hockey world cup
-
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్‌ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్‌హామ్ గేమ్స్‌లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన -
భారత్ X జర్మనీ
కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్‌కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్‌గా నిలిచింది. అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్ నాలుగో సారి ఫైనల్ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్ తేడాతో డచ్‌పై జయభేరి మోగించింది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్ కీపర్ మోహిత్‌తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్‌లో పూల్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో యువ భారత్ జట్టు 10–1తో కెనడాను చిత్తు చేసింది. ఈ విజయంతో తమ పూల్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత్ నాకౌట్‌కు అర్హత సంపాదించింది. భారత జట్టులో ఆదిత్య అర్జున్ (8వ, 43వ నిమిషాల్లో), రోహిత్ (12వ, 55వ ని.), అమన్‌దీప్ లక్రా (23వ, 51వ ని.) రెండేసి గోల్స్ సాధించారు. విష్ణుకాంత్ (42వ ని.), రాజిందర్ (42వ ని.), కుష్వాహ సౌరభ్ ఆనంద్ (51వ ని.), ఉత్తమ్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జూడ్ నికోల్సన్ 20వ నిమిషంలో చేశాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్... పూల్ ‘డి’ విజేత నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్‌లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
భారత్ 12 – కెనడా 0
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను భారత జట్టు భారీ విజయంతో మొదలు పెట్టింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్ తేడాతో కెనడాను చిత్తుగా ఓడించింది. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి 4–0తో ముందంజలో నిలిచిన భారత్ తర్వాతి అర్ధ భాగంలో మరో 8 గోల్స్ కొట్టడం విశేషం. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ ఏకంగా నాలుగు గోల్స్‌తో (26వ నిమిషం, 41వ ని., 54వ ని., 60వ ని.) చెలరేగగా...దీపిక సోరెంగ్ (34వ నిమిషం, 50వ ని., 54వ ని.), అన్ను (4వ నిమిషం, 6వ ని., 39వ ని.) చెరో మూడు గోల్స్ సాధించారు. దీపి మోనికా టోపో (21వ ని.), నీలమ్ (45వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. తమ తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం జర్మనీతో భారత్ తలపడుతుంది. -
Hockey WC 2023: ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పూల్ ‘డి’లో భాగంగా నేడు ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2–0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో 5–0తో వేల్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బెల్జియం భారీ విజయం పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. పూల్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 5–0తో గెలుపొందింది. బెల్జియం తరఫున హెండ్రిక్స్ (31వ ని.లో), కాసిన్స్ (43వ ని.లో), ఫ్లోరెంట్ (50వ ని.లో), సెబాస్టియన్ డాకియర్ (52వ ని.లో), ఆర్థర్ స్లూవెర్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 3–1తో చిలీపై, నెదర్లాండ్స్ 4–0తో మలేసియాపై, జర్మనీ 3–0తో జపాన్‌పై విజయం సాధించాయి. -
హాకీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ.. స్పెయిన్‌పై ఘన విజయం
భువనేశ్వర్ వేదికగా జరగుతోన్న హాకీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే హర్మన్‌ప్రీత్ సింగ్ సేన అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోను ప్రత్యర్ధి జట్టుకు గోల్ సాధించే అవకాశం భారత డిఫెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ అద్భుతమైన డిఫెన్సింగ్ స్కిల్స్‌ను చూపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలిగోల్ సాధించాడు. అనంతరం హార్దిక్ సింగ్ 26 నిమిషంలో రెండో గోల్‌ను భారత్‌కు అందించాడు. ఇక భారత తన తదుపరి మ్యాచ్‌లో జనవరి 15న ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మెగా టోర్నీలో శుభారంభం చేసింది. గ్రూపు-డిలోనే భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
వరల్డ్‌కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ. 1 కోటి..!
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. -
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్‌లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్‌లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్‌హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
ప్రపంచకప్ టోర్నీకి భారత హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే!
Men's Hockey World Cup: ఒడిశాలో వచ్చే నెలలో 13 నుంచి 29 వరకు జరిగే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా... అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘డి’లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్లతో కలిసి భారత జట్టు ఉంది. భారత హాకీ జట్టు: శ్రీజేశ్, కృషన్ పాఠక్ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్, వరుణ్, నీలం సంజీప్ జెస్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్. చదవండి: Ranji Trophy: వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఆంధ్ర విజయం IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు -
'సొంత గడ్డపై భారత జట్టు ప్రపంచ కప్ గెలుస్తుంది’
న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ పురుషుల హాకీ టోర్నీ భువనేశ్వర్, రూర్కేలా వేదికలపై జనవరి 13 నుంచి 29 వరకు జరుగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్లో భాగంగా శుక్రవారం ట్రోఫీ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సమరం కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 15 పోటీ జట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ సన్నాహాలు, సన్నద్ధత చూస్తుంటే మరోసారి ప్రపంచ చాంపియన్ అవుతుందని అనిపిస్తుంది. జట్టు సభ్యులంతా కఠోరంగా శ్రమించారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రపంచకప్ మాత్రమే కాదు... పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు సత్తా చాటుతుంది’ అని అన్నారు. ఒకప్పుడు హాకీలో భారత్‌కు ఘనచరిత్ర ఉంది. చివరి సారిగా భారత్ 47 ఏళ్ల క్రితం కౌలాలంపూర్ (1975)లో జరిగిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. చదవండి: IND-W vs AUS-W: సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే? -
హాకీ ప్రపంచకప్‌కు సన్నాహాలు
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్–2023 టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్రొ అధ్యక్షతన అనుబంధ విభాగాల ఉన్నత అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక లోక్‌సేవా భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్, క్రీడా విభాగం కార్యదర్శి ఆర్.వినీల్‌కృష్ణ, వివిధ విభాగాల ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కటక్, రౌర్కెలా ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరుసగా రెండోసారి హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో 2018లో తొలిసారి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు, నిర్వాహక వర్గాలు టోర్నమెంట్ నిర్వహణకు ప్రసంశలు కురిపించారని గుర్తుచేశారు. ఈసారి గతంకంటే ఘనంగా ఆద్యంతం విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దఫా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియం, రౌర్కెలా ప్రాంతంలో హాకీ పురుష ప్రపంచకప్–2023 టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ కావడం క్రీడాలోకంలో జయజయ ధ్వానాలు నేటికి మార్మోగడం అద్భుత విజయంగా వివరించారు. హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం రౌర్కెలా స్టేడియం శరవేగంగా సిద్ధమవుతోందని క్రీడా విభాగం కార్యదర్శి వినీల్‌కృష్ణ తెలిపారు. -
World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో..
టెరసా (స్పెయిన్): అసలైన మ్యాచ్‌ల్లో గెలుపొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు వర్గీకరణ పోటీల్లో వరుస విజయాలు సాధించి ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో ముగించింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో జపాన్‌పై విజయం సాధించింది. ఫార్వర్డ్ ప్లేయర్ నవ్‌నీత్ కౌర్ (30వ, 45వ ని.) రెండు ఫీల్డ్ గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. జట్టులో మరో గోల్‌ను దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా (38వ నిమిషం) సాధించింది. జపాన్ జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను యు అసయ్ 20వ నిమిషంలో చేసింది. జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను యు అసయ్ పొరపాటు చేయకుండా గోల్‌పోస్ట్ లోకి పంపడంతో 1–0తో మ్యాచ్‌లో పైచేయి సాధించింది. భారత శిబిరంలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ మూడో క్వార్టర్లో దీప్ గ్రేస్, నవ్‌నీత్ గోల్స్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్‌లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్‌ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్‌ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్‌జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్‌తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్‌గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్‌కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది. -
ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్
భారీ అంచనాల నడుమ ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆతిధ్య స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా 0-1 తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా కనీసం క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ] Full-time ESP 1-0 IND 📲 - Watch the games LIVE on https://t.co/igjqkvzwmV in 🇨🇦🇰🇷🇨🇳🇯🇵🇿🇦#HWC2022 #HockeyEquals #ESPvIND pic.twitter.com/SrxzXOiU3J — International Hockey Federation (@FIH_Hockey) July 10, 2022 మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా.. మార్తా సేగు గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ విజయంతో స్పెయిన్.. న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లు రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 తేదీల్లో సెమీస్.. 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్ -
కీలకపోరులో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్‌కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్‌తో, చైనాతో మ్యాచ్‌లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. -
Hockey World Cup 2022: భారత్‌ను ఆదుకున్న వందన కటారియా
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. నెదర్లాండ్స్‌లో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. -
Hockey World Cup 2022: చైనాతో భారత్ ఢీ.. ఎప్పుడంటే..?
మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా నేడు పూల్ ‘బి’ లో చైనా జట్టుతో భారత్ ఆడనుంది. గోల్‌కీపర్ సవిత పూనియా నాయకత్వంలోని టీమిండియా చైనాపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకు చైనాతో 21 సార్లు తలపడిన భారత్ 11 సార్లు గెలిచి, ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదిసార్లు చైనా నెగ్గింది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్దం
టెరసా (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 17 రోజుల పాటు అమ్మాయిలు స్టిక్స్‌తో అలరించనున్నారు. స్పెయిన్, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో స్పెయిన్‌తో కెనడా తలపడుతుంది. భారత అమ్మాయిల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ హాట్ ఫేవరెట్ నెదర్లాండ్స్ మరోసారి హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. 2014, 2018లో విజేతగా నిలిచిన డచ్ అమ్మాయిలు 1983, 1986, 1990లలో హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచారు. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యమవని రీతిలో 8 టైటిల్స్‌ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. భారత మహిళలు గత టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచకప్‌లోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 48 ఏళ్ల అమ్మాయిల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ మెరుగైన ప్రదర్శన ‘నాలుగో స్థానం’. మెగా ఈవెంట్ ఆరంభమైన 1974లో కాంస్య పతక పోరులో వెస్ట్ జర్మనీ చేతిలో ఓడింది. ఆ తర్వాత మళ్లీ పతక పోటీలో ఏనాడు నిలువలేకపోయింది. 4 పూల్స్... 16 జట్లు... పూల్–ఎ: నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, చిలీ. పూల్–బి: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా. పూల్–సి: స్పెయిన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, కెనడా. పూల్–డి: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
రెండో విజయంతో క్వార్టర్స్‌లోకి భారత్
పాట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (2వ ని.లో), ముంతాజ్ ఖాన్ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
Hockey Men Junior World Cup: యువ భారత్ జోరు...
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జూనియర్ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను శారదానంద్ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శారదానంద్ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్‌కీపర్ పవన్ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్‌పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్‌పై, ఫ్రాన్స్ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా తో ఫ్రాన్స్; జర్మనీతో భారత్ తలపడతాయి. -
FIH Hockey Junior World Cup: హాకీలో జూనియర్ల సమరం
భువనేశ్వర్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం సాధించడంతో హాకీ ఆటకు కొత్త కళ వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ల బాటలో మరో పెద్ద విజయాన్ని అందుకునేందుకు జూనియర్లు సన్నద్ధమవుతున్నారు. నేటినుంచి జరిగే జూనియర్ ప్రపంచ కప్ హాకీలో భారత జట్టు ఫేవరెట్‌గా దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన మన టీమ్‌తో పాటు మరో 15 జట్లు టోర్నీ బరిలో ఉన్నాయి. 2016 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత్...టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో రెడీ అయింది. గ్రూప్ ‘బి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ తలపడుతుంది. ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత సీనియర్ జట్టులో సభ్యుడిగా ఉన్న వివేక్ సాగర్ ప్రసాద్ టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. గ్రూప్ ‘బి’లో భారత్, ఫ్రాన్స్‌లతో పాటు కెనడా, పోలాండ్ జట్లు ఉన్నాయి. 25న కెనడాతో... 27న పోలాండ్‌తో భారత్∙తన తదుపరి మ్యాచ్‌లను ఆడనుంది. గ్రూప్‌లో టాప్–2గా నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ డిసెంబర్ 5న జరగనుంది. కరోనా వల్ల స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. మూడో టైటిల్‌పై గురి... ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లలో) చాంపియన్‌గా నిలిచిన భారత్ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మ్యాచ్‌లన్నీ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అవకాశం. కోవిడ్–19 దృష్ట్యా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నాయి. అయితే టైటిల్ వేటలో జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ నుంచి మన జట్టుకు పోటీ తప్పకపోవచ్చు. జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను జర్మనీ అత్యధికంగా ఆరు సార్లు గెల్చుకోవడం విశేషం. ఈ టోర్నీ కోసం టీమిండియా గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. వెటరన్ ఆటగాడు కరియప్ప టీమ్‌కు కోచ్‌గా ఉన్నప్పటికీ... సీనియర్ టీమ్ కోచ్ గ్రాహమ్ రీడ్ యువ టీమిండియాపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. సీనియర్ జట్టుతో మ్యాచ్‌లను ఆడిస్తూ యువ భారత్‌ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేశాడు. -
‘దాయాది’ని గెలిచి... ప్రపంచాన్ని జయించి...
హాకీలో మన గతం ఎంతో ఘనం. ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో అయితే భారతే చాంపియన్. ఏ దేశమేగినా... ఎవరెదురైనా... ఎగిరింది మన తిరంగానే. అందుకేనేమో మిగతా జట్లు కసిదీరా ఆడినా పసిడి కోసం మాత్రం కాదు! రజతమో లేదంటే కాంస్యమో వాళ్ల లక్ష్యం అయి ఉండేది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు భారత్‌దే స్వర్ణయుగం. విశ్వక్రీడల్లో ఇంతటి చరిత్ర ఉన్న భారత్‌కు ప్రపంచకప్ మాత్రం అంతగా కలసిరాలేదు. 1975లో ఒకసారి మాత్రమే భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా టీమిండియా మళ్లీ ప్రపంచాన్ని గెలవలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ సంబరాలెన్ని ఉన్నా... ప్రపంచకప్‌లో అంతగా లేవు. ఈ వెలితి తీరేలా... ‘ప్రపంచ’ పుటలకు ఎక్కేలా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి మరీ ‘కప్’ కొట్టింది. మలేసియా ఆతిథ్యమిచ్చిన మూడో మెగా ఈవెంట్ ఫైనల్ కౌలాలంపూర్‌లో జరిగింది. టోర్నీలోని హేమాహేమీ జట్లను ఓడించి భారత్, పాకిస్తాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకిది రెండో ప్రపంచకప్ ఫైనల్. 1971లో స్పెయిన్‌పై ఫైనల్లో నెగ్గి పాక్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సాధించగా... 1973లో నెదర్లాండ్స్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత్ షూటౌట్లో ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం... ప్రపంచకప్ సాధించడం... ఈ రెండింటిని రెండు కళ్లతో చూస్తే మాత్రం ఒత్తిడంతా భారత్‌పైనే! మరి టీమిండియా ఏం చేసింది? ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థుల్ని (పాక్, ఒత్తిడి) ఎలా జయించింది? పోరు హోరెత్తిందిలా... సరిగ్గా 45 ఏళ్ల క్రితం సంగతి. 1975, మార్చి 15న కౌలాలంపూర్‌లోని మెర్డెకా ఫుట్‌బాల్ స్టేడియం (అప్పట్లో ఆస్ట్రోటర్ఫ్‌పై కాకుండా పచ్చిక మైదానంలో హాకీ మ్యాచ్‌లను నిర్వహించేవారు). దాయాదుల ‘ప్రపంచ’ యుద్ధానికి వేదిక. సహజంగా మలేసియాలో హాకీకి క్రేజ్ ఎక్కువ. పైగా ప్రపంచకప్ ఫైనల్! అందుకే ఆ రోజు జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్ల మేనేజర్లు, ప్రేక్షకులే కాదు క్షణాలు, నిమిషాలు కూడా ఎదురుచూస్తున్నాయి... తొలి పైచేయి ఎవరిదని! ఈ ఎదురుచూపుల్లోనే 16 నిమిషాలు గడిచిపోయాయి. ఆ మరు నిమిషమే భారత రణ శిబిరాన్ని నిరాశపరిచింది. బోణీతో దాయాది దరువేసింది. పాక్ స్ట్రయికర్ మహమ్మద్ జాహిద్ షేక్ (17వ నిమిషంలో) సాధించిన గోల్‌తో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత సేనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆట పాక్ ఆధిక్యంతోనే సాగుతూ ఉంది. భారత్ దాడులకు పదును పెట్టినా... ఆ ప్రయత్నాలేవీ ఫలించకుండా 43 నిమిషా ల ఆట ముగిసింది. ఆ తర్వాత నిమిషమే భారత విజయానికి తొలి అడుగు పడేలా చేసింది. డిఫెండర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ సుర్జీత్ సింగ్ (44వ నిమిషంలో) చక్కని ఏకాగ్రతతో గోల్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అశోక్... సుర్జీత్ చేసిన ఒకే ఒక్క గోల్‌తో భారత్ మూడడుగులు ముందుకేసింది. స్కోరు 1–1తో సమమైంది. ఒత్తిడి తగ్గింది. టైటిల్‌పై కన్ను పడింది. సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన సానుకూలత ఫీల్డ్‌లో కనిపించింది. ఒకప్పుడు భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్ స్వర్ణాలను సాకారం చేస్తే... ఈసారి ఆయన తనయుడు అశోక్ కుమార్ (51వ నిమిషంలో) ప్రపంచకప్ టైటిల్‌ను ఖాయం చేసే గోల్ సాధించి పెట్టాడు. కానీ ఈ గోల్‌పై పాక్ వివాదం రేపినా... బంతి నిబంధనల ప్రకారం గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిందని రిఫరీ పాక్ అప్పీల్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆధిక్యం 2–1కు చేరిన ఈ దశలో భారత్ కట్టుదిట్టంగా ఆడింది. రక్షణ పంక్తి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరోధించింది. మిగిలున్న నిమిషాలన్నీ పాక్‌ను ముంచేయగా... భారత్ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ మురిపెమే... ఇప్పటికీ అపురూపం తొలి ప్రపంచకప్ (1971)లో భారత్ కాంస్యంతో పతకాల బోణీ చేసింది. రెండో ఈవెంట్ (1973)లో రజతం గెలిచింది. మూడో ప్రయత్నంలో పసిడి నెగ్గింది. ఇలా వరుసగా మూడు ప్రపంచకప్‌లలో 3, 2, 1 స్థానాలకు ఎగబాకిన భారత్ చిత్రంగా... ఆ తర్వాత ప్ర‘గతి’ మార్చుకుంది. పతకానికి దూరమైంది. 1975 మెగా ఈవెంట్ తర్వాత 11 సార్లు ప్రపంచకప్ టోర్నీలు జరిగినా... ఇందులో మూడుసార్లు (1982, 2010, 2018లలో) ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినా సెమీఫైనల్ చేరలేకపోయింది. -
భారత్‌లో 2021 జూనియర్ హాకీ ప్రపంచకప్
లుసానే: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను మరోసారి నిర్వహించే అవకాశం భారత్‌కు లభించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021 జూనియర్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెడుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్ రెండోసారి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోన్న దేశంగా ఘనతకెక్కింది. 2016లో తొలిసారి లక్నో వేదికగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించిన భారత్ విజేతగా నిలిచింది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా... ఇప్పటికే జర్మనీ, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్‌లు అర్హత సాధించాయి. హోస్ట్ హోదాలో భారత్ కూడా ఈ టోర్నీలో ఆడటం ఖాయమైంది. అయితే ఈ మెగా ఈవెంట్ భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు ఆరంభమవుతుందనే వివరాలను ఎఫ్ఐహెచ్ ప్రకటించాల్సి ఉంది.