు చేశారని, ఈనెల 10న మరో రూ.200 కోట్లు నేత కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఖాదీ, చేనేత, పొందూరు తదితర బ్రాండ్ వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామన్నారు. సీఎం జగన్ చొరవతో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్ పోర్టల్ ద్వారా చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులో ఉందన్నారు. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తామన్నారు. ఏపీ చేనేత వస్త్రాలకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు మాట్లాడుతూ చేనేత కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. 11 మందికి సత్కారం.. చేనేత వస్త్రాల తయారీలో నూతన ఒరవడి సృష్టించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న 11 మందిని సత్కరించారు. మృతి చెందిన 13 మంది చేనేత కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు రూ.12,500 చొప్పున ఆర్థిక సాయం అందించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిభూషణ్ కుమార్, చేనేత జౌళి శాఖ డైరెక్టర్ పి.అర్జునరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ పోతుల సునీత, డీసీఎంఎస్ చైర్పర్సన్ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టు వస్త్రాల డిజైన్‌తో తపాలా కవర్ ధర్మవరం పట్టు చీరలు, పావడాలపై రూపొందించిన ప్రత్యేక తపాలా కవర్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి మేకపాటి శనివారం ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఈ కవర్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఆప్కో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మవరం పట్టు వస్త్రాల ప్రత్యేకత అయిన పెద్ద బోర్డర్, కాంట్రాస్ట్ రంగులను ప్రతిబింబిస్తూ తపాలా కవర్ ఒక జరీ బుటను కలిగి ఉండటం ప్రత్యేకత. పోస్టాఫీసుల అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.350 కోట్లతో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఎంఎస్ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్పెయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్ఎంఈలే వెన్నెముక అని పేర్కొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ టెర్మినళ్ల ఏర్పాటు దిశగా ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వనున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్ మ్యాన్‌పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని మంత్రి వివరించారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచాం కోవిడ్–19 సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచామని మంత్రి మేకపాటి చెప్పారు. కరోనా లాక్డౌన్ వల్ల ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంగా కృషి చేశామన్నారు. 11,238 యూనిట్లకు రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించామని చెప్పారు. లాక్డౌన్లో పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను రద్దు చేశామన్నారు. మూడేళ్లలో తిరిగి చెల్లించుకునేలా తక్కువ వడ్డీకి ఎంఎస్ఎంఈలకు రుణాలిచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. ‘వైఎస్సార్ నవోదయం’ పథకం ద్వారా వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్ విధానంలో ఒకేసారి లక్షకుపైగా యూనిట్లకు రూ.2,807 కోట్ల విలువైన రుణాలను అందించి ఎంఎస్ఎంఈల్లో జవసత్వం నింపామని తెలిపారు. సరసమైన ధరకే ఎంఎస్ఎంఈలకు భూమిని అందించి రాష్ట్రవ్యాప్తంగా 31 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఎంఎస్ఎంఈ సీఈవో పవనమూర్తి తదితరులు ఏపీ తరఫున పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న తీరును మెచ్చుకోవడమే కాకుండా ఈ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. కోవిడ్–19 తర్వాత ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌లో ‘గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్’ పేరిట జపాన్ రాజధాని టోక్యోలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా నిర్వహించబోతున్నామని, ఇందులో పాల్గొని రాష్ట్రం తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. -
విజయవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్‌లోకి టీడీపీకి చెందిన 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరారు. వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఆయన పనితీరును చూసి ఆకర్షితులై వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. (చదవండి: అందులో పట్టుబడ్డవారంతా టీడీపీ కార్యకర్తలే) వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందనే ఉద్ధేశ్యంతో నగరంలోని టీడీపీకి చెందిన స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పార్టీలోకి జాయిన్ అయ్యారని పేర్కొన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సైతం ప్రారంభించదలుచుకున్నామని వెల్లడించారు. టీడీపీలో ఆదరణ లేకపోగా, కులాల కంపుతో తమ అస్తిత్వాన్ని చంపుకుని ఉండలేమని అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్సీపీలోకి చేరారని తెలిపారు. ప్రజల మనిషిగా, పేదలకు సాయం చేసే వ్యక్తిగా ఉన్న సీఎం జగన్ వెంట తాము నడుస్తామని వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’) -
