Gutta sukhendar Reddy
-
మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్!
సాక్షి హైదరాబాద్: టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయనుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. కాగా మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ముదిరాజ్ పేరును కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాతే బండా ప్రకాశ్ పేరును ప్రకటించే అవకాశముంది. ఖాళీగా ఉన్న చీఫ్విప్తోపాటు, మూడు విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఎన్నిక: శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు శనివారం విడుదల చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలను మండలి సభ్యులందరికీ పంపించారు. తాజా షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 40 మంది సభ్యులున్న మండలిలో ఎంఐఎంకు ఉన్న ఇద్దరు సభ్యులతో కలుపుకుని టీఆర్ఎస్కు 38 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేసే సభ్యుడు మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్ సోమవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటిస్తారు. ఈ నెల 15న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
-
చంద్రబాబు దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయి
-
బీజేపీ, కాంగ్రెస్‌కు మేం సమాన దూరం!
సాక్షి, నల్లగొండ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ సమాన దూరం పాటిస్తుందని ఆ పార్టీ నేత, లోక్‌సభ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఆయన దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుత్తా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్న విషయాన్ని గుత్తా గుర్తు చేశారు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఏపీ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. -
సీఎంపై విశ్వాసముంది
నల్లగొండ ఎంపీ గుత్తా సాక్షి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసముందని, అందు కే ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ను ప్రకటించానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తనకు అసంతృప్తి ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేద న్నా రు. శనివారం నల్లగొండలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో కలసి ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న రోజే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. -
కాంగ్రెస్‌కు ఆ దమ్ముందా: గుత్తా
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానింత వరకు అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదని, కండువా కూడా కప్పుకోలేదని తెలిపారు. తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా, వారిదగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రిహార్సల్స్ కోసం వచ్చారా, అన్న మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలకు స్పందిస్తూ, తాను ఇంత వరకు ఎమ్మెల్యే కాకున్నా, సమావేశాల కోసం చాలాసార్లు అసెంబ్లీకి వచ్చానని తెలిపారు. పార్టీలో అధికారికంగా చేరాల్సి వస్తే రాజీనామా చేసే వెళ్తానని, అనర్హత వేటుకు ఎందుకు గురికావాలని పేర్కొన్నారు. -
నోట్ల రద్దుతో ప్రజాజీవనం ఛిన్నాభిన్నం
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫైర్ సాక్షి, నల్లగొండ: తెలుగుదేశం, బీజేపీ పన్నిన కుట్ర వల్లే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ అవస్థలు వచ్చాయని, పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని ప్రజల జీవన వ్యవస్థ చిన్నాభిన్నమైందని నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం నిర్ణయం వల్ల సామాన్య పౌర జీవనం ఇబ్బందులు పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కుబేరుల కంటే సామాన్య ప్రజలను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బాబుకు అలవాటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కూడా ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. పాలమ్ముకునే వ్యక్తి తలకాయలమ్ముకుం టున్నాడని తననుద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రేవంత్‌రెడ్డి ఓ పిట్టల దొరని, అలాంటి పిట్టల దొరలను తయారు చేయడం చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు. -
ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి
నల్లగొండ : ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధంతో పాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి విసిరిన సవాల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దమ్ముంటే గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై గెలవాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిలా పూటకో పార్టీ మారే అలవాటు తనకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే పోటీ చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే పార్టీ మారిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించాలన్నారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2014లో ఓడిపోయి...పైగా తనపై సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. కాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే.. తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా...
