Keerthi
-
సింగిల్ క్యారెక్టర్‌తో వస్తోన్న హలో బేబీ.. ట్రైలర్ చూశారా?
కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హలో బేబీ. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ..'ట్రైలర్ చూస్తుంటే సోలో క్యారెక్టర్‌తో తో సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయం. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. హ్యాకింగ్‌పై తీస్తున్న మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు' అని కొనియాడారు.నిర్మాతఆదినారాయణ మాట్లాడుతూ..' ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. హీరోయిన్ కావ్య కీర్తి అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది' అని అన్నారు. -
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. హగ్గులతో 'బిగ్‌బాస్' కీర్తి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కుమారి ఆంటీ ఫుడ్ పై ఊహించని కామెంట్
-
ఏడుగురికి పునర్జన్మనిచ్చిన ‘కీర్తి’
పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్‌కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్‌కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు. కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. కీర్తికి గౌరవ వందనం చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు కష్టం
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్‌ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్‌ప్యాడ్‌ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్‌ప్యాడ్‌ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాటన్ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్రెడ్డిని సంప్రదించగా.. కాటన్‌ప్యాడ్‌ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
Bigg Boss Keerthi Engagement: బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్- హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!
బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కార్తీ తన వివాహాబంధానికి ముగింపు పలికారు. తన భార్య అర్పితకో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పాత జ్ఞాపకాలన్నీ మరిచిపోయి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు. ఈ జంట పెళ్లైన దాదాపు 11 ఏళ్లకు తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు. కాగా.. వీరిద్దరికీ ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు. గతంలో వీరిద్దరు డైవర్స్ తీసుకోబోతున్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యేలా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి : వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఇన్‌స్టాలో కిరిక్ కీర్తి రాస్తూ.. ' ఈ రోజు చట్టం ప్రకారం మేం విడిపోయాం. అర్పిత, నాకు మధ్య బంధానికి పూర్తిగా తెరపడింది. ఇక నుంచి నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఉండదు కూడా. అధికారికంగా మేం విడాకులు తీసుకున్నాం. ఆమె కూడా మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నా. చేదు జ్ఞాపకాలను మరచిపోయి.. మీ ప్రేమ, శుభాకాంక్షలు భవిష్యత్తులోనూ నాపై కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 2023లో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని.. జీవితం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొచ్చాడు. కాగా.. కిరిక్ కీర్తి, అర్పిత మొదటిసారి కాలేజీలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహం పెళ్లిబంధంగా మారింది. అయితే వీరు పెళ్లికి ముందు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. వీరి వివాహానికి అర్పిత తల్లిదండ్రులు అంగీకరించలేదు. (ఇది చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా? ) View this post on Instagram A post shared by ಕಿರಿಕ್ ಕೀರ್ತಿ - Kirik Keerthi (@kirikkeerthi) -
ఒక కష్టం దశ... దిశను మార్చింది!!
ఓ పండు కన్నతల్లిని కాపాడింది... కన్న బిడ్డను రక్షించింది. ఒక బిడ్డగా ఒక తల్లిగా ఎదురైన అనుభవాలు... ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. కంప్యూటర్స్ నుంచి పంటపొలానికి దారి మళ్లించాయి. పంట పొలం నుంచి పరిశ్రమ దిశగా నడిపించాయి. ‘ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు చాలా సులువుగా ఖర్చు చేయగలుగుతారు. తిరిగి తాము పనిచేసే దేశాల్లో అంత డబ్బును సులువుగా సంపాదించుకోవచ్చనే ధీమా అది. అదే ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా కష్టం’ అన్నారు చికోటి కీర్తి. జీవితం నేర్పించిన పాఠాలనుంచి ఆమె తెలుసుకున్న జ్ఞానం అది. ‘నా జీవితమే నన్ను నడిపించింది. హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించి, పెళ్లితో నైజీరియా వెళ్లాను. ముగ్గురు పిల్లల తల్లిగా ఇండియాకి వచ్చి నా సవాళ్లకు జవాబుల కోసం అన్వేషణ మొదలు పెట్టాను. సంజీవనిలాంటి పరిష్కారం దొరికింది. తొగరు పండు నన్ను పారిశ్రామికవేత్తగా మార్చింది’ అని క్లుప్తంగా వివరించారు కీర్తి. విజయవంతమైన కీర్తి ప్రయోగాల జీవితం ఇలా సాగింది. బాబు తక్కువ బరువుతో పుట్టాడు ‘‘నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లిబర్టీ సెంటర్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాను. నాన్న నైజీరియాలో మెకానికల్ ఇంజనీర్, అమ్మ మా కోసం గాంధీ హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది. మూడు నెలలకోసారి ఎవరో ఒకరు ఇండియా– నైజీరియాల మధ్య ప్రయాణించేవాళ్లం. పెళ్లి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇక్కడి అబ్బాయితో కుదరడం యాదృచ్ఛికమే. నా పిల్లలు ఇండియాలోనే పుట్టాలనే ఆకాంక్ష కొద్దీ మూడు డెలివరీలకూ ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను. రెండవసారి గర్భిణిగా ఉన్న సమయంలో సరిగ్గా ఏడవ నెలలో అమ్మ ఆరోగ్యం మా కుటుంబాన్ని కుదిపేసింది. అక్కడ (నైజీరియా) మలేరియా సర్వసాధారణం. అమ్మకు మలేరియా మెదడుకు సోకడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అక్కడ అన్నిరకాల వైద్యం అందించిన తర్వాత ఇండియాకి తీసుకువచ్చి డాక్టర్ సూచనతో నోని ఫ్రూట్ (తొగరు పండు) జ్యూస్ పట్టించాం. ఆమె రికవరీ స్పీడ్ మాకే ఆశ్చర్యం కలిగింది. నా డెలివరీ టైముకు పూర్తిగా కోలుకుని అంతా తనే చూసుకుంది. నాకది మిరకిల్. అయితే ఆ మిరకిల్ నా తదుపరి జీవితానికి ఒక సంకేతమని ఆ తర్వాత తెలిసింది. నాకు బాబు డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. బరువు ఒకటిరన్నర కిలోలు. మేము ఏ మాత్రం ఊహించని పరిణామం అది. నాలుగు నెలలు నిండినా బరువు గ్రాము కూడా పెరగ లేదు. డాక్టర్లు ఏ భరోసా ఇవ్వలేకపోయారు. అప్పుడు అమ్మ తనను కాపాడిన నోని జ్యూస్ బాబు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుందేమో చూద్దామన్నది. దేవుడి మీద భారం వేసి పట్టించాం. నెల రోజుల్లో ఏడు వందల గ్రాములు పెరిగాడు. అప్పటి నుంచి నోని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. కంపెనీ మాట మార్చింది మార్కెట్లో ఉన్న నోని ఫ్రూట్ జ్యూస్ కంపెనీలను సంప్రదించాను. ఇదీ అదీ అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సేకరించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో అమ్మ ఆరోగ్య దృష్ట్యా నాన్న బయటి దేశాల్లో ఉండడానికి ఇష్టపడక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేశారు. ఆయన తనకంటూ వ్యాపకం కోసం వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా పదెకరాల పొలం కొని తొగరు చెట్లను పెంచాం. ఓ కంపెనీ ఇచ్చిన భరోసాతో పంటను యాభై ఎకరాలకు విస్తరించాం. అయితే పంట పెద్ద మొత్తంలో వచ్చే సమయానికి కంపెనీ మాకిచ్చే ధర తగ్గించింది. ఖర్చులు కూడా రానంత తక్కువ ధరకు అమ్మడంకంటే ఈ పండ్లతో మనమే పరిశ్రమ స్థాపిద్దామనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా కుటుంబ అవసరాలకు తగినట్లు తయారు చేస్తున్న జ్యూస్, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి మొత్తం పాతిక రకాల ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేసి ‘చెక్ బయో ఆర్గానిక్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చాం. మా పొలంలో పండించి తయారు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో మోసపోవడం, రాజీ పడడం రెండూ ఉండవు. మా అమ్మను, నా బిడ్డను కాపాడిన ఈ పండులోని ఔషధగుణాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో సంజీవని వంటి ఈ పండును ఎన్ని రకాలుగా అందించవచ్చనే పరిశోధనలు చేస్తున్నాను. ప్రభుత్వ అనుమతుల ప్రకారం సర్టిఫికేట్లతోపాటు నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నాను’’ అని తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారామె. ‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు కీర్తి. సంజీవని పండుతో పరిశోధన తొగరు చెట్లు చలిని తట్టుకోలేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ పండు మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ పంట అక్కడ పండదు. కాబట్టి ఎన్నో ఔషధగుణాలున్న సంజీవని వంటి ఈ పండుకు ప్రచారం కూడా పెద్దగా లభించలేదు. ఈ పండు నేరుగా మన దేహంలోని కణాల మీద పనిచేస్తుంది. అనేక రోగాలను నయం చేస్తుంది. కణాల శక్తిని పెంచి, దేహాన్ని వ్యర్థరహితం, విషరహితం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి గుణాన్నిస్తుంది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత స్వస్థత కోసం వాడడమే కాదు. మామూలు వాళ్లు కూడా రోజుకు 30 మిల్లీలీటర్ల రసం తాగితే సమగ్రమైన ఆరోగ్యం చేకూరుతుంది. రసాయన రహితంగా తయారు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వచ్చింది. ఆయుష్ అనుమతి కోసం అప్లయ్ చేశాను. – చికోటి కీర్తి ఫౌండర్, చెక్ బయో ఆర్గానిక్స్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్ డాక్టర్ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్...
మరో కీర్తికిరీటం ‘మిసెస్ తెలంగాణ’. ‘మిసెస్ వోగ్స్టార్ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్ నాడి పట్టుకుంది. సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో జైపూర్ వేదికగా వోగ్ స్టార్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్స్టార్ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది. ‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్ఎన్ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్‌తోనే మమేకమైపోయింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో టెన్త్ టాపర్‌ని. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్‌లు ప్రాక్టీస్ చేశాను. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్ లెవెల్ ప్లేయర్‌ని. ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్‌లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్ ఇంటర్లో ఉండగా ఓ యాక్సిడెంట్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు. ఏఎస్రావు నగర్లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్సెట్లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నాను. టాప్ టెన్‌లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్ వల్ల ఆ కల నెరవేరలేదు. ► ... డాన్స్ మానలేదు! కుప్పంలో ఎంబీబీఎస్ చేశాను. అప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ మానలేదు. నేను స్టేజ్ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్ మ్యారేజ్. డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్‌లో నా సీనియర్. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్‌తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు. డాన్స్ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్ హైదరాబాద్ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్ రౌండ్లో ర్యాంప్ వాక్, డాన్స్ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్ తెలంగాణ ఆడిషన్’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా అనేక సెషన్లు జరిగాయి. అన్నీ వర్చువల్‌గానే. ► పోటీల నుంచి నేర్చుకున్నాను! ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్‌లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’ ఎంపిక ఇలా! స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి. – డాక్టర్ ఎం.వి. శ్రీకీర్తి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
Deputy Collector Datla Keerthi: సర్కారీ కొలువులు.. కీర్తికి సలాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ బాధ్యతల వరకూ విజయనగరంతో ఆమెకు విడదీయలేని అనుబంధం... ఇటీవల వెలువడిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తరాంధ్ర టాపర్‌గా నిలిచి విద్యల నగరానికి వన్నె తెచ్చారు. ఒకవైపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సబ్‌కలెక్టర్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నారు. విసుగు లేకుండా 11 ఏళ్ల పాటు నిర్విరామ కృషితో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. మెటీరియల్ సౌలభ్యం అంతగా లేకపోయినా గ్రూప్–1 వంటి పోటీపరీక్షల్లో భావవ్యక్తీకరణకు మాతృభాష తెలుగు తనకు కలిసిసొచ్చిందని సగర్వంగా చెబుతున్నారు దాట్ల కీర్తి. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... టీచర్ల ఫ్యామిలీ మాది... మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలంలోని రాజులనగరం. మా నాన్న దాట్ల జగన్నాథరాజు తొలుత ఎస్జీటీగా తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది రిటైర్డ్ అయ్యారు. అమ్మ నిర్మల కూడా టీచరే. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోడపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన తర్వాత చిన్న వయసులోనే టీచర్‌ను అయ్యాను. అలా టీచర్ల ఫ్యామిలీ మాది. కానీ మా తాతగారు కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో గ్రామాల్లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. అలా నాకు గ్రూప్–1 రాసి సబ్‌కలెక్టరు పోస్టు సాధించాలనే లక్ష్యం ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లోనే చదువు... నాన్న చేయి పట్టుకొనే స్కూల్‌కు వెళ్లడంతో నా విద్యాభ్యాసం మొదలైంది. మా ఊరికి సమీపంలోనే ఉన్న వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో ఆయన టీచర్‌గా పనిచేసేటపుడు అక్కడే నన్నూ చదివించారు.ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ మాకవారిపాలెం జెడ్పీ హైసూ్కల్లో చది వాను. ఏడో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి పరీక్షలు ప్రైవేట్‌గా రాయించారు మా నాన్న. అలా 13 ఏళ్లకే 1997–98 బ్యాచ్‌లో పదో తరగతి పాస్ అయ్యాను. ఇంటర్ విద్య కోసం విజయనగరానికి... ఇంటరీ్మడియెట్ చదవడానికి తొలిసారిగా విజయనగరం వచ్చాను. శ్రీనివాస జూనియర్ కాలేజీలో బైపీసీ చదివాను. నిరీ్ణత వయసు కన్నా తక్కువ ఉండడంతో అప్పుడు ఎంసెట్ రాయడానికి నిబంధనలు అంగీకరించలేదు. బీఎస్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినా సెకండ్ ఇయర్ మళ్లీ విజయనగరం వచ్చేశాను. ఇక్కడి గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆసెట్లో 3వ ర్యాంకు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీలో చేరాను. 