keeravani
-
ఏపీని రామోజీ నిజంగానే ప్రేమించారా?
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభలో కొందరు వక్తలు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వపరంగా ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా సంస్మరణ సభలు నిర్వహించవచ్చా అన్న చర్చ ఒకటి అయితే, కీరవాణి వంటి సినీ ప్రముఖులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి.కీరవాణి కులగజ్జితోనో, పార్టీ గజ్జితోనో మాట్లాడారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన మామ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.ను,రామోజీరావును సమానం చేస్తూ రాజగురువు పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మీడియా నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తుందని అంటూ గత ప్రభుత్వం ఓడిపోయిందన్న వార్త విన్న తర్వాతే రామోజీ కన్నుమూశారని చెప్పారు. ఈ విషయాన్ని బట్టే రామోజీ పక్షపాతంగా పనిచేశారా?లేక నిష్పక్షపాతంగా పనిచేశారా అన్నది పవన్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు రాజకీయ నేతలు కనుక, ఈనాడు మీడియాతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలి కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని కీరవాణి చేసిన రాజకీయ విమర్శ అర్ధరహితంగా ఉందని చెప్పవచ్చు.సంస్మరణ సభ కనుక రామోజీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం తప్పు కాదు. ఆయనను బాగా పొగడడం అభ్యంతరం కాదు. కాని అంతటితో ఆయన ఆగలేదు. రామోజీ ఏపీని ఎంతో ప్రేమిస్తారట.అలాంటి ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడిన తర్వాతే నిష్క్రమించారని ఆయన తెలిపారు . ఇది దుర్మార్గమైన కామెంట్. రామోజీ నిజంగానే ఏపీని ప్రేమించి ఉంటే అదెలాగో చెప్పి ఉండాల్సింది.ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కబంద హస్తాలలో ఉండి ఉంటే ఏ రకంగానో వివరించాలి కదా! పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తే అది కబంద హస్తం అవుతుందా?ప్రభుత్వ స్కూళ్లను ,ఆస్పత్రులను బాగు చేయడం, ప్రజల ఇళ్లవద్దకే పాలనను తీసుకు వెళ్లడం, వృద్దుల ఇళ్లవద్దే పెన్షన్ లు అందచేయడం, చెప్పిన హామీలు చెప్పినట్లు నెరవేర్చడం, కిడ్నీ బాదితుల కోసం ఉద్దానంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఒక భారీ రక్షిత నీటి పధకం తీసుకు వస్తే అది కబంధ హస్తమా!రాజకీయాలలో గెలుపు,ఓటములు ఉంటాయి.ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే కీరవాణి అభిమానించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా మూడుసార్లు ఓడిపోయింది. అప్పుడు కూడా ఏపీ కబంద హస్తం నుంచి బయటపడినట్లు అవుతుందా!చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తానని ,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు.అది ఏపీ ప్రజలకు ఇచ్చిన అభయహస్తమని కీరవాణి భావిస్తున్నారా!జగన్ అమలు చేసిన వాగ్దానాలకన్నా మూడు రెట్లు అధికంగా ప్రజలకు డబ్బు పంచుతానని టిడిపి మానిఫెస్టోలో ప్రకటించింది.అప్పుడు అది కబంధ హస్తం అవుతుందా?లేక అభయహస్తం అవుతుందా?మద్యం ధర తగ్గించి, సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రజలను దోపిడీ చేయడానికి బడా సినిమా నిర్మాతలకు అవకాశం ఇవ్వడం ఏపీకి అభయహస్తం ఇచ్చినట్లవుతుందని కీరవాణి అనుకుంటుండవచ్చు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయడం, కనీసం ముప్పైశాతం షూటింగ్‌లు చేయాలని జగన్ కోరితే అది కబంద హస్తం అన్నమాట.రామోజీకి నిజంగానే ఏపీపై అంత ప్రేమ ఉంటే ఫిలిం సిటీ వంటివాటిని ఏపీలో ఎందుకు పెట్టలేకపోయారు! ఆ రాష్ట్రంలో గత పదేళ్లలో ఆయన పెట్టిన సంస్థలు ఏమి ఉన్నాయి?పోనీ అంతకుముందు అయినా ఏపీ ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఏమిటి?తుపాను వంటివి వచ్చినప్పుడు విరాళాలు సేకరించి కొన్నిచోట్ల ఒక వంద ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అది తప్ప మిగిలినదంతా ఆయన చేసింది వ్యాపారమే కదా!అంతవరకు ఆయన గొప్పవాడే అని చెప్పండి. కాని ఏపీని ఆయనే ఉద్దరించినట్లు కలరింగ్ ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది.మార్గదర్శి సంస్థల ద్వారా సేకరించిన డబ్బు తీసుకువెళ్లి తెలంగాణలో రామోజీ ఫిలింసిటీని, టీవీ కార్యాలయాలను నెలకొల్పారు కాని, ఏపీలో ఏమైనా పెట్టుబడి పెట్టారా!ఈనాడు మీడియా ద్వారా అబద్దాల ప్యాక్టరీని పెట్టి నిత్యం తనకు గిట్టని వారిపై విషం చిమ్మడం విలువలకు ప్రాధాన్యం ఇచ్చినట్లా!సినిమా రంగానికి చెందిన దాసరి నారాయణరావు పేరు కూడా లేకుండా ఆయన సినిమాలను టీవీలలో చూపించడం గొప్ప విషయమా?రామోజీ ఒక వ్యక్తిగా,తన వ్యాపార రంగంలో అభివృద్ది చెందారు.దానిని ఎవరు కాదనరు.కాని దాంతోనే ఏపీ సమాజం అంతటికి ఆయనే ఆదర్శమన్నట్లు చిత్రీకరించడం కరెక్టు కాదు.ఏపీ సమాజానికి ఆయన ఏమి ఇచ్చారో కాని,ఆ సమాజం నుంచి ఆయన చాలా పొందారు. ఎంత మేలు చేశారోకాని, హానీ మాత్రం బాగా ఎక్కువగానే చేశారు. మీడియా లేకుండా కేవలం ఇతర వ్యాపారాలకే రామోజీ పరిమితం అయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వపరంగా ఇంత భారీ సభ నడిపేవారా?కీరవాణి ఇంతగా పొగిడేవారా!ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా పేరొందిన హరిశ్చంద్రప్రసాద్ వంటివారికి గాని, దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ,ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కాని ఇవ్వనంతగా గౌరవం ఇచ్చారంటే కేవలం మీడియా ద్వారా ప్రభావితం చేయడం కాదా! తెలుగుదేశం పార్టీకి, అందులోను చంద్రబాబు నాయుడుకు బాజాలు కొట్టినందుకు కాదా! కీరవాణి వంటి వారికి సినిమా వ్యాపారంలో రామోజీ అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు.అంతవరకు అభినందించడం, కృతజ్ఞతలు చెప్పడం మంచిదే.అలాకాకుండా జగన్ ప్రభుత్వంపై పిచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా కీరవాణి కులగజ్జితోనే మాట్లాడుతున్నారని రుజువు చేసుకున్నట్లు కాదా!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి,నిజాయితీల కోసం రామోజీ బతికారని చెప్పారు. మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారని ,ఎన్నో రకాలు గా హింసించారని ఆయన అన్నారు. రామోజీ తన పత్రిక, టీవి ద్వారా చాలామందిని అంతకన్నా ఎక్కువగా హింసించారు. అవన్ని ఎందుకు! మార్గదర్శి ద్వారా డిపాజిట్లు వసూలు చేయవచ్చా?అందులో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని వచ్చిన అభియోగాలపై ఎందుకు రామోజీ తన జీవిత కాలంలో వివరణ ఇవ్వలేకపోయారు?రామోజీరావు ,ఎన్.టి.ఆర్.లను సమానం చేసే విదంగా చంద్రబాబు మాట్లాడడం ద్వారా తనకు రాజగురువుపై ఉన్న భక్తిని తేటతెల్లం చేశారని అనుకోవచ్చు.అంతవరకుతప్పుపట్టనవసరం లేదేమో! చంద్రబాబు ఒక ఆసక్తికర విషయం తెలియచేశారు.' కొన్ని పత్రికలలో ఇతర పార్టీల వార్తలు రాయరని, కాని రామోజీ మాత్రం ప్రతి పార్టీ,నాయయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ,ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారని, కవరేజీలో ఎక్కడ తప్పు చేయరు అని అన్నారు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో చెబుతారని" కూడా పేర్కొన్నారు.నిజంగానే ఇలా జరిగిందా అని చూస్తే నేతిబీరకాయలో నెయ్యి చందమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి వార్తలు ఇవ్వాలనే వారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అవేమీ పాటించలేదు.గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి 151 సీట్లు ఉంటే, విపక్ష టిడిపికి 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఈ కాలంలో ఈనాడు మీడియా ఇచ్చిన కవరేజీని గమనిస్తే చంద్రబాబు ఈ విసయంలో కూడా అసత్యాలు చెప్పారని అర్దం అవుతుంది. టిడిపి కి డెబ్బైఐదుశాతం వార్తల కవరేజీ ఇస్తే,వైఎస్సార్సీపీకి పాతిక శాతం కూడా ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ వ్యతిరేక వార్తలు మాత్రం డెబ్బై ఐదు శాతం ఇచ్చారు.