harsha kumar
-
హర్షకుమార్కు సవాల్ విసిరిన నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు తొత్తులుగామారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న కొందరు నాయకుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని, వారంతా జై చంద్రబాబు అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హర్ష కుమార్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశం దళిత జాతి కోసం కాదు చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దారుణాలపై హర్ష కుమార్, శ్రవణ్ కుమార్‌ను ఎందుకు స్పందించలేదని చెప్పారు. అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి హోదాలో ఆదినారాయణరెడ్డి దళితులను అవమానిస్తే మీరు ఎక్కడున్నారు. నీకెందుకురా రాజకీయాలు అని చింతమనేని దళితుల్ని దూషించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా... అన్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబూ లాంటి నీచులు 100 మంది వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. (చదవండి: చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ) హర్షకుమార్ టీడీపీలో చేరడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. చంద్రబాబు రాసిన స్క్రిప్టు కాకుండా మీకంటూ సొంతగా స్క్రిప్టు రాసుకునే దమ్ముందా. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేముంటే చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అడ్డుకున్నాడో అడగండి. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీయండి. దళిత జాతిని మీరు బాగుపడనివ్వరా? చంద్రబాబుకు, లోకేష్‌కు ధైర్యం ఉంటే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం కాదు, ఏపీకి రమ్మనండి. మంగళగిరి దెబ్బకి లోకేష్ హైదరాబాద్ పారిపోయాడు. వెన్నుపోటు అని గూగుల్‌లో కొడితే చంద్రబాబు పేరు వస్తుంది. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర జగన్మోహన్రెడ్డి పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చించుకుందాం రండి. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం’అని ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. (చదవండి: పోలీసు సంస్కరణల్లో ‘ఆంధ్ర’ భేష్) -
‘చంద్రబాబు, హర్షకుమార్ హస్తం ఉంది’
సాక్షి, తాడేపల్లి: ‘హర్షకుమార్కు సరదాగా ఉంటే నక్షలైట్లలో చేరాలి. ఆయనతో పాటు చంద్రబాబు కూడా నక్సలైట్లలో చేరాలి. అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు’ అంటూ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత యువకుడి శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దళిత బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. అంతేకాక బాధిత బాలికకు ప్రభుత్వం పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని తెలిపారు. చంద్రబాబు దళితులను నీచంగా చూశారని అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెదపలేదన్నారు. దళితుల కోసం మీడియా సమావేశం పెట్టిన హర్షకుమార్ మూడు రాజధానులు కోసం ఎందుకు మాట్లాడుతున్నారని అమ్మాజీ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న నిన్ను ఎవరూ నమ్మరు: కనకరావు హర్షకుమార్, చంద్రబాబు మీద మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌ల్లో హర్షకుమార్ ఒకరు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి అతడు కక్కుర్తి పడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్ దళిత సమస్యలపై పోరాటం చేస్తామంటే ఎవరూ నమ్మరు. దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి. ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక చంద్రబాబు, హర్షకుమార్ ఉన్నారు’ అని ఆయన ఆరోపించారు. అంతేకాక ‘యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మక్కై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు. అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు. రాజధానిలో దళితుల భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెదపలేదు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబుకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి. వారి సంక్షేమం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు’ అన్నారు కనకరావు. -
‘బాబు కాళ్లు పట్టుకున్న నేతకు ఆ అర్హత లేదు’
-
‘బాబు కాళ్లు పట్టుకున్న నేతకు ఆ అర్హత లేదు’
సాక్షి, తాడేపల్లి: దళితులపై దాడుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించినంత వేగంగా ఏ సీఎం స్పందించలేదని మంత్రి విశ్వరూప్ అన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు. అత్యాచార ఘటనల్లో నిర్భయ, ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేసి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. టీడీపీ నేత హర్షకుమార్ దళితుల బాగుకోసం చేసిందేమీ లేదని అన్నారు. హర్షకుమార్ ఎంపీగా పోటీ చేస్తే పది వేల ఓట్లు కూడా రాలేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమారుడికి 600 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. హర్షకుమార్‌ది దళిత ఎజెండా కాదని... చంద్రబాబు, అమరావతి ఎజెండా