Human Rights Commission
-
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
మానవ హక్కులకు దిక్కేది?
మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్, సభ్యులు పదవీ విరమణ పొందిన 3 నెలల్లోగా మళ్లీ కొత్త కమిషన్ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు చెబుతోంది. కానీ రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. కొత్త కమిషన్‌ను నియమించాలని రెండేళ్లుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుగుతున్నా, ఇంతవరకు నియామకం చేపట్టలేదు. రేపు, ఎల్లుండి అంటూ కాలయాపనతోనే ప్రభుత్వం నెట్టుకొస్తోంది. రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు కాపాడే కమిషన్ నియామకంలో అలసత్వం సరికాదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. కొత్త కమిషన్ నియామక ప్రక్రియ కొనసాగుతోందని, రెండు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. –సాక్షి, హైదరాబాద్ చైర్మన్, సభ్యుల ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారంటే.. చైర్పర్సన్: ముఖ్యమంత్రి సభ్యులు: శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, హోంమంత్రి, రెండు సభల ప్రతిపక్ష నేతలు అర్హతలు చైర్మన్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జిగా పనిచేసినవారు అర్హులు. జ్యుడీషియల్ సభ్యుడు: హైకోర్టులో జడ్జిగా లేదా జిల్లాజడ్జిగా ఏడేళ్లు పనిచేసి ఉండాలి. నాన్–జ్యుడీషియల్ సభ్యుడు: మానవ హక్కులపై విశేష అనుభవం, పరిజ్ఞానం ఉండాలి. కాలపరిమితి: చైర్మన్, సభ్యుల కాలపరిమితి మూడేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అదే వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేస్తే గవర్నర్‌కు అందజేయాలి. వీరిని తొలగించే అధికారం కూడా గవర్నర్‌కే ఉంటుంది. చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రజల హక్కులను గౌరవించాలి 1993 మానవహక్కుల చట్టం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర కమిషన్ ఉండాలనేది రాష్ట్ర ప్రజల చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కు. దీనిని గౌరవించి ప్రజల హక్కులకు కొంతైనా గ్యారంటీ ఇవ్వగలిగే కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం వెంటనే పూర్తి చేయాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది హెచ్ఆర్సీ ఏర్పాటు ఇలా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటైంది. చైర్మన్, జ్యుడీషియల్, నాన్–జ్యుడిషీయల్ సభ్యులిద్దరూ ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కమిషన్ ఏర్పాటు చేస్తూ 2019, నవంబర్‌లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తెలంగాణ కమిషన్ తొలి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య, సభ్యులుగా ఆనందరావు నడిపల్లి(జ్యుడీషియల్), ఇర్ఫాన్ మొహినుద్దీన్(నాన్ జ్యుడీషియల్)ను ప్రభుత్వం నియమించింది. 2022తో వీరు పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. దీంతో గత రెండేళ్లలో ఒక్క కేసు కూడా విచారణకు నోచుకోలేదు. విధులు » మానవ హక్కులతోపాటు రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధానవిధి. » పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు లేదా వారి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు. » రాష్ట్రంలోని ఏ అంశంలోనైనా హక్కులపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు. » కమిషన్ విచారణ జరిపాక, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. నష్టపరిహారం, ఇతర చర్యలపై సూచనలు కూడా చేయవచ్చు. కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. ముఖ్యమైన వివరాలు.. » కోర్టులతో పోలిస్తే కేసుల పరిష్కారం వేగవంతంగా ఉంటుంది. బాధితులకయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. » చాలా దేశాల్లో హక్కుల కమిషన్లు అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి. » రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి కంటే తక్కువ లేని అధికారిని రాష్ట్ర కమిషన్ కార్యదర్శిగా నియమిస్తారు. » ఫిర్యాదుదారు, బాధితులు, ఘటన వివరాలు, పరిహారం తదితర వివరాలతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. బాధితులే కాదు.. వారి తరఫున ఇతరులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. » సెక్షన్ 30 ప్రకారం జిల్లా కోర్టులోని రెండవ అదనపు జిల్లాజడ్జి హెచ్ఆర్సీ కేసులు విచారించాలి. ప్రత్యేకంగా పీపీ కూడా ఉండాలి. అయితే, ఈ కేసులను ఏ చట్టం ప్రకారం విచారణ చేయాలనేదానిపై స్పష్టత లేదు. ఇలా సంప్రదించవచ్చు ఫోన్ నంబర్: 040–24601572అడ్రస్: బ్లాక్–7, గృహకల్ప కాంప్లెక్స్, ఎంజే రోడ్, గాం«దీభవన్, నాంపల్లి, హైదరాబాద్ -
చినబాబు బ్యాచ్ చిత్రహింసలు!
