Heat wave
-
అమెరికాలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో హీట్ వేవ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు దంచికొడుతున్నాయి. హీట్ వేవ్ కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా పలుచోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.వివరాల ప్రకారం.. అమెరికాలోకి పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. హీట్ వేవ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వాహనదారుల కోసం రహదారులపై హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేస్తున్నారు అధికారులు.Today's USA Coast-to-Coast Weather Outlook!• Record breaking heat wave continues to affect the Western United States• Severe weather and flooding continue for Midwest, Ohio Valley, Southern Plains• Southern Texas preparing for Hurricane Beryl's heavy rains@NBCPalmSprings pic.twitter.com/qAmjnG6HUy— Jerry ‘The Steffler’ Steffen ⚡ (@JerrySteffen) July 4, 2024ఇక, కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో నిన్న(గురువారం) 123 డిగ్రీ(ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. హీట్ వేవ్ ఇలాగే కొనసాగితే మరో 4-5 రోజుల్లో రికార్డు స్థాయిలో 130 డిగ్రీల(ఫారన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. టెక్సాస్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
9 రోజులు.. 500 కోట్ల మందికి చుక్కలు చూపించిన ఎండలు!
న్యూఢిలీ: ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ నెలలో తొమ్మిది రోజులు నమోదైన అధిక ఎండలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన ‘క్లైమెట్ సెంట్రల్’ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.జూన్ నెలలోని 9 రోజులు అధిక ఉష్ణోగ్రత నమోదై.. ఎండలు మండిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లమంది, భారత్‌లో 61.9 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో 57.9 కోట్ల మంది, ఇండోనేషియాలో 23.1 కోట్ల మంది, నైజిరియాలో 2.06 కోట్ల మంది, బ్రెజిల్లో 1.76 కోట్లమంది, బంగ్లాదేశ్‌లో 1.71 కోట్ల మంది, అమెరికా 1.65 కోట్లమంది, యూరోప్‌లో 1.52 కోట్ల మంది, మెక్సికోలో 1.23 కోట్ల మంది, ఎథియోపియాలో 1.21 కోట్ల మంది, ఈజిప్ట్‌లో 1.03 కోట్ల మంది ప్రజలు జూన్‌లో తొమ్మిది రోజల ఎండ వేడిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.వాతావరణ మార్పుల కారణంగా జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది మూడుసార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. ‘‘ సుమారు శతాబ్దం పైగా బొగ్గు, ఆయిల్, నాచురల్ గ్యాస్‌ను మండించటం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది. అర్బన్ జనాభాను కట్టడి చేయకపోవటంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యాయి’’ అని క్లైమెట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్షింగ్ తెలిపారు.అదే విధంగా జూన్ 16నుంచి 24 వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4. 97 వందల కోట్ల మంది మూడు సార్లు తీవ్రమైన ఎండకు ప్రభావిత అయినట్లు క్లైమెట్ ఫిఫ్ట్ ఇండెక్స్ (సీఎస్ఐ)తెలిపిందన్నారు. భారత్‌లో అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి గాలులు రికార్డుస్థాయిలో నమోదైనట్ల రిపోర్టులో వెల్లడించింది. ఉష్ణోగ్రత, వేడి గాలులు కారణంగా సుమారు వంది మంది మరణించగా, 40 వేల మంది వడదెబ్బ తగిలిన కేసులు నమోదయ్యాయిని తెలిపింది. అధిక ఎండ, వడగాలులతో దేశరాజధాని ఢిల్లీ నీటి సంక్షోభం, పవర్ కట్ సంభవించినట్లు పేర్కొంది. అదేవిధంగా సౌది అరేబియాలో సైతం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రపంచవ వ్యాప్తంగా హజ్ యాత్రకు అక్కడి వచ్చిన సుమారు 1300 మంది ఎండ తీవ్రత కారణంగా మృతి చెందారు. అదే విధంగా భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, జూన్ నెలల్లో దేశంలో 40 శాతం మంది సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. అదీ కాక కొన్ని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పలు చోటు రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాత్రి పూటి ఉష్ణోగ్రత సైతం 35 డిగ్రీల వరకు నమోదైనట్లు పేర్కొంది. -
హీట్‌వేవ్ ముగిసింది.. ఇక వానలే వానలు
న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్‌బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది. -
కరోనా రికార్డులు దాటేస్తున్న వడదెబ్బ మృతులు?
దేశరాజధాని ఢిల్లీలో వడగాడ్పుల బీభత్సం కొనసాగుతోంది. ఎండలకు తాళలేక మృతి చెందుతున్నవారి సంఖ్య గతంలో ఎదురైన కరోనా మహమ్మారి మరణాలను మించిపోతున్నది. ఢిల్లీలోని పలు శ్మశానవాటికల వద్ద దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాల క్యూ కనిపిస్తోంది.ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన బోద్ ఘాట్‌లో కరోనా తర్వాత అత్యధిక దహన సంస్కారాలు జూన్ 19న ఒక్క రోజులో జరిగాయి. బుధవారం రాత్రి 12 గంటల వరకు నిగమ్ బోద్ ఘాట్ వద్ద 142 మృతదేహాలను దహనం చేశారు. కరోనా కాలంలో 2021 ఏప్రిల్‌న 253 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు.నిగమ్ బోద్ ఘాట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడానికి వడదెబ్బ కారణం కావచ్చన్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు 1,101 మృతదేహాలను దహనం చేశామన్నారు. నిగమ్ బోద్ ఘాట్ల వద్ద మృతదేహాల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.దేశంలో కరోనా తాండవమాడుతున్న 2022 జూన్‌లో ఈ ఘాట్‌లో మొత్తం 1,570 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలయ్యేలా వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిగమ్ బోద్ ఘాట్‌లో వారం రోజులుగా జరిగిన దహన సంస్కారాల గణాంకాలు ఇలా ఉన్నాయి.జూన్ 14 - 43జూన్ 15- 53జూన్ 16 - 70జూన్ 17 - 54జూన్ 18 - 97జూన్ 19- 142 (అర్ధరాత్రి 12 గంటల వరకు)ఢిల్లీలో సంభవిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పేదల పాలిట శాపంగా మారాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వడగాడ్పుల కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 48 గంటల్లో 50 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండ తీవ్రతకు తొమ్మది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా వడదెబ్బ కారణంగా మృతిచెందారా లేదా అనేది ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. -
ఉత్తరాదిలో భానుడి భగభగలు..
-
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్‌లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్‌ఖండ్‌లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్‌లో ఎనిమిది మంది, చిత్రకూట్‌లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్‌భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. -
12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో పంజాబ్, హర్యానాతో సహా వాయువ్య, మధ్య , తూర్పు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని కొన్ని చోట్ల నేడు (సోమవారం) కూడా వడగాలులు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఈ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లో కూడా తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు వేసవి పరిస్థితులను, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని ప్రధానికి అధికారులు ఈ సమావేశంలో వివరించారు.ఉత్తర భారతంలోని ప్రజలు వేడిగాలులకు చెమటలు కక్కుతుండగా, దక్షిణాదినగల కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.అసోంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
ఉత్తర భారతానికి హీట్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా హీట్‌వేవ్ అలర్ట్ ఇచ్చింది. రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఉత్తర భారతమంతా మే 21వ తేదీ వరకు భానుడు చండ ప్రచండంగా నిప్పులు కురిపించనున్నాడని తెలిపింది. శుక్రవారం(మే17) దేశంలోనే రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. హీట్‌వేవ్ అలర్ట్ నేపథ్యంలో జైపూర్ నహార్ఘర్ బయలాజికల్ పార్కులోని జంతువులకు చల్లదనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పార్కు అధికారులు తెలిపారు. -
ఎండలతో బీ కేర్‌ఫుల్ ..ఐఎండీ తాజా వార్నింగ్
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్26) అలర్ట్ జారీ చేసింది. తూర్పు,దక్షిణ భారతాల్లో రానున్న ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పౌరులు బయటికి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే ఏప్రిల్ 28 నుంచి 30 మధ్య ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
వెదర్ అప్డేట్: కొనసాగనున్న హీట్‌వేవ్
న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో దక్షిణ, ఉత్తర భారతాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. రానున్న ఐదు రోజుల్లో విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. మండే ఎండల్లో వర్ష సూచన -
తెలంగాణకు హెచ్చరిక.. బయటకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ -
మండే ఎండల్లో వర్ష సూచన: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు. -
భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ వచ్చీ రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల వేడి.. కరువు దాడి -
తిరుమల: భక్తగిరులపై భానుని భగభగలు (ఫొటోలు)
-
ఒక వైపు మండుతున్న ఎండలు..మరోవైపు వర్షాలు
-
ఓరి దేవుడో.. ఇవేం ఎండలు! వడదెబ్బకు 54 మంది మృతి
ఉత్తరప్రదేశ్: రాజస్థాన్‌లో బిపర్ జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంటే.. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే బల్లియా జిల్లా ఆస్పత్రిలో 54 మంది మృతి చెందారు. దాదాపు 400 మంది తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు వేరువేరు కారణాలున్నప్పటికీ ఎండ తీవ్రత ఓ కారణమని వైద్యులు చెప్పారు. రోజురోజుకూ వేడితీవ్రత ఎక్కువగా..ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎండలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు. జూన్ 15న 23 మంది మరణించగా..ఆ మరుసటి రోజు 20 మంది మృతి చెందారు. కాగా.. శనివారం 11 మంది ప్రాణాలు పోయాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే యాదవ్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి ఏదైనా వ్యాధి కారకమా? అని తెలుసుకోవడానికి లక్నో నుంచి ఓ బృందం వస్తోందని అడినల్ హెల్త్ డైరెక్టర్ డా.బీపీ తివారీ తెలిపారు. వేడి, చలి పెరిగినప్పుడు శ్వాసకోశ సమస్యలు, డయాబెటిస్, బీపీ విపరీతంగా పెరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు పెరగడమే తాజా మృతులకు కారణమని వెల్లడించారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో స్ట్రెచర్స్ లేమి కారణంగా రోగులను బంధువులు భుజాలపై మోసిన సందర్భాలు ఎదురయ్యాయని చెప్పారు. ఇదీ చదవండి:అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ -
రానున్న ఐదు రోజులు వడగాల్పులే.. యెల్లో అలర్డ్ జారీ..
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 42°C నుంచి 44°C వరకు స్థిరంగా నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో 39°C నుంచి 41°C వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. వడగాలల నేపథ్యంలో పలు జిల్లాలకి వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు.. రేపు ఖమ్మం ,నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా అవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొంది. ఇదీ చదవండి:విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. -
ఏపీలో జూన్ మొదటి వారం వరకూ ఎండల తీవ్రత
-
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సలసల
-
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
సాక్షి ముంబై: తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్నేర్లోని రూపాలి రాజ్‌పుత్ ఉండగా.. నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత
-
వర్షాకాలంలో పెరుగుతున్న ఉష్ణతాపం.. వైజాగ్ వాసుల అవస్థలు
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కానీ వాతావరణం వేసవి అనుభూతిని కలిగిస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం, మరోపక్క ఉక్కపోత వెరసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో చల్లదనం పరచుకుంటున్నా, అవి బలహీన పడ్డాక సూర్యుడు చుర్రుమంటున్నాడు. కొద్దిరోజుల నుంచి ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వీటి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటోంది. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వేడిని వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆకాశంలో కొద్దిపాటి మబ్బులు కమ్ముకుంటున్నా వాతావరణంలో అంతగా చల్లదనం కనిపించడం లేదు. మేఘాలు కనుమరుగయ్యాక భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొద్దిపాటి సమయానికే సూర్య తాపం తీవ్రత పెరిగి చిర్రెత్తిస్తున్నాడు. మరోవైపు దీనికి ఉక్కపోత కూడా తోడవుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉక్కపోత అధికంగా ప్రభావం చూపుతుంది. వేసవిలో మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల సీజనే అయినా అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. ఫలితంగా జనానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. దీంతో వేసవి సీజనులో మాదిరిగా పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరివిగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఇదీ కారణం.. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ద్రోణులు గాని, ఆవర్తనాలు గాని లేవు. దీంతో వర్షాలు కూడా కురవడం లేదు. ప్రస్తుతం పశ్చిమం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలా విశాఖలో గాలిలో తేమ శాతం 60 నుంచి దాదాపు 90 శాతం వరకు ఉంటోంది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతకుమించితే ఉక్కపోత ప్రభావం మొదలవుతుంది. (క్లిక్: గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి) ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నా అవి వచ్చి పోతున్నాయి తప్ప స్థిరంగా ఉండడం లేదు. దీంతో సూర్య కిరణాలు నేరుగా భూ ఉపరితలంపైకి ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం విపరీతమైన ఉక్కపోతకు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు మేఘాలు, వర్షాలు లేకపోవడం వంటివి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం వంటిది ఏర్పడే వరకు కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు. (క్లిక్: గిరిజనులకు విలువిద్యలో శిక్షణ)