వలస కార్మికుల కన్నీళ్లు తుడుస్తున్న ఏపీ ప్రభుత్వం
కోవిడ్–19 ఉపద్రవాన్ని నియం త్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వలస కార్మికుల విషయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. ఉన్న ఊర్లో పనుల్లేక పొట్ట చేతబట్టుకుని తమది కాని దూర ప్రాంతాలలో పనిచేసుకుని పొట్ట నింపుకునేందుకు వెళ్లిన వారికి కరోనా మహమ్మారి అక్కడ కూడా పనిలేకుండా చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన ఇంటికి మనం వెళ్లి, అయినవాళ్ల మధ్య గడిపితే చాలనుకునే విధంగా చేసింది. అయితే ఎక్కడివ క్కడ రవాణా సౌకర్యాలు ఆగిపోవడం వారిని గందరగోళంలోకి నెట్టి వేసింది. ఇటు పనులు లేకా, అటు పోవడానికి వాహనాలు లేకా వారిని కాలిబాట పట్టేలా చేసింది. వేలాది మంది వందలకొద్దీ కిలోమీటర్లు నడిచి వెళ్తున్న దృశ్యం చూపరుల గుండెలను తరుక్కు పోయేలా చేసింది. వారి పాదాల నెత్తుటితో తడిసి రోడ్లు ఎరుపెక్కాయి. ఇందులో యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు, నెలల బిడ్డను చంకన ఎత్తుకొని పోతున్న తల్లులు ఉన్నారు, ఊళ్లో క్షేమ సమాచారం తెలియని తండ్రులు ఉన్నారు, మండుటెండలో నెత్తిన బండెడు మూటలు పెట్టుకుని నడుస్తున్న దంపతులు ఉన్నారు. ఒకరు ఎక్కడో తమిళనాడు నుంచి పట్నా పోవాలి. మరొకరు ఎక్కడినుంచో ఒడిశాకి రావాలి. పగవాడికి కూడా రాకూడని కష్టం! ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికుల వెతలను చెవికెక్కించుకోవడం హర్షింపదగ్గ విషయం. వివిధ వృత్తుల్లో పనిచేస్తూ వేర్వేరు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా స్వంత రాష్ట్రానికి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం బక్కచిక్కిన వలస కార్మికుల గోడుపైనే దృష్టి పెట్టింది. నిన్నమొన్నటి వరకూ దశలవారీగా మత్స్యకారులు, ఇతర వృత్తుల వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రభుత్వ చర్యలు వలస కూలీలకు ఎడారిలో ఒయాసిస్సులా ఆశలు రేపాయి. ఇందులో కొందరు పాదాలకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తుండటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి హృదయాన్ని కలచివేసింది. మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదే అని ఆయన గుర్తించారు. అదే అధికారులను ఆదేశించారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులో ఎక్కించి, రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలి. వారి పట్ల ఉదారంగా ఉండాలి. భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రిలీఫ్ క్యాంపులు నెలకొల్పి కూలీలు సేద తీర్చేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో దేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్, అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లాంటి ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. కార్మికులకు సంబంధించి ప్రభుత్వ స్పందన రెండు రకాలు. బయటి రాష్ట్రాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వారిని సురక్షితంగా ఇక్కడికి రప్పించడం, ఇక్కడ చిక్కుబడి పోయిన వివిధ రాష్ట్రాల వారిని వారి స్వస్థలాలకు తరలించడం. అయితే అక్కడి నుండి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు రావడానికి, పోవడానికి అవసరమైన ఏర్పాట్లు లేకపోయినప్పటికీ అందరూ మూకుమ్మడిగా ఎగబడటం, కరోనా అంటువ్యాధి కావడంతో ముఖ్యమంత్రి అప్రమత్తమై, అధికారుల్ని మేల్కొల్పారు. ముందుగా వలస కార్మికులను ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. ఇప్పుడు ఏకంగా వలస కార్మికులు మన రాష్ట్రానికి రావాలన్నా, మన రాష్ట్రానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులు వారివారి ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎవరి కాళ్లావేళ్లా పడాల్సిన పనిలేకుండా నేరుగా స్పందన వెబ్ సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇది వలస కార్మికులకు మరింత భరోసానిచ్చే విధంగా ఉంది. వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్లి, ఎవరిని కలవాలి...ఇందులో రాజకీయ పైరవీల వంటివి ఉంటాయా... అనేది తెలియని వాళ్లు అక్షరం ముక్క రాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడా పరిస్థితి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వలస కార్మికులకు విముక్తి కల్పిం చారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే సంబంధిత కార్మిక శాఖ కార్యాలయానికిగానీ, లేదా ఎవరితోనైనా ఆన్లైన్లో దరఖాస్తుగానీ చేసుకుంటే వారి అభ్యర్థనను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి కంట్రోల్ రూమ్‌లో 24/7 పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇది నిజంగా ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమనే చెప్పాలి. అలాగే క్వారంటైన్‌కు వెళ్లేవారికి రూ. 