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా. -
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
ప్రీతి మృతి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్ఆర్సీ) ఆశ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్‌ఆరీసీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది. మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు అనస్థీషియా హెచ్ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్నీటి వీడ్కోలు కాగా సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఖమ్మం జైలులో సైఫ్.. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. అసమానతలు బాధాకరం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు. చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్స్పెక్టర జనరల్ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
భార్య నుంచి కాపాడాలని మొర
సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. (చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?) -
పవన్ కల్యాణ్‌పై మానవహక్కుల కమిషన్‌లో కేసు
గుంతకల్లు రూరల్: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో వివరాలు వెల్లడించారు. విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ స్పందించి తమ ఫిర్యాదును విచారణకు స్వీకరించిందని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఇప్పుడు కర్నూలులోనే...
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాన్ని తెలంగాణ నుంచి కర్నూలు నగరానికి మార్చారు. ఏడాది క్రితం ఏపీ మానవహక్కుల కమిషన్, లోకాయుక్తలను ఏర్పాటు చేశారు. మానవహక్కుల కమిషన్ ప్రారంభం నుంచీ కర్నూలులో కార్యకలాపాలు చేపట్టింది. అయితే లోకాయుక్తను మాత్రం భవనం, ఇతర సౌకర్యాల కొరత వల్ల... ఏడాదిపాటు తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలోనే కొనసాగించి... చివరికి మార్చి 18న కర్నూలుకు మార్చారు. లోకాయుక్త చట్టం ప్రకారం... ప్రభుత్వంలోని కిందిస్థాయి అటెండర్ నుంచి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ అన్ని స్థాయిల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాగే... గ్రామస్థాయి ఎంపీటీసీలు, సర్పంచ్ల నుంచి ఇతర మండలస్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రజాప్రతి నిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమాల వరకూ ఆధారాలతో లోకాయుక్తలో పిటిషన్లు వేయ వచ్చు. అయితే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేయడానికి లోకాయుక్త చట్టం ఒప్పుకోదు. ఇది రాష్ట్ర స్థాయి చట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985–1986ల మధ్య మొదటి సారి లోకాయుక్తను ఏర్పాటు చేశారు. ఆనాటి లోకాయుక్త చట్టమే నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. లోకాయుక్త కార్యాలయంలో లభించే సంబంధిత ఫార్మాట్లో వివరాలు భర్తీ చేసి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు జతచేసి, విజ్ఞాపన పత్రాన్ని కూడా చేర్చి కేవలం రూ. 150 ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి. ఈ అప్లికేషన్‌ను ఒక అడ్వకేట్‌తో సర్టిఫై చేయించాలి. లోకాయుక్తకు ఛైర్మన్‌గా పదవీ విరమణ పొందిన హైకోర్ట్ జడ్జీలను నియమిస్తున్నారు. రిజిస్ట్రార్లుగా జిల్లా జడ్జీలు పనిచేస్తు న్నారు. సివిల్, క్రిమినల్ కోర్టులకున్న అధికారాలన్నీ లోకాయుక్తకు ఉన్నాయి. లోకాయుక్తకు పిటీషన్లు పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. ప్రస్తుత లోకాయుక్త చిరునామా: ఏపీ లోకాయుక్త, 96/3/721241, సంతోష్ నగర్, మెయిన్‌రోడ్, మహేంద్ర షోరూమ్ పక్కన, కర్నూలు–518006. – కె. ధనలక్ష్మి, సెక్రెటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ -
ఇల్లులాంటిదే ఆస్పత్రి
మంచిర్యాల టౌన్: మన ఇల్లు లాంటిదే ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చిన వారు ఆరోగ్యంతో వెళ్లాలి తప్ప.. అశ్రద్ధతో కొత్తగా వ్యాధులను తెచ్చుకోవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య హితవు పలికారు. శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూ వార్డును ఆనుకుని ఉన్న బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నీరు సక్రమంగా రావడం లేదని ఓ రోగి సహాయకుడు ఫిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్ వెంటనే వెళ్లి పరిశీలించారు. బాత్రూంల బయట నీరు నిలిచి ఉండటాన్ని గమనించారు. దీంతో పక్కనే ఉన్న స్వైపర్తో ఫ్లోర్‌పై నిలిచిన నీరు మొత్తాన్ని స్వయంగా తొలగించారు. కొన్ని పనులను స్వయంగా చేసుకోవాలని రోగి సహాయకులకు సూచించారు. ఒక్కొక్క రోగికి సహాయంగా ముగ్గురు, నలుగురు రావడం వల్ల నీరు, పరిశుభ్రత సమస్యలు ఏర్పడతాయని వివరించారు. -
తూ.గో. ఎస్పీకి హెచ్ఆర్సీ నోటీసులు