అంతేకాదు.గత ఐదేళ్లు వార్తలకు,సంపాదకీయాలకు తేడా లేకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కధనాలను,పచ్చి అబద్దాలను మొదటిపేజీలో ఇచ్చారో అందరికి తెలుసు. రామోజీరావు అంటే నాకు గౌరవమే.ఆయన వద్ద పనిచేసిన అభిమానం ఉంటుంది.కాని ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే ఇప్పుడు వాస్తవాలు చెప్పవలసి వస్తోంది.చివరిగా ఒక మాట.కీరవాణి తన ప్రసంగంలో రామోజీరావును భీష్ముడితో పోల్చారు. అంటే భీష్ముడు మాదిరి కౌరవుల తరపునే రామోజీ యుద్దం చేశారని చెప్పినట్లే కదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Live Show: కిరవాణి కులగజ్జి ?.. రామోజీ కోసం ఎన్టీఆర్ ని అవమానిస్తారా ?
-
ఎట్టకేలకు రాజమౌళి-మహేశ్ మూవీ అప్డేట్.. బయటపెట్టిన కీరవాణి
'ఆర్ఆర్ఆర్' రిలీజై రెండేళ్లయింది. అప్పటి నుంచి రాజమౌళి మహేశ్ సినిమా మీదే పనిచేస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పట్లేదు. మే చివరన కృష్ణ జయంతి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటే.. అస్సలు సౌండ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పేశారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం)'మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అని కీరవాణి చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది అయిపోవచ్చు.రాజమౌళి సినిమా అంటే ఫెర్ఫెక్ట్ ఉండాలి. అదీ కాక 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ వచ్చింది కాబట్టి.. ఇప్పుడు చేయబోయే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. దీంతో కచ్చితంగా పూర్తవడానికి నాలుగైదేళ్లు పట్టేస్తుందేమో? ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ విషయంలో గతంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదైనా అప్డేట్ వస్తే గానీ అసలేం జరుగుతుందనేది క్లారిటీ రాదు. చూడాలి మరి ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే ఆగస్టులో మహేశ్ పుట్టినరోజు నాటికైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) -
తెలంగాణ గేయంపై వివాదం
-
'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని కాంట్రవర్సీలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)ఇకపోతే 'జయ జయహే తెలంగాణ' పాటని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే తెలుగులో ఎన్నో దశాబ్దాల నుంచి సంగీత దర్శకుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' గీతంతో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవాణికి అప్పగించి ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్) -
13 నిమిషాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో అందెశ్రీ, కీరవాణిలకు ఆయ న పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పుల అనంతరం మరోమారు సమావేశమై గేయానికి తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 13 నిమిషాలు గేయం ఆలపించడం అతిథులకు ఇబ్బంది కలిగిస్తుందేమో ననే అభిప్రాయంతో షార్ట్ వర్షన్ రూపొందించాలనే అభిప్రాయం చర్చకు వచి్చందని, ఈ షార్ట్ వర్షన్ బాధ్యత అందెశ్రీకి అప్పగించారని తెలుస్తోంది. -
రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.తిరుమలకు సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'విశ్వంభర' అనే పేరుని ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. అసలు కథ ఏంటనేది కాస్త.. ఈ వీడియోలో రివీల్ చేశారు. అసలు 'విశ్వంభర' అంటే ఏంటి? ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుంది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) గతేడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన చిరు.. ఆగస్టులో 'భోళా శంకర్' మూవీతో వచ్చి ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చిరుని వీర లెవల్లో ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానమిచ్చేలా 'విశ్వంభర' మూవీ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తీస్తున్న ఈ సినిమా మూడు నాలుగు లోకాల మధ్య ఉండనుందని.. ఈ వీడియోతో అర్థమైంది. రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు.. పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. మరి ఈ వస్తువుతో చిరుకు ఏమైనా సంబంధం ఉంటుందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇక 'విశ్వంభర' అంటే భూమి, ప్రపంచం అని అర్థం. అంటే ఇది పలు యూనివర్స్‌ల నడిచే కథ అని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ) -
సినిమా హిట్‌కి ఆస్కార్ ఉపయోగపడదు
‘‘నేను మొదటి నుంచి సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది. అంతే కానీ నాకు వచ్చిన ‘ఆస్కార్’ అవార్డు అనేది ఓ సినిమా విజయానికి ఉపయోగపడదని భావిస్తాను. నా వరకూ సంగీతం బాగా అందించాలి. సినిమాని డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి నచ్చాలి. ‘నా సామిరంగ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అన్నారు. నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► నాగార్జునగారు, నా కాంబినేషన్లో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, అన్నమయ్య, శ్రీరామదాసు..’ వంటి పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ‘నా సామిరంగ’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. అందులో ఉన్నట్లుగానే ‘నా సామిరంగ’లోనూ వినోదాత్మక అంశాలు చాలా ఉన్నాయి. ఈ మూవీ మరో ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ అవుతుందని ఆశిస్తున్నాను. పైగా ‘నా సామిరంగ’ నాగార్జునగారికి యాప్ట్ టైటిల్. ► సీనియర్స్ కంటే కొత్త దర్శకుల్లో బాగా కష్టపడే తత్వం ఉంటుంది. ఎలాగైనా తమను తాము నిరూపించుకోవాలనే కసితో పని చేస్తారు. ఈ చిత్రదర్శకుడు విజయ్ బిన్నీ కూడా అంతే.. చాలా త్వరగా ఈ సినిమా తీయగలిగాడు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రాఘవేంద్ర రావుగార్లలా క్వాలిటీ తగ్గకుండా త్వరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను. బిన్నీ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ప్రతి పాటని ఫుల్ డ్యాన్స్ కోణంలో ఆలోచించడం సహజం. కానీ, దానికి భిన్నంగా ఇందులో రెండు మూడు మెలోడీ పాటలు చేయించాడు. అప్పుడు తను పరిపక్వత ఉన్న దర్శకుడనిపించింది. తెలుగు నేటివిటీ, కట్టుబాట్లు, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ► ‘నా సామిరంగ’ చిత్రానికి పాటలన్నీ చంద్రబోస్గారే రాశారు. అయితే అన్నం తినేటప్పుడు కొంచెం పచ్చడి నంజుకుంటాం. అలా అని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెపుకోం.. అన్నం తిన్నామని మాత్రమే చెప్పుకుంటాం కదా (నవ్వుతూ). ఇదీ అంతే. నేనుప్రేషనల్ లిరిక్ రైటర్ని కాదు. ఎవరైనా వచ్చి రాయమని అడిగినా రాయను. కానీ రీ రికార్డింగ్ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఓ ఆలోచన వస్తుంది. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఓ పాట రాశానంతే. ► ‘నా సామిరంగ’ చిత్రంలో ఇప్పటి తరానికి కావాల్సిన పాటలు ఇచ్చాను. నా వయసు ఎక్కువైనా నా వద్ద పని చేసే వారందరూ యువకులే.. వారి ఆలోచనలు నేటి యువతకు తగ్గట్టు ఉంటాయి. అలా ముందుకెళుతున్నాను (నవ్వుతూ). ఓ పాట వైరల్ కావడం, కాకపోవడం అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది.. వ్యూస్‌ని బట్టి తెలుస్తోంది. కానీ గతంలో పాట హిట్ అయ్యిందా? లేదా అని తెలుసుకోవాలంటే కష్టంగా ఉండేది. ఏదైనా పెళ్లికి వెళ్లి చూసేవాళ్లం. అక్కడ బ్యాండ్‌లో ఆ పాట ప్లే చేస్తుంటే హిట్టయినట్టు.. లేకుంటే కానట్టు అని తెలుసుకునే వాళ్లం (నవ్వుతూ). ►నేను సంగీతం అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మూడు పాటలు రికార్డ్ చేశాం. చిరంజీవిగారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ప్రారంభమయ్యాయి. రాజమౌళిగారితో చేయబోయే కొత్త సినిమా మ్యూజిక్ వర్క్ నా వరకూ ఇంకా రాలేదు. -
నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘నా సామి రంగ. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'బెల్లం చెరకు చూపులదానా.. అల్లం మిరప మాటలదానా..బొండు మల్లి నడుముదానా.. బండెడు సోకుల ఓ నెరజాణ.. నువ్వుట్టా పోతుంటే..నిన్నట్టా సూతుంటే.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ అందించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఆషిక రంగనాథ్ పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె వరలక్ష్మి పాత్రలో కనిపించనుందని వెల్లడించారు. ప్రత్యేకంగా గ్లింప్ల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ఇటలీ వెళ్లాడు. అలాంటిది ఇప్పుడు వీడియో కాల్లో కొందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అసలేం జరిగింది? చరణ్ ఎందుకు సారీ చెప్పాడనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీనితో పాటు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎప్పటికప్పుడు ఏదో కార్యక్రమానికి హాజరవుతూనే ఉంది. తాజాగా మన దేశంలో జర్మనీ యూనిటీ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. 'ఆర్ఆర్ఆర్' టీమ్ తరఫున కీరవాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. నాటు నాటు పాటని జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులందరూ డ్యాన్స్ కూడా చేశారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఇటలీ వెళ్లానని, తను రాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానని వీడియో కాల్లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) View this post on Instagram A post shared by German Embassy New Delhi (@germanyinindia) -
ఆయనతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్న: అనంత శ్రీరామ్
-
ఏడాది గ్యాప్.. ఒకేసారి రెండు మూవీ అప్డేట్స్
కింగ్ నాగార్జున గతేడాది అక్టోబరులో 'ఘోస్ట్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. అది ఘోరంగా ఫెయిలైంది. దీంతో ఆలోచనలో పడిపోయారు. కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతోపాటు ఓ వీడియోని రిలీజ్ చేసి హైప్ పెంచేశారు. వచ్చే సంక్రాంతికే ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పి దర్శకనిర్మాతలు షాకిచ్చారు. హిట్ కోసం వెయిటింగ్ అక్కినేని ఫ్యామిలీకి హిట్ పడి చాలాకాలమైపోయింది. 'ఘోస్ట్'తో బోల్తా కొట్టిన నాగార్జున.. ఏడాది గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించారు. కొత్త సినిమాకు 'నా సామిరంగ' అనే పేరు నిర్ణయించారు. తనకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. గుంటూరు కారం, ఈగిల్, హనుమాన్.. భారీ బడ్జెట్ చిత్రాలున్నా సరే నాగ్.. తన మూవీని బరిలో దింపుతున్నారు. దీనిబట్టి కాన్ఫిడెన్స్ అర్థమవుతోంది. (ఇదీ చదవండి: బర్త్‌డే స్పెషల్.. టాలీవుడ్లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే) గ్లింప్స్ ఎలా ఉంది? రెండు నిమిషాలున్న ఈ బర్త్ డే స్పెషల్ వీడియోలో నాగ్.. రగ్డ్ లుక్‌తో కనిపించారు. సీన్స్ అవీ చూస్తుంటే రూరల్ మాస్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ.. ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆస్కార్, నేషనల్ అవార్డులు గెలుచుకున్న కీరవాణి.. ఈ చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు. హీరోయిన్‌తో సహా ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ధనుష్ సినిమాలోనూ అలానే నాగ్ పుట్టినరోజు సందర్భంగా మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది. ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఇందులో కీలకపాత్రలో నాగార్జున నటిస్తారని ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎస్ జే సూర్య విలన్ అని తెలుస్తోంది. రష్మిక హీరోయిన్. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) Official !!#Nagarjuna Onboard for #Dhaush's #D51 🔥 He is going to play an extended cameo role 💫 pic.twitter.com/avPQQFqVlk — AmuthaBharathi (@CinemaWithAB) August 29, 2023 -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్‌బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
కీరవాణి 'ఆస్కార్'పై కేంద్ర మంత్రి కామెంట్స్
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని ఆస్కార్ అవార్డు ఆలస్యంగానే వచ్చిందని కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. నిర్మాత కేటీ కుంజుమన్ 1993లో నిర్మించిన చిత్రం జెంటిల్మెన్. నటుడు అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం అప్పట్లో సంచల విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. దీనికి గోకుల్ కృష్ణ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) చేతన్ శీను, నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చైన్నె ఎగ్మూర్‌లోని రాజా ముత్తయ్య హాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్న ఈ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణిని ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రి మురుగన్ మాట్లాడుతూ.. తమిళ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని అన్నారు. తమిళ ఇండస్ట్రీ ఇలా పేరు తెచ్చుకోవడంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ పాత్ర చాలా ఉందని గుర్తుచేసుకున్నారు. నిర్మాత కుంజుమన్ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారని, సంగీత దర్శకుడు కీరవాణి 33 ఏళ్లుగా సంగీత రంగంలో ఉన్నారని అన్నారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చిందనే అభిప్రాయాన్ని మురుగన్ వ్యక్తం చేశారు. ఆయన్ని ఆశీర్వదించడానికి తనకు వయస్సు చాలదని చెప్పుకొచ్చారు. జెంటిల్మెన్ సీక్వెల్ చిత్రం ఘనవిజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
‘మణి’తో చెదురు మధుర మెమొరీస్
మా చిన్ననాటి నెల్లూరు స్నేహితులు ఏ పేరుతో పలకరిస్తే తను పులకరిస్తాడో ఆ ముద్దుపేరే ‘మణి’. సినిమా వాళ్ళు పిల్చుకున్న పేరు బాలూ. వెరసి యస్పీ ‘బాలు’ సుబ్ర‘మణి’యం అయ్యాడు. తనతో నాకా రోజుల్నుంచే పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి, బంధమవడానికి మూల కారకుడు – కారణజన్ముడు మహమ్మద్ రఫీ. ఇక మేం వయసులో ఎదిగే కొద్దీ మా దారులూ, రహదారులూ, రహసందులూ వేరయ్యాయి. నేనేమో డాక్టరీ చదివి చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్నయ్యాను. తనేమో ఆ మూడు అంగాల్లో గొంతును ఎన్నుకొని దాన్ని ఎన్ని మెలికలు తిప్పాలో తిప్పి, డాక్టరేట్లూ, పాటలకి మంచి రేట్లూ సంపాదించుకుంట, చివరికి ‘పద్మభూషణ్’ దగ్గర ఆగాడు. నేనేమో నా పేషెంట్ల గూబల్ని గుయ్యిమనిపిస్తూ వైద్యం చేసుకుంటుంటే తనేమో శ్రోతల చెవుల్లోని కర్ణభేరులకు తన శ్రావ్యమైన గొంతుతో సాంత్వన కలిగించేవాడు. సింగర్‌గా తొలిరోజుల్లో తను పాడిన సినిమా పాటలు నాలుగైదు మట్టి రికార్డులుగా హెచ్.ఎం.