2005లో గోల్డ్ మెడల్‌తో బయటకు వచ్చాను. అదే సంవత్సరం ఎడ్‌సెట్‌లో ర్యాంకు సాధించడం, 2005–06 బ్యాచ్‌లో బీఈడీ పూర్తి చేయడం కూడా జరిగిపోయాయి. 21 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. అధికారిగా శిక్షణ కూడా విజయనగరంలోనే... బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఎనిమిది నెలల శిక్షణ కోసం 2018లో విజయనగరం జిల్లాకే వచ్చాను. తర్వాత పోస్టింగ్ కూడా ఇక్కడికే రావడం నా అదృష్టం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా 2019 సంవత్సరంలో రెగ్యులర్ అయ్యాను. అప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాను. ఉన్నతమైన జీవితానికి విద్య ఒక్కటే మార్గం. ప్రభుత్వం కలి్పంచిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనేది నా సూచన. నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించింది... గ్రూప్–1 నోటిఫికేషన్ 2018 సంవత్సరంలో మరోసారి వెలువడింది. ప్రిలిమ్స్ తర్వాత 2020 సంవత్సరంలో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాల్లో 325 మంది విజేతల్లో నేనూ ఉన్నాను. వాల్యూషన్ మళ్లీ చేయడంతో వారిలో నాతో పాటు 123 మందికి మాత్రమే ఇంటర్వ్యూకు అవకాశం దక్కింది. తుది ఫలితాల్లో 9వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాంధ్రలోనే టాపర్‌గా నిలిచాను. సబ్‌కలెక్టర్ అవ్వాలనే నా కల నెరవేరింది. లక్ష్యంపై గురి తప్పవద్దు... గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం... ఇవేవీ గ్రూప్–1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడానికి ఆటంకాలు కానేకావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యంపై గురి తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ క్రమంలో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా చేరడం మంచిది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావవ్యక్తీకరణ ప్రధానం గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో భావవ్యక్తీకరణ చాలా ప్రధానం. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని దినపత్రికలను చదవాలి. అంశాల వారీగా క్లిప్పింగ్స్ ఉంచుకోవాలి. అయితే పరీక్షల్లో ఆ సమాచారాన్ని యథావిధిగా దించేయకూడదు. ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తూ మన విశ్లేషణ కూడా జోడించాలి. ఎగ్జామినర్‌ను ఇంప్రెస్ చేసేలా భావవ్యక్తీకరణ ఉండాలి. ఇందుకు మాతృభాష తెలుగు నాకు బాగా ఉపయోగపడింది. త్వరలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అయ్యేవారికి ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్‌తో పాటు స్వీయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.’’ సబ్‌కలెక్టర్ కావాలన్నదే లక్ష్యం... సబ్‌కలెక్టరు కావాలన్నదే లక్ష్యం. ముందు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని డీఎస్సీకి ప్రిపేరేషన్ ప్రారంభించాను. అదే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్‌తో వివాహం అయ్యింది. ఆయన ఐటీ రంగాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారంలోకి వచ్చేశారు. నేను 2009లో డీఎస్సీలో మూడో ర్యాంకుతో టీచర్ ఉద్యోగం పొందాను. అచ్యుతాపురం మండలంలోని గొర్లి ధర్మవరం యూపీ స్కూల్లో చేరడంతోనే హెడ్మాస్టర్గా పనిచేయాల్సి వచ్చింది. టీచర్‌గా కొనసాగుతూనే గ్రూప్–1 పరీక్షకు సిద్ధమయ్యాను. 2011లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. న్యాయవివాదాలతో ఫలితాలు వెలువడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2016లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను. -
Vizianagaram: గ్రూప్–1 ఫలితాలు.. రాణించిన రైతు బిడ్డ
గ్రూప్–1 ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు, మరో అధికారి ప్రతిభ చూపారు. వీరిలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నతోద్యాగాలకు సిద్ధమై విజయం సాధించగా, మరొకరు సివిల్స్ శిక్షణ తీసుకుంటూ గ్రూప్–1 ఉద్యోగానికి అర్హత సాధించారు. డిప్యూటీ కలెక్టర్‌గా కీర్తి విజయనగరం పూల్‌బాగ్: విజయనగరం జిల్లా బీసీ సంక్షేమాధికారి దాట్ల కీర్తి గ్రూప్ –1లో విజేతగా నిలిచారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపి కయ్యారు. ఆమె రాష్ట్ర స్థాయిలో 8, ఉత్తరాంధ్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె గత మూడేళ్లుగా జిల్లా బీసీ సంక్షేమాధి కారిగా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆమె తల్లి దాట్ల నిర్మల విశాఖపట్నం జిల్లా చోడపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తండ్రి జగన్నాథ రాజు హెచ్‌సీ వెంకటాపురం మండలం జెడ్పీహెచ్ లో స్కూల్ అసిస్టెంట్(సైన్సు)గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. కీర్తి స్వస్థలం విశాఖజిల్లా మాకివారిపాలెం మండలంలోని రాజులనగరం. కీర్తికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. రాణించిన రైతు బిడ్డ గుర్ల: గుర్ల మండలంలోని నాగళ్లవలసకి చెందిన అట్టాడ అప్పలనాయుడు ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గరివిడి ఫేకర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుమారుడు వెంకటరమణ మూర్తి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపడంతో ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయన గ్రూపు–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన గరివిడిలోని గోదావరి స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో పుటపర్తిలోని శ్రీ సత్యసాయి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో మూడేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం అయిన నిరాశ చెందకుండా చదువుతున్నారు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైనా చేరలేదు. సివిల్స్‌లో రాణించి ఐఏఎస్ అవ్వాలన్నదే అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రజరీ అధికారిగా సన్యాసిరావు వేపాడ: మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరిణి సన్యాసిరావు గ్రూపు–1లో విజేతగా నిలిచారు. అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆయనది ఎల్.కోట మండలం గొల్జాం స్వగ్రామం. తల్లిదండ్రులు తరిణి రామారావు, ఈశ్వరమ్మల ప్రోత్సాహంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. 2006లో డీఎస్సీ క్వాలిఫై అయ్యారు. 2008 ఫిబ్రవరి 28న ఎస్.కోట మండలం వెంకటరమణపేట ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2009 వరకు పనిచేశారు. 2009 ఆగస్టు నుంచి 2017 జూలై వరకు ఎంపీయూపీఎస్ జాకేరులో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి నేటివరకు ఎంపీపీఎస్ బంగారయ్యపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన గ్రూపు–1లో విజయం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు భార్య పద్మశ్రీ, కుమారై లిఖితరామ్, కుమారుడు భార్గవ్‌రామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం) -
Neetu Yadav And Kirti Jangra: బర్రెలు అమ్మే బిజినెస్.. 2500 కోట్ల అమ్మకాలు!
‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?’ నీతూ యాదవ్, కీర్తి జంగ్రాలను అందరూ ఇదే అడిగారు. ఇద్దరూ ఢిల్లీ ఐఐటిలో చదివారు. ఒకటి రెండు ఉద్యోగాలు చేశారు. మానేసి ఆన్లైన్లో పశువుల సంత పెడతామంటున్నారు. ‘మీకేమైనా పిచ్చా?’ ‘బుద్ధి గడ్డి తింది’ ‘చదివాక పిసలు అన్నారట’ ఎన్నో కామెంట్స్... కాని ఈ ఇద్దరు అమ్మాయిలు ‘యానిమాల్’ అనే యాప్ తయారు చేశారు. 2019లో మొదలెట్టారు. ఇప్పటికి 2500 కోట్ల విలువైన పశు అమ్మకాలు సాగించారు. IITians Neetu Yadav And Kirti Jangra: అది 2019. నీతూ యాదవ్ బెంగళూరు నుంచి జైపూర్‌లో ఫ్లయిట్ దిగింది. సెప్టెంబర్ నెల. జల్లు పడుతోంది. నీతూ బుర్రలో కూడా ఆలోచనల జల్లు కురుస్తోంది. బెంగళూరులో ఆన్లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం మానేసి జైపూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతవూరు నవల్పూరుకు వెళుతోందామె. అక్కడ ఏం చేయాలో తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. మరోవైపు అదే సమయానికి హర్యానాలోని హిసార్ పట్టణంలో కీర్తి జంగ్రా నివాసం కోలాహలంగా ఉంది. కీర్తికి అమెరికాలో ఉన్నత చదువులకు సీట్ వచ్చింది. ఆమె అమెరికాకు వెళ్లనున్నందున తల్లిదండ్రులు బంధువులను పిలిచి చిన్న పార్టీ అరేంజ్ చేశారు. కాని కీర్తి మనసులో ఏముందో తెలిస్తే వారి రియాక్షన్ ఏమిటో. రియాక్షన్ ఎలా ఉన్నా నిర్ణయం చెప్పాల్సిందే కదా. ‘ఆన్లైన్లో పశువులు అమ్ముతాం’... ఇదీ నీతూ యాదవ్, కీర్తి జంగ్రా తమ ఇళ్లల్లో చెప్పింది. వాళ్లిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. రూమ్మేట్స్. జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నో కలలు కన్నారు. ఐఐటి అయ్యాక నీతూ బెంగళూరులో ‘ప్రతిలిపి’లో పని చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్గావ్లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్‌లో పని చేయడానికి వెళ్లింది. ఇద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఇద్దరికీ తాము చేస్తున్న ఉద్యోగాలు అంత సంతృప్తినివ్వడం లేదు. ఏదైనా సొంతగా సాధించాలనే తపన. నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు. నీతూకు పశువులతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కీర్తి తండ్రి టీచర్. కాని అతని మేనమామలు పాడి రైతులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పశువుల సంతలు చూశారు. పశువుల లావాదేవీల సమయంలో రైతుల హైరానా చూశారు. ఇద్దరికీ ఒకేసారి ‘అసలు ఆన్లైన్లో పశువులు ఎందుకు అమ్మకూడదు’ అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం ఎదురైంది.పశువులంటే ఉప్పులో పప్పులో కాదు. బట్టలు కాదు ఆన్లైన్లో కొనడానికి. రైతులు సంతకు వచ్చి ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కుంటారు. మరి ఆన్లైన్లో వీళ్లు ఎలా అమ్ముతారు? ఇదే ప్రశ్న అందరూ వేశారు ఇద్దరినీ. వాళ్లు సమాధానం చెప్పలేదు. చివరకు ఇద్దరి ఇళ్లలోనూ ‘సరే.. మీకు నచ్చిందే చేయండి’ అన్నారు. 2019 చివరలో బెంగళూరులో 11 వేల రూపాయల అద్దెతో ఒక చిన్న గది నుంచి నుంచి నీతూ, కీర్తిల ‘యానిమాల్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. ‘యానిమల్’ పశువు. ‘యానిమాల్’ పశువుల సంత. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. వర్చువల్ సంత. కొనాలనుకున్న రైతు అమ్మాలనుకున్న రైతు వీళ్లు తయారు చేసిన ‘యానిమాల్’ ద్వారా లావాదేవీలు ముగించవచ్చు. ‘అసలు జనం టిక్‌టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లాంటి కాలక్షేపం యాప్‌లను కాకుండా పనికొచ్చే ఉపాధికి అవసరమయ్యే యాప్‌లను ఎందుకు చూడరు. దేశంలో 30 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ఏడున్నర కోట్ల పాడి రైతుల దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఇది పెద్ద మార్కెట్. ఆన్లైన్ అమ్మకాలలో వీటిని తేవచ్చునని చాలామంది అనుకోలేదు. ఎందుకంటే సంప్రదాయ సంతల్లోనే వీటి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. కాని మేము వీటిని ఆన్లైన్లో తేదలుచుకున్నాం. యాప్ తయారు చేశాం. సక్సెస్ అయ్యాం’ అంటుంది నీతూ యాదవ్. అయితే ఇలా సక్సెస్ కావడం అంత సులభం కాలేదు. 2019 చివరి వరకూ వీళ్లు కేవలం 50 పశువులే తమ యాప్ ద్వారా అమ్మారు. కాని 2020లో లాక్డౌన్ వచ్చాక వీరి యాప్ ఊపందుకుంది. దీనిని రైతుల సౌలభ్యం కోసం హిందీలో కూడా డెవలప్ చేశారు. దాంతో రాజస్థాన్‌లోనే ఐదులక్షల మంది పాడిరైతులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్లలో యానిమాల్ కార్యకలాపాలు విస్తరించాయి. 2020 నవంబర్ నాటికి 30 వేల పశువుల లావాదేవీలు సాగితే డిసెంబర్‌కు వాటి సంఖ్య 40 వేలు అయ్యింది. 2021 నుంచి సగటున నెలకు 50 వేల పశువులు ‘యానిమాల్’ ద్వారా అమ్మకమో కొనుగోలో జరుగుతోంది. ఇప్పటికి 80 లక్షల మంది రైతులు ‘యానిమాల్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘ఇన్వెస్టర్లు భారీగా మాకు ఫండ్ చేయడానికి ముందుకు వచ్చారు. చేశారు కూడా’ అని మెరుస్తున్న కళ్లతో అంటుంది కీర్తి. ఇప్పటికి 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి దక్కాయి. కీర్తి, నీతూ చేసింది ఏమిటంటే అమ్మే రైతును, కొనే రైతును అనుసంధానం చేయడమే. ‘మేం చెప్పామని కొనొద్దు. పాలు పితికి చూసి మరీ తీసుకోండి’ అని వీరు అంటారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు. అలాగే పాడిరైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తారు. పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో కూడా తెలియ చేస్తారు. ఉత్తర భారతదేశంలో యానిమాల్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది. ఇది రైతుల మాటే. ‘ఇలా మేము ఎప్పుడూ పశువులను కొనలేదు’ అని వారు అంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక కొత్త ఆలోచన మెరిపించారు. అది ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కారణమైంది. ‘నీ తెలివి సంతకెళ్లా’ అనేది మనకు తిట్టు. కాని తెలివి నిజంగా సంతకెళితే ఏమవుతుందో చూశారుగా! -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి కీర్తి ధునుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చిన్నారికి అప్పుడే రుద్వేద్‌గా పేరు పెట్టారు. కీర్తి-ధనుష్ తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో బుల్లితెర నటులు సహా నెటిజన్లు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇటీవలె కీర్తి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా కీర్తి బావ నిరుపమ్ అలియాస్ డాక్టర్‌బాబు అన్న విషయం తెలిసిందే. నిరుపమ్ భార్య మంజులా పరిటాల స్వయానా కీర్తికి అక్క. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. View this post on Instagram A post shared by 🅹🅰️🅸🅳🅷🅰️🅽🆄🆂🅷 (@jaidhanushofficial) -
