illicit affair
-
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
వివాహితతో అడ్డంగా దొరికితే.. చితకొట్టి పెళ్లి చేశారు
పాట్నా: వివాహేతర సంబంధం ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నలుగురిలో పరువు పోయేలా చేయడంతో పాటు కన్నబిడ్డలకూ దూరం చేసేసింది. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆమెకు బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు ఆమె భర్త, అత్తలు. బీహార్ నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె.. భర్తలేని టైంలో ఇంటికే రప్పించుకుంటోంది. అయితే పక్కింటి వాళ్లు ఇచ్చిన సమాచారంతో నిఘా వేసిన భర్త, అతని తల్లి వాళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ప్రియుడిని దొరకబుచ్చుకుని చితకబాదేశారు. అయితే.. ఆ తర్వాతే అసలు కథ నడిచింది. ఈ ఊరి సెంటర్లో ఉన్న గుడి వద్దకు ఆమెను, ఆ ప్రియుడిని తీసుకెళ్లారు. అతని చేత ఆమె నుదుటిపై సింధూరం అద్దించారు. గ్రామస్తులంతా చూస్తుండగా.. ఆమె రోదిస్తుండగానే వాళ్లిద్దరికీ వివాహం చేశారు. ఆపై పిల్లలిద్దరినీ తీసుకుని ఆ భర్త, అత్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు ఆ ప్రియుడు, ఆ వివాహిత అక్కడ మిగిలిపోయారు. స్థానికులెవరూ అది అడ్డుకోకపోగా.. తమ ఫోన్లకు పని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఆ వ్యక్తికీ వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదెక్కడ న్యాయమంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారు మరి!. Bihar News : दो बच्चों की मां का 3 बच्चों के पिता से चल रहा था अफेयर, पति ने करा दी शादी ! | Politicians India #bihar #nawada #viral #viralvideo #lovemarriage #marriage #temple #biharnews #extramaritalaffair #news pic.twitter.com/FwcU4NtuDb — Politicians India (@Politicians_IND) July 8, 2023 -
అప్సర కేసు.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది. పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు. కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్ అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్..
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కనుగంటి అప్సర (30) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగినట్లుగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా ఆలయ పూజారి అయిన నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ అప్సరను తొలుత సుల్తాన్‌పూర్‌లోని గోశాలలో అంతమొందించాలని భావించాడు. అయితే, గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించి.. కారును 2 కి.మీ. దూరం తీసుకెళ్లి నర్కుడలోని ఓ వెంచర్లో హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి సాయికృష్ణ ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్సర హత్యకు మూడుసార్లు విఫలయత్నం చేసిన సాయికృష్ణ.. నాలుగోసారి ఆమెను అంతమొందించాడు. కోయంబత్తూరు టూర్ అడ్డుపెట్టుకొని.. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ గుడికి వెళ్తున్న క్రమంలో సాయికృష్ణ, అప్సరలకు పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరు ఫోన్లో కాల్స్‌తోపాటు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునే వాళ్లు. గత నవంబర్‌లో అప్సర, సాయికృష్ణ గుజరాత్‌లోని సోమనాథ్, ద్వారక ఆలయాలను దర్శించుకుని, అక్కడే ఇద్దరూ ఒక్కటైనట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో తనను పెళ్లి చేసుకోకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, సంఘాల్లో చెప్పి పరువు తీస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెను అంతమొందించాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కోయంబత్తూరుకు తీసుకెళ్లాలని పలుమార్లు అప్సర కోరడంతో హత్యకు ఇదే అదనుగా భావించాడు. ఈనెల 3న శంషాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఆఖరి బస్సు రాత్రి 11 గంటలకు ఉందని, టికెట్ కూడా బుక్ చేశానని నమ్మించి, ఆమెను ఇంటి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. రెండు గంటలపాటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. కోయంబత్తూరుకు వెళ్లడం ఏమైందని అప్సర ప్రశ్నించడంతో.. తాను టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. సుల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్దామని ఆమెను ఒప్పించాడు. తర్వాత నర్కుడ వైపు వెళ్లి కారు కవర్‌ను అప్సర తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి, బండరాయితో తలపై మోది హత్య చేశాడు. చదవండి: అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే? తర్వాత కారు కవర్, అప్సర చెప్పులు, బండరాయిని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశాడు. అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎల్బీనగర్ నుంచి రెండు టిప్పర్ల ఎర్ర మట్టిని తెప్పించి పోశాడు. తమ్ముడు అయ్యవారి సత్యప్రసాద్ ద్వారా టిప్పర్ డ్రైవర్ అశోక్‌కు నగదు ఫోన్ పే ద్వారా రూ.16 వేలు వేశాడు. మరుసటి రోజు కూడా మ్యాన్‌హోల్ వద్ద దుర్వాసన వస్తుండటంతో మ్యాన్‌హోల్ కాంక్రీట్ మూతతో పూడ్చేశాడు. 14 రోజులు రిమాండ్‌కు.. పోలీసులు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజి్రస్టేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణ కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. అప్సర తల మీద బండరాయితో బలంగా మోదడంతో అధికంగా రక్తస్రావం జరిగి మరణించిందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాలతో దొరికాడు.. అప్సరను హత్య చేసిన తర్వాత సాయికృష్ణ అమాయకుడిలా ఆర్జీఏఐ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన మేనకోడలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానం వచి్చన పోలీసులు శంషాబాద్ బస్టాండ్ వద్ద సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో హంతకుడు సాయికృష్ణనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేయాలని భావించారు. ఈనెల 3న కోయంబత్తూరు వెళ్తున్నామని అప్సరను కారులో తెచ్చిన సాయికృష్ణ రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కారు ఆపి కిందికి దిగాడు. ఇంతలోనే ఓ బస్సు అటుగా వెళ్లడంతో కారు ఎటువైపు వెళ్లిందనేది సీసీ ఫుటేజీ తొలుత లభించలేదు. ఆ తర్వాత రాళ్లగూడ వరకు వెళ్లి ఒక్కడే ఫాస్ట్‌ఫుడ్ తిన్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కూడా అప్సర ఓసారి కారు దిగింది. వాంతి చేసుకున్న తర్వాత తిరిగి కారులో కూర్చున్నట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. హత్య చేసిన తర్వాత తిరిగొస్తున్న క్రమంలో కారులో ఒక్కడే ఉన్న సీసీ ఫుటేజీ కూడా పోలీసులకు దొరికింది. అప్సర నుంచి చివరి ఫోన్ కాల్ సాయికృష్ణకు చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అప్సర హత్యకు ముందు.. గూగుల్‌లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్‌లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
మిస్డ్ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగితేలారు.. చివరకు..
హైదరాబాద్: కలకలం రేపిన యువకుడు రాజేష్ మృతి కేసు కొలిక్కి వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని డాక్టర్స్ కాలనీ సమీపంలో సోమవారం కుళ్లిపోయిన స్థితిలో అల్లెవుల రాజేశ్ (24) మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల కీలక ఆధారాలు గుర్తించారు. మృతుడి సెల్‌ఫోన్ కాల్ డేటాలో చివరిసారిగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో మాట్లాడినట్లు ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజేష్‌కు, ఆమెకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈమేరకు ఆమె భర్త, బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ► ములుగు జిల్లాకు చెందిన రాజేశ్‌కు ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమంలో హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసి వివాహం కాలేదని భావించిన రాజేశ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి సంబంధం గురించి ఆమె భర్తకు తెలియడంతో మందలించాడు. దీంతో ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారన్న విషయం రాజేశ్‌కు తెలియడంతో ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేశ్‌తో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింది. కలిసి జీవితాంతం ఉండలేనప్పుడు కలిసి చనిపోదామని భావించిన టీచరు, రాజేశ్ ఇరువురూ.. మే 24న హయత్‌నగర్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల పరిశీలనలో పోలీసులు గుర్తించారు. అదే రోజు ఉపాధ్యాయురాలు ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియురాలి మరణ వార్త విని.. ఉపాధ్యాయురాలు చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉన్న విషయం తెలియక ఆమెకు రాజేశ్ వాట్సాప్ సందేశాలు, కాల్స్ చేశాడు. పదే పదే రాజేశ్ నుంచి ఫోన్లు రావటంతో ఆ ఫోన్ కుటుంబ సభ్యుల లిఫ్ట్ చేశారు. రాజేశ్ టీ షాపు దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు రాజేశ్‌ను గట్టిగా మందలించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియురాలు మరణించిన విషయం రాజేశ్‌కు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. తాను ఉండేది స్నేహితుడి గదితో కాబట్టి ఆత్మహత్య చేసుకోలేక.. శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్‌కు చేరుకున్నాడు. అదే రోజు (మే 24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివారు ప్రాంతం కావటంతో మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. 3–4 రోజులలో మృతదేహం కుళ్లిపోవటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్ మృతదేహానికి దుస్తులు లేకుండా ఉన్న స్థితిలో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలి మరణం అనంతరం ఆగ్రహంతో ఆమె కుటుంబ సభ్యులు రాజేశ్ మృతి చెందిన సంఘటన స్థలానికి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు తదుపరి విచారణ సాగిస్తున్నారు. విషమిచ్చి నా భార్యను చంపేశారు రాజేశ్ మృతి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని టీచరు భర్త మీడియాకు తెలిపారు. అతడిపై దాడి చేశామన్న వార్తలలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తన భార్యకు, రాజేష్‌తో సామాజిక మాధ్యమాలలో పరిచయం ఏర్పడి ఉండొచ్చని, వాళ్లిద్దరికి వయసులోనూ చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. తన భార్యను ఎవరో బ్లాక్మెయిల్ చేసి భయపెట్టారని, ఎవరో విషం ఇచ్చి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు. ఇదీ చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన చిన్నారి -
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్‌నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
వివాహేతర సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి కుమారుడ్ని దారుణంగా
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు. నిందితుడి పేరు విక్రమ్ శరద్ కోలేకర్. ఖేడ్‌లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. చదవండి: అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు? -
తిరుపతిలో దారుణం.. భర్తకి భార్య ప్రియుడి శిరోముండనం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భర్త. తమ గుట్టును బయటపెట్టడం భరించలేని ఆమె ప్రియుడు.. ఆ భర్తపై పైశాచిక చేష్టలకు దిగాడు. ఆ భర్తకి శిరోముండనం చేసి.. మూత్రం పోశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో హర్షవర్థన్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని, రిప్(RIP) అంటూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అది చూసిన ఆ ప్రియుడు హర్షవర్ధన్ రగిలిపోయాడు. బాధిత భర్తను దొరకబుచ్చుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ అతన్ని బెదిరించారు కూడా. అయితే.. ఈ చేష్టలను అడ్డుకోకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులకు విషయం చేరింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి హర్షవర్దన్‌తో పాటు అతని అనుచరుడు అన్వర్‌ను, వీళ్లకు సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జరిగిన అవమానంతో బాధిత భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
Crime News: భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ సొంత అన్నని..
బనశంకరి: అనుమానం పెనుభూతమైంది. సొంత అన్ననే కడతేర్చేందుకు వుసిగొల్పింది. కాళ్లు పట్టుకుని వేడుకున్నా తన భార్యతో సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో సొంత అన్నను హత్య చేశాడు ఇక్కడ ఓ తమ్ముడు. ఈ ఘటన కర్ణాటక బెళగావి జిల్లా చిక్కోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. చిక్కోడి పట్టణంలో అక్బర్ షేక్ (36), అమ్జద్ షేక్ అన్నదమ్ములు. ఒకే అంతస్తులో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. అయితే అక్బర్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తమ్ముడైన అమ్జద్లో నెలకొంది. దీంతో పలుమార్లు అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి.. అలాంటిదేం లేదని తేల్చారు కూడా. కానీ.. అక్బర్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అమ్జద్లో నానాటికీ బలపడుతూ పోయింది. ఈ క్రమంలో.. అన్న అక్బర్‌ను లేకుండా చేయాలని అమ్జద్ పథకం రచించాడు. ఏకంగా ఓ కారు కొనుగోలు చేశాడు. శనివారం బైక్‌లో వెళ్తున్న అక్బర్‌ను కారుతో ఢీ కొట్టించాడు. యాక్సిడెంట్‌గా ఆ కేసు పోతుందని అనుకున్నాడు. అయితే యాక్సిడెంట్ చేసినా అక్బర్ చనిపోలేదని భావించి.. కారు దిగిన అమ్జద్ అక్బర్ వైపు వెళ్లాడు. తనకేం సంబంధం లేదని, వదిలేయాంటూ కాళ్లు పట్టుకున్నాడు అక్బర్. అయినా వినకుండా ఓ ఆయుధంతో అన్నను హతమార్చాడు. ఆపై నేరుగా చిక్కోడిపోలీస్స్టేషన్లో లొంగిపోయాడు అమ్జద్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. తమ్ముడిని నమ్మించి గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి..
వైరా రూరల్ (ఖమ్మం జిల్లా): అన్న భార్య వదినతో సంబంధం పెట్టుకుని తమ్ముడు దిగజారిపోతే అతడిని గొడ్డలితో నరికి చంపి మనిషిగా మరింత దిగజారిపోయాడు ఓ అన్న. సోమవారం తెల్లవారుజామున ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరంలో ఈ ఘటన జరిగింది. రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామారావు, రామకృష్ణ, నరేశ్(32) అన్నదమ్ములు. రామకృష్ణ కూలిపనులు చేస్తుండగా, దివ్యాంగుడైన నరేశ్ వాటర్‌ప్లాంట్‌లో గుమాస్తా. వీరిద్దరూ తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రామకృష్ణ మొదటి భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయి రెండోపెళ్లి చేసుకున్నాడు. నరేశ్ భార్య రెండేళ్ల క్రితం వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం తన భార్యతో నరేశ్ సన్నితంగా ఉండటాన్ని చూసిన రామకృష్ణ ఆమెను మందలించాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని రాజమండ్రిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. నరేశ్‌తో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె తనను వదిలేసి పోయిందని కక్ష పెంచుకున్న రామకృష్ణ తమ్ముడిని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసుకున్నాడు. నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు... తల్లి సుబ్బమ్మ దీపావళి పండుగకు కూతురింటికి వెళ్లగా రామకృష్ణ తన తమ్ముడిని హత్య చేసేందుకు పథకం పన్ని ఆదివారంరాత్రి రెబ్బవరం శివార్లలోకి తీసుకెళ్లి మద్యం తాగించాడు. తర్వాత ఇద్దరూ ఇంటికెళ్లి భోజనం చేసి పడుకున్నారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నరేశ్‌పై రామకృష్ణ గొడ్డలితో విచక్షణారహితంగా నరికివేశాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం విషయాన్ని మేనమామ చెరుకూరి లక్ష్మీనారాయణ, స్నేహితులకు రామకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు. వీరు పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, తన భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకే తమ్ముడిని హతమార్చినట్లు విచారణలో రామకృష్ణ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
భార్య మీద అనుమానం.. 3 నెలలుగా 30కేజీల ఇనుప చైన్‌తో..
జైపూర్: అనుమానం పెనుభూతమైతే బంధాలు అదృశ్యమవుతాయి. ఇక భార్యభర్తల మధ్య అనుమానం మొదలైతే ఆ బంధం అక్కడితో ముగిసిపోతుంది. భార్యను చిత్రహింసలకు గురి చేస్తాడు భర్త. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త ఆమెను గత మూడు నెలలుగా ఇనుప చైనుతో బంధించి చిత్రహింసలకు గురి చేయసాగాడు. విషయం పోలీసులు దృష్టికి చేరడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాజస్తాన్ ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన బాధితురాలు(40), తరచుగా పుట్టింటికి వెళ్లేది. పొలం పనుల్లో తల్లికి సాయం చేసేది. భార్య ఇలా తరచుగా పుట్టింటికి వెళ్తుండటంతో భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్యకు తల్లిగారి ఊరిలో ఎవరితోనే అక్రమం సంబంధం ఉందని.. అందుకే తరచుగా అక్కడకు వెళ్తుందని భావించాడు. ఈ క్రమంలో హోలీ పండగకు రెండు మూడు రోజుల ముందు ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన భర్త దాదాపు 30 కేజీల బరువుండే ఇనుప గొలుసుతో ఆమెను బంధించి ఉంచి.. చిత్రహింసలకు గురి చేయసాగాడు. వృద్ధురాలైన తన తల్లికి సాయం చేయడానికే తాను పుట్టింటికి వెళ్తున్నానని భార్య చెప్పినప్పటికి అతడు వినలేదు. ఇప్పటికి మూడు నెలలుగా బాధితురాలిని కట్టేసి ఉంచాడు. దీని గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని బాధితురాలిని కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేవారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘పుట్టింటికి వెళ్లిన ప్రతి సారి నా భర్త అక్కడకు వచ్చి గొడవ చేసేవాడు. నా కుటుంబ సభ్యుల ముందే నన్ను కొట్టేవాడు. ఈ సారి ఏకంగా మూడు నెలల నుంచి నన్ను ఇనుప గొలుసుతో కట్టేసి.. హింసించడం ప్రారంభించాడు’’ అని తెలిపింది. చదవండి: అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో! -
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
గాంధారి (ఎల్లారెడ్డి): భార్య మహిళా కానిస్టేబుల్.. ఆమె ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై ఎన్నిసార్లు వారించినా ఆమె పట్టించుకోలేదు. పైగా ఎస్సైతో దాడి చేయించింది. దీన్ని భరించలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాం ధారి మండలం మాధవపల్లిలో చోటుచేసుకుంది. పోలీస్తుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర దెగులూర్ తాలూకాలోని షాకూర్ గ్రామానికి చెందిన శివాజీరావు 15 ఏళ్ల క్రితం మాధవపల్లికి చెందిన రైతు బాజారావు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బాజారావుకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రజితను శివాజీరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు పుట్టిన రెండేళ్లకు అనారోగ్యంతో రజిత మృతి చెందింది. దీంతో బాజారావు రెండో కూతురు సంతోషితో శివాజీరావుకు రెండో పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం సంతోషికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి కామారెడ్డికి కాపురం మార్చారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సంతోషికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివప్రసాద్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివాజీరావు ప్రవర్తన మార్చు కోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో సంతోషి, ఎస్సై కలిసి శివాజీరావును మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి నుంచి మాధవపల్లికి వచ్చిన శివాజీరావు తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గాంధారి ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల ధర్నా సమాచారం అందుకున్న సంతోషి కామారెడ్డి నుంచి గ్రామానికి చేరుకుంది. శివాజీరావు బంధువులు పెద్ద సంఖ్యలో మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి వచ్చారు. అతని చావుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు. పోలీసులు ఎవరి కంట పడకుండా సంతోషిని దొడ్దిదారిన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ప్రధాన రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి ధర్నా చేశారు. బుధవారం ఉదయం 10 వరకు ఆందోళన కొనసాగింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన చెడ్డ తల్లి కాదు’
చండీగఢ్: చెడ్డ మహిళ ఉంటుంది కానీ.. చెడ్డ తల్లి ఉండదని పెద్దల మాట. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. సమాజం హర్షించనప్పటికి.. బిడ్డల బాగు కోసం ఆమె ఏం చేయడానికికైనా సిద్ధ పడుతుంది. తాజాగా పంజాబ్, హరియాణా కోర్టు కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఓ మహిళను చెడ్డ తల్లిగా పరిగణించలేము అని వ్యాఖ్యనించడమే కాక నాలుగున్నరేళ్ల కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించింది. వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. భర్త తన దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో పంజాబ్‌కు చెందిన ఓ మహిళ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వంపై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా.. ఉందని ఊహించినా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచి తల్లి కాదని అనడానికి కానీ.. పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు’’ అని స్పష్టం చేశారు. కేసు వివరాలు... ఇక కేసు వివరాలకు వస్తే.. పిటీషనర్ పంజాబ్‌కు చెందిన ఫతేగార్ సాహిబ్‌కు, లుధియానాకు చెందిన ఆమె భర్త ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులు. 2013లో వీరికి వివాహం కాగా.. 2017లో ఓ కుమార్తె జన్మించింది. పిటీషన్‌దారైన మహిళ 2020, ఫిబ్రవరిలో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని.. కానీ మాత్రం తాను ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డానని.. సొంత ఇల్లు కూడా ఉందని.. కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పిటీషన్లో తెలిపింది. మైనర్ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. అంతేకాక సదరు మహిళ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుమార్తె కస్టడీని కోరుతూ.. ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది. ఇక భర్త వాదనల ప్రకారం అతడి భార్య తన దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అందుకే పాపను ఆమె దగ్గర నుంచి తీసుకువచ్చానన్నాడు. ఏడాదిగా తన కుమార్తె నానమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయ్యిందని.. ఇప్పుడు బిడ్డను తన భార్యకు అప్పగిస్తే.. పాపపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు.. ‘‘తల్లి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది. రానున్న సంవత్సారల్లో పాప నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరం అవుతాయి. అంతేకాక హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చదవండి: భార్య గుట్టు బయటపెట్టిన కాల్ రికార్డింగ్స్! -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త
బనశంకరి(కర్ణాటక): వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే తాలూకా బీమనబీడు గ్రామానికి చెందిన మహిళ (25)తో 30 ఏళ్ల వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. బుధవారం రాత్రి మహిళ ప్రియునితో కలిసి ఉండగా ఆమె భర్త కట్టె, కత్తితో ప్రియునిపై దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని మైసూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గుండ్లుపేటే పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. Australia: దొంగను చంపి..శవంతో 15 ఏళ్లు సహవాసం -
కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
రామసముద్రం (చిత్తూరు జిల్లా): భార్యతో సహజీవనం చేస్తున్నాడన్న ఆగ్రహంతో వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన ఘటన రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. ఎస్ఐ రవికుమార్ కథనం మేరకు.. దిగువలంభంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె ఆదిలక్ష్మికి.. పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు అర్జున్‌కు 20ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కలహాల వల్ల నాలుగేళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకాకి చెందిన శ్రీనివాసులు అలియాస్ ఆంజప్ప(41)తో ఆదిలక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ దిగువలంభంవారిపల్లెలో సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం ఆమె భర్త అర్జున్‌కు తెలియడంతో గురువారం రాత్రి ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆంజప్పపై బండరాయితో మోది పారిపోయాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని గాయపడిన ఆంజప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతిచెందాడు. శవపరీక్ష నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ మధుసూధన్‌రెడ్డి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే.. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు -
భార్య నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ పోసి
చెన్నై : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన తిరువలంగాడు ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరువలంగాడు సమీపం మెన్నవేడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్. ఇతని భార్య ప్రియాంక. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రియాంక నార్తవాడా గ్రామానికి చెందిన కార్తిక్ (27)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన రాజ్‌కుమార్ కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు కలిపి.. ప్రియాంక చేతులు కట్టి నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. -
ఇద్దరు పిల్లల తండ్రి.. ప్రియురాలి తల్లితో జంప్!
లండన్ : తన బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలిని కాదని ఆమె తల్లితో పారిపోయాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్ అల్డ్రిడ్జ్ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్ షెల్టన్ (29)తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. రియాన్‌తో పాటు ఆమె తల్లి 44 ఏళ్ల జార్జినాతోనూ సైడ్ ట్రాక్ నడిపాడు. రాత్రిళ్లు కిచెన్‌లో బకార్డి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. వీరి ప్రవర్తన రియాన్‌కు అనుమానాస్పదంగా తోచింది. దీంతో ఓ రోజు దీనిపై ఇద్దర్నీ నిలదీయగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు. రియాన్ కడుపుతో ఉన్న సమయంలో జెస్,జార్జినాలు రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం రియాన్‌కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ( అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య) జనవరి 28న జెస్,రియాన్‌ల ప్రేమకు గుర్తుగా పండంటి మొగబిడ్డ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొన్ని గంటల తర్వాత జెస్‌నుంచి ఆమెకో మెసేజ్ వచ్చింది. తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నట్లు. ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన ఆమెకు.. జెస్, జార్జినా లేచిపోయారన్న విషయం తెలిసి షాక్ అయింది. దీనిపై రియాన్ మాట్లాడుతూ.. ‘‘ ఇది దారుణమైన వెన్నుపోటు. ఏ అమ్మమ్మ అయినా మనవడితో ప్రేమలో పడాలి.. మనవడి తండ్రితో కాదు. నాకు, నా పిల్లలకు తోడుగా ఉంటుందనుకున్నాను. కానీ, ఇలా నా ప్రియుడితో పారిపోతుందనుకోలేదు’’అని కన్నీటి పర్యంతం అయింది. -
అప్పు.. అక్రమ సంబంధం.. ఓ హత్య
లక్నో : వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పుకు బదులు మహిళతో సంబంధాన్ని కోరుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన వినోద్‌కుమార్, ప్రీతి దంపతులు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన త్యాగి అనే వ్యక్తి దగ్గర ప్రీతి.. పెళ్లికి ముందు 40 వేల రూపాయలు అప్పు తీసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి లక్ష రూపాయలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా అప్పు తీర్చకపోవటంతో ప్రీతిని తనతో సంబంధం పెట్టుకోమని త్యాగి బలవంతం చేశాడు. దీంతో గత సంవత్సరం నుంచి ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం ప్రీతి భర్త వినోద్‌కు తెలియటంతో.. త్యాగిని చంపాలని నిర్ణయించుకున్నారు. జనవరి 4వ తేదీన అతడ్ని విందుకు పిలిచి ఫుల్లుగా తాగించారు. ( పోలీస్ జీప్‌ను చూసి ఆ ఇద్దరు మహిళల పరుగులు..) అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం శవాన్ని సూట్‌కేసులో పెట్టి విజయ్ నగర్‌లోని డ్రైనేజీ కాలువలో పడేశారు. స్నేహితుడి ఇంటికని వెళ్లిన త్యాగి మరుసటి రోజుకూడా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైనేజీలోని సూట్‌కేసులో కుళ్లిపోయిన స్థితిలో త్యాగి శవాన్ని గుర్తించారు. అతడి సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఎటీఎమ్ విత్డ్రాల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరిపి ప్రీతి, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం: భర్తను హత్యచేసి..
సాక్షి, నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. అంతేగాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో బంధువులు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ పన్నాగం ఫలించినందుకు నిందితులు ఇద్దరు సంతోషించారు. కానీ నిందితురాలి పెద్ద కొడుకు నోరు విప్పడంతో వీరి బండారం బయపడింది. తన తండ్రిని చంపుతుండగా కళ్లారా చూసిన ఆ అబ్బాయి విషయాన్ని అందరికీ చెప్పాడు. (చదవండి: నల్గొండలో జంట హత్యల కలకలం) మునుగోడు మండలం, కొరటికల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న జరిగిన ఈ హత్యకేసుకు సంబంధించిన అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మనుమడు చెప్పిన వివరాల ఆధారంగా మృతుడి తల్లిదండ్రులు కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
యజమాని భార్యతో సంబంధం.. అది తెలిసి..
తిరువొత్తియూరు : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులోని హొసూరులో జరిగింది. కృష్ణగిరి జిల్లా హొసూరు బేగిపల్లికి చెందిన హరి కుమారుడు శ్రీకాంత్ (21). ఇతను హొసూరు మునేశ్వరనగర్‌లో వున్న బైరోస్ అనే వ్యక్తి మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్‌కు, యజమాని భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి బైరోస్ శ్రీకాంత్‌ను మందలించాడు. అయినా సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో బుధవారం శ్రీకాంత్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరి చివర తోటలో ఉరి వేసుకుని..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడింది. టెక్కలి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పిట్టల సరియలో ఊరి చివర ఉన్న తోటలో ఇప్పిలి రాజేష్, పాలిన వేనమ్మలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధమే మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. చదవండి : ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు -
మహిళతో సంబంధం: విద్యార్థి ఆత్మహత్య
ముంబై : మహిళతో అక్రమ సంబంధం ఓ కాలేజీ స్టూడెంట్ ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెలోని కొయాలి గ్రామానికి చెందిన ఆకాశ్ అనే 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌కు నెల రోజుల క్రితం ఫేస్బుక్లో సంగీత అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సంబంధాన్ని ఆకాశ్ తల్లిదండ్రులకు చెబుతానంటూ సంగీత బెదిరించసాగింది. ( భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు) దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆకాశ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆకాశ్ మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సంగీత బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..
ఆళ్లగడ్డ(కర్నూలు): ప్రియుడితో రాసలీలలు జరుపుతున్న భార్యను భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన సంఘటన ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్ వాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది. తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పి ఆటోడ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై భర్తకు అనుమానం రావడంతో సదరు వ్యక్తిని తన ఇంటికి రావొద్దని చెప్పాడు. (చదవండి: ఆవు దూడపై అత్యాచారం) ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా ఇరుగుపొరుగు వారు గమనించి ఫోన్ చేసి చెప్పారు. భర్త వచ్చి భార్య, ప్రియుడు ఇంట్లో ఉండటం గమనించి గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ)