kamareddy dist
-
విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలి!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ.. విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్‌లైన్ విధించింది. మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో గురువారం సమావేశమైన రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా విలీన గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానించింది. ఈ నెల 20 లోపు రాజీనామా చేయాలని డెడ్‌లైన్ విధించింది. అలాగే సంక్రాంతి పండుగ రోజున రైతులంతా కుటుంబ సమేతంగా కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈనెల 17న పాతరాజంపేట గ్రామంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ ద్వారా ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లతో పాటు వంద ఫీట్ల రోడ్ల పేరుతో భూములను కొల్లగొట్టే ప్రయత్నాలను నిరసిస్తూ రైతులంతా నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, మాస్టర్‌ప్లాన్ పై అభ్యంతరాలకు ఈ నెల 11న గడువు ముగిసింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని కోరుతూ 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి రైతులు వినతిపత్రాలు అందజేశారు. అయితే మున్సిపల్ తీర్మానంపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాల ద్వారా కౌన్సిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాగా విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవిలు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తరువాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు చెప్పారు. -
కామారెడ్డి జిల్లా : పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
-
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
-
Panchakshari Nagini: టాలెంట్‌కు మూ'ల'కం
కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్‌పాస్‌గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు. స్మార్ట్ ఆలోచనతో ఆన్లైన్లో రికార్డ్ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేటర్‌గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్ రైటింగ్.. అన్నింటా తానే ఫస్ట్ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్ చదివి ఆపై సివిల్స్‌లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్‌గా క్లాసులు చెబుతుంటుంది. స్కూల్ నుంచి ఇస్రోకు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్ టాలెంట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్ లెవల్ సైన్స్ ఫేయిర్‌లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్ రైటింగ్లోనూ గోల్డ్‌మెడల్ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది. టాలెంట్ టెస్ట్ కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్లైన్ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే 22 సెకన్లలో 118 మూలకాల పేర్లు చదివి కలాం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్లైన్లో జరిగిన నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ‘లర్న్ సంథింగ్ విత్ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్‌లో చానల్ నిర్వహిస్తోంది. మోటివేటర్‌గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది. ఆన్లైన్ రికార్డులు నా లక్ష్యం సివిల్స్ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్పాయింట్లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది. – పంచాక్షరి నాగిని – ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఎంపీడీవోలు ఇలా ఉంటే ఎలా? కామారెడ్డి కలెక్టర్‌కు మంత్రి మందలింపు
సాక్షి, నిజామాబాద్ : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులు సైతం రాజకీయ నాయకుల్లాగా గాలిమాటలు, తప్పుడు లెక్కలు చెబితే ఎలా అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లా పరిషత్ హాలులో 5వ విడత పల్లెప్రగతి పనులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ధామాలు ఎన్ని వినియోగంలోకి వచ్చాయని కామారెడ్డి డీపీవోను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. డీపీవో సరైన లెక్కలు చెప్పలేదు. ఎంపీడీవోలు సైతం వివరాలు చెప్పకపోవడంతో ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై నమ్మకం లేకుండా పోయిందన్నా రు. వైకుంఠ ధామాలు వాడుకలోకి రాకుండానే చ్చినట్లు తప్పుడు లెక్కలు ఎలా చెబుతారన్నారు. లెక్కల్లో స్పష్టత ఉండాలన్నారు. మండలాల వారీగా కచ్చితమైన నివేదిక ఉండాలన్నారు. కాకిలెక్కలు చెబితే ఎలా అన్నారు. కామారెడ్డి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎంపీడీవోలు ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ క్ర మంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలుగజేసుకున్నారు. లెక్కలపై సందేహం వస్తోందన్నారు. కామారెడ్డి కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకోవాలన్నారు. ఈ నెల 18 లోగా మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు నీటి సౌకర్యం కల్పించి వాడుకలోకి తేవాలన్నారు. లేనిపక్షంలో మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం నుంచి తాను కాపాడలేనన్నారు. నెల తరువాత మళ్లీ వచ్చి చూస్తానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గ్రామపంచాయతీలు ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చె త్త నుంచి ఆదాయం ఆర్జించాలని మంత్రులు ఎర్ర బెల్లి, ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని ఓ చిన్న తండా మొక్కల పెంపకం ద్వారా రూ.15 లక్షల ఆదాయం ఆర్జించిందన్నారు. ట్రాక్టర్లు చాలకపోతే మరొక ట్రాక్టర్ తీసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థా ల తో మంచి ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ప్రస్తు తం ఇతర రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ దిగుమతి అవుతోందన్నారు. నిధుల కొరత లేదన్నారు. ఉపాధి హా మీ నిధులను పంచాయతీలు తెలివిగా వాడు కోవాలన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్షి్మ, షాదీముబారక్, పింఛన్లు, కేసీఆర్ కిట్లు తదితర సంక్షేమ పథకాల గురించి ఆయా పంచాయతీల్లో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ లెక్కలతో ఉంచాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్, గంగాధర్‌గౌడ్,ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సి నారాయణరెడ్డి, జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్: ఫాంహౌస్‌పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్ -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు
సాక్షి, కామారెడ్డి క్రైం: తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అక్కతో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమెపై చెల్లి మరిగిన నూనె పోసింది. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసు కుంది. కాలనీలో నివాసం ఉండే షేక్ చాందిని, నా గూర్‌బీలు అక్కాచెల్లెళ్లు. ఇది వరకే ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. తమ భర్తలతో గొడవల కారణంగా ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా చాందినికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటోంది. చెల్లెలు నాగూర్‌బీ కూడా శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉండేది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి తన అక్క కూడా సన్నిహితంగా ఉంటుందని జీర్ణించుకోలేక కాగుతున్న నూనెను నిద్రిస్తున్న చాందినిపై తన చెల్లెలు నాగూర్‌బీ పోసింది. తీవ్రగాయాలైన చాందినిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసుధన్‌గౌడ్ తెలిపారు. చదవండి: ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో -
కళ్లల్లో కారం కొట్టి చైన్‌స్నాచింగ్.. దొంగకు చుక్కలు చూపించిన సూపర్ ఉమెన్
సాక్షి, కామారెడ్డి: చైన్‌స్నాచింగ్ యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పొలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపులో ఉన్న ఆయన భార్య కంట్లో కారంపొడి చల్లి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి సరుకులు కొనేందుకు వచ్చిన భారతి అనే మహిళ ఆ దొంగను అడ్డుకొని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుధ్ది చేసి గొలుసును బాధిత మహిళకు అప్పగించారు. నిందితుడి వద్దనున్న డ్రైవింగ్ లైసెన్సులో యాదగిరి, సదాశివనగర్ అని, ద్విచక్రవాహనానికి చెందిన ఆర్సీ కార్డుపై అజంపుర, మెదక్ అని వేర్వేరు అడ్రస్‌లు ఉన్నట్లు గుర్తించారు. కౌన్సిలర్లు పిట్ల వేణు, కోయల్కర్ కన్నయ్యలు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగను అడ్డగించిన భారతి అనే మహిళను స్థానికులు అభినందించారు. చదవండి: ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్ -
అండగా ఉంటాం...: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట ధా న్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలపైనే తను వు చాలించిన రైతు బీరయ్య ఇంటికి ప్రజాప్రతిని ధులు, నాయకులు వరుసకట్టారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య శుక్రవారం తెల్లవారేసరికి వడ్ల కుప్పమీదనే కన్నుమూసిన ఘటన ప్రజలను కంటతడి పెట్టించింది. ఈ నేపథ్యంలో రాజ కీయ పార్టీల నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బీర య్య కొడుకుతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. కాం గ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందవద్దని, రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావుతో కలసి ఐలాపూర్‌లోని బీరయ్య ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బీరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్లే బీరయ్య చనిపోయారని ఆరోపించారు. బీరయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం సాయం అందించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మరో కాంగ్రెస్ నేత సుభాష్‌రెడ్డి, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు బీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బీరయ్యది సహజ మరణమే! ఇదిలా ఉండగా లింగంపేట మండల అధికారులు.. ఎల్లారెడ్డి ఆస్పత్రి వైద్యుల నివేదిక ఆధారంగా బీరయ్యది సహజ మరణమేనని తేల్చారు. రైతు బీరయ్యది సహజ మరణమని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదంటూ జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. -
ధాన్యం రాశిపైనే ఆగిన ఊపిరి
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో వరి మంచి దిగుబడి వచ్చింది.. రైతు సంబురంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. వారం రోజులైనా తన వంతు రాలేదు. రోజూ రాత్రి చలిలో ధాన్యం కుప్పల వద్దే పడుకున్నాడు. అదే కుప్పపై గుండెపోటుతో కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ మండలంలోని ఐలాపూర్‌కు చెందిన పాతింటి మామిడి చిన్న బీరయ్య (56) తనకున్న పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమి కలిపి నాలుగున్నర ఎకరాల్లో వరి వేశాడు. వరికోతలు పూర్తికావడంతో గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాడు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వరుస నంబర్లు కేటాయించగా.. బీరయ్యకు 70వ నంబర్ వచ్చింది. ఆ రోజు నుంచి ధాన్యం కోనుగోలు కోసం పడిగాపులు పడుతూ వచ్చాడు. చలిగా ఉన్నా రోజూ రాత్రి ధాన్యం కుప్పవద్దే నిద్రపోయాడు. రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడవడంతో ఆరబెడుతూ అవస్థలు పడ్డాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి.. తన వడ్ల కుప్పపై పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తోటి రైతులు గమనించే సరికి చనిపోయి ఉన్నాడు. అధికారులు బీరయ్య మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. ఇది తెలిసి కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయారు. ధాన్యం కొనుగోలు కాలేదన్న మనోవేదనతోనే బీరయ్య గుండెపోటుతో చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. బీరయ్యకు భార్య పోచవ్వ, కుమారులు రాజేందర్, మహేశ్ ఉన్నారు. సీఎంవో అధికారుల ఆరా..! వరికుప్పపై రైతు మృతి చెందిన విషయమై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. బీరయ్య ఎలా చనిపోయాడని జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కాగా.. కొనుగోలు కేంద్రం వద్ద రైతు మరణించిన వార్త దావానలంలా వ్యాపించడంతో.. చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రైతు కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే మండల, జిల్లా అధికారులెవరూ బీరయ్య చనిపోయిన కొనుగోలు కేంద్రం వద్దకు గానీ, ఆయన ఇంటికిగానీ రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. -
కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీరందిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని.. 100 శాతం కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలిపారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటించారు. కామారెడ్డిలో నూతన కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు.అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కూడా మంజూరు చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కొరత లేకుండా చేశామని సీఎం అన్నారు. ‘‘ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్. కల్యాణలక్ష్మీ, రైతుబంధు వంటి పథకాలు పెట్టాం. పెన్షన్ రూ.200 నుంచి రూ.2వేలకు పెంచామని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: సిద్ధిపేట నేను పుట్టిన జిల్లా: సీఎం కేసీఆర్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ -
2 కిలోమీటర్లు లాక్కెళ్లిన లారీ.. ఇద్దరి దుర్మరణం
సదాశివనగర్ (ఎల్లారెడ్డి)/కామారెడ్డి: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ శివారులో 44వనంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన గడ్డం మమత (32), గడ్డం లక్ష్మి(41)తో పాటు మరి కొందరు.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు రెండు ఆటోలు, ఒక తుఫాన్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పద్మాజివాడి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోనుంచి గడ్డం మమత రోడ్డుపై పడిపోగా, ఆమె తలపై నుంచి లారీ వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే ఆటోలో ఉన్న గడ్డం లక్ష్మి లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోగా, సుమారు రెండు కిలోమీటర్ల వరకు రహదారి వెంట ఈడ్చుకెళ్లడంతో ఆమె కూడా దుర్మరణం చెందింది. ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ చిన్న బాలయ్య, రాజయ్య, సాయవ్వలను నిజామాబాద్‌కు, ఆవునూరి రాజవ్వ, దోమకొండ లక్ష్మి, గడ్డం బాల్‌రాజ్, లక్ష్మిలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నేరుగా సదాశివనగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.శేఖర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం -
Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్కు దూరమైనట్లే కనిపిస్తోంది! పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చే సిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట నడుస్తున్నారు. ఆయన కోటరీలో ఒకరిగా ఉంటూ ఆయన వెంటే తిరుగుతున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా.. ఇతర పార్టీలో చేరడమా? అన్న దానిపై రా జేందర్ వేస్తున్న అడుగుల్లో రవీందర్‌రెడ్డి వెన్నంటి ఉండడం గమనార్హం. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారి పోనున్నాయి. చదవండి: Etela Rajender: బీజేపీలో చేరికపై బండి సంజయ్ క్లారిటీ గులాబీ జెండా ఆవిర్భావం నుంచి.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన కేడర్ ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత నామినేటెడ్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజాల సురేందర్ అనూహ్యంగా గులాబీ గూటికి చేరడం, నియోజక వర్గ బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించడంతో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన తనను కాదని సురేందర్‌ను చేర్చుకోవడంతో మాజీ ఎమ్మెల్యే నిరాశ చెందారు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలతో నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. రెండున్నరేళ్లుగా పదవి దక్కక పోగా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనను, తన అనుచరులను పట్టించుకోక పోవడం రవీందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. చివరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ రవీందర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు నమోదు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలకు దూరమవుతూ వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బయటకు పంపింన నేపథ్యంలో రవీందర్‌రెడ్డి.. ఈటలను కలిసి అండగా నిలిచారు. మొదటి నుంచి పార్టీలో కలిసి పని చేసిన వారు కావడం, రవీందర్‌రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై ఉన్న కోపంతో ఈటలతో కలిసి అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్కు కొంత నష్టం.. ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమాల్లో నియోజక వర్గ ప్రజలు చురకైన పాత్ర పోషించారు. రవీందర్‌రెడ్డి వెంట ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఓటమి చెందినా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆయన వెన్నంటే ఉన్నారు. ఈటల కొత్త పార్టీ పెడితే రవీందర్‌రెడ్డి వెంట ఉన్న వారంతా ఆయనతో కలిసి పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే, ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వెంట ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాషాయ గూటికి చేరతారని తెలిసింది. అదే జరిగితే ఎల్లారెడ్డి నుంచి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డికి, ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య టిక్కెట్ కోసం పోటీ తప్పదు. రవీందర్‌రెడ్డి కమలం గూటికి చేరితే ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి ఒకరిని, జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి మరొకరిని నిలిపే అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. కాగా నియోజక వర్గంలో బలమైన కేడర్ కలిగి ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే అధికార పార్టీకి కొంత నష్టం తప్పదని భావిస్తున్నారు. ఈటల కోటరీలో ఒకడిగా.. మాజీ మంత్రి ఈటల కోటరీలో ఒకరిగా ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ తదితర పార్టీల నేతలను కలవడానికి వెళ్లిన ఈటల వెంట ఆయన ఉన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమా.. వేరే పార్టీలో చేరడమా? అన్న విషయంలో జరుగుతున్న చర్చల్లో రవీందర్‌రెడ్డి ఉండడం ద్వారా ఆయన టీఆర్ఎస్పై తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నారు. తమ చర్చలు, ప్రయత్నాల గురించి రవీందర్‌రెడ్డి తన అనుచరులకు ఎప్పటికప్పుడు స మాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో ఇన్నేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నట్టే కనిపిస్తోంది. ఏనుగు అనుచరులు చాలా రోజుల నుంచి పార్టీని వీడాలని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరుతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. -
మీ వల్లే 32 మందికి కరోనా.. కలెక్టర్ సీరియస్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా టెక్రియాల్ కస్తూర్బా పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం పట్ల జిల్లా కలెక్టర్ శరత్ సీరియస్ అయ్యారు. ఓ వైపు కోవిడ్ కేసులు పంజా విసురుతున్న తరుణంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ శరత్ బుధవారం సందర్శించారు. వైద్యులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్ఓ లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని బయటకు ఎలా పంపిస్తారని మండిపడ్డారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు విద్యార్థి కరోనా భారిన పడి ఉండవచ్చని, దానివల్ల అందరికి సోకి ఉంటుందన్నారు. తమ నిర్లక్ష్యం వల్లే 32 మందికి కరోనా సోకిందని మండిపడ్డారు. పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ స్కూల్లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజనం కూడా ఏర్పాటు చేయాలని ఒకవేళ ఇక్కడ వసతి లేకపోతే సౌత్ క్యాంపస్‌కు పంపించాలని పేర్కొన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎవరు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఇళ్లకు వెళ్తే కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేసుకుని తిరిగి రావాలని సూచించారు. తాము అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇబ్బంది అనుకుంటే ఇంటికి వెళ్లాలని, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాలలో శానిటేషన్ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు ఉన్నారు. కేజీబీవీలో కరోనా కలకలం కాగా జిల్లా కేంద్ర పరిధిలోని టేక్రియాల్‌లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కోవిడ్ కలకలం సృష్టించింది. విద్యాలయంలో 32 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా స్థానిక ఏఎన్ఎంలు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే మంగళవారం స్థానిక ఏఎన్ఎం సుజాత టేక్రియాల్ కేజీబీవీలో పరీక్షలు నిర్వహించారు. ఒకరికి పాజిటివ్ రావడంతో ఆమె తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యాలయంలోని 126 మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చింది. విద్య, వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై రెండు మొబైల్ టీంలను రప్పించారు. ల్యాబ్ టెక్నిషియన్లతో మళ్లీ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్షలు చేయించారు. 142 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. పదో తరగతి చదువుతున్న వారిలో 13 మంది, తొమ్మిదో తరగతిలో 12 మంది, ఏడో తరగతిలో ముగ్గురు, ఆరో తరగతిలో నలుగురు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ బాధితులను హోం క్వారంటైన్లో ఉంచారు. వైరస్ ఎలా వ్యాపించింది? టేక్రియాల్ కేజీబీవీలో 180 మంది విద్యారి్థనులు చదువుకుంటున్నారు. ఇటీవల శివరాత్రి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు కొందరు తమ స్వగ్రామాలకు వెళ్లి వచ్చారు. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది పిల్లలను చూడడానికి వచ్చి వెళ్లారు. దీంతో ఎక్కడో విద్యార్థికి వైరస్ సోకి ఉంటుందని, మిగతా విద్యార్థులకు వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి వైరస్‌బారిన పడినవారిని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు డీఈవో రాజు తెలిపారు. పాఠశాల అంతటా సానిటైజ్ చేయించామన్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు నమోదైన విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. తల్లిదండ్రులు స్వయంగా వచ్చి విద్యార్థులను తీసుకువెళ్లడం గమనార్హం. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడాలని, కోవిడ్ నిబందనలు పాటించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ సూచించారు. చదవండి: కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి -
32 మంది విద్యార్థులకు కరోనా..కలెక్టర్ సీరియస్
-
కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్డౌన్ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. వివరాలు.. నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్లైన్ క్లాస్‌ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్‌ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష -
‘విద్యా రంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు’
సాక్షి, కామారెడ్డి : విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి సబిత పాల్గొన్నారు. బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో 2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్ రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. చదవండి: ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోందని, ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు -
యూరియా కోసం బారులు..
-
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బెంగళూరులోని తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి పయనమయ్యారు. అల్లుడే తమ కూతురిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. కామారెడ్డికి చెందిన శరణ్య (25) సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే పట్టణానికి చెందిన, తన క్లాస్మేట్ అయిన రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు.(అత్తపై అల్లుడి దాడి) కాగా పెళ్లైన కొన్నాళ్ల తర్వాత నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక శరణ్య ఇటీవలే తల్లిగారింటికి వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న రోహిత్.. ఇకపై భార్యను కష్టపెట్టనని, వేధింపులకు గురిచేయనని పెద్దల సమక్షంలో ఒప్పుకొని మూడు నెలల కిందటే ఆమెను మళ్లీ కాపురానికి తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోహితే తమ కూతురిని చంపేసి ఉంటాడని లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటాడని ఆమె తల్లి మాధవి ఆరోపిస్తున్నారు. రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.(పెళ్లి ఇష్టం లేక యువతి బలవన్మరణం) -
ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు
సాక్షి, కామారెడ్డి : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన వివిధ పార్టీల నేతలను శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు ప్రజాసంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొందరు నేతలు మద్యం సేవిస్తూ దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి అధికార పార్టీ నేతల వాట్సాప్‌కు చేరడంతో వారు వాటిని మరింత వైరల్ చేశారు. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీ శ్వేతకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. మాచారెడ్డి పోలీసు స్టేషన్‌కు తరలించిన నేతల్లో కొందరు ఠాణా వెనకవైపున మద్యం తెప్పించుకుని తాగినట్టు ప్రచారం జరిగింది. ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై ఎస్పీ శ్వేతను ‘సాక్షి’ సంప్రదించగా.. ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. -
గెట్ రెడీ టు ఆపరేషన్ ఆకర్ష్...
సాక్షి, కామారెడ్డి: ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార పార్టీలోకి వలసలు జోరందుకోవడం సర్వసాధారణమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి గులాబీదళం ఆకర్ష్‌కు పదును పెట్టింది. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు కారెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవాలి. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. సీఎం కేసీఆర్ పంపించే సైనికుడినే గెలిపించాలి’ అని బుధవా రం జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సభ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో అన్ని ఎంపీ స్థానాలను గెలచుకునేందుకు ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందని కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఫోకస్ చేసింది. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 5,76,433 కాగా... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 4,43,468 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకన్నా 1,32,965 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అదే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 1,44,631 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందున మెజారిటీ మరింత పెరగాల్సిందని, కానీ గతంలోకన్నా తక్కువ ఓట్లు రావడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల శాతం ఎందుకు తగ్గిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌ను టార్గెట్ చేసుకుని ఓట్ల శాతం పెరిగేలా పార్టీ క్యాడర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేగాక ఎమ్మెల్యేలు తమతమ నియోజక వర్గాల్లో మెజారిటీ తేవడానికి ప్రయత్నించాలని ఓ రకంగా అల్టిమేటం జారీ చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ చురకలు కూడా అంటించారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే కాదు మంచి మెజారిటీ రావాలన్న టార్గెట్‌తో ఎన్నికలకు సమాయత్తమైన టీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలమైన నాయకత్వంపై దృష్టి సారించింది. జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావడంతో ఆ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజక వర్గానికి చెందిన నేతలకు గాలం వేయడానికి గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. నియోజక వర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి పార్టీ మారుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రసార మాద్యమాల్లో వచ్చిన ఈ వార్త గురువారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి, అవకాశాల కోసం పార్టీలో చేరమంటూ ఇతర పార్టీల నేతలకు గులాబీ దళం గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి.. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎదుటి పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆకర్ష్‌కు పదును పెట్టినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలై, వారు నామినేషన్లు వేసేలోగా అవకాశం రాని నేతలు పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా చాలా మంది పార్టీలు మారుతారని తెలుస్తోంది. -
విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేసిన ఉపాసన
దోమకొండ: విద్యార్థులు బాగా చదువుకుని 100శాతం ఫలితాలు సాధించాలని ప్రముఖ సినీ నటుడు రాంచరణ్‌తేజ సతీమణి ఉపాసన అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేసే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గడికోట ట్రస్ట్ నుంచి పాఠశాలకు చెందిన 89మంది విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేస్తామన్నారు. పౌష్టికాహారం తమ ట్రస్ట్ నుంచి అందిస్తామని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల పేరుతో పాటు పుట్టిన ఊరి పేరును నిలబెట్టాలని ఆమె కోరారు. ఆమె వెంట జిల్లా విద్యాధికారి రాజు, ఏంఈవో సేవ్లానాయక్, సర్పంచ్ నల్లపు అంజలి, ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్, ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గడికోట ట్రస్ట్ ప్రతినిధి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
ఓటింగ్ పరిశీలనలో పోలింగ్ ఏజెంట్లే కీలకం
సాక్షి, కామారెడ్డి అర్బన్: పోలింగ్ బూత్‌లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చుండే ఏజెంట్ల పాత్ర చాలా కీలకమైంది. బోగస్ ఓట్లు పడకుండా ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాలి. ఒక ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపోందే అవకాశం ఏన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా వుండాలి. లేకపోతే ఇతర అభ్యర్థులకు అమ్ముడు పోయే సందర్భాలు కూడా ఉంటాయి. పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. పోలింగ్ స్టేషన్లో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు, తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పొందిన వారు, గుర్తింపు పొందని రిజిష్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్ కూర్చీలు వేస్తారు. పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోలింగ్ ఏజెంట్ ఫారం–10లో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్ నియామక పత్రం పొందినవారికి నిరూపణ డిక్లరేషన్‌పై ఏజెంట్ పాస్ జారీ చేస్తారు. ఒక్కో బూత్‌కు మూడు పాసులు జారీ చేసిన ఒక్క∙పో రు మాత్రమే కూర్చోడానికి అనుమతి ఇస్తారు. ఓటర్ల జాబితాను బయటకు తీసుకువెళ్లేందుకు వీలు ఉండదు. లింగ్ ఏజెంట్లు ఓటింగ్ సమయానికి కనీసం గంటముందుగా బూత్‌కు చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పక్రియ వారు చేసుకుపోతారు. ఆలస్యమయాతే ఓటింగ్ మిషన్ల సీల్లో ఏజెంట్ సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. అలాగే ఓటింగ్ ముగిసిన అనంతరం కూడా ఈవీఎంల సీలింగ్ పక్రియను పర్యవేక్షించి దానిపై సంతకం చేయాలి. పోలింగ్ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్, వైర్లెస్, కార్డ్‌లెస్ తీసుకుపోరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించరాదు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి చీటీలను పంపడం నిషేధం. పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని ఏజెంట్ నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగినా ప్రిసైడింగ్ అధికారి, పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులకు ఫిర్యాదు చేయాలి. పోలింగ్‌పై అభ్యంతరం తెలుపవచ్చు. పోలింగ్ సరళి కనిపించే విధంగా పార్టీ ప్రాధాన్యత ప్రకారం ఏజెంట్లకు కూర్చీలు ఏర్పాటు లేకుంటే ఫిర్యాదు చేయవచ్చు. సంఖ్య అసాధారణంగా ఉంటే ఏజెంట్లకు పోలింగ్ స్టేషన్లో ఏ విధంగానైనా సర్దుబాటు చేస్తారు. -
నిలిచేదెవరు..? తప్పుకునేదెవరు..?
పార్టీ టికెట్టు కేటాయించకపోవడంతో అలిగి స్వతంత్రంగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇతర అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోవారు అధిష్టానం మాట విని తప్పుకుంటారా? బరిలోనే ఉంటారా అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియనుండడంతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సాక్షి, కామారెడ్డి: టికెట్టు దక్కలేదన్న కోపంతో తిరుబాటుకు సిద్ధపడ్డ నేతలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. ముందుముందు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని, పోటీకి అవకాశం కల్పిస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆశచూపుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తోంది. అయితే తమకు ఏ పదవి ఇస్తారో అధికారికంగా ప్రకటిస్తేనే పోటీ నుంచి తప్పుకుంటామని తిరుబాటు నేతలు మొండికేస్తున్నట్టు సమాచారం. దీంతో వారిని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్లా రెబెల్స్.. జిల్లాలో ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు లేవు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన జాజాల సురేందర్‌కు అవకాశం దక్కింది. దీంతో భంగపడ్డ సుభాష్‌రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కాసుల బాల్రాజును వరించింది. ఇక్కడ టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన మల్యాద్రిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జుక్కల్‌లో గంగారామ్‌కు టికెట్టు రావడంతో అరుణతార తిరుగుబాటు చేశారు. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని భావించారు. అయి తే అనూహ్యంగా బీజేపీలో చేరిన అరుణతార ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రంగంలోకి హైకమాండ్.. తిరుగుబాటు చేసిన నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ కేంద్రంగా తిరుగుబాటు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డిలో తిరుగుబాటు చేసిన సుభాష్‌రెడ్డికి ఎంపీ టికెట్టు ఇస్తామని నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించాలని ఆయన మెలిక పెట్టినట్టు సమాచారం. ఎంపీ అవకాశం ఇస్తామని కచ్చితంగా ప్రకటిస్తేనే తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలవడంతో ఆయ నతో కాంగ్రెస్ ముఖ్యనేతలు మాట్లాడినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నేటితో ముగియనున్న గడువు.... నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా తిరుగుబాటు నేతలు నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదా అన్నదానిపై చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో న్యాయం చేస్తా మని పార్టీ హైకమాండ్ చెబుతున్నా రెబ ల్స్ నమ్మడం లేదని సమాచారం.. తిరుగుబాటు నేతలు ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నా.. వారి అనుచరులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇచ్చే ప్రాధాన్యతపై ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబడుతున్నట్టు సమాచారం. అధిష్టానం బుజ్జగిం పులు ఫలించి, తిరుగుబాటు నేతలు పోటీలోనుంచి తప్పుకుంటారా, లేక బరిలోనే నిలిచి బలాన్ని తేల్చుకుంటారా అన్నది గురువారం సాయంత్రంలోగా తేలనుంది.