Investigating
-
వియత్నాం స్టీల్‌పై యాంటీ డంపింగ్!
న్యూఢిల్లీ: హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్ విచారణను భారత్ ప్రారంభించింది. హాట్ రోల్డ్ ఫ్లాట్ అల్లాయ్ లేదా నాన్–అల్లాయ్ స్టీల్ డంపింగ్ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఈ విచారణ జరుపుతోంది. డీజీటీఆర్ నోటిఫికేషన్ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్ లిమిటెడ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తరపున ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు. అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్ విచారణ నిర్వహిస్తాయి. -
గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!
టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్? చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే! మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట. కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది. -జమ్ముల శ్రీకాంత్ -
జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ED విచారణలో TSPSC చైర్మన్,సెక్రటరీలు
-
కవిత నివాసంలో 4 గంటలకు పైగా కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి : బండి సంజయ్
-
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు
-
దొంగ సొత్తు చెరువులో ఉందా..?
టెక్కలి: టెక్కలిలో ఈనెల 22న ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీకి సంబంధించి టెక్కలి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఎంవీ గణేష్ నేతృత్వంలో గత కొద్ది రోజులుగా ఒడిశా ప్రాంతాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక దొంగ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దొంగ ఇచ్చిన సమాచారంతో ఒడిశా పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు కండ్రవీధిలో గల ఓ చెరువులో నగల కోసం అన్వేషించినట్లు సమాచారం. జిల్లాలో వరుసగా జరుగుతున్న వివిధ రకాల సంఘటనల నేపథ్యంలో టెక్కలిలో జరిగిన భారీ చోరీపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ చోరీలో దొంగలు కాజేసిన రూ.2.40 లక్షల నగదు, 14 తులాల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: బాలింతల సేవలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్) -
మాదకద్రవ్యాల వ్యవహారాన్ని ఆటకట్టించేలా ‘హెచ్–న్యూ’
సాక్షి హైదరాబాద్: రాజధానిలో డ్రగ్ అనే మాట వినపడకూడదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అమలు పెట్టడంలో భాగంగా నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేక విభాగానికి అంకురార్పణ చేశారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌గా (హెచ్–న్యూ) పిలిచే దీంతో పాటు డ్రగ్స్‌పై పోరు కోసం ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజింగ్ వింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండింటినీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్–న్యూకు డీసీపీ స్థాయి అధికారి అధిపతిగా ఉండనున్నారు. తాత్కాలికంగా ఈ బాధ్యతల్ని ప్రస్తుత టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మికి అప్పగిస్తున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్–ఇన్స్పెక్టర్లతో పాటు 20 మంది కానిస్టేబుళ్లతో పని చేసే ఈ విభాగం గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం సేకరించడం, దాడులు చేయడం, నిందితులను పట్టుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ మాదిరిగా ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌గా కొనసాగుతుంది. వీటికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా ఆయా పోలీసుస్టేషన్లలోనే నమోదు అవుతాయి. ఈ కేసుల దర్యాప్తు పక్కాగా సాగి, నిందితులు కోర్టులో దోషులుగా నిరూపితమై శిక్షలు పడితేనే పూర్తి స్థాయి ఫలితాలు ఉంటాయని పోలీసు కమిషనర్ ఆనంద్ భావిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజింగ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. అదనపు సీపీ (సిట్, నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పని చేసే దీనికి సీసీఎస్ ఏసీపీ కందుకూరి నర్సింగ్‌రావు నేతృత్వం వహించనున్నారు. ఇన్స్పెక్టర్, ఎస్సైతో పాటు ఆరుగురు కానిస్టేబుళ్లు ఇందులో ఉంటారు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టుల్లో విచారణ పూర్తయ్యే వరకు ఈ విభా గం పర్యవేక్షిస్తుంది. దీనిపై బుధవారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. -
పెగాసస్ కుంభకోణంపై మమతా బెనర్జీ సంచలన నిర్ణయం
-
కరీంనగర్లో హైటెక్ వ్యభిచారం: అంతా ఆన్లైన్లోనే..
