Jaguar
-
కొత్త డిజైన్, స్టైలిష్ లుక్‌లో జాగ్వార్ కారు (ఫొటోలు)
-
కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
కాయ్ రాజా కాయ్.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లు, మనీసర్క్యులేషన్ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమిత్‌పటేల్ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్విల్లే జాగ్వార్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్లైన్లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్‌ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్పట్ల్కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. -
ప్రభాస్ రేంజే వేరు.. డార్లింగ్ కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!
ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంబోర్ఘిని అవెంటడోర్ భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) జాగ్వార్ ఎక్స్‌జే భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్‌జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) బీఎండబ్ల్యూ ఎక్స్3 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుందని తెలుస్తుంది. -
జాగ్వార్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ ఇక అప్పుడే..
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల దిగ్గజం జాగ్వార్ 2025లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ డెలివరీలను ప్రారంభించనుంది. ఈ ఏడాది కొత్త డిజైన్ల వివరాలను విడుదల చేయనున్నట్లు, 2024లో నిర్దిష్ట మార్కెట్లలో విక్రయాలను ప్రారంభించనున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తాత్కాలిక సీఈవో అడ్రియన్ మార్డెల్ తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్, అటానామస్ కార్ల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను కల్పించేందుకు ముందుగా తమ సిబ్బందికి తగు శిక్షణనివ్వడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో 29,000 మందికి శిక్షణా ప్రోగ్రాంను ప్రారంభించినట్లు మార్డెల్ చెప్పారు. రాబోయే రోజుల్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ వాహనాల్లో పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం ఈ ఏడాది ప్రీ–ఆర్డర్లు తీసుకోనున్నట్లు మార్డెల్ తెలిపారు. మరోవైపు, పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ వాహనాల బ్రాండ్‌గా జాగ్వార్ పరివర్తన ప్రక్రియ సజావుగా ముందుకు సాగుతోందని కంపెనీ 2022–23 వార్షిక నివేదికలో చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. (ఇదీ చదవండి: రోడ్‌షోలు నిర్వహించున్న ఎల్ఐసీ.. ఎక్కడో తెలుసా?) ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల కొరత తదితర సవాళ్ల కారణంగా సంస్థ గత ఆర్థిక సంవత్సరం వ్యాపారపరంగా పలు సమస్యలు ఎదుర్కొందని ఆయన వివరించారు. సరఫరాలపరమైన సమస్యలను అధిగమించేందుకు కంపెనీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైందని చంద్రశేఖరన్ చెప్పారు. -
సంపాదనలో మాత్రమే కాదు లగ్జరీ కార్ల విషయంలో అంతకు మించి
Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500) జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని. బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI) కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!) జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF) బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది. నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. చీతాలు.. చిన్నవైనా వేగంగా.. ►ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. ►ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ►శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. ►రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. ►3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. ►చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. ►ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. ►ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. ►నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. ►ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ►ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్ సహరన్ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. ►తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. ►ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. జాగ్వార్లు.. భారీ పరిమాణంలో.. ►ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. ►చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. ►ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు. -
పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్ ఏ పవర్
అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే బలంతోపాటు వేట సాగించాల్సిందే. జాలి దయ లాంటివి అస్సలు ఉండవు. ఒక జంతువు ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే. ఇక సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు వాటికి ఏ జంతువు నచ్చితే వాటిని వేటాడి తమకు ఆహారంగా మార్చేసుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఓ జాగ్వార్(చిరుతపులి) నదిలోకి దూకి మొసలిని వేటాడి ఆహారంగా మలుచుకుంది. ముందుగా చెట్టు పొదల్లో నక్కిన చిరుతపులి మెల్లగా నది ఒడ్డుకు వచ్చింది. తర్వాత నీటిలో తేలియాడుతున్న మొసలిపై ఒక్క ఉదుటున దూకి భయంకరంగా దాడి చేసింది. వెంటనే దాని దవడలతో మొసలి మెడ భాగంలో కరిచి పట్టుకొని నది నుంచి బయటకు లాక్కెళ్లింది. అయితే చిరుత నుంచి తప్పించుకోవడానికి మొసలి ఎంత పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పైచేయి జాగ్వార్దే అయ్యింది. ఈ వీడియోను ఫిగెన్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేశాడు. వాస్తవానికి ఈ వీడియోను రెండేళ్ల కిందటే వాహ్సీ హయత్లార్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. 42 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఇప్పటి వరకు 2.6 మిలియన్ల మంది వీక్షించారు. 27 లైక్‌లు వచ్చాయి.‘ జాగ్వార్ దవడలు చాలా దృడంగా ఉంటాయి. చిరుతపులి చాలా ఆకలిగా ఉన్నట్లు ఉంది. ఓ దేవుడా జాగ్వార్‌కు ఎంత శక్తి ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ.. OMG what a power!! pic.twitter.com/LHZazN2zwP — Figen (@TheFigen) August 14, 2022 -
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకువస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ఓ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి రాలేనంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరీష్‌కుమార్ ఉక్రెయిన్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద అసిస్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జంతువులంటే ఇష్టపడే గిరికుమార్ జాగ్వార్ (మచ్చలు కలిగిన చిరుతపులి), బ్లాక్ పాంథర్ (నల్ల చిరుతపులి)ని పెంచుతున్నారు. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను ఒంటరిగా వదిలేసి స్వదేశానికి రాలేనంటున్నారీ వైద్యుడు. హీరో చిరంజీవి నటించిన సినిమా స్ఫూర్తితోనే జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటున్నానని, కేవలం వాటిని రక్షించడం కోసమే ఉక్రెయిన్‌లో ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'నా నుంచి ప్రేరణ పొంది మీరు జాగ్వార్, పాంథర్లను పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. యుద్ధ సమయంలో వాటిని వదిలి రాలేక ఆ మూగ జీవాల వెన్నంటే ఉండటం మా మనసులను కదిలిస్తోంది. వాటి మీద మీరు చూపిస్తున్న ప్రేమ, కరుణ నిజంగా ప్రశంసనీయం. మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే యుద్ధం ముగిసి అంతా మామూలైపోవాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: నా పులులతోపాటే నేనూ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడు -
జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల
లగ్జరీ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు జాగ్వార్ ఐ-పేస్‌ను భారత మార్కెట్ లో రూ.1.6 కోట్లకు విడుదల చేసింది. ఎస్యూవీ జాగ్వార్ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. జాగ్వార్ ఐ-పేస్ 90 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 294 కిలోవాట్ల శక్తిని, 696 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఐ-పేస్ కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండటానికి దేశంలో 19 నగరాల్లో 22 రిటైల్ అవుట్లెట్లలో 35 ఈవీ ఛార్జర్లను అమర్చినట్లు సంస్థ తెలిపింది. ప్రతిచోట 7.4 కేడబ్ల్యూ ఏసీతో పాటు 25 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ రిటైల్ నెట్వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఇండియా జాగ్వార్ ల్యాండ్ రోవర్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. అలాగే, వినియోగదారులు వాహనంలో అందించిన హోమ్ ఛార్జింగ్ కేబుల్‌ను ఛార్జింగ్ కోసం 7.4 కిలోవాట్ల ఏసీ వాల్ మౌంటెడ్ ఛార్జర్‌ను ఉపయోగించవచ్చు. ఛార్జర్‌ని అమర్చడానికి టాటా పవర్ లిమిటెడ్ సిబ్బంది సహకరిస్తారని చెప్పింది. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? -
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. ఆధునీకరించిన జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులోని 44.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఒకసారి చార్జీ చేస్తే 419 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 143 పీఎస్ పవర్, 350 ఎన్ఎం టార్క్, 8.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఎంజీ కొత్త జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్ పనోరమిక్ సన్‌రూఫ్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ ఏర్పాటు ఉంది. 31 నగరాల్లో బుకింగ్స్‌కు జడ్ఎస్ 2021 వర్షన్ అందుబాటులో ఉంది. వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కొరకు దేశంలో పెద్ద ఎత్తున చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.20.99 లక్షలు. జాగ్వార్ ఐ-పేస్ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మార్చి 9న జాగ్వార్ ఐ-పేస్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో తొలి ప్రీమియం పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదేనని కంపెనీ అంటోంది. వాహనానికి 90 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని పొందుపరిచారు. 696 ఎన్ఎం టార్క్, 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 80కిపైగా అంతర్జాతీయ అవార్డులను ఈ కారు సొంతం చేసుకుంది. వీటిలో 2019లో అందుకున్న వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ గ్రీన్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఉన్నాయి. ఆఫీస్, హోం చార్జింగ్ సొల్యూషన్స్ కోసం టాటా పవర్‌తో కంపెనీ చేతులు కలిపింది. యమహా ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ కొత్త శ్రేణి జపాన్ ద్విచక్ర వాహనాల దిగ్గజం యమహా తాజాగా తమ ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ సిరీస్‌లో కొత్త శ్రేణిని ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,03,700 నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్, ఎఫ్ఐ మోడల్స్ ఉన్నాయి. బీఎస్6 ఇంజిన్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్, ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టం), ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి ఫీచర్లతో ఇవి తేలికగా ఉంటాయని సంస్థ తెలిపింది. మోటర్‌సైకిల్ బరువును 137 కేజీల నుంచి 135 కేజీలకు తగ్గించినట్లు వివరించింది. ధర రూ. 1,03,700 నుంచి ప్రారంభం -
జాగ్వార్ Vs అనకొండ.. భయంకర వీడియో!
అనకొండ, బ్లాక్ పాంథర్(నల్ల చిరుతపలి) మధ్య ఫైట్ జరుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2013లోనే బయటకొచ్చిన వీడియో. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఇటీవల ట్విటర్లో పోస్టు చేయడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దక్షిణ అమెరికాలోని గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అదే విధంగా జాగ్వార్ విషయానికొస్తే అమెరికాలోనే ఇది పెద్ద పిల్లి. ఈ రెండు తమ బలాన్ని నిరూపించుకునేందుకు తలపడితే ఆ దృశ్యాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఉంది. ఇందులో ఈ రెండు భయంకరంగా పోరాడుతూ.. నీటిలోకి, నేల మీదికి లాక్కుంటూ వేటికవే తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. చదవండి: నెవెర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఫైట్ సీన్! ఈ వీడియోలో మెలనిస్టిక్ జాగ్వార్ దీనినే బ్లాక్ పాంథర్ అని కూడా పిలుస్తారు. ఇది భారీ అనకొండను నీటి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము మాత్రం బ్లాక్ పాంథర్నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనకొండను వదలకుండా పట్టు బిగిస్తూ భూమి మీదకు లాగుతోంది. మరి ఈ పోరాటంలో ఎవరిది పై చేయి సాధించిందనేది తెలియలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. జాగ్వార్ అద్భుతంగా పోరాడిందని, వీడియో భయంకరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ అనకొండలు ప్రపంచంలోనే అత్యంత భారీ పాములలో ఒకటి. అంతేగాక 130 కిలోల వరకు బరువు కలిగి ఉంటాడి. వీటికి నీటిలో వేగం అమితంగా ఉంటుంది. అయితే భూమిపై వీటి బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీళ్లున్న ప్రదేశాల సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటాయి. Registro raríssimo de uma onça-pintada lutando com uma sucuri. pic.twitter.com/bQPGu9Cutn — Biodiversidade Brasileira (@BiodiversidadeB) January 5, 2021 -
వీటిలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?
లాక్డౌన్ విధించిన నాటి నుంచి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వస్తే కరోనా పలకరిస్తుందనే భయంతో ఇళ్లలోనే గడిపారు. దాంతో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. జనాలను ఎంటర్టైన్ చేయడానికి సోషల్ మీడియాలో పలు క్విజ్లు, గేమ్‌లు తెగ నడిచాయి. సాధారణంగా పులుల గురించి టాపిక్ వస్తే.. చితా, లియోపార్డ్, జాగ్వార్ వంటి పేర్లను వింటూ ఉంటాం. చూడ్డానికి అన్ని ఒకేలా ఉంటాయి. వాటి శరీరం మీద మచ్చల ఆధారంగానే ఏది ఏంటనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ ఓ సరికొత్త చాలెంజ్‌తో నెటిజనుల ముందుకు వచ్చారు. ముఖం కనిపించకుండా తీసిన రెండు పులుల ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దాంతో పాటు.. ‘ఈ రెండింటింలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?’ అంటూ ప్రశ్నించారు కస్వాన్. Lets see how many can identify. Which one of them is Jaguar & which one is Leopard. The pattern makes the difference, apart from other things. pic.twitter.com/K10kRUxiqE — Parveen Kaswan (@ParveenKaswan) July 20, అంతేకాకుండా ముఖం చూడకుండా.. కేవలం వాటి శరీరం మీద ఉన్న మచ్చల ఆధారంగానే తాము వీటి మధ్య తేడాను గుర్తిస్తామని తెలిపారు కస్వాన్. ప్రస్తుతం ఈ చాలెంజ్ తెగ వైరలవుతోంది. మరికొందరు నెటిజనుల దీనికి చిరుత ఫోటోను కూడా జత చేశారు. మీరు ఓ సారి ప్రయత్నించండి.(ఈ వీడియో భయంకరంగా ఉంది!) -
సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!
న్యూఢిల్లీ : ‘నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు.. బైట కుక్క చేత భంగ పడును’ అన్న పద్యం కచ్చితంగా వినే ఉంటాము. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి శక్తి ఏనుగును సైతం చంపేలా ఉంటుందని, బైటి కొచ్చినపుడు కుక్క కూడా దాంతో ఓ ఆట ఆడుకుంటుందని దానర్థం. అయితే కొన్ని కొన్నిసార్లు నీళ్లలో ఉన్నప్పుడు కూడా మొసలి ప్రాణాలకు భరోసా ఉండదు. చిరుత పులి ప్లాన్ వేసి నీళ్లలోకి దూకిందంటే మొసలి ఖతం కాక తప్పదు. ( 1100 కి.మీ. ప్రయాణించిన మొసలి) సింహాల గుంపుకు సాధ్యంకాని పనిని కూడా చిరుత పులులు ఈజీగా చేసేస్తాయి. చిరుత పులులు మొసళ్లను వేటాడిన పాత వీడియో సమూహం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్ట్ ఫర్ నేచర్ లవర్స్ అనే ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. -
జేఎల్ఆర్ చేతికి ‘బౌలర్’
న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కొనుగోలు చేసింది. ఆఫ్–రోడ్ కాంపిటీషన్ కార్లను కూడా తయారు చేసే బౌలర్ కంపెనీ ఇకపై జేఎల్ఆర్కు చెందిన స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ వ్యాపారంలో ఒక భాగం కానుంది. అయితే ఎంత మొత్తానికి ఈ సంస్థకు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం జేఎల్ఆర్ వెల్లడించలేదు. -
కొత్త కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ మాయం
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతున్నా కొద్దీ కార్లు నడపడం చాలా సులువు అవుతూ వస్తోంది. ఇప్పటికే చాలా కార్లలో గేర్‌కు బదులుగా ఆటో గేర్ సిస్టమ్ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హ్యాండ్ బ్రేక్‌ను మాత్రం డ్రైవరే వేయాల్సి వచ్చేది. ఆ విధానానికి స్వస్తి చెబుతూ మొట్టమొదటి సారిగా జాగ్వర్ కార్లలో బటన్ సిస్టమ్ వచ్చింది. బటన్ నొక్కితే చాలు హాండ్ బ్రేక్ దానంతట అదే పడిపోతోంది. జాగ్వర్ కార్లను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ల్యాండ్ రోవర్, లెక్సెస్, మెర్సిడెస్ బెంజి, పోర్షే ఖరీదైన కార్లు కూడా పుష్ బటన్ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 32 కార్ల కంపెనీల వాహనాలను అధ్యయనం చేయగా ఇప్పటికే జాగ్వర్, ల్యాండ్ రోవర్, లెగ్సస్, మెర్సిడెస్, పోర్షే కార్లలో హ్యాండ్ బ్రేక్ లివర్ పూర్తిగా కనుమరుగైంది. ఇక షో రూముల్లో పరిశీలిస్తే ప్రతి పది కంపెనీల కార్లలో మూడు కంపెనీల కార్లలో మాత్రమే ఇంకా హ్యాండ్ బ్రేక్ వ్యవస్థ ఉంది. డేషియా, సుజికీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ హ్యాండ్ బ్రేకర్ల వ్యవస్థనే ఉపయోగిస్తున్నాయి. హ్యాండ్ బ్రేక్ వేసి ఉందా, లేదా అన్న విషయం డాష్ బోర్డులో రెడ్ మార్కుతో కనిపిస్తుంది. హ్యాండ్ బ్రేకుల్లో కూడా ఆటోమేటిక్ వ్యవస్థ వస్తోంది. కొండలు, గుట్టలు ఎక్కుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొండ ఎక్కుతున్నప్పుడు కారు ముందుకు పోలేక వెనక్కి జారుతున్నప్పుడు ఈ ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేసి హ్యాండ్ బ్రేక్ దానంతట అదే పడుతుంది. డ్రైవర్ అవసరం లేని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తోన్న నేపథ్యంలో డ్రైవర్ మరింత సులువుగా కార్లు నడిపే దిశగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. -
వరదలో రేసు.. విన్నర్ ఎవరు?
-
బొలెరో Vs జాగ్వర్: వరదలో రేసు.. విన్నర్ ఎవరు?
ముంబైని బుధవారం భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై నగరం సముద్రం పక్కన మరో సహా సముద్రాన్ని తలపించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలో జలమయమైన ముంబైలోని ఓ రోడ్డులో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. వరదనీటిలో ముందుకుపోలేక విలాసవంతమైన జాగ్వార్ సెడాన్ కారు రోడ్డు మధ్యలో ఆగిపోగా.. దాని వెనుక వచ్చిన మహేంద్ర బోలెరో ఎస్యూవీ.. వరదనీటిలోనూ జూమ్జూమ్మంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మోహన్ చంద్రాని అనే నెటిజన్ ఈ వీడియోను ట్వీట్‌చేసి.. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రకు ట్యాగ్ చేశారు. అయితే, జాగ్వర్ వర్సెస్ బొలెరో అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోపై ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ.. దీనిపై తాను గొప్పలు చెప్పుకోబోనని, సముద్రాన్ని తలపించే పరిస్థితుల నడుమ కార్ల మధ్య పోటీ అనడం సరికాదని పేర్కొన్నారు. అయితే, వరదల్లోనూ రాజాలా దూసుకుపోయే బొలెరో కారు తన ఫెవరెట్ వెహికిల్ అని అభిప్రాయపడ్డారు. -
టాటా మోటార్స్ ‘బ్రేక్స్’ ఫెయిలవ్వడానికి కారణాలేంటి?
2008... ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బతో దివాలా కోరల్లోకి జారుకున్న ఫోర్డ్ మోటార్స్ తన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)ను అమ్మకానికి పెట్టింది. అప్పటివరకూ భారతీయ కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్ అధిపతి రతన్‌టాటా చేశారు. పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్ డాలర్లు(అప్పట్లో మన కరెనీప్రకారం రూ.9,300 కోట్లు) వెచ్చించి టాటా మోటార్స్ జేఎల్ఆర్ను సొంతం చేసుకుంది. అంతభారీ మొత్తం అవసరమా అన్నవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టేలా... జాగ్వార్‌పై టాటాలు లాభాల స్వారీ చేశారు. దేశీ వాహన మార్కెట్లో పోటీపడలేక ఆపసోపాలు పడుతున్న టాటామోటార్స్కు జేఎల్ఆర్ ఆతర్వాత కాలంలో నిజంగా కామధేనువే అయింది. అంతర్జాతీయంగా అమ్మకాల్లో జేఎల్ఆర్ చిరుతలా దూసుకెడుతూ మాతృసంస్థను ఆదుకుంటూ వచ్చింది. 2019... పదేళ్లు తిరిగేసరికి అంతా రివర్స్‌గేర్. ఒకప్పుడు సంస్థకు సంజీవనిలా పనిచేసిన అదే జేఎల్ఆర్... ఇప్పుడు మాతృ సంస్థను కనీవినీఎరుగని నష్టాల లోయలోకి తోసేసింది. షేరు విలువ కూడా అంతకంతకూ పాతాళంలోకి జారిపోతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు టాటామోటార్స్ ‘బ్రేక్స్’ ఫెయిల్ అవడానికి దారితీసిన కారణాలేంటి? ఎందుకిలా తలకిందులైంది? భవిష్యత్తు ఏంటి?... వీటన్నింటిపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనం ఇది... సాక్షి, బిజినెస్ విభాగం బస్సులు, ట్రక్కులు, మిలిటరీ వాహనాల నుంచి కార్ల దాకా అన్ని రకాల వాహనాల తయారీలోలో ఉన్న టాటా మోటార్స్.. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలు ప్రకటించడం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 26,961 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో టాటా మోటార్స్ షేరు ఇంట్రాడేలో ఏకంగా 30% కుప్పకూలింది. ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్ విలువ రూ. 9,000 కోట్ల పైచిలుకు హరించుకుపోయింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)లో పెట్టుబడుల విలువను తగ్గించాల్సి రావడమే భారీ నష్టాలకు కారణంగా టాటా మోటార్స్ చెబుతోంది. ఏడాది వ్యవధిలో టాటా మోటార్స్ మార్కెట్ విలువ ఏకంగా 62% పడిపోవడం కంపెనీ దారుణ పరిస్థితికి నిదర్శనం.ప్రస్తుతం టాటా మోటార్స్ అమ్మకాల్లో 70–75 శాతం దాకా, లాభాల్లో 90 శాతం దాకా వాటా జేఎల్ఆర్దే ఉంటోంది. అయితే, గడిచిన మూడు, నాలుగు త్రైమాసికాలుగా.. అమ్మకాలు మందగిస్తుండటం, లాభాల మార్జిన్లు తగ్గుతుండటం తదితర అంశాలు జేఎల్ఆర్ తీరుపై సందేహాలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. 2016 ఆర్థిక సంవత్సరం దాకా రెండంకెల స్థాయి వృద్ధితో దూసుకెళ్లిన జేఎల్ఆర్ అమ్మకాలు ఆ తర్వాత నుంచి చాలా నెలల్లో సింగిల్ డిజిట్‌లోనే నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని కీలకమైన లగ్జరీ మోడల్స్‌ను నిలిపివేసి కొత్త వాటితో భర్తీ చేస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణమంటూ కంపెనీ చెబుతున్నా.. అసలు కారణాలు ఇంకా వేరేవి చాలానే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రాజుకున్న బ్రెగ్జిట్ కుంపటి... జేఎల్ఆర్ రాజకీయ, భౌగోళిక అనిశ్చితితో పాటు టెక్నాలజీపరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్రెగ్జిట్పరమైన ఆందోళనలతో పాటు యూరప్‌లో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతుండటం, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు మందగిస్తుండటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధభయాలు మొదలైనవి జేఎల్ఆర్కు ప్రతికూలంగా ఉంటున్నాయి. జేఎల్ఆర్ అమ్మకాల్లో ఈ మూడు ప్రాంతాల వాటా సుమారు మూడో వంతు ఉంటుంది. మొత్తం జేఎల్ఆర్ విక్రయాల్లో చైనా మార్కెట్ వాటానే 24 శాతం పైగా ఉండేది. కానీ అక్కడ డిమాండ్ మందగిస్తుండటం సమస్యగా మారింది. చైనాలో జేఎల్ఆర్ అమ్మకాలు 42% పడిపోయాయి. సంపన్న మార్కెట్ల ఆర్థిక వ్యవస్థలు కూడా పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో లగ్జరీ, డీజిల్ వాహన విక్రయాల మందగిస్తుండటం సైతం జేఎల్ఆర్కు ప్రతికూలంగా మారుతోంది. ఇక బ్రెగ్జిట్ వివాదంతో బ్రిటన్ నుంచి ఎగుమతి చేసే కార్లపై మిగతా యూరోపియన్ యూనియన్ దేశాల్లో అధిక పన్నులు వర్తించనుండటం కూడా ప్రతికూలంగా ఉంటోంది.ఒకవేళ చెకోస్లొవేకియా ప్లాంట్ గానీ అందుబాటులోకి వస్తే .. జేఎల్ఆర్కు ఈ భారం కాస్త తగ్గొచ్చు. జేఎల్ఆర్ అమ్మకాల సరళి సైతం సమస్యలకు కొంత కారణంగా ఉంటోంది. జేఎల్ఆర్కి సంబంధించి లాండ్ రోవర్‌తో పోలిస్తే జాగ్వార్ వాహనాల విక్రయాల మార్జిన్ చాలా తక్కువ. అంతర్జాతీయంగా దిగ్గజాలైన బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్‌లతో పోటీపడాల్సి రావడమే ఇందుకు కారణం. జేఎల్ఆర్ వాహనాలు పటిష్టమైన ఎస్‌యూవీలకు మాత్రమే పేరొందాయి. అటు, టయోటా లాంటి సంస్థలతో పోలిస్తే జేఎల్ఆర్ చిన్న సంస్థ. ఇలాంటివి కేవలం ఒక ప్రత్యేక విభాగంపై మాత్రమే ఆధారపడితే ఫలితాలు ఉంటాయి. కానీ పోటీ సంస్థల తరహాలో ప్రతీ విభాగంలోకి ప్రవేశించడం, వాటిని నిర్వహించడం జేఎల్ఆర్ తలకు మించిన భారంగా మారింది. పైపెచ్చు, జాగ్వార్, ల్యాండ్రోవర్ల కార్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ సొంత గ్రూప్ వాహనాల విక్రయాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ఎఫ్ పేస్ ఎస్యూవీ, రేంజ్ రోవర్ ఎవోక్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, వేలార్ లాంటివి ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా మళ్లుతోంది. అయితే, ఈ విషయంలో జేఎల్ఆర్ వ్యూహాలు మెప్పించేవిగా లేవని పరిశీలకులు అంటున్నారు. బ్రెగ్జిట్ పరిణామాలతో విదేశీ మారకంపరమైన నష్టాలు కూడా జేఎల్ఆర్ ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆదాయాలు తగ్గితే.. తదుపరి ఆవిష్కరణలపైనా, ఆపై మార్కెటింగ్‌పైనా ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్నది అంచనా. కోలుకునే అవకాశాలు ఉన్నాయా.. చుట్టూరా ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న టాటా మోటార్స్‌కి దేశీ అమ్మకాలు మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. దేశీయ వ్యాపారం ఊపందుకుంటోందని, మార్కెట్ వాటా పెరుగుతుండటంతో పాటు లాభదాయకత కూడా వృద్ధి నమోదు చేస్తోందని మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. టర్నెరౌండ్ 2.0 వ్యూహం మంచి ఫలితాలే ఇస్తోందంటూ తెలిపారు. ఇక జేఎల్ఆర్లో కూడా వ్యయాల నియంత్రణ చర్యలు తీసుకోనుంది. 2.5 బిలియన్ పౌండ్ల టర్నెరౌండ్ ప్లాన్‌లో భాగంగా 4,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కొత్త కార్ల మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడులతో ప్రత్యర్థి సంస్థలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, వ్యయాల నియంత్రణతో నష్టాలు కొంత మేర తగ్గించుకోగలిగినా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానీ అమ్మకాల గ్రాఫ్ కొంత కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జేఎల్ఆర్ అమ్మకాలు 7% క్షీణించవచ్చని, వచ్చే సారి మాత్రం లో బేస్ ఎఫెక్ట్, కొత్త ఆవిష్కరణల ఊతంతో కాస్త మెరుగ్గా ఉండొచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. కొత్త మోడల్స్, కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ వాహనాలు ఎంతవరకూ క్లిక్ అవుతాయన్న దానిపై కంపెనీ టర్నెరౌండ్ ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల మాట. దేశీయంగా ట్రక్కులు, ప్యాసింజర్ కార్ల అమ్మకాలు కాస్త పెరుగుతున్నట్లు కనిపించినా.. గత త్రైమాసికంలో ట్రక్స్ విక్రయాలు అనూహ్యంగా తగ్గాయి. లిక్విడిటీ, ఫైనాన్సింగ్ సమస్యలు, వాణిజ్య విభాగంలో కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం ఆటోమొబైల్ రంగానికి సవాలుగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఎంత మేర ఫలితాలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. షేరు ఢమాల్ .. టాటా మోటార్స్ షేరు శుక్రవారం ఎన్ఎస్ఈలో ఏకంగా 29.45 శాతం పడి.. రూ.129 స్థాయిని తాకింది. సుమారు పాతికేళ్ళ తర్వాత ఇంతలా పడటం ఇదే ప్రథమం. 1993 ఫిబ్రవరి 2న షేరు 40.5 శాతం పడింది. కాగా, చివర్లో కోలుకుని 17.58 శాతం నష్టంతో రూ. 151 వద్ద క్లోజయ్యింది. ఒకే రోజున కంపెనీ మార్కెట్ విలువ రూ. 9,124 కోట్లు క్షీణించి రూ. 52,809 కోట్ల నుంచి రూ. 43,685 కోట్లకు పడిపోయింది. -
జాగ్వార్ ఎక్స్‌జేలో స్పెషల్ ఎడిషన్
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) జాగ్వార్ ఎక్స్‌జే మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్, జాగ్వార్ ఎక్స్‌జే50ను అందిస్తున్నట్లు జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి తెలిపారు. ఈ కారు ధర రూ.1.11 కోట్లని పేర్కొన్నారు. 3 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19– అంగుళాల అలాయ్ వీల్స్‌ను రూపొందించామని చెప్పారాయన. వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటానికి 6.2 సెకన్లు చాలని... ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్– స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. -
నయన్‌కు డ్రైవర్ ఎవరో తెలుసా?
సినిమా: నటి నయనతార కొత్తగా జాగ్వర్ కారు కొన్నది. దానికి డ్రైవర్ ఎవరో తెలుసా? అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఇంతకు ముందు యువ హీరోలను సపోర్ట్‌గా చేసుకుని హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకే అధిక ప్రాముఖ్యతనిస్తూ వచ్చిన ఈ సంచలన నటి ఈ మధ్య స్టార్ హీరోలతో కమర్శియల్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించిన ఈ జాణ తదుపరి విజయ్‌తో జత కట్టనుంది. మరో పక్క అరమ్–2 వంటి కథానాయకి సెంట్రిక్ పాత్ర చిత్రాలను చేయడానికి సిద్ధం అవుతోందనుకోండి. ఈ బ్యూటీ సినిమా విషయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా చూస్తే ఇటీవల ఈ అమ్మడు జాగ్వర్ అనే ఖరీదైన కారును కొనుగోలు చేసింది. అయితే ఆమె ప్రస్తుత స్థాయికి అలాంటి కారు కొనడం పెద్ద విషయమేమీ కాదు. ఒక చిత్రానికి రూ.5 కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటోంది. కాగా నయనతార బయట ప్రాంతాల్లో షూటింగ్ అయితే బీఎండబ్ల్యూ కారును వాడుతుందట. అందుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. కొత్తగా కొన్న జాగ్వర్ కారును చెన్నైలో షూటింగ్‌లకు ఉపయోగిస్తుందట. దీనికి మాత్రం డ్రైవర్ తన లవర్ విఘ్నేశ్శివన్నే నట. ఆయన నయనతారపై ఉన్న ప్రేమతో ఆమె డ్రైవర్ బాధ్యతలను తనే తీసుకున్నాడట. నయనతార కారుకు డ్రైవర్‌గా మారడమే కాకుండా, ఆమె నటించే చిత్రాల కథలను తనే వింటున్నారు. తన ప్రియురాలు సంతోషంగా ఉండాలని ఆమెకు నచ్చిన విషయాలను చేస్తున్నారట. అందుకే విఘ్నేశ్ శివన్ సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపిస్తుంది. నయనతారను సంతోషంగా ఉంచడం బాగానే ఉందిగానీ,ఆమెను త్వరలో పెళ్లి చేసుకోవలసిందిగా విఘ్నేశ్ శివన్‌ను అభిమానులు ఒత్తిడి చేస్తున్నారట. వారి కోరికలోనూ న్యాయం ఉంది కదా! -
ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తలెత్తగల సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉందని వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు. అత్యవసర సమయాల్లో మిత్రదేశాలకు సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు ముందుంటుందని వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. ‘దేశానికి సరిహద్దుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్‌కు అపరిష్కృత సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల కారణంగా ప్రధాన ముప్పు ఎదురవుతోంది. సరిహద్దు అవతల నుంచి ఎదురయ్యే ఉగ్రముప్పును సైతం ఐఏఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. పొరుగున ఉన్న దేశాలు(చైనా, పాక్) ఆయుధ వ్యవస్థల్ని శరవేగంగా ఆధునీకరించడం, మౌలిక వసతులను మెరుగుపర్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు దీటుగా మిగ్–29, జాగ్వార్, మిరేజ్–2000లను ఆధునీకరిస్తున్నాం. అలాగే 83 తేజస్, 36 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేస్తున్నాం’ అని తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ చురుకైన పాత్ర పోషించడంపై స్పందిస్తూ..‘ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్ పూర్తి అప్రమత్తంగా ఉంది. అత్యధిక సీ–17 గ్లోబల్ మాస్టర్ యుద్ధ విమానాలు వినియోగిస్తున్న జాబితాలో ఐఏఎఫ్ రెండోస్థానంలో ఉంది. వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల యుద్ధవిమానాలు కావాల్సి ఉండగా 32 స్క్వాడ్రన్లు ఉన్నాయన్నారు. -
జాగ్వార్ దేశీ ‘ఎఫ్–పేస్’
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)... మేకిన్ ఇండియా పాలసీలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన జాగ్వార్ ‘ఎఫ్–పేస్’ ఎస్‌యూవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2 లీటర్ల టర్బో చార్జ్ ఇంజినియం పెట్రోల్ ఇంజిన్‌ను కలిగిన ఈ కారు ధర రూ.63.17 లక్షలు. పార్క్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, కాబిన్ ఎయిర్ ఐయోనైజేషన్, డ్రైవర్ కండీషన్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తాజా ఎస్యూవీ ద్వారా భారత మార్కెట్లో జాగ్వార్ మరింత మెరుగుపడిందని సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 27 అవుట్లెట్ల ద్వారా ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎఫ్–పేస్, ఎక్స్‌జే, ఎఫ్–టైప్ రేంజ్ జాగ్వార్లను సంస్థ విక్రయిస్తోంది. -
కుమారస్వామితో షూటింగ్ లోకేషన్‌కు కేటీఆర్
-
కన్నడ మూవీ సెట్లో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ కన్నడ మూవీ షూటింగ్ జరుగుతున్న లోకేషన్‌కు వెళ్లారు . కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సీతారామ కల్యాణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. కుమారస్వామితో కలిసి షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన కేటీఆర్ యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. నిఖిల్ గౌడతో కలిసి సినిమా రషెస్ చూసి సాంకేతిక నిపుణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో కుమారస్వామితో పలు రాజకీయ అంశాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.