hamsa nandini
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియల్ లైఫ్‌కి, రీల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో చాలా చలాకీగా ఉంటూ..ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడడు. స్టైజ్‌పై మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు. అంతేకాదు ఇతరులతో మాటలు కలిపేందుకు కూడా వెనుక ముందు ఆలోచిస్తుంటాడు. తనకు క్లోజ్ అయిన వారితో సరదాగే ఉన్నా..కొత్త వారితో మింగిల్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాడని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక్కసారి తనతో స్నేహం ఏర్పడితే.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడట. ఇక షూటింగ్ టైమ్‌లో అందరికి భోజనాలు తెప్పించే అలవాటు డార్లింగ్‌కి ముందు నుంచే ఉంది.(చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కల్కి.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘మిర్చి’ సినిమాలో టైటిల్ సాంగ్‌కి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. అయితే వేరే సినిమా షూటింగ్ కారణంగా ఆ సినిమా తాను చూడలేకపోయానని.. ఈ విషయం తెలిసి ప్రభాసే టికెట్ బుక్ చేసి సినిమా చూపించారని హంసనందిని చెప్పింది.(చదవండి: నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ)‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మిర్చి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలో బిజీ అయ్యాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ని అందుబాటులో లేను. అలాగే రిలీజ్ టైమ్‌లో కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్ కలిసి.. ‘నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా?’అని అడిగాడు. నేను సినిమా చూడలేదని చెప్పాను. వెంటనే టికెట్ బుక్ చేసి సినిమా చూడమని చెప్పాడు. అంతేకాదు సినిమాలో నా సాంగ్ ఏ టైమ్‌కి వస్తుందో కూడా చెప్పాడు. నేను అదే టైమ్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాను’ అని హంసనందిని చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ తాజాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.#Prabhas Anna Mirchi Movie ki Ticket book chesi, ‘Mirchi’ Song oche timing cheppi mari Theatre ki pampadu anta Hamsa ni! 🥰😅❤️ pic.twitter.com/CgVqqKlkzg— . (@charanvicky_) July 2, 2024 -
చిన్నప్పటి కల నెరవేర్చుకున్న రష్మిక.. సామ్-జాన్వీ కిల్లింగ్ లుక్స్
జపాన్‌లో రష్మిక.. చిన్నప్పటి కల నెరవేరిందని పోస్ట్ అంబానీ వెడ్డింగ్ రష్మిక.. భర్తతో కలిసి క్యూట్ పోజులు మోడ్రన్ డ్రస్‌లో హీట్ పెంచేస్తున్న నటి ప్రియమణి నవ్వుతో మాయ చేస్తున్న హీరోయిన్ జెనిలీయా లంగా ఓణీలో తెలుగు యంగ్ హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ స్విమ్మింగ్ పూల్‌లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ అనుకృతి 'కుర్చీ మడతపెట్టి' పాటకు పూర్ణ స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. వీడియో View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Salony Luthra (@salonyluthra) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అలా కనిపించిన అరియానా.. ఐటమ్ బ్యూటీ మెల్ట్ అయ్యే లుక్
జనవరి గురించి అనసూయ పోస్ట్.. క్రేజీ ఫొటోలు కూడా 'లియో' నటి జనని క్యూట్ డ్యాన్స్ వీడియో వైరల్ అందాల విందు చేస్తున్న నటి ఇషా తల్వార్.. చూస్తే అంతే తెల్లచీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్ సోకుల వయ్యారాలతో టెంప్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్' అరియానా ఫుల్ జాలీ మూడ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న జిమ్‌లో సెల్ఫీతో క్యూట్‌గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మరింత అందంగా కనిపిస్తూ మెరిసిపోతున్న హంస నందిని View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
పూల్‌లో హాట్ బ్యూటీ.. చూపుతో భయపెడుతున్న సామ్
చీరలో మహాలక్ష్మిలా కనిపిస్తున్న హీరోయిన్ ఐశ్వర్య బర్త్ డే బ్యూటీ మంచు లక్ష్మి డిఫరెంట్ పోజులు అందాల విందుతో కేక పుట్టిస్తున్న రీతూ చౌదరి స్విమ్మింగ్ పూల్‌లో నటి హంస నందిని బ్యాక్ పోజుతో టెంప్ట్ చేస్తున్న శివాత్మిక భయపెట్టేలా చూస్తున్న హీరోయిన్ సమంత View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!
తెలుగులోకి ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు మెల్లమెల్లగా కనుమరుగైపోతుంటారు. అలా పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా దాదాపు 20 ఏళ్ల క్రితమే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా చేస్తే రాని గుర్తింపు ఐటమ్ సాంగ్స్ తో సంపాదించింది. అలా ఓ ఐదేళ్ల పాటు వరసపెట్టి ఈమెని అవకాశాలు వరించాయి. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో సడన్ గా ఓ ఆశ్రమంలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏం జరిగింది? ఈమె ఆమెనే పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు హంస నందిని. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. ఎప్పుడైతే ప్రభాస్ 'మిర్చి'లో ఐటమ్ సాంగ్ చేసిందో ఈమె ఫేట్ మారిపోయింది. స్పెషల్ సాంగ్స్ ల్లో అవకాశాలు వరసపెట్టి వచ్చాయి. అలా దాదాపు ఐదేళ్ల పాటు డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. (ఇదీ చదవండి: క్రేజీ అడ్వెంచరస్ వెబ్ సిరీస్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్) ఐటమ్ గర్ల్ గా! 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. క్యాన్సర్ బారిన పడి! అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. సడన్ గా 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. త్వరలో కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చెప్పినట్లుగానే మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. ఈ మధ్యనే కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో కనిపించింది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమెని నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు గానీ కాసేపటికి గుర్తుపట్టేశారు. ఎంతలా మారిపోయిందోనని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) (ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) -
9 సార్లు కీమోథెరపీ..అంతలోనే మరో రొమ్ముకి కూడా కేన్సర్: హంసా నందిని
‘‘కేన్సర్ అని నిర్ధారణ అయ్యాక గతం తాలూకు భయాలు, అయోమయాలు, ఒత్తిడి... అన్నీ మళ్లీ నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. పలుమార్లు వైద్య పరీక్షలు, పలు స్కానింగ్స్ చేయించుకుని, శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఇక ఏ భయం లేదు అనుకుంటున్న సమయంలో మరో రొమ్ముకి కూడా కేన్సర్ సోకే ప్రమాదం ఉందని నిర్ధారణ అయింది. మళ్లీ పోరాటం ఆరంభం’’ అని హంసా నందిని చెప్పా రు. 2020లో ఆమెకు గ్రేడ్ 3 ‘కార్సినోమా’ (రొమ్ము కేన్సర్) నిర్ధారణ అయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసా నందిని ఆ సంగతులు పంచుకున్నారు. ‘‘18 ఏళ్ల క్రితం మా అమ్మగారికి బ్రెస్ట్ కేన్సర్ అని నిర్ధారణ అయింది. దురదృష్టం కొద్దీ ఆ పో రాటంలో ఆమె ఓడిపోయారు. ఇక నాకు కేన్సర్ నిర్ధారణ అయ్యాక 9 సార్లు కీమోథెరపీ జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితి ముగిసిందనుకున్నాను. కానీ ఆ ఆనందం కొన్నాళ్లే. ఎందుకంటే ‘బీఆర్సీఏ1’ (వంశపారంపర్య రొమ్ము కేన్సర్) అని, జీవితంలో మరో రొమ్ముకి కూడా 70 శాతం కేన్సర్ సోకే ప్రమాదం ఉందని తేలింది. దాంతో పలు శస్త్ర చికిత్సలు, మరో ఏడు సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇది ఎంతో సవాల్‌తో కూడుకున్నది. అందుకే ‘చిరునవ్వుతో పోరాడాలి. మళ్లీ స్క్రీన్ మీద (నటించాలి) కనబడాలి. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా మన జీవితం గురించి చెప్పా లి’ అని నాకు నేనుగా వాగ్దానం చేసుకున్నాను. నేను జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ముందుగా రోగ నిర్ధారణ కావడం, మంచి డాక్టర్లు, నా ఫ్యామిలీ, నా పాజిటివ్ మైండ్ కారణం. గత నవంబర్‌లో షూటింగ్ సెట్లోకి కూడా అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు అందరూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. నేను సజీవంగా ఉన్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు నాకు నేనుగా ఓప్రామిస్ చేసుకున్నాను. ‘ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుని బతకాలన్నది’ ఆప్రామిస్. ఈ సందర్భంగా మా అమ్మగారి పేరు మీద ‘యామినీ కేన్సర్ ఫౌండేషన్’ని ఆరంభించాలనుకుంటున్న విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నాను. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. -
క్యాన్సర్‌తో నటి ఫైట్.. అప్పుడు, ఇప్పుడు ఎలా ఉందంటే?
తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులకు చేరువైన నటి హంసానందిని. రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె గతేడాది డిసెంబర్లో ఆ మహమ్మారిని జయించింది. ఈ క్రమంలో తిరిగి సినిమాలపై దృష్టి సారించిన నటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్‌గా మారింది. ఒక ఏడాది క్రితం క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా జుట్టు కోల్పోయి గుండుతో ఉన్న వీడియో షేర్ చేసింది. అలాగే క్యాన్సర్‌ను జయించిన తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న ఆమె సముద్రపు ఒడ్డున తన జుట్టు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. 'ఒక ఏడాదిలో చాలా జరిగాయి. ప్రస్తుతానికైతే బాగున్నాను' అని నటి రాసుకొచ్చింది. జుట్టు ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా అద్భుతంగా ఉన్నారు అని ఒకరు కామెంట్ చేయగా ఆ నెటిజన్‌పై ముద్దుల వర్షం కురిపించింది హంసానందిని. మిగతా నెటిజన్లు కూడా తనొక రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. కాగా హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది. లౌక్యం, రుద్రమదేవి, జై లవకుశ సహా పలు చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) చదవండి: నాటునాటు పాటకు దుమ్ము దులిపిన పాక్ నటి, వీడియో వైరల్ -
క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ఇప్పుడెలా ఉందో తెలుసా?
టాలీవుడ్లో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాలభామ హంసానందిని. అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఈ భామ ఇటీవలె దాన్నుంచి బయటపడింది. అంతేకాకుండా క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత సినిమా షూటింగులోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది హంసానంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Thankful through everything 🧚♀️. .#swanstories pic.twitter.com/SUmsQCHE1t — Hamsa Nandini (@ihamsanandini) January 7, 2023 -
క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి హంసానందిని క్యాన్సర్‌ను జయించింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసా నందిని తాజాగా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. మూవీ సెట్లో మళ్లీ అడుగుపెట్టాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. నా పుట్టినరోజును నా కోస్టార్స్, మూవీ టీంతో సెలబ్రేట్ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే నేను కోలుకోగలిగాను. ఐ యామ్ బ్యాక్ అంటూ హంసా నందిని రాసుకొచ్చింది. షూటింగ్లో పాల్గొన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసుకుంది. దీంతో వెల్కమ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో ఐటెం సాంగ్స్‌లో కనువిందు చేసింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
‘కీమో’నుంచి కోలుకున్నా.. క్యాన్సర్ ట్రీట్మెంట్పై నటి రియాక్షన్
Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment: ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని ఇటీవలె క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్ట్‌ను షేర్ చేసింది. 16సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్ వెల్ సూన్ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
హంసానందిని ఫొటోషూట్ వైరల్, 'ఫస్ట్ లవ్ కోసం బలంగా తిరిగొస్తా'
ఫొటోలు భావాలు చెబుతాయా? అంటే కొన్ని ఫొటోలు చెబుతాయి. అందుకు తాజా ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న హంసా నందిని ఫొటో. ఇటీవల హంస చేయించుకున్న ఫొటోషూట్ ఇది. మామూలుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవాళ్లు, సినిమాలో గెటప్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవాలనుకునేవాళ్లు.. ఇలా రకరకాల కారణాలతో ఫొటోషూట్ చేయిస్తారు. అయితే హంసా నందిని తాజా ఫొటోషూట్‌కి ఇవేవీ కారణాలు కావని ఊహించే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు రొమ్ము కేన్సర్‌కి సంబంధించిన చికిత్స జరుగుతోంది. తాను కేన్సర్ బారిన పడిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో హంస సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫొటోషూట్ చేయించుకున్నారు. గుండుతో ఉన్న ఈ ఫొటోలో హంస ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టయిలిస్ట్‌గా చేసిన అమీ పటేల్ అంటున్నారు. ‘మీరు (హంసా నందిని) చాలా అందంగా కనబడుతున్నారు. మీ ఫొటో ‘బలం, నమ్మకం, అందాన్ని’ ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు కేన్సర్‌తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా, మరింత అందంగా బయటికొస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం’ అని అమీ పటేల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత డిసెంబరు నాటికే తొమ్మిది విడతల కీమోథెరపీ పూర్తయిందని, ఇంకా ఏడుసార్లు చేయించుకోవాలనీ హంస పేర్కొన్నారు. యాక్టింగ్ అనేది నా ఫస్ట్ లవ్... ఇంకా చాలా బలంగా, మెరుగ్గా తిరిగి వస్తానని కూడా అన్నారు. ఆమె నమ్మకం నిజమవుతుందని ఈ ఫొటో స్పష్టం చేస్తోంది కదూ. -
షాకింగ్.. ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందినికి క్యాన్సర్, గ్రేడ్-3 స్టేజ్
Actress Hamsa Nandini Revealed She Suffer With Breast Cancer: నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ధీమా వ్యక్తంచేశారు. తన జీవితంలో కాలం ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదన్నారు హంస. చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్ సాంగ్ ట్రోల్స్‌పై స్పందించిన సామ్ 18 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో తన తల్లి కన్నుమూశారని.. నాటి నుంచి అదే భయంతో జీవిస్తున్నానని తెలిపారు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారని వివరించారు. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నానని.. మరో ఏడు చేయించుకోవాల్సి ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని అభిమానులకు తెలిపారు. అంతేగాక క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనువిందు చేసింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్ మొత్తం పోయాయి: నటి
నటి హంస నందిని తన కుటుంబం ఇటీవల కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. తరచూ తనకు సంబంధించిన వీడియోలు, హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే ఆమె కొద్ది రోజులుగా ఒక్క పోస్టు షేర్ చేయలేదు. దీంతో హంసకు ఏమైందంటు ఫాలోవర్స్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తాను, తన కుటుంబ సభ్యులంతా కరోనా పాజిటివ్‌గా తేలిందని, 25 రోజుల పాటు కోవిడ్ హాస్పిటల్‌నే ఉన్నట్లు నెటిజన్లు పెట్టిన మెసేజ్‌లకు ఆమె సమధానం ఇచ్చారు. అంతేగాక ఇటీవల కోలుకుని వారు డిశ్చార్జ్ అయినట్లుగా కూడా ఆమె స్పష్టం చేశారు. ఆమె స్పందిస్తూ.. ‘క్షమించండి. కొన్ని రోజులుగా ఎలాంటి పోస్ట్స్ షేర్ చేయ లేదు. ఏప్రిల్ 9న నేను కరోనా బారిన పడ్డాను. నా కుటుంబం కూడా మహమ్మారి బారిన పడింది. దీంతో దాదాపు 30 రోజుల పాటు కరోనాతో పోరాడం. తిరిగి ఇంటికి వస్తామన్న హోప్ కూడా పోయాయి. అయితే కరోనా అని తెలియాగానే నేను నా ఫ్యామిలీ వెంటనే ఆసుపత్రిలో చేరాము. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఇక 25 రోజుల తర్వాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చింది, ఇప్పుడిప్పుడే వారంతా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి’ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది. చదవండి: నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న హీరోయిన్! -
స్విమ్ సూట్లో రాశీ, సాగర తీరాన హంసా