సాక్షి, కరీంనగర్: లగ్జరీ ఇళ్లు.. సంపన్నులు ఉండే ప్రాంతాలు.. శివారుకాలనీలు అడ్డాగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అనుమానం రాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. యువకులు, సంపన్నులు, పేరున్న వారితో ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ.. వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తూ.. వలపువల వేస్తున్నారు. రేట్ ఫిక్స్ చేసుకుని దందాను గుట్టుగా సాగిస్తున్నారు. ఇటీవల నిఘా పెట్టిన పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అంతా వాట్సాప్‌లోనే.. ► వ్యభిచార కేంద్రం నిర్వాహకులు కస్టమర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. సదరు గ్రూపుల్లో యువతుల ఫొటోలు పెడుతూ ఆకర్షిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు దంపతులు కలసి ఈ దందాను సైలెంట్‌గా నడిపిస్తున్నారు. ► ఎక్కువగా యువత, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు వలపువల విసురుతూ.. తమ మనిషిని పంపించి పరిచయాలు పెంచుకొని దందాకు శ్రీకారం చుడుతున్నారు. ► జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, పేరున్న పెద్దమనుషులు, విద్యాసంస్థల కరస్పాండెంట్ల వద్దకు యువతులనే నేరుగా పంపిస్తున్నారని సమాచారం. ►నగరశివారు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జనాలు వచ్చిపోవడం చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందిస్తున్నారని జిల్లాకేంద్రంలోనే కొత్తదారులు వెతుకుతున్నారు. నగరంలోని మంకమ్మతోట, జ్యోతినగర్, భాగ్యనగర్, తీగలగుట్టపల్లి, విద్యానగర్, భాగ్యనగర్, చైతన్యపురి, బ్యాంక్కాలనీల్లో పెద్దపెద్ద అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని గుట్టుగా దందా నడిపిస్తున్నారు. ► అదే విధంగా కరీంనగర్‌లోని కొన్ని లాడ్జీల్లోనూ విచ్చలవిడగా వ్యభిచారం జరుగుతోందని అరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అద్దె ఇళ్లు, ప్లాట్లలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ► ఫోన్ల ద్వారానే యువతుల ఎంపిక, బేరం అన్ని జరుగుతుంటాయని తెలిసింది. కొందరు ఉన్నత చదువులు చదివిన యువతులు కూడా తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా రొంపిలోకి దిగుతుండడం బాధాకరమైన విషయమని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల నిఘా వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెలలో టూటౌన్ పరిధిలోని సప్తగిరికాలనీలోని ఓ ఇంట్లో దాడిచేసి వ్యభిచార నిర్వాహకులైన భార్యభర్తలు, ముగ్గురు విఠులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.37,380 స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కరీంనగర్ రూరల్ ప్రాంతంతోని తీగలగుట్టపల్లిలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు విఠుడిని అరెస్టు చేశారు. దందాపై పోలీసులు నిఘా పెడుతూ అరెస్టు చేస్తున్నప్పటికీ ఎక్కడోఒకచోట గుట్టుగా నడుస్తూనే ఉంది. ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే డయల్ 100 ద్వారా, సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. వేళ్లూనుకుంటున్న దందా.. కరీంనగర్ జిల్లాకేంద్రంలో వ్యభిచార దందా వేళ్ళూనుకుంటోంది. నగరం నడిబొడ్డున వ్యభిచార కేంద్రాలు వెలుస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వారి అర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకుని రొంపిలోకి దింపుతున్నారు. పోలీసులు దాడులు చేసినప్పటికీ.. దందా ఆగడం లేదు. గతంలో చింతకుంట, రేకుర్తి, హౌసింగ్‌బోర్డుకాలనీ శివారు ప్రాంతాల్లో జరిగే వ్యభిచారం ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే హైటెక్ హంగులతో కొనసాగిస్తూ.. పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలోనే రెండు వ్యభిచార కేంద్రాలపై పోలీసులు దాడిచేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. -
