kapil mishra
-
క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సవాల్ విసిరారు బీజేపీ నేత కపిల్ మిశ్రా. సీబీఐపై సిసోడియా చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లై డిటెక్టర్, నార్కో పరీక్షకు సిద్ధమని మీడియా ముందుకు వచ్చి అంగీకరించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై సిసోడియా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను సోమవారం 9 గంటలపాటు విచారించారు సీబీఐ అధికారులు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా.. తనను ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సీబీఐ అధికారులు బెదిరించారని, లేదంటే ఇలాగే మరిన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. అంతేకాదు తనకు బీజేపీలో సీఎం పదవి ఆపర్ చేశారని పేర్కొన్నారు. ఈ విచారణ అనంతరం తనపై పెట్టింది తప్పుడు కేసు అని పూర్తిగా అర్థమైందని సిసోడియా అన్నారు. తనను ఏం చేసినా సరే ఆప్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సిసోడియా ఆరోపణలను సీబీఈ ఇప్పటికే ఖండించింది. ఆయన వ్యాఖ్యల్లో అసలు వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. వృత్తిపరంగానే తాము సిసోడియాను విచారించినట్లు స్పష్టం చేసింది. మున్ముందు కూడా చట్టప్రకారమే ఆయన్ను విచారిస్తామంది. తాజాగా బీజేపీ సిసోడియా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
ఆ పుకారు వల్లే ఢిల్లీ అల్లర్లు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో కలిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ తీశారు. అయితే వీరు జఫరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో డయల్పూర్‌లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌పై దుండగులు మూక దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశారని ఛార్జిషీటులో ప్రస్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు) అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించినప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అతను ఛాంద్ బాగ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఇక సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
గణాంకాలతో సహా ప్రభుత్వంపై కపిల్ మిశ్రా ఫైర్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రాలు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపెడుతోందంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా 6,542 కేసులు నమోదు కాగా, 73 మంది మరణించినట్లు ప్రభుత్వం లెక్కలు చూపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కోవిడ్-19 బాధితుల అంత్యక్రియలు నిగంబోడ్ ఘాట్, పంజాబీ బాగ్, ఐటీఓ విద్యుత్ దహన వాటికలలో జరుగుతున్నాయి. చదవండి: కోవిడ్: 75శాతం కేసులు అలాంటివే..! ఏప్రిల్ 3 నుంచి నిగంబోడ్ ఘాట్‌లో దహనం చేసిన మృతదేహాల సంఖ్య 155 కన్నా ఎక్కువ, పంజాబీ బాగ్‌లో 72, ఐటిఓ శ్మశానవాటికలో 95 మృతదేహాలను ఖననం చేసినప్పటికీ.. మే 10 నాటికి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 73 మంది మాత్రమే చనిపోయారని తప్పు లెక్కలు చూపెడుతోంది. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ దహన వాటికల వద్ద ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో గణాంకాలతో సహా వివరించారు. అయితే కపిల్ మిశ్రా విమర్శలపై కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. చదవండి: 2లక్షలు దాటిన కరోనా కేసులు -
ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో చురుగ్గా పర్యటిస్తూ భారత దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తుండగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వ పరువును, దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజులపాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటిపై ప్రపంచ పత్రికలు తమదైన రీతిలో దాడి చేశాయి. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారుణంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం వల్లనే ‘2002లో గుజరాత్’ తరహా అల్లర్లు పునరావృతం అయ్యాయని ఆ పత్రికలు వ్యాఖ్యానించాయి. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..) ‘మోదీ స్టోక్డ్ దిస్ ఫైర్’ అనే శీర్షికతో ‘ది గార్డియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘పోలిటిషియన్స్ స్టోక్డ్ ఢిల్లీ రైట్స్’ అని ‘ది ఖలీజ్ టైమ్స్’ వార్తను ప్రచురించగా, ‘మోదీ సైలెన్స్ యాజ్ డెత్ టాల్ మౌంటెడ్’ అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో రోజు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి మోదీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్ స్పీజల్’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోదీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగ పడవచ్చేమోగానీ అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్నాయంటూ ‘అవుట్‌సైడ్ షో ఆఫ్, ఇన్సైడ్ ప్రొటెస్ట్’ శీర్షికన ఆ పత్రిక వార్తను ప్రచురించింది. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) మోదీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్ ఆర్ ఆంగ్రీ, ఇట్స్ ముస్లిం ఆర్ వర్రీడ్’ శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్ న్యూస్ పీస్’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్ ఆఫ్ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్ అండ్ యాన్ అల్టిమేటమ్’ పేరిట ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తను ప్రచురించింది. ప్రభుత్వం చేసిన చట్టాన్ని ప్రశ్నించే మేధోవారసత్వంతోపాటు నైతిక, ప్రజాస్వామిక హక్కులు తమకున్నాయంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ముస్లింలపై దాడి చేయడం ఆశను ఆర్పేసిందంటూ ‘అల్ జజీరా’ వ్యాఖ్యానించింది. విభిన్న కుల, మతాల సమ్మేళనంతో సహజీవనం సాగించడం భారత్‌కున్న ఓ గొప్ప సంస్కృతి అన్న పేరు నేటి ఢిల్లీ అల్లర్లతో మసకబారిందంటూ ‘గల్ఫ్ న్యూస్’ సంపాదకీయం రాసింది. (చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) -
భావజాలం రగిలించిన ఘర్షణలు
నాటి ప్రధాని ఇందిర హత్యానంతరం సిక్కులపై పనిగట్టుకుని చేసిన విషప్రచారం కారణంగా 1984లో మూక భయంకరదాడులకు పాల్పడింది. 35 ఏళ్ల తర్వాత సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా విద్వేష ప్రసంగం మరోసారి మూకదాడులకు దారితీసింది. ఆనాడు ఢిల్లీలో జరిగిన ఘోర దాడులు, నేడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండ సందర్భంగా.. పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. మూక మనసత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది రాజ్యం దన్నుతో తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు. ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహను మన నేతలు కోల్పోయారు. ఇలాంటి పిరికి మనస్తత్వంతో కూడిన రాజకీయాల దుష్ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు. ఢిల్లీ నగరంలో 1984లో సిక్కు వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఏమిటంటే నగరవ్యాప్తంగా పుకార్లను శరవేగంగా వ్యాప్తి చెందించడం. సిక్కులు ఢిల్లీ నగర నీటి సరఫరా చానల్స్‌లో విషం కలిపారని, పంజాబ్‌లో హత్యకు గురైన హిందువుల శవాలను రైళ్లలో కుక్కి ఢిల్లీకి పంపుతున్నారనే స్థాయి పుకార్లను నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం వ్యాపింపచేశారు. అప్పట్లో వాట్సాప్ ఉండేది కాదని గుర్తుంచుకోవాలి. పుకార్లను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసేవారు. ఇందిర హత్య ఘటన జరి గిన 24 గంటలలోపే ఢిల్లీని ఈ రకమైన పుకార్లు ఆరకంగానే చుట్టుముట్టాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఈ పుకార్ల వ్యాప్తికి తమవంతు పాత్ర పోషించారు. పోలీసులే కొన్ని ప్రాంతాలకు వాహనాల్లో వచ్చి లౌడ్ స్పీకర్ల ద్వారా పంజాబ్ నుంచి శవాలతో కూడిన రైళ్లు వస్తున్నాయని, నగరంలో తాగునీటిలో విషం కలుపుతున్నారని గట్టిగా అరుస్తూ ప్రచారం చేశారని అప్పట్లో కొన్ని నిజనిర్ధారణ కమిటీలు నిర్ధారించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసు అధికారులు ఇంటి తలుపులు తట్టి జనాన్ని లేపి తాగు నీటిని తాగవద్దని మరీ సలహా ఇచ్చేంతవరకు వ్యవహారం సాగింది. పోలీసులకు, వ్యవస్థీకృత మూకలకు మధ్య అసాధారణమైన కుమ్మక్కుకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. ఆనాడు సిక్కులను ఢిల్లీలో ఊచకోత కోస్తున్నప్పుడు పోలీసులు పత్తా లేకుండా పోయారని, లేక ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని లేక ఆ హత్యాకాండలో తామూ స్వయంగా పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు నిర్ధారించారు. 1984 ఘర్షణలు వ్యాపించిన కీలక ప్రాంతాల్లో ఒకటైన త్రిలోక్‌పురిలో పోలీసులే మూకలకు రక్షణగా వచ్చారని, తమ వాహనాల్లోని ఇంధన ట్యాంకులను ఖాళీ చేసి అమాయకులను, ఇళ్లను, దుకాణాలను తగులబెట్టడానికి అవసరమైన డీజిల్‌ను స్వయంగా అందించారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సిక్కు యువతులను దుండగులు సామూహిక అత్యాచారం చేస్తున్నప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులను ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు వెనక్కు రప్పించారని, సుల్తాన్‌పురి ప్రాంతంలో ఒక పోలీసు అధికారి ఇద్దరు సిక్కులను స్వయంగా చంపాడని కూడా అప్పట్లో నివేదికలు వచ్చాయి. ఆనాడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలకు సంబంధించి ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి కూడా పోలీసులు తిరస్కరించారు. తమ పొరుగున ఉన్న సిక్కు ప్రజలకు హిందువులు రక్షణగా నిలబడి పోలీసు ఠాణాలకు తోడుకెళ్లి ఫిర్యాదు చేయిస్తే మీ మతస్తులకోసం పోరాడండ్రా అంటూ అక్కడి పోలీసులు సలహాఇచ్చిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఒకవైపు హింసోన్మాదులను స్వేచ్ఛగా వది లిపెడుతూ మరోవైపు శాంతియాత్రలు చేస్తున్నవారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. పైగా, ఘర్షణలను నిరోధించాలని చూసిన కొందరు పోలీసులకు తమ సీనియర్ అధికారులు ఏమాత్రం సహకరించలేదు. పోలీసులు తమకు తాముగా ఆ ఘర్షణల పట్ల అలా స్పందించారన్న ముసుగులో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక ఘటనలపై అధికారులు శీతకన్ను వేశారు. అందరూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే ఆ హింసాకాండకు మొత్తంగా పథకరచన చేసి అమలు చేశారని బాధితులు, ప్రత్యక్షసాక్షులు, జర్నలిస్టులు, పౌర బృందాలు ఏకకంఠంతో చెప్పారు. ఆనాడు చుట్టుపక్కల గ్రామాలనుంచి, రీసెటిల్మెంట్ కాలనీలనుంచి గూండాలను టూవీలర్లలో, టెంపో వ్యాన్లలో, ట్రక్కులలో తీసుకొచ్చి హింసకు ప్రేరేపించారు. చివరకు డీటీసీ బస్సులలో కూడా ఒకచోటినుంచి ఒకచోటికి గూండాలను తరలించి హింసకు పాల్ప డ్డారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తమ తమ నివాస ప్రాంతాల్లో సిక్కు కుటుంబాలకు చెందిన ఇళ్లకు గుర్తు పెట్టి మరీ రంగం సిద్ధం చేశారు. తర్వాత పోలీ సులు తీరుబడిగా మూకతో వచ్చి అలా గుర్తు పెట్టి ఉన్న ఇళ్లపైపడి మృత్యుతాండవం చేయించారు. ఆ విషాద సమయంలో సిక్కు వితంతువులకు ఉపశమన చర్యల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఆనాడు వారి దిగ్భ్రమను ప్రపంచానికి చాటి చెప్పారు. అన్నాళ్లూ తమ పొరుగునే ఉంటూ పలకరించిన వారే తమను విద్రోహులుగా ముద్రవేసిచూడటం కలిచివేసిందని భర్తల్ని పోగొట్టుకున్న వితంతువులు పేర్కొన్న వైనాన్ని చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాశారు. ఆ దహనకాండ ఎంత ఆకస్మికంగా సంభవించిందంటే ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి బాధితులకు ఏళ్ల సమయం పట్టింది. ఒక్క రాత్రిలోనే వారు ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్‌పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే పైకి రెండు ఘటనల మధ్య సాదృశ్యం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండకు, 1984లో సిక్కువ్యతిరేక హింసాత్మక దాడులకు మధ్య పోలికలు తీసుకురావడం సమస్యను పక్కదారి పట్టిస్తుంది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు, ఈ వారం జరిగిన ఘర్షణల్లో కూడా ఏదోమేరకు ముస్లింల ఇళ్లు, షాపులు, కార్లను గుర్తు పెట్టి మరీ దాడి చేయడానికి పథకం పన్నిన ఘటనలు చోటు చేసుకున్నట్లు మనకు తెలుసు. కానీ ఈ రెండు ఘటనల మధ్య పోలిక ఇంతటితోనే ఆగిపోతుంది. 1984 నాటి హింసాత్మక ఘటనల్లో కాంగ్రెస్ నేతల పాత్రకు సంబంధించి విస్తృతంగా సాక్ష్యాలు లభించినప్పటికీ నేటి ఢిల్లీ ఘర్షణల్లో అంతవేగంగా మంటలు చెలరేగడం తమను సైతం నివ్వెరపర్చిందని బీజేపీ నేతలే చెబుతున్నట్లు నేను మాట్లాడిన రిపోర్టర్లు తెలిపారు. అందుకే ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని తట్టుకోలేక తమ పార్టీనేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగాన్ని తప్పు పట్టాల్సి వచ్చింది. అంతే కాకుండా మిశ్రాను పార్టీ పదవి నుంచి తొలగించాలని కూడా తివారీ చెప్పారు. తివారీ అలా మాట్లాడిన కొన్ని గంటల్లోపే కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో ర్యాలీ తీయడమే కాకుండా ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్లో తిష్టవేసిన సీఏఏ వ్యతిరేక నిరసనకారులను డిల్లీ పోలీసులు తక్షణం తొలగించనట్లయితే తాను వీధుల్లోకి వస్తానని తీవ్ర హెచ్చరిక చేశాడు. మిశ్రా ప్రసంగం తర్వాత కొన్ని గంటల్లోపే అంటే మరుసటి దినం ఉదయాన్నుం పూర్థి స్థాయి ఘర్షణలు చెలరేగాయి. బీజేపీలో విభేదాలు తివారీ, మిశ్రాలకే పరిమితం కాలేదు. భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా మిశ్రా చేసిన విద్వేష ప్రసంగం ఆమోదనీయం కాదని, తనపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పాడు. కానీ బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు మిశ్రాను వెనకేసుకు రావడమే కాకుండా మిశ్రా ప్రసంగం శాంతికి పిలుపుగా వర్ణించాడు. గంభీర్‌ను సమర్థించాలా లేక మిశ్రాను సమర్థించాలా అనే విషయంపై పార్టీ ట్విట్టర్ విభాగం కూడా చీలిపోవడాన్ని చూస్తే బీజేపీలో విభజన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక క్షేత్ర స్థాయిలో సైతం, మూక హింసపై స్థానిక స్థాయిలోని బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారని వార్తాహరులు చెబుతున్నారు. కొందరు మూకహింసను సమర్థించగా, మరికొందరు ముస్లిం కుటుంబాలను కాపాడటంలో మునిగిపోయారు. 1984లో స్వయంగా కాంగ్రెస్ నేతలే తమ కార్యకర్తలను హింసాత్మక ఘర్షణలవైపు నడిపించగా, ఇటీవలి ఢిల్లీ ఘర్షణలు కింది స్థాయి నుంచి ప్రేరేపితం కావడం గమనార్హం. మూక మనస్తత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు. ఏ పార్టీకి ఓటేసినా వీరంతా హిందుత్వ భావజాలంతోనే ఐక్యమయ్యారు. కపిల్ మిశ్రా కూడా గతంలో ఆప్ పార్టీకి చెందినవాడే కదా. ఒక రీతిలో 2020 ఘర్షణలు 1984 ఘర్షణలకు కొనసాగింపు అని చెప్పవచ్చు. ఆనాడు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చగొట్టిన తీవ్ర హింసాకాండ ఫలితంగా సిక్కు కుటుంబాలు తమ జీవితాలను పునర్నిర్మించుకునే క్రమంలో ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై, న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. మరోవైపున రాజ్యానికి సంబంధించిన పలు విభాగాలు తమవైపు ఉన్నాయని హిందువులు విశ్వసించడం ప్రారంభించారు. ఒక మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అది హిందువులను కాపాడటానికేనని వీరు నమ్మసాగారు. గత కొన్నేళ్లుగా ఈ సెంటిమెంట్ మరింత పెరుగుతూ వచ్చింది. అందుకే పోలీసులు తమ వైపు ఉన్నారనే భావనతో హిందూ మూకలు కెమెరా ముందుకు ధైర్యంగా వచ్చి ఘర్షణలకు పాల్పడ్డారు. పైగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు వచ్చాయి కాబట్టి ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహ కోల్పోయారు. ఇలాంటి పిరికిమనస్తత్వంతో కూడిన రాజకీయాల ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు. -అనింద్యో చక్రవర్తి, సీనియర్ జర్నలిస్టు -
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
-
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్ ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్‌కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్‌నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్‌కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్‌కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్‌ను వీడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్‌కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
‘ఒవైసీ హనుమాన్ చాలీసా చదువుతారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇది చేశాం, ఇకముందు అది చేస్తాం అని చెప్పాల్సిన నాయకులు ఇతర పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్ చేత మొట్టికాయలు తిన్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మెజారిటీ సీట్లు సాధించడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ భక్తుడినని, ఇప్పటికీ హనుమాన్ చాలీసా పఠిస్తానని వెల్లడించగా, దీన్ని ఉటంకిస్తూ కపిల్ మిశ్రా మంగళవారం ట్వీట్ చేశారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..) ‘కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడిక ఒవైసీ వంతు. ఆయన కూడా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెడతారు. ఐక్యతకు బలమైన శక్తి ఉంది. మన ఐక్యత 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు చేసే మురికి రాజకీయాలను సమాధి చేస్తుంది. దీనికోసం అందరం కలిసి పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ ఆయన పలుసార్లు అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు భారత్‌కు పాక్‌కు మధ్య యుద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రెండు రోజుల పాటు ఢిల్లీ ఎన్నికల ప్రచార నిషేధానికి గురయ్యారు. (బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) చదవండి: ‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోండి’ -
‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోండి’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతోంది. రోజురోజుకి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా మరోసారి ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోవాలి. ఉమర్ ఖలీద్, అఫ్జల్ గురు, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులను తమవారిగా భావించేవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కి భయపడుతున్నారు’ అంటూ ఆప్‌పై కపిల్‌మిశ్రా విమర్శలు గుప్పించారు. కాగా ఆప్ నేత సంజయ్ సింగ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మత కలహాలు సృష్టిస్తారని.. ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకుండా నిషేధించాలని వ్యాఖ్యానించారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యలో కపిల్ మిశ్రా ఆప్‌పై వివాదాస్పద విమర్శలు చేయడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్- పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ తన ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించి కపిల్ మిశ్రాపై 48 గంటల పాటు ఢిల్లీలో ప్రచార నిషేధం విధించింది. ఈ నిషేదం తర్వాత మళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కపిల్ మిశ్రా మరోసారి తీవ్రమైన విమర్శలకు దిగారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్–పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్ సంస్థ కపిల్ చేసిన ట్వీట్లను తొలగించింది. -
వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..
-
భారత్-పాక్ వ్యాఖ్యలు.. ఈసీ నోటీసు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ పోరు ఉంటుందని ఆప్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కపిల్ మిశ్రాకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకే షోకాజ్ నోటీస్ జారీ చేశామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించనున్నాయని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ట్వీట్‌పై రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కింది. షాహిన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేయిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ షాహిన్‌బాగ్‌లో ప్రవేశించి మినీ పాకిస్తాన్‌గా మార్చిందని మండిపడ్డారు. ఢిల్లీలోని చంద్‌బాగ్, ఇందర్‌లోక్ ప్రాంతాలలో చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మినీ పాకిస్తాన్‌లు చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో వారికి సరైన జవాబు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరచారని..మిశ్రా అభ్కర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కపిల్ మిశ్రా గురవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతోంది. దీని కోసం మారాణాయుధాలతో పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ సమీపంలోని షెహన్‌బాగ్‌కు చేరుకుంది. భారత్ చట్టాలను గౌరవించకుండా అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతోంది’ అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆమ్ఆద్మీ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార ఆప్ సర్కార్‌పై బీజేపీ నేతలు మాటాల దాడిని ప్రారంభించారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కపిల్ మిశ్రా బరిలో నిలిచారు. అయితే బుధవారం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన కపిల శర్మ ఆ పార్టీనేతలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా అభివర్ణించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలిన ఈసీని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలో శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేసి గత ఆగస్ట్‌లో బీజేపీలో చేరారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
సీఎంకు షాకిచ్చిన సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేడు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలోనే శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నేతలు రాజీనామా చేయడం ఆప్‌ను కలవరానికి గురిచేస్తోంది. -
‘సీఎం గారు.. ప్లీజ్ బట్టలు మార్చుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నాపై రెబల్ ఎమ్మెల్యే, ఆప్ మాజీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు. కనీసం బట్టలు అయినా మార్చుకోండంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం గారు.. దయచేసి మీరు, మీ బృందం బట్టలు మార్చుకోండి. అలాగే ఉంటే అనారోగ్యపాలవుతారు. బట్టలు మార్చుకోవద్దని మోదీ ఏం చెప్పలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నానాలుగో రోజుకు చేరింది. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్లు ఆమర నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసం నుంచి గవర్నర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి, భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదికూడా చదవండి కేజ్రీవాల్‌కు షాక్ -
కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెబల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా షాకిచ్చారు. అసెంబ్లీకి తక్కువ హాజరు అయ్యారంటూ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాగునీటి శాఖను తన వద్దే ఉంచుకున్న కేజ్రీవాల్.. ఆ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలం అయ్యారని, అంతేకాకుండా అసెంబ్లీ సెషన్స్‌ను ఎగ్గొడుతూ.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కపిల్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘ముఖ్యమైన అంశాలపై చర్చించే సమయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో లేరు. 2017 నుంచి ఇప్పటిదాకా 27 అసెంబ్లీ సెషన్స్ జరగ్గా.. ఏడింటికి మాత్రమే కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈయనేం ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమయ్యేందుకు ఇదే ఉదాహరణ. దయచేసి.. ఆయన(కేజ్రీవాల్) అసెంబ్లీ రికార్డులను ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అంతేకాదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నిసార్లు పర్యటించారో.. ప్రజల దగ్గరి నుంచి ఎన్ని విజ్ఞప్తులు పరిశీలించారో ఆరా తీయండి. ఆయన ఆస్తుల వివరాలను కూడా ఓసారి పరిశీలించండి’ అని కపిల్ పిటిషన్లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను బెంచ్ అత్యవసరంగా స్వీకరించగా.. మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు ఈ పిటిషన్‌పై ఆప్ మాత్రం గప్‌చుప్‌గా ఉంది. -
