Infrastructure sector
-
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
మౌలికం 6.3 శాతం అప్
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి మే నెలలో 6.3 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గతేడాది ఇదే నెలలో ఇన్ఫ్రా రంగ వృద్ధి 5.2 శాతం. మరోవైపు, ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతంతో పోలిస్తే గత నెలలో వృద్ధి మందగించడం గమనార్హం. ఎరువులు, క్రూడాయిల్, సిమెంటు రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది కీలక మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో.. బొగ్గు ఉత్పత్తి 10.2 శాతం, సహజ వాయువు 7.5 శాతం, విద్యుదుత్పత్తి 12.8 శాతంగా నమోదైంది. 2023లో ఇదే నెలలో ఇవి వరుసగా 7.2 శాతం, (–) 0.3 శాతం, 0.8 శాతంగా ఉన్నాయి. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ వృద్ధి రేటు 0.5 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 7.6 శాతానికి మందగించింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, దశలవారీగా సుదీర్ఘ సమయం పాటు పార్లమెంటు ఎన్నికలు జరగడం వంటి అంశాలు కొన్ని రంగాల్లో కార్యకలాపాలపై ప్రభావం చూపి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌కి భారీ డిమాండ్ నెలకొందని, ఏప్రిల్‌తో పోలిస్తే మే లో బొగ్గు, విద్యుత్ రంగాల వృద్ధికి ఇది దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. మే నెలలో ఐఐపీ వృద్ధి 4–5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నాయర్ చెప్పారు. -
ప్రాజెక్టులపై రూ.4.4 లక్షల కోట్ల అదనపు భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి 421 ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా వ్యయం రూ.4.40 లక్షల కోట్ల మేర పెరిగినట్టు కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదిక తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూ.150 కోట్లు అంతకుమించి నిర్మాణ వ్యయంతో కూడినవి కావడం గమనార్హం. మొత్తం1,831 ప్రాజెక్టులకు గాను 421 ప్రాజెక్టులు పెరిగిపోయిన వ్యయాలతో నత్తనడకన సాగుతుంటే, 845 ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమైనట్టు తెలిపింది. ‘‘మొత్తం 1,831 ప్రాజెక్టుల అసలు నిర్మాణ వ్యయం అంచనా రూ.25.10 లక్షల కోట్లు కాగా, వీటి నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 29.51 లక్షల కోట్లుగా ఉంటుంది. దీనివల్ల నిర్మాణ వ్యయ భారం 17.54 శాతం మేర అంటే, రూ.4.40 లక్షల కోట్లు పెరిగింది’’అని వివరించింది. 2023 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.15.58 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం అంచనాలో 53 శాతం వ్యయం చేశారు. ఆలస్యమైన 845 ప్రాజెక్టుల్లో 204 ప్రాజెక్టులకు సంబంధించి జాప్యం 1–12 నెలల మధ్య ఉంటే, 198 ప్రాజెక్టులు 13–24 నెలల ఆలస్యంగా, 322 ప్రాజెక్టులు 25–60 నెలలు, 121 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా జాప్యంతో కొనసాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, మౌలిక సదుపాయాల మద్దతు లేకపోవడం సకాలంలో నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి, వ్యయాలు పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
మౌలికానికి రూ.60,000 కోట్ల రుణ వితరణ
ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్‌ఫిడ్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ వెల్లడించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్‌పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు. ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లకు నాబ్‌ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది. ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు. -
ఎన్పీఏల తగ్గింపునకు ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు
న్యూఢిల్లీ: నిరర్థక రుణాలను (వసూలు కానివి/ఎన్పీఏలు) కట్టడి చేయడంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) తీసుకున్న చర్యలు, పని తీరును పార్లమెంటరీ ప్యానెల్ అభినందించింది. ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు ఎన్పీఏలను నియంత్రిస్తాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా తన సేవలను అందించడానికి వీలు పడుతుందని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది. ఐఐఎఫ్‌సీఎల్ అనేది మౌలిక రంగానికి రుణ వితరణ కోసం 2006 జనవరిలో కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఇటీవలే పార్లమెంట్‌కు సమర్పించింది. ఐఐఎఫ్‌సీఎల్ తీసుకున్న చర్యలు దీర్ఘకాలంలో సంస్థ బలోపేతానికి సాయపడతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎన్పీఏల పరిష్కారానికి బోర్డు ఆమోదిత మేనేజ్మెంట్ పాలసీని అమల్లో పెట్టడాన్ని ప్రస్తావించింది. -
ఆతిథ్య రంగానికి ఇన్ఫ్రా హోదా: హోటల్స్ యాజమాన్యాల డిమాండ్
ఆతిథ్య రంగం (హోటల్స్) తమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక రంగం) హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ఆర్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ నిబంధనల కింద దీర్ఘకాలానికి నిధులను పొందే వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. పర్యాటకం, హాస్పిటాలిటీకి (ఆతిథ్యం) పరిశ్రమ హోదాను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినప్పటికీ.. కావాల్సిన ప్రోత్సాహకాలు, అధికారాలు ఈ రంగానికి రావడం లేదని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్బీఐ నిబంధనల కింద దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు పరిశ్రమకు భారత ప్రభుత్వం ద్వారా మౌలిక రంగం హోదా కావాలని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ జనరల్ జైసన్ చాకో పేర్కొన్నారు. దీనివల్ల నాణ్యమైన వసతి సదుపాయాల సరఫరా పెరుగుతుందని, దేశీ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్‌ను పెంచుతుందని చాకో అభిప్రాయపడ్డారు. పర్యాటకాన్ని జాతీయ ఏజెండాగా మార్చేందుకు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఆతిథ్యాన్ని చేర్చాలని పరిశ్రమ కోరింది. దేశంలో ఆతిథ్య పరిశ్రమ సమగ్రాభివృద్ధికి వీలుగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, అమలుకు గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. వచ్చే బడ్జెట్లో కనీస ప్రత్యామ్నాయ పన్ను విషయంలో 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వెసులుబాటు కల్పించాలని పశ్చిమ భారత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రదీప్ షెట్టీ డిమాండ్ చేశారు. దీనివల్ల పన్నుల భారం తగ్గి, హోటల్ పరిశ్రమకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
వేగవంత అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్‌గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. విధిలో బాధ్యతగా మెలగండి నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్‌గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్ఐపీ కీలక పాత్ర పోషించనుంది. ► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్ఐపీ, ఇప్పుడు 34 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. ► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. ► ఎన్ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్ఏబీఎఫ్ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది. ► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం. ► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు. -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
మందగించిన మౌలికం.. తొమ్మిది నెలల కనిష్ట స్థాయి, కారణం ఇదే
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఆగస్టులో మందగించింది. 3.3 శాతానికి పరిమితమైంది. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. చివరిసారిగా 2021 నవంబర్‌లో వృద్ధి 3.2 శాతంగా ఉండగా, గతేడాది ఇదే వ్యవధిలో 12.2 శాతంగాను నమోదైంది. ఈ ఏడాది జూలైలో ఇది 9.8 శాతంగా ఉంది. ఆగస్టులో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి 0.9 శాతం క్షీణించింది. గతేడాది ఆగస్టులో 3.1 శాతం క్షీణించిన ఎరువుల ఉత్పత్తి 11.9 శాతం పెరిగింది. బొగ్గు ఉత్పత్తి 7.6 శాతానికి, రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 7 శాతానికి, ఉక్కు (2.2%), సిమెంట్ (1.8 శాతం), విద్యుత్ (0.9 శాతం) విభాగాలు మందగించాయి. బేస్ సాధారణ స్థాయికి తిరిగి వస్తుండటం, భారీ వర్షాల కారణంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు నిల్చిపోవడం, విద్యుత్‌కి డిమాండ్ తగ్గడం తదితర అంశాలు ఆగస్టులో మౌలిక రంగాల వృద్ధిని దెబ్బతీసినట్లు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు పెట్టుకుంది. స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడంతో పాటూ సులభతర ఆర్థిక లభ్యత, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివి ప్రకటించి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి చేదోడుగా నిలవాలని పరిశ్రమ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. నివాస విభాగంలో డిమాండ్‌ను పెంచాలంటే పలు కీలక ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. అందులోని పలు కీలకాంశాలు.. అఫర్డబుల్ హౌసింగ్ ధరలలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆస్తి పరిమాణం, ధర, కొనుగోలుదారుల ఆదాయం ఆధారంగా అందుబాటు గృహాల నిర్వచనాన్ని కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ నిర్వచించింది. నాన్-మెట్రోపాలిటన్ సిటీలు, నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ 90 చ.మీ. వరకు కార్పెట్ ఏరియాతో ఉండాలి. ప్రధాన నగరాల్లో అయితే 60 చ.మీ. కార్పెట్ ఏరియా. ఈ రెండింటికీ ధర రూ.45 లక్షల లోపు ఉండాలి. రానున్న బడ్జెట్లో ఈ విభాగాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది కస్టమర్లు ఈ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే నగరాల వారీగా ధరల పరిమితులను సవరించాల్సిన అవసరం ఉంది. 90, 60 చ.మీ. కార్పెట్ ఏరియా యూనిట్ల పరిమాణం బాగానే ఉన్నప్పటికీ.. ధర రూ.45 లక్షలు అనేది చాలా నగరాలలో ఆచరణయోగ్యంగా లేవు. ఉదాహరణకు ముంబైలో రూ.45 లక్షల బడ్జెట్ అనేది చాలా తక్కువ అందుకే దీన్ని రూ.85 లక్షలకు పెంచాలి. ఇతర నగరాల్లో రూ.60-65 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. ధరల సవరణతో ఎక్కువ గృహాలు అఫర్డబులిటీ కిందకి వస్తాయి. దీంతో కొనుగోలుదారులు 1 శాతం జీఎస్టీ, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు వంటి బహుళ ప్రయోజనాలను పొందుతారు. పెద్ద మొత్తంలో అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించేందుకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను కేటాయించాలి. భారీ పరిశ్రమల శాఖ, రైల్వేలు, పోర్ట్ ట్రస్ట్‌లు మొదలైన వాటి పరిధిలోకి వచ్చే నగరాల్లోని కొన్ని భూములను సంబంధిత ప్రభుత్వ సంస్థలు విడుదల చేయాలి. తక్కువ ధరతో భూమి లభ్యత పెరిగితే ప్రాపర్టీ ధరలను నియంత్రించవచ్చు. గత బడ్జెట్లో అందించిన అఫర్డబుల్, అద్దె గృహాల రుణాలపై రూ.1.5 లక్షల అదనపు మినహాయింపు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించాలి. దీంతో ఈ విభాగంలో సరఫరా పెరుగుతుంది. అనరాక్ నివేదిక ప్రకారం గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలోని మొత్తం గృహాల సరఫరాలో 26 శాతం అఫర్డబుల్ హౌసింగ్లే ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ రేట్లపై రూ.2 లక్షల పన్ను రాయితీని రూ.5 లక్షలకు పెంచాలి. పన్ను రేట్లలో కోత లేదా సవరించిన పన్ను శ్లాబ్‌ల ద్వారా వ్యక్తిగత పన్ను ఉపశమనం ప్రకటించాలి. ప్రత్యేకించి సెక్షన్ 80సీ(ఏడాదికి రూ.1.5 లక్షలకు) కింద తగ్గింపు పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. రానున్న బడ్జెట్లో ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు!) -
మౌలికానికి మరింత బూస్ట్!
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధుల వెసులుబాటుకు కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్(డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలు కల్పించే బిల్లును కేబినెట్ మంగళవారం అనుమతించింది. తద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. ప్రభుత్వం 2025 కల్లా మౌలిక రంగంలో రూ. 111 లక్షల కోట్లను వెచ్చించాలని ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20,000 కోట్ల పెట్టుబడులతో డీఎఫ్ఐ ఏర్పాటుకు ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రతిపాదిత డీఎఫ్ఐ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించడం సంతోషదాయకమని సీతారామన్ పేర్కొన్నారు. తొలి దశ పెట్టుబడిని ప్రభుత్వం సమకూర్చనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. పన్ను రాయితీలు రానున్న కొన్నేళ్లలో డీఎఫ్ఐ ద్వారా మార్కెట్ల నుంచి రూ.మూడు లక్షల కోట్లను సమీకరించే యోచనలో ఉన్నట్లు సీతారామన్ తెలియజేశారు. డీఎఫ్ఐకు పదేళ్లపాటు పన్ను రాయితీలు అమలుకానున్నట్లు వెల్లడించారు. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి ద్వారా పెన్షన్ ఫండ్స్, సావరిన్ ఫండ్స్ తదితర భారీ సంస్థల నుంచి నిధులను సమకూర్చుకోగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వృత్తినిపుణులతో కూడిన బోర్డు డీఎఫ్ఐ నిర్వహణను చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. బోర్డులో కనీసం 50 శాతం అనధికార డైరెక్టర్లుంటారని వెల్లడించారు. ఆయా రంగాలలో నైపుణ్యమున్న సుప్రసిద్ధ వ్యక్తులతో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. చైర్మన్‌ను సైతం ఇదే విధంగా ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. గతంలోనూ డీఎఫ్ఐ తరహా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఐడీబీఐ తదితరాలు విభిన్న కారణాలతో ఇతర బిజినెస్ కార్యకలాపాల్లోకి మళ్లినట్లు వివరించారు. చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్! -
6వ నెలా... మైనస్‌లోనే మౌలిక రంగం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వరుసగా ఆరవనెల కూడా క్షీణతలోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 8.5 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. అంటే 2019 ఆగస్టులో జరిగిన ఉత్పత్తితో పోల్చిచూస్తే, 2020 ఆగస్టులో ఈ రంగాల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 8.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజ్ ఉన్న ఎనిమిది రంగాల పనితీరును వేర్వేరుగా పరిశీలిస్తే.... ► బొగ్గు (3.6 శాతం), ఎరువులు (7.3 శాతం) వృద్ధి బాటన నిలిచాయి. ► క్రూడ్ ఆయిల్ (–6.3%), సహజ వాయువులు (–9.5 %), రిఫైనరీ ప్రొడక్టులు (19.1%), స్టీల్ (–6.3 %), సిమెంట్ (–14.6 శాతం) విద్యుత్ (–2.7 శాతం) క్షీణతలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ...: కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో చూస్తే, ఈ గ్రూప్ ఉత్పత్తి 17.8 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కనీసం 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పట్లో అంత తక్కువ వృద్ధి తీరుకు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రధాన కారణం. 2019 ఆగస్టులో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 0.2 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
మౌలిక రంగం డౌన్
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్‌లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్‌లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది. -
ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు. మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్లకు ఇది అదనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయన్నారు. ఇంధన రంగంలో రూ.25 లక్షల కోట్ల ప్రాజెక్టులు రానున్నాయని, రోడ్ల నిర్మాణంలో రూ.20 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రానున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (దాదాపు రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన, రోడ్లు, రైల్వేకు పెద్దపీట కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల్లో ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు అగ్ర ప్రాధాన్యం లభించింది. ‘‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (ఎన్ఐపీ) కింద గుర్తించిన రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం సమన్వయంతో ఎన్ఐపీ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ఉపాధి కల్పన, జీవన సౌఖ్యం కలగడంతోపాటు, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రావడం వల్ల సమగ్ర వృద్ధికి వీలు పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి విడత వార్షిక అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం వచ్చే ఏడాది ద్వితీయ భాగంలో ఉంటుందని తెలిపారు. -
రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ బయటపెట్టిన కుంభకోణం ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోగస్ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించడం సంచలనంగా మారింది. ప్రముఖుడంటూ చేసిన ప్రకటనలోని వ్యక్తి ఎవరా అనేది ఉభయ రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బోగస్ బిల్లులు, హవాలా లావాదేవీలతో సంబంధం ఉన్న సదరు ప్రముఖ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో (2014–2019) కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆ కీలక వ్యక్తికి రూ. 150 కోట్లు చేరినట్లు ఆధారాలు ఉన్నాయని ఆదాయపన్నుశాఖ అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. హవాలా వ్యాపారులకు, సదరు కీలక వ్యక్తికి ఉన్న సంబం ధాలు కూడా తమ దాడుల సందర్భంగా వెల్లడయ్యాయని ఆ అధికారి చెప్పారు. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల పనుల పేరుతో బోగస్ బిల్లులు పెట్టి భారీగా డబ్బు దోచేసిన వారి వివరాలను వీలైనంత త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య జరిగిన దాడులే కీలకం... షెల్ కంపెనీలు సృష్టించడం, బోగస్ బిల్లులతో నిధులు కాజేయడం వంటివి బయటకు రావడానికి ముందు ఆదాయపన్నుశాఖ పెద్ద కసరత్తే చేసింది. అనుమానం ఉన్న వారందరిపైనా దాడులు చేస్తూ వచ్చింది. అవన్నీ 2018 జూన్–డిసెంబర్, 2019 ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య జరిగినవే. ఐటీశాఖ దాడులు ఎదుర్కొన్న వారంతా అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములు లేదా సన్నిహితులైన వారే కావడం గమనార్హం. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీలు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌కు సంబంధించిన అకౌంటెంట్‌తోపాటు అప్పటి పోలవరం కాంట్రాక్టు సంస్థ సహా అనేక కంపెనీలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో బహిర్గతమైన సమాచారం ఆధారంగానే నవంబర్ మొదటి వారంలోనూ ఏపీ, తెలంగాణలో మరికొన్ని సోదాలు జరిగాయి. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లు ఎగవేసిన ఆరోపణల కేసులో సుజనా చౌదరికి చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొని ఆ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో హవాలా వ్యాపారుల పాత్రను గుర్తించింది. ఆ క్రమంలోనే నవంబర్ మొదటి వారంలో ఏపీ, తెలంగాణలో ఆదాయపన్నుశాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. హవాలా ద్వారా ఏపీలో ప్రముఖ వ్యక్తికి రూ. 150 కోట్లు చేరవేసిన వ్యవహారాన్ని ఈ దాడుల్లో పసిగట్టింది. ‘ఆదాయపన్నుశాఖ దాడుల ఫలితంగా తమ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఆదాయపన్నుశాఖ దాడుల సమయంలో పోలీసు భద్రత ఇవ్వబోమని ప్రకటించింది’అని ఢిల్లీలో ఈడీ అధికారి ఒకరు గుర్తుచేశారు. కాంట్రాక్టు పనులు, బిల్లులు గత ప్రభుత్వంలోనివే... మౌలిక వసతుల రంగంలోని కొన్ని కంపెనీలు బోగస్ కాంట్రాక్టు బిల్లులతో భారీ ఎత్తున నగదు సమకూర్చుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే కాంట్రాక్టు పనులు, బోగస్ బిల్లులన్నీ 2019కి పూర్వం ఉన్న ప్రభుత్వాల్లో జరిగినవేనని తేలికగా అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఎంట్రీ ఆపరేటర్లు (కాంట్రాక్టర్లు), లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా నగదుగా మార్చుకున్న సంగతి బయటపడింది. బోగస్ బిల్లులతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో ఉన్నట్లు వెల్లడించిన సీబీడీటీ... ఆంధ్రప్రదేశ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. బోగస్ బిల్లులతో సంబంధం ఉన్నవారు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖుడికి రూ. 150 కోట్ల నగదు సమకూర్చిన సాక్ష్యాలు ఇప్పుడు ఆదాయపన్నుశాఖ వద్ద ఉన్నాయి. బోగస్ బిల్లులు, హవాలా చెల్లింపులన్నీ ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందు జరిగినవేనని తేటతెల్లమమవుతోంది. ప్రముఖ పత్రికాధిపతి వియ్యంకుడి కంపెనీకి రూ. 5 వేల కోట్ల విలువైన భారీ కాంట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా గత ప్రభుత్వం రూ. 750 కోట్ల మేర మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వ్యవహారంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఐటీశాఖ గుర్తించింది. ఈ కంపెనీ కార్యాలయాలపై 2018లోనే ఆదాయపన్నుశాఖ రోజుల తరబడి దాడులు నిర్వహించింది. అనేక అక్రమ లావాదేవీలతోపాటు వందల సంఖ్యలో షెల్ కంపెనీలను ఆ కంపెనీ సృష్టించినట్లు వెల్లడించింది. పోలవరం ఏటీఎం అన్న ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మమిదే... పోలవరం కాంట్రాక్టు సంస్థపై పలు పర్యాయాలు దాడులు నిర్వహించిన ఆదాయపన్నుశాఖ... అనేక అక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి 2018 డిసెంబర్లో నివేదిక సమర్పించింది. నిర్దేశిత అంచనా కంటే ఎక్కువ మొత్తానికి పనులు అప్పగించడం, భారీగా మొబిలైజేషన్ అడ్వాన్సుల నిధులు ఇవ్వడం మొదలుకొని అనేక అక్రమ లావాదేవీలు దాడుల్లో వెలుగులోకి వచ్చాయని అత్యున్నతస్థాయి అధికారి ఒకరు ఇచ్చిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. సదరు కంపెనీ నుంచి ప్రభుత్వంలో ముఖ్యులకు హవాలా ద్వారా భారీగా నగదు చేరిందన్న విషయాన్ని ఐటీశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి సభలో పోలవరం ప్రాజెక్టును కొందరు ఏటీఎంలా వాడుకుంటున్నారన్న సంగతిని బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది. -
‘మౌలిక’రంగం తిరోగమనంలోనే...
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా – 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్‌లోనే... ► బొగ్గు (–20.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–5.4 శాతం), సహజ వాయువు (–4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–6.7 శాతం), సిమెంట్ (–2.1 శాతం), స్టీల్ (–0.3 శాతం) విద్యుత్ (–3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2018 సెప్టెంబర్‌లో ఈ 8 పరిశ్రమల వృద్ధిరేటు 4.3%. ► కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే– ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది. ► పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం. -
మౌలిక రంగంపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: రైల్వేలు, రహదారులు, విమాన, నౌకాశ్రయాలు, గృహ నిర్మాణం సహా వివిధ కీలక మౌలిక రంగ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్న తీరును నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సహా పలువురు ఉన్నతాధికారులు మోదీకి వివరించారు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సగటున రోజుకు 11.67 కి.మీ.ల రోడ్డు నిర్మాణం జరగ్గా, 2017–18లో అది 26.93 కి.మీ.లకు పెరిగినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. 2014–18 మధ్య కాలంలో ప్రధాన మంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద 44 వేల గ్రామాలకు రోడ్లు నిర్మించామనీ, అంతకు ముందటి నాలుగేళ్లలో ఈ సంఖ్య 35 వేలుగా ఉందని పీఎంవో వెల్లడించింది. ప్రస్తుతం రహదారులపై 22 శాతం టోల్‌ఫీజులు ఎలక్ట్రానిక్ చెల్లింపుల పద్ధతిలో వస్తున్నట్లు అధికారులు మోదీకి చెప్పగా, డిజిటల్ చెల్లింపులను మరింత పెంచాలని ఆయన ఆదేశించారు. -
మౌలిక రంగం డౌన్... తయారీ జూమ్!
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు మే లో పది నెలల కనిష్టానికి పడిపోయింది. 3.6 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, సహజవాయువు ఉత్పత్తి క్షీణించడమే ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది మే లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి 3.9 శాతంగా ఉంది. 2017 జూలై తర్వాత మౌలిక రంగం వృద్ధి ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం. అప్పట్లో ఇది 2.9 శాతంగా నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.6 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మే తో పోలిస్తే తాజాగా ఈ ఏడాది మేలో క్రూడాయిల్ ఉత్పత్తి 2.9 శాతం, సహజవాయువు ఉత్పత్తి 1.4 శాతం మేర క్షీణించింది. అటు రిఫైనరీ ఉత్పత్తుల తయారీలో వృద్ధి రేటు 4.9 శాతానికి (గతేడాది మేలో 5.4 శాతం), ఉక్కు 0.5 శాతానికి (3.8 శాతం), విద్యుదుత్పత్తి 3.5 శాతానికి (గత మేలో 8.2%) పరిమితమైంది. అయితే బొగ్గు 12.1%, ఎరువుల ఉత్పత్తి 8.4% వృద్ధి కనపర్చాయి. తయారీకి డిమాండ్ జోష్... ఇటు దేశీయంగాను, అటు విదేశాల నుంచి ఆర్డర్ల రాకతో జూన్‌లో తయారీ రంగం ఊపందుకుంది. తయారీ రంగ కార్యకలాపాల వృద్ధిని నమోదు చేసే నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) 53.1 పాయింట్లకు చేరడం దీనికి నిదర్శనం. మేలో ఇది 51.2గా ఉంది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇంత వేగవంతమైన వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమం. అలాగే, వరుసగా 11వ నెలలోనూ తయారీ రంగ పీఎంఐ కీలకమైన 50 పాయింట్లకు ఎగువన కొనసాగడం గమనార్హం. సాధారణంగా పీఎంఐ 50 పాయింట్లకు ఎగువన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. భారీ ఆర్డర్లు, డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని నివేదికను రూపొందించిన ఆర్థికవేత్త ఆష్నా దోధియా తెలిపారు. ఉత్పత్తి అవసరాలు పెరుగుతున్నందున తయారీ సంస్థలు కొనుగోలు కార్యకలాపాలు, అదనపు సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాయి. ధరలపరంగా చూస్తే ముడివస్తువుల రేట్లు పెరగడంతో.. ఉత్పత్తి వ్యయాలూ పెరిగాయి. -
మౌలిక రంగం వృద్ధి డౌన్!
♦ 2017 మేలో 3.6 శాతం ♦ క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధిరేటు 5.2 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరునూ వార్షికంగా పరిశీలిస్తే.... ♦ బొగ్గు: 6 శాతం వృద్ధి రేటు –3.3 క్షీణతలోకి జారిపోయింది. ♦ ఎరువులు: 6.2 శాతం వృద్ధి రేటు –6.5 శాతానికి క్షీణించింది. ♦ క్రూడ్ ఆయిల్: –3.3 క్షీణత నుంచి స్వల్పంగా 0.7 శాతం వృద్ధికి మారింది. ♦ సహజవాయువు: ఈ రంగం కూడా –6.5 శాతం క్షీణత నుంచి 4.5 శాతం వృద్ధికి మారింది ♦ రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. ♦ స్టీల్: 13.4 శాతం వృద్ధి 3.7 శాతానికి జారింది. ♦ సిమెంట్: వృద్ధి 2.7 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ♦ విద్యుత్: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది. కాగా నెలవారీగా చూస్తే మాత్రం వృద్ధి రేటు బాగుంది. ఏప్రిల్‌లో వృద్ధిరేటు 2.8 శాతంగా ఉంది. -
సెప్టెంబర్‌లో మౌలిక రంగం జోరు..!
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయ్యింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 38 శాతంగా ఉన్న ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే... ఊపు నిచ్చిన రంగాలు... రిఫైనరీ ప్రొడక్టులు: వార్షికంగా చూస్తే వృద్ధి 0.5% నుంచి 9.3%కి ఎగసింది. స్టీల్: వృద్ధి 16.3 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదయ్యింది. సిమెంట్: ఈ రంగంలో -1.6 శాతం క్షీణత 5.5 శాతం వృద్ధికి మారింది. వృద్ధి తగ్గినవి మూడు ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 18.3 శాతం నుంచి 2.0 శాతానికి పడిపోయింది. విద్యుత్: వృద్ధి 11.4 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది. క్షీణతలో... బొగ్గు: 2.1 శాతం వృద్ధి -5.8 శాతం క్షీణతలోకి జారింది. క్రూడ్ ఆయిల్: -0.1 శాతం క్షీణత నుంచి -4.1 శాతం క్షీణతకు పడిపోయింది. సహజవాయువు: ఈ రంగంలోనూ 0.9% వృద్ధి -5.5 శాతం క్షీణతకు మళ్లింది. ఆరు నెలల్లో... ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది. -
నాలుగేళ్లలో మౌలికంలోకి భారీ పెట్టుబడులు
♦ రూ.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తాయి ♦ 4 కోట్ల ఉద్యోగాల సృష్టి అవకాశం: గడ్కరీ న్యూఢిల్లీ: మౌలిక రంగంలోకి 2019 నాటికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విశ్వాసం వ్యక్తం చేశారు. దీనివల్ల దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల తక్షణ పునరుద్ధరణపై దృష్టి సారిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మౌలిక రంగం పురోభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ దాదాపు 21 ప్రధాన నిర్ణయాలు తీసుకుందంటూ... ‘‘ఈ రంగం వృద్ధి లక్ష్యాల మేరకు నమోదయితే.. 2019 నాటికి జీడీపీలో ఈ విభాగం వాటా గణనీయంగా పెరుగుతుంది. గడచిన రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టుల మంజూరయ్యాయి. కానీ వచ్చే రెండేళ్లలో కనీసం రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తాం. వ్యాపార నిర్వహణ, లాభదాయకతకు సంబంధించి 2014లో ఉన్న నిరాశాకర పరిస్థితులు మారుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల పునఃప్రారంభానికి ఇదే కారణమన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు పెట్టుబడుల విషయంలోనూ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని గడ్కరీ చెప్పారు. -
మౌలిక రంగం మెరుపు..
♦ మార్చిలో 6.4 శాతం వృద్ధి ♦ 16 నెలల గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదుచేసుకోకపోగా -0.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం. మార్చి ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో వెలువడతాయి. తాజా సమీక్ష నెలలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది. రంగాల వారీగా వేర్వేరుగా చూసే... దూసుకుపోయినవి... ♦ రిఫైనరీ ప్రొడక్టులు: 2015 మార్చి నెలలో ఈ రంగం -1.5 శాతం క్షీణతలో ఉంది. అయితే 2016 మార్చిలో భారీగా 10.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ♦ ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 5.2 శాతం నుంచి 22.9 శాతానికి ఎగసింది. ♦ స్టీల్: -6.5% క్షీణత నుంచి 3.4% వృద్ధికి మళ్లింది. ♦ సిమెంట్: ఈ రంగం కూడా -3.7 శాతం క్షీణత నుంచి 11.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ♦ విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా... ♦ కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) ఈ గ్రూప్ ఉత్పత్తి వార్షికంగా 4.5 శాతం నుంచి 2.7 శాతానికి పడింది. తయారీ రంగం... 4 నెలల కనిష్టానికి న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్‌లో 50.5 శాతానికి పడింది. కొత్త ఆర్డర్లు భారీగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. ఆర్బీఐ రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సూచీ సూచిస్తున్నట్లు మార్కిట్ ఎకనమిస్ట్ డీ లిమా పేర్కొన్నారు. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దానిని విస్తరణ దశగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.