ఘనంగా సీరియల్ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్
ప్రముఖ సీరియల్ నటి కీర్తి సీమంతం తన నివాసంలో ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటి కీర్తి భర్త ధనుష్ కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాకుండా కీర్తి బావ నిరుపమ్ అదేనండీ డాక్టర్‌బాబు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఈయన భార్య మంజలా పరిటాల కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. కీర్తి-దనుష్ మొదటిసారి తల్లిదండ్రులు కానుండటంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడ సీరియల్స్‌తో బాగా గుర్తింపు పొందిన కీర్తి తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. చదవండి : మొదటిసారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ ఒంటరిగానే డెలివరీకి వెళ్లా.. హరితేజ ఎమోషనల్ వీడియో -
మేధావి కీర్తిని ‘రేంజర్ దీదీ’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని భద్రగడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు మేధావి కీర్తి. గతేడాది మే నెలలో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కీర్తిని స్థానికులంతా ‘రేంజర్ దీదీ’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే స్థానిక మహిళలకు తోడబుట్టిన అక్కలా వ్యవహరిస్తున్నారు ఈ యంగ్ ఆఫీసర్. ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమంది మహిళలకు చేయూతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు కీర్తి . ‘ధాత్రీ’ అనే సంస్థను స్థాపించి, భుట్గావ్, నెగ్యానా, బండసరి, తిక్రీ సుమన్కారి గ్రామాల్లోని మహిళల ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ధాత్రీ సంస్థ ద్వారా కుట్లు, అల్లికలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పనుల్లో స్థానిక మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన మహిళలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయించి వాటిని మంచి లాభాలకు విక్రయిస్తూ ఆదాయాన్ని పదింతలు చేస్తున్నారు. దీపాలు, పూజాసామగ్రి, కుండల తయారీ, సుంగధ ద్రవ్యాల ఉత్పత్తులు, స్థానికంగా పండే బార్లీ, రాజ్మా, మండెవా, రోడోడెండ్రాన్ రసం వంటివాటిని తయారు చేయిస్తున్నారు. అంతేగాక స్థానికంగా పెరిగే మలు, తిమ్లీ అనే మొక్కల నుంచి తయారు చేసిన ప్లేట్స్, గిన్నెలను ‘వేదిక్ పత్రావళి’ పేరుతో విక్రయిస్తున్నారు. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయిస్తున్నారు. ‘నందినీ’ అనే బ్రాంచ్ ప్రారంభించి దీనిలో పెళ్లికాని అమ్మాయిలతో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయిస్తున్నారు. ప్రారంభంలో ఇక్కడి మహిళలను ఒప్పించడం చాలా కష్టమైంది. కానీ తరువాత సీనియర్ అధికారుల సాయంతో ముందుకు సాగగలిగానని కీర్తి చెప్పారు. మహిళలకు శిక్షణ నివ్వడం గతేడాది దీపావళి పండుగకు ఒక నెలముందు ప్రారంభించాం. అప్పుడు కొన్ని రకాల మెషిన్లు, కొంతమంది ట్రైయినర్లతో శిక్షణ ఇప్పించడంతో.. నెలరోజుల్లోనే వేగంగా నేర్చుకుని దీపావళి పండుగ సమయంలో అనేక ఉత్పత్తులు అందించిన మహిళలు వాటిని విక్రయించడం ద్వారా రూ.40 వేలు ఆదాయం పొందారు’’ అని కీర్తి చెప్పారు. ‘‘ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశువులు పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత వాటిని పెద్దగా పట్టించుకోరు. అటువంటి పశువుల నుంచి పేడ సేకరించి వాటిని ఉపయోగపడే కళాఖండాలుగా తీర్చితిద్ది వాటి ద్వారా గ్రామీణ మహిళలకు మరికొంత ఆదాయం సృష్టించడమే తమ లక్ష్యం’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మేధావి కీర్తి ఎంతో కష్టపడి ఇక్కడి మహిళలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. నాణ్యతతో కూడిన స్వదేశీ ఉత్పత్తులకు ధాత్రీ మంచి బ్రాండ్‌గా ఎదుగుతుంది’’ అని ముస్సోరీ డివిజినల్ ఫారెస్ట్ అధికారి కహంకన్ నసీమ్ అన్నారు. ధాత్రీ ద్వారా ఉపాధి పొందుతున్న తమకు రేంజర్ దీదీ తల్లిలా, అక్కలా తమని ఆదుకుంటున్నారని ధాత్రీద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు చెప్పారు. ఎప్పటికప్పుడు తమని మోటివేట్ చేస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆదాయంగా మలుస్తున్నారు. మహా కుంభమేళా–2021లో మా ఉత్పత్తులను విక్రయించేందుకు దీదీ అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనిద్వారా తమ ఆదాయం పెరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
సేద్యం చేస్తున్న నటి కీర్తీ..
సినిమా: కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం ఇంతకు ముందు చేయనటువంటి పనులను చేయిస్తోంది. పలువురు నటీనటులు తమకు ఇంతకు ముందు పరిచయం లేని పనులను చేస్తున్నారు. నటి కీర్తీ పాండియన్ సేద్యం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ నటుడు అరుణ్ పాండియన్ వారసురాలైన ఈమె తుంబ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం విలన్ అనే మలయాళ చిత్ర తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు తండ్రి అరుణ్ పాండియన్ కూడా నటిస్తున్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో నటి కీర్తి పాండియన్ కూడా తన స్వగ్రామానికి వెళ్లి వ్యసాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తను ట్రాక్టర్ ఎక్కి పొలాన్ని దున్నుతున్న వీడియోను విడుదల చేశారు. తాజాగా పొలంలో నాట్లు వేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు పలువురికి స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తోంది. హీరోయిన్లు అంటే అద్దాల మేడలో నివసించే సున్నితమైన వారనే అర్ధాన్ని నటి కీర్తి పాండియన్ మార్చేసింది అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. View this post on Instagram One of the most grateful things I have ever done! Learning the craft, one step at a time ♥️ Had to pull in Driya baby for this one 👩🏽🌾 #niece #quarantine #farming . . . . 📸 Appa @arunpandianc (Again, this is within our quarantine gated home property, it is not a public area) A post shared by Keerthi Pandian (@keerthipandian) on May 5, 2020 at 1:31am PDT -
కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంసృష్టించిన తల్లిని చంపిన తనయ కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో దాదాపు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై... ఆ తర్వాత మలుపులు తిరుగుతూ మూడు కేసులుగా మారిందీ వ్యవహారం. వీటిలోని ఒక్కో కేసులో కీర్తి ‘పాత్ర’ ఒక్కో రకంగా ఉంది.మొత్తమ్మీద అక్టోబర్ 26న రాత్రి 8గంటలకు ఫిర్యాదు దారుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కీర్తి... ఆపై అనుమానితురాలిగా, నిందితురాలిగా మారి బాధితురాలిగానూ ‘అవతారం’ ఎత్తింది. తొలుత ఫిర్యాది బాయ్‌ఫ్రెండ్ శశికుమార్ ప్రోద్బలంతో కీర్తి అక్టోబర్ 19న తల్లి రజితను హత్య చేసింది. 22 వరకు శవాన్ని ఇంట్లోనే ఉంచి, ఆపై శశితో కలిసి రామన్నపేటకు తీసుకెళ్లి అక్కడి రైలు పట్టాలపై పడేసింది. తన తండ్రి వేధింపుల నేపథ్యంలోనే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ 26న రాత్రి 8గంటలకు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నెం.643/2019గా నమోదైన ఈ మిస్సింగ్ కేసులో కీర్తి ఫిర్యాదిగా, ఆమె తల్లి రజిత పేరు బాధితురాలిగా ఉంది. ఆపై అనుమానితురాలు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డినీ పోలీసులు ప్రశ్నించారు. వైజాగ్ టూర్ అంటూ చెప్పిన కుమార్తె వ్యవహారశైలిని తండ్రి అనుమానించారు. బంధువులతో కలిసి కీర్తిని నిలదీయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తన ఫిర్యాదుతో నమోదైన మిస్సింగ్ కేసులో కీర్తి అనుమానితురాలిగా మారింది. పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో, లోతుగా విచారించడంతో పాటు పూర్వాపరాలు ఆరా తీశారు. ఆమె కదలికలు, కమ్యూనికేషన్‌కు సం బంధించి సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిజం బయటపడి నిందితురాలు హయత్‌నగర్ పోలీసులు కీర్తిని విచారించడం, ప్రాథమిక ఆధారాలు సేకరించడం, క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో అసలు విషయం గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. దీంతో అప్పటి వరకు ఫిర్యాదిగా ఉన్న కీర్తి అదే కేసులో శశితో కలిసి నిందితురాలిగా మారింది. కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా చేరారు. ఈ మర్డర్ కేసులోనే పోలీసులు కీర్తి, శశిలను అరెస్టు చేశారు. హత్యతో పాటు సంయుక్తంగా ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణ చేర్చారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు రజిత హత్య జరగడానికి కారణాలు, దాని పూర్వాపరాలు తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు మరో రెండు దారుణాలను గుర్తించారు. కీర్తి మైనర్‌గా ఉన్నప్పుడే బాల్‌రెడ్డితో పాటు శశికుమార్ ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దారుణాలపై సమాచారం ఉంటే పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలనే నిబంధన ఉంది. దీంతో హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ ఫిర్యాదిగా మారారు. ఆయన ఫిర్యాదుతో సుమోటోగా రెండు పోక్సో యాక్ట్ (మైనర్‌పై అత్యాచారానికి సంబంధించి) కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నెం.659/2019, 660/2019లతో నమోదైన వీటిలో కీర్తి బాధితురాలిగా ఉంది. వీటిలో మొదటి కేసులో బాల్‌రెడ్డిని, రెండో దాంట్లో శశిని అరెస్టు చేశారు. ఆమన్‌గల్లుకూ ప్రకంపనలు ఈ కేసుల ప్రకంపనలు పొరుగున ఉన్న ఆమన్‌గల్లును తాకాయి. మైనర్‌గా ఉన్న కీర్తిని గర్భవతిని చేసిన బాల్‌రెడ్డి అప్పట్లో అబార్షన్ చేయించాడు. శశికుమార్‌తో కలిసి కారులో ఆమన్‌గల్లులోని పద్మ నర్సింగ్ హోమ్‌లో ఈ చట్ట విరుద్ధమైన పని జరిగింది. ఈ విషయం హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. దీంతో పోలీసులు ఆ ఆస్పత్రి నిర్వాహకులనూ నిందితులుగా చేర్చడానికి నిర్ణయించారు. దీనిపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఆ ఆసుపత్రిపై దాడి చేసి సీజ్ చేశారు. -
కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?
ఆమనగల్లు: హయత్‌నగర్‌లో తల్లి రజితను చంపిన కీర్తికి ఆమనగల్లు పట్టణంలో అబార్షన్ జరిగిందని ప్రసారమాధ్యమాల్లో రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆమనగల్లులో అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రుల్లో ఎలాంటి అర్హతలు లేని అర్‌ఎంపీలు గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆమనగల్లు అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో ఆర్ఎంపీపై కేసు కూడా నమోదైంది. ఆమనగల్లులో అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నా వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. హయత్‌నగర్‌కు చెందిన రజితను ఆమె కూతురు కీర్తి ప్రియుడితో కలిసి చంపేసింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. కీర్తి గర్భవతి కావడంతో ఆమె ప్రియుడు బాల్‌రెడ్డి శశికుమార్ సహకారంతో ఎల్బీ నగర్‌లోని సహారా ఎస్టేట్స్‌లో ఉంటున్న ఓ వైద్యుడిని సంప్రదించారని తెలిసింది. అతడి సలహా మేరకు కీర్తి ఆమనగల్లు పట్టణంలో ఈ ఏడాది జనవరిలో అబార్షన్ చేయించుకున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఆమనగల్లులో గర్భస్రావం చేయించుకున్నా.. తల్లిని హత్య చేయడంతో ఈవిషయం వెలుగుచూసింది. ఆర్ఎంపీలదే హవా ఆమనగల్లు పట్టణంలో ఆర్ఎంపీల హవా నడుస్తోంది. దాదాపు 10 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా ఎక్కువగా ఆర్ఎంపీలే నిర్వహిస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. డబ్బులకు ఆశపడి ఇష్టారాజ్యంగా అబార్షన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అసురక్షిత పద్ధతులతో గర్భం దాల్చిన మహిళలు, బాలికలు గర్భస్రావం కోసం ఆమనగల్లుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఎంపీలు అడిగినంత డబ్బులు ఇచ్చి గుట్టుగా అబార్షన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్ఎంపీలు అవసరమున్నా, లేకున్నా రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. పట్టణంలో నాలుగు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు పరీక్షలు చేయించుకుంటున్నారు. నిర్వాహకులు ప్రతిరోజూ ఆర్ఎంపీల వాటాగా కొంత కమీష¯Œ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు? హత్య కేసులో నిందితురాలైన కీర్తికి అబార్షన్ చేసింది ఎవరోనని పట్టణంలో జనం గుసగుసలాడుకుంటున్నారు. పోలీసుల విచారణలో కీర్తి ఆమనగల్లులో అబార్షన్ చేసుకున్నట్లు చెప్పింది. ఈ ఘనటకు సంబంధించి ఆమెకు అబార్షన్ చేసిన డాక్టర్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో స్థానిక ఆర్ఎంపీలు, డాక్టర్లలో గుబులు మొదలైంది. -
రియల్ ‘దృశ్యం’!