కర్నూలు(సెంట్రల్): తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్(20) అనే యువకుడి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. అడిషనల్ జిల్లా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తూర్పు గోదావరి ఎస్పీ, రామచంద్రాపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్), మండపేట స్టేషన్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్ 11వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ సీఐ దుర్గప్రసాద్ కాళీకృష్ణ భగవాన్ను స్టేషన్‌కు పిలిచి మర్మావయం దగ్గర గాయపడేలా కొట్టారని, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహకుమార్ తెలిపారు. -
తల్లిదండ్రుల రక్షణ బాధ్యత బిడ్డలదే
కర్నూలు (సెంట్రల్)/ఆళ్లగడ్డ: సంతానం ఉండి కూడా తల్లిని అనాథగా వదిలేయడం సరైన విధానం కాదని, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని దేవరాయపురం కాలనీకి చెందిన పి.ఓలమ్మ (75) ను కుమార్తెలు, కుమారులు అనాథగా వదిలేయడంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై హెచ్ఆర్సీ స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓలమ్మ భర్త 25 ఏళ్ల క్రితమే చనిపోయినా పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల ఆమె పక్షవాతానికి గురి కావడంతో కుమారులు, కోడళ్లు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. దీంతో తన బిడ్డలకు ఇచ్చిన మూడెకరాలను తిరిగి ఇప్పించాలని పెద్దలను కోరినా..వారెవరూ వినిపించుకోలేదు. దీంతో రోడ్డున పడిన ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సాక్షి వార్తపై హెచ్ఆర్సీ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యూడిషియల్, నాన్ జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావులు స్పందించారు. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం ఓలమ్మకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, ఆళ్లగడ్డ తహసీల్దార్, ఓలమ్మ సంతానానికి నోటీసులిస్తూ కేసు డిసెంబర్ 13కి వాయిదా వేశారు. కాగా, హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. ఓలమ్మ ఉంటున్న ప్రదేశానికి చేరుకుని విచారించారు. తక్షణం ఆశ్రయం కల్పించేందుకు ఆమెను ఆళ్లగడ్డలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రానికి తరలించారు. -
హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తాం
కర్నూలు (సెంట్రల్): మానవ హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని, తప్పుచేస్తే శిక్ష తప్పదని ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి స్పష్టంచేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే ఎంతటి వారైనా అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సామాన్యుడి హక్కులను హరిస్తే వారి తరఫున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగుతుందని చెప్పారు. ఎక్కువగా పోలీసుస్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వివరించారు. కర్నూలులో కమిషన్ కార్యాలయం ప్రారంభమై నెలరోజులవుతోందని, ఇప్పుడిప్పుడే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయని ఆయన చెప్పారు. కమిషన్ సేవలను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే వెబ్సైట్, ఈ–మెయిల్, వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జస్టిస్ సీతారామమూర్తి చెప్పారు. కమిషన్ సేవలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు నెలల్లో 135 సమస్యలు.. 72 కేసులు 2021 మార్చి 23 నుంచి ఇప్పటివరకు మొత్తం 135 సమస్యలు వచ్చాయి. అందులో 72 అర్జీలపై హెచ్ఆర్సీ కేసులు నమోదు చేశాం. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల వారు నేరుగా ఫిర్యాదులు అందిస్తున్నారు. భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్లు, వీఆర్వోలపైనే ఎక్కువగా ఫిర్యాదులు ఉంటున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపై కూడా కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులను పోస్టు, కొరియర్, ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా ఏపీ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, 1, 2, 4 గదులు, ధర్మపేట, కర్నూలు–518004 చిరునామాకు పంపొచ్చు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయాల్సిందే ఎలాంటి సందర్భంలోనైనా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే సెక్షన్–173 ప్రకారం కేసు నమోదు చేయాలి. చేయకపోతే పోలీసులే బాధ్యులవుతారు. తరువాత సెక్షన్–153 ప్రకారం ఆ కేసులో మెరిట్స్ లేకపోతే అదే విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలపాలి. అంతేకానీ.. కేసు నమోదు చేయకుండా ఉండకూడదు. అలా చేస్తే మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. అలాగే, కమిషన్ రూపొందించుకున్న 14 అంశాలు ఫిర్యాదులో కచ్చితంగా ఉండాలి. లేదంటే ఆ ఫిర్యాదు డిస్మిస్ అవుతుంది. అవి.. ► ఫిర్యాదులో వాది, ప్రతివాది అడ్రస్సులు పిన్‌కోడ్‌తో సహా ఉండాలి. వీలైతే ఫోన్ నంబర్లనూ రాయాలి. ► ఫిర్యాదుదారుడు కచ్చితంగా అర్జీలో సంతకం చేయాలి. ► ఏడాదిలోపే ఆ అంశంపై ఫిర్యాదు చేయాలి. అదే సమయంలో ఆ ఫిర్యాదు అంశంపై ఏ కోర్టుల్లో కేసులు ఉండడం కానీ, నడుస్తుండడం కానీ జరగరాదు. ► ఏ రాష్ట్రానికి సంబంధించి ఫిర్యాదు అదే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. ► ఏదైనా సంఘటనను ప్రోత్సహించిన అధికారి, అమలుచేసిన అధికారులు ఉంటే వారి పేర్లను నేరుగా చేరిస్తే వారిని విచారణకు పిలవడానికి వీలుంటుంది. ► ఆఫీసర్‌పై వ్యక్తిగత ఫిర్యాదు చేస్తే వారి ఇంటి అడ్రస్సు.. వృత్తిపరంగా చేస్తే హోదా, కార్యాలయం, ఇతర వివరాలు ఇవ్వాలి. ► ఫిర్యాదు కాపీలు నాలుగు ఉండాలి. ఒకే సమస్యపై ఐదారుగురు ఫిర్యాదు చేయదలుచుకుంటే మొదటి వ్యక్తి పేరుతో ఫిర్యాదు చేయాలి. -