నల్లగొండ ఎంపీ గుత్తా సవాల్ నల్లగొండ: ‘నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నేనూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం ఎన్నికలకెళ్దాం. ప్రజలెవర్ని ఆమోదిస్తరో తెలుస్తది’ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. విచక్షణ కోల్పోయి కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదన్నారు. ఏనాడూ నాగలి పట్టని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క... నేడు వైఎస్ వేషధారణలో ట్రాక్టర్‌తో రోడ్ల మీదకు వచ్చి ప్రజల మెప్పు కోసం ఆరాటపడుతున్నారన్నారు. -
కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం--ఎంపీ గుత్తా
తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరియైన విధానం కాదన్నారు. రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యూయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తరుుతే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు. -
జానా అలా అన్నందుకే పార్టీ మారా: గుత్తా
నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెట్టే బాధలు భరించలేకనే సీఎల్పీ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెబుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం ఎందుకని చెప్పి తామే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిలువునా మునిగిపోవడానికి పన్నెండు మంది నాయకులు కారకులని, వారిలో కొందరు మిర్యాలగూడలో జరిగిన సభలో కూడా పాల్గొన్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్రానికి కాబోయే సీఎంలు తామేనని ప్రగల్భాలు పలికి చిట్టచివరికి పార్టీనే ముంచారని విమర్శించారు. -
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు: ఉత్తమ్
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటికే అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, టీఆర్ఎస్ కండువాలను కప్పుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఇప్పటికే రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన అన్ని వేదికలకు ఫిర్యాదులు చేశామని ఉత్తమ్ చెప్పారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న అంశాల ఆధారంగా తాము సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, సెలవులు పూర్తయిన వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఇటీవల పార్టీ మారిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. గుత్తాపైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాజకీయ ఫిరాయింపులను అడ్డుకునే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పార్టీ సీనియర్లు డి.కె.అరుణ, సబితా ఇంద్రా రెడ్డి, సంపత్ఖుమార్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుత్తాకు ఆ ప్రాజెక్టుపై అవగాహన లేదు: ఒంటేరు
♦ మల్లన్నసాగర్ నిర్వాసితుల ♦ సమస్యపై టీటీడీపీ చర్చ సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని తె లుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు నిర్వాసితుల సమస్యపై ఈ సమావేశంలో చర్చించారు. మెదక్ జిల్లా తొగుట మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. నిర్వాసితుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 25, 26 తేదీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేయనున్న దీక్షపైనా సమావేశం చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాల సమన్వయ బాధ్యతను ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి అప్పజెప్పాలని నిర్ణయం కూడా జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అనంతరం ఒంటేరు మాట్లాడుతూ ప్రాజెక్టును కుడలేరు వాగుపై ప్రాజెక్టు నిర్మిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. -
వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి: గుత్తా
కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ మారినందుకు తనపై విమర్శలు గుప్పించటం మానుకోవాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం జరిగిన సమన్వయక మిటీ సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు పరస్పరం దూషించుకున్నారన్నారు. వాళ్లలో వాళ్లకే ఐకమత్యం లేదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారాననడం సిగ్గుచేటని తెలిపారు. తనకు కాంట్రాక్టులు లేవని, తన వియ్యంకుడు నిజాం కాలం నుంచే పెద్ద కాంట్రాక్టరని గుత్తా తెలిపారు. సమయం, సందర్భంగా చూసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. -
స్వలాభం కోసమే పార్టీ వీడారు..
వలసలపై రాహుల్, దిగ్విజయ్‌కు ఉత్తమ్ నివేదన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మరో శాసనసభ్యుడు భాస్కర్‌రావు, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ తదితరులు స్వలాభం కోసమే పార్టీని వీడారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన ఇక్కడ వారిరువురినీ కలసి వలసలపై నివేదించారు. అధిష్ఠానం పిలుపు మేరకే ఉత్తమ్ ఢిల్లీ వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ పోరాటంలో ఎలాంటి వైఫల్యమూ లేదని, పార్టీ మారిన నేతలు కాంట్రాక్టులు, ఇతర పదవులను ఆశించి అధికార పార్టీలో చేరారని ఉత్తమ్ వివరణ ఇచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిణామాలపై రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌తో చర్చించానని తెలిపారు. వలసల వల్ల పార్టీకి నష్టమేమీ లేదని, పదవుల కోసం కాకుండా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని రాహుల్ చెప్పారన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో దిగ్విజయ్, కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు పాల్గొననున్నట్టు తెలిపారు. నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం గాంధీభవన్‌లో బుధవారం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్చార్జీలు దిగ్విజయ్‌సింగ్, రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు పరిశీలకులుగా హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత అంశా లు, అంతర్గత విషయాలపై మాత్రమే చర్చ ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నా యి. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో భారీ స్థాయి లో వలసలు, వలసలను నిరోధించడంలో రాష్ట్ర నాయకత్వ వైఫల్యంపై సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు ఉండే అవకాశముం దని పార్టీ నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు. -
వాళ్లు మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ వీడిన గుత్తా, భాస్కర్ రావులు స్వప్రయోజనాలకోసమే పార్టీ వీడారన్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్లే పార్టీ వీడానని గుత్తా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నైతిక విలువలు ఉంటే వెంటనే గుతా పదవికి రాజీనామా చేయాలన్నారు. గుత్తా పార్టీ వీడినందుకు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అధిష్టానం ఆదిశిస్తే నల్గొండ ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుస్తానని అని చెప్పాడు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదన్నారు. -
'కాంగ్రెస్‌ను వీడుతున్నందుకు బాధగా ఉంది'
హైదరాబాద్ : త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ వివేక్, మాజీమంత్రి వినోద్ తదితరులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌లు అధికార పార్టీలో చేరనున్నారు. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో సమావేశమై ... పార్టీ మార్పుపై చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నో మంచి పథకాలు చేపట్టారన్నారు. దేవరకొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు. కాగా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తమని కలిచి వేశాయన్నారు. అదే సమయంలో కేసీఆర్ తమను పార్టీలోకి ఆహ్వానించారని... ఆయనతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్!
కేసీఆర్‌తో గుత్తా, సురేశ్‌రెడ్డి, వివేక్, వినోద్ భేటీ టీఆర్ఎస్లో వారి చేరికకు సీఎం గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్ అధికార టీఆర్ఎస్ పెద్ద ప్లాన్‌లోనే ఉంది! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో.. ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌తో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో వీరి చేరికకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ గుత్తా ఈ నెల 11న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కలిసి ఒకేసారి గులాబీ తీర్థం పుచ్చుకుంటారా అన్న దానిపై స్పష్టత లేదు. అయినా ఈ వారంలోపే వీరంతా టీఆర్ఎస్లో చేరుతారని భావిస్తున్నారు. మాజీ ఎంపీ వివే క్ టీఆర్ఎస్లో చేరుతారని ఏడాది నుంచే ప్రచారంలో ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడంతో ఈ నాయకులంతా బయటకు రావాలని నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పార్టీ మారి పరువును పోగొట్టుకోవద్దని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ పార్టీ మారుతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లు ఎక్కకున్నా, పార్టీ సభ్యత్వం లేకున్నా సోనియాగాంధీ చలువతో రెండుసార్లు ఎంపీ అయ్యాడన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఒకే విడతలో రుణమాఫీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం రూ. 300 కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు. -
ఏం చేద్దాం.., అసలు ఏమైతాంది...?
*జిల్లా కాంగ్రెస్ పరిణామాలపై జానా, రాజగోపాల్ సమాలోచనలు *వెంకట్‌రెడ్డి, గుత్తా వ్యవహారంపై చర్చ *రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా..4 గంటలపాటు సుదీర్ఘ మంతనాలు *ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదన్న ఎమ్మెల్సీ *త్వరలోనే అధినేత్రి సోనియా వద్దకు.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరో మలుపు తిరిగాయి. వారం రోజులుగా పార్టీని కుదిపేస్తున్న అంశాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు కె.జానారెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు మంగళవారం సమాలోచనలు చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ రాజగోపాల్ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ)నేత జానారెడ్డి దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతున్న వార్తలతో పాటు రెండు, మూడు రోజులుగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇద్దరు నేతల జిల్లాలో జరుగుతున్న పరిణామాలతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. అసలు ఏమైతాంది... వాస్తవానికి వారం రోజులుగా జిల్లా కాంగ్రెస్ అట్టుడికిపోతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరే ఎపిసోడ్‌తోపాటు ఉన్నట్టుండి తెరమీదకొచ్చిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు, ఆయనకు షోకాజ్ జారీ అంశాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సుఖేందర్‌రెడ్డి పార్టీ వీడడం దాదాపు ఖాయమేనని, కోమటిరెడ్డి కూడా పార్టీతో అమీతుమీ తేల్చుకునేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల పర్యవసానం ఎలా ఉంటుందన్న దానిపై జానా, రాజగోపాల్‌రెడ్డి చర్చించారు. ఎవరు ఉన్నా... ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఇరువురు నేతలు ఈ భేటిలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడే దిశగా భవిష్యత్‌లో అడుగులు వేయాలని, ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోనూ అందరు నేతలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని.. అందుకోసం తామే పెద్దన్న పాత్ర పోషించాలని ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసుల జారీ గురించి కూడా మాట్లాడిన నేతలు అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే ఢిల్లీకి రాజగోపాల్ జిల్లాతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిసి అన్ని పరిస్థితులను వివరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జానాతో భేటి నుంచే ఢిల్లీ పార్టీ పెద్దలకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, జానాతో భేటి సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పార్టీ మారే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్లేది లేదని, ఎన్ని కష్టాలు వచ్చినా, పార్టీని కాపాడుకుంటానని, పార్టీ కోసమే పనిచేస్తానని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. -
గుత్తాకు టీఆర్ఎస్ లైన్ క్లియర్!
ఆ జిల్లా గులాబీ నేతల అభిప్రాయం తీసుకున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు అంతా సిద్ధమైపోయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, మరికొందరు స్థానిక ప్రజా ప్రతిని ధులను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి చేరికపై వారికి స్పష్టత ఇచ్చి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఇతర నేతల చేరికకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనను కేసీఆర్ నిరాకరించినట్టుగా తెలిసింది. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ పలువురు ఎంపీలు పార్టీ మారినా అనర్హత వేటు పడలేదని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అనర్హత వేటు పడే అవకాశముంటే అప్పుడే రాజీనామా గురించి ఆలోచించవచ్చని, అప్పటిదాకా రాజీనామా అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే గుత్తా చేరికకు తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు ఒకవేళ ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేస్తే నల్లగొండ ఎంపీ స్థానంలో తేరా చిన్నపరెడ్డికి అవకాశమివ్వాలనే ప్రతిపాదనపైనా కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. -
ఒకరు బతుకమ్మల చుట్టూ..మరొకరు అమరావతి చుట్టూ
నల్లగొండ: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఆయనిక్కడ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేసి ఓ సీఎం బతుకమ్మల చుట్టూ.. మరో సీఎం అమరావతి చుట్టూ తిరుగుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రెండు రాష్ట్రల్లో కరువుతో రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. పత్తికి మద్దతు ధర కలిపించి సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇదే మొదటిది.. ఇదే చివరిది..
టీఆర్ఎస్ పార్టీకీ ఇది మొదటీ ప్రభుత్వమని.. ఇదే చివరి ప్రభుత్వమని.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పాల్గొన్న ఎంపీ రైతు వ్యతిరేకి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణలా దృష్టి సారించిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మరిచారని అన్నారు. -
అధికారులతో నాయకులకు శిక్షణా?
పార్టీలకు అతీతంగా ఉండే అధికారులతో రాజకీయ నాయకులకు శిక్షణ పాఠాలు ఎలా చెప్పిస్తారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అవినీతి కేసుల్లో, కుంభకోణాల్లో ఉన్నారని, అలాంటి వాళ్లకు ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డితో పాఠాలు చెప్పించడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో గానీ, అసెంబ్లీలో గానీ ఉన్న సభ్యుల్లో 15 శాతం మంది కంటే ఎక్కువ మంది మంత్రులుగా ఉండేందుకు వీల్లేదని ఆయన చెప్పారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. -
'టీఆర్ఎస్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతోంది'
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని గుత్తా విమర్శించారు. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.