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఠాణాలో అదృశ్యం కేసుగా నమోదైన రజిత కేసు దృశ్యం సినిమాను తలపించింది. ఆ సినిమా లో తన కూతురును బలవంతం చేయబోయి న వ్యక్తిని మీనా చంపేస్తే ఆ శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి హీరో వెంకటేశ్ ఏ సాక్ష్యం దొరక్కుండా జాగ్ర త్త పడటం చూశాం. ఆ రీల్ లైఫ్‌కు తగ్గట్టుగానే రియల్‌లైఫ్‌లో కాస్త భిన్నంగా తనను బలవంతం చేసిన వ్యక్తి బెదిరింపులకు తలొగ్గి కన్నతల్లి హత్యలో భాగస్వామ్యమై ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రయాణం చేయడం దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా నడిచింది. వీరు ఆధారాలు చెరిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిందితురాలి తండ్రికి వచ్చిన అనుమానం కాస్తా ఆమెను ఇప్పుడు ఏకంగా జైలు ఊచలు లెక్కించేలా చేసింది. తల్లి రజితను హత్య చేసిన కూతురు కీర్తితో పాటు కొత్త శశికుమార్‌లను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అలాగే కీర్తిని ప్రేమించి అత్యాచారం చేశాడని పోక్సో యాక్ట్ కింద నమోదైన మరో కేసులో చిమ్ముల బాల్రెడ్డికి కూడా సంకెళ్లు వేశారు. ఇలా ఒక్క మిస్సింగ్ కాస్తా 3 కేసులుగా మారింది. శివకుమార్‌పై కూడా పోక్సోయాక్ట్ కేసు నమోదుచేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీశ్‌లతో కలసి సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అబార్షన్నే అడ్వాంటేజ్‌గా.. కీర్తికి అబార్షన్ అయిన విషయాన్ని ఆమె తల్లికి చెబుతానంటూ శశికుమార్ బెదిరించడం మొదలెట్టాడు. ఈ వేధింపులకు భయపడిన కీర్తి శశికి శారీరకంగా లొంగిపోయింది. ఏకాంతంలో ఉండగా ఫొటోలు, వీడియోలు తీసిన శశి తనతో శారీరక సంబంధం కొనసాగించచాలని బెదిరించాడు. తనతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాల్‌రెడ్డితో పాటు మీ అమ్మ రజితకు చెప్తానన్నాడు. చివరకు మీ అమ్మ రజితను చంపేస్తే ఆమె నిర్వహిస్తున్న చిట్టీల డబ్బులు, సిటీలో ఉన్న ప్లాట్లు, సొంతూరులో ఉన్న భూములు నీ సొంతమవుతాయని, ఆ తర్వాత తనకు రూ. 10 లక్షలిస్తే హాయిగా బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకోవచ్చని నమ్మించాడు. ఇలా అక్టోబరు 16న రజితకు నిద్రమాత్ర లి వ్వగా ఆమెకు ఏమీ కాలేదు. దీంతో 19న రాత్రి ఇంట్లో రజిత బెడ్‌పై పడుకొని ఉండగా ఆమె కళ్లలో కారం చల్లి, కడుపు మీదకు ఎక్కి చేతులు గట్టిగా పట్టుకోవడంతో శశి ఆమె మెడకు చున్నీ బిగించి చంపాడు. కీర్తి, శశికుమార్ అమ్మగా మాట్లాడిన కీర్తి... అనంతరం రజిత సెల్‌ఫోన్ నుంచి బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసిన కీర్తి చికిత్స కోసం ఆçస్పత్రికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నానని రజితగా గొంతు మార్చి మాట్లాడింది. రెండ్రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మిద్దామనుకుంది. అప్పటికే శవం దుర్వాసన వస్తుండటంతో దాన్ని బెడ్‌షీట్‌తో చుట్టి శశి కారు డిక్కీలో వేసుకొని చౌటుప్పల్ రైల్వే ట్రాక్ రామన్నపేట పట్టాలపైకి తీసుకొచ్చి పడేశారు. బెడ్‌షీట్, దారాలను తూప్రాన్‌పేట లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీర్తి బంధువులు మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ అడుగు తుండటంతో తాను వైజాగ్ వెళ్లానని, నాన్న తాగొచ్చి తరచూ అమ్మతో గొడవపడేవాడని సమాధానమిచ్చింది. అక్టోబరు 26న రాత్రి హయత్‌నగర్ పీఎస్‌లో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి కూతురిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు చెప్పడంతో కేసు యూటర్న్ తీసుకుంది. బాల్‌రెడ్డి తండ్రిని అడిగితే ‘వైజాగ్ ఎక్కడెళ్లింది.. మా ఇంట్లోనే ఉంది కదా’అని సమాధానమివ్వడంతో కీర్తి అబద్ధం చెబుతున్నట్టుగా పోలీసులు నిర్ధారణకొచ్చి ఆ దిశగా విచారణ చేయగా కేసు చిక్కుముడి వీడింది. కీర్తికి అబార్షన్ చేసిన అమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. పరిచయం కాస్తా ప్రేమగా.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం నెర్నామ్లా గ్రామానికి చెంది న శ్రీనివాస్‌రెడ్డి, రజితల కుటుంబం పదేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలోని మునగనూర్‌కు వలసవచ్చింది. వీరి కుమార్తె కీర్తిరెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో బీఎస్సీ మైక్రో బయాలజీ సెకండియర్ చదువుతోంది. పొరుగింట్లో ఉంటున్న శశికుమార్ కుటుంబంతో కీర్తి కుటుంబానికి సాన్నిహిత్యం పెరిగింది. కీర్తి ఇంటర్ చదువుతున్న సమయంలో రామాంజనేయనగర్ కాలనీలో ఉంటున్న స్నేహితురాలు శిల్ప వద్దకు వెళ్తుండేది. ఈ క్రమంలో శిల్ప సోదరుడు బాల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. గతే డాది సెప్టెంబర్‌లో కీర్తి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలని భావించారు. అబార్షన్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉండటంతో కీర్తి ఇంటిపక్కనే ఉన్న శశి సహాయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, కీర్తిని కూడా పంపించాలంటూ శశి అడగటంతో తల్లి రజిత అంగీకరించింది. ఇలా సంగారెడ్డికి బదులు అమన్‌గల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన బాల్‌రెడ్డి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. -
‘దృశ్యం సెకండ్ పార్ట్‌లా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు నిందితులను పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. ప్రియుడి సహాయంతో కీర్తి తన తల్లి రజితను హత్య చేసిందన్నారు. 19న రజితను హత్య చేసి మూడు రోజుల తర్వాత రామన్నపేట రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేశారని చెప్పారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కీర్తితో పాటు ఆమెకు సహకరించిన రెండో ప్రియుడు శశిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ క్రైమ్.. దృశ్యం సినిమాకు సెకండ్ పార్ట్‌లా ఉందని అభిప్రాయపడ్డారు. ‘కీర్తి, బాల్‌రెడ్డిల మధ్య లవ్ ఎఫైర్ ఉండటంతో.. వారిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాల్‌రెడ్డి కీర్తిపై అత్యాచారం చేశాడు. గర్భం దాల్చిన కీర్తికి శశికుమార్ అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని శశికుమార్ బ్లాక్మెయిల్ చేశాడు. అబార్షన్ విషయం ఇంట్లో చెబుతానని వేధించాడు. కీర్తి ఆస్తిపై కన్నేసిన శశి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కీర్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. పెళ్లికి కీర్తి తల్లి అడ్డు చెప్పడంతో ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. శశికుమార్ సహాయంతో కీర్తి తల్లిని హత్య చేసింది. మృతదేహాం తరలించేటప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడు. రజిత హత్య చేసిన తరువాత ఇంట్లోని రూ.10 లక్షలు తీసుకోవాలని భావించారు. గతంలోనే తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించినప్పటికీ.. అది విఫలమైంది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడ్డ బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశాం. నిందితులపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశాం’అని సీపీ తెలిపారు. -
మీడియా ముందుకు శశికుమార్, కీర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీర్తి తల్లి రజిత హత్య కేసులో నిందితులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో హయత్‌నగర్‌కు చెందిన పల్లెర్ల కీర్తి ప్రియుడితో కలిసి కన్నతల్లినే హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కోణాల్లో విచారణ జరిపిన అనంతరం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సీపీ నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు.(చదవండి : కీర్తికి మద్యం తాగించి.. రజిత గొంతు నులిమిన శశి) కాగా తల్లిని దారుణంగా హతమార్చి ఆ నేరాన్ని తండ్రిపై నెట్టివేయాలని చూసిన కీర్తి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులతో ప్రేమలో మునిగిన కీర్తిని తల్లి మందలించడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. మొదట శశికుమార్‌తో ప్రేమలో పడిన కీర్తి.. తర్వాత బాల్రెడ్డికి దగ్గర కావడంతో వారిద్దరికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శశికుమార్ కీర్తితో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో కీర్తి మళ్లీ శశికుమార్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఈనెల 19న కూరగాయల మార్కెట్ నుంచి కీర్తి తల్లి రజిత ఇంటికి వచ్చిన సమయంలో అక్కడికి చేరకున్న శశికుమార్.. కీర్తికి మద్యం తాగించి తల్లిని హత్య చేసేలా ప్రేరేపించాడు. ఈ క్రమంలో కీర్తి తల్లి ముఖంపై దిండుతో అదిమి పట్టగా.. శశికుమార్ ఆమెకు చున్నీతో ఉరి బిగించి హత్య చేశాడు. ఈ కేసులో కీర్తి మరో ప్రియుడు బాల్‌రెడ్డి హస్తం కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..
హయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లిని హతమార్చిన కుమార్తె కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీసి తల్లిని చంపేందుకు ప్రేరేపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల పుటేజీలు, సాంకే తిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగులోకి వచ్చి నాలుగు రోజులైనా దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. కాగా మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్ తీసుకెళ్లి అక్కడ కీర్తికి అబార్షన్ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్నతల్లినే కూతురు హత్య చేసిన కేసులో ట్విస్టుల పరంపర కొనసాగుతోంది. ప్రియుడు శశికుమార్‌తో కలిసి కీర్తి.. తన తల్లి రజితను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సంబంధించి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రజితను హత్య చేసినట్టు అంగీకరించిన శశికుమార్, కీర్తిలు.. హత్యకు ముందు జరిగిన విషయాలను వెల్లడించారు. 19వ తేదీన రజిత ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. రజిత మార్కెట్ నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో కీర్తి, శశికుమార్‌లు ఇద్దరు కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ అనంతరం.. రజితను అడ్డు తొలగించికుంటేనే ఇద్దరం కలిసి ఉంటామని శశికుమార్ కీర్తిని ఒప్పించాడు. కీర్తి ఇంటికి బీర్ బాటిల్స్ తీసుకువచ్చాడు. రజిత లోపల గదిలో ఉండగా.. శశికుమార్, కీర్తిలు కలసి ఇంటి ఆవరణలోనే మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరు ఇంటి లోపలకు వెళ్లి.. లోపలి నుంచి లాక్ చేశారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. రజిత అరవకుండా కీర్తి ఆమె మొహంపై దిండు పెట్టింది. అదే సమయంలో శశికుమార్ చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత వారిద్దరు రజిత మృతదేహాన్ని యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేటు వద్ద పడవేశారు. కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయగా.. మరో ప్రియుడు శశికుమార్ ఆమెకు అబార్షన్ చేయించాడు. దీంతో ఆమె బాల్రెడ్డికి దూరమై.. శశికుమార్‌కు దగ్గర అయినట్టుగా తెలిసింది. కాగా, ఈ హత్యకేసు వెలుగులోకి రావడంతో శశికుమార్, బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే సెల్ఫోన్లలోని వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసులో బాల్‌రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, శశికుమార్‌తో కలిసి తల్లిని అంతమొందించిన కీర్తి.. ఆ నెపాన్ని తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపై వేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. వైజాగ్ టూర్ వెళ్లానని చెప్పిన కీర్తి.. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో కీర్తి ప్రవర్తనపై శ్రీనివాస్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. చదవండి : తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్ -
కీర్తికి మద్యం తాగించి.. రజిత గొంతు నులిమిన శశి
సాక్షి, హైదరాబాద్ : తల్లిని పాశవికంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. వివరాలు.. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి కలిసి ఉండటం గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన శశి రజిత అడ్డు తొలగించుకుంటేనే తామిద్దరం కలిసి ఉండవచ్చని కీర్తికి చెప్పాడు.( చదవండి : వీడియోలున్నాయ్..చంపేస్తావా లేదా?!) అనంతరం బీర్ బాటిల్స్‌తో కీర్తి ఇంటికి వచ్చాడు. కీర్తి తల్లి రజిత లోపల గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తికి శశి మద్యం తాగించి రజితను హత్య చేసేలా ప్రేరేపించాడు. తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా.. శశి లోపలి నుంచి తలుపు గడియ వేశాడు. పథకం ప్రకారం తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండుతో నొక్కగా.. శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఉరివేసుకున్నట్లుగా అందరినీ నమ్మించారు. అనంతరం మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేట్ వద్ద పడేసి ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన విషయాలు పోలీసులు వెల్లడించారు. కీర్తి ఇంట్లో నుంచి మూడు బీర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్ పథకం పన్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. ‘మా నాన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది’ అని కీర్తి ముందు శశి బిల్డప్ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి శశికుమార్‌నే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శశికుమార్ ఇంట్లో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వాళ్లు ‘నీ ఇష్టమున్నట్టు చేస్కో’ అని వదిలేశారు. ఇక కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పాడు శశికుమార్. అందుకు రజిత నిరాకరించింది. అమ్మాయి చదువుకునేది చాలా ఉందని చెప్పింది. ఇది మనసులో పెట్టుకున్న శశికుమార్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో కీర్తికి గతంలో తాము అద్దెకు ఉన్న పక్క కాలనీలో ఉండే బాల్‌రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. బాల్‌రెడ్డి గురించి తెలిసిన కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నా రు. ఈ విషయం తెలిసి శశికుమార్.. కీర్తి వెంటపడ్డాడు. ‘నువ్వు నాతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. అందరికీ చూపిస్తాన’ని బెదిరించాడు. చదవండి: కీర్తి ఇలా దొరికిపోయింది.. తనతోనే ఉండాలని వెంటపడినా మొదట్లో నిరాకరించింది. ఆ తర్వాత శశికుమార్ వేధింపులు తారస్థాయికి చేరాయి. కీర్తి పెళ్లి చేసుకునే బాల్రెడ్డికి కూడా చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్ ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టింది కీర్తి. ఇందులో భాగంగానే శశికుమార్ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శశికుమార్ చెప్పినట్టుగా నటించిన కీర్తి చివరకు తండ్రితోనే అబద్ధం చెప్పి పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇచ్చింది. అయితే కూతురు ప్రవర్తన అనుమానంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కీర్తి ధైర్యం చేసి అమ్మ రజితకు చెప్పినా, నాన్న శ్రీనివాస్‌రెడ్డికి చెప్పినా, చివరకు షీటీమ్స్‌ను ఆశ్రయించినా పరిస్థితి హత్య వరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం ఏసీబీ చేతికి చిక్కిన మహబూబ్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడు శశికుమార్ అని తెలిసింది. కీర్తికి అబార్షన్ చేయించేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడి తండ్రి ఏమైనా సహకరించాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించని పోలీసులు బుధవారం నిందితుల అరెస్టు చూపే అవకాశం ఉంది. చదవండి: తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే..