INTERPOL
-
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
హసీనా కోసం ఇంటర్‌పోల్ సాయం కోరుతాం: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను భారతదేశం నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. పలు నేరారోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లా రప్పించేందుకు అక్కడి సిద్ధమైంది. 77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్, ఆమె పార్టీ నాయకులు విపక్ష-వ్యతిరేక విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. దీని ఫలితంగా జూలై-ఆగస్టులో విద్యర్థుల నిరసనల సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం కాస్త పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీయటంతో ఆగస్టు 5న హసీనా రహస్యంగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది.మరోవైపు..విద్యార్థుల నిరసనల సందర్భంగా కనీసం 753 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా, ఆమె అవామీ లీగ్ నాయకులపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్, ప్రాసిక్యూషన్ బృందానికి అక్టోబర్‌లో పలు నేరాలు, మారణహోమంపై 60కి పైగా ఫిర్యాదులు దాఖలు అయ్యాయని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.‘‘త్వరలో ఇంటర్‌పోల్ ద్వారా హసీనాకు రెడ్ నోటీసు జారీ చేయనున్నాం. పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నప్పటికీ.. తిరిగి బంగ్లాకు తీసుకువచ్చి కోర్టులో నెలబెడతాం’’ అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. అప్పగించడం, లొంగిపోవడం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు పెట్టుకొనే అభ్యర్థన మాత్రమే. ఇక.. ఇంటర్‌పోల్ సభ్య దేశాలు తమ జాతీయ చట్టాల ప్రకారం రెడ్ నోటీసులను అమలు చేస్తాయని అధికారులు తెలిపారు.చదవండి: రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి! -
త్వరలోనే భారత్‌కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌పోల్ 90వ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ తరఫున ఆ దేశ ఫెరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసిన్ బట్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇంటర్‌పోల్ అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్‌రైసీ, సెక్రెటరీ జనరల్ ఉర్గన్ స్టాక్ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతోంది. ఉగ్రవాదం తీరు మారింది... పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్లైన్ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా సైబర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మార్పిడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు. రెడ్ కార్నర్ నోటీసుల్లో వేగం పెరగాలి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు వీలు కల్పించే రెడ్ కార్నర్ నోటీసుల జారీలో వేగం మరింత పెరగాల్సి ఉందని ఇంటర్‌పోల్‌కు ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం భారత్ తరఫున 780 రెడ్ కార్నర్ నోటీసులున్నాయని గుర్తు చేశారు. వీటిలో 205 పలు నేరాల్లో సీబీఐ జాబితాలో వాంటెడ్‌గా ఉన్న నేరగాళ్లకు సంబంధించినవని ఆయన చెప్పారు. నేరగాళ్లు ఇంటర్‌పోల్ సభ్య దేశాల్లో ఎక్కడున్నా అరెస్టు చేసేందుకు, వెనక్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు వీలు కల్పిస్తుంది. భారత్ జారీ చేసిన నోటీసుల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహాయకుడు చోటా షకీల్, ఉగ్రవాదులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌తో పాటు ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులున్నారు. రెడ్ కార్నర్ నోటీస్ అంతర్జాతీయ అరెస్టు వారెంటు కాదని, నేరగాళ్లను అరెస్టు చేసి తీరాలంటూ సభ్య దేశాలను ఇంటర్‌పోల్ ఒత్తిడి చేయలేదని సంస్థ ప్రధాన కార్యదర్శి ఉర్గన్ సోమవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. దావూద్‌పై పాక్ మౌనం అండర్ వరల్డ్ డాన్, భారత్‌లో విధ్వంసం