విద్యార్థినికి సీటు నిరాకరణపై హెచ్ఆర్సీ సీరియస్
కర్నూలు (సెంట్రల్): కరోనా నేపథ్యంలో ఏడాదిపాటు చదువుకు దూరమైన విద్యార్థినిని ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి నిరాకరించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. దీనిపై కంబాలపాడు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు ఇంటర్ బోర్డు కమిషనర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కర్నూలు జిల్లా సి.బెళగళ్ మండలం పోలకల్‌కు చెందిన ఎం.శ్రావణి 2020లో పదో తరగతి పాసైంది. అదే ఏడాది కరోనా విజృంభిస్తుండటంతో ఆమె కాలేజీలో చేరలేదు. ఈ సంవత్సరం కర్నూలు జిల్లా కంబాలపాడు గురుకుల కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె మార్కుల ఆధారంగా బైపీసీలో సీటు వచ్చింది. అయితే గతేడాది ఆమె ఇంటర్లో చేరకపోవడంతో వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదంటూ ఆమెకు సీటును నిరాకరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆమెకు సీటు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు ఇంటర్ బోర్డు కమిషనర్, బోర్డు రీజినల్ డైరెక్టర్లకు నోటీసులు పంపింది. నెల రోజుల్లో ఏమి చర్యలు తీసుకున్నది వివరించాల్సిందిగా కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు ఎం.శ్రీనివాసరావులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. -
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. -
నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఏపీ హైకోర్టు
అమరావతి: కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. క్యాబినెట్ మంత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని.. పార్టీలుగా చేసి అందరికీ నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాగా పిటిషనర్ వాదనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. చదవండి: కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం క్యాబినెట్ మంత్రులకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి వింటామన్న హైకోర్టు.. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు అనుగుణంగానే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ -
కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్
సాక్షి, విజయవాడ: కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్ఆర్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్‌ని మానవ హక్కుల కమిషన్‌కి హెడ్ క్వార్టర్‌గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది. చదవండి: (ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’) -
ఏపీ హెచ్ఆర్సీ హైదరాబాద్‌లో ఎందుకుంది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్ఆర్సీ) రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఉందని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలంది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గడువు కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
సాక్షి ఎఫెక్ట్: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం
సత్తెనపల్లి: అన్నీ ఉన్నా అనాథగా మారిన సత్తెనపల్లి వాసి గోపవరపు సత్యనారాయణ దుస్థితిపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించి అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని నాన్ జ్యుడీయల్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ఆ పెద్దాయన సంతానంతో మాట్లాడాలని గుంటూరు ఆర్డీవో ఎస్.భాస్కర్‌రెడ్డిని ఆదేశించారు. తనకు ఎక్కడ ఇష్టముంటే అక్కడ చేర్చాలని పేర్కొన్నారు. సత్యనారాయణకు కల్పించిన సౌకర్యాలపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. మేమున్నామంటూ.. గుంటూరు, నరసరావుపేటకు చెందిన అనాథాశ్రమ నిర్వాహకులు సత్యనారాయణను తాము చేర్చుకుంటామంటూ ముందుకొచ్చారు. చివరి మజిలీ వేళ తాము అండగా ఉంటామని, ఆయనకు ఊతకర్రగా మారుతామని హామీ ఇచ్చారు. కరోనా చీకట్లు అలుముకున్న వేళ మానవత్వపు దీపాన్ని వెలిగించి ఆ వృద్ధుడి మోములో బోసి నవ్వులు చూస్తామని ప్రకటించారు. చదవండి: సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. -
పెద్దపల్లి: వివాహితపై సామూహిక అత్యాచారం?
సాక్షి, పెద్దపల్లి: ఇటుక బట్టీలో పనిచేసే ఓ వివాహితపై యజమానులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) లేఖ రాయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖ ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు.. అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్ఆర్సీ.. విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించింది. వీరంతా ఇటుక బట్టీల వద్ద కూలీలతో మాట్లాడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్న తెలిపారు. బాధితులను దాచారా? అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. దీంతో యజమానులే వారిని దాచిపెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు యజమానులు సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అత్యాచారం, కూలీల నిర్బంధంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. కాగా, గతంలో సైతం ఇదే ఇటుక బట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టిందని పలువురు కూలీలు గుర్తు చేస్తున్నారు. -
‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’
ప్యోంగ్యాంగ్: నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన గురించి ప్రపంచం అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. కఠినమైన ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న అక్కడి ప్రజల గురించి తల్చుకుంటే.. భయం వేస్తోంది. ఇక అక్కడి డిటెన్షన్ సెంటర్ల గురించి.. వాటిలో మగ్గుతున్న ఖైదీలు.. ప్రత్యేకించి మహిళల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ ‘ఐ స్టిల్ ఫీల్ ది పెయిన్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. డిటెన్షన్ కేంద్రాల్లో మహిళలు అనుభవించిన నరకం గురించి ఈ నివేదిక ప్రపంచానికి వెల్లడించింది. 2009 నుంచి 2019 వరకు దాదాపు 100 మంది మహిళలను ఈ డిటెన్షన్ కేంద్రాల్లో బంధించినట్లు నివేదిక తెలిపింది. వీరంతా ఉత్తర కొరియా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ మహిళలు. విడుదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి పరిశోధకులు వీరిని సియోల్‌లో అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశారు. (నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!) దీనిలో బాధితులు నిర్భంద కేంద్రాల్లో తాము స్వచ్ఛమైన గాలి, నిద్ర, పగటి పూట ఎండ, మంచి ఆహారానికి కూడా నోచుకోలేదని వెల్లడించారు. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం నిద్రాహారాలు మాని పని చేస్తూనే ఉన్నామన్నారు. వీరంతా అధికారుల చేతుల్లో తీవ్ర హింసలకు గురి కావడమే కాక అత్యాచారానికి కూడా గురయ్యారని నివేదిక తెలిపింది. పోలీసు అధికారులు తమను అంగట్లో ఆటబొమ్మల మాదిరి చూసేవారని బాధితులు వెల్లడించారు. హింస, దురాక్రమణ, అత్యాచారం, బలవంతపు గర్భస్రావం వంటి దారుణాలు ఈ కేంద్రాల్లో నిత్యకృత్యమని బాధితులు వెల్లడించారు. ఓ మహిళ యూఎన్ అధికారులతో మాట్లాడుతూ.. ‘డిటెన్షన్ కేంద్రంలో ఓ అధికారి నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను తిరస్కరిస్తే.. నిన్ను హింసిస్తాను.. అవమానాలకు గురి చేస్తాను.. ఒప్పుకుంటే నిన్ను ఇక్కడ నుంచి త్వరగా విడుదల చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు’ అని నివేదిక వెల్లడించింది.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఉత్తర కొరియా ఈ నివేదికపై వెంటనే స్పందిచలేదు.. కానీ గతంలో మాత్రం ఈ మానవహక్కుల నివేదిక తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్ర అని విమర్శించింది. ఈ నివేదికలో పాలు పంచుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి డేనియల్ కొల్లింగే మాట్లాడుతూ.. ‘పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్యోంగ్యాంగ్‌పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. స్వేచ్ఛ, శ్రేయస్సు సాధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేశం దాటుతున్న వారిని బహిష్కరించవద్దని ఇతర దేశాలను కోరుతున్నాను’ అన్నారు. -
అయ్యో... బిడ్డ
సాక్షి, నల్లగొండ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఆక్సిజన్ సరఫరా లేక కొడుకు నరకయాతన పడుతుండగా... ఏం చేయాలో దిక్కుతోచక కన్నతల్లి తల్లడిల్లింది. బిడ్డను పిలుస్తూ, సపర్యలు చేస్తూ రోదించింది. ఆమె అలా చూస్తుం డగానే కుమారుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఎందరి హృదయాలనో బరువెక్కించింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. దీన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన బొప్పని యాదయ్య (40) ఆరోగ్యం బాగోలేక శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరగా, శనివారం సాయంత్రం శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అయిపోయింది. తల్లి లక్ష్మమ్మ కుమారుడి అవస్థను చూసి ఎంతగా రోదించినా ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదు. గిలగిలలాడిన యాదయ్య తుదిశ్వాస విడిచాడు. యాదయ్య లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని భార్య కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ తన పెన్షన్ డబ్బులతోనే యాదయ్య, అతని పిల్లలను సాకుతోంది. ఈ క్రమంలో యాదయ్యకు ఆయాసం ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యులు శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినా.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చారు. అతను శ్వాస ఆడక శనివారం సాయంత్రం మరణించాడు. సకాలంలో వైద్యం అందితే బతికేవాడు నా కుమారుడికి సరైన సమయంలో వైద్యం, ఆక్సిజన్ అందితే బతికేవాడని తల్లి లక్ష్మమ్మ తెలిపింది. డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్ పెట్టినా అది అయిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయినట్లు ఆరోపించింది. యాదయ్యకు కరోనా లక్షణాలు ఉండడంతో అతని నుంచి నమూనాలు తీసుకుని పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా రిజల్ట్ రాలేదని పేర్కొన్నాయి. సుమోటోగా కేసు నమోదు ఆస్పత్రి బెడ్‌పై కుమారుడు యాదయ్యకు తల్లి సేవలు చేస్తూ రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21లోగా అన్ని ఆధారాలతో పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కోరిన కలెక్టర్ యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాదయ్య తీవ్ర శ్వాస ఇబ్బంది, దగ్గు, జ్వరంతో చికిత్స కోసం 17న ఆస్పత్రిలో చేరాడని, అతను అప్పటికే అలర్జి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరి వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్నాడని కలెక్టర్ వివరించారు. వచ్చిన వెంటనే కరోనా అనుమానిత వార్డులో చేర్చుకుని సంబంధిత డాక్టర్, సిబ్బంది శక్తివంచన లేకుండా వైద్యసేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయాడన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్ఆర్సీ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొన్నారు. -
తండ్రిని మోసిన కుమారుడు.. విచారణకు ఆదేశం
కొల్లాం(కేరళ) : ఆరోగ్యం బాగాలేని తండ్రిని, కుమారుడు ఎత్తుకుని కిలోమీటరు మేర నడిచిన ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. కొల్లాం జిల్లాలోని పునలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తన తండ్రి జార్జ్(89)ని తీసుకురావడానికి వెళుతుండగా లాక్డౌన్ కారణంగా పునలూర్‌లో పోలీసులు రోయ్‌మన్(30) ఆటోను అడ్డుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి తన తండ్రిని తీసుకురావాలని మొరపెట్టుకున్నా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఒక కిలోమీటరు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి తన తండ్రిని తీసుకురావడానికి వేరే అవకాశం లేకపోవడంతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకువచ్చాడు. తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్‌మన్‌ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు స్పందించలేదు. పులనూరు సీఐ ముందుగా తనను ఆటో డాక్యుమెంట్లు అడగ్గా అన్ని చూపించానని రోయ్‌మన్ తెలిపారు. అయినా ఆటోను ఆసుపత్రి వరకు అనుమతించలేదన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. ఇక జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనపై రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ మానవ హక్కుల సంఘం తెలిపింది.