ifs officer
-
రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్ చేస్తే..!
విజయం సాధించాలంటే ఎంత కష్టమైనా భరించాలి. నిబద్దత, పట్టుదల ఉంటే చాలు ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా విజయం వచ్చి ఒడిలో వాలుతుంది. కావాల్సిందల్లా సాధించాలనే కసి. కడు పేదరికం నుంచి కూడా ఓర్పు, అభిరుచి ఉంటే విజయం సాధించ వచ్చు. అలాంటి సక్సెస్ స్టోరీని తలుసుకుందాం...రండి..! తమిళనాడులోని కోయంబత్తూర్ పాలక్కాడ్‌కు చెందిన ఆర్ ముత్తులక్ష్మి, ఆర్ చంద్రశేఖర్‌ల ఏకైక కుమార్తె రమ్య. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూపెరిగిన రమ్య చదులు రాణించింది. పదవతరగతి ఆ తరువాత పాలిటెక్నిక్ డిప్లమా చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ,ఆ తర్వాత IGNOUలో ఎంబీఏ చేసింది. ఐఏఎస్ కావాలను కలలు కంది.ఇంతలో తండ్రి అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంది. బెంగళూరుకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీలో మూడేళ్లపాటు పనిచేసింది. ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ ఆఫీసర్ కలలు కంది. క్రమంగా ఆ కల నెర్వేర్చుకోవాలనే పట్టుదలా పెరిగింది. అలా 2017 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నైకి వెళ్లిపోయింది. కానీ తన ఖర్చులకైనా ఏదో ఒక పని చేసుకోవాలి అందుకే రోజుకు మూడు గంటలు పనిచేసేలా డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో ఆమె వేతనం ఐదు వేలు మాత్రమే. మిగిలిన సమయాన్ని చదువుకోసం కేటాయించేది. కానీ తొలి పరీక్షలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేక పోయింది. అయినా పట్టువీడలేదు. ఐదు సార్లు ఫలితం దక్కక పోయినా ఏ మాత్రం నిరాశ పడలేదు. అపజయాలే విజయానికి సోపానాలు అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ 2021 లితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తల్లి సహకారం, తోడ్పాటుతోనే ఈ విజయం సాధించానంటూ ఆమో సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఆమె ఐఎఫ్ఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. -
చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేశారు. తుర్క్మెనిస్తాన్ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్ టి రోసెన్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు. చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ జతచేశారు. ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే.. When a Persian Leopard family decided to make home in front of a trap camera. The best thing you will watch. Credits to @NarynTR for raising awareness about them. pic.twitter.com/5hp8R4Whh1 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 14, 2023 -
మహారణ్యానికి మహిళా బాస్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం. మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది. వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్‌గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్‌కు ఫీల్డ్ డైరెక్టర్‌గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది. అడవి అంటే ప్రేమ సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్‌లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్‌లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది. స్త్రీలకు సవాలు ‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం. అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు. ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్. ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం. -
Jaipur Literature Festival 2023: త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు
‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు. స్త్రీల ఇంటి పని (కేర్ వర్క్)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్ వర్క్’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్ వర్క్) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. ఈ కేర్ వర్క్ తరాలుగా స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్ వర్క్‌కు విలువ కట్టడం లేదు. కేర్ వర్క్‌ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో శనివారం జరిగిన ‘విమెన్ అండ్ వర్క్’ అనే సెషన్లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్హుడ్ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్ మేగ్నిఫీషియెంట్ విమెన్ అండ్ దెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ లక్ష్మి పురి ఉన్నారు. ‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్‌గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు. ‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్హుడ్ ఉంటుంది. స్త్రీల మధ్య సిస్టర్హుడ్ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్హుడ్ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు. మంగళయాన్ వంటి మిషన్‌ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్. ‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
పిచ్చి అంటారండి దీన్ని!.. కాస్త ఉంటే..
మనుషులకు-వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలియంది కాదు. నగరీకరణ, అడవుల్లో కార్పొరేట్ వ్యవహారాలు పెరిగి పోయే కొద్దీ.. అలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. జనావాసాల వైపుగా వచ్చిన ఏనుగుల మందను తరిమే క్రమంలో ఓ కుర్రాడు.. కర్రతో ఏనుగును కొట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ గజరాజు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సురేందర్ మెహతా.. ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. జస్ట్ మ్యాడ్నెస్(కేవలం పిచ్చి) అనే క్యాప్షన్ ఉంచారాయన. Just madness…🐘#Wildlife #conflict @susantananda3 pic.twitter.com/Il8jx4AqgZ — Surender Mehra IFS (@surenmehra) December 4, 2022 ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం -
ఇదేం పామురా అయ్యా.. తిండి వేశారు అనుకుందో ఏమో..
సాధారణంగా మన ఇంటి పక్కన ప్రదేశాల్లో పాము కనిపిస్తే ఏం చేస్తారు?. కొందరు పామును చంపేస్తారు.. మరికొందరు అక్కడి నుంచి పారిపోతారు. ఈ వీడియోలో కూడా ఓ పాము తమ ఇంటి వద్ద కనిపించడంతో ఓ వ్యక్తి దానిపైకి చెప్పును విసిరాడు. దీంతో, అతను దానికి తిండి వేశాడు అనుకుందో ఏమో.. పాము తన నోటితో ఆ చెప్పును పట్టుకుని అక్కడి నుంచి పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. పింక్ కలర్లో ఉన్న రబ్బర్ చెప్పును నోట కరుచుకున్న పాము, తల పైకి ఎత్తి చాలా కోపంతో వేగంగా పాకుతున్నట్లు అందులో ఉంది. ‘ఈ పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో అని ఆశ్చర్యంగా ఉంది. దానికి కాళ్లు లేవుగా’ అని ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఇది ఎక్కడ జరిగిందో తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పు వాసన వల్ల ఏదో తినే పదార్థంగా భావించిన పాము దానిని నోట కరుచుకుని ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location. pic.twitter.com/9oMzgzvUZd — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2022 -
ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’
ఎందుకు.. ఆశ్చర్యం అని చెప్పుకునేలోపు.. మనమో చిన్న కథ చెప్పుకుందాం.. అనగనగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికి చెరో నలుగురు పిల్లలు. ఓరోజు అక్క భర్తకు ఎందుకో కోపమొచ్చింది.. అక్కను చంపేశాడు.. అలాగే ఓ బిడ్డనూ చంపేశాడు. అక్క పిల్లలు అనాథలయ్యారు.. చెల్లెలే ధైర్యంగా నిలబడింది.. వారిని చేరదీసింది. వారి కన్నీళ్లను తుడిచింది. ఎలా మెలగాలో చెప్పింది.. ఎలా బతకాలో నేర్పింది. బతుకుదెరువు చూపింది. ప్రయోజకుల్ని చేసింది.. ఏంటీ.. పాతకాలపు సెంటిమెంటు స్టోరీ అనేగా మీ డౌటు..ఈ స్టోరీ మనుషులది కాదు.. ఈ పులులది అని చెబితే.. ఆశ్చర్యమే కదా..ఎందుకంటే.. ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా అన్నారు. అవి ఆహారాన్ని ఆరగిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. ఈ ఫొటో వెనకున్న కథను నెటిజన్లకు తెలిపారు. Tigress takes care of 3 cubs of her dead sister along with 4 of her own. It is also reported that she gives precedence during hunting to the cubs of her sister. Rare. (Source:Forest Department) pic.twitter.com/V5wK28Qlgy — Susanta Nanda IFS (@susantananda3) August 22, 2022 -
మొక్కలు కూడా యుద్ధం చేస్తాయా..?
ఒడిశా: మొక్కలు సాధారణంగా ఎవరినీ నొంపించవనే మనకు తెలుసు. కానీ వుడ్ సోరెల్ అని పిలవబడే ఓ మొక్క ఉంది. అయితే దానిని ఎవరైనా ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది. ఎంతలా అంటే దాని దగ్గరున్న ఆయుదాలతో ఆపకుండా యుద్ధం చేస్తుంది. అదేంటి మొక్క యుద్ధం చేయడమేంటనుకుంటున్నారా..? ఇది నిజమే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారి బారి నుంచి కాపాడుకోవడానికి మిస్సైళ్లను పేల్చుతుంది. మిస్సైల్స్ అంటే ఎలాంటి బాంబులనో కాదు. ఆ మొక్క విత్తనాలనే బాంబుల్లా విసిరేస్తుందన్నమాట. వుడ్ సోరెల్ కాయలు చూడటానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా దానిని తాకిన వెంటనే ఆపకుండా వరుసగా విత్తనాలను విసురుతుంది. ఒక్కటి రెండో కాదు కాసేపు అలా వాటిని వదులుతూనే ఉంటుంది. మిస్సైళ్ నుంచి బాంబులను వదిలినట్టుగా ఈ మొక్క విత్తనాలను వదలుతుంది. ఇలా దాదాపు నాలుగు మీటర్ల వరకు విత్తనాలను విసరగలిగే శక్తి ఈ వుడ్ సోరెల్ మొక్కలకు ఉంటుంది. ఒత్తిడితో పాటు దానికున్న శక్తి వల్ల అది విత్తనాలను విసరగలుగుతుంది. అయితే ఈ విత్తనాలు తగిలితే మనుషులకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు కానీ చిన్నచిన్న కీటకాలకు తగిలితే వాటికి మాత్రం నొప్పి పుడుతుంది. తాజాగా ఈ మొక్కకు సంబంధించిన ఓ వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇక ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఈ మొక్క ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వుడ్ సోరెల్ కనిపిస్తుందని సమాచారం. Ballistic missiles as seen in the on going war are not humans prerogative only.. Wood Sorrel plant explodes & goes ‘ballistic’ when touched. Seeds are thrown as far as 4 metres away due to stored strain energy, with the plant targeting the object that agitated it. 🎥Arun Kumar pic.twitter.com/uRVWO2MOut — Susanta Nanda IFS (@susantananda3) February 26, 2022 -
ఈ విషయం తెలిస్తే చైనా ఆగుతుందా
సాక్షి, నూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన, అబ్బురపరిచే విషయాల గురించి అందరికి తెలుస్తున్నాయి. ట్విటర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తెలిసే ఉంటారు. అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సుశాంత నంద. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు చేసే కామెంట్స్ చూస్తే.. విరగబడి నవ్వుతారు. ఇంతకు ఆయన షేర్ చేసిన ఫోటో.. ఆ వివరాలు.. (చదవండి: వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు) సుశాంత నంద తన ట్విటర్లో శనివారం ఓ ఫోటోని షేర్ చేశారు. సడెన్‌గా చూస్తే.. అది డ్రాగన్ ఫోటోనో, పెయింటింగో అనిపిస్తుంది. కానీ కాదు. అది పోర్చుగల్‌లో ప్రవహిస్తున్న ఓ నది. ఆకాశం నుంచి చూస్తే.. అది అచ్చాం డ్రాగన్ మాదిరే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజనులు చేసే కామెంట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. (చదవండి: ‘ఒకే ఫ్రేమ్‌లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్‌గా ఉన్నారు’) ‘‘ఈ ఫోటోని చైనా వాడు చూస్తే.. మా డ్రాగన్లకు పోర్చుగల్ సంతోనోత్పత్తి కేంద్రంగా ఉంది. కనుక ఆ దేశం కూడా మాకు చెందినదే అంటుంది’’.. ‘‘ఇప్పటి నుంచి పోర్చుగల్ కూడా మా దేశంలో భాగమే. వారిని మాలో కలుపుకుంటాం అంటుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!) When river look like a dragon... From Portugal. 🎬Faces in Things pic.twitter.com/0NWYPsXLQZ — Susanta Nanda (@susantananda3) November 27, 2021 -
అంత సమయం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్ఎస్ అధికారి వి.వెంకటేశ్వర్రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్లో కేటాయించనున్న ప్లాట్ నంబర్ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్‌లోనే గతంలో కేటాయించిన ప్లాట్ నంబర్ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్ నంబర్ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు
అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అమ్మ ప్రేమకు హద్దులుండవు.. అనంతం. బిడ్డల్ని సంరక్షించడంలో తల్లి తర్వాతనే ఎవరైనా. వర్షం వస్తే పిల్లలకు తాను గొడుగవుతుంది.. ఎండలో నీడవుతుంది... ఇలా అన్ని వేళలా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. అందుకే ఓ మాట అంటుంటారు.. సృష్టికర్త తాను అన్ని చోట్ల ఉండలేక.. తల్లిని సృష్టించాడంటారు. ఈ మాట అక్షరాల నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే.. తల్లి ప్రేమను అనుభూతి చెందుతారు. ఆ వివరాలు.. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో జోరుగా వర్షం కురుస్తుంటుంది. నిలువుగా పొడవుగా ఉన్న ఓ కర్రలాంటి దాని మీదున్న గూడులో ఓ కొంగ, పిల్లలతో కలిసి ఉంటుంది. పైన ఏ ఆధారం లేకపోవడంతో గూడు, దానిలోని పిల్లలు తడుస్తుంటాయి. ఈ క్రమంలో తన పిల్లలను వర్షంలో తడవకుండా ఉండటం కోసం కొంగ తన రెక్కలను తెరచి.. దాని కాళ్ల మధ్య పిల్లలను నిలుపుతుంది. అయినా పిల్లలు తడుస్తుండటంతో ఆ తల్లి కొంగ అలానే తన రెక్కలను విప్పార్చి.. కూర్చుంటుంది. ‘‘ఎందుకంటే తనొక అమ్మ’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు ఆ కొంగ చూపిన తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ‘‘తను ఒక అమ్మ.. ప్రకృతి తనకు ప్రేమను పంచడం, రక్షించడం, దారి చూపడం వంటి ఎన్నో లక్షణాలను అందించింది. తల్లి అంటేనే ప్రేమ.. సృష్టికర్తకు జోహార్లు..’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
అంతెత్తు లేచింది.. వెంటపడి తరిమింది..!
న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ అవును! అడవి జంతువులు అడవిలో నివసిస్తాయి. కానీ అడవి పాలన ఏం చెబుతుంది? అక్కడ బలవంతుడిదే మనుగడ. అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ పోరాటంలో దూకుడుగా ఉన్న వ్యక్తిదే పై చేయి అయినట్లు.. ఏ జంతువైతే మరో జంతువును త్వరగా భయపెట్ట గలదో.. దానికి అడవిలో రక్షణ ఉంటుంది.’’ అంటూ రాసుకొచ్చారు. Sloth bear scaring away a Tiger - not quite a rare thing in the forests! Most bears (esp mumma bears) do attempt to scare the predator at the first instance by raising it's forelimbs to make them look large in size. This trick worked out for this bear. Video shared by a senior pic.twitter.com/SIikET7Asm — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 10, 2021 -
బలంగా తన్నాడు.. మొద్దు వచ్చి మీద పడింది.. అంతే!
చర్యకు ప్రతి చర్య అనేది సహజం. మనిషి చేసే ప్రతి పనికి ఫలితం అనుభవంచి తీరాల్సిందే అని పెద్దలు వూరికే అనలేదు. ఇక మనుషుల రకరకాలుగా ఉన్నట్లే.. వారి మనస్తత్వం కూడా అనేక విధాలుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి చెట్టును తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలోని వ్యక్తి తన బలాన్ని చూపించుకోవాలనుకున్నాడేమో.. అదే పనిగా మొద్దుబారిన ఓ చెట్టును తన్నడం మొదలు పెట్టాడు. బలంగా తన్నుతున్నాడు గానీ.. బుద్దికి పని చెప్పినట్టు లేడు. ఇంకేముంది చెట్టు విరిగింది. కానీ మొద్దు వచ్చి తలపై పడింది. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ వీడియోను భారతీయ అటవీ అధికారి సుధా రామెన్ ‘‘మీరు చేసేది.. మీకు తిరిగి వస్తుంది. అది మంచైనా.. చెడైనా’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 91 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వందల మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కర్మ ఫలం అంటే ఇదే.. మనం ఏ చేస్తామో.. అది తిరిగి వస్తుంది.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ గొప్పకు పోయాడు.. చివరకు పాఠం నేర్చుకున్నాడు.’’ అని రాసుకొచ్చారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలిరాలేదు. కానీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. All that you do comes back to you - Good and Bad pic.twitter.com/kMHZGF3NLi — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 1, 2021 చదవండి: 97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు -
వావ్.. అంకుల్ స్టెప్పులిరగదీశాడు కదా..!
సరదాగానో, ఇంట్లో ఎవరు లేనప్పుడో, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో డ్యాన్స్ చేయడం కామన్. కానీ సంప్రదాయ నృత్యం చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భరత నాట్యం, కూచిపుడి వంటి డ్యాన్స్‌లు చేయడం చాలా కష్టం.. అది కూడా ఆ నృత్యాలకు సంబంధించిన వస్త్రాలు ధరించి. కానీ ఇక్కడ ఉన్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యతో నోరు వెళ్లబెడతారు. మాములుగా భరతనాట్యం డ్రెస్ ధరించి.. డ్యాన్స్ చేయడానికి ఆడవారే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ పురుషుడు భరతనాట్యం డ్రెస్ ధరించి.. ఎంతో అందంగా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పైన చొక్క, కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఉన్నాడు. ఇక అతడు ఎంతో అద్భుతంగా.. చాలా సులభంగా.. అందంగా భరతనాట్యం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతో అందంగా, క్లియర్‌గా చేశారు.. అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్‌మాన్‌లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్‌కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్‌పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్‌స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్‌మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు
-
వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు..
సాధారణంగానే కుక్కలకు మానవులు ఎలా ప్రవర్తించాలి, ఏది ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణను ఇచ్చినప్పుడు అవి తూచా తప్పకుండా పాటించడం మనకి తెలుసు. ఒక్కోసారి మనం మర్చిపోయినా అవి మర్చిపోవు. ఇదే క్రమంలో ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు. అసలు ఎవరు ఈ కుక్క ఇలా ట్రైనింగ్ ఇచ్చారో గానీ ఇది చేసిన పని చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అదే మున్సిపాలిటీ అధికారులు గనుక చూస్తే స్వచ్ఛ భారత్‌కు దీన్నే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తారేమో.. అసలు ఇంతకీ ఏం చేసిందో ఈ శునకం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. కారు లోపల కూర్చున్న ఓ వ్యక్తి రోడ్డుపై పేపర్ విసురుతాడు. అకస్మాత్తుగా, ఆ కారు గుండా వెళుతున్న ఒక కుక్క, ఆ వ్యక్తి కారోలోంచి నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ కవర్ని తన నోటితో ఎత్తుకొని తిరిగి కారులోకి వదిలేస్తుంది. ఇదే కుక్క స్థానంలో మనిషే ఉండుంటే చూసి చూడనట్లు వెళ్లిపోయేవాడు. కానీ ఆ కుక్క మాత్రం అందుకు భిన్నంగా శుభ్రతకు సంబంధించిన ఓ పాఠాన్నే మనకు నేర్పిందనే చెప్పాలి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. “ప్రియమైన మానవులారా, ఇది మనకు ఒక పాఠం.. ఈ కుక్క తనకిచ్చిన శిక్షణను అనుసరిస్తున్నందుకు అభినందించాల్సిందే ” అని తన పోస్ట్‌కు ఈ శీర్షికను పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు మనం ఇలాంటివి చూసైనా మారాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో ) -
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
వైరల్: ‘బిడ్డా లే.. అమ్మ వచ్చింది చూడు’
న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి -
ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం
మనుషుల మాదిరి జంతువులకు దాదాపు అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. తాజాగా ఓ శునకానికి యమ కోపం వచ్చేసింది. ఆకలవుతుందని భౌ భౌ అని అరుస్తుంటే ఎంతకీ యజమాని పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆ శునకం తిన్నె గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) ప్రవీణ్ అంగుసామి తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. తనకు ఆకలి అయ్యిందని ఆ కుక్క అరుస్తుంటుంది. కొద్దిసేపటికి కోపమొచ్చి వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్ పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఎంత కోపం? ఆకలైతే అంతే.! తదితర కామెంట్లు చేస్తున్నారు. మీరు చూసేయండి ఆ వీడియో.. -
ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య..
-
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు
ముంబై: అటవీ శాఖ అధికారిణి బలవన్మరణానికి పాల్పడడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఉన్నతాధికారి వేధింపులేనని తేలింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తన సూసైడ్ నోట్లో తాను బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను వివరించింది. ఆ వ్యక్తెవరో కూడా పేర్కొనడంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె అటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలచివేస్తోంది. మహారాష్ట్రలో యంగ్ అండ్ డైనమిక్‌గా అధికారిణిగా దీపాలి చవాన్ మొహితే (28) గుర్తింపు పొందింది. లేడీ సింగమ్‌గా పేరు పొందారు. అయితే ఆమె అమరావతి జిల్లాలోని టైగర్ రిజర్వ్ సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న అధికారిక నివాసంలో గురువారం సాయంత్రం దీపాలి తన సర్వీస్ రివాలర్వ్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అంతకుముందు ఆమె రాసిన లేఖ లభ్యమైంది. అందులో శివకుమార్ తనతో గడపాలని, అలా చేయకపోతే అదనపు డ్యూటీలు వేయడం.. వేధించడం చేసేవాడని వాపోయింది. దీంతోపాటు తాను గర్భిణిగా ఉన్న సమయంలో కొండల్లోకి లాక్కెళ్లాడని ఆరోపించింది. అతడి వలన తనకు గర్భస్రావం అయ్యిందని లేఖలో కన్నీటి పర్యంతమైంది. తనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఆయనే ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ అని తెలిపింది. కొన్ని నెలలుగా ఆయన లైంగికంగా వేధించిన విషయాన్ని పూసగుచ్చినట్టు లేఖలో రాసింది. మానసికంగా కూడా చిత్రహింసలకు గురి చేశాడని వాపోయింది. అతడు తన అధికారాన్ని దుర్వినియోగంతో చేసిన కార్యాలను వివరించింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న వినోద్ శివకుమార్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. చదవండి: వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య -
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు
బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2009 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్‌తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఏకంగా ఇంటినే మోసేశారు..
నాగాలాండ్: ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని నాగాలాండ్‌లోని గ్రామస్తులు మరోసారి నిరూపించారు. గ్రామస్తులు తలో చేయి వేసి ఏకంగా ఓ గుడిసెను ఓ చోటు నుంచి మరో చోటుకి తరలించారు. గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గుడిసె నాలుగు దిక్కుల్లోని పునాదులను పైకి లేపి కాలి నడకనే గుడిసెను నూతన గమ్యానికి చేర్చారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుధా రామన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐకమత్యమే మహా బలమని ఈ నాగాలు మరోసారి నిరూపించారంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా 9000 వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. Yet another video where the Nagas show us that Unity is strength! House shifting in progress at village in Nagalandpic.twitter.com/XUGhiEGNe7 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) February 5, 2021