2 వేలు, మంచి పౌష్టికాహారం, మంచి పండ్లతో కిట్ ఇవ్వడం మరో ఎత్తు. ఇది పాలకులకు ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ రాష్ట్రం నుండి మొత్తం 12,794 మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసేందుకు వెళ్లారు. వారిలో అత్యధికంగా 2,062 మంది ఉత్తరప్రదేశ్‌కు, 1,110 మంది బిహార్‌కు, 1,086 మంది తెలంగాణకు, 822 మంది కర్ణాటకకు, వివిధ పనుల నిమిత్తం వలస వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇంతకుమించే ఈ వలస కూలీల సంఖ్య ఉంటుందని అనధికారిక అంచనా. వీరందరినీ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇతర రాష్ట్రాల వలస కూలీలకు అందిస్తున్న భోజనం, వసతి, వారికోసం ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లు, ఆర్టీసీ బస్సులు, అందులో వారి తరలింపునకు అయ్యే ఖర్చు మొత్తం మానవతా దృక్పథంతో ప్రభుత్వమే భరిస్తోంది. ఈ చర్యలు చేపట్టడం వల్ల రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలస కూలీల సంఖ్య బాగా తగ్గిందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు చెబుతున్నారు. ఇప్పటి వరకు 31 రైళ్లలో 36,823 మందిని వారి రాష్ట్రాలకు పంపించారు. రాష్ట్రంలోనే వేర్వేరు జిల్లాలకు చెందిన 1,09,742 మందిని వారి వారి స్వస్థలాలకు పంపించారు. కార్మికుల వెతలకు గుండె కరిగే జగన్ లాంటి ముఖ్యమంత్రి చర్యలు ఆదర్శనీయం, ఆచరణీయం. వ్యాసకర్త: గౌతమ్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 98481 05455 -
త్వరలో కొత్త ఐటీ పాలసీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. విశాఖలోని మధురవాడ హిల్–3 లో ఉన్న ఐటీ ఇన్నోవేషన్ వ్యాలీలో ఐటీ పరిశ్రమల సీఈవోలు, ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలు, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను పరిశ్రమల ప్రతినిధులను అడిగి తెలసుకున్నారు. ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనీ, పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటించనున్నామనీ.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రాయితీలు అందించేలా ఇది ఉంటుందని వివరించారు. ఏడాదికి 50వేల ఐటీ ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో మంజూరు కాని సబ్సిడీ నిధుల బకాయిలు త్వరలో విడుదల చేస్తామని కంపెనీ సీఈవోలకు హామీ ఇచ్చారు. విశాఖ ఐటీ హిల్స్‌లో ఎన్ని పరిశ్రమలున్నాయి, ఎంత భూమిని పొందాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించాయి, స్థలాలు తీసుకుని బిల్డింగ్లు నిర్మాణం చేసి వాటిని ఏవిధంగా వినియోగిస్తున్నారు.. మొదలైన వివరాల్ని వచ్చే సమావేశం సమయానికి తనకు అందించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పిస్తాం పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా మొదలైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పరిశ్రమలు విశాఖ నుంచి తరలిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల్ని ప్రశంసించిన మంత్రులు.. ఈ సందర్భంగా.. వివిధ పరిశ్రమల్ని మంత్రులు పరిశీలించి.. ఉద్యోగులతో మాట్లాడారు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ‘రిమోట్ కంట్రోల్ వాటర్ రెస్క్యూ క్రాప్’ ప్రాజెక్టుని రూపొందించిన ఉద్యోగుల్ని మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి ప్రశంసించారు. ఇది ఒడ్డు నుంచి 2 కిలో మీటర్లు దూరం వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు తయారీకి రూ.5 లక్షలు వరకు ఖర్చవుతుందని మంత్రులకు వివరించారు. -
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
సాక్షి, అమరావతి: రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ (ఎస్ఎస్ఎస్ స్ప్రింగ్స్) సంస్థ రాష్ట్రంలో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా ఎస్ఎస్ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటుచేయనున్న డిఫెన్స్, ఏరోస్పేస్ క్లస్టర్‌పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు. బోయింగ్, ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్, లాక్‌హీద్ మార్టిన్ వంటి సంస్థలు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి వ్యక్తంచేసినట్లు మేకపాటి తెలిపారు. టాటా ఏరోస్పేస్ సంస్థ కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి కనబరిచిందని, త్వరలోనే సీఎం సమక్షంలో మరోమారు చర్చలు జరపనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్కు ఎన్ఎస్డీసీ సహకారం: మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సహకారం అందించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. న్యూఢిల్లీలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఎండీ, సీఈఓ డాక్టర్ మనీష్‌కుమార్ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అందించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. రెనాల్ట్ ఇండియాతో పాటు, సీమెన్స్ వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. -
‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’