ప్రేమికులపై దాడి ఘటన: విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. నిన్న రాత్రి పుష్కర ఘాట్‌లో కూర్చొని ఉన్న ప్రేమజంటపై ఇద్దరు దాడికి దిగారు. యువకుడిని తాళ్లలో కట్టేసిన దుండగులు.. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. దాడి ఘటనపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌పై పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. పోలీసులు నిందితులు కోసం గాలింపు చేపడుతున్నారని తెలిపారు. బాధితురాలికి మహిళా కమిషన్ అన్ని విధాలా అండగా ఉంటుందని వాసి రెడ్డి పద్మ అన్నారు. చదవండి: చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా.. గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది.. -
సుబ్బారెడ్డి హత్య కేసు.. దర్యాప్తు ముమ్మరం
తాళ్లూరు: వైఎస్సార్ సీపీ నాయకుడు మారం సుబ్బారెడ్డి హత్య కేసులో సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన వెంటనే రజానగరం గ్రామంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. సోమవారం చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దర్శి, పొదిలి, అద్దంకి, ఇంకొల్లు సీఐలు శ్రీరామ్, ఎండీ మొయిన్, ఆంజనేయ రెడ్డి, రాంబాబు, ఎస్సైలు నాగరాజు, ఆంజనేయులు, రామకృష్ణ పోలీసుల బృందం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వీధి వీధిన తిరిగి బంధువులను విచారించారు. కేసును త్వరితగతిన ఛేదిస్తాం... పూర్తి స్థాయిలో విచారించి తగిన ఆధారాలు సేకరించి త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని దర్శి సీఐ ఎండీ మొయిన్ తెలిపారు. మృతునికి బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఏమైనా నగదు వ్యవహారాలు, ఇతర అంశాల్లో ఎవరితోనైనా విభేదాలున్నాయా అని ఆరా తీశామన్నారు. లేక గ్రామంలో సైకోగా అనుమానిస్తున్న వ్యక్తి పనేనా? అన్న విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ అశోక్ వర్ధన్, ఇంటలిజెన్స్ ఎస్సై రామారావు గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. జీపు నడుపుతూ గ్రామంలో పర్యటిస్తున్న ఎస్పీ.. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు: గ్రామానికి చెందిన వారు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉంటుండగా వారి తల్లిదండ్రులు గ్రామంలో ఉంటూ పొలాలు చూసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా గొంతు కోసి దారుణంగా చంపిన సంఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించండి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హత్య జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పరిశీలించారు. అన్నం తినే సమయంలో కూర్చున్న స్థలం, వెనకవైపు గోడ, ఖాళీ ప్రదేశాలను చూశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలో విచారించి ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే దారులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో సమాచారం సేకరించాలని చెప్పారు. అనుమానుతుల వివరాలు, వారి ప్రవర్తన తీరు, హతుడి ఆర్థిక పరిస్థితులపై పూర్తిగా ఆరా తీయాలని సూచించారు. ముందుగా తాళ్లూరు స్టేషన్ ఆవరణలో గతంలో రజానగరంలో జరిగిన ఘర్షణలో శేషయ్య అనే వ్యక్తిపై దాడి చేసిన పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం రోడ్డు మార్గంలో స్వయంగా ఎస్పీ జీపు నడుపుకుంటూ ఆయా ప్రాంతాల్లో పరిశీలించాల్సిన విధానాన్ని చీరాల డీఎస్పీ, దర్శి సీఐలకు వివరించారు. -
హనీట్రాప్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్తాన్‌కు చేరవేస్తున్న హనీట్రాప్ కేసులో మరో కీలక సూత్రధారిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. సెయిలర్స్‌కి ఫండింగ్ చేసిన ముంబైకి చెందిన అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ జబ్బర్ షేక్(53)ను అక్కడే పట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో తీవ్రంగా పరిగణించిన ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్‌నోస్ లో వెల్లడైన నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లోనే 11 మంది ఇండియన్ సెయిలర్స్‌ను, ఆ తర్వాత మరో ముగ్గురు సూత్రధారులను అరెస్ట్ చేసింది. మొత్తంగా ఈ కేసులో 15మందిని అరెస్ట్ చేసింది. భార్యాభర్తలిద్దరూ.. ఈ గూఢచర్యం కేసులో అబ్దుల్ భార్య షైష్టా ఖైజర్ని గతంలోనే అరెస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ పాక్‌లోని వ్యక్తుల సూచనల మేరకు సమాచారం అందించిన సెయిలర్స్ ఖాతాల్లోకి నగదుని బదిలీ చేస్తుండేవారు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న ఎన్ఐఏ.. అబ్దుల్ని అరెస్టు చేసి 120బీ, 121ఏ, ఐపీసీ సెక్షన్ 17,18, సెక్షన్ 3 యాక్ట్(అఫీషియల్ సీక్రెట్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసింది. డిజిటల్ డివైజ్‌లు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ప్రకటనలో తెలిపింది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్తాన్‌కు ఈ సెయిలర్స్ సమాచారం ఇవ్వడం ప్రారంభించినట్లు పేర్కొంది. యుద్ధనౌకలు, సబ్మెరైన్ల సమాచారం ఎప్పటి నుంచి చేరవేశారు.. దాని వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. -