అన్నారు. దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్ష కుమార్ ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్ల హర్షకుమార్ ఎంపీ అయ్యారని, దళితులను మాస్క్‌లా హర్షకుమార్ వాడుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో దళిత నేతలు అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే నోరు మెదపని టీడీపీకి ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళితుల అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, అమరావతికి దళిత సమస్యలకు సంబంధం ఏమిటన్నారు. దళితులను ప్రభుత్వానికి దూరం చేయాలనే కుట్రతోను చంద్రబాబుతో కలిసి హర్షకుమార్ పని చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్ అని పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో పది వేల ఓట్లు తెచుకున్న చరిత్ర హర్షకుమార్‌ది అని మంత్రి విమర్శించారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే హర్షకుమార్ పనిగా పెట్టుకున్నారని, టీడీపీ హయాంలో చాలా సందర్భాల్లో దళితులపై దాడులు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. టీడీపీ హయాంలో దళితులపై జరిగిన దాడుల సమయంలో ఎందుకు వర్ల రామయ్య నోరు మెదపలేదని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి అని.. దళితులకు ఒక ఉపముఖ్యమంత్రి, ఐదు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైస్సార్ చేయూత ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడారు. హర్షకుమార్‌ను ప్రజలు జోకర్‌గా చూస్తున్నారని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. -
మలుపు తిరిగిన శిరోముండనం ఘటన
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో దళిత యువకుడు ఇండుగుపల్లి ప్రసాద్ శిరోముండనం ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు ఇసుక లారీ ఢీకొట్టడం వల్ల తనకు గాయాలవడంతో వివాదం తలెత్తినట్టుగా ప్రసాద్ చెబుతున్నది వాస్తవం కాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో దళిత యువకుడు కానేటి విజయకుమార్ శనివారం స్పృహలోకి వచ్చి స్పష్టం చేశాడు. ఇంకా అతడు ఏం చెప్పాడంటే.. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) ► ఈ నెల 18 రాత్రి ప్రసాద్, మరికొంతమంది మిత్రులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా బైకు బోల్తా పడి పక్కనే ఉన్న గోతిలో పడింది. దీంతో కాలు విరిగింది తప్ప లారీ ఢీకొని కాలు విరగలేదు. ► లారీ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే గొడవ పడినట్టు ప్రసాద్ చెబుతున్న దానిలో నిజం లేదు. అసలు ప్రసాద్ ఆ సమయంలో అక్కడ లేనే లేడు. ► ఈ ఘటనలో నా పేరును ప్రసాద్, మరికొంత మంది దళిత నాయకులు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ► నిజానికి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త. గత ప్రభుత్వ హయాం నుంచే ఇసుక లారీల వద్ద వసూళ్లకు పాల్పడేవాడు. ఇవ్వని వారితో గొడవ పడుతుండేవాడు. ► 2019, మార్చి 10న మరో ఇద్దరితో కలిసి సీతానగరం పలావ్ సెంటర్ వద్ద పలసపూడి నాగేంద్ర అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో ప్రసాద్‌పై సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో 74/2019, ఐపీసీ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ► ప్రమాదం బారినపడ్డ నన్ను ఏ దళిత నాయకుడూ పరామర్శించలేదు. ► మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా దీన్ని రాజకీయం చేస్తుండటం నాకు బాధ కలిగిస్తోంది. (శిరోముండనం కేసు; కొత్త కోణం) -
హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి
-
ఆ వ్యాఖ్యలు హర్ష కుమార్‌కే వర్తిస్తాయి
అమలాపురం టౌన్: దళిత సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమైనా మాజీ ఎంపీ హర్షకుమార్ తన స్వలాభానికే ఉపయోగించుకుంటున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. దళితులు అధికంగా ఉన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన దళితులకు ఏం చేశారో ప్రజలకు తెలుసని ఆమె విమర్శించారు. అమలాపురంలో అనురాధ శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. సీతానగరం పోలీసు స్టేషన్లో జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, తమ ప్రభుత్వం తొలి నుంచీ ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ సవాంగ్‌లు స్పందించి బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో హర్షకుమార్ వాడిన పదజాలం, ప్రదర్శించిన ఆవేశం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ఆమె ప్రశ్నించారు.(‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) దళితుల మీద ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ఓ దళితుడిగా ఆయనకూ వర్తిస్తాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల గురించి ఆయన చెప్పిన మాటలు ఎంత సత్య దూరమో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిసారీ మీరు అనుసరిస్తున్న తీరును...మీ చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జరిగిన ఘటనను వైఎస్సార్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్త కంఠంతో ఖండించారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే దళితుల కోరికన్నారు. చదువుకున్న వాళ్లం.. ప్రజాప్రతినిధులం.. మన పదజాలం, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని హర్షకుమార్ విజ్ఞతకే... ఆయన మనః సాక్షికే వదిలేస్తున్నానని ఎంపీ అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార వ్యాఖ్యలను హర్షకుమార్ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
బహిరంగ వేదికపై ఆయన కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
-
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
-
‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్ విలువ దిగజారిదంటూ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో’ అని నిప్పులు చెరిగారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) ‘దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారు. దళితుడు వరప్రసాద్ కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ మంత్రి విశ్వరూప్ హితవు పలికారు. (ఆ కేసు దర్యాప్తులో వేగం పెంచండి: డీజీపీ) -
మాజీ ఎంపీ హర్షకుమార్ చెల్లని నాణెం: విశ్వరూప్
-
బ్రేకింగ్ : మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి : విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను, ప్రభుత్వోద్యోగులను బెదిరించిన కేసులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఉన్న రెడ్‌క్రాస్ భవనంలోని షాపులను జిల్లా కలెక్టర్, సిబ్బంది కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయిస్తున్నారు. హర్షకుమార్ వచ్చి న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించి, మహిళా ఉద్యోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కోర్టు సిబ్బందిని చంపుతానంటూ బెదిరించారని జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హర్షకుమార్ శుక్రవారం ఇంటికి రావడంతో పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసును జారీచేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో హర్షకుమార్, ఆయన అనుచరులు స్టేషన్‌కు వచ్చారు. హర్షకుమార్ విచారణకు సహకరించక పోవడంతో అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాజమహేంద్రవరం ఐదో అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వాలని చెప్పినప్పటికీ అన్యాయంగా అరెస్ట్ చేశారని హర్షకుమార్ పేర్కొన్నారు. -
మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తాం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తోయటం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93 మంది ఉన్నారని ప్రజలను, వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వద్ద 93 మంది ఉన్నట్టు సమాచారాన్ని అధికారులకు అందిస్తే తద్వారా ప్రభుత్వాధికారులు ఆవిధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ కాని అటువంటివేమీ లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవపట్టించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారన్నారు. గతనెల 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం 12 గంటలు, 3.30 గంటల సమయంలో వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుషపదజాలంతో మాట్లాడడం, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించడంతో పాటు, తోయడం, మహిళా ఉద్యోగినులతో అసభ్యకరంగా ప్రవర్తించారని జిల్లా కోర్టు పరిపాలనాధికారి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హర్షకుమార్‌తో పాటు ఆయనకు సహకరించిన వారిని అరెస్టు చేస్తామన్నారు. ఈ విధంగా ధిక్కారధోరణిలో మాట్లాడి ప్రజలను తప్పుదోవపట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. త్రీటౌన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ మాజీ ఎంíపీ జీవీ హర్షకుమార్‌ను అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన త్రీటౌన్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబును సస్పెండ్ చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. గత నెల 28న జిల్లా కోర్టు పరిపాలనాధికారి మాజీ ఎంపీ హర్షకుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేసిన త్రీటౌన్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబుకు, సిబ్బందికి ఆయనను అరెస్టు చేయాలని అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీబాజ్పాయ్ ఆదేశాలు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్స్పెక్టర్ శేఖర్‌బాబు గతనెల 29వతేదీ మధ్యాహ్నం వరకు ఇంటిలో ఉన్న హర్షకుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్సారం చేశారన్నారు. ఇన్స్పెక్టర్, సిబ్బంది ముందు నుంచే మాజీ ఎంపీ పరారయ్యారన్నారు. అందువల్ల విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు శేఖర్‌బాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. -
హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఫైర్ అయ్యారు. ఇటువంటి విషాద ఘటనలను రాజకీయ నిరుద్యోగులు ప్రచారానికి వాడుకోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబాలకు పండుల రవీంద్ర తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారనడం తప్పు అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో మృతుల కుటుంబాలు మనోవేదనకు గురవుతాయన్నారు. ‘మీపై గౌరవం ఉంది. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి’ అని హర్షకుమార్‌ను పండుల డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడకూడదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం చేయాల్సిదంతా చేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్యోగం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకుని.. హర్షకుమార్ నైతిక విలువలు దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుపైన పండుల రవీంద్ర మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.. మీకు కళ్లు పోయాయా అని ఆయనను ప్రశ్నించారు. దళితులను చింతమనేని దుర్భాషలాడినప్పుడు మీరు ఏమైపోయారని నిలదీశారు. బుద్ధుడి పేరుతో భూములు ఆక్రమించే గొల్లపల్లి సూర్యారావుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. -
‘ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి’
సాక్షి, కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పిన పార్టీకి సపోర్టు చేయకుండా తాము వైఎస్సార్ సీపీకి పని చేయడంతో తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మహాసేన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజేష్ సరిపెల్ల వివరించారు. శుక్రవారం కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హర్షకుమార్ అనుచరులు తమను రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారని, హర్షకుమార్ వల్ల తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మీని కలసి వివరించినట్టు తెలిపారు. హర్షకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు, మహాసేన సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. -
టీడీపీ- కాంగ్రెస్‌ల పొత్తా?.. సిగ్గుచేటు!
సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటైన కాంగ్రెస్-టీడీపీలపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అడగడుగునా అవమాన పరిచి, వివక్షకు గురిచేసిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. దళితులను రాజధాని ప్రాంతం నుంచి వెళ్లగొట్టడానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న దోపిడిపై కోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో సోమవారం పర్యటించిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూముల్ని ఏపీ మంత్రులు బెదిరించి, అక్రమంగా కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని.. అంతేకాకుండా పట్టా భూముల రైతులకు ఇచ్చే ప్యాకేజీలు కూడా వారికి వర్తింపచేసేలా చూడాలని డిమాండ్ చేశారు. పదిహేను రోజుల్లో అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరగకపోతే అమరావతిలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. ఏపీ రాజధాని అంతర్జాతీయ ఆర్థిక నేరం చంద్రబాబు ఏపీని సింగపూర్ కంపెనీలకు అమ్మేశారని హర్షకుమార్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా అమ్మడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట జరుగుతున్న దోపిడిపై ప్రధానికి పిర్యాదు చేస్తానని తెలిపారు. సీఎం బినామీలు, పార్టీ నాయకుల కోసమనే విధంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను కబ్జాలు చేసి, టీడీపీ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాలుపడుతోందని ధ్వజమెత్తారు. -
ముఖేష్ అంబానీని అరెస్టు చేయాలి
తాడితోట (రాజమహేంద్రవరం): జిల్లా నుంచి రూ. 19వేల కోట్ల విలువైన గ్యాస్‌ను చోరీ చేసిన ముఖేష్ అంబానీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. అమలాపురం అయిల్ స్కాంలో నిందితులపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో ముఖేష్ అంబానీ దోపిడీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, సుప్రీం కోర్టులో కేసు వేశానని తెలిపారు. ఈ ఆయిల్ స్కాం వాస్తమేనని కెనడాకు చెందిన సంస్థ నివేదిక ఇచ్చినా, కేంద్రం నియమించిన షా కమిటీ నిర్థారించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని ఆరోపించారు. అమలాపురంలో ఆడుకుంటున్న పిల్లలపైకి హోం మంత్రి సోదరుడు సిద్ధప్ప నాయుడు కుక్కను ఉసిగొల్పడంతో 9వ తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ మరణించాడన్నారు. అరుణ్ కుమార్ శరీరంపై 78 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టు మార్టం రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అరుణ్ కుమార్ మృతికి కారకులైన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కాట్రావుల పల్లిలో దళిత యువకుడిపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ఈ నెల 16న కాట్రావులపల్లి నుంచి పాదయాత్ర నిర్వహించి జిల్లా జడ్జికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు. కాకినాడలో వంశీధర్ అనే విలేకరికి జర్నలిస్ట్ హెల్త్ స్కీం కార్డు ఏమాత్రం పనికిరాకుండా పోయిందన్నారు. ఆ విలేకరి సొంత డబ్బుతో అత్యవసర వైద్యం చేయించుకున్నప్పటికీ ప్రాణాలు కోల్పోయాడన్నారు. దండోరా నాయకులు తుత్తరపూడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
చివరి సన్నివేశం ప్రారంభం!
హర్ష కుమార్, తులికా సింగ్ జంటగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాస్ట్ సీన్’ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ నిర్మిస్తోంది. ప్రకాశ్ ఠాకూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా సల్మాన్ సర్కార్ తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ‘‘కథ అద్భుతంగా కుదిరింది. ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఈ నెల 20న హైదరాబాద్‌లో మూడు రోజులు షూట్ చేస్తాం. తర్వాత కేరళలో చిత్రీకరణ జరపుతాం. ఈ షెడ్యూల్ 18 రోజుల పాటు జరుగుతుంది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు దీపక్ బలదేవ్. మధునారాయణ్, హిమాయత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రమణ్ గోయల్ సంగీతం అందిస్తారు. -
మీరు.... మీ పార్టీ 420 : హర్షకుమార్
రాజమహేంద్రవరం: ప్రతి విషయంలోను ప్రజలను, దళితులను మోసం చేస్తున్న మీరు...మీ పార్టీ 420తో సమానమని టీడీపీని, రాష్ట్ర సీఎం చంద్రబాబుని ఉద్దేశించి అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం వ్యాన్ ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి కిందపడిన ఘటనలో 22 మంది చనిపోగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్ష చొప్పున నష్ట పరిహారం అందజేశారని, ఈ నెల 18న దర్శనానికి వెళ్తూ కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష నష్ట పరిహారం ప్రకటించడం వివక్షత కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది మే 23న పాత తుంగపాడులో ఒక దళితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తులపై ఇంత వరకూ చర్యలు లేవని, ఇటీవలే ఓ మీడియా సమావేశంలో చార్జిషీటు వేసినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. ఇకనైనా దళితుల పట్ల వివక్షను విడనాడాలని సూచించారు. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్న చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరమట గణేశ్వరరావు, జీవీ శ్రీరాజ్, ఒరిగేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
'యనమల ఒక చవట.. దద్దమ్మ'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యనమల ఒక చవట.. దద్దమ్మ' అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. యనమల వల్లే పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్ తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుకపైనే ఆసక్తి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు ప్రజా ప్రతినిధులా? ఇసుక వ్యాపారులా? అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. -
'కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి'
రాజమండ్రి: కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన తనను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చారు. ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. -
'రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టండి'
కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. చంద్రబాబు నాయుడు కాపుల రిజర్వేషన్లతో బీసీలను రెచ్చగొడుతున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల కోసం కాపు ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరం అయితే కాపు రిజర్వేషన్ల కోసం ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటానని హర్షకుమార్ తెలిపారు. -
'తుని ఘటనపై నైతిక బాధ్యత చంద్రబాబుదే'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే' అని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతరులపై నెపం నెట్టడం చంద్రబాబుకు అలవాటు అని మండిపడ్డారు. సోమవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు వెంటనే రిజర్వేషన్ ప్రకటించి వారి ఆగ్రహం చల్లార్చాలని డిమాండ్ చేశారు. కాపు మంత్రులు సీఎం చంద్రబాబు భజన చేయడం మానేయండంటూ హర్షకుమార్ విమర్శించారు. కాగా, కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే. -
జగన్ దీక్షపై సర్కారు తీరు జుగుప్సాకరం: హర్షకుమార్
రాజమండ్రి సిటీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా చేసు ్తన్న నిరవధిక నిరాహార దీక్ష పట్ల మంత్రుల ప్రకటనలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉన్నాయని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. జగన్ దీక్షపై బురద చల్లే ప్రయత్నాన్ని టీవీ చానల్స్‌లో చూశాక తట్టుకోలేకపోయానన్నారు. దీక్ష కు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రాజ మండ్రి కోటగుమ్మం సెంటర్లో జరుగుతున్న రిలే దీక్షలకు హర్షకుమార్ సోమవారం సంఘీభావం ప్రకటించారు. రాష్ర్ట ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. -
వైఎస్ జగన్ దీక్షకు హర్షకుమార్ మద్దతు
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ జి వి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడాలని హర్షకుమార్ అన్ని పార్టీలకు సూచించారు.