సాక్షి, అమరావతి : ఓటమి భయంతో కౌంటింగ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో కౌంటింగ్ రోజున గొడవలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు, కుయుక్తులకు తెరతీసిందని అన్నారు. ఆ క్రమంలోనే పదిహేడుమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించిందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆయన మంగళవారం కలిసి ఆధారాలతో సహా టీడీపీ కుట్రలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రౌడీషీటర్లను కౌంటింగ్ ప్రక్రియలంలో పాల్గొనకుండా అడ్డుకోవాలని వినతి పత్రం అందించారు. కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీషీటర్లని ఎందుకు అనుమతించారో జిల్లా అధికారులు చెప్పాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులను బెదించడం, భయపెట్టడం కాదంటే కాల్లబేరానికి రావడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. -
సీపీఎస్‌ను తక్షణం రద్దు చేయండి
సాక్షి, అమరావతి: కమిటీలతో కాలయాపన చేయకుండా రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. సీపీఎస్ రద్దు కోరుతూ విజయవాడలోని దాసరి భవన్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల సమస్యగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం జరుగుతున్న పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని ప్రకటించారు. పోరాటాన్ని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసులను ప్రయోగించడం దారుణమన్నారు. ఛలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా అరెస్టులు చేసినప్పటికీ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకుని ఉద్యమం నిర్వహించడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారికి ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడపై కత్తిలా ఉన్న సీపీఎస్ కన్పించడంలేదని, అందుకే అసెంబ్లీ ముట్టడిలో ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు లేడని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకుంటే నవంబర్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం చేసిన తీర్మానం వివరాలను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతామని చెప్పారు. సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత జల్లి విల్సన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పోలారి, ఆమ్ఆద్మీ నేత పోతిన వెంకట రామారావు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ప్రధాన కార్యదర్శులు బాబురెడ్డి, జి.హృదయరాజు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అ«ధ్యక్షుడు చలసాని రామారావు, శ్రామిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు కళ్లేపల్లి శైలజ, వీఆర్వో సంఘ నాయకుడు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. సీపీఎస్ రద్దు ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పొట్టకొట్టే సీపీఎస్ రద్దు కోసం జరిగే ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి చెప్పారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి నుంచి సీపీఎస్ రద్దు కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఉద్యమానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారని తెలిపారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, హెలికాఫ్ట్టర్, విమానాల్లో చక్కర్లు కొట్టేందుకు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్న చంద్రబాబుకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి మనసు రావడంలేదని మండిపడ్డారు. 35 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన వ్యక్తికి పెన్షన్ భరోసా కూడా లేకుండా చేస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ రద్దు విషయంలో ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. -
‘వ్యర్థాల నుంచి విద్యుత్’పై రామ్కీ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రామ్కీ గ్రూప్ కంపెనీ... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా 45 మెగావాట్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహిస్తోంది. ఇవి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై సంస్థ రూ.600 కోట్లు వ్యయం చేసింది. మరో 105 మెగావాట్లకు సమానమైన ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ ఎం.గౌతమ్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి కోసం సుమారు రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. 2021 నాటికి ఇతర విభాగాలపై కంపెనీ మరో రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త మార్కెట్లకు.. కేకేఆర్‌కు వాటా విక్రయించటం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అడుగుపెట్టడానికి వినియోగించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో కంపెనీ సేవలందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 30% ఆదాయం సమకూరుతోంది. 2021 నాటికి ఇది 35– 36 శాతానికి చేరనుంది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తాం. మొత్తంగా భారత మార్కెట్ రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధిని నడిపిస్తుంది. క్లీన్ ఇండియా లక్ష్యంతో రామ్కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేకేఆర్ తోడవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సంబంధ సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్య 18,000కు... ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.3,670 కోట్లు. విక్రయం అనంతరం సంస్థలో రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాటా 40 శాతానికి పరిమితమవుతుంది. తాజా డీల్‌లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రైవేట్ ఈక్విటీ, స్టాండర్డ్ చార్టర్డ్‌లు కంపెనీలో తమకున్న 11 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించాయి. ఇక రామ్కీ ఎన్విరో ఎండీగా గౌతమ్‌రెడ్డి కొనసాగుతారు. కేకేఆర్ టీమ్ సభ్యులు కంపెనీ బోర్డులోకి వస్తారు. కంపెనీలో ప్రస్తుతం 10,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 18,000 దాటనుంది. భారత్‌లో 20 నగరాల్లో రామ్కీ ఎన్విరో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కంపెనీ ఏటా 35 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 10 లక్షల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహిస్తోంది. 20,000 పైచిలుకు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు సేవలందిస్తోంది. -
వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన పూనూరు గౌతంరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆగ్రహావేశాలు
♦ వంగవీటి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు ♦ రాధా, రత్నకుమారి తదితరుల తీవ్ర నిరసన ♦ అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తత ♦ రంగా కుటుంబానికి బాసటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ♦ వైఎస్సార్ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్ ♦ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు దివంగత నేత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహావేశాలకు దారితీశాయి. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహించేం దుకు వెళ్తున్న వంగవీటి రాధా, ఆయన తల్లిరత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ ఆదివారం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీసింది. 1. మొగల్రాజపురంలోని తన నివాసం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని అడ్డుకున్న పోలీసులు 2. వంగవీటి రాధాకృష్ణను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సాక్షి, అమరావతి బ్యూరో : వంగవీటి రంగా, రాధాపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రంగా కుటుంబానికి బాసటగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌతంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో పాటు పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం బందరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు వస్తున్న వంగవీటి రంగా తనయుడు రాధాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాధా, రత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ నగరం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. గౌతంరెడ్డిపై పెల్లుబికిన ఆగ్రహం వంగవీటి రంగా, రాధాలపై ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబికింది. గౌతంరెడ్డిపై వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మొగల్రాజపురం వీధుల్లో వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు గౌతంరెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రంగా కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ గౌతంరెడ్డి వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధి ష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదంటూ తేల్చిచెబుతూ.. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గౌతంరెడ్డి వ్యవహారశైలిని తప్పుబడుతూ.. రంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రెండు రోజులుగా టీవీ చానల్లో గౌతంరెడ్డి ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు ప్రసారం కావడం.. ఆదివారం ఉదయం సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలకు సంబం «ధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసుల ఓవరాక్షన్.. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు బందరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో వంగవీటి రాధా విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఇందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్తున్న రాధాను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న రాధా తల్లి రత్నకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వావాదానికి దిగారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రాధా, రత్నకుమారి, పార్టీ నేతల మధ్య తోపులాట జరగడంతో రత్నకుమారి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు, అభిమానులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ఓవరాక్షన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హైడ్రామా... వంగవీటి రా«ధ, రత్నకుమారిని అదపులోకి తీసుకున్న పోలీసులు నగరంలోని పలు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ హైడ్రామా నడిపించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్నప్పటికీ రాత్రి వరకు నగరమంతా తిప్పి, చివరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాధ, రత్నకుమారి స్టేషన్లో నేలపైనే కూర్చుని పోలీసుల తీరుకు నిరసన తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. మరికొంత మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుచిత వ్యాఖ్యలు సరికాదు : కొలనుకొండ విజయవాడ సెంట్రల్ : దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆదివారం ప్రకటన్లో సూచిం చారు. గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు రంగా అభిమానుల మనో భావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రంగా ఆరాధ్యదైవమని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తుండగా ప్రత్యర్థుల చేతిలో రంగా హత్యకు గురవడం, తదనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలు సని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు. వంగవీటి రాధా, రత్నకుమారి అక్రమ నిర్బంధం ఇబ్రహీంపట్నం(మైలవరం) : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా నిర్బంధించారు. విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వైఎ స్సార్ సీపీ కార్యాలయానికి వెళ్తున్న రాధాను, ఆయన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. చిరిగిన చొక్కాతో స్టేషన్లో ఉన్న రాధా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధానికి నిరసనగా తల్లీకుమారులు పోలీస్ స్టేషన్లో నేలపై కూర్చున్నారు. రాధా, రత్నకుమారిని పోలీసులు నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వంగవీటి మోహనరంగా జోహార్ అంటూ నినాదాలు చేశారు. విజయవాడ డీసీపీ రాణా, ఏసీపీ రామకృష్ణ కార్యకర్తలను అదుపుచేయలేకపోయారు. 144 సెక్షన్ విధించి పోలీస్‌స్టేషన్ రోడ్డును మూసివేయించాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ సీపీ నేతల బాసట వంగవీటి రాధాను అక్రమంగా నిర్బంధించారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రాధాకృష్ణ, రత్నకుమారిని పరామర్శించి, వారికి బాసటగా నిలిచారు. ఈలోపు విజయవాడ నుంచి పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ కూడా అక్కడి చేరుకున్నారు. మీడియాను లోపలకు అనుమతించకపోవటంతో కార్యకర్తలు గేటు ఎదుట కొద్దిసేపు నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, నాయకులు మేడపాటి నాగిరెడ్డి, జోగి రాము, అక్కల గాంధీ, నల్లమోతు మధుబాబు, రవి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు రాధాకు బాసటగా నిలిచారు. -
ప్రభుత్వాల దిమ్మ తిరగాలి
(విజయవాడ) గాంధీనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగేలా దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 12 డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తూ కార్మిక సంఘాల జిల్లా సదస్సు తీర్మానం చేసింది. శుక్రవారం విజయవాడ స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సన్నాహక సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నాయని, కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సదస్సులో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సును దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులు సమ్మె చేస్తే వారికి రూ. 6లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాలను సవరించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు కావాలని డిమాండ్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు రెండేళ్లుగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పైగా నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుందామనుకుంటే భూములు లేకుండా గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల ఎకరాల భూమిని లాక్కø్కవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కార్మికులు, నిరుద్యోగులు చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మికుల సెస్సుతో సొంత ప్రచారమా..? ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి వసూలు చేస్తున్న సెస్సును చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 9న జిల్లా కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, కె రామారావు (ఇఫ్టూ), మాదు శివరామకృష్ణ (వైఎస్సార్‌టీయూ) గర్రె వరప్రసాద్ (ఐఎన్టీయూసీ), పి ప్రసాద్ (ఇప్టూ), మీర్‌హుస్సేన్ (హెఎంఎస్), వెంకటసుబ్బయ్య, నరసింహారావు, ఎన్సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.