సృష్టించి పరారీలో ఉన్న ఇతర ఉగ్రవాదుల ఉనికిపై పాక్ మరోసారి మౌనం వహించింది. దావూద్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఎక్కడున్నారన్న మీడియా ప్రశ్నకు ఇంటర్‌పోల్ సదస్సులో పాల్గొంటున్న పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చీఫ్ మొహసిన్ బట్ బదులివ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆయన సరిగ్గా సదస్సు మొదలయ్యే సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చారు. అయినా మోదీ ప్రసంగం పూర్తవగానే మీడియా అంతా బట్‌ను చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించింది. వాటికి బదులివ్వకుండానే ఆయన వెళ్లిపోయారు. -
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్‌ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్‌తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్‌పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
‘పంచ్’ ప్రభాకర్ అరెస్ట్‌కు అమెరికా సాయం కోరిన భారత్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇద్దరి ఆచూకీ కనుగొనేందుకు అమెరికా అధికారుల సాయం కోరినట్లు సీబీఐ తెలిపింది. పంచ్ ప్రభాకర్‌గా పేరున్న సి.ప్రభాకర్ రెడ్డి, మణి అన్నపురెడ్డి అనే వారు అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం ఉందని గురువారం సీబీఐ తెలిపింది. వీరిపై దేశంలో కోర్టులు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్‌పోల్ సాయంతో అమెరికాలో వారుంటున్న ప్రాంతాన్ని గుర్తించి, వారిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ల వివరాలను అమెరికా అధికారులకు అందజేసినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో అక్టోబర్ 22వ తేదీన అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సీబీఐ వెల్లడించింది. అంతకుముందు, ఇదే కేసులో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. మరో వ్యక్తిపై విచారణ కొనసాగుతోందని, అతడి యూట్యూబ్ చానెల్‌ను మూసివేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ 16 మంది నిందితులపై నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 2020 నవంబర్ 11న కేసు నమో దు చేసినట్లు సీబీఐ తెలిపింది. అనంతరం సామాజిక మాధ్యమాల్లో జడ్జీలు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న పలు అభ్యం తరకర పోస్టులను తొలగించామని తెలిపింది. -
డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన ఈడీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చదవండి : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు Tollywood Drugs Case 2021: డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి -
Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. కాగా, ఇప్పటికే ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ ల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. అదేవిధంగా, 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. కాగా, దీనిపై విచారించిన అనంతరం మరికొంత మందికి నోటిసులను జారీచేసే అవకాశం ఉంది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్‌పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు చదవండి: విషాదం: లోయలో పడ్డ కారు.. నవ వధువు, తండ్రి మృతి -
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన వాస్తవాలు
-
కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో వెలుగు చూసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు భావిస్తున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది. చదవండి: కేరళ గోల్డ్ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు? దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి వీరివురిని శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దర్యాప్తులో భాగంగా స్వప్నా సురేష్, సరిత్లను వారి ఇళ్లకు, కార్యాలయాలకు కూడా తీసుకెళ్లారు. కీలక నిందితడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాజిల్ ఫరీద్ కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. కేసులో మరో నిందితుడైన సరిత్ని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కస్టమ్స్ శాఖను కోరారు. కాగా బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ గోల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది -
ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్
టెహ్రన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్ సహకారాన్ని అభ్యర్ధించింది. డ్రోన్ దాడిలో ఇరాన్ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్‌తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్ ప్రకటించిందని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్ సోమవారం వెల్లడించినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్ చర్యతో ట్రంప్‌నకు అరెస్ట్ ప్రమాదం ముంచుకురాకున్నా ఇరాన్, అమెరికాల మధ్య ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. కాగా, బాగ్దాద్‌లో ఈ ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన ఘటనలో ట్రంప్‌తో పాటు 30 మందికి పైగా ఇతరులపై హత్య, ఉగ్రవాద అభియోగాలున్నాయని ప్రాసిక్యూటర్ అలీ అల్ఖాసిమెర్ పేర్కొన్నట్టు ఐఎస్ఎన్ఏ వార్తాసంస్థ వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ఆయన ప్రాసిక్యూషన్‌ను ఇరాన్ కొనసాగిస్తుందని ఆయన పేర్కొంది. కాగా ఈ ఉదంతంపై ఇంటర్‌పోల్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. చదవండి : విగ్రహాల ధ్వంసం : ట్రంప్ కీలక నిర్ణయం చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ! -
నిత్యానందకు నోటీసులపై వింత జవాబు
బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్) ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద) ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ నిత్యానంద కథేంటి? -
నిత్యానందకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆచూకీ కనుక్కోవాలని ఇంటర్‌పోల్ ప్రపంచ దేశాలను కోరింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్మాతికవేత్త నిత్యానంద గత ఏడాది విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుధవారం ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. (నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి) గుజరాత్, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద ఉన్నారు. చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.. లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్‌లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి. (నిత్యానంద మరో అకృత్యం) -
నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు నేహాల్ దీపక్ మోదీ(40) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ నోటీసు జారీ చేసింది. నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్ పోల్‌ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్బ్యాంకులో ఎల్ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు నీరవ్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆమెకు ఉగ్రసంస్థలతో సంబంధం ఉండొచ్చు’
తిరువనంతపురం : కేరళ వచ్చిన ఓ జర్మన్ దేశస్థురాలు నాలుగు నెలలుగా కనిపించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సదరు మహిళకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు ఇంటర్‌పోల్ భావిస్తోంది. ఈ క్రమంలో సాధ్యమైనంత తొందరగా ఆమె ఆచూకీ కనుక్కోవాలంటూ కేరళ పోలీసుల మీద ఒత్తిడి తెస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు.. జర్మనీకి చెందిన లీసా వైసే(31) అనే మహిళ ఈ ఏడాది మార్చి 7న యూకేకు చెందిన అలీ మహ్మద్ అనే వ్యక్తితో కలిసి తిరువనంతపురం వచ్చింది. వల్లికావు, కొల్లంలో ఉన్న మాతా అమృతానందమయి మఠాన్ని దర్శించడానికి ఇండియా వచ్చినట్లు లీసా తన ఎంబార్కేషన్ ఫామ్‌లో పేర్కొంది. 2011లో కూడా లీసా ఈ మఠాన్ని సందర్శించడానికి వచ్చిందని.. 2 నెలల పాటు ఇండియాలోనే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 7న తిరువనంతపురం వచ్చిన లీసా.. అదే నెల 10వ తేదీ వరకూ తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌లో ఉంది. ఆ తర్వాత లీసా నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడమే కాక గూగుల్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో లీసా తల్లి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 11 రోజుల పాటు లీసా గురించి వెతికినప్పటికి ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదంటున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మాతా అమృతానందమయి మఠానికి వెళ్లి విచారించగా లీసా, మహ్మద్ అనే వ్యక్తులు తమ ఆశ్రమానికి రాలేదని వారు తెలిపారు. లీసా వీసా గడువు ఏప్రిల్ 5తో ముగిసింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి లీసా గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో కేరళ పోలీసులు లీసా ఫోటో, వివరాలను ఇతర రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు పంపడమే కాక లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఈ కేసు విషయంలో ఇంటర్‌పోల్ సాయం కూడా కోరారు. అయితే లీసాకు ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఇంటర్‌పోల్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి కేరళ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘లీసా, మహ్మద్ కోవలంలోని ఓ హోటల్లో దిగారని, వర్కాల వెళ్లారని మా దర్యాప్తులో తెలీంది. అయితే లీసా, మహ్మద్‌లు ఇద్దరు.. విదేశీయులు ఇండియాలోని హోటల్లోలో కానీ ఇళ్లలో కానీ నివాసం ఉండటానికి అవసరమైన అతి ముఖ్యమైన ఫామ్ సీని నింపలేదు. లీసాతో పాటు వచ్చిన మహ్మద్ మార్చి 15న యూకే వెళ్లినట్లు తెలిసింది. కానీ లీసా మాత్రం ఇప్పటి వరకూ ఇండియాను విడిచి వెళ్లలేదు. మా అనుమానం ప్రకారం లీసా మత సంస్థలు నడుపుతున్న హస్టల్లో లేదా.. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఉండి ఉండవచ్చు’ అని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఎవరీ లీసా.. జర్మన్ దేశస్థురాలైన లీసా యూదు మతస్తురాలు. అయితె 2012లో ఆమె ఇస్లాంలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ఈజిప్ట్‌లోని ఓ ఎన్జీవీతో కలిసి పని చేస్తుంది. కొద్దికాలానికి లీసా అమెరికాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ హషీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ 2016లో లీసా, తన భర్త నుంచి విడిపోయింది. -
ఇంటర్‌పోల్‌తో చేతులు కలిపిన ఐసీసీ
దుబాయ్: గత కొంతకాలంగా క్రికెట్‌ను ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిరోధించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎన్ని రకాల చర్యలు తీసుకుం టున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ంగ్ను తరిమికొట్టేందుకు ఇంటర్ పోల్‌తో కలసి పనిచేయనుంది. ఈ మేరకు గత వారం ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న ఇంటర్‌పోల్ అధికారులతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ సమావేశమై చర్చించినట్లు ఐసీసీ ఓ లేఖలో వెల్లడించింది. ‘ప్రపంచ వ్యాప్తంగా నేరాల నియంత్రణకు కృషి చేసే సంస్థ ఇంటర్‌పోల్. దీనికి 194 దేశాలతో అనుబంధం ఉంది. అలాంటి సంస్థతో కలసి పనిచేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీనివల్ల క్రికెట్ వ్యవహారాల్లో అవినీతి, ఫిక్స్ంగ్ జాఢ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు వీలవుతుంది’అని ఆ లేఖలో పేర్కొంది. కాగా, దీనిపై ఇంటర్‌పోల్ క్రిమినల్ నెట్వర్క్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోస్ డి గ్రేసియా మాట్లాడుతూ క్రికెట్లో అవినీతి, ఫిక్సింగ్ వ్యవహారాల నియంత్రణకు ఐసీసీతో కలసి పనిచేయనున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు. -
చోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్
సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్బీ బ్యాంకు స్కామ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్ చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్ చోక్సీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయడంతో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్‌కు చేరవేయనున్నారు. బ్యాంకు స్కామ్ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్‌కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్మెంట్ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్‌కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్ నీరవ్ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా కిమ్ యాంగ్
దుబాయ్: అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్‌కు నూతన అధ్యక్షుడు నియమితులయ్యారు. యూఏఈలోని దుబాయ్‌లో బుధవారం జరిగిన వార్షిక సమావేశంలో దక్షిణకొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్(57)ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్ తెలిపింది. ఈ పదవిలో యాంగ్ 2020 వరకూ కొనసాగుతారు. ఇప్పటివరకూ ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే సెప్టెంబర్‌లో అదృశ్యం కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. చైనా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లంచం ఆరోపణలపై బీజింగ్‌లో విమానం దిగగానే ఆ దేశ అధికారులు మెంగ్ హాంగ్వేను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రష్యా అభ్యర్థి, ఇంటర్‌పోల్ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్ ప్రోకోప్చుక్ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు వ్యతిరేకించాయి. -
చైనా చీకటి కోణం
బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నేరగాళ్లను, హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నవారిని ఇంటర్‌పోల్ అనే అంతర్జాతీయ పోలీసు సంస్థ ఏ మూలనున్నా పట్టి బంధిస్తుం దని అందరూ నమ్ముతుంటారు. అది రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసిందంటే ఆ నేరగాళ్ల పని అయి పోయినట్టేనని విశ్వసిస్తుంటారు. కానీ ఈమధ్య ఉన్నట్టుండి మాయమై ఆచూకీ లేకుండా పోయిన ఇంటర్‌పోల్ చీఫ్ మెంగ్ హాంగ్వీ సంగతి తెలియక ఆ సంస్థ ఉన్నతాధికారులే అయోమయంలో పడ్డారు. ఆయన ఆచూకీ తెలుసుకోవడానికే దాదాపు రెండు వారాలు పట్టింది. ఇంకా విచిత్ర మేమంటే... ఆయన ఆచూకీ, ఇంటర్‌పోల్ చీఫ్ పదవికి ఆయన రాజీనామా ఒకేసారి వచ్చాయి. రాజీనామాను అంగీకరించి ఆయన స్థానంలో వేరే చీఫ్‌ను నియమించుకోవడం తప్ప ఇంటర్‌పోల్ చేసిందేమీ లేదు. ఇంటర్‌పోల్‌కు ఈ దుస్థితి కల్పించింది చైనా ప్రభుత్వమే. అంతర్జాతీయంగా అన్ని చోట్లా తన సత్తా చాటాలని, తిరుగులేని శక్తిగా ఎదగాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దానికి తగినట్టు ఆర్థికంగా అది శరవేగంతో ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి సంస్థలన్నిటిలోనూ తన ముద్ర కనబడా లని, నాయకత్వ పగ్గాలు తనకూ రావాలని ఒకప్పుడు చైనా కోరుకునేది. కానీ పశ్చిమ దేశాలు అందుకు అవకాశమిచ్చేవి కాదు. 80వ దశకంలో డెంగ్ ఆర్థిక సంస్కరణలకు తెరతీశాక, పశ్చిమ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మొదలయ్యాక పరిస్థితులు క్రమేపీ మారుతూ వచ్చాయి. ఐక్య రాజ్యసమితి సంస్థల్లోనూ, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకుల్లోనూ, అంతర్జాతీయ న్యాయస్థానా ల్లోనూ ఆ దేశానికి కూడా చోటు దొరుకుతోంది. ఇప్పుడు కొన్ని రోజులు మాయమై అందరినీ కంగారు పెట్టిన ఇంటర్‌పోల్ చీఫ్ మెంగ్ హాంగ్వీ చైనీయుడే. రెండేళ్లక్రితం ఇంటర్‌పోల్‌కు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చైనా మీడియా ఎంతో సంబరపడింది. దీన్ని చైనా న్యాయవ్యవస్థకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించింది. ఇంతలోనే ఏమైందో చైనా ప్రభుత్వం ఆయనపై కన్నెర్రజేసింది. ఆయన్ను లంచం కేసులో అరెస్టు చేశామని చెబుతోంది. హాంగ్వీ ఉన్నతస్థాయి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. చైనా ఇంటర్‌పోల్ చీఫ్‌గా, ప్రభుత్వంలో ఉప మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సర్కారు ఎంపిక చేసి పంపితేనే ఇంటర్‌పోల్ చీఫ్ అయ్యారు. ఆయన అవినీతి ఇన్నాళ్లకు తెలిసింది కాబట్టే ఇప్పుడు చర్య తీసుకున్నామని చైనా ప్రభుత్వం వాదించవచ్చు. అది నిజమేననుకున్నా ఆయన్ను అరెస్టు చేసే విధానం ఇలాగేనా? ఆరోపణలొచ్చి నప్పుడు, వాటికి అవసరమైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే దానిపై ఇంటర్‌పోల్‌కు వర్తమానం అందించాలి. చట్టప్రకారం ఆయన్ను రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండా, ఆయన స్వస్థలానికి వచ్చాక బంధించడం, ఆ సంగతిని కూడా దాదాపు రెండువారాలు దాచి పెట్టి ఉంచడం ఏ రకంగా సమర్థనీయమో ఆ ప్రభుత్వమే చెప్పాలి. తమ ప్రమాణాల ప్రకారం అరెస్టులు ఇలాగే ఉంటాయని చైనా వాదించవచ్చుగానీ ఈ తంతును ఎవరైనా అపహరణనే పిలుస్తారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఇలా మాయం చేసిన తీరు చూశాక అసలు ఆ ఆరోపణలే పెద్ద బోగస్ అని భావిస్తారు. అందలం ఎక్కబోయే నేతలకూ లేదా అధికారంలో ఉన్నవారికి పెద్ద బెడదగా మారొచ్చునని సంశయం వస్తే అలాంటివారిని అవినీతి కేసులో, లంచం కేసులో ఇరికించి జైలుకు పంపడం చైనాలో రివాజు. మెంగ్ ఏ కోవలోకి వస్తారో చూడాల్సి ఉంది. అసలు ఆయన మాయమైన తీరు, అది వెల్లడైన తీరు ఆశ్చర్యం కలి గిస్తుంది. గత నెల 25న చైనా చేరుకున్నాక ఆయన ఫోన్ స్విచాఫ్ రావడంతో భార్య కంగారు పడుతుండగా, ఉన్నట్టుండి ఆ ఫోన్ నుంచి బాకు బొమ్మ ఈమోజీ రావడం ఆ భయాన్ని మరింత పెంచింది. కనీసం తనను పోలీసులు పట్టుకున్నారని సందేశం పంపే అవకాశం కూడా ఆయనకు లేదన్నమాట! ఒక్క మెంగ్ విషయంలో మాత్రమే కాదు... హాలీవుడ్ చిత్రాల్లో నటించే చైనా సినీ తార ఫాన్ బింగ్‌బింగ్‌ను కూడా ఇదే విధంగా చైనా ఈ తరహాలోనే మాయం చేసింది. ఐరన్మాన్ 3, ఎక్స్–మెన్, లాస్ట్ ఇన్ బీజింగ్ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొంది భారీ పారితోషికాన్ని తీసుకునే నటి ఫాన్. ఆమె ఆచూకీ మూడు నెలలపాటు తెలియలేదు. ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి ఇలా మాయం కావడంలో మర్మమేమిటో ఎవరికీ బోధపడలేదు. హఠాత్తుగా ఈ నెల 3న ఆమె పేరిట ఒక ప్రకటన విడుదలైంది. భారీ మొత్తంలో పన్ను ఎగ్గొట్టి పెద్ద తప్పు చేశానని, సమాజం తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేశానని ఆ ప్రకటనలో ఆమె పశ్చాత్తాప పడింది. ఆమెతో పోలిస్తే మెంగ్ అదృష్టవంతుడు. ఇంటర్‌పోల్ చీఫ్ కనుక రెండు వారాలకే ఆచూకీ తెలిసింది! కానీ ఇద్దరి విషయంలోనూ వారి పేరిట వెలువడిన ప్రకటనలే ఇప్పటికీ ఆధారం. ఇంటర్‌పోల్ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థేమీ కాదు. పుట్టి 104 ఏళ్లవుతున్నా దానికి తగినన్ని నిధులు, అవసరమైనంత సిబ్బంది ఎప్పుడూ లేరు. 192 సభ్య దేశాల్లో ఏ దేశమైనా ఫలానా వ్యక్తిపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయమని కోరితే ఆ పని చేయడం, అంతర్జాతీయ నేరస్త ముఠాల ఆచూకీ అడిగితే సభ్యదేశాల్లోని పోలీసు విభాగాలన్నిటికీ ఆ వినతిని పంపి, స్పందన రాబట్టడం దాని పని. అలా చేయడం వల్ల అప్పుడప్పుడు నేరగాళ్లు పట్టుబడుతున్న సందర్భా లున్నాయి. అయితే అధికారంలో ఉన్నవారి ఆగడాలను ప్రశ్నించినవారిని ఆయా దేశాలు నేరస్తు లుగా చిత్రించి ఆచూకీ కోసం అడుగుతుంటే, అది ముందూ వెనకా చూడకుండా పాటిస్తుదన్న విమర్శలున్నాయి. రష్యా, చైనాలు ఇలాంటి పనుల్లో ఆరితేరాయి. ఆ దేశాలనుంచి అందే వినతుల విషయంలో జాగ్రత్తలు పాటించి, హేతుబద్ధంగా వ్యవహరించాలని అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఇంటర్పోల్పై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఈలోగా ఏకంగా ఆ సంస్థ చీఫ్‌నే అత్యంత అనాగరి కంగా, తలబిరుసుగా అపహరించి చైనా తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఈ ఉదంతం చైనా చీకటి కోణాన్ని వెల్లడించింది. -
ఇంటర్‌పోల్ చీఫ్ రాజీనామా.. తెరవెనుక డ్రాగాన్!
బీజింగ్ : అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాంగ్వే అనూహ్యంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన నుంచి రాజీనామా లేఖ అందినట్లు ఇంటర్‌పోల్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో దక్షిణ కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కీమ్ జోంగ్ యాంగ్ ఇంటర్‌పోల్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ఇంటర్‌పోల్ అధ్యక్షుడు కాకముందు చైనా ప్రజా భద్రత ఉప మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ నుంచి స్వదేశం చైనాకు తిరిగి వెళ్తున్న హాంగ్వే అదృశ్యమైయ్యారు. అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. కాగా హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారులు ధ్రువీకరించారు. కానీ రాజీనామా తప్ప హాంగ్వేకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది. -
మాల్యా బాటలోనే మెహుల్ చోక్సీ..
న్యూఢిల్లీ : లండన్ కోర్టులో తన అప్పగింత పిటిషన్‌పై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వినిపించిన వాదనలనే రూ 13,578 కోట్ల పీఎన్బీ స్కాం కేసులో నిందితుడు, ప్రముఖ జ్యూవెలర్ మెహుల్ చోక్సీ ముందుకుతెచ్చారు. భారత్ జైళ్లలో పరిస్థితులు సరిగ్గా ఉండవనే కారణం చూపి ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయాలని సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరడాన్ని వ్యతిరేకించారు. భారత్‌లో జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉంటాయని, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న మీడియా విచారణ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఇంటర్‌పోల్‌కు దాఖలు చేసిన అప్పీల్లో పేర్కొన్నారు. పీఎన్బీ స్కామ్‌లో కీలక నిందితుడైన చోక్సీ కరేబియన్ జంట ద్వీవులు అంటిగ్వా, బార్బుడాల్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. కేసు చుట్టూ మీడియా హడావిడి అధికంగా ఉండటంతో ఆరోపణల్లో ఉన్న నిజాయితీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీతో కలిపి ఈ కేసులో తనను పేర్కొంటున్నారని, భారత్‌లో నిందితులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదని వాపోయారు. తన ఉద్యోగులు, ఫ్రాంచైజీల నుంచి తనకు ప్రాణహాని ఉందని చోక్సీ ఇంటర్‌పోల్‌కు మొరపెట్టుకున్నారు. -
మెహుల్ చోక్సి ఇక్కడ లేడు
వాషింగ్టన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నారా? అంటూ గల్లిగల్లి వెతుకున్నారు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క దేశం భారత్‌కు, సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్ పోల్ వాషింగ్టన్, మెహుల్ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత బుధవారం భారత్ పంపిన అభ్యర్థనకు ఇంటర్‌పోల్ వాషింగ్టన్ స్పందించింది. మెహుల్ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వెంటనే ఇంటర్‌పోల్ వాషింగ్టన్కు భారత్ మరో లేఖ పంపింది. చోక్సి ఆచూకీ గురించి ఏమైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరింది. కాగ, పారిపోయిన ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్ 2018 కింద నీరవ్, చోక్సిలకు వ్యతిరేకంగా ఈడీ రెండు దరఖాస్తులను ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్ట స్పెషల్ కోర్టులో జూన్ 11న నమోదు చేసింది. భారత్, యూకే, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివే నీరవ్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయి ఉంది. అతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. నీరవ్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ఇతర దేశాలను భారత్ కోరిందని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నీరవ్ ఆచూకీ తెలుసుకునేందుకు ఫ్రాన్స్, యూకే, బెల్జియం వంటి యూరోపియన్ దేశాల సహాయం కూడా భారత్ తీసుకుంటోందని పేర్కొంది.