huge profits
-
భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
టాటా టెక్ సూపర్ హిట్.. గాంధార్ ఆయిల్ ఘనం
న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది. గాంధార్ సెంచరీ... గాంధార్ ఆయిల్ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది. ఫెడ్ ఫినా.. ప్చ్! ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్‌తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది. -
భారీ లాభాలపై అదానీ గురి..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ భారీ లాభాలపై గురి పెట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల నిర్వహణ లాభాల(ఇబిటా)ను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలుసహా.. సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్‌లను పటిష్ట వృద్ధి బాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. గ్రూప్ నిర్వహణలోగల పోర్టులు, రవాణా, లాజిస్టిక్స్, విద్యుత్ ప్రసారం, సోలార్ ప్యానెళ్లు తదితర విభాగాలను పరుగు తీయించే యోచనలో ఉంది. ఈ బాటలో గ్రూప్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కొత్త పెట్టుబడులు రానున్న కాలంలో నగదును సృష్టించగలదని అంచనా వేస్తోంది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నెల మొదట్లో 2.65 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. తద్వారా ఇన్వెస్టర్లలో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 శాతం వృద్ధి బాటలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇబిటాలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల ఇబిటాకు చేరుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)కి గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల ఇబిటా ఉమ్మడిగా 36 శాతం జంప్‌చేసి రూ. 57,219 కోట్లను తాకింది. గ్రూప్‌లో 83 శాతం వాటా కలిగిన మౌలిక సదుపాయాల కీలక బిజినెస్‌లు వార్షికంగా 23 శాతం పురోగతిని సాధించాయి. ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్‌తోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్కుగల ఇన్ఫ్రా వెంచర్లతో కూడిన విభాగాలు ఉమ్మడిగా రూ. 47,386 కోట్ల ఇబిటాను అందుకున్నాయి. -
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభాల పంట
న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్‌బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్‌ను చేరుకుంటాయని అంచనా. బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్‌బీలను ఆర్బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్‌బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్‌లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి. ఐదేళ్లలో భారీ నష్టాలు పీఎస్‌బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి. సంస్కరణల ఫలితం ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్‌లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్‌బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్‌లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్‌బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్‌బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది. ఇతర చర్యలు మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్‌బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది. గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్‌లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్‌ను సైతం ఆర్బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం గట్టెక్కించింది. టర్న్ అరౌండ్ ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్‌బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్‌లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్‌బీలు వాటాదారులకు డివిడెండ్లను సైతం పంపిణీ చేశాయి. ఎస్బీఐ సహా తొమ్మిది పీఎస్‌బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్‌బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్‌బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్‌కుమార్ మెహతా సైతం చెప్పారు. -
సింగిల్ డేలో...ఒక లక్షను కాస్త రూ. 26 లక్షలు చేసిన మీమ్ కాయిన్..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడైన బిట్‌కాయిన్‌తో సరిసమానంగా ఆయా ఆల్ట్ కాయిన్స్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. డోజీ కాయిన్, షిబా ఇను లాంటి మీమ్ కాయిన్స్ కూడా భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. వీటితో పాటుగా కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ కూడా సింగిల్ డేలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ఒక్కరోజులోనే 26 రెట్లు..! బిట్‌కాయిన్, ఈథెరియం వంటి అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలు గత కొద్ది రోజుల నుంచి నేలచూపులు చూస్తున్నాయి. కాగా ఆల్ట్ కాయిన్స్ మాత్రం భారీ లాభాలను గడిస్తున్నాయి. క్రిప్టోమార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలియన్ షిబా ఇను కాయిన్ ఆదివారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏలియన్ షిబా ఇను లేదా ASHIB కాయిన్ విలువ దాని మునుపటి విలువ కంటే 26 రెట్లు పెరిగింది. అంటే ఒక్క రోజులో ఏలియన్ షిబా ఇనులో శనివారం నాడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఆదివారం మధ్యాహ్నానికి రూ. 26 లక్షలకు పైగా రాబడిని తెచ్చి ఇచ్చింది. షిబా ఇను ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను ఏలియన్ షిబా కాయిన్‌ను కొందరు డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. షిబా ఇను బుల్‌రన్‌ను కోల్పోయిన ఇన్వెస్టర్ల కోసం ఎలియన్ షిబా కాయిన్ అవకాశం కల్పిస్తోందని ఈ కాయిన్ డెవలపర్స్ అన్నారు. అంతేకాకుండా...ది ఏలియన్ ఇన్వేషన్ ఈజ్ఫైనల్ హియర్...! అనే ట్యాగ్‌లైన్ కూడా టాగ్ చేస్తూ ఇటీవల ఐలాండ్ బాయ్స్ పాడిన పాట కొద్ది రోజుల క్రితం సంచలనమైంది. CoinMarketCap డేటా ప్రకారం...Alien Shiba Inu ధర ఆదివారం మధ్యాహ్నం USD 0.009869 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు USD 0.000376 గా ఉంది. కాగా మళ్లీ కొద్ది క్షణాల్లోనే ఏలియన్ షిబా ఇను బుల్ రన్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ కాయిన్ దాదాపు USD 0.0025 వద్ద ట్రేడవుతోంది. చదవండి: మళ్లీ అదే అంధకారమా..! తెరపైకి మరోసారి Y2K సమస్య..! ప్రభావమెంతంటే..? -
న్యూ ఇయర్ బొనాంజా..! జస్ట్ 2 రోజుల్లోనే..సుమారు రూ. 5.36 లక్షల కోట్లను...
కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్లలో బుల్ రక్కేలేస్తూ పరుగులు తీస్తోంది. బుల్ పరుగులతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు. 2022 తొలి రెండు రోజుల్లోనే లక్షల కోట్లను మదుపరులు వెనకేశారు. రెండు రోజుల్లో రూ. 5.36 లక్షల కోట్లు..! ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు కొత్త ఏడాదిలో బుల్ పరుగులపై ఎలాంటి ప్రభావాలు చూపలేదు. సెన్సెక్స్ 2022 మొదటి రోజున ట్రేడింగ్‌లో ఏకంగా 929.40 పాయింట్లు లాభం పొంది 59,183.22 వద్ద స్థిరపడింది. అదే దూకుడు మంగళవారం రోజు కూడా కొనసాగింది. రెండో రోజు కూడా సెన్సెక్స్ 672.71 పాయింట్లు పెరిగి 59,855.93 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 179. 60 పాయింట్లు పెరిగి 17, 805. 30 వద్ద స్ధిర పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్‌లో లిస్ట్ ఐనా కంపెనీల మార్కెట్ విలువ కేవలం రెండు రోజుల్లోనే రూ. 5.36 లక్షల కోట్లు పెరిగి ఆయా ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పొందారు. కాసుల కురిపించిన షేర్లు ఇవే..! కేవలం రెండు రోజుల్లోనే ఆయా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఎన్టీపీసీ, ఒఎన్జీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, టైటాన్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. చదవండి: ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! -
ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..!
స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కాసుల వర్షం కురుపిస్తోంది. గత 12 నెలలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేర్ విలువ ఏకంగా 540 శాతం ఎగబాకి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందజేసింది. సరిగ్గా 12 నెలల క్రితం కంపెనీలో పదివేల పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు రూ . 67000 రాబడిని అందించింది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్. భారత్‌లోనే అతిపెద్ద సంస్థగా..! హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థ నిలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటాలను ఒలెక్ట్రా కల్గి ఉంది. ఈ సంస్థ చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో భారీ ప్లాంట్..! ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు దృష్టిసారించాయి. అయితే వీరు కేవలం టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. హెవీ వెహికిల్స్‌పై ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దృష్టిసారించింది. అందులో భాగంగా 2020 డిసెంబర్లో, హైదరాబాద్ శివార్లలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని ప్రారంభ వ్యయం సుమారు రూ. 600 కోట్లు. 10,000 యూనిట్ల సామర్థ్యంతో 150 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. షేర్ ధర ఎందుకు పెరుగుతోంది..! ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేర్ ధర గత ఏడాది నుంచి కొత్త రికార్డులను నమోదుచేస్తోంది. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో భారత్‌లోని ఆయా రాష్ట్రాలు ప్రజారవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను వాడేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల కోసం భారీ ఆర్డర్స్‌ను ఇచ్చాయి. అంతేకాకుండా దీంతో కంపెనీ షేర్ విలువ గణనీయంగాపెరుగుతోంది. భవిష్యత్తు ఎలా ఉందంటే...? ప్రజారవాణా కోసం పలు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించడంతో కంపెనీ భవిష్యత్తుపై ఎలాంటి ఢోకా లేదని నిపుణులు పేర్కొన్నారు. దాంతో పాటుగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో 6 వేల బస్సుల కోసం కంపెనీ టెండర్లు దాఖలు చేసిందని ఒలెక్ట్రా చైర్మన్ కెవి ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వ రవాణా సంస్థకు మరో 50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి బిడ్‌ను గెలుచుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా రూపొందించాలని ఆయా సంస్థలతో కంపెనీ జత కట్టింది. 2022-23లో వాటి ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనాకు చెందిన బీవైడీ సంస్థ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోవాలని కంపెనీ చూస్తోన్నట్లు సమాచారం. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!
ఇప్పుడిప్పుడే కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ రూపంలో భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని కల్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీకాలను వేసుకున్న వారిని కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణుల హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతుంటే కొంతమందికి ఈ వేరియంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే...! ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్ నడుస్తోంది. సుమారు 6000కుపైగా క్రిప్టోకరెన్సీలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని ఒక క్రిప్టోకరెన్సీయే ఒమిక్రాన్. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ వేరియంట్‌కు డబ్లూహెచ్‌వో ఒమిక్రాన్‌గా నామకారణం చేసింది. ఏ ముహుర్తాన కరోనా వైరస్ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ పేరు పెట్టారో లేదో..! ఒమిక్రాన్ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా 945 శాతం మేర ఎగబాకింది. CoinGecko ప్రకారం నవంబర్ 27న ఒమిక్రాన్ క్రిప్టోకరెన్సీ విలువ 65 డాలర్ల(రూ. 4,883) వద్ద ఉండగా..ప్రస్తుతం దీని విలువ 576.48 డాలర్లకు(43,311) కు చేరింది. ఒకానొక సమయంలో ఒమిక్రాన్ టోకెన్ గరిష్టంగా 689 డాలర్లను తాకింది. ఒమిక్రాన్ క్రిప్టో మార్కెట్ వాల్యూయేషన్ ఏకంగా 400 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రిప్టో టోకెన్‌పై ఇన్వెస్ట్ చేసిన వారికి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనా పేరుతో భారీ నష్టాలు..! ఒమిక్రాన్ వేరియంట్‌తో ఒమిక్రాన్ క్రిప్టో టోకెన్‌కు కాసుల వర్షం కురిపించగా...ఇందుకు విరుద్దంగా కోవిడ్-19 ప్రారంభంలో ప్రముఖ మెక్సికన్ బీర్ బ్రాండ్ కరోనా ఎక్స్ట్రా భారీ నష్టాలను మూటకట్టుకుంది. ఏకంగా రెండునెలల్లో 170 మిలియన్ డాలర్ల నష్టాలను కరోనా ఎక్స్ట్రా బీర్ కంపెనీ చవిచూసింది. A crypto token named after the new COVID-19 variant ‘Omicron’ is up over 650% within the 3 days, and is now worth over $400 million. If this isn’t a sign we’re in a giant bubble, I don’t know what is. pic.twitter.com/7ESD1v9wgF — Mr. Whale (@CryptoWhale) November 28, 2021 చదవండి: చైనా ఎఫెక్ట్! క్రిప్టో మైనర్ల ఒప్పందాలు.. కరెంట్ కోతలతో పక్కదేశాల వైపు చూపు -
షార్ట్ కవరింగ్‌తో నష్టాలకు చెక్..
ముంబై: షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల అండతో సూచీలు శుక్రవారం భారీ లాభాలు అందుకున్నాయి. దీంతో అయిదురోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు మూడున్నర శాతం రాణించడం కూడా సూచీల ర్యాలీకి కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 642 పాయింట్లు లాభపడి 49,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 14,744 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో భారీగా కుదేలైన ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. కేంద్రం ప్రకటించిన కొత్త స్క్రాపేజ్ విధానంతో ఆటో రంగ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఒక్క రియల్టీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కదలాడటం, దేశీయంగా కరోనా కేసుల విజృంభణ లాంటి ప్రతికూలాంశాలతో సూచీలు రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1416 పాయిం ట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 438 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. ఇవే బాండ్ ఈల్డ్స్, కరోనా కేసుల పెరుగుదల కారణాలతోనే ఈ వారంలో సెన్సెక్స్ 934 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌సెషన్ నుంచి షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు.... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో ప్రారం భమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 629 పాయిం ట్లు నష్టపోయి 49,216 వద్ద, నిఫ్టీ 208 పాయింట్లను కోల్పోయి 14,350 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. భారీ నష్టాలను చవిచూస్తున్న సూచీలను మిడ్‌సెషన్ నుంచి జరిగిన షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు ఆదుకున్నాయి. చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం నుంచి 1416 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 438 పాయింట్లు లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ వ్యాపార విభజనపై చర్చించేందుకు బోర్డు ఏప్రిల్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలపడంతో కంపెనీ షేరు 2.5 శాతం లాభపడి రూ.223 వద్ద ముగిసింది. ► రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ముందుకెళ్లందంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం నష్టంతో రూ.56 వద్ద స్థిరపడింది. ► రిలయన్స్ షేరు మూడున్నర శాతం లాభంతో రూ.2078 వద్ద నిలిచింది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఎయిర్‌టెల్‌కు పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో కంపెనీ షేరు ఒకశాతం లాభంతో రూ.532 వద్ద ముగిసింది. -
రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిల్చుకునే రాకేష్ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం ఝన్ ఝన్ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్సిసి షేర్లలో 12.84 శాతం వాటాను ఈ జంట సొంతం. జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్సిసి స్టాక్ ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది. 11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా ఎన్సీసీ షేరు ధర రూ.89.15 గా ఉండటం విశేషం. -
బడ్జెట్ బూస్ట్ : బుల్ దౌడు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా ర్యాలీ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. దీంతో భారత బెంచ్ మార్క్ సూచికలు 2 శాతం ఎగిసాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లుకు పైగా లాభపడింది. చివరికి సెన్సెక్స్ 834 పాయింట్ల లాభంతో 49398 వద్ద, నిఫ్టీ 240 పాయింట్లు ఎగిసి 14521 వద్ద పటిష్టంగా ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ మరోసారి 50వేలకు చేరువలో ఉండగా నిఫ్టీ 14500 ఎగువన ముగియడం విశేషం. ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, పీఎస్‌యు బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ లాభపడ్డాయి. సెన్సెక్స్ లాభాలలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ (ఒక్కొక్కటి 5శాతం లాభం) ఎక్కువగా తోడ్పడ్డాయి. టాటా మెటార్స్, ఐసిఐసిఐ , కోటక్, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్స్ కూడా లాభపడ్డాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, మారుతి, భారతి ఎయిర్టెల్, సిప్లా, గెయిల్, హిందాల్కో లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డిసెంబరు 2020 త్రైమాసికంలో మైండ్ ట్రీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 65.7 శాతం పెరిగి 326.5 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో షేర్లు 4 శాతం పెరిగాయి. అటు ఎంఅండ్ఎం, ఐటీసీ, టెక్ మహీంద్ర స్వల్పంగా నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, రాబోయే బడ్జెట్లో ఆర్థిక సంస్కరణల ఆశలు బుల్లిష్ సెంటిమెంట్‌కు దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆర్బీఐ బూస్ట్, మార్కెట్లు జంప్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, ఆర్బీఐ మీడియా సమావేశం నిర్వహించనుందనే వార్తతో ఆరంభంలోనే వెయ్యి పాయింట్లకు పైగా జంప్ చేశాయి. అన్ని రంగాల షేర్లూ కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. ఒక దశలో నిప్టీ 93 వందల స్థాయిని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 979 పాయింట్లు ఎగిసి 31584 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ఎగిసి 9273 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా మినహా బ్యాంకింగ్, ఐటీ, ఎఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, ఐటీ ఇలా అన్నిరంగాలు దూకుడుగా ఉన్నాయి. ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ ఈ ఉదయం మీడియానుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతుండగా, వేదాంతా, క్యాడిల్లా, టొరంటో ఫార్మ నష్టపోతున్నాయి. -
లాభాల జోరు, 30వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య ఆరంభంలోనే 1300 పాయింట్లు ఎగిసాయి. ఆ తరువాత కొద్దిగా తడబడినా మిడ్ సెషన్ నుంచి వేగం పుంజుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ, ఎఫ్ ఎంసీజీ, ఐటీ, ఆటో రంగాలషేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ ఏకంగా 2476 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 30 వేల ఎగువన స్థిరంగా ముగిసింది. నిఫ్టీ కూడా 708 పాయింట్ల లాభంతో 8792 వద్ద పటిష్టంగా ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 1813 పాయింట్లు ఎగిసింది. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ 22 శాతం , యాక్సిస్ 20 శాతం, హిందాల్కో 17 శాతం, ఎం అండ్ ఎం 14 గ్రాసిం14 , మారుతి 10 లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపీ కూడా 55పైసల లాభంతో ముగియడం విశేషం. -
భారీ లాభాల్లోకి సూచీలు, బ్యాంక్స్ అప్
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు ఉన్నట్టుండి లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 366 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతోంది. ఆరంభంలో నామమాత్రపు లాభాలతో ఉన్నకీలక సూచీలు ఒక దశలో 100 పాయింట్లకు పైగా క్షీణించాయి. కానీ అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్స్‌క్స్355 పాయింట్ల లాభంతో 37901 వద్ద నిఫ్టీ 101 పాయింట్లు ఎగిసి 11227 వద్ద కొనసాగుతున్నాయి.ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లకుభారీ మద్దతునిస్తున్నాయి. బ్యాంక్‌నిఫ్టీ 600 పాయింట్లకుపైగా ఎగిసింది. అటు ఆటో షేర్లు కూడా లాభపడుతున్నాయి. మరోవైపు ఐటీ, ఫార్మా బలహీనంగా ఉన్నాయి. భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎం అండ్ఎం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్‌మహీంద్ర, యాక్సిస్, ఎల్ అండ్ టీ మారుతి సుజుకి, టాటా మోటార్స్, భారీగా లాభపడుతున్నాయి. యస్‌బ్యాంకు, టైటన్, హెచ్‌సీఎల్,టెక్, జీ, ఐటీసీ, హీరో, మోటో, టీసీఎస్,యూపిఎల్,రిలయన్స్‌నష్టపోతున్నాయి. అలాగే బై బ్యాక్ ఆఫర్‌తో ఇండియా బుల్స్ 10 శాతానికి పైగా ఎగిసింది. ప్రస్తుతం 5శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ అయింది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా. -
కొనసాగుతున్న జోష్, 38 వేల ఎగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో సార్వత్రిక ఎన్నికల జోష్ కొనసాగుతోంది. వరుస లాభాలకు నిన్న కొద్దిగా విరామం తాసుకున్న సూచీలు తిరగి శుక్రవారం మరింతగా పుంజుకున్నాయి. భారీ లాభాలతో సెన్సెక్స్ 38వేలకు ఈజీగా అధిగమించింది. మిడ్‌సెషన్ తరువాత మరింత ఎగిసి సెన్సెక్స్450 పాయింట్లు జంప్‌చేసి 38,206కు చేరగా.. నిఫ్టీ 134 పాయింట్లు ఎగసి 11,476 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఐటీ 1.5 శాతం చొప్పున ఎగశాయి. మీడియా 2 శాతం పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, మెటల్ 0.9-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. మీడియా కౌంటర్లలో యుఫో, జీ, సన్ టీవీ, ఈరోస్, డిష్ టీవీ, డెన్, పీవీఆర్, జీ మీడియా 3.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో కొటక్ బ్యాంక్, ఐవోసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, విప్రో, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ 4.5-1.5 శాతం మధ్య లాభపడుతుండగా, ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, యస్‌బ్యాంక్, అల్ట్రాటెక్, కోల్ ఇండియా, హిందాల్కో, వేదాంతా, ఇన్ఫ్రాటెల్, ఐటీసీ నష్టపోతున్నాయి. -
మార్కెట్లకు ‘శక్తి’ బూస్ట్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు వారాంతంలో చాలా హుషారుగా ముగిసాయి. ఆరంభంనుంచి హవా చాటుకున్న కీలక సూచీలు చివరకంటూ అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు ఎగిసి 35,779 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు లాభపడి 10,737వద్ద బలంగా స్థిరపడ్డాయి. రెండు రోజుల్లో 800పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో 5 వారాల్లో ఒక రోజులో అతిపెద్ద లాభాలుగా నిలిచాయి. నిఫ్టీ బ్యాంకు 480 పాయింట్లు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా ఆర్బీఐకు కొత్త గవర్నర్ ఎంపిక లాంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహిమిచ్చినట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా పుంజుకున్నాయి. ఇంకా ఐబీ హౌసింగ్, ఎయిర్టెల్, హీరోమోటో 7 శాతం చొప్పున జంప్‌చేయగా.. అదానీ పోర్ట్స్, యూపీఎల్, యస్ బ్యాంక్, ఐషర్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ 5.5-3.7 శాతం మధ్య పురోగమించాయి. మరోవైపు డా. రెడ్డీస్, భారతి ఇన్ ఫ్రాటెల్, హెచ్‌పీసెల్, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
స్టాక్‌మార్కెట్లు దూకుడు: 400 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై : ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో దలాల్‌స్ట్రీట్‌లో లాభాల పంటపడుతోంది. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ లాభాలతో 36వేల పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ ఒక దశలో 400పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 393 పాయింట్లు జంప్‌చేసి 36,109వద్ద, నిఫ్టీ సైతం 109 పాయింట్లు ఎగసి 10,837 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాభాలు సూచీల్లో జోష్ నింపుతున్నాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ దూకుడు మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.3 శాతం చొప్పున ఎగశాయి. అయితే ఐటీ 0.3 శాతం నీరసించగా ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా రంగాలు 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. జీ,హిందాల్కో, వేదాంతా, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ 3.6-2 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్ బ్యాంక్ మరోసారి 8 శాతం పతనమై.. అదే రేంజ్లో మళ్లీ పుంజుకుని 1 శాతం నష్టానికి పరిమితమైంది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, ఎన్టీపీసీ, టీసీఎస్ 2.2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. రూపాయి బలం అటు రూపాయి కూడా డాలరు మారకంలో 73 పైసలు ఎగిసి 70 స్థాయినుంచి 69.89 స్థాయికి పుంజుకోవడం విశేషం. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
-
మార్కెట్ల హై జంప్: అయిదు కారణాలు
సాక్షి, ముంబై: భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో కీలక సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ మరింత జోరందుకుంది. 605 పాయింట్లు దూసుకెళ్లి 35,037ను తాకింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు జంప్‌చేసి 10,568వద్ద కొనసాగుతోంది. ర్యాలీకి మద్దతునిస్తున్న అయిదు అంశాలు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, జీఎస్టీ వసూళ్లు, పుంజుకున్న రూపాయి విలువ, అంతర్జాతీయంగా దిగి వస్తున్న క్రూడ్ ధరలు , బాండ్‌మార్కెట్ తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు చెప్పారు. అమెరికా చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్‌వార్ ముగింపు దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా వ్యాఖ్యలు, దీంతోపాటు ఈ నెలాఖరున అర్జెంటీనాలో జరగనున్న జీ20 దేశాల సదస్సులో చైనీస్ ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యే యోచనలో ఉన్నట్లు ట్రంప్ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాల్లోనూ లాభాలే. ఆటో, మెటల్, కొన్ని బ్యాంకింగ్ రంగ షేర్లు ఎఫ్ఎంసీజీ షేర్ల లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. బీపీసీఎల్, వేదాంతా, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, హీరోమోటో, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, యస్‌బ్యాంక్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్ భారీగా లాభపడుతున్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా నష్టపోతున్నాయి. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు : భారీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంలోనే భారీ లాభాలను సాధించిన కీలక సూచీలు కొనుగోళ్ల జోష్‌తో మరింత లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 34, 859 వద్ద,నిఫ్టీ 133 పాయింట్లు ఎగిసి 10, 13 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ 10500 స్థాయిని అధిగమించింది. దీంతో దేశీయంగా దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా సెక్టార్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, యస్‌బ్యాంక్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, ఇండస్ఇండ్, ఐషర్, ఎంఅండ్ఎం, ఐవోసీ, టాటా మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్‌గా ప్రారంభమైంది. డాలరుమారకంలో నిన్నటి ముగింపు 73.45 తో పోలిస్తే. 73.10 వద్ద బలంగా ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు దిగి రావడం, ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్ ముగింపు సంకేతాలతో ఇన్వెస్టర్లలో జోష్ వచ్చింది. అటు వరుసగా మూడో రోజు అమెరికా మార్కెట్లు హైజంప్ చేశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లోనూ ఇదే ధోరణి నెలకొంది. -
మార్కెట్లు హై జంప్: 500పాయింట్ల ర్యాలీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి తెప్పరిల్లాయి. భారీ పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హై జంప్ చేశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ వసెంచరీ చేసింది. ప్రస్తుతం 578 పాయింట్లు జంప్‌చేసి 34,579కు చేరింది. నిఫ్టీ సైతం 183పాయింట్లు పురోగమించి 10,417వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీతప్ప అన్ని రంగాలూ కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, యస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐషర్, ఐవోసీ, అదానీ పోర్ట్స్, వేదాంతా 6-3 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.మరోవైపు నిన్నమార్కెట్ ముగిసిన అనంతరం ఫలితాలు ప్రకటించిన టీసీఎస్తోపాటు హెచ్‌సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో పుంజుకుంది. 74 స్థాయినుంచి పుంజుకుని 73.75 వద్ద కొనసాగుతోంది. -
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : మందుల విక్రయాలపై ప్రయివేటు ఆస్పత్రులు ప్రజలను లూటీ చేస్తున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సేకరించిన బిల్లులను విశ్లేషించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) విస్తుపోయింది. ఈ ఆస్పత్రులు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై ఏకంగా 1737 శాతం లాభాలు దండుకున్నట్టు ఈ పరిశీలనలో వెల్లడైంది. రోగుల బిల్లుల్లో ఇవి 46 శాతం వరకూ ఉంటాయి. ఆయా మందులు, వైద్య పరికరాల తయారీదారుల కన్నా గరిష్ట ఎంఆర్పీలతో ఈ ఆస్పత్రులే భారీగా లాభపడుతున్నాయని ఎన్పీపీఏ పేర్కొంది. ఈ మందులు, పరికరాలు, డిస్పోజబుల్స్‌ను ఆయా ఆస్పత్రులు తమ ఫార్మసీల్లోనే కొనుగోలు చేయాలని రోగులను కోరుతుండటంతో అధిక ధర వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. పెద్ద మొత్తంలో మందులను ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేస్తుండటంతో తక్కువ ధరకే అవి అందుబాటులోకి వస్తాయని, అయినప్పటికీ ఆయా ఆస్పత్రులు ఎంఆర్పీలను విపరీతంగా పెంచి విక్రయిస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయని ఎన్పీపీఏ నిగ్గుతేల్చింది. కంపెనీల నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లను ఇచ్చే క్రమంలో ఆయా ఆస్పత్రులు డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలను మందుల లేబుల్స్‌పై అధిక ఎంఆర్పీ ముద్రించాలని కోరుతున్నాయని పేర్కొంది. దీంతో రోగులు భారీ మొత్తాలను మందుల కోసం వెచ్చించాల్సి వస్తోందని ఎన్పీపీఏ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ర్ట ప్రభుత్వాలే వీటిపై చర్యలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఒకపుడు ఉద్యోగం లేదు...మరిపుడు..
చెన్నై ఒకప్పుడు ఉద్యోగంకోసం వెదుకులాడిన వ్యక్తి దశాబ్దం తరువాత కోట్ల రూపాయల సంస్థకు అధిపతి అయ్యాడు. నమ్మలేక పోతున్నారా.. ఇదినిజం. చెన్నైకి చెందిన మైక్రో ఫినాన్స్ వ్యాపార వేత్త పీఎన్ వాసుదేవన్(53) ఈ ఘనత సాధించారు. అయితే ఆయన విజయ ప్రస్థానం అంత అషామాషీగా సాగలేదు. అనుకోకుండా వ్యాపారంలోకి ప్రవేశించినా.. నిబద్ధతతో, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రస్తుతం ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించిన వాసుదేవన్ అటు ఉద్యోగులకు, ఇటు రుణగ్రహీతలకు అభిమానపాత్రుడిగా నిలిచారు. చెన్నైకి చెందిన వాసుదేవన్ మామూలు మధ్య తరగతి మనిషిలా చోళమండలం ఫినాన్స్ సంస్థలో ఉద్యోగంలో చేరారు . వ్యాపారం నిమిత్తం ముంబై కి తరచూ ప్రయాణిస్తున్న క్రమంలో ముంబైలోని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ కి షిప్ట్ అయ్యారు. అయితే అక్కడి కాలుష్యం కారణంగా అతని కుమార్తె అనారోగ్యం బారిన పడింది. వైద్యుల హెచ్చరికలతో అతను మళ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైకి మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా... సొంతంగా కంపెనీ పెట్టాలని ప్రతిపాదన వచ్చినా చేతిలో అంత పెట్టుబడి లేకపోవడంతో కొంచెం తటపటాయించాడు. చివరికి చోళమండలం సంస్థ పెద్దలు, ఇంకా కొంతమంది స్నేహితుల సహకారంతో 2007 లో ఈక్విటాస్ హోల్డింగ్స్ అనే కంపెనీ స్థాపించాడు. అంతే ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అలా ఈ ఏప్రిల్ 5న స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయిన ఈక్విటాస్ హోల్డింగ్స్ లిమిటెడ్ దూసుకుపోతోంది. ప్రతి షేర్ ముఖ విలువ రూ.10, బాండు ధర రూ.10- నుంచి రూ.110గా పబ్లిక్ ఇష్యూకు జారీ చేసిన కంపెనీ అధిపతి పి.ఎన్.వాసుదేవన్ భారీ లాభాలను ఆర్జించారు. 120 కోట్లతో లిస్టైన కంపెనీ ఇపుడు రూ 4,600 కోట్ల వ్యాపారాన్ని సాగిస్తోంది. మరోవైపు బిలియన్ డాలర్ల కంపెనీలన్నీ తమ లాభాల్లో రెండు శాతాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుండగా.. చాలా యేళ్ల ముందునుంచే వాసుదేవన్ 5 శాతం లాభాలను దీని కోసం పక్కన పెడుతున్నారు. ఎందుకంటే తమ ఖాతాదారులకు స్కూల్స్, ఆసుపత్రిలాంటి కనీస సౌకర్యాలు లేవని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు తమ వ్యాపారానికి విరాళాలకు కూడా ఆయన అంగీకరంచరు. మీరు సేవ చేయాలంటే..స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయమని సలహా ఇస్తారు. తాము అందించిన సేవలకు ప్రతిఫలంగా ప్రజలు తమను ఇష్టపడటం ప్రారంభించారని వాసుదేవన్ చెప్పారు. ఎస్ కెఎస్ మైక్రోఫైనాన్స్ సంస్థ సునామిలో కూడా తమ సంస్థ గట్టిగా నిలబడి పాఠాలు నేర్చుకున్నామన్నారు. రుణగ్రహీతలు నేలపై కూర్చుని ఉన్నప్పుడు తాము కుర్చీలో కూర్చోకుండా.. వారికి స్థాయికి దిగి రుణాలను అందచేయడమే తమ విజయ రహస్యమన్నారు. తన జీతంలో కోత పెట్టాల్సిందిగా బోర్డు మీటింగ్ లో ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ఈ విషయంలో ప్రపంచంలోఎక్కడైనా ఒక కంపెనీ లోని అతి తక్కువ వేతనం కంటే 40 రెట్లకు మించి టాప్ అధికార్ల జీతం ఉండకూడదన్న ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ సూత్రం తనకు ప్రేరణ అని, దాన్ని తాను ఫాలో అయ్యానని పేర్కొన్నారు. వాసుదేవన్ ఏం చేసినాపారదర్శకంగా చేస్తారని.. అతని మూలాలను మర్చిపోలేదని కంపెనీ స్థాపనలో సహకరించిన స్పార్క్ క్యాపిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె. రామకృష్ణన్ ప్రశంసించారు. కాగా ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు ఆర్ బీ ఐ నుంచి చిన్న ఆర్థిక బ్యాంకు (ఎస్ఎఫ్బీ) లైసెన్స్ లభించిన సంగతి తెలిసిందే. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా లాభాలతో ప్రారంభం అయ్యాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు రూపాయి బలపడడం కూడా తోడవడంతో ఆరంభంలోనే ట్రేడింగ్ అదిరింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 24,463.41 పాయింట్లు దాటగా, నిఫ్టీ 7,427.10 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇక రూపాయి కూడా ప్రారంభంలోనే పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.67.54గా ఉంది.