కీచక జాబితా @ ఐటీఎస్ఎస్ఓ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అలాంటి దారుణాలకు పాల్పడే కీచక జాబితా సిద్ధం చేసి ప్రత్యేక డేటాబేస్ ద్వారా అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలోపడింది. దీనికోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)కి భిన్నంగా ‘ఇన్వెస్టిగేటింగ్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’(ఐటీఎస్ఎస్ఓ)కు రూపమిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆ జాబితాలను అప్డేట్ చేసి అందజేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిధిలో నడిచే సీసీటీఎన్ఎస్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరగాళ్ల గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. కీచక నేరస్థులు మళ్లీ నేరం చేసి దొరికినపుడు వారి గత చరిత్రను ఎఫ్ఐఆర్, చార్జిషీట్లలో పేర్కొనాలని యోచిస్తోంది. దీనికోసమే ఐటీఎస్ఎస్ఓ అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ‘దిశ’ఘటన నేపథ్యంలో కేంద్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడే నిందితులందరికీ ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీఎస్ఎస్ఓ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్ శివారులో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. తరువాత డిసెంబర్ 6న జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లలో దిశ కేసులో నిందితులు నలుగురు చనిపోయారు. నిందితులు నలుగురు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా మహిళలపై అలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అన్న అనుమానాలను సీపీ సజ్జనార్ సైతం వ్యక్తం చేశారు. గతంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. వారి డీఎన్ఏ శాంపిళ్లను కర్ణాటకతోపాటు, ఏపీ తదితర రాష్ట్రాలకు పంపుతామని సైబరాబాద్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఐటీఎస్‌ఎస్‌ఓనే ఆధారం.. ఈ డేటాబేస్‌లో ఆడవారిపై అనుచితంగా ప్రవర్తించేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారు, ట్రాఫికింగ్, వ్యభిచారం, కిడ్నాపులు, ఆన్లైన్ వేధింపులకు పాల్పడేవారి జాబితాను పొందుపరుస్తారు. ఇందులో నేరగాళ్ల వేలిముద్రలు, బ్లడ్‌గ్రూప్, డీఎన్ఏ, పాత నేరాలు, నేర స్వభావం, నేరం చేసే విధానం తదితర విషయాలు రికార్డు చేస్తారు. దేశంలో ఎక్కడ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఘటనాస్థలంలో దొరికిన శాంపిల్స్‌ను ఇకపై ఐటీఎస్‌ఎస్‌ఓకు పంపుతారు. ఒకవేళ నేరస్తుడిని ముందే గుర్తించినా అతని వేలిముద్రలను ఐటీఎస్‌ఎస్‌ఓతో పోల్చి చూస్తారు. ఒకవేళ గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటే.. అవి కూడా దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. ఫలితంగా దర్యాప్తు వేగంగా పూర్తవుతుంది. పాత నేరస్తుడి గత చరిత్రను చార్జిషీటుతో పాటు కలిపి న్యాయస్థానానికి సమర్పించడంతో నిందితుడికి తక్కువ సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నది కేంద్రం యోచన. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వద్ద దాదాపుగా 5 లక్షల మందికిపైగా నేరస్తుల వేలిముద్రలు, నేర చరిత్ర వివరాలున్నాయి. వీటిలో రేపిస్టులు, మహిళలను వేధించేవారి వివరాలను వేరు చేసి త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. -
దర్యాప్తు దిశ ఇలా..
సాక్షి, హైదరాబాద్: దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు సానుకూలంగా నిర్ణయం తీసుకోగానే నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అలాగే మృతదేహాన్ని తరలించిన ప్రాంతం మీదుగా నిందితులతో కలసి ప్రయాణించి పూర్తి వివరాలను రాబట్టనున్నారు. దిశ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాక ఏమైందన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో అది ఏమైందో విచారించనున్నారు. అరెస్టు చేసి షాద్‌నగర్ పోలీసు స్టేషన్లో ఉంచినప్పుడు బయట ప్రజా ఆందోళనతో పూర్తిస్థాయిలో వారి నుంచి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారు. ఇప్పటికే సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దగ్గరుండి కేసు విచారణపై మార్గదర్శనం చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసే ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చవద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పలువురి విచారణ... దిశ మృతదేహం కాలడాన్ని చూసిన ఫరూక్‌నగర్‌కు చెందిన సమల సత్యం, మృతురాలి తండ్రి పొతుల శ్రీధర్‌రెడ్డి, తల్లి విజయమ్మ, సోదరి భవ్యతో పాటు కొత్తూరు శివారులోని ఎస్సార్ పెట్రోల్ బంక్‌లో పనిచేసే లింగరాం ప్రవీణ్ గౌడ్, లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డి, నందిగామలోని ఐవోసీ పెట్రోల్ బంక్‌లో పనిచేసే శ్యామ్ గౌడ్, మృతురాలి బైక్‌లో గాలి నింపిన క్రేన్ వెహికిల్ హెల్పర్ శంషీర్ అలమ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఆయా ఘటనాస్థలి నుంచి దిశ దుస్తులు, నిందితులు తాగిన మందు బాటిళ్లు, మృతదేహం కాల్చిన ప్రాంతం నుంచి సేకరించిన రిస్ట్‌వాచ్, కొత్తూరులో మృతురాలి బైక్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీలో నుంచి సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలను ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బంది సేకరించి పరీక్షలు చేస్తోంది. అలాగే తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి చటాన్‌పల్లి అండర్‌పాస్ వరకు మృతదేహాన్ని పెట్టుకొని లారీ వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు సేకరించే పని ఇప్పటికే పూర్తి కావచ్చింది. సాధ్యమైనంత తొందరగా నిందితుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకొని, పూర్తిస్థాయి ఆధారాలతో చార్జిషీట్ రూపొందించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. -
ఎందాకొచ్చింది మీ దర్యాప్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సోమవారం సీబీఐని తలంటింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా డోపీగా మార్చిన ఉదంతంపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ‘రియో’కు అర్హత పొందిన నర్సింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించాలనే దురుద్దేశంతో కొందరు అతను తినే ఆహారంలో డ్రగ్స్ కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఏదేమైనా డోపీ మరకతో నర్సింగ్ చివరి నిమిషంలో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యాయపోరాటం చేస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేకుండా ఉంది. దీంతో సీబీఐ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎప్పటికీ పూర్తి చేస్తారని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తదుపరి కోర్టు విచారణ జరిగే ఫిబ్రవరి 1వ తేదీకల్లా తెలపాలని జస్టిస్ నజ్మీ వాజిరి ఆదేశించారు. ‘ఇప్పటి వరకు ఏం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఇది సీబీఐ అనుకుంటున్నారా లేక మరేదైనా ఏజెన్సీనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాకారుల కెరీర్ నాశనమవడం భారత క్రీడల ప్రగతికి చేటని జస్టిస్ నజ్మీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఇద్దరు వివాహితల అదృశ్యం
చెన్నారావుపేట(నర్సంపేట): వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలకేంద్రం లోని రాజీవ్‌నగర్–1 కాలనీకి చెందిన జన్ను రాజేష్ భార్య జన్ను గీత గత నెల 28న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటాయి. బంధువుల ఇళ్లలో, పలు ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆదివారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. మొగుళ్లపల్లిలో... మొగుళ్లపల్లి(భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన ఆకాంక్షకు ఇదే మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన యువకుడితో గత ఏడాది వివాహమైంది. కాగా శనివారం ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తండ్రి తిప్పారపు శివరావు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా రాజు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440904634కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
సీబీఐ నోటీసుల కలకలం
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పని చేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ వేగం పెంచినట్లు తెలుస్తోంది. తణుకు పట్టణానికి చెందిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి రాంప్రసాదరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న ఆ రోపణలపై గతేడాది అక్టోబరులో ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులునమోదు చేశారు. చాలా కాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గత రెండ్రోజులుగా తణుకు పరిçసర ప్రాంతాల్లోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీబీఐ నోటీసులు అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వంద మందికి పైగా ఈ నోటీసులు అందుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఏప్రిల్ మొదటి వారంలో దఫదఫాలుగా ఇచ్చిన తేదీల్లో విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో కేసు నమోదు కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివాసంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఈయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్టణం, న్యూఢిల్లీ, మీరట్‌లలో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లుతోపాటు రూ.37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. రాంప్రసాదరావు అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్ముతో ఆయన భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావుతోపాటు ఆయన భార్య కనకదుర్గ పైనా అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధానమంత్రి పేషీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు చేసినట్లు తెలిసింది. ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో తణుకులోని ఆయన భార్య ఆకుల కనకదుర్గ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనకదుర్గకు బినామీ లుగా ఉన్న కొందరు రియల్ వ్యాపారులపైనా దృష్టి సారించిన అధికారులు తాజాగా నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రియల్ వ్యాపారుల్లో గుబులు ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు, ఆయన భార్య ఆకుల కనకదుర్గ ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు తదనంతరం కేసు నమోదు నేపథ్యంలో దాదాపు అయిదు నెలల తర్వాత సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రియల్ వ్యాపారుల్లో గుబులు రేగుతోంది. సీబీఐ కార్యాలయం, విశాఖపట్టణం పేరుతో తపాలాశాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో అందుతున్న నోటీసులు చూసిన కొందరు ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్లుగా జరిగిన క్రయవిక్రయాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆస్తులు అమ్మిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన వారికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేయడం విశేషం. ఆస్తుల విక్రయించిన సమయంలో మార్కెట్ విలువ, రిజిస్ట్రార్ విలువలో వ్యత్యాసాన్ని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావాదేవీలు జరిగిన సమయంలో కొందరు రియల్ వ్యాపారులకు ఐటీరిటన్స్ లేకపోవడంపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక్క పైడిపర్రులోనే సుమారు యాభై మంది నోటీసులు అందుకున్నట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ఉండగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కీలక దశకు నయీం కేసుల దర్యాప్తు
గ్యాంగ్‌స్టర్ నయీం, అతని అనుచరులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షునిగా బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్... మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీం కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు. వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఏడీజీ అంజనీకుమార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక కోర్టుల్లో ఎక్కడిక్కడ దాఖలు చేయాలని సూచించారు. నయీం కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టయిన 80 మంది కూడా అతని కుటీంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. అయితే నయీం ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నయీం అనుచరుల నుంచీ ఈ కోణానికి సంబంధించి కీలకాంశాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ... ఎన్కౌంటర్ తర్వాత నుంచి నయీం కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రముఖులతో సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా... కొందరు నేతలపై ఓ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్‌స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన వాటిలో కేవలం కబ్జా, బెదిరింపుల ఆరోపణలతో కూడిన వాటిని ఈలోపే కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కషిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. గత ఆగష్టు 8న నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతని ఆగడాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నయీం కేసులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సిట్ సేకరించింది. అయితే నయీమ్‌ను ఉపయోగించుకొని కొందరు రాజకీయ నేతలు లాభపడ్డారనే విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు విషయంలో రాజకీయపార్టీల ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. నెల రోజులు పూర్తయినా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ, దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదంటూ కొందరు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులను పెంచిన ఉన్నతాధికారులు... కేసును కొలిక్కి తీసుకుచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. -
ఆ ల్యాప్‌టాప్‌లో ఏముంది..?
* మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసుల ఆరా * అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్న బలగాలు భద్రాచలం: ఆ ల్యాప్‌టాప్‌లో ఏముందో..దానిలో ఎవరెవరి వివరాలు ఉన్నాయో? ఆ పెట్టెలో దాగి ఉన్న సమాచారంతో ఎవరి బాగోతం బయట పడుతుందో..? అంతటా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన అంశమిదే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసులకు అధునాతన ఆయుధాలతోపాటు, ఓ ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు బయటకు వెల్లడించకపోవటానికి గల కారణాలేమటన్నదానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అగ్రనేతల వద్దనే ల్యాప్‌టాప్‌లు, ప్రింటింగ్ మిషనరీ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలోంచి కూడా ల్యాప్‌టాప్‌ల ద్వారా మావోయిస్టులు తమ కార్యకలాపాల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఎన్కౌంటర్ ప్రదేశంలో లభించిన ల్యాప్‌టాప్‌లో నిగూఢమైన సమాచారమేదో ఉందని, అందుకనే ఇప్పటివరకు పోలీసులు వాటి స్వాధీనంపై ప్రకటన చేయలేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. అగ్రనేతలు పాల్గొన్న ప్లీనరీలో లభించిన ఈ ల్యాప్‌టాప్‌ను పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మావోయిస్టుల కార్యకలాపాలు ఏ రీతిన సాగుతున్నాయనే దానిపై ఓ అంచనాకు రావటంతో పాటు, వారికి సహరిస్తున్నవారెవరైనా ఉన్నారా..? అనే వివరాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తున్నారు. ఇదిలా ఉంటే ల్యాప్‌టాప్‌లో ఏముందోననే దానిపై సర్వత్రా చర్చసాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులతోపాటు, ఏజెన్సీ ప్రాంతంలో కోట్లాది రూపాయలతో పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. తమ పేర్లు దానిలో ఉంటే, పోలీ సులు భవిష్యత్‌లో చేపట్టే విచారణలో ఎటువంటి ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తప్పించుకున్నవారి కోసం వేట బొట్టెంతోగు ప్లీనరీ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలతోపాటు, వందలాది మందిగా పాల్గొన్న వారు ప్రస్తు తం ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కోసమని ప్రత్యేక పోలీసు, గ్రేహాం డ్స్ బలగాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగానే గురువారం రాత్రి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దబ్బమడక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ పరిణామాలతో సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరం నెలకొంది. గాయపడినవారు ఎక్కడ? బొట్టెంతోగు ప్లీనరీపై ప్రత్యేక పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడి చేయటంతో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం నాటికి మరో మృతదేహం కూడా అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లుగా ప్రచారం సాగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీ కరించడం లేదు. పోలీసుల మెరుపుదాడిలో పదుల సంఖ్యలోనే మావోయిస్టులు గాయాలపాలైనట్లుగా పరిసర గ్రామాలకు చెందిన ఆదివాసీలు చెబుతున్నారు. ఎన్కౌంటర్ ముగి సిన తర్వాత మంగళవారం రోజు సాయంత్రం ఆ ప్రదేశానికి వెనుదిరిగి వచ్చిన కొంతమంది మావోయిస్టులు, గాయపడిన వారికి తగిన రీతిలో సాయం చేయాలని పరిసర గ్రామా ల ప్రజలకు చెప్పి వెళ్లినట్లుగా తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, గాయాల పాలైన మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
ఇందూరు టీఆర్ఎస్ లో రగడ
♦ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ ♦ భూపతిరెడ్డిపై చేయి చేసుకున్న బాజిరెడ్డి ♦ కాలూరులో ఇరువర్గాల బాహాబాహీ ♦ ఎమ్మెల్సీపై రూరల్ పీఎస్‌లో కేసు ♦ ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు శనివారం బట్టబయలు అయ్యాయి. జిల్లాలోని కాలూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డ్డిల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఇద్దరు, 2 గ్రూపుల మధ్య నెలకొన్న వివా దం చివరకు ఎమ్మెల్సీపై చేయి చేసుకునే స్థాయికి చేరింది. ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. నిజామాబాద్ మండలం కాలూర్‌లో మహిళామండలి భవన ప్రారంభోత్సవానికి శనివారం ఏర్పాట్లు చేశారు. ముందుగా గ్రామానికి ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి చేరుకున్నారు. స్వాగత ఫ్లెక్సీలో భూపతిరెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు చర్చపెట్టారు. ఈలోగా కాలెపల్లి క్యాంపులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కాలూర్‌కు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, వీజీగౌడ్లు మహిళా మండలి భవనాన్ని ప్రారంభించి లోనికి వెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మహిళా మండలి భవనంలోకి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్సీ వర్గీయులు భూపతిరెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదని పార్టీ మండల అధ్యక్షుడైన ముస్కె సంతోష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భూపతిరెడ్డి మరో అనుచరుడు ధర్మారం రమాకాంత్ నిరసన వ్యక్తం చేశారు. నిరసనలతో కార్యక్రమానికి అంతరాయం ఏర్పడడంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే బాజిరెడ్డి బయటకు వచ్చి భూపతి రెడ్డి అనుచరుడు రమాకాంత్‌పై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో గొడవ పడగా ఆయనపైనా చేయి చేసుకున్నారు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ చెంప ఛెళ్లుమనిపించారు. వెంటనే నిజామాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్ని, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దు మణిగింది. ఎమ్మెల్సీ, ఆయన వర్గీయులపై కేసు కాలూరు ఘటనలో తమ విధులకు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆటంకం కల్పించాడని ఎస్‌హెచ్‌వో మున్ని ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
నెల్లూరు క్రైమ్: నెల్లూరులోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. ప్రాథమిక సమాచారం మేరకు.. జిల్లాలోని ఇందుకూరిపేట మండలం జగదేవిపేటకు చెందిన అత్తులూరి ప్రభాకర్ నాయుడు (55) ఎవరెస్ట్ లాడ్జిలో ఈ నెల 2న ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, సోమవారం నుంచి అతడుంటున్న గది తలుపు తెరచుకోలేదు. అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది మంగళారం తలుపులు తెరచి చూడగా ప్రభాకర్ నాయుడు మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు.