harirama jogaiah
-
కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్?
పాలకొల్లు సెంట్రల్: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ పది హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు సరే.. మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నించారు. బుధవారం ‘జయహో కాపూస్ జయహో బీసీస్’ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సిందని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ రాశారు. -
పెన్నులో ఇంకు అయిపోయిన పవన్ లో మార్పు రాలేదు
-
పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ
-
‘టీడీపీ అధినేతల కుతంత్రమా?’.. పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ
పశ్చిమ గోదావరి: జనసేన బాగు గూర్చి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి తాను ఇచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్టు లేవంటూ కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య అన్నారు. ఆయన శుక్రవారం మరోసారి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ‘ఈ విషయం బహిరంగసభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఎల్లో మీడియా ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు, నాకు మధ్య తగువులు పెడ్తున్నట్లుగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మరింత దాసోహం అనిపించేటట్లు చేయాలనే కృత్తిమ చర్యలా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీ నెగ్గటం అసాధ్యం. ...గతంలో తనకున్న పదవులు సైతం వదులుకొని చిరంజీవికి సపోర్ట్ చేసిన వ్యక్తి హరిరామ జోగయ్య. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు?. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి?. సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి?. వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా. ...పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజి వీరుడుగా జనంలో నమ్మింపచేసి, నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ది పొందాలనేది ఈ తెలుగుదేశం అధినేతల కుతంత్రమా?. జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిది. మీకు యిష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నాను’ అని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేశారు. -
పవన్ కళ్యాణ్ కు లేఖలపై లేఖలు రాస్తోన్న చేగొండి హరిరామ జోగయ్య
-
జనసేన పరిస్థితి ఇంత హీనమా?.. పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హరిరామజోగయ్య సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అలాగే, జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? అని అన్నారు. కాగా, హరిరామజోగయ్య ఆదివారం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో హరిరామజోగయ్య..‘జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా?. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా?. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు. జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు. పవన్ పరిపాలన అధికారం చేపట్టడం. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటి. జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా?. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. -
పవన్ కళ్యాణ్ కు కొత్త టెన్షన్ జనసేనకు జోగయ్య లేఖలు..
-
జోగయ్య కాదు జోరీగయ్య
చేగొండి హరిరామ జోగయ్య తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్‌కు చిర్రెత్తుకొస్తోంది... ఒకవైపు చూస్తే కులంలో పెద్ద... మరోవైపు సీనియర్ నాయకుడు... అలాంటి మనిషి తరచూ తనను ఇరిటేట్ చేస్తుంటే పవన్ ఏమీ అనలేక.. ఇటు చంద్రబాబు దగ్గర డిమాండ్ చేసే పరిస్థితి లేక.. బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ముక్కీ మూలిగి పొత్తులో ఓ పాతిక సీట్లు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కు గగనమైపోతోంది..ఇది కూడా ఎక్కడ ఇస్తారన్నది ఖరారు కాలేదు.. కేవలం టిక్కెట్లే ఇస్తారా.. అభ్యర్థులను శాతం చంద్రబాబే సప్లై చేస్తారా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు.. ఈలోపే జోగయ్య మళ్ళీ జోరీగయ్య మాదిరి మారిపోయి లేఖలు రిలీజ్ చేస్తున్నారు కనీసం అరవై సీట్లు ఇవ్వకుండా దేనికోసం పొత్తు.. ఇలాగైతే మా కాపులు .. కాపు యువత.. నాయకులూ ఏమవ్వాలి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు మేమెందుకు పాలికాపులమవ్వాలి. పాతిక ఇరవై సీట్లకోసం పవన్ ఇంత యాగీ చేసి సినిమా కెరీర్ వదులుకుని జగన్ మీద ఇంతగా రెచ్చిపోయి కాలు దువ్వి శత్రుత్వం తెచ్చుకోవాలా ? ఇదెక్కడి దరిద్రం అంటూ జోగయ్య రాస్తున్న లేఖలు. వాటిలో లేవనెత్తుతున్న సందేహాలు ఇటు కాపు యువతలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. కాపులకు అధికప్రాధాన్యం ఇస్తూ కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలను సైతం ఆడుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాళ్ళదన్నుకుని తెలుగుదేశం పల్లకీ ఎందుకు మోయాలి అనేది ఇప్పుడు గోదావరి జిల్లాల్లోచర్చ. కులం చెడినా సుఖం దక్కాలన్నది సామెత. కానీ కేవలం పాతిక సీట్ల కోసం మొత్తం కాపులను గంపగుత్తగా చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేస్తే ఎలా అనేది జోగయ్య ప్రశ్న... అరవై సీట్లయినా ఇవ్వకుంటే కాపు నాయకులకు పోటీ చేసేందుకు ఎక్కడ అవకాశం వస్తుందని.. వాళ్లంతా చాన్నాళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం చూస్తున్నారని. ఇప్పుడు పాతిక సీట్లకే ఒప్పేసుకుంటే ఇక వాళ్లంతా ఎందుకు ఊరుకుంటారని..? ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తారని జోగయ్య లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమే అని కాపు యువత అంటోంది. గౌరవప్రదంగా సీట్లు కేటాయించకుంటే పొత్తు పొసగదని జోగయ్య తేల్చేసారు. దీంతో పవన్ ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారు. ఇటు చూస్తుంటే చంద్రబాబు పాతిక సీట్లకు మించి ఇవ్వడు.. కావాలంటే బ్లాకులో డబ్బు ఇస్తాడు కానీ సీట్లు ఇవ్వడు.. అన్ని లేకపోతె ప్రజలు ఒప్పుకోరు.. దీంతో ఏమి చేయాలో తోచక పవన్ మళ్ళీ కార్యకర్తలకు మొహం చూపలేక సిగ్గుతో దాక్కున్నారు. అలాగని టీడీపీని కాదని అటు బీజేపీతో వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు.. ఏమిటో పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఒక దారీ తెన్నూ లేకుండా జాతరలో దారితప్పిన పిల్లాడిలా పవన్ ఆందోళనలో ఉండిపోయారు -సిమ్మాదిరప్పన్న -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్‌నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
Janasena: అల్టిమేటంపై పవన్ రియాక్షన్ ఏంటో?
ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకుపేరు మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది జనసేన తీరు. అసలు జనసేనలో టీడీపీ పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎన్ని సీట్లు ఇస్తారో.. తమను గౌరవప్రదంగా చూసుకోవాలి అని ఇప్పటికి పవన్ కల్యాణ్ ఎన్నోమార్లు చెప్పినా ఆయన మాటలను టీడీపీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వస్తోంది. ఎన్ని సీట్లు ఇస్తే గౌరవం కాపాడినట్లు అన్నదానికి ఒక ప్రామాణికం.. లెక్కా పత్రం లేకపోయినా ఇటు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగ మాదిరి మారి పోరుతూనే ఉన్నారు. మనం ఎక్కడా తగ్గొద్దు .. మన గౌరవం మనం కాపాడుకోవాలి అంటూ నిత్యం పవన్‌ను రెచ్చగొడుతూ కాపుల్లో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసం మనం ఎందుకు పని చేయాలి అంటూ జోగయ్య బహిరంగ లేఖల్లో పవన్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. నేడు జోగయ్య ఏకంగా యాభై మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ కూడా విడుదల చేసేసారు. ఇదిగో ఈ యాభై స్థానాల్లో మన జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని అయన అల్టిమేటం ఇచ్చారు. అందులో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గం అయిన విజయనగరం కూడా ఉంది. ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేసారు. విజయనగరం సీటును ఘరాన అయ్యలు అనే కాపు నేతకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు టిక్కెట్ ఇవ్వాలని, అక్కడ ఆయనే పోటీ చేయాలనీ ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలకబూని ఉన్నారు. తానూ ఐదు సార్లు గెలిచిన తెనాలి సీటును జనసేనకు ఎలా ఇస్తారన్నది ఆలపాటి రాజా ప్రశ్న.. ఇప్పటికే అయన క్యాడర్ తో సమావేశమై రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాను అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జోగయ్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఈ జాబితాను టీడీపీ గౌరవించాలని లేదు కానీ జోగయ్య దృష్టిలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్లకు టిక్కెట్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళు అలకబూని పార్టీకి దూరం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు జనసేనను దాదాపు ఇరవైసీట్లకు పరిమితం చేసేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే తమకు అంత నష్టం అని చంద్రబాబు భవిస్తూ సేనానిని సాధ్యమైనన్ని తక్కువసీట్లకు ఒప్పించాలని చూస్తున్నారు. దీంతోబాటు కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని మొన్నామధ్యన లోకేష్ చేసిన ప్రకటన సైతం జనసేన గ్రాఫ్ ను పవన్ రాజకీయ పటిమను తగ్గించిందని అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండేదానికి మేమెందుకు చాకిరీ చేయాలన్నది జనసైనికులు, కాపుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఇలా లిస్ట్ విడుదల చేసి కాపు నాయకులను సంఘటితం చేయాలనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పవన్ దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి. ✍️సిమ్మాదిరప్పన్న -
హరిరామ జోగయ్య లేఖపై పేర్ని నాని కామెంట్స్
-
జోగయ్య.. పవన్ చెవిలో జోరీగ ..
చేగొండి హరిరామ జోగయ్య కాస్తా పవన్ చెవిలో జోరీగలా మారారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఇమేజిని.. ప్రతిష్టను.. కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారు. పెద్దాయన రామా.. కృష్ణా.. అని మూల కూర్చోకుండా పవన్‌ను పరుగెత్తిస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్‌ను గత కొద్దిరోజులుగా ఈ వెటరన్ ఎదురుప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ మొన్నామధ్య జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు. ఆశలు పవన్‌కు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది. కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు. అది అలా ఉండగానే ఇప్పుడు మరో బాణం సంధించారు. నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు. ఇలా ఐతే ఎలా అని ప్రశ్నించారు. అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు. అలా అయన ప్రకటించాక కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా ? అంటూ జోగయ్య ప్రశ్నించారు. చదవండి: ఇంకా యాచించే స్థితేనా?.. బహిరంగ లేఖలో పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ? మీకు అస్తిత్వం లేదా.. కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్‌ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఈ లేఖలు కాపు సామాజిక వర్గంలో ఒక ఆలోచనను రేకెత్తించాయి. అసలు మన ఓట్లతో చంద్రబాబు గద్దెనెక్కడం ఏమిటి? మనం ఆయన కోసం త్యాగాలు చేసి కూలీ చేయడం ఏమిటనే ఆలోచన మొదలైంది. నిన్ను మా నాయకుడిగా చూడాలని ఆశిస్తుంటే మీరు కాస్తా చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడితే ఎలా? అంటూ అయన ప్రశ్నించారు. --- సిమ్మాదిరప్పన్న -
పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ
-
పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ
-
ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు కూడా మేనిఫెస్టోలో లేవని అన్నారాయన. పొత్తులో ఉన్న జనసేన టీడీపీలు ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో విడుదల చేశాయి. అయితే అది అంత ఆకర్షనీయంగా లేదని హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మేనిఫెస్టోలో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవు. ఇరు పార్టీలు తయారు చేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షనీయంగా, జనరంజకంగా లేదు. కనీసం నాలుగు కోట్ల మంది సంతృప్తి పడే విధంగా మేనిఫెస్టో రూపొందించడం శ్రేయస్కరం. .. పైగా అధికార వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ మేనిఫెస్టో ఏమాత్రం సరితూగదని లేఖలో ప్రస్తావించారాయన. సమన్వయంగా సాధించేది ఏంటి? తెలుగు దేశం పార్టీతో పొత్తుపై వ్యతిరేకత నెమ్మదిగా బయటకు వస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న సమన్వయ సమావేశాలు అందుకు వేదిక అవుతున్నాయి. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత రాజమండ్రి జైలు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంటోందని జనసేన కేడర్ చెబుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమన్వయ సమావేశాల్లో ఇరు పార్టీల కేడర్ నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు పరస్పరం ఎదురవుతున్నాయి. ‘‘ఇన్నాళ్లు టీడీపీని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు ఎందుకు చంకనెక్కారు?. ఇంకెన్నాళ్లు ఎజెండా పక్కనబెట్టి పక్క పార్టీ జెండా మోద్దాం?. అసలు జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు?. రెండు పార్టీల మ్యానిఫెస్టో అంటూ ఒకటే తయారు చేస్తున్నారు.. దానికి గ్యారంటీ ఏంటీ?. తెలంగాణ తరహాలో జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలే బరిలో దిగుతారా?. అసలు పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు?. మీకే నియోజకవర్గాల్లో గ్యారంటీ లేకుంటే.. రెండు పార్టీల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఉంటుంది?. క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్‌ను తెలుగుదేశం నేతలు అసలు పట్టించుకోవడం లేదు, దానికేమంటారు?. కొన్ని చోట్లయితే మరీ వివక్ష చూపిస్తున్నారు, సభలు పెట్టుకుంటే వచ్చి జెండా పట్టుకోమంటున్నారు?’’.. ఇలా పలు ప్రశ్నలు లెవనెత్తినట్లు సమాచారం. -
హరిరామజోగయ్య.. నీ పుస్తకంలో ఏం రాశావో గుర్తులేదా?: అడపా శేషు