‘ఆయనలాంటి స్నేహితులు బీజేపీకి అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్‌కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ 20మందిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్ ఎమ్మెల్యే(రెబల్) కపిల్ మిశ్రా చెబుతున్నాడు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని అంటున్నాడు. అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు. ‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత’ ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు’’ అని కపిల్ పేర్కొన్నారు. కపిల్ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి, సరితా సింగ్, ప్రవీణ్ దేశ్‌ముఖ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే అంతర్గత సర్వేను ప్రారంభించేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశాడు. మీడియాతో కపిల్ మిశ్రా (పాత చిత్రం) -
కేజ్రీవాల్ నివాసం వద్ద హైడ్రామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా, ఆయన అనుచరులను అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద అడ్డగించడంతో శుక్రవారం హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్వహిస్తున్న ‘జనతా దర్బార్’లో పాల్గొనేందుకు తన 25 మంది మద్దతుదారులతో కలిసి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. అనుమతి లేదన్న కారణంతో వీరిని అడ్డుకున్నారు. దీంతో మిశ్రా, ఆయన అనుచరులు కేజ్రీవాల్ నివాసం వెలుపల ధర్నాకు దిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని కేజ్రీవాల్ అడగానికి వస్తే తనను అనుమతించలేదని మిశ్రా తెలిపారు. ‘జనతా దర్బార్‌లో తనను కలిసేందుకు కేజ్రీవాల్ ఎందుకు అనుమతిచడం లేదు? ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే నన్ను ఎందుకు కలవడం లేదు?’ అని ప్రశ్నించారు. 2013, ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆప్ కార్యకర్త సంతోష్ కోలి తల్లిని మిశ్రా తన వెంట తీసుకొచ్చారు. సంతోష్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి
-
‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లో ఆరోపణలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్ మిశ్రాను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం కపిల్ మిశ్రా మాట్లాడుతూ ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు. తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇస్తున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్ మద్దతుదారులు కపిల్ మిశ్రాపై దాడికి యత్నించారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
నిజమైతే.. నేను జైల్లో ఉండేవాడ్ని: సీఎం
మాజీ మంత్రి కపిల్ మిశ్రా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఇవి నిరాధార ఆరోపణలని, వీటిని ప్రత్యర్థులు సైతం నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం పస ఉన్నా తాను ఈపాటికి జైలులో ఉండేవాడినని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. మాజీ ఆప్ నేత, తన కేబినెట్లో మాజీ మంత్రి అయిన కపిల్ మిశ్రా ఆరోపణలపై తొలిసారి మౌనాన్ని వీడారు. తాను ఏ చిన్న కుంభకోణానికి పాల్పడినా కేంద్రంలోని బీజేపీ తనను జైలులో వేసేదని పేర్కొన్నారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ. రెండుకోట్లు కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, పార్టీ విరాళాలు, నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని కపిల్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని, తాను రూ. 2 కోట్ల లంచం తీసుకోలేదని కేజ్రీవాల్ తెలిపారు. -
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
-
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
హవాలా స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. ముఖేష్ కుమార్ అనే ఢిల్లీ వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చానని చెప్పడం అంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. ఇదంతా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోడానికి చేసిన ప్రయత్నమేనని మిశ్రా అన్నారు. ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన చెప్పారు. నాలుగు షెల్ కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల మొత్తం చెక్కుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి వచ్చిందని ఐదు రోజుల క్రితం మిశ్రా ఆరోపించారు. అయితే దీన్ని ముఖేష్ కుమార్ అలియాస్ ముఖేష్ శర్మ ఖండించారు. తాను స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చానన్నారు. పేదలకు సేవ చేయడానికే ఆమ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వస్తోందని భావించి, అందుకు సాయపడాలనే తాను ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో చెప్పారు. ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఆ నాలుగు కంపెనీలు ఈ వ్యక్తివేనని, తాము ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీకి విరాళం ఇచ్చాడని అన్నారు. కానీ ముఖేష్ కుమార్/శర్మ పూర్తి నిజాలు బయట పెట్టడంలేదని మిశ్రా తాజాగా అంటున్నారు. అతడు రూ. 2 కోట్లు ఇవ్వలేదన్న విషయాన్ని తాను నిరూపించగలనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 లక్షల చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ఉన్న నాలుగు లేఖలను ఆయన చూపించారు. వాటిలో రెండింటిమీదే శర్మ సంతకాలు ఉన్నాయన్నారు. అంటే శర్మ కేవలం కోటి రూపాయలే ఇచ్చారని, మిగిలిన కోటి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఆ 2 కోట్ల విరాళం వచ్చిందని, ఇది మరింత ప్రశ్నార్థకంగా ఉందని కపిల్ మిశ్రా అన్నారు. ఆదాయపన్ను శాఖ కేజ్రీవాల్‌ను దాని గురించి అడిగితే, ఎక్కడినుంచి వచ్చాయో తెలియదన్నారని చెప్పారు. మొత్తం 16 షెల్ కంపెనీలను ఉపయోగించుకోవడం ద్వారా కేజ్రీవాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.