వి. వారు మార్కెట్లోకి వదలగానే వాటిని చూసుకొని మురిసిపోయి, సన్నగా రివటలా ఉన్న మనిషి కాస్తా శారీరకంగా ఉబ్బి, మానసికంగా తబ్బిబై్బ పోయాడు. బాడీ షేమింగ్ చెయ్యడానికి రౌడీమూక రెడీ అవుతుందని ముందే పసిగట్టి, వాళ్ళ కంటే ముందు తన మీద తనే జోకులేసుకోవడం మొదలెట్టాడు. వేదిక మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ‘ఈ భారీకాయాన్ని దొర్లించుకుంటూ రావడంలో మీ కంటే వెనుకబడిపోయాను’ లాంటి జోకులు వేసుకుంటే ఇక అవతల వాళ్ళకేం మిగిలిందని! అందుకనే నేను అతనికి పెట్టిన పేరు ‘జోకులపతి ఫన్డితారాధ్యుల శుభ్రహాస్య గోలసుబ్రమణ్యం’. ఓసారి నాకు ఫోన్ చేసి ‘ఫలానా మన కామన్ ఫ్రెండ్‌కి మీ మున్సిపాలిటీలో ఏదో సర్టిఫికేట్ కావాలట. ఆ ఫ్రూఫ్లేవో పంపుతాడు. నువ్ కాస్త ఫాలోఅప్ చెయ్. మొన్న నేను కచ్చేరీకి వచ్చినప్పుడు ఎవరో వచ్చి కలిశారు. మేయరట. ఆ నంబర్ తెలుసుకుని నాకు పంపించు. నేనూ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాను’ అన్నాడు. ‘మేయరా? నేన్నమ్మను గాక నమ్మను’ అన్నాను. ‘ఏం? నా ఫ్యానై ఉండకూడదా? ఇందులో నమ్మకపోవడానికేముంది?’ అన్నాడు. ‘నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను, అక్కడ మెజా రిటీ వాళ్ళు మేస్తారు మేస్తారు మేస్తారు’. మణీ, నేనూ కలిసి ఎన్నోసార్లు వేదికలెక్కి నాటిక ప్రదర్శనల్లో పాల్గొన్నాం. ఓ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కి మైమ్ ప్రదర్శన. నటి రేవతి యాంకరింగ్. ప్రేక్షకుల్లో టాలీ, కోలీ, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందరో! కల్పనా అయ్యర్ డాన్స్ మొదలైంది. తర్వాత మా ‘వైద్యోనారాయణో హరీ’ మ్యూజిమైమ్. సైడ్వింగ్లో మేకప్పు లతో రెడీగావున్నాం. అప్పుడు చూసుకుంటే బాలు తెల్లకోటు (ఆప్రన్) మర్చిపోయి వచ్చాడు. అందులో మేమిద్దరం డాక్టర్లం. ఏదో కామెడీగా ఆపరేషన్ చేసే సీను. ఒక్కసారి నాకైతే గుండెల్లో గుదిబండ పడ్డట్టయింది. ‘ఏం వర్రీకాకు. నువ్వు డాక్టర్ పాత్ర కంటిన్యూ చెయ్. నేన్నీ పక్కన కంపౌడర్‌గా మారిపోతాన’ని అప్పటికప్పుడు ప్యాంటు మోకాలు వరకూ మడిచి, చొక్కా పై బటన్స్ రెండు విప్పేసి రెడీ అయిపోయాడు. ప్రదర్శన బ్రహ్మాండంగా వచ్చింది. అలా మేం తెరవేయగానే వేదిక వెనక్కి వచ్చిన దర్శకుడు బాలచందర్, మణితో ‘నీకొక కథ రెడీ చేసుకోబోతున్నాను. అందులో హీరో నువ్వే. నేను చెప్పినప్పుడు డేట్స్ యివ్వు’ అనేసి వెళ్ళిపోయారు. తర్వాత అది నిజంగానే కార్య రూపం దాల్చి తమిళంలో వసంత్ అనే తన అసిస్టెంట్‌తో దర్శ కత్వం చేయించారు బాలచందర్ ‘కేలడి కన్మణి’ (ఇందులోనూ మణి ఉంది గమనించారా). పెద్ద హిట్టయింది. ఓ ఉదయం తిరుపతి నుంచి మెడ్రాస్ కార్లో వెళ్తూ బోర్ కొట్టి ‘వీడు అర్ధరాత్రీ అపరాత్రీ ఫోన్లు చేసి డోకులొచ్చే జోకులేసి విసి గించేస్తుంటాడు కదా ఇప్పుడైతే ఒ.పి.లో పేషెంట్లతో మాంచి బిజీగా ఉంటాడు కదా? డయల్ చేసి యివ్వు కాలెత్తాడంటే అయిపోయాడే’ అని తన పి.ఎ. విఠల్‌తో అన్నాడట. తర్వా తెప్పుడో నాకు చెప్పారు. సరే, ఇక్కడ నా ఫోన్ మోగింది. ‘ఏం చేస్తున్నావ్’ అట్నుంచి మణి గొంతు.‘ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకేం చేస్తాను గురూ’ అన్నాను. ‘అదే. ఎన్నో ఏళ్ళ నుండి నిన్నెప్పుడడిగినా ప్రాక్టీస్ అనే అంటావు. మరి పర్ఫెక్ట్ అయ్యేదెప్పుడు? ప్రాక్టీస్ మేక్స్ ఎ మాన్ పర్ఫెక్ట్ అంటారు గదా. అంటే నువ్ ప్రాక్టీస్ సరిగ్గా చెయ్యడం లేదన్నమాటేగా. ఇప్పుడు నేను న్నాననుకో పాట ప్రాక్టీస్ చేస్తాను. పర్ఫెక్ట్ అయ్యాకే రికార్డింగ్ చేస్తారు. అలా నువ్వూ పెర్ఫెక్ట్ అవ్వాలని నా ఆశ’... ఇలా సాగి పోయింది వరుస. కాసేపు కామెడీ పక్కన బెడ్తే మీతో పంచుకోవలసిన మరో గొప్ప విషయాన్ని నా బీరువా అరల్లోంచి బైటికి తీస్తాను. కాకినాడలో నేను ఫైనలియర్ యమ్బీబీయస్ చదువుతున్న రోజుల్లో కొవ్వూరు నుంచి ఇక్కడికి వలసొచ్చిన ఓ భారీ నంబరు మెంబర్లున్న ఫ్యామిలీతో పరిచయమైంది. ప్రతి రాత్రీ వాళ్ళొచ్చి నా బేచిలర్ రూమ్‌లో సంగీత సాహిత్య సమలంకృత సద్గోష్ఠి జరుపుతుండేవారు. ఆ అన్నదమ్ముల్లో ఒకాయన కొడుకు వయొ లిన్ అద్భుతంగా వాయించేవాడు. అతనికప్పుడు