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే మూడో భార్య పేరుతో ఉన్న ఇళ్లు, ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన నేత హరిరామజోగయ్యపై మండిపడ్డారు. వంగవీటి రంగ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని నీ పుస్తకంలో రాయలేదా?. ఇప్పుడు చంద్రబాబు అంత కమ్మగా ఎందుకు కనిపిస్తున్నారంటూ నిలదీశారు. ‘‘శాండ్, మైన్స్, వైన్స్ అన్నీ చంద్రబాబు సామాజిక వర్గం దోచుకున్న సంగతి తెలీదా?. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వటం ద్వారా ఎంత వాటా పొందారు?. పవన్ కళ్యాణ్ రాజధానిలో బినామీల పేరుతో ఎన్ని ఆస్తులు సమకూర్చారో చెప్పాలి’’ అని శేషు డిమాండ్ చేశారు. మహిళలంటే సీఎం జగన్‌కి ఎంతో గౌరవం. అందుకే మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ జైల్లో ఉన్నాడు. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నారు’’ అంటూ అడపా శేషు మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు: వైద్యులు -
చంద్రబాబుపై రంగా హత్య రక్తపు మరకలు!
పాలకొల్లు సెంట్రల్ : విపక్షాల ఓట్లు చీలకుండా చేయడం వల్ల జనసేన అభ్యర్థులను కొంతవరకూ గెలిపించుకునే అవకాశాలున్నా టీడీపీతో పొత్తు వల్ల పలు నష్టాలున్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీపై అవినీతి, కుల ముద్రతో పాటు ఆయనపై రంగా హత్య ఉదంతం రక్తపు మరకలు అలాగే ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, ప్రధాని మోదీకి బద్ధ శత్రువుగా మిగలడం, కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్ల డిమాండ్‌పై స్పందించకపోవడం లాంటి వాటివల్ల చివరకు జనసేనకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. జనసేన కనీసం 75 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు కైవసం చేసుకుంటే గౌరవప్రదమైన అధికారాన్ని పొందవచ్చని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబుకు పూర్తి కాలం అధికారాన్ని అప్పగిస్తే పవన్‌పై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమేనని భావించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాజకీయ విశ్లేషణ పేరుతో చేగొండి బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు రాగా జనసేనతో పొత్తు వల్ల రెండు శాతం పెరగవచ్చన్నారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. కేంద్రంతో సీఎం జగన్‌కు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణమన్నారు. -
ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్..హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది. ‘‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్‌పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట -
కాపు రిజర్వేషన్‌పై జూన్‌లో తుది విచారణ
సాక్షి, అమరావతి: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌కు పలు సూచనలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలని సూచించింది. లేనిపక్షంలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో పెండింగ్‌లో ఉందన్న కారణంతో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని వ్యాఖ్యానించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిందని, దీనిపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేయడంలేదని అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు జోక్యం చేసుకుంటూ.. కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తాము గతంలోనే పిల్ దాఖలు చేశామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని, అందువల్ల లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. -
టీడీపీతో పొత్తు జనసేనకు నష్టం..సీట్లు చెరిసగం ఉండాలి:హరిరామజోగయ్య
సాక్షి, పశ్చిమగోదావరి: గత 14 ఏళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఆరోపణలు, కుల ముద్ర, రంగా హత్య ఉదంతం వంటి నీలినీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి గత 14 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, మీడియా మద్దతు, చంద్రబాబు అనుభవం వంటి అంశాలు జనసేనకు లాభించినా.. అవినీతి ఆరోపణలు, రంగా హత్య వంటి ఉదంతాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. బాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు స్పందించకపోవడం, ప్రధాని మోదీకి బాబు బద్ధశత్రువు కావడం వల్ల టీడీపీతో జత కలిస్తే జనసేనకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటులో చెరిసగంగా ఉండాలని తెలిపారు. లేకుంటే అసంతృప్తివాదులు పెరిగి ఓటింగ్ సమయంలో ఓట్లు చీలిపోయి మధ్యలో వైఎస్సార్సీపీ లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం చంద్రబాబుకు కట్టబెడితే.. బాబు వద్ద పవన్ ప్యాకేజీ తీసుకున్నాడని, కాపు కులాన్ని టీడీపీకి తాకట్టు పెట్టాడంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందని స్పష్టం చేశారు. అధికారం ఇద్దరూ చెరిసగం తీసుకోవాలని తెలిపారు. చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
‘అలాంటి బాబుతో పవన్ పొత్తు.. సమర్థిస్తారా?’
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి హరిరామ జోగయ్యకి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబు నాయుడితో పవన్ పొత్తును ఏ విధంగా సమర్థిస్తారని అందులో అమర్నాథ్.. హరిరామ జోగయ్యను నిలదీశారు. ‘వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అని మీరే పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?. స్పష్టం చేయాలని హరిరామ జోగయ్యని నిలదీశారు మంత్రి అమర్నాథ్. -
హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..
అమరావతి: కాపు సామాజిక వర్గం అంశంపై మాజీ మంత్రి హరి రామ జోగయ్య రాసిన లేఖకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడుతో జతకడుతున్న పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖను తనకు పంపారా? అని పరోక్షంగా హరిరామ జోగయ్యకు చురక అంటించారు. అలాగే హరి రామ జోగయ్య ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు అమర్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను ట్వీట్ చేశారు. pic.twitter.com/bnqvFRKR6L — Gudivada Amarnath (@gudivadaamar) February 5, 2023 చదవండి: యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా? -
చంద్రబాబు, పవన్‌లతో మ్యాచ్‌ఫిక్సింగ్
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లతో మాజీమంత్రి హరిరామజోగయ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కాపు రిజర్వేషన్ల పేరుతో నాటకమాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మంత్రివర్గంలో హరిరామజోగయ్య మంత్రిగా పనిచేసినప్పుడు కాపులను ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. కాపుల అభ్యున్నతి కోసం ఏనాడూ పాటుపడని ఆయన ఇప్పుడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల స్క్రిప్ట్ మేరకే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర హక్కులను హరిస్తున్న బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ పార్టీపై పేర్ని నాని స్పందిస్తూ.. దేశంలో పిరమిడ్ పార్టీ గతంలో అన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిందని.. అలాగే, కేఏ పాల్ పార్టీ రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీచేసిందని.. అదే రీతిలో 175 స్థానాల్లోనూ బీఆర్ఎస్ పోటీచేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్‌తో ఆ పార్టీ పోటీపడుతుందంటూ ఎద్దేవా చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరిస్తున్నది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి బీఆర్ఎస్ ఇక్కడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తుందో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. -
దాసరి విగ్రహావిష్కరణలో వివాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎంపీల పేర్లు లేకుండా అన్నీ తానై నడిపించినట్టుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య తదితరులు మనస్తాపం చెందారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పోస్టర్లా ఉందంటూ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన అందరివాడు.. మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి అందరివాడు. ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారు. పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించాం. స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరాం. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్లా ఉంది. అందరికి సంబంధించినదిలా కనపడడం లేదు. వాళ్ల తాలూకు మంత్రులు, ఎంపీలు, కాబోయే ఎంపీల పేర్లున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. -
ముద్రగడ సాధించిందేమీ లేదు: జోగయ్య
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కాపు రిజర్వేషన్ల కోసం చేపట్టిన దీక్షను హఠాత్తుగా విరమించడం ద్వారా ముద్రగడ పద్మనాభం ఏం సాధించారని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రశ్నించారు. సోమవారం జోగయ్య ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఆయనపై ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయించుకోవడం తప్పించి.. ముద్రగడ దీక్షవల్ల కాపులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను మంగళవారం పూర్తి వివరాలు మాట్లాడతానని జోగయ్య చెప్పారు.