► రాధేశ్యామ్ కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన పూజా హెగ్డే ► ఆటాడుకుందాం రా అని పిలుస్తోన్న ప్రియాంక చోప్రా ► కనులు మూసినా కలల్లోకి వస్తున్న అనుపమ పరమేశ్వరన్ ► చోటా గ్యాంగ్‌తో హిందీ బిగ్‌బాస్ 14 విన్నర్ రుబీనా దిలైక్ సెల్ఫీ ► భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన రీమా సేన్ ► క్యూట్ పిక్ షేర్ చేసిన రితికా సింగ్ ► అమ్మవారిని దర్శించుకున్న 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ► ఆలోచనల్లో మునిగిపోయిన ప్రియాంక మోహన్ ► స్విమ్ సూట్లో ఓరకన్నుతో చూస్తోన్న రాశి ఖన్నా ► సముద్ర తీరాన హంసానందిని సెల్ఫీలు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Reema Sen (@senreema29) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) -
హంసానందిని స్టన్నింగ్ ఫోటోలు
-
కార్నివాల్ ప్రారంభించిన హంసా నందిని
-
స్క్రీన్ టెస్ట్
1. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె? ఎ) తమన్నా బి) క్యాథరిన్ సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి 2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఆడియోగ్రఫీ బి) ఎడిటింగ్ సి) కెమెరా డిపార్ట్మెంట్ డి) ఆర్ట్ డిపార్ట్మెంట్ 3. ‘షేక్ మోజెస్ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ను పోషించిన గాయకుడెవరో తెలుసా? ఎ) ఎస్పీ బాలు బి) రామకృష్ణ సి) ఘంటసాల డి) ఇళయరాజా 4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాని డి) సందీప్ కిషన్ 5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) వెంకటేశ్ 6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) బోయపాటి శ్రీను డి) శ్రీవాసు 7. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు? ఎ) దివ్యభారతి బి) ప్రత్యూష సి) సౌందర్య డి) భార్గవి 8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ శరన్ బి) త్రిష సి) సోనాలి బింద్రే డి) రవీనా టాండన్ 9. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ సి) అభినయశ్రీ డి) ముమైత్ ఖాన్ 10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) కృష్ణవంశీ బి) జేడీ చక్రవర్తి సి) రామ్‌గోపాల్ వర్మ డి) సురేశ్ బాబు 11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) భారతీరాజా బి) కోడి రామకృష్ణ సి) బాలచందర్ డి) కె. రాఘవేంద్రరావు 12. రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్ భామ ఎవరో కనుక్కోండి? ఎ) ఐశ్వర్యారాయ్ బి) సోనాక్షి సిన్హా సి) దీపికా పదుకోన్ డి) అమీ జాక్సన్ 13. ‘‘క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది. రచయితెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) వక్కంతం వంశీ సి) అబ్బూరి రవి డి) కోన వెంకట్ 14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా? ఎ) అనుదీప్ బి) హేమచంద్ర సి) హిప్ హాప్ తమిళ డి) పెంచల్ దాస్ 15. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ సి) ఎ. కోదండ రామిరెడ్డి డి) యస్.జె. సూర్య 16. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అనే పాటను హమ్ చేసింది సింగర్ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె? ఎ) కలర్స్ స్వాతి బి) రాశీ ఖన్నా సి) తమన్నా భాటియా డి) అనుపమా పరమేశ్వరన్ 17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్లో ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్ డి) వరుణ్‌తేజ్ 18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) ‘షకలక’ శంకర్ సి) ధన్‌రాజ్ డి) శ్రీనివాసరెడ్డి 19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్ హీరో ఎవరో చెప్పండి? ఎ) సల్మాన్‌ఖాన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమిర్ ఖాన్ డి) సైఫ్అలీ ఖాన్ 20. ఈ ఫొటోలో మేకప్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుహాసిని డి) జయప్రద మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్
జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడిస్తున్నారు. తన ఐటమ్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అన్న రేంజ్లో పేరు తెచ్చుకున్న హంసానందిని ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు సినిమాలో కీలకమైన పలు సన్నివేశాల్లోనూ హంస కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న జై లవకుశ సినిమాతో ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్ అంటే నందమూరి అనేనా?
నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కుమారులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్... హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సంతోషానికి అదో కారణం. ఇంకో కారణం ఏంటంటే.. వీళ్లిద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నారు. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా అన్నయ్య కల్యాణ్‌రామ్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మీరు చూస్తున్నది... హరికృష్ణ సరదాగా లొకేషన్‌కి వెళ్లినప్పుడు తీసిన ఫొటో. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే... టేబుల్ పైన ఉన్న నేమ్ ప్లేట్ మీద ‘ఎన్. లవ కుమార్’ అనే పేరు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనీ, ఓ పాత్ర పేరు ‘జై’, మరో పాత్ర పేరు ‘లవ’, మూడో పాత్ర పేరు ‘కుశ’... అందుకే సినిమాకు ‘జై లవ కుశ’ టైటిల్ ఖరారు చేశారనీ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ‘ఎన్. లవకుమార్’ పేరు చూస్తోంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. పేరు పక్కన పెడితే... సినిమాలో హీరో ఇంటి పేరు ‘ఎన్’ అంటే నందమూరి అనేనా? వెయిట్ అండ్ సీ! స్పెషల్ హంస! ఈ సినిమాలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్. ఆమెతో పాటు మరో ఇద్దరికి చోటుంటుంది. ముగ్గురు హీరోయిన్లు కాకుండా మరో అందాల భామ హంసా నందిని ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె ఐదు రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. ఓ పాటతో పాటు కీలక సన్నివేశాల్లో హంస కనిపిస్తారట. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’, ‘లౌక్యం’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’... హంస స్పెషల్‌గా కనిపించిన సినిమాలన్నీ హిట్టే. ఆ విధంగా ‘లక్కీ గాళ్’ అనే పేరు తెచ్చుకున్నారు. -
శరవణ సిల్క్స్ షోరూం ప్రారంబించిన హీరోయిన్స్
-
ఐటెం పాటలు తుస్..!
టాలీవుడ్ లో ఐటెం పాటలు ఆకట్టుకోలేపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో విడుదలైన తెలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అగ్రతారలు చేసిన ఐటెం పాటలు అభిమానుల అంచనాలను అందుకోలేక తేలిపోయాయి. నిరుడు 'మిర్చి' ఘాటుతో కుర్రకారును ఊర్రూతలూగించిన హంసానందిని కూడా ఈ ఏడాది మెప్పించలేకపోయింది. లెజెండ్, లౌక్యం సినిమాల్లో అమ్మడు నర్తించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆగడులో శృతిహాసన్, అల్లుడు శ్రీనులో తమన్నా చేసిన ప్రత్యేక గీతాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎవడు సినిమాలోయ రాంచరణ్ తో దీటుగా స్కార్లెట్ విల్సన్ స్టెప్పులేసినా స్పందన అంతంతమాత్రమే. మూసధోరణిలో ఉండడం వల్లే ప్రత్యేక గీతాలు ఆదరణ కోల్పోతున్నాయని చెబుతున్నారు. పాటలన్నీ దాదాపు ఒకే ఫ్లోలో ఉండడం, నృత్య భంగిమల్లో నవ్యత కొరవడడం కూడా కారణమంటున్నారు. -
కిక్ ఇచ్చే పాత్ర!
ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటలకు, అతిథి పాత్రలకు పరిమితమైన హంసా నందిని ‘రియల్ స్టార్’లో కథానాయికగా నటించారు. స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్లో సి. రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేశారు. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో శ్రీహరి అందరివాడు అనిపించుకున్నారు. అందుకే ‘అందరివాడు’ అనేది ఈ చిత్రాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. హంసా నందిని పాత్ర కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై.గిరిరాజ్, పులగం శ్రీనివాస్ ముదిరాజ్. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల