indigo airline
-
ఆగస్టు 16 నుంచి ముంబైకి ఇండిగో విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): దేశ ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (గన్నవరం) సర్వీస్‌లు నడిపేందుకు మరో ఎయిర్‌లైన్స్ సంస్ధ ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ రూట్లో ఎయిరిండియా సంస్థ విజయవంతంగా సర్వీస్‌లు నడుపుతోంది. దీంతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆగస్టు 16 నుంచి సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విమాన ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టికెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ సర్వీస్ నిమిత్తం 180 మంది ప్రయాణికుల సామర్ధ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ320 విమానాన్ని వినియోగించనున్నారు. ఈ విమానం ముంబై నుంచి రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9.00కు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.ప్రారంభ టికెట్ ధరలు ముంబై నుంచి విజయవాడకు రూ.3,645, విజయవాడ నుంచి ముంబైకి రూ. 3,712గా నిర్ణయించారు. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూకే, యూఎస్ఏ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని తెలిపారు.త్వరలో చెన్నైకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్చెన్నై నుంచి విజయవాడకు త్వరలో చౌక ధరల విమాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ రూట్లో ఇండిగో మాత్రమే సర్వీస్‌లను నడుపుతోంది. కొత్త సర్వీసులకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
అయోధ్య చేరుకోనున్న మొదటి ఫ్లైట్ ఇదే.. ఎప్పుడో తెలుసా?
అయోధ్య రామమందిరం ప్రారంభ ఏర్పాట్లతో పాటు ఎయిర్‌పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. అంతకంటే ముందు అయోధ్య విమానాశ్రయంలో డిసెంబర్ 30న మొదటి విమానాన్ని నడపనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల వెల్లడించారు. ఢిల్లీ - అయోధ్య మధ్య 2024 జనవరి 10 నుంచి ఇండిగో విమానాలు ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రతి రోజు తిరిగే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరి 1:15 గంటలకు అయోధ్యకు చేరుతుంది. ఆ తరువాత 1:45 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ప్రతి రోజూ ఇదే షెడ్యూల్లో విమానాలు నడుస్తాయి. ఇదే చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య అహ్మదాబాద్ నుంచి మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే విమానాలు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో ఉదయం 9:10 గంటలకు బయలుదేరి 11:00 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఆ తరువాత 11:30 గంటలకు అయోధ్య నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది. Launching flights to #Ayodhya from #Ahmedabad and #Delhi starting 30th December 2023. Fares starting at ₹2,999. Book now https://t.co/kQiEKSPfat. #goIndiGo #NewDestination #IndiaByIndiGo pic.twitter.com/L4p1iMHm1R — IndiGo (@IndiGo6E) December 14, 2023 -
తన్నులు తిన్న మహిళాపైలట్పై చర్యలు
ఢిల్లీ: ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్‌ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో నిన్నంతా విపరీతంగా వైరల్ అయ్యింది. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని, శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులే ఆ పని చేశారు. అయితే.. ఈ ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్‌ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఇది చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ద్వారకా పోలీస్ స్టేషన్లో ఆ జంటపై కేసు నమోదు అయ్యింది. Injuries of the minor that she was beaten and brunt by the couple pic.twitter.com/jYVwWzbfTx — । अतुल । (@atulamist7) July 19, 2023 ఇదీ చదవండి: సెల్‌ఫోన్ వాడుతోందని తిడితే.. జలపాతంలో దూకింది -
విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. -
దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..!
విమానంలో అందించే ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. అందులోని గుర్ప్రీత్ సింగ్ హాన్స్ అనే మరో ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి డిసెంబర్ 19న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో అనువైన ఆహారం అందించాలి. కానీ అలా జరగటం లేదు. ఇచ్చిన ఆహారం తిని కొందరు సర్దుకోగలరు కానీ అందరు అలా ఉండలేరు. ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూశాను. ’ అని రాసుకొచ్చారు గుర్ప్రీత్ సింగ్ హాన్స్. Unfortunately, I mean it Unfortunately I book a flight with @IndiGo6E from #Istanbulairport to @DelhiAirport people are right staff are right but @IndiGo6E can't. Every international LONG DISTANCE(we can manage from Dubai to India ) flight has a food choices video in front — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 18, 2022 వీడియో ప్రకారం.. ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘నీ వల్ల విమానంలో గందరగోళం నెలకొంది. నీ బోర్డింగ్‌లో ఉన్న ఆహారమే అందిస్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి.’ అని ఎయిర్‌హోస్టెస్ సూచించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. మరో సిబ్బంది కలుగ జేసుకుని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె సర్వెంట్, ఒక ఉద్యోగిని, నేను మీ సర్వెంట్‌ని కాదు అని పేర్కొన్నారు ఆ ప్రయాణికుడు. ఎయిర్‌హోస్టెస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. Even staff checked our boarding pass before giving us food which is not right for long distances #internetflight @IndiGo6E @AAI_Official @DelhiAirport @GovtOfIndia_ one thing you must need to realise is that "we choose you, you can't" pic.twitter.com/2uLIqhG5vw — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 19, 2022 ఇదీ చదవండి: ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం! -
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటుడు దగ్గుబాటి రానా ఆగ్రహం
-
పాయల్ రాజ్‌పుత్‌కు చేదు అనుభవం, ఆ ఎయిర్‌లైన్‌పై ఫైర్..
‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది వల్లే తనకు ఇలా జరిగిందంటూ పాయల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది తన లగేజ్‌ని డ్యామేజ్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తింది. ఈ సందర్భంగా తన లగేజ్ ఫొటోలను షేర్ చేస్తూ ఇండిగో విమాన సంస్థ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల పాయల్ ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. దీంతో తన లగేజ్ డ్యామేజ్ అయ్యిందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది ఆమె. చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి ‘డ్యామేజ్ అయిన నా బ్యాగులు చూడండి. ఇందుకు ఇండిగో విమాన సిబ్బందే కారణం. నా లగేజ్‌ని ఇష్టానుసారంగా విసిరారు. వారి నిర్లక్ష్యం కారణంగా నా లగేజ్ దారుణంగా పాడైంది. ఈ ప్రయాణం నాకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని ఇచ్చింది’ అంటూ ఇండిగో ఎయిర్‌లైన్‌ను ట్యాగ్ చేసింది. అనంతరం కాసేపటికే ఆమె మరో ట్వీట్ చేస్తూ ఇండిగో ఎయిర్‌లైన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇండిగో సిబ్బంది తన సమస్యను పరిష్కరించిందని చెబుతూ థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు తన అభ్యర్థనపై ఇండిగో ఎయిర్‌లైన్ స్పందించిన తీరుపై ఆమె హర్షం వ్యక్తి చేసింది. వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించిన ఇండిగో సేవలకు ధన్యవాదాలు అంటూ పాయల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే పాయల్ ప్రస్తుతం మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రంలో నటిస్తోంది. Check in luggage damaged by Indigo, brutally handled by the staff. Worst experience guys! @IndiGo6E pic.twitter.com/B0dwvtWj0Y — paayal rajput (@starlingpayal) September 14, 2022 Highly elated to share my regards ,Thanks @IndiGo6E for acknowledging my problem. It’s resolved now . Thanks for the quick service . Best wishes from my side 👍 ✈️ #indigo — paayal rajput (@starlingpayal) September 14, 2022 -
షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. 'షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. -
విమాన ప్రయాణికులపై 'క్యూట్ ఫీ'.. చిత్రాలు వైరలవటంతో..
దిల్లీ: విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే.. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన వారు తమ టికెట్లో 'క్యూట్ ఛార్జ్' అంటూ కనిపించటంపై ఆశ్చర్యానికి గురయ్యారు. అందంపై రుసుము వసూలు చేయటమేంటని తికమకపడ్డారు. శాంతాను అనే వ్యక్తి తన టికెట్ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు. 'క్యూట్ ఛార్జ్' వివరాలతో కూడిన ఆ టికెట్ వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండిగో సంస్థపై విమర్శలు గుప్పించారు. 'నా వయసుతో నేను చాలా అందంగా కనిపిస్తానని తెలుసు. కానీ దానికి నాపై ఇండిగో ఇలా ఛార్జ్ వసూలు చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు' అని పేర్కొన్నారు. I know I’m getting cuter with age but never thought @IndiGo6E would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX — Shantanu (@shantanub) July 10, 2022 శాంతాను షేర్ చేసిన చిత్రంలో టికెట్ ధరకు సంబంధించిన వివరాలను ఉంచారు. అందులో ఎయిర్‌ఫేర్ ఛార్జీలు, సీట్ ఫీ, సెక్యూరిటీ, కన్వీనియన్స్ ఫీజులతో పాటు క్యూట్ ఛార్జ్ అంటూ రూ.100 వసూలు చేశారు. ఇలాంటి ఫోటోనే మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ఈ కొత్త ఛార్జీల కారణంగానే నేను ఇండిగోలో ప్రయాణించాలనుకోవట్లేదు. ఆ ఛార్జీలు నాకు రూ.20వేలు అవుతుంది. విమానం టికెట్ ధర కన్నా అది చాలా ఎక్కువ' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్యూట్ ఫీ అంటే ఏమిటి? క్యూట్ అంటే 'కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్' అని అర్థం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మెటల్ డిటెక్టింగ్ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు దీనిని వసూలు చేస్తారు. ట్విట్టర్లో క్యూట్ ఫీపై వైరల్‌గా మారిన క్రమంలో ఇండిగో సమాధానమిచ్చింది.'ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్(క్యూట్) సేవలను ఉపయోగిస్తున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారని తెలుసుకోండి. మీకు సేవ చేసేందుకే మేము ఉన్నాం' అని ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చింది. Ms. Waliya, please know that the CUTE charges are levied at select airports for the usage of Common User Terminal Equipment (CUTE) services. You may visit https://t.co/anjh8jarWV to know more. (1/2) — IndiGo (@IndiGo6E) July 10, 2022 ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే!
IndiGo Appoints Pieter Elbers As New CEO: ఇండిగో కొత్త సీఈవోగా పీటర్ ఎల్బర్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2019నుంచి ఇండిగో ఎయిర్ లైన్ సీఈవో విధులు నిర్వహిస్తున్న రోనోజోయ్ దత్ రిటైర్ అవుతున్నట్లు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2019, జనవరి నెలలో ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా సీఈవో సంస్థను ముందుండి నడిపిస్తున్న రోనోజోయ్ దత్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిటైర్ అవుతున్నట్లు ఇండిగో తెలిపింది.రిటైర్ అవుతున్న రంజయ్ దత్ స్థానంలో కేఎల్ఎం రాయిల్ డచ్ ఎయిర్‌లైన్ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ఈ ఏడాది అక్టోబర్ 1లోపు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఇండిగో తనని సీఈవో నియమించడం పట్ల ఎల్బర్స్ సంతోషం వ్యక్తం చేశారు. 16ఏళ్ల క్రితం ఉద్యోగులు,మేనేజ్మెంట్ టీమ్‌గా ఏర్పడిన ఇండిగో ఎంతో ఆకట్టుకుందని అన్నారు. అద్భుతమైన పయనంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇండిగో విజన్‌ను నెరవేరుస్తూ, భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు ఇండిగో సేవల్ని అందుబాటులోకి తెస్తామని పునరుద్ఘాటించారు. చదవండి👉ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో -
ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా!
దేశంలో కోవిడ్ కారణాల వల్ల విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం దేశీయ విమానాయన సంస్థ ఇండిగో 'ప్లాన్ బి'ని అందుబాటులోకి తెచ్చింది. ఇండిగో ఎండ్ నుండి ఫ్లైట్ రద్దు చేసినా లేదా రీషెడ్యూల్ చేసినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్ధం తమ వద్ద ప్లాన్ బి' ఉందని తెలిపింది. ఇంతకీ ఆ ప్లాన్ బి' ఏంటని అనుకుంటున్నారా? మీ ఫ్లైట్ సమయం/లేదా తేదీని మార్చుకోవచ్చు. ఇండిగో నిబంధనలకు లోబడి ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా లేకుండా రీఫండ్ పొందవచ్చని ఇండిగో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. #6ETravelAdvisory: Do not wait in queue, for any cancelled/rescheduled flight for more than 2 hrs visit- https://t.co/evofgYvfrV, all the options available on Plan B are same that are offered at our contact center. For further assistance DM us on Twitter/Facebook pic.twitter.com/AuFYvUEumY — IndiGo (@IndiGo6E) January 5, 2022 ఇండిగో అధికారిక ట్విట్ ప్రకారం.. 2 గంటల కంటే ఎక్కువసేపు రద్దు చేయబడిన లేదా, రీషెడ్యూల్ చేయబడిన ఏదైనా విమానాల కోసం ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. “ప్రస్తుతం కోవిడ్‌తో ప్రయాణ పరిమితులు, వాతావరణంలో మార్పుల కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. అందుకే మార్పులు లేదా రద్దు చేయాల్సి వస్తే ప్రయాణీకులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు సమాచారం అందిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్లో పేర్కొంది. చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగంలో మరో సంచలనం! -
విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్
భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి ఫస్ట్, సెకండ్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు టికెట్ బుక్ చేసేటప్పుడు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఈ ఆఫర్ ప్రకటించిన మొదటి విమానయాన సంస్థ ఇండిగో. బుకింగ్ సమయంలో భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్న 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది. "బుకింగ్ సమయంలో ఈ ఆఫర్ పొందాలంటే ప్రయాణీకులు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. అలాగే, వారు విమానాశ్రయ చెక్-ఇన్ కౌంటర్/బోర్డింగ్ గేట్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ లో వ్యాక్సినేషన్ స్టేటస్ చూపించాలి" అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. "దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో, జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మా వంతు సహకారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అలాగే, ప్రతి ప్రయాణికుడు తక్కువ ధరలకే సురక్షితంగా ప్రయాణించేలా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు" తెలిపారు. ఈ ఆఫర్ ప్రస్తుతం ఇండిగో వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్ -
విమానాన్ని ఢీకొన్న నిచ్చెన : ధ్వంసమైన రెక్కలు
ముంబై : బలమైన ఈదురు గాలులు ముంబై విమానాశ్రమయంలో బీభత్సం సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం నిచ్చెన.. అక్కడే ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతొ ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పిఉంచే భాగం ధ్వంసమైంది. శనివారం వీచిన ఈదురుగాలులు, అధిక వర్షపాతంతో ముంబై నగరం జలమయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలమైన గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి రావడంతో ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు మీడియాల్లో వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో రెండు విమానాలు కూడా విమానాశ్రయంలోనే నిలిపివున్నాయని స్పైస్ జెట్ తెలిపింది.‘ఈ ప్రమాదం ముంబై విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్పైస్ జెట్‌కు చెందిన విమానం మెట్ల నిచ్చెన దాని ఆపి ఉంచిన స్థానం నుండి వేరుచేయబడి ఇండిగోకు చెందిన విమానాన్ని బలంగా తాకింది. ఈ ప్రమాదంలో ఇండిగో విమాన రెక్కలు ధ్వంసమైయ్యాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సేవలు పునః ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారినపడ్డారు. లాక్డౌన్ కారణంగా అన్ని విమానయాన సర్వీసులు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25న అన్ని దేశీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలువురు వారి గమ్యస్థానాలకు చేరడానికి తిరుగు పయనమయ్యారు. విమానయాన సేవలు తిరిగి ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంతో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అన్న దానిపై చర్చ మొదలైంది. (క్వారంటైన్లో 23 లక్షల మంది ) విమానాశ్రయాల్లో పరీక్షల అనంతరం కరోనా సోకినట్లు నిర్థారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అంతేకాకుండా వారితో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు, సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉంచారు. లాక్డౌన్ 4.0లో భారీ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగానే దీశీయ విమాన కార్యకలాపాలు సాగించడానికి అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండు నెలల అనంతరం దేశీయ విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భౌతికదూరం పాటించడం, ఫేస్ మాస్క్, శానిటైజేషన్, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి అన్న నిబంధనలు విధిస్తూ విధించింది. అయినప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకో ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే..వీరిలో ఎక్కువమంది ఇండిగో విమానంలోనే ప్రయాణించారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు ఉండటం గమనార్హం. (హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష ) -
పైలట్ రోహిత్‌కు కునాల్ కృతజ్ఞతలు
ఇండిగో ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పైలట్ రోహిత్‌కు కమెడియన్ కునాల్ కామ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 28న ఇండిగో సంస్థ విమానంలో ప్రయాణించిన కునాల్ అదే విమానంలో వెళ్లున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిని అసభ్యకరంగా మాట్లాడినందుకు కునాల్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఆరు నెలలపాటు కామ్రా తమ విమానాల్లో ప్రయాణించరాదని ఇండిగో విమానయాన సంస్థ వేటు వేసింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. (ప్రముఖ కమెడియన్‌పై నిషేధం) ఈ క్రమంలో సదరు విమాన పైలట్ రోహిత్ మాటేటి ఇండిగో విమాన సంస్థకు ఓ లేఖ రాశారు. అందులో ‘కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇండిగో విమానయాన సంస్థ పనిచేసింది. ప్రయాణికుడిపై చర్యలు తీసుకునే ముందు పైలట్ ఇన్ కమాండర్‌ను సంప్రదించలేదు. విమాన సిబ్బంది చెప్పిన సూచనలను కునాల్ పాటించాడు. ఈ చర్యకు చాలా సార్లు క్షమాపణలు కూడా కోరాడు. కామ్రా విమానంలో కొంత విసుగు కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. కానీ అతన్ని బ్యాన్ చేసే అంత అసభ్యకరంగా ప్రవర్తించలేదు’ అంటూ కమెడియన్‌కు మద్దతుగా లేఖలో పేర్కొన్నారు. తన 9 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ఘటన జరగలేదని పైలట్ తెలిపారు. (అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్) Captain Rohit Mateti ko mera salaam 🙏🙏🙏 — Kunal Kamra (@kunalkamra88) January 31, 2020 కాగా దీనిపై స్పందించిన కమెడియన్ కునాల్..‘నేను కెప్టెన్ రోహిత్ మాటేటికి నమస్కారం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక పైలట్ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించి.. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, ఇందుకు అంతర్గత కమిటీ దర్యాప్తును ప్రారంభించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. -
నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో తన పాత విమానాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి కొత్త ‘ఏ 320 నియో’ విమానానికి.. అన్మోడిఫైడ్ ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లను కలిగిన పాత విమానాలను నిలుపుచేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. ఇక వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 97 ఏ 320 నియో విమానాల్లో పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాల్సిందేనని ఇటీవలే డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గడువుతేదీ లోపు మార్చకపోతే వీటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు
ఎయిర్‌పోర్టు (గన్నవరం): గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్‌కు విమాన సర్వీస్‌లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్‌జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ముందుకువచ్చాయి. అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. స్పైస్ జెట్ వైజాగ్ సర్వీస్.. స్పైస్‌జెట్ సంస్థ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌కు ఇండిగో నాలుగో సర్వీస్.. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్‌లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్‌ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది. -
రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం
సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్ రూట్లలోనూ డైరెర్ట్ ఫ్లైట్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది. ఇక అగర్తలా, దిబ్రూగఢ్ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబె-దిబ్రూగఢ్ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
ఇండిగోకు మరో షాక్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ, ప్రమోటర్ల వివాదంతో చిక్కుల్లో పడిన ఇండిగోకు మరో షాక్ తగిలింది. ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) ఇండిగో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీజీసీఏ ప్రత్యేక ఆడిట్ బృందం భద్రతా లోపాలను గుర్తించిన నేపథ్యంలో నలుగురు సీనియర్ ఉద్యోగులకు శుక్రవారం నోటీసులిచ్చింది. ట్రైనింగ్ హెడ్ కెప్టెన్ సంజీవ్ భల్లా, చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ కెప్టెన్ హేమంత్ కుమార్, ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషీమ్ మిత్రా, క్యూఏ (క్వాలిటీ అస్యూరెన్స్) కెప్టెన్ రాకేశ్ శ్రీవాస్తవలకు ఈ నోటీసులిచ్చింది. విమానాల ల్యాండింగ్ ప్రమాదాల సంఘటనల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు , విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 8, 9తేదీల్లో గుర్గావ్లోని ఇండిగో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రధాని జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్ మరోవైపు ఇండిగో ప్రమోటర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కో ప్రమోటర్ రాహుల్ భాటియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీకి లేఖ రాసిన ఇండిగో ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. సంస్థ ఎదుర్కొంటున్న కార్పొరేట్ పాలన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. -
ఇండిగో ఫౌండర్ల విభేదాలు : షేరు పతనం
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సంక్షోభం వివాదం ఇంకా ఒక కొలిక్కిరాకముందే మరో దేశీ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇండిగో కో ఫౌండర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరుపై మార్కెట్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్యా తీవ్ర విభేదాల పొడసూపాయి. నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అంశంతోపాటు షేర్ హోల్డర్స్ ఒప్పందంలో కొన్ని క్లాజెస్ విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయట మరోవైపు జెట్ ఎయిర్వేస్ మూసివేసిన తరువాత ఇబ్బందుల్లో ఉన్న భారతీయ వైమానిక రంగానికి భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్ మార్కెట్ కలిగిన ఇండిగో సంక్షోభం ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా గత ఏడాది కంపెనీ సీఈవోగా ఆదిత్య ఘోష్ నియామకం తర్వాతనుంచి వీరి మధ్య వ్యవహారం చెడినట్టు సమాచారం. కీలక ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలతోపాటు నిర్వహణ స్థానాల్లోని ప్రవాస భారతీయుల నియామకాలపై విభేదాలున్నాయట. అంతేకాదు ఈ వ్యవహారం బహిర్గతం కాకమందే పరిష్కరించుకునే దిశగా జెఎస్‌ఏలా, ఖైతాన్ & కో సంస్థలను నియమించుకున్నారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. వార్తలపై ఇండిగో ఫౌండర్లు రాహుల్, గంగ్వాల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ వార్తలతో గురువారంనాటి మార్కెట్లో ఇండిగో షేరు 7శాతం పతనమైంది. మార్చి 31 నాటికి ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌లో రాహుల్ భాటియాకు, 38 శాతం వాటా, గాంగ్వాల్‌కు 37 శాతం వాటా ఉంది. 2006 లో భాటియా, గాంగ్వాల్ ఇండిగోను స్థాపించారు, 2013లో కంపెనీ లిస్టింగ్ నాటికి ఇండిగోలో ప్రమోటర్లిద్దరూ 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. కాగా సీఈఓగా ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో ఇండిగో సంస్థకు నూతన సీఈఓగా రొణొజాయ్ దత్తా నియమితులయ్యారు. -
ఇండిగోకు ఏమైంది? మరో 32 విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా32 విమానాలను రద్దు చేసింది.పైలట్ల కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడిందని విమాన్రాశయ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌నుంచి బయలు దేరాల్సిన విమానాలను రద్దు చేసింది. శనివారం15, ఆదివారం 7విమానాలను రద్దు చేయగా, సోమవారం 32 విమాన సర్వీసులను రద్దు చేసిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఇండిగో వాదన మరోలా ఉంది. ఉత్తర ఇండియాలో సంభవించిన తీవ్ర వడగళ్లవానతో ఫిబ్రవరి 7,11 తేదీల్లో అనేక విమాన సర్వీసులను దారిమళ్లించాల్సి వచ్చిందని దీంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే షెడ్యూల్‌ను పునరుద్ధరించడం, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో కొన్ని విమానాలను రద్దు చేయాల్సివచ్చిందని తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పుణే వెళ్లవలసిన ఇండిగో విమానం శనివారం అయిదు గంటలకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. పైలెట్ విధులకు హాజరు కాకపోవడంతో తెల్లవారుఝామున 4గంటల బయలు దేరాల్సిన విమానం ఉదయం 9.30 నిమిషాలకు బయలుదేరింది. మరో విమానం కోసం గంటముందు విధులకు హాజరైన పైలెట్‌ను సర్దుబాటు చేశారు. దీంతో హైదారాబాద్ విమానాశ్రయంలో180 మందికి పైగా ప్రయాణికులు ఇండిగో విమానంలో పడిగాపులు కాచారు. అటు సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ కూడా ఆదివారం 10 విమానాలను రద్దు చేసింది. నిర్వాహణ వ్యవహారాల కారణంగా వీటిని నిలిపివేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఒక్క ముంబై విమానాశ్రయం నుంచే దాదాపు 10 సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం. దీంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. -
ఇండిగో దివాలీ సేల్ : 10లక్షల టికెట్లపై డిస్కౌంట్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో దీపావళి ఆఫర్ ప్రకటించింది. పండుగ వేడుకల్లో భాగంగా మూడు రోజుల దీపావళి ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. అక్టోబర్ 24-26వరకు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 40శాతం డిస్కౌంట్‌తో 10లక్షల సీట్లను కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించింది. అన్ని చార్జీలు కలిపి రూ. 899 ప్రారంభ ధరలో టికెట్లను అందిస్తోంది. ఇండిగో నెట్‌వర్క్‌లో మొత్తం 64 ప్రాంతాలకు ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. ఇలా బుక్ చేసుకున్నటికెట్లు నవంబరు 8,2018 -ఏప్రిల్ 15,2019 మధ్య ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి. తమ కస్టమర్ల సౌలభ్యం, సంతోషం కోసం మూడు రోజుల దివాలీ స్పెషల్ సేల్‌ను ప్రారంభించామని ఇండిగో కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. దేశీయంగా రూ.899, అంతర్జాతీయ మార్గాల్లో రూ. 3399 ప్రారంభ ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు తెలిపారు. కుటుంబాలు, స్నేహితులను కలుసుకునే సందర్భం దీపావళికి తక్కువ ధరల్లో టికెట్లను అందించడం ద్వారా తమ కస్టమర్లకు మంచి అనుభవాన్ని మిగులుస్తుందన్నారు. చాలా తొందరగా వినియోగదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
ఇండిగో ఇండిపెండెన్స్ డే సేల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఇతర విమానయాన సంస్థలు డిస్కౌంట్ స్కీమ్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండిగో కూడా రూ. 981కే విమాన టికెట్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో పరిమితకాల ఆఫర్ కింద పరిమిత సీట్లను అందిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 15లోపు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా బుక్ చేసుకున్నటికెట్ల ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. వెబ్సైట్ అందించిన సమాచారం శ్రీనగర్, జమ్ము మధ్య రూ.981 టికెట్‌ను అందిస్తుండగా హైదరాబాద్-అహ్మదాబాద్ (రూ.1,992), హైదరాబాద్-లక్నో (రూ.2,456), కోల్‌కతా-బెంగళూరు (రూ .3,634), కోలకతా-భువనేశ్వర్ (రూ .1,379), కోలకతా-ఢిల్లీ (రూ. 2,836), కోలకతా-హైదరాబాద్ (రూ.2,594) ముంబై-బెంగళూరు (రూ.1,748), ముంబై-ఢిల్లీ (రూ .2,255), బెంగళూరు-ఢిల్లీ (రూ .2,929) అహ్మదాబాద్-బెంగళూరు (రూ.2,078), అహ్మదాబాద్-ఢిల్లీ (రూ.1,415), బాగ్డోగ్ర-కోల్‌కతా (రూ .1,613), బెంగళూరు-గోవా (రూ.1,782), బెంగళూరు-గోవా (బెంగళూరు) రూ.1,782), గౌహతి-కోల్‌కతా (రూ .1,793) ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. -
అదనపు బ్యాగేజీపై ఇక ఛార్జీల బాదుడే
న్యూఢిల్లీ : దేశీయ విమానాల్లో 15 కేజీల కంటే అదనంగా చెక్-ఇన్ బ్యాగేజీ తీసుకెళ్తున్నారా? అయితే ఇక మీకు ఛార్జీల మోత మోగినట్టేనట. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌లు అదనపు బ్యాగేజీల ప్రీ-బుకింగ్ ఛార్జీలను, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెల్లించే అదనపు చెక్-ఇన్ బ్యాగేజీల ఛార్జీలను పెంచేశాయి. ఎయిర్‌పోర్టుల వద్ద 15 కేజీలకు మించి అదనపు బ్యాగేజీని తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపితే, ఒక్కో కిలోకు ప్రస్తుతం 400 రూపాలను ఛార్జ్ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇండిగో అదనపు బ్యాగేజీ ఛార్జీలను మూడో వంతు లేదా 33 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీ-బుకింగ్ చేసుకునేటప్పుడు దేశీయ ప్రయాణికులు ఉచితంగా అందించే 15 కేజీలను మించి మరో 5, 10, 15, 30 కేజీలను తీసుకెళ్తున్నట్టు నమోదు చేస్తే, ఇక నుంచి రూ.1900, రూ.3800, రూ.5700, రూ.11,400ను చెల్లించాల్సి ఉంటుంది. గత ఆగస్టులోనే ఇండిగో ఈ ఛార్జీలను పెంచింది. తాజాగా మరోసారి కూడా వీటిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక స్పైస్‌జెట్ సైతం 5, 10, 15, 20, 30 కేజీల అదనపు బ్యాగేజీకి విధించే ప్రీబుక్ ఛార్జీలను రూ.1600, రూ.3200, రూ.4800, రూ.6400, రూ.9600కు పెంచుతున్నట్టు తెలిపింది. ఎవరైతే ప్రీబుక్ చేసుకోరో వారు అదనపు చెక్-ఇన్ బ్యాగేజీకి ఒక్కో కిలోకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గోఎయిర్ అదనపు బ్యాగేజీ ఛార్జీలు అచ్చం ఇండిగో మాదిరిగానే ఉన్నాయి. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే 25 కేజీల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా అనుమతి ఇస్తోంది. గతేడాది ఆగస్టు వరకు ఎయిర్‌లైన్స్ అన్నీ 15 కేజీలకు మించి.. తొలి ఐదు కిలోల అదనపు బ్యాగేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎయిర్‌లైన్స్ నడుచుకునేవి. కానీ డీజీసీఏ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన ఎయిర్‌లైన్స్, 15 కేజీలకు మించిన తర్వాత విధించే అదనపు బ్యాగేజీ ఛార్జీలను అవి మాత్రమే నిర్ణయించుకునేలా ఆదేశాలను తెచ్చుకున్నాయి. -
ఇండిగో ప్రెసిడెంట్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. 2008 నుండి అధ్యక్షపదవిలో కొనసాగిన ఆదిత్య ఘోష్ తన పదవికా రాజీనామా చేశారు. దీంతో పదేళ్ళపాటు సంస్థతో కలిసిచేసిన ఘోష్‌తో అనుబంధం జూలై 31వ తేదీతో ముగియనుంది. అలాగే ఇండిగో ప్రెసిడెంట్, సీఈవో పదవికి వైమానిక రంగ నిపుణుడైన గ్రెగర్ టేలర్ పేరును పరిశీలిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరోవైపు రాహుల్ భాటియాను మధ్యంతర సీఈవో గా నియమించినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే రాజీనామాకు గల కారణాలను అటు ఘోష్ గానీ, ఇటు ఇండిగో సంస్థ వెల్లడి చేయలేదు. సమీప భవిష్యత్తులో "తరువాతి అడ్వెంచర్" కు అధిరోహించనున్నానని మాత్రం ఘోష్ వ్యాఖ్యానించారు. 2007 మే 30 న ఘోష్ సీనియర్ అడ్వైజర్‌గా ఇండిగో బోర్డులో చేరారు.