ఇంకా నిక్కర్ల వయసే! అతన్ని సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో ముందో సారి బాలూకి పరిచయం చెయ్యమని నన్నడిగారు. నేనా కుర్రాడ్ని మద్రాస్‌లో మణి యింటికి తీసుకెళ్తే ఆ రాత్రి రెండు కీర్తనలు వింటే చాలనుకున్న బాలూకి ఇరవై రెండయినా తన్మయత్వం విడలేదు. అతిశయోక్తి కాదనుకుంటే ఆ రాత్రి అదే ఐ మీన్ తెల్లవారు జాము వరకూ రెండొందల రెండయినా అయ్యుంటాయి. చివర్న చేతు ల్నిండుగా చప్పట్లుకొట్టి ‘వెరీగ్రేట్. ఎలాంటి చైల్డ్ ప్రాడిజీని తీసు కొచ్చావ్! సంగీత ప్రపంచంలో ఇతనే హైట్స్‌కి వెళ్ళిపోతాడో నేనూహించలేను. గాడ్ బ్లెస్ యు’ అన్నాడు. ఆ కుర్రాడి పేరు – కీరవాణి. కీరవాణికి ఆస్కారకుడూ, ఆస్కారణ భూతుడైన∙రాజమౌళి కప్పుడు బహుశా రెండో, మూడో, ఏడో ఏడు. చాలాసార్లు వేదికల మీద కీరవాణి ప్రసక్తి వచ్చినప్పుడు మణి ‘నా ఫ్రెండ్ దివాకర్ నాకు మొట్టమొదట పరిచయం చేశాడు’ అంటుండేవాడు నేను గర్వపడేలాగ. తీరా ఇవ్వాళ కీరవాణి ఆస్కార్ పట్టుకొచ్చిన వేళకు, ముందే కూసిన కోయిలలా, కంగ్రాట్స్ చెప్పకుండానే, కంగారుపడి, కాయం చాలించి, కాలం చేసి, కీర్తిశేషుడయ్యడు బాలూ! నాకెంతో ఆప్తుడు, మనందరికీ ఇష్టుడైన మణి / బాలూకి ఈ డెబ్భయ్ ఏడవ జన్మదినాన ఈ భూగోళం ఉన్నంత కాలం బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ మెమొరబుల్ రిటర్న్స్ ఆఫ్ ది డే. డా‘‘ వై. దివాకర రావు వ్యాసకర్త ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్టు, కాకినాడ మొబైల్: 94403 40484 (నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి) -
ఆస్కార్ వేడుక చేసుకోవడం నాకు చాలా వింతగా ఉంది
-
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శిల్పాకళావేదికలో ‘నాటు నాటు’ ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ (ఫోటోలు)
-
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్‌కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్‌చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
పెళ్లి సందడి@25.. రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సౌందర్య లహరి.. స్వప్న సుందరి’, ‘నవ మన్మథుడా.. అంతి సుందరుడా’, ‘హృదమనే కోవల తలుపులు తెరిచే తాళం ప్రేమ’ లాంటి పాటలు వింటే ఇప్పటికీ ఏదో అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 12,1996లో విడుదలైంది. బుధవారం నాటికి ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరరావు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను’ అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పెళ్లి సందD సినిమా హీరోయిన్ పేరును తెలియజేస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం. అని ట్విటర్ ద్వారా తెలియజేశారు. కాగా అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీ లీల.. కిస్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విడుదల అవ్వకుండానే శ్రీమురళి నటిస్తోన్న భారతే అనే మూవీలో అవకాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లిసందDతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. -
సైబరాబాద్ : ప్లాస్మాదానం ప్రచారంలో రాజమౌళి
-
కరోనాపై కీరవాణి కదిలించే పాట..
అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్, సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి’, ‘ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి’ అనే లిరిక్స్ ప్రజల్లో చైతన్యంతో పాటు మనోధైర్యాన్ని తీసుకొస్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. ఇక గతంలో కూడా కరచాలనం కంటే చేతులెత్తి నమస్కారం చేయడం ఎంత మంచిదో వివరిస్తూ ఓ పద్యాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడికి బిల్‌గేట్